Sri Devi Bagavatham-2
Chapters
అథ చతుర్థో7ద్యాయః. నారద ఉవాచ : భగవన్దేవదేవేశ భూతభవ్యజగత్ర్పభో | కవచం చ శ్రుతం దివ్యగాయత్రీ మంత్ర విగ్రహమ్.
1 అధునా శ్రోతు మిచ్ఛామి గాయత్రీహృదయం పరమ్ | యద్ధారణాద్బవేత్పుణ్యం గాయత్రీజపతో7ఖిలమ్. 2 శ్రీనారాయణ ఉవాచ : దేవ్యా శ్చ హృదయం ప్రోక్తం నారదాథర్వణ స్ఫుటమ్ | తదేవాహం ప్రవక్ష్యామి రహస్యాతి రహస్యకమ్.
3 విరాడ్రూపాం మహాదేవీం గాయత్రీం వేదమాతరమ్ | ధ్యాత్వా తస్యా స్త్వథాంగేషు ధ్యాయే దేతాశ్చ దేవతాః.
4 పిండ బ్రహ్మాండయో రైక్యా ద్బావయే త్స్వతనౌ తథా | దేవీరూపే నిజే దేహే తన్మయత్వాయ సాధకః.
5 నాదేవో భ్యర్చ యే ద్దేవ మితి వేదవిదో విదుః | తతో7భేదాయ కాయే స్వే భావయేద్దేవతా ఇమాః.
6 అథ త త్సంప్రవక్ష్యామి తన్మయత్వ మథో భ##వేత్ | గాయత్రీహృదయస్యా స్యా7ప్యహమేవ ఋషిః స్మృతః.
7 గాయత్రీచ్ఛంద ఉద్ధిష్టం దేవతా పరమేశ్వరీ | పూర్వోక్తేన ప్రకారేణ కుర్యా దంగాని షట్కృమాత్ | ఆసనే విజనే దేశే ధ్యాయే దేకాగ్రమానసః.
8 అథార్థ నాస్యః: ద్యౌర్మూర్ధ్నిదైవతమ్ | దంతపంక్తా వశ్వినౌ | ఉభే సంధ్యే చోష్ఠయోః ! ముఖమగ్నిః | జిహ్వాయాం సరస్వతీ ! గ్రీవాయాం తు బృహస్పతిః | స్తనయో ర్వసవోష్టౌ | బాహ్వోర్మరుతః | హృదయే పర్జన్యః | ఆకాశముదరే | నాభావంతరిక్షమ్ | కటయోరింద్రాగ్నీ | జఘనే విజ్ఞానఘనః ప్రజాపతి | కైలాసమలయా పూర్వోః | విశ్వేదేవా జాన్వోః | జంఘయోః కౌశికః | గుహ్యే యనే | ఊర్వోపితరః || పాదయోః పృథివీ | వనస్పతియో7ంః. గులీషు | ఋషయోరోమసు | నఖేషు ముహూర్తాః | అస్థిషుగ్రహాః | అసృజ్మాంసేషు ఋతవః | సంవత్సరా వై నిమిషే అహోరాత్రయో రా దిత్యశ్చంద్రమాః | ప్రవరాం దివ్యాం గాయత్రీం సహస్రనేత్రాం శరణ మహంప్రపద్యే. ఓం తత్స వితుర్వరేణ్యాయ నమః | ఓం తత్పూర్వజయాయ నమః | తత్ర్పాతరాదిత్యాయ నమః | తత్ర్పాతరాదిత్య ప్రతిష్ఠాయనమః | ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి | సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి | సాయం ప్రాతరధీయానో7పాపో భవతి | సర్వతీర్థేషు స్నాతో భవతి | సర్వై ర్దేవైర్జాతో భవతి| అవాచ్యవచనా త్పూతో భవతి | అభక్ష్యభక్షణా త్పూతో భవతి | అభోజ్యభోజనా త్పూతో భవతి | అఛోష్యచోషణా త్పూతో భవతి | అసాధ్యసాధనా త్పూతో భవతి | దుష్పృతిగ్రహశతసహస్రా త్పూతో భవతి | సర్వప్రతి గ్రహా త్పూతో భవతి | పంక్తిదూషణా త్పూతో భవతి | అనృతవచనా త్పూతో భవతి | అథా బ్రహ్మచారీ బ్రహ్మచారీ భవతి | అనేన హృదయాధీతేన క్రతుసహస్రే ణష్టం భవతి | షష్టిశతసహస్రగాయత్ర్యా జప్యాని ఫలాని భవంతి | అష్టౌ బ్రాహ్మణా న్సమ్య గ్గ్రాహయేత్ | తస్య సిద్ధి ర్బవతి | య ఇదం నిత్య మధీయానో బ్రాహ్మణః పాత్రః శుచిః సర్వపాపైః ప్రముచ్యత ఇతి | బ్రహ్మలోకే మహీయతే | ఇత్యాహభగసూన్ శ్రీనారాయణః. ఇది శ్రీదేవీభాగవతే మహాపురాణ ద్వాదశస్కంధే గాయత్రీహృదయంనామ చతుర్థో7ధ్యాయః. నాల్గవ అధ్యాయము గాయత్రీ హృదయము. నారదుడిట్లనెను : భగవానుడా దేవదేవేశా! భూత భవ్య జగత్ ప్రభూ | శ్రీ దివ్య గాయత్రీ మంత్ర విగ్రహ మును - గాయత్రీ కవచమును వింటిని. ఇపుడు నాకు పరమ గాయత్రీ హృదయమును వినలవయునని కోరిక గల్గుచున్నది. చిత్తమున గాయత్రిని జపించువాడు దానిని ధరించినచో సమస్త పుణ్య ఫలితములు పడయగలడు గదా ! శ్రీనారాయణు డిట్లనెను : నారదా! అథర్వణ వేదమునందు గాయత్రీదేవి హృదయము తెలపబడినది. అధి రహస్య లలో రహస్యము. ఐనను నీకు దానిని తెలుపుచున్నాను వినుము. విరాడ్రూపిణి మహాదేవి వేదమాత యైన గాయత్రి నైక్యభావముతో ధ్యానించి తన యంగములందు సాధకు డాయా దేవతలను న్యాస మొనర్చుకొనవలయును. సాధకుడు తన శరీరమునందు పిండాండ బ్రహ్మాండముల ఐక్యమును భావించవలయును. తను గాయత్రీ స్వరూపునిగ దలంచి తన్మయుడు గావలయును. దేవత్వము లేనివాడు దేవు నర్చింపరాదని వేదవిదు లందురు. కనుక గాయత్రితో నభేదము సిద్ధించుటకు తన మేని యందాయా దేవతల నిట్లు భావించవలయును. ఇపుడు గాయత్రితో తన్మయత్వ మొందుటకు దానిని తెలుపు చున్నాను. ఈ గాయత్రీ హృదయమునకు నేనే (నారాయణుడు) ఋషిని. గాయత్రి ఛందము; పరమేశ్వరి దేవత; మొదట చెప్పినటుల వరుసగ నంగన్యాస మొనర్చవలయును. ఏకాంతమున నాసనము వేసికొని యేకాగ్రచిత్తముతో దేవిని ధ్యానించ వలయును. ఇపు డర్థన్యాస మాలకించుము. తలయందు దివి పలువరు సలం దశ్వినులును పెదవులందు సంధ్యలును ముఖమునందగ్ని నాలుకయందు సరస్వతి మెడయందు బృహస్పతి స్తనములం దష్టవసువులును రెండుభుజములందు మరుత్తులును హృదయమున పర్జన్యుడు పొట్టయం దాకసమును బొడ్డునం దంతరిక్షమును నడుమునం దింద్రాగ్నులను పిక్క లందు విజ్ఞానఘనుడగు ప్రజాపతి తొడలందు కైలాసమలయగిరులను జానువులందు విశ్వేదేవతలును పిక్కలందు కౌశికుడు గుహ్యమం దుత్తరాయన దక్షిణాయనముల యథిష్ఠాన దేవతలును తొడలందు పితరులను పదములందు భూమిని వ్రేళ్లయందు వనస్పతులును రోమములందు ఋషులును గోళ్లయందు ముహూర్తములును ఎముకలందు గ్రహములును రక్తమాంసములందు ఋతువులును కనుఱప్పలందు సంవత్సరమును పగలు రేలయందు సూర్యచంద్రులును నలరి తేజరిల్లుచుండగ వేయికనుల తల్లియైన శ్రీగాయత్రీదేవిని నేను శరణు వేడుచున్నాను. శ్రేష్ఠుడైన సవితకు వందనములు. తూర్పున నుదయించు దేవునకు నాకైమోడ్పులు. తూర్పున వెలుగొందు భాస్కరునకు నా ప్రణామములు. ప్రభాత భాస్కరునకు నిలయమైన దేవికి నా ప్రణతులు. ఈ గాయత్రీ హృదయము నుద యము చదివినవాడు రాత్రి చేసిన పాపము బాయును. సాయంతనము చదివినచో పగటి పాపము వ్రీలిపోవును. తొలి - మలి సంజలందు చదివినవాడు పాపరహితు డగును. అట్టివాడు సర్వపుణ్యతీర్థములందు గ్రుంకినవాడు ఎల్ల దేవతల నెఱింగిన వాడు అగును. పలుకరానివి పలికిన పాతకము - తినరానివి తినిన దోషము - భుజింపరానివి భుజించిన పాపము - చీకరానివి చీకిన కల్మషము - అసాధ్యములను సాధించుటలో గల్గిన చెడు - నూఱువేల చెడు దానములు పరిగ్రహించిన పాపరాసులు - సకల విధములైన పరిగ్రహముల దోషములు మున్నగు సకల పాపములనుండి విడివడును. మఱియు అతడు పంక్తిదోషమునుండి పవిత్రు డగును. అబద్ధపు మాటలనుండి పూతు డగును. బ్రహ్మచారి గానివాడు బ్రహ్మాచారి యగును. దీనిని చదివినవానికి వేయి యజ్ఞములు చేసిన ఫలిత మబ్బును. అరువదివేల గాయత్రి జపఫలము సిద్ధించగలదు. ఎనిమిది మంది బ్రాహ్మణులచే గాయత్రి ననుష్ఠించుటకు చక్కగ గ్రహింపజేయవలయును. అటుల చేసినవానికి గాయత్రీ హృదయమును సిద్ధించును. ప్రాతఃకాలమందు శుచియై ప్రతినిత్యము గాయత్రీ హృదయము చదివిన బ్రాహ్మణుడు పాపరాసులనుండి విముక్తుడు గాగలడు. బ్రహ్మలోకమునంధు మహామహిమగలవా డగును.'' అని శ్రీనారాయణు భగవానుడు దయతో పలికెను. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ద్వాదశ స్కంధమున గాయత్రీ హృదయ మనెడు నాల్గవ యధ్యాయము.