Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచమో7ధ్యాయః

నారద ఉవాచ: భక్తానుకంపి న్సర్వజ్ఞ హృదయం పాపనాశనమ్‌ | గాయత్ర్యాః కథితం తస్మా ద్గాయత్ర్యాః స్తోత్ర మీరయ. 1

శ్రీనారాయణ ఉవాచ : ఆదిశ##క్తే జగన్మాతర్బక్తానుగ్రహకారిణి |

సర్వత్ర వ్యాపికే7నంతే శ్రీ సంధ్యే తే నమో7స్తుతే. 2

త్వమేవ సంధ్యా గాయత్రీ సావిత్రీ చ సరస్వతీ | బ్రాహ్మీ చ వైష్ణవీ రౌద్రీ రక్తా శ్వేతా సితేతరా. 3

ప్రాత ర్బాలా చ మధ్యాహ్నే ¸°వనస్థా భ##వేత్పునః | వృద్ధా సాయం భగవతీ చింత్యతే మునిభిః సదా. 4

హంసస్థా గరుడారూఢా తథా వృషభవాహినీ | ఋగ్వేదాధ్యాయినీ భూమౌ దృశ్యతే యా తపస్విభిః. 5

యజుర్వేదం పఠంతీ చ అంతరిక్షే విరాజతే | సా సామగా పి సర్వేషు భ్రామ్యమాణా తథా భువి. 6

రుద్రలోకం గతా త్వం హి విష్ణులోకనివాసినీ | త్వమేవ బ్రహ్మణో లోకే7మర్త్యానుగ్రహకారిణీ. 7

సప్తర్షి ప్రీతిజననీ మాయా బహువరప్రదా | శివయోః కరనేత్రోత్థా హ్యశ్రు స్వేదసముద్బవా. 8

ఆనందజననీ దుర్గా దశధా పరిపఠ్యతే | వరేణ్యా వరదా చైవ వరిష్ఠా వరవర్ణినీ. 9

గరిష్ఠా చ వరార్హా చ వరారోహా చ సప్తమీ | నీలగంగా తథా సంధ్యా సర్వదా భోగమోక్షదా.10

భాగీరథీ మర్త్యలోకే పాతాళే భోగవత్యపి | త్రిలోకవాహినీ దేవీ స్థానత్రయనివాసినీ. 11

భూర్లోకస్థా త్వమేవాసి ధరిత్రీ శోకధారిణీ | భువోలోకే వాయుశక్తిః స్వర్లోకే తేజసాం నిధిః. 12

మహర్లోకే మహాసిద్ధి ర్జనలోకే జనేత్యపి | తపస్వినీ తపోలోకే సత్యలోకే తు సత్యవాక్‌. 13

కమలా విష్ణులోకే చ గాయత్రీ బ్రహ్మలోకదా | రుద్రలోకే స్థితా గౌరీ హరార్ధాంగనివాసినీ. 14

ఐదవ అధ్యాయము

గాయత్రీ స్తోత్రము

నారదు డిట్లనెను : భక్తదయాళూ! సర్వజ్ఞ! పాపనాశ##మైన గాయత్రీ హృదయము చెప్పితివి. ఇప్పుడు శ్రీగాయత్రీ స్తోత్రమును తెలుపుము. శ్రీనారాయణు డిట్లనియెను : ఆది శక్తీ! జగజ్జననీ! భక్తానుగ్రహకారిణీ! విశ్వవ్యాపినీ! అనంతశ్రీ! సంధ్యాదేవీ! నీ కివే నా హృదయ పూర్వకనమస్కారములు తల్లీ! నీవు సంధ్యవు గాయత్రివి సావిత్రివి సరస్వతివి బ్రాహ్మివి వైష్ణవివి రైద్రివి రక్తపు. ఉదయమున బాలవు మధ్యాహ్నమున యువతివి సాయంతనమున వృద్ధపునైవ భగవతివి నీవే యని మునులు నిత్యము నిన్నే సంస్మరింతురు హంసారూఢవు గరుడాసీనవు వృషభవాహనవు ఈవే. ఋగ్వేద మధ్యయనము చేయుచు పరమ తాపసులకు నీ వీ భూమిపై దర్శన మిత్తువు. యజుర్వేద మధ్యయనము చేయుచు నంతరిక్షమున విరజిల్లుచుందువు. సామగానము చేయుచు భువిపై నెల్లెడల సంచరింతువు. నీవు బ్రహ్మ విష్ణు రుద్రలోకము లందుప వివసించుచు మనుజులపై నీ యనుగ్రహము ప్రసరింపజేయుదువు. సప్తర్షులను ప్రసన్నులను జేయు తల్లీ! మాయాతీత శక్తీ! బహువరప్రదాయినీ! శివభక్తుల చేతులనుండి కనులనుండి యుద్బవించిన తల్లీ! వారి కన్నీట చెమట సముద్బవించిన దేవీ! ఆనందజననీ! దుర్గా! వరేణ్య! వరద! వరిష్ఠ వర్ణిని! పది తెఱంగుల కీర్తింపబడు తల్లీ! గరిష్ఠ! వరార్హా! పరారోహ! నీలగంగా! సంధ్యా! సర్వదా! భోగమోక్షదా! నరలోకమున భాగిరథిగ పాతాళమందు భోగవతిగ స్వర్గమునందు సీతగ త్రిలోకవాహినియై దేవియై ముల్లోకములందు నివసించుదానవు నీవే. ఈ భూలోకమున లోకధరిత్రివి - భూమాతవు నీవే! భువర్లోకమున వాయుశక్తివి నీవే! స్వర్లోకమునందు తేజస్విని నీవే. మహర్లోకమున మహాసిద్ధివి జనలోకమందు జననివి తపోలోక మందు తపస్వినివి సత్యలోకమున సత్యవాదినివి నీవే. శ్రీ విష్ణులోకమందు కమలవు - బ్రహ్మలోకమున గాయత్రివి రుద్రలోకమున శివునర్ధంగినియగు గౌరివి నీవే అమ్మా|

అహమో మహతశ్చైవ ప్రకృతి స్త్వం హి గీయసే | సామ్యావస్థాత్మికా త్వ హిం శబలబ్రహ్మరూపిణీ. 15

తతః పరాపరా శక్తిః పరమా త్వ హి గీయసే | ఇచ్ఛాశక్తిః క్రియాశక్తిర్జా నశక్తి స్త్రిశక్తిదా. 16

గంగా చ యమునా యైవ వీపాశా చ సరస్వతీ | సరయూ ర్దేవికా సింధు ర్నర్మదేరవతీ తథా. 17

గోదావరీ శతద్రూ శ్చ కావేరీ దేవలోకగా | కౌశికీ చంద్రభాగా చ వితస్తా చ సరస్వతీ. 18

గండకీ తాపీనీ తోయా గోమతీ వేఆతవత్యపి | ఇడా చ పింగళా చైవ సుషుమ్మా చ తృతీయకా. 19

గాంధారీ హస్తాజీహ్వా చ పూషా7పూషా తథై వచ | అలంబుసా కుహూశ్చైవ శంఖినీ ప్రాణవాహినీ. 20

నాడీ చ త్వం శరీరస్థా గీయసే ప్రాక్తనై ర్బుధైః | హృత్పధ్మస్థా ప్రాణశక్తిః కంఠస్థా స్వప్ననాయికా. 21

తాలుస్థా త్వం సదాధారా బిందుస్థా బిందుమాలీనీ | మూలే తు కంఉడలీ శక్తి ర్వ్యాపినీ కేశమూలగా. 22

శిఖామధ్యాసనా త్వం హి శిఖాగ్రే తు మనోన్మనీ | కిమన్యద్బహునోక్తేన యత్కించి జ్జగతీత్రయే. 23

తత్సర్వం త్వం మహాదేవి శ్రియే సంధ్యే నమో7స్తుతే | ఇతీదం కీర్తితం స్తోత్రం సంధ్యాయాం బహుపుణ్యదమ్‌. 24

మహాపాపప్రశమనం మహాసిద్ధి విధాయకమ్‌ | ఇదం చకీర్త యే త్త్సోత్రం సంధ్యాకాలే సమాహితః. 25

అపుత్ర ప్రాప్నుయాత్పుత్రం ధనార్థీ ధన మావాప్వుయాత్‌ | సర్వతీర్థపోదాన యజ్ఞ యోగఫలం లభేత్‌. 26

భోగాన్బుక్త్వా చిరం కాల మంతే మోక్ష మావాప్ను యాత్‌ | తవస్విభిః కృతం స్తోత్రం స్నానకాలే తు యః పఠేత్‌. 27

యత్రకుత్రజలే మగ్నః సంధ్యా మజ్జనజం ఫలమ్‌ | లభ##తే నాత్రసందేహః సత్యం సత్యం చ నారద. 28

శృణుయా ద్యోపి తద్బక్త్యా స తు పాపాత్ర్పముచ్యతే | పీయూషసదృశం వాక్యం సంధ్యోక్తం నారదేరితమ్‌. 29

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురణ ద్వాదశస్కందే గాయత్రీ స్తోత్రం నామ పంచమో7ధ్యాయః.

అహంస్పురణ - మహత్తత్వము - ప్రకృతి - సామ్వావస్థాత్మిక - శబల బ్రహ్మరూపిణి - నీవే యని గానముచేయబడు చున్నావు. సకలపరాశక్తివి పరమవు ఐచ్ఛాశక్తివి క్రియాశక్తవి జ్ఞానశక్తివి త్రిశక్తిదాయినివి నీవే! శ్రీగంగ యమున విపాశ సరస్వతి సరయు దేవిక సింధు నర్మద ఐరావతి గోదావరి శతద్రు కావేరి దేవలోకగామిని కౌశికి చంద్రభాగ వితస్త సరస్వతి గండకి తాపిని తోయ గోమతి వేత్రవతి నీవే! ఇడ పింగళ సుషుమ్న గాంధారి హస్తిజిహ్వ పూష అపూష అలంబుస కుహు శంఖిని ప్రాణవాహిని ఈ శరీరమందలి నాడులన్నియును నీవే యని సనాతనులైన బుధులచేత నీవు కోనియాడబడుచున్నావు. హృదయ కమలమందలి ప్రాణశక్తి కంఠమందలి స్వప్ననాయిక తాలుపులందలి సదాధార భూమధ్యమందలి బిందుమాలిని మూలాధారమంది కుండలినశక్తి కేశమూలమందలి వ్యాపిని శిఖా మధ్య నివాసిని శిఖాగ్రమున మనోన్మని యను రూపములన్నియు నీవే. వేయేల! ఈ ముజ్జగము లందేయే వస్తువులు గలవో అవన్నియు నీవే మహాదేవీ! శ్రీదేవీ! సంధ్యాదేవీ! నీకు మాహృదయాంజలులు. ఈ గాయత్రీ స్తోత్రమును విశేషించి సంధ్యలందు చదివిన విశేష పుణ్యము గల్గును. ఈ స్తోత్రము మమాపాతకరాసులను నశింపచేయగలదు. దీనిని సంధ్యలందు సమచిత్తముతో కీర్తించ వలయును. దీని మహిమవలన పుత్రహీనుడు పువ్రంతుడగును. ధనార్థి ధనికుడగును. సకల తీర్థ తపోదానములు - యోగ యజ్ఞముల ఫలము లభించును. దీనివలన చిరకాలము భోగములను భవించి తుదకు మోక్ష భాగ్యము బడయును. పుణ్యతాపసులొనర్చిన యీ స్తోత్రమును స్నాకాలమున చదివినవాడు ఎచ్చటనైన ఎప్పుడైన స్నానము చేసినవాడును సంధ్యాకాలమున స్నానము చేసిన ఫలితము బొందును. నారదా! ఇందావంతకును సందహము లేదు. ఇది నిజము. దీనిని శుద్ధ మనస్సుతో విన్నవాడును పాపముక్తుడగును. సంధ్యాకాలములం దమృత రసాయనముతో సమమైన యీ గాయత్రీ స్తోత్రము నీకు వినిపించితిని.

ఇతి శ్రీదేవీభాగవత మహాపురాణమందలి ద్వాదశ స్కంధమున పంచమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters