Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుర్వింశోధ్యాయః

నారదఉవాచ : నారాయణ మహాభాగ గాయత్య్రా స్తు సమాసతః | శాంత్యాదికాన్‌ ప్రయోగా స్తు వదస్వ కరుణానిధే . 1

నారాయణ ఉవాచ : అతిగుహ్యమిదం పృష్టం త్వయా బ్రహ్మతనూద్బవ |

న కస్యాపి చ వక్తవ్యం దుష్టాయ పిశునాయచ. 2

అథ శాంతిః పయోక్తాభిః సమిద్బిర్జుహుయాద్ద్విజః | శమీసమిద్బిః శామ్యంతి భూతరోగ గ్రహాదయః. 3

ఆర్ద్రాభిః క్షీరవృక్షస్య సమిద్బిర్జుహుయాద్ద్విజః | జుహుయాచ్చకలై ర్వాపి భూతరోగాది శాంతయే 4

జలేన తర్పయేత్సూర్యం పాణిభ్యాం శాంతి మాప్నుయాత్‌ | జానుదఘ్నే జలే జప్త్వా సర్వాన్దోషాన్‌ శమం నయేత్‌ 5

కంఠదఘ్నే జలేజప్త్వా ముఛ్యేత్ప్రాణాంతి కాద్బయాత్‌ | సర్వేభ్యః శాంతికర్మభ్యో నిమజ్జ్యాప్సు జపః స్మృతః 6

సౌవర్ణే రాజతే వాపి పాత్రే తామ్రమయేపివా | క్షీరవృక్షమయే వాపి నిర్వ్రణ మృణ్మయే పివా.7

సహస్రం పంచగవ్యేన హుత్వా సుజ్వలితే నలే | క్షీరవృక్షమయైః కాష్ఠైః శేషం సంపాదయే చ్చనైః 8

ప్రత్యాహుతి స్పృశన్‌ జప్త్వా సహస్రం పాత్రసంస్థితమ్‌ | తేన తం ప్రోక్షయే ద్దేశం కుశైర్మంత్రమనుస్మరన్‌. 9

బలిం కిరంస్తత స్త స్మిన్ధాయేత్తు పరదేవతామ్‌ | అభిచార సముత్పన్నా కృత్యా పాపంచ నశ్యతి 10

దేవభూత పిశాచాద్యా యద్యేవం కురు వశే | గ్రహం గ్రామం పురం రాష్ట్రం సర్వంతేభ్యో విముచ్యతే. 11

నిఖనే ముచ్యతే తేభ్యో లిఖనే మధ్యతోపిచ | మండలే శూల మాలిఖ్య పూర్వోక్తేచ క్రమేపివా. 12

అభిమంత్ర్య సహస్రం త న్నిఖనే త్సర్వశాంతయే| సౌపర్ణం రాజతం వాపి కుంభం తామ్రమయం చ వా. 13

మృణ్మయం వా నవం దివ్యం సూత్రవేష్టిత మవ్రణమ్‌ | స్థిండిలే సైకతే స్థాప్య పూరయేన్మంత్ర విజ్జలైః. 14

ఇరువదినాలగువ అధ్యాయము

గాయత్రీ ప్రయోగ విశేష నిరూపణము

నారదుడిట్లనెను: నారాయణ! మహానుభావా!దయానిధీ! నా కిపుడు సంక్షేపముగ శాంతి మున్నగు కార్యము లందు గాయత్రిని ప్రయోగించు విధానము తెలుపుము. శ్రీనారాయణు డిట్టనెను: నారదా! నీవిపుడు రహస్యమైన విషయము నడిగితివి. దానికి సమాధామనము తెలుపుచున్నాను వినుము. దానిని దుష్టునకు గాని కృపణునకు గాని తెలుపరాదు. విప్రుడు పాలలో తడిసిన జమ్మిసమిధలను గాయత్రి మంత్రముతో వేల్చినచో భుతగ్రహ రోగాదులు శమించును. పాలలో తడిసిన పాలచెట్టు సమిధతో గాని ముక్కలతోగాని వేల్చినచో భూతరోగాదులు శముంచగలవు. పిదప దోసిట నీళ్ళు తీసికొని సూర్యునకు తర్పణ మీయవలయును. మోకాలిబంటి నీట గాయత్రిని జపించినచో సర్వదోషములు తొలగిపోవును. కుత్తుక బంటి నీటిలో గాయత్రిని జపించినచో ప్రాణాంతకమైన భయమైనను తొలగిపోవును. ఎల్లశాంతికర్మలకు నీటియందు గాయత్రిని జపించవలయును. ఇపుడు వేర్వేరు ప్రయోగములు వినుము. బంగారము- వెండి- రాగి- పాలచెట్టు- మట్టి యను వానితో దేనితోనైన చేసిన చిల్లులు లేని పాత్రలో పంచగవ్యములుంచి వానికి క్షీరవృక్షము సమిధలు కలిపి ప్రజ్వలించుచున్న యగ్నిలో వాల్చవలయును. వేయి గాయత్రి జపించి పంచగవ్యములు తాకి ప్రోక్షించి ప్రతి యాహుతి వేల్చవలయును. పిదప బలి యిచ్చి పరాభట్టారికాదేవిని మదిలో ధ్యానించవలయును. దీనివలన నభిచార ప్రయోగముల వలన గల్గిన కృత్య నశించి తీరును. ఈ విధముగ వేల్చిన వానికి దేవతలు భూతములు పిశాచములు గ్రహములు పురములు గ్రామములు రాష్ట్ర ములు సర్వము వశమగును. అట్టివాడు సకల బాధలనుండి ముక్తుడగును. ఒక చతురస్ర మండలమందున నెనిమిది గంధములతో నొక శూలము నలంకరించి దానిని గాయత్రితో వేయి మారు లభిమంత్రించి యచ్చట నేలలో పాతిన సర్వశాంతి యగును. బంగారు వెండి రాగి మట్టి వీనిలో దేనితోనైన కలశము చేసిదానికి గట్టి మంచిదారము చుట్టి దానిని స్థండిలమున లేక యిసుకవైదికపై ముచి దానిలో మంత్రవిధుడు నీరు నింపవలయును.

దిగ్బ్య ఆహృత్య తీర్థాని చతసృభ్యో ద్విజోత్తమైః | ఏలాచందన కర్పూర జాతీపాటల మల్లికాః 15

బిల్వపత్రం తథా క్రాంతాం దేవీ వ్రీహాయవాం స్తిలాన్‌ | సర్షపా న్షీరవృక్షాణాం ప్రవాళాని చ నిక్షిపేత్‌. 16

సర్వాణ్యభివిధాయైవం కుశకూర్చి సమన్వితమ్‌ | స్నాతః సమాహితో విప్రః సహస్రం మంత్రయే ద్బుదః. 17

దిక్షు సౌరా నధీయూర న్మంత్రా న్విప్రాస్త్రయూవిదః | ప్రోక్షయేత్పాయయే దేనం నీరం తేనాభిషించయేత్‌ .18

భూతరోగాభిచా రేభ్యః స నిర్ముక్తః సుఖీ భ##వేత్‌ | అభిషేకేణ ముచ్యేత మృత్యోరాస్యగతో నరః 19

అవశ్యం కారయే ద్విద్వా న్రాజా దీర్ఘజిజీవిషుః | గావో దేయాశ్చ ఋత్విగ్బ్వ అభిషేకే శతం మునే. 20

దక్షిణా యేన వా తుష్టి ర్యథ్యాశక్త్యా థవా భ##వేత్‌ | జపే దశ్వత్థ మాలభ్య మందవారే శతం ద్విజః. 21

భూతారోగాభిచారేభ్యో ముచ్యతే మహతో భయాత్‌ | గూడూచ్యాః పర్వవిచ్చిన్నాః పయోక్తా జూహుయా ద్ద్విజః. 22

ఏవం మృత్యుంజయో హోమః సర్వవ్యాధి వినాశనః | ఆమ్రస్య జుహుయా త్పత్రైః పయోక్తైర్జ్వరశాంతయే. 23

వచాభిః పయసాక్తాభిః క్షయం హుత్వా వినాశ##యేత్‌ | మధుత్రితయహోమేన రాజయక్ష్మ వినశ్యతి. 24

నివేద్య భాస్కరాయాన్నం పాయసం హోమపూర్వకమ్‌ | రాజయాక్ష్మభి భూతం చ ప్రాశ##యేచ్చాంతి మాప్నుయాత్‌ . 25

లతాః పర్వసు విచ్చిద్య సోమస్య జుహుయాద్ద్విజః | సోమే సూర్యేణ సంయుక్తే పయోక్తాః క్షయశాంతాయే. 26

కుసుమైః శంఖవృక్షస్య హుత్వా కుష్ఠం వినాశ##యేత్‌ | అపస్మారవినాశః స్యా దపా మార్గస్య తండులైః 27

క్షీరవృక్షసమిద్ధోమా దున్మాదో పు వినస్యతి | ఔదుంబరసమి ద్ధోమాదతిమేహః క్షయం వ్రజేత్‌ | 28

నాలుగ దిక్కులనుండి పుణ్యతీర్థములనుండి విప్రులు తెచ్చిన జలములు నా కలశమందుంచి దానితో నేలకులు చందనము కప్పురము జాజి- పాటలి- మల్లికలు మారేడు దళములు విష్ణుక్రాంత- సహదేవి వ్రీహియవలు నువ్వులు మినుములు పాలచెట్టు రావి చిగుళ్ళు నుంచవలయును. తర్వాత దానిలో నిదువదేడు కుశలతో చేసిన కూర్చనుంచవలయును. విప్రుడు తరువాత స్నాన మొనరించి నిష్ఠతో వేయిమార్లు గాయత్రితో దాని నిభిమంత్రించవలయును. మూడు వేదములు తెలిసిన విప్రులు దానికి నలుపైపుల జేరి సౌరమంత్రములు చదువవలయును. ఇట్టి కలశములోని జలమును గాయత్రితో భూతాది రోగము లున్నవానిని ప్రోక్షించి త్రాపి యా మీట స్నాన మాడించవలయును. అట్టి భుతరేగి యభిచార దోషములనుండి విముక్తుడై శాంతచిత్తుడగును. ఇంతేల ! చావు ముఖములో పడినవాడు సైతమును బ్రదుకగలడు. ఈ విధణుగ దీర్ఘజీవనము గోరుకొను విద్వాంసులు రాజులు నాచరించవలయును. ఇట్టు లభిషేకించబడిన వాడు విప్రులకు నూఱసి గోవులు దానము చేయవలయును. విప్రులు దేనితో సంతోషింతురో దానినే దాన మీయవలయును. ద్విజుడు శనివారమున రావిచెట్టు క్రింద నూఱుమార్లు గాయత్రి జపించినచో భూతరోగాభిచారముల భయమునుండి ముక్తుడగును. తిప్పతీగ ముక్కలు పాలలో నానబెట్టి వేల్చినచో అది మృత్యుంజయహోమ మనబరగును. ఇది సర్వరోగనివారకము. జ్వరశాంతికి మామిడాకులు పాలు వేల్చవలయును. పాలలో వస నానబెట్టి వేల్చినచో క్షయరోగము తగ్గును. పాలు పెరుగు- నెయ్యి ఈ మూటిని వేల్చినచో రాజయక్ష్మరోగము శాంతించును. క్షీరాన్నము గాయత్రితో వేల్చి సూర్యునకు నివేదించి దానిని రాజయక్ష్మరోగికి తినిపించినచో వాని రోగము తగ్గును. సోమలతను గణుపుల వఱకు త్రుంచి వాని నమావాస్యనాడు పాలతో వేల్చినచో క్షయవ్యాధి నివారించును. శంఖవృక్షపు పూలు వేల్చిన కుష్ఠురోగము తొలగును. దుచ్చెను విత్తులు వేల్చినచో నుపస్మారము తొలగును. పాలచెట్టు సమిధలతో హోమము చేసినచో నున్మాదము తగ్గును. మేడిచెట్టు సమిధలు హోమము చేసినచో ప్రమేహ రోగాలు నశించును.

ప్రమేహం శమయే ద్దుత్వా మధునేక్షురసేన వా | మధుత్రితయహోమేన నయే చ్చాంతిం మసూరికామ్‌. 29

కపిలాసర్పిషా హూత్వా నయేచ్చాంతిం మసూరికామ్‌ | ఉదుంబరవటాశ్వత్తైర్గో గజాశ్వామయం హరేత్‌ . 30

పిపీలిమధు వల్మీకే గృహే జాతే శతం శతమ్‌ | శమీసమిద్బి రన్నేన సర్పిషా జుహూయా ద్ద్విజః. 31

తదుత్థ శాంతి మాయాతి శేషైస్తత్రబలింహరేత్‌ | అభ్రస్తనితభూకం పాలక్ష్యాదౌ వనవేతనః. 32

సప్తాహం జుహూయాదేవం రాష్ట్రే రాజ్యం సుఖీ భ##వేత్‌ | యా దిశం శతజప్తేన లోష్టేనాభిప్రతాడయేత్‌. 33

తతోగ్ని మారుతారిభ్యో భయం తస్య వినశ్యతి | మనసైవ జపేదేనాం బద్ధో ముచ్యేత బంధనాత్‌. 34

భూతరోగ విషాదిభ్యః స్పృశ్యన్‌ జప్త్వా విమోచయేత్‌ | భూతాగిబ్యో విముచ్యేత జలం పీత్వాభిమంత్రితమ్‌. 35

అభిమంత్ర్య శతం భస్మ న్యసే ద్బూతాది శాంతయే | శిరసా ధారయే ద్బస్మ మంత్రయిత్వా తదిత్యృచా. 36

సర్వవ్యాధి వినిర్ముక్తః సుఖీ జీవేచ్చతం సమాః | అశక్తః కారయే చ్చాంతిం విప్రం దత్వా తు దక్షిణామ్‌. 37

అథ పుష్టిం శ్రియం లక్ష్మీ పుషై#్ప ర్హుత్వా೭೭ప్ను యాద్ద్విజః |

శ్రీకామో జుహుయాత్పద్మైరక్తైః శ్రియమవాప్నుయాత్‌. 38

హుత్వా శ్రియ మవాప్నోతి జాతీపుషై#్పర్నవైః శుభైః | శాలితం డులహోమేన శ్రియమాప్నోతి పుష్కలామ్‌. 39

సమిద్బి ర్బిల్వవృక్షస్య హుత్వాశ్రియ మవాప్నుయాత్‌ | బిల్వస్య శకలైర్హుత్వా పత్రైః పుషై#్ప ఫలైరపి. 40

శ్రియ మాప్నోతి పరమాం మాలస్య శకలైరపి | సమిద్బి ర్బిల్వవృక్షస్య పాయసేన చ సర్పిషా 41

శతం శతం చ సప్తాహం బహుత్వా శ్రియమవాప్నుయాత్‌ | లాజై స్త్రీమధురోపేతైర్హోమే కన్యా మవాప్నుయాత్‌. 42

చెఱకు రసము తేనె కలిపి హోమము చేసినచో ప్రమేహ రోగాలు శాంతించును. పాలు పెరుగు నెయ్యి కలిపి వేల్చినచో మశూచిరోగము మటుమాయమగును. కపిలగోవు నెయ్యి వేల్చినచో మశూచి తొలగును. మేడి మఱ్ఱి గారి సమిధలు వేల్చినచో ఆవుల గుఱ్ఱముల యేనుగుల రోగాలన్నియును దూరమగును. శమీ సమిధలు పాలు నెయ్యి కలిపి రెండేసి వందల మార్లు హవనము చేసినచో చీమలు మున్నగు వాని యుపద్రవము లింటినుండి తొలగిపోవును. దానివలన నింటిలో శాంతి నెలకొనును, పిదప నన్నము బలి వేయవలయును. వనవేతస సమిధలు లక్ష వేల్చినచో భూకంపము పిడుగులు ఉఱుములు మున్నగునలి తగ్గిపోవును. ఇట్లు వారము దినములు వేల్చిన రాష్ట్రమందు సుఖశాంతులు నెలకొనును. మట్టిపెడ్డను నూఱుమార్లు గాయత్రితో నభిమంత్రించియే దిశకు విసరినచో ఆ దిశనుండి యతని కగ్నిభయము గాలిభయము దొంగల భయము గలుగవు. చెరసాలలో బద్ధుడైనవాడు మనసులోనే గాయత్రిని జపించినచో నతడు బంధముక్తుడగును. దర్బను తాకి గాయత్రి జపించినచో భూతరోగ విషాదులనుండి విముక్తుడగును. గాయత్రీ మంత్రిజలము త్రాగినచో భూతరోగాములనుండి విముక్తుడగును. భూతశాంతికి నూఱుమార్లు గాయత్రీ మంత్రముతో భస్మము నభిమంత్రించి నొసట దాల్చవలయును. అట్టివాడు సకలవ్యాధులనుండి విడివిడి మూఱండ్లు సుఖజీవనము చేయును. ఇట్లు సొంతముగ చేసికొనలేనివాడు విప్రులకు దక్షిమ లిచ్చి చేయించుకొనవచ్చును. విరిసిన పూలు వేల్చినచో పుష్టి కలిమి లక్ష్మీని బడయును. శ్రీకాము డెఱ్ఱ కమలముల వేల్చినచో ధనవంతుడగును. ఎఱ్ఱని క్రొత్ర మంచి జాజిపూలు వేల్చినచో నింట లక్ష్మీ తాండవించును. శాలి బియ్యముతో వండిన యన్నము హోమము చేసిన నింట లక్ష్మీదేవి కొలువై యుండును. మారేడు సమిధలుగాని ఫలపుష్పములుగాని పండ్ల ముక్కలుగాని మారేడు వేర్లుగాని హోమము చేసిన వాని యింట తఱగని సిరిసంపదలు తులతూగును. మారేడు సమిధలు పాలతో నేతితో తడిపి దినమునకు రెండువందల చొప్పున హోమము వారము నాళ్లు చేసినచో వాని యింట సిరి తులతూగును. వానికి సుఖశాంతులు గల్గును. పాలు పెరుగు పేలాలు కలిపి వేల్చినచో వానికి మంచి కన్య లభించును.

అనేన విధినా కన్యా వర మాప్నోతి వాంఛితమ్‌ | రక్తోత్పలశతం హుత్వా సప్తాహం హేమచాప్నుయాత్‌. 43

సూర్యబింబే జలం హుత్వా జలస్థం హేమ చాప్నుయాత్‌ | అన్నం హుత్వాప్నుయా దన్నం వ్రీహీన్వ్రీహిపతి ర్బవేత్‌. 44

కరీషచూర్ణై ర్వత్సస్య హుత్వా పశు మవాప్నుయాత్‌ | ప్రియంగు పాయసాజ్యై భ##వేద్ధోమాదిభిః ప్రజా. 45

నివేద్య భాస్కరాయాన్నం పాయసం హోమపూర్వకమ్‌ | భోజయేత్త దృతుస్నాతం పుత్రం పరమవాప్నుయాత్‌ . 46

సప్రరో హాభిరార్ద్రాభి రాయుర్హుత్వా సమాప్నుయాత్‌ |

సమిద్బిః క్షీరవృక్షస్య హుత్వా೭೭యుష మవాప్నుయాత్‌ . 47

సప్రరోహాభిరార్ద్రాభిరక్తాభి ర్మధురత్రయైః | వ్రీహీణాం చ శతం హుత్వా హేమ చాయు రవాప్నుయాత్‌. 48

సువర్ణ కుట్మలం హుత్వా శతమాయు రవాప్నుయాత్‌ | దూర్వాభిః పయసా వాపి మధునా సర్పిషాపివా. 49

శతం శతం చ సప్తాహ మపమృత్యుం వ్యపోహతి | శమీ సమిద్బి రన్నేన పయసా వాచ సర్పిషా . 50

శతం శతం చ సప్తాహ ముమృత్యుం వ్యపోహతి | న్యగ్రోధసమిదో హూత్వా పాయసం హోమయేత్తతః. 51

శతం శతం చ సప్తాహం మపమృత్యుం వ్యపోహతి | క్షీరోహారో జపేన్మృత్యోః సప్తాహాద్విజయీ భ##వేత్‌ . 52

అనశ్న న్వాగ్యతీ జప్త్వా త్రిరాత్రం ముచ్యత్‌ యమాత్‌ | మిజ్జ్యాప్సు జపే దేవ సద్యో మృత్యోర్వి ముచ్యతే. 53

జపేద్బిల్వం సమాశ్రిత్య మాసం రాజ్యమావాప్నుయాత్‌ |

బిల్వం హుత్వా 7ప్నుయా ద్రాజ్యం సమూలఫలపల్లవమ్‌. 54

హుత్వా పద్మశతం మాసం రాజ్యమాప్నోత్యకంటకమ్‌ | యవాగూం గ్రామప్నోతి హుత్వా శాలిసమన్వితామ్‌. 55

అశ్వత్థసమిదో హుత్వాయుద్ధాదౌ జయమాప్నుయాత్‌ | అర్కస్య సమిధో హుత్వా సర్వత్ర విజయీ భ##వేత్‌. 56

ఈ విధముగా కన్య వేల్చినచో మంచి వరుడు లభించును. ప్రతిదినము నూఱు వంతున వారము నాళ్లు మంచి ఎఱ్ఱ కమలములు వేల్చిన వానికి బంగారము లభించును. అన్నము వేల్చినవా డన్నవంతుడును. ధాన్యము వేల్చినవాడు ధాన్యవంతుడునగును. ఆవుదూడ పేడ పొడి వానికి పశుసంపద వృద్ధియగును. పాలు నేయి పెరుగు కలిపి కొర్రలు యన్నము వేల్చినవాడు ప్రజావంతుడగును. పాయసాన్నము వేల్చిన తర్వాత సూర్యునకు నివేదించి ఋతుస్నాతయగు బ్రాహ్మణ స్త్రీకి దినిపించినవానికి పండువంటి కుమారుడు గల్గును . మొలకెత్తిన మోదుగు సమిధలు తడిపి వేల్చిన లేక పాలచెట్టు సమిధలు వేల్చినవాడు నూఱండ్లు బ్రదుకగలడు. పాలు పెరుగు నెయ్యి కలిపి తడిసిన పాలచెట్టు మొలకలతో సమిధలు వేల్చిన వానికి బంగారము చిరాయువు గల్గును. నూఱు బంగారు కమలములు గాయత్రితో వేల్చిన వానికి దీర్ఘాయువు గల్గును. గరిక పాలు పెరుగు నెయ్యి వీనిని ప్రతిదినము నూఱుసార్లు చొప్పున వారము నాళ్లు వేల్చినచో సపమృత్యువు తొలగిపోవును. అదే విధముగ పాలు నెయ్యి అన్నముతె జమ్మి సమిధలు కలిపి వేల్చినవానికి. ఒక వారము నాళ్లు వేల్చగనే యపమృత్యువు తొలగిపోవును. పాయసము మఱ్ఱి సమిధలు కలిపి ప్రతిదినమ నూఱు చొప్పున వారమ వేల్చిన నపమృత్యువు తొలగిపోవును. కేవలము పాలు త్రాగుచు వారము నాళ్లు గాయత్రి జపించినవాడు మృత్యుంజయుడు గాగలడు. భోజనము చేయక మౌనముగ మూడు రాత్రులు గాయత్రి జపించినవానికి యమభయము గల్గదు. నీటిలో మునిగి జపించినవా డప్పటికప్పుడే మృత్యు భయమునుండి ముక్తుడగును. మారేడు చెట్టు క్రింద నెలనాళులు గాయత్రి జపించినవానికి రాజ్యలక్ష్మీ వశమగును. మారేడు వేర్లు పండ్లు చిగుళ్ళు వేల్చినను రాజ్యప్రాప్తి గల్గును. నూఱు కమలములు నెలనాళ్లు వేల్చినప్పటికిని రాజ్యప్రాప్తి గల్గును. యవలపిండిపేలాలు కలిపి హవనము చేసినచో గ్రామాధిపత్యము లభించును. రావి సమిధలు వేల్చిన వానిని యుద్ధమున విజయశ్రీ వరించగలదు. జిల్లేడు సమిధలు వేల్చినవానికి నెల్ల యెడల విజయము లభించును.

సంయుక్తైః పయసాపత్రైః పుషై#్పర్వా వేతసస్య చ | పాయసేన శతం హూత్వా సప్తాహం వృష్టిమాప్నుయాత్‌. 57

నాభిదఘ్నే జలే జప్త్వా సప్తాహం వృష్టి మాప్నుయాత్‌ | జలే భస్మశతం హుత్వా మహావృష్టిం నివారయేత్‌ . 58

పాలాశీభిరవాప్నోతి సమిద్బి ర్బ్రహ్మా వర్చసమ్‌ | పలాశకుసుమైర్హుత్వా సర్వ మిష్ట మవాప్నుయాత్‌ . 59

పయోహుత్వాప్ను యాన్మేధా మాజ్యం బుద్ధిమవాప్నుయాత్‌ | అభిమంత్ర్య పిబే ద్బ్రాహ్మం రసం మేదామవాప్నుయాత్‌ . 60

పుష్పహోమభ##వేద్వా సస్తంతుభిస్తద్విధం పటమ్‌ | లవణం మధుసంమిశ్రం హుత్వేష్టం వశమానయేత్‌ . 61

నయేదిష్టం వశం హుత్వా లక్ష్మీపుషై#్త ర్మధుప్లుతైః | నిత్య మంజలినాత్మాన మభిషించెజ్జలే స్థితః. 62

మతిమారోగ్యమా యుష్మమగ్ర్యం స్వాస్థ్యమవాప్నుయాత్‌ |

కుర్వా ద్విప్రోన్య ముద్దిశ్య సోపి పుష్టిమవాప్నుయాత్‌ . 63

అథ చారువిధిర్మాసం సహస్రం ప్రత్యహం జపేత్‌ | ఆయుష్కామః శుచౌదేశే ప్రాప్ను యాదాయురుత్తమమ్‌. 64

ఆయురారోగ్యకామ స్తు జపేన్మాసద్వయం ద్విజః | భ##వే దాయుష్య మారోగ్యం శ్రియై మాసత్రయం జపేత్‌. 65

ఆయుః శ్రీపుత్ర దారాద్యాశ్చ తుర్బిశ్చ యశో జపాత్‌ | పుత్రదారాయురారోగ్యం శ్రియం విద్యాం చ పంచభి. 66

ఏవమేవోత్తరాన్కామా న్మాసైరే వోత్తరైర్‌ వ్రజేత్‌ | ఏకపాదో జపే దూర్ధ్వబాహుః స్థిత్వా నిరాశ్రయః . 67

మాసం శతత్రయం విప్రః సర్వాన్కామానవాప్నుయాత్‌ | ఏవం శతోత్తరం తప్త్వా సహస్రం సర్వ మాప్నుయాత్‌ . 68

రుద్ధ్వా ప్రాణ మపానం చ జపేన్మాసశత త్రయం | యదిచ్చేత్తదవాప్నోతి సహస్రాత్పర మాప్నుయాత్‌ . 69

ఏకపాదో జపే దూర్ధ్వాబాహూ రుద్ధ్వానిలం వశః | మాసం శతమవాప్నోతి యదిచ్చే దితి కౌశికః 70

బెత్తపుచె ట్టాకులు పాలతో లేక నేతితో వెయ్యి యాహుతు లిచ్చినచో దినము నూఱు చొప్పున వారము దినములు వేల్చిన కుంభవర్షము గురియును. బొడ్డులోతు నీళ్లలో వారము నాళ్లు గాయత్రి జపించినచో కుంభవర్షము గురియును. నీటిలో నూఱుమార్లు భస్మము వేల్చినచో మహావర్ష మాగిపోవును. మోదుగ సమిధలు వేల్చిన బ్రహ్మతేజము గల్గును మోదుగ పూలు వేల్చిన కోరిన కోర్కెలు తీరును. పాలు వేల్చిన మేధయు- నెయ్యి వేల్చిన బుద్ధియును గాయత్రితో నభిమంత్రించిన బ్రహ్మారసము త్రాగిన మేధాసిద్ధి గల్గును. మంచిపూలు వేల్చిన సువాసనలును తంతువులు వేల్చిన వెల వస్త్రములును తేనె కలిపి యుప్పువేల్చినచో ఇష్టుడును వశ మగును. లక్ష్మీ పుష్పములు తేనెలో గలిపి వేల్చిన వాంఛితము లీడేరును. ప్రతిదినము తన దోసిలి నీటితో తన్ను తా నభిషేకించుకొనినచో అతనికి మంచి బుద్ధి- ఆయురారోగ్య భాగ్యములు- శ్రేష్ఠత్వము గల్గును. ఇతరు నుద్దేశించి యే బ్రాహ్మణుడైన చేసినచో ఆ ఇతరునకు నభీష్టములు తీరును. ప్రతిదినమును పవిత్రస్థలమున శుచియై వేయి చొప్పున నెలదినములు గాయత్రి జపించినవానికి నిజముగ చిరాయువు ప్రాప్తించును. బ్రాహ్మణు డుట్టు లాయురారోగ్య భాగ్యము లాశించి రెండు నెలలు జపించినచో నతని కాయురారోగ్యభాగ్యములు తప్పక గల్గును. ఇట్లు మూడునెలలు చేసిన సిరిసంపదలు గల్గును. నాల్గు నెలలు జపించుట వలన చిరాయువు - సిరిసంపదలు -భార్యాపుత్రులు- కీరితి గల్గును. ఇట్టులారు నెలలు జపించినచో భార్యాపుత్రులు - ఆయురారోగ్యములు- సిరి- విద్య గల్గును. ఇట్లు ప్రతినెల పెంచుచు గాయత్రి జపించినవాని కామనలన్నియును తప్పక తీరును. ఒంటికాలిమీద నుండి భుజములు పైకెత్తు నిరాశ్రయుడై మూడు నెలలు జపించినచో వాఛింతము లన్నియును నెఱవేరును. ఇట్లు నూఱునుండి వేలవఱకు గాయత్రి జపించినవాని కోరికలన్నియు తీరును. ప్రాణాపానములు బంధించి దినమునకు మూడువందల వంతున నెల జపించినవాడేది తలచిన నది నెఱవేరును ఇటుల వేయి జపించినవాని యభీష్టములన్నియును సిద్ధించును. ప్రాణమును బంధించి యొంటికాలిపై నిలిచి చేతులు పైకెత్తి దినము నూఱు వంతున మాసము పాటు గాయత్రి జపించినచో వాని మనోరథము లన్నియును తీరును.

ఏవం శతత్రయం జప్త్వా సహస్రం సర్వ మాప్నుయాత్‌ | నిమజ్జ్యాప్సు జపేన్మాసం శతమిష్ట మవాప్నుయాత్‌ . 71

ఏవం శతత్రయం జప్త్వా సహస్రం సర్వమాప్నుయాత్‌ | ఏకపాదో జపే దూర్ధ్వబాహు రుద్ధ్వా నిరాశ్రయః. 72

నక్తమశ్హ్ననవిష్యాన్నం వత్సరాదృషితామియాత్‌ | గీరమోఘా భ##వేదేవం జప్త్వా సంవత్సరద్వయమ్‌. 73

త్రివత్సరం జపే దేవం భ##వే త్రైకాల దర్శనమ్‌ | అయాతి భగవాన్దేవ శ్చతుః సంవత్సరం జపేత్‌. 74

పంచభి ర్వత్సరై రేవ మణిమాదిగుణో భ##వేత్‌ | ఏవం షడ్వత్సరం జప్త్వా కామరూపిత్వ మాప్నుయాత్‌. 75

సప్తభిర్వత్సరైరేవ మమరత్వ మవాప్నుయాత్‌ | మనుత్వం నవభిః సిద్ధ మింద్రత్వం దశబిర్బవేత్‌ . 76

ఏకాదశభి రాప్నోతి ప్రాజాపత్యం సువత్సరైః | బ్రహ్మత్వం ప్రాప్నుయా దేవం జప్త్వా ద్వాదశవత్సరాన్‌. 77

ఏతేనైవ జితా లోకాస్తపసా నారదాదిభిః | శాక మన్యే పరే మూలం ఫల మన్యే పయః పరే. 78

ఘృత మన్యే పరే సోమ మపరే చరువృత్తయః | ఋషయః పక్షమశ్నంతి కేచిద్బైక్ష్యాశినో హని. 79

హవిష్య మపరేశ్నంతః కుర్వంత్యేవ పరంతప | అథ శుద్ధ్యై రహస్యానాం త్రిసహస్రం జపేద్ద్విజః. 80

మాసం శుద్ధో భ##వేత్త్సయాత్సు వర్ణస్య ద్విజోత్తమః | జపేన్మాసం త్రిసహస్రం సురాపః శుద్ది మాప్నుయాత్‌. 81

మాసం జపే త్త్రిసాహస్రం శుచిః స్యాద్గురుతల్పగః | త్రిసహస్రం జపేన్మాసం కుటీం కృత్వా వనే వసన్‌ . 82

బ్రహ్మాహా ముచ్యతే పాపాదితి కౌశికభాషితమ్‌ | ద్వాదశాహం నిమజ్జ్యాప్సు సహస్రం ప్రత్యహం జపేత్‌ . 83

ముచ్యేర న్నంహసః సర్వే మహాపాతకినో ద్విజాః | త్రిసాహస్రం జపేన్మాసం ప్రాణానాయమ్య వాగ్యతః. 84

ఇట్లు మూడు వందలు లేక వేయి జపించుట వలన సర్వకామములు పండును. నీటిలో మూఱు చొప్పున నెల దినముగా గాయత్రి జపించినచో నసాధ్యముగూడ సాధ్యమగును. ఇట్లు వెయి లేక మూడు వేలు జపించినచో సర్వకామ్యములు సిద్ధించును. గాలిని బంధించి చేతులు పైకెత్తు యొంటికాలిమీద నిరాశ్రయుడై రాత్రి హవిష్యాన్నము దినుచు సంవత్సరను వఱకు జపించినవాడు ఋషిత్వ మొందును. ఈ ప్రకారముగ రెండేండ్లు చేసినవాని కమోఘమైన వాక్‌ సిద్ధి గల్గును. ఇట్లు మూడేండ్లు జపించినచో త్రికాలజ్ఞానము గల్గును. నాలుగెండ్లు జపించినచో సూర్యభగవానుడు ప్రత్యక్షమగును.

ఐదేండ్లు జపించిన నణిమాది సిద్ధులు గల్గును. ఆరేండ్లు జపించినవాడు కాలరూపి యగును. ఏడేండ్లు జపించినవాని కమరపదవి లభించును. తొమ్మిదేండ్లు గాయత్రి జపించినవానికి మనుత్వము గల్గును . పదేండ్లు జపించిన ఇంద్రత్వము లభించును. ఈ విధముగ పదునొకండేండ్లు జపించినవానికి ప్రాజాపత్యమను పండ్రెండేడులు జపించిన బ్రహ్మత్వమను ప్రాప్తించును. ఇట్టి గాయత్రి తపః ఫలమున నారదాదు లెల్లలోకములు గెల్చిరి. కొందరు శాకములు గడ్డలు పండ్లు పాలు నెయ్యి సోమము చరువు తిని తపింతురు. మఱికొందరు భిక్షావృత్తితో నింకకొందఱు ప్రతి దిన మేకభుక్తముగను జపింతురు. మఱికొందరు హవిష్యాన్నము తినుచు గాయత్రి పరమ జప మాచరింతురు. ద్విజుడు తన రహస్య పాపములు కడుగుకొనుటకు మూడువేల గాయత్రి జపించవలయును బంగారము దొంగలించినవాడు నెలదినములు గాయత్రి జపించిన శుద్ధాత్ముడగును. నెలకు మూడువేల జపించినవాడు సురాపానదోషమునుండి విముక్తుడగును. నెలదినములు మూడవేలు గాయత్రి ప్రతి దినము జపిం చిన గరుతలప్పగమనమున గల్గిన దోషమునుండి పవిత్రుడగును. అడవిలో గుడిసెలో నివసించుచు నెలనాళ్లు మూడువేలు జపించినచో బ్రహ్మహత్యా పాతకమునుండి విముక్తుడగును. అని యీ కామ్యప్రయోగములన్నియును విశ్వామిత్ర మహర్షి వచించెను. ప్రతియుదయమున నీట మునిగి పండ్రెండు దినములు- పండ్రెండు వేలు గాయత్రి జపించినచో వాని హృదయము మహాపాతకములనుండి విముక్తమగును. ప్రాణాయామము చేయుచు మోనముగ నెలకు మూడు వేలు గాయత్రి జపించినచో -

మహాపాత కయుక్తోవా ముచ్యతే మహతో భయాత్‌ | ప్రాణాయామసహస్రేణ బ్రహ్మహాపి విశుధ్యతి. 85

షట్కృత్వ స్త్వభ్యసే దూర్ధ్వం ప్రాణాపానౌ సమాహితః | ప్రాణాయామా భ##వేదేష సర్వపాప ప్రణాశనః. 86

సహస్ర మభ్యసే న్మాసం క్షితిపః శుచితా మియాత్‌ | ద్వాదశాహం త్రిసాహస్రం జపేద్ధి గోవధే ద్విజః . 87

అగమ్యాగమనస్తేయ హననాభక్ష్యభక్షణ | దశసాహస్రమభ్యస్తా గాయత్రీ శోధయే ద్ధ్విజః. 88

ప్రాణాయామ శతం కృత్వా ముచ్యతే సర్వకిల్బిషాత్‌ | సర్వేషా మేవ పాపానం సంకటే సతి శుద్ధయే . 89

సహస్ర మభ్యసేన్మాసం నిత్యజాపీ వనే వసన్‌ | ఉపవాససమం జప్యం త్రిసహస్రతదిత్యృచమ్‌ . 90

చతుర్వింశతి సాహస్రమభ్యస్తాత్కృ చ్చ్రసంజ్ఞితా | చతుష్షష్టి సహస్రాణి చాంద్రాయణసమాని త . 91

శతకృత్వోభ్యసేన్నిత్యం ప్రాణానాయమ్య సంధ్యయోః | తదిత్యృ చ మవాప్నోతి సర్వపాపక్షయం పరమ్‌ . 92

నిమజ్జ్యాప్ను జపేన్నిత్యం శతకృత్వ స్తద్యృచమ్‌ | ధ్యాయన్దేవీం సూర్యరూపాం సర్వపాపైః ప్రముచ్యతే . 93

ఇతి తే సమ్యగాఖ్యాతాఃశాంతిశుద్ధ్యాది కల్పనాః | రహస్యాతి రహస్యా శ్చ గోపనీయా స్త్వయాసదా. 94

ఇతి సంక్షేపతః ప్రోక్తః సదాచారస్య సంగ్రహః | విధినాచరణా దస్య మాయా దుర్గా ప్రసీదతి . 95

నైమిత్తికం చ నిత్యం చ కామ్యం కర్మ యథావిధి | ఆచరేన్మనుజః సోయం భుక్తి ముక్తి ఫలాప్తిభాక్‌ . 96

ఆచారః ప్రథమో ధర్మో ధర్మస్య ప్రభు రీశ్వరీ | ఇత్యుక్తం సర్వశాస్త్రేషు సదాచారఫల మ్మహత్‌ . 97

ఆచారవాన్సదాపూతః సదైవాచారవాన్సుఖీ | ఆచారవాన్సదా ధన్యః సత్యం సత్యం చ నారద . 98

దేవీ ప్రసాదజనకం సదాచారవిధానకం | యద్యపి శృణుయాన్మర్తో మహాసంపత్తి సౌఖ్యభాక్‌ . 99

సదాచారేణ సిద్ద్యే చ్ఛ ఐహికాముష్మికం సుఖమ్‌ | తదేవ తే మయా ప్రోక్తం కిమన్యచ్చ్రోతు మిచ్ఛసి. 100

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే సదాచారనిరూపణం నామ చతుర్వింశోధ్యాయః

ఏకాదశస్కంధః సమాప్తః

సార్ధైరామాబ్ధినేతేంద్రు (1243 1/2 ) దద్యైర్వ్యాసకృతైః శుభైః! దేవీ భాగవతస్యాసై#్య కాదశస్కంధ ఈరితః.

అతడు మహాపాపభయములునుండి విముక్తి గాంచును. వేయి ప్రాణాయామములతో జపించినచో బ్రహ్మహత్యా పాతకములనుండి శుద్ది చెందును. ఆరుమార్లు ప్రాణాపామను లూర్ధ్వముఖముగ చేసి సంయమముతో ప్రాణాయామము చేసినచో పాపముక్తుడగును. నెలనాళ్ళు దినము వేయి జపించిన పుడమిపతి శుచి యగును. గోహత్య చేసిన ద్విజుడు పండ్రెండేండ్లు మూడువేలు గాయత్రి జపించగ శుద్దుడగును. కూడని వారితో గూడినను తినరానివి తినినను దొంగతనమునను పదివేలు గాయత్రి జపించి శుద్దాత్ముడగును. నూఱు ప్రాణాయామములు చేసినవాడు సకల పాపములనుండి ముక్తుడగును. సంకర పాతకముల నుండి విముక్తి గాంచుటకు అడవిలో నిత్యము వేయి చొప్పున నెలపాటు గాయత్రి జపించవలయును. మూడువేల గాయత్రీజపయొక్క యుపవాసమునకు సాటి యగును. ఇరువది వెల జపమొక్క కృచ్ఛ్ర వ్రతమునకు సరి యగును. అరువది వేల గాయత్రి జపమొక్క చాంద్రాయణ వ్రతమునకు సమానమగును. ప్రతిదిన ముదయ సాయం సంధ్యలందు నూఱసివంతున గాయత్రి జపించినచో సర్వపాపములు క్షయించును. నీట మునిగి నూఱుమార్లు గాయత్రి జపించిన పిదప సవితృరూపిణి యగు గాయత్రిని ధ్యానించినచో సర్వపాప పంకము కడిగివేయబడును. ఈ ప్రకారముగ నీకు శాంతి శుద్ధుల కొఱకై గాయత్రీ ప్రయోగములు వివరింతి తెలిపితిని. ఇవెల్లరహ్యతి రహస్యములు. వీని నెప్పుడును గుప్తముగ నుంచుము. ఈ విధముగా నీకు సదాచార లక్షణములు గూడ సంక్షేపముగ తెలిపితిని. వీనినెల్ల యథావిధిగ క్రమముగ నాచరించినచో నామాయా - దుర్గా- దేవి దయ తప్పక కల్గును. మనుజుడు నిత్యనైమిత్తిక కామ్య కర్మములు యథావిదిగ నాచరించినచో నతనికి భుక్తి ముక్తులు కైవసమగును. ఎల్ల ధర్మముల కధిష్ఠాతృదేవి పరమేశ్వరి. ఇట్టు లెల్ల శాస్త్రములందును సదాచారమునకు మహాపుణ్యఫలము తెలుపబడెను. నారదా !సదాచార సంపన్నుడు మాత్రమే నిత్యపవిత్రుడు ఆనందభాజనుడు ధన్యజీవుడు. ఇది ముమ్మాటికి నిజము. ఈ సదాచార విధానము శ్రీదేవిని ప్రసన్నురాలిని జేయును. దీనిని విను- చదువు నట్టి సదాచారవంతుడు మహాసౌఖ్యసంపద లనుభవించును.

ఈ సదాచారమువలననె యిహ పరలోకము లందానంద భోగభాగ్యములబ్బును. ఇదంతయును నీకు దెల్పితిని. ఇంకేమి వినదలచితివో తెలుపుము.

ఇది శ్రీదేవీభాగవత మహాపురాణమందలి యేకాదశ స్కంధమున నిరువదినాల్గవ యధ్యాయము.

ఇది వేయి రెండువందల నలుబది మాడున్నరశ్లోకములు గల్గి శ్రీవ్యాసమహర్షి రచించిన శ్రీదేవీ భగవతమందలి పదునొకండవ స్కంధము సమాప్తము.

Sri Devi Bagavatham-2    Chapters