Sri Devi Bagavatham-2
Chapters
అథ సప్తమో7ధ్యాయః. శ్రీ నారద ఉవాచ : శ్రుతం సహస్రనామాఖ్యం శ్రీగాయత్ర్యాః ఫలప్రదమ్ |
స్తోత్రం మహోన్నతికరం మహాభాగ్యకరం పరమ్.
1 అధునా శ్రోతు మిచ్చామి దీక్షాలక్షణ ముత్తమమ్ | వినా యేన న సిద్ధ్యేత దేవీమంత్రే7ధికారితా.
2 బ్రాహ్మణానాం క్షత్రియాణాం విశాం స్త్రీణాం తథైవ చ | సామాన్యవిధినా సర్వం విస్తరేణ వద ప్రభో.
3 శ్రీనారాయణ ఉవాచ : శృణు దీక్షాం ప్రవక్ష్యామి శిష్యాణాం భావితాత్మనామ్ | దేవాగ్ని గురుపూజాదా వధికారో యథా భ##వేత్. 4 దివ్యం జ్ఞానం హి యా దద్యా త్కు ర్యా త్పాపక్షయం తు యా | సైవ దీక్షేతి సంప్రోక్తా వేదతంత్ర విశారదైః. 5 అవశ్యం సా తు కర్తవ్యా యతో బహుఫలా మతా | గురుశిష్యావుభా వత్రాప్యతిశుద్ధా వపేక్షితౌ. 6 గురు స్తు విధివత్ర్పాతః కృత్యం సర్వం విధాయ చ | స్నాన సంధ్యాదికం సర్వం యథావిధి విధాయ చ. 7 కమండలుకరో మౌనీ గృహం యాయా త్సరిత్తటాత్ | యగామండప మాసాద్య విసేత్తత్రాసనే వరే. 8 ఆచమ్య ప్రాణానాయమ్య గంధపుష్పవిమి త్రితమ్ | సప్తవారాస్త్రమంత్రేణ జప్తం వారి సుసాధయేత్. 9 వారిమా తేన మతియా నస్త్రమంత్రం సముచ్చరన్ | ప్రోక్షయేద్ద్వార మఖిలం తతః పూజాం సమాచరేత్. 10 ఊర్ధ్వోదుంబరకే దేవం గణనాధం తథా శ్రియమ్ | సరస్వతీం నామంత్రైః పూజయేడ్గంధపూష్పకైః. 11 ద్వారదక్షిణశాఖాయాం గంగాం విఘ్నేశ మర్చయేత్ | ద్వారస్య వామశాఖాయాం క్షేత్రపాలం చ సూర్యజామ్. 12 దేహల్యాం పూజయే దస్త్రదేవతా మస్త్రమంత్రతః | సర్వం దేవీమయం దృశ్యమితి సంచింత్య సర్వతః. 13 దివ్యానుత్సారయే ద్విఘ్నా నస్త్రమంత్రజపేన తు | అంతరిక్షగతాన్విఘ్నా న్పాదఘాతై స్తు భూమిగాన్. 14 ఏడవ అధ్యాయము గాయత్రీ దీక్షా లక్షణము శ్రీ నారదు డిట్లనెను : మహాభాగ్యకరము మహోన్నతి సాధకము సకల ఫలప్రదమునైన శ్రీ గాయత్రీ సహస్రనామ స్తోత్రమును వింటిని. ఇపుడు దీక్షా లక్షణము వినదలచుచున్నాను. అది లేనిచో మానవుడు దేవీమంత్రము జపించుట కధికారి గాడు. ప్రభూ! బ్రహ్మణ - క్షత్రియ - వైశ్య - స్త్రీలకు తగి సామాన్య విధానమున విస్తరించిన తెలుపుము. శ్రీనారాయణు డిట్లనెను : భావితాత్ములగు శిష్యులకు దీక్షా విధానమును తెలుపుచున్నాను వినుము. దాని నాచరించినవాడు అగ్ని - దేవతా - గురు - పూజలకు యోగ్యు డగును. పాపక్షయ మొనర్చి దివ్యజ్ఞానము నొసంగు విద్యను వేద - తంత్ర విశారదులు దీక్ష యని పేర్కొందురు. కనుక దీక్ష తప్పక గ్రహించవలయును. అది బహుఫలప్రదము. దానికి గురు - శిష్యు లిరువురును పవిత్రులుగ నుండవలయును. గురువు వేకువజామునలేచి యథావిదిగ కాలకృత్యములు స్నాసంధ్యాది విధులును సక్రమముగ నిర్వర్తించవలయును. తర్వాత కమండలువు చేబూని నదీతీరమునుండి తన యింటికి రావలయును. పిదప యోగమండపము నందు పరాసనమున గూర్చోనవలయును. అపిదప నత డాచమించి ప్రాణములు నియమించి గంధపుష్పములుగల నీటీ నేడు మారులు ''ఫట్'' అను అస్త్రమంత్రముతో శుద్ధి చేయవలయును. అస్త్రమంత్రముతో మండపద్వారమును జలముతో ప్రోక్షించిన పిదప బుద్ధిమంతుడు పూజ నారంభించవలయును. ద్వారమునకు మొదట గణపతిని మధ్యలో లక్ష్మిని పిదప సరస్వతిని మంత్రపూర్వకముగ ధూపదీపములతో పూజించవలయును. దక్షిణద్వారము వైపున గంగను గణపుతి నర్చించవలయును. ద్వారమున కెడమవైపున క్షేత్రపాలకుని యముని నర్చించవలయును. కడపపై అస్త్రదేవతను ''ఫట్'' మంత్రముతో పూజించవలయును. ఇదంతయును నంతట దేవీయమని తలంచవలయును. అస్త్రమంత్రము జపించి పైనుండి వచ్చు విఘ్నములను తొలగించవలయును. పాదము తాకిడిచేత భూమివలన కలుగు విఘ్నములను తొలగించవలయును. వామశాఖాం స్పృశ న్పశ్చా త్ర్పవిశేద్దక్షిణాంఘ్రిణా | ప్రవిశ్య కుంభం సంస్థాప్య సామాన్యార్ఘ్యం విధాయచ. 15 తేన చా7ర్ఘ్య జలేనా పి నైరృత్యాం దిశి పూజయేత్ | వాస్తునాథం పద్మయోనిం గంధపుష్పాక్షతాదిభిః. 16 తతః కుర్యాత్పంచగవ్యం తేనచా7ర్ఘ్యోదకేనచ | తోరణ స్తంభపర్యంతం ప్రోక్షయే న్మండపం గురుః. 17 సర్వం దేవీమయం చేదం భావయేన్మనసా కిల | మూలమంత్రం జపన్బక్త్యా ప్రోక్షణం స్యాచ్ఛరాణునా. 18 శరమంత్రం సముచ్చార్య తాడయే న్మండపక్షమామ్ | హుం మంత్రం తు సముచ్చార్య కుర్యాదభ్యుక్షణం తతః. 19 ధూపయే దంతరం ధూపై ర్వికిరాన్వికరేత్తతః | మార్జయేత్తాం స్తు మార్జన్యా కుశనిర్మితయా పునః. 20 ఈశానదిశి తత్పుంజం కృత్వా సంస్థాపయేన్మునే | పుణ్యాహవాచనం కృత్వా దీనానాథాం శ్చ తోషయేత్. 21 విశేన్మృద్వాసనే పశ్చాన్నమస్కృత్య గురుం నిజమ్ | ప్రాజ్యుఖో విధివద్ధ్యాత్వా దేయమంత్రస్య దేవతామ్. 22 భూతశుద్ధ్యాదికం కృత్వా పూర్వోకేన నైవ వర్త్మనా | ఋష్యాదిన్యాసకం కుర్యా ద్దేయమంత్రస్య వై మునే. 23 న్యసేన్మునిం తు శిరసి ముఖే ఛందః సమీరితమ్ | దేవతాం హృదయాంభోజే గుహ్యే బీజంతుపాదయోః. 24 శక్తిం విన్యస్య పశ్చా త్తు తాలత్రయరవాత్తతః | దిగ్బంధం కారయే త్పశ్చాచ్ఛోటికాభి స్త్రిభిన్నరః. 25 ప్రాణాయామం తతః కృత్వా మూలమంత్ర మనుస్మరమ్ | మాతృకాం విన్యసేద్దేహే తత్ర్పకారస్తథోచ్యతే. 26 ఓం అంనమ ఇతి ప్రోచ్య న్యసేచ్ఛిరసి మంత్రివిత్ | ఏవమేవ తు సర్వేఘ న్యసే త్థ్సానేఘ వైమునే. 27 మూలమంత్రం షడంగం చ న్య సే దంగేషు సత్తమః | అంగుష్ఠాదిష్వంగదు లీఘ హృదయాదిశ చ క్రమాత్. 28 పిదప నెదమవైపు తాకుచు కుడిపాదము మొదట నుంచవలయును. ఇట్లు మండపమున ప్రవేశించి కలశము స్థాపించి సామాన్యార్ఘ్య మొసంగవలయును. అర్ఘ్యజలముతో నైరృతి దిశయందు వాస్తునాధుని బ్రహ్మను గంధ పుష్పాక్షతలతో బూజించవలయును. అర్ఘ్యజలముతో పంచగవ్యము సిద్ధము చేయవలయును. మండపమునుండి తోరణ స్తంభమువఱకు జలము ప్రక్షించవలయును. ఈ సర్వమును దేవీమయమనియే భావించవలయును. పరభక్తితో మూల మంత్రము జపించవలయును. శరమంత్రం (ఫట్) తో మండపపు నేలను తాకవలయును. హుం మంత్రముతో నీటి నచట చిలుకరించవలయును. పిదప సువాసనగల ధూపములతో ధూపము వేయవలయును. విఘ్నశాంతికొఱకు విఘ్వహరములగు నీరు - చందనము - భస్మము - గఱిక - అక్షతలు - నను వికిరములను వెదజల్లవలయును. దర్బకుంచెతో నూడ్చవలయును. మునీ ! వాని నన్నిటి నీశాన్య దిశయం దుంచి మార్జన చేయవలయును. పుణ్యాహవాచన మొనరించి దీనులను. దిక్కులేనివారిని సంతోషపెట్టవలయును. ఆ పిమ్మట శిష్యుడు తన గుపరువునకు ప్రణమిల్లి మెత్తని యాసనముపై తూర్పు మొగముగ గూర్చొని మంత్రదేవతను విధితో మదిలో ధ్యానించవలయును. వెనుక చెప్పినటుల భూతశుద్ధి మున్నగునవి యొనర్చిన పిదప ఋష్యాది న్యాస మొనరించి మంత్ర ముపదేశించవలయును. మంత్రఋషిని శిరమునందు ఛందమును ముఖమందును దేవతను హృదయ మందును జీజమును గుహ్యమందును శక్తిని చరణములందును న్యాస మొనరించి ముమ్మారు చప్పట్లు కొట్టి ముమ్మారు చిటికెలు వేసి దిగ్బంధనము చేయవలయును. ఆ తర్వాత ప్రాణాయామ మాచరించి మూలమంత్ర ముచ్చరించుట తన దేహమందు మాతృకాన్యాస మీ విధముగ నొనర్చవలయును. మంత్రవిదుడు ''ఓం అం నమః'' అని శిరమున ''ఓం అం నమః - ఓం ఇం నమః'' యనుచు నన్ని యంగములందు న్యాస మొనర్చవలయును. శిష్యున కుపదేశించ వలసిన మంతమునకు షడంగ న్యాసము కరన్యాసము హృదయన్యాసము నొనర్పివలయును. నమః స్వాహా పషడ్యుక్తైః హుంవౌషట్ ఫట్ పదాన్వితైః | ప్రణవాదియుతైర్మంత్రైః షడ్బిరేవ షడంగకమ్. 29 వర్ణన్యాసాదికం పశ్చా న్మూలమంత్రస్య యోజయేత్ | స్థానేషు తత్తత్కల్పోక్తేష్వితి న్యాసవిధిః స్మృతః. 30 తతో నిజే శరీరే7స్మిం శ్చింతయే దాసనం శుభమ్ | దక్షాంసే చ న్యసేద్ధర్మం వామాంసే జ్ఞానమేవ చ. 31 వామోరౌ చాపి వైరాగ్యం దక్షోరావథ విన్యసేత్ | ఐశ్వర్యం ముఖ దేశేతు మునే ధ్యాయే దధర్మకమ్. 32 వామపార్శ్వే నాభిదేశే దక్షపార్శ్వే తథాపునః | నఞదీంశ్చాపి జ్ఞానాదీ న్పూర్వోక్తానేవ విన్యసేత్. 33 పాదా ధర్మాదయః ప్రోక్తాః పీఠస్య మునిసత్తమ | అధర్మాద్యా స్తు గాత్రాణీ స్మృతాని పుంగవైః. 34 మధ్యే7నంతం హృది స్థానే న్యసేస్మృ ద్వాసనే స్థలే | ప్రంపచపద్మం విమలం తస్మిన్సూర్యేందు పావకాన్. 35 న్యసేత్కలా యుతాన్మంత్రీ సంక్షేపాత్తా వదామ్యహమ్ | సూర్యస్య ద్వాదశకలా స్తా ఇందోః షోడశస్మృతాః. 36 దశ వహ్నేః కలాః ప్రోక్తా స్తాభిర్యుక్తాంస్తుతాన్మ్సరేత్ | సత్త్వం రజస్తమశ్చైవ న్యసేత్తేషా మథోపరి. 37 ఆత్మాన మంతరాత్మానం పరమాత్మాన మేవ చ | జ్ఞానాత్మానం న్యసేద్విద్వా నిత్థం పీఠస్య కల్పనా. 38 అముకాసనాయ నమఇతి మంత్రేణ సాధకః | ఆసనం పూజయిత్వా తు తస్మిన్ధ్యాయే త్పరాంబికామ్. 39 కల్పోక్తవిధినా మంత్రీ దేయ మంత్రస్య దేవతామ్ | మానసై రూపచారై శ్చ పూజయే త్తాం యథా విధి. 40 ముద్రాః ప్రదర్శయే ద్విద్వాన్కల్పోక్తా మోదకారికాః | యాభిర్విరచితాభి స్తు మోదో దేవ్యా స్తు జాయతే. 41 నారాయణ ఉవాచ : తతః స్వవామభాగాగ్రే షట్కోణోపరి వర్తులమ్ | చతురస్రయుతం సమ్యజ్మధ్యే మండల మాలిఖేత్. 42 ''ఓం హృదయాయ నమః ఓం శిరసే స్వాహా ఓం శిఖాయై వషట్ ఓం కవచాయ హుం ఓం నేత్ర త్రయావౌషట్ ఓం అస్త్రాయ ఫట్'' అను క్రమమున షడంగన్యాస మొనర్చవలయును. పిదప మూలమంత్రముతో నాయాచోట్ల వర్ణన్యాస మొనర్చవలయును. ఆయా కల్పములందు చెప్పబడిన న్యాస విధాన మిదియే. పిదప తన శరీరము నొక పవిత్రమైన యాసనముగ భావించి దాని కుడి ఆంసమున ధర్మము నెడమ అంసమున జ్ఞానమును ఎడమతొడయందు వైరాగ్యమును కుడితొడయందు సంపదను ముఖమునం దధర్మమును న్యాస మొనరించవలయును. ''వామ భాగే అధర్మాయ నమః నాభిదేశే అవైరాగ్యాయ నమః దక్షిణ పార్శ్వే అజ్ఞానాయ నమః అను రీతిగ నుచ్చరించవలయును. శరీర మాసన మని యందాలపీఠమని బావించి దానికి ధర్మాదులు పాదములనియు నధర్మాదు లంగము లనియును మునులు తలంతురు. ఆ పీఠము నడుమ హృదయ పద్మమందు అనంత భగవానుడు విరాజుల్లుచున్నాడని భావించవలయును. పిదప నతనియందు ప్రపంచమయమైన పద్మమును నందు సూర్య - చంద్రాగ్నులను ధ్యానించవలయును. అందఱిని కళాసహితముగ న్యాస మొనర్చవలయును. వానిపై సత్త్వరజస్తమములను ఆత్మాంతరాత్మ జ్ఞానాత్మలను నలుదెసలను న్యాస మొనరించి ఈ విధముగ రీఠకల్పన మొనరించవలయును. ''అమురా (సాధకుని పేరు) సనాయనమః'' అను మంత్రముతో సాధకు డాసన పూజ జరిపి పరాంబికను ధ్యానించవలయును. ఉపదేసించవలసిన మంత్రదేవతను మంత్రవిదుడు కల్పోక్త ప్రకారముగ మానసోపచారములచే యథావిధిగ పూజించవలయును. పండితుడు కల్పోక్తరీతిగ దేవికి ప్రియములైన ముద్రలు ప్రదర్శించి దేవిని ఆసన్నురాలినిగ చేయవలయును. తరువాత తన కెడమవైపున షట్కోణ చక్రమున దానిపై వృత్తమును దానిపై చతురస్రమును చక్కగ చందనముతో వేయవలయును. మధ్యే త్రికోణం సంలిఖ్య శంఖముద్రాం ప్రదర్శయేత్ | షడంగాని చ షట్కోణష్వర్చయే త్కుసుమాదిభిః. 43 అగ్న్యాదిషు తు కోణషు షడంగార్చన మాచరేత్ | ఆధారపాత్ర మాదాయ శంఖస్య మునిసత్తమ. 44 అస్త్రమంత్రేణ సంప్రోక్ష్య స్థాపయేత్తత్ర మండలే | మం వహ్ని మండలాయోక్త్వా తతో దశకలాత్మనే. 45 అముకదేవ్యా అర్ఘ్య పాత్రస్థానాయనమఇత్యపి | మంత్రో7య ముక్తః శంఖస్యాప్యాధరస్థావనే బుధైః. 46 ఆధారే పూర్వ మారభ్య ప్రదక్షిణ క్రమేణ తు | దశ వహ్నికలాః పూజ్యా వహ్నిమండల సంస్థితాః. 47 తతో వై మూల మంత్రేణ ప్రోక్షితం శంఖముత్తమమ్ | స్థాపయే త్తత్ర చాధారే మూలమంత్ర మనుస్మరన్. 48 అంసూర్యమండలాయోక్త్వా ద్వాదశాంతే కలాత్మనే | అముకదేవ్యర్ఘ్య పాత్రాయ నమ ఇత్యుచ్చరే త్తతః. 49 శం శంఖాయ పదం ప్రోచ్య నమ ఇత్యేత దుచ్చరేత్ | ప్రోక్షయే త్తేన తం శంఖం తస్మిన్ద్వాదశ పూజయేత్. 50 సూర్యస్య ద్వాదశకలా స్తపిన్యాద్యా యథా క్రమమ్ | విలోమమాతృకాం ప్రోచ్య మూలమంత్రం విలోమకమ్. 51 జలైరాపూరయే చ్చంఖం తత్ర చేందోః కలాం న్యసేత్ | ఉంసోమ మండలాయో క్త్వాంతే షోడశకలాత్మనే. 52 అముకార్ఘ్యా మృతాయేతి హన్మంత్రాంతో మనుః స్మృతః | పూజయే న్మనునా తేన జలం తు సృణి ముద్రయా. 53 తీర్థాన్యావాహ్య తత్రైవాప్యష్ట కృత్వో జపేన్మనుమ్ | షడంగాని జలే న్యస్య హృదాంసే పూజయేదపః. 54 అష్టకృత్వో జపేన్మూలం ఛాదయేన్మద్ప్యముద్రయా | తతో దక్షిణ దిగ్బాగే శంఖస్య ప్రోక్షణీం న్యసేత్. 55 శంఖాంబు కించిన్ని క్షిప్య ప్రోక్షయేత్తేన సర్వతః | పూజాద్రవ్యం నిజాత్మానం విశుద్ధం భావయే త్తతః. 56 దాని నడుమ త్రికోణము నిర్మించి శంఖముద్ర ప్రదర్శించవలయును. షట్కోణమునందలి షడంగములను పూలుమున్నగువానితో బూజించవలయును. ఆగ్నేయము మొదలైన కోణములందును షడంగముల నర్చించవలయును. శంఖము క్రింద నున్న యాధాకపాత్రను తీసికొని దానిని ''ఫట్'' మంత్రముతో ప్రోక్షించి మండలమం దుంచవలయును. '' మంవహ్నిమండలాయ దశకళాత్మనే ఆముకదేవ్యా (దేవిపేరు) అర్ఘ్యపాత్ర స్థాపనాయ నమః'' అను మంత్రము శంఖము యొక్క యాధారపాత్ర నుంచుటకు చెప్పవలయును. ఆధారమున తూర్పు మొదలుకొని ప్రదక్షిణముగ వహ్నిమండలమందునన పది వహ్నికళలను పూజించవలయును. ఆ పిదప మూలమంత్రముతో శంఖమును సంప్రోక్షించి మూలమంత్రమును స్మరించుచు దాని నాధారమం దుంచవలయును. '' అంసూర్య మండలాయ ద్వాదశ కళాత్మనే అముక దేవ్యర్ఘ్య ప్రాతాయ నమః'' అని యుచ్చరించవలయును. పిదప ''శం శంఖాయ నమః'' యని శంఖము మీద నీరు చల్లవలయును. దాని యందు పండ్రెండు కళలను పూజించవలయును. తాపిని మున్నగు సూర్యుని పండ్రెండు కళలను క్రమముగ పూజించవలయును. పిదప విలోమముగ మాతృకను మూలమంత్రమును చదివి శంఖమును నీటిలో నింపి దానియందు సోమకళలను న్యాసము చేయవలయును. '' ఉం సోమమండలాయ షోడశ కళాత్మనే అమకా (దేవి పేరు) ర్ఘ్యామృతాయ హృవయాయ నమః'' అను మంత్రముతో కుశముద్రతో గంగను పూజించవలయును. దానియుందు తీర్థముల నావహనము చేసి యెనిమిది మార్లు మంత్రము జపించి జలమందు మత్ప్యముద్రతో దాని నాచ్చాదించవలయును. శంఖమును ప్రోక్షించిన జలమును ద్రవ్యములను తన్ను పవిత్రులుగ భావించవలయును. నారాయణ ఉవాచ: తతః స్వపురతో వేద్యాం సర్వతోభద్రమండలమ్ | సంలిఖ్య కర్ణికా మధ్యం పూరయే చ్చాలితండులైః. 57 ఆస్తీర్య దర్బాం స్తత్రైవ న్యసేత్కూర్చం సలక్షణమ్ | ఆధారశక్తి మారభ్య ఫీఠమన్వంత మర్చయేత్. 58 నిర్ర్వణం కుంభ మాదాయాప్య స్త్రాద్బిః క్షాలితాంతరమ్ | తంతునా వేష్టయే త్తంతు త్రిగుణ నారుణన చ. 59 నవరత్నో దరం కూర్చయుతం గంధాది పూజితమ్ | స్థాపయేత్తత్ర పీఠేతు తారమంత్రేణ దేశికః. 60 ఐక్యం కుంభస్య పీఠస్య భావయే త్పూరయేత్తతః | మాతృకాం ప్రతిలోమేన జపం స్తీర్థోదకైర్మునే. 61 మూలమంత్రం చ సంజప్య పూజయే ద్దేవతాధియా | అశ్వత్థ పనసామ్రాణాం కోమలై ర్నవ పల్లవైః. 62 ఛాదయే త్కుంభవదనం చషకం సఫలాక్షతమ్ | సంస్థాపయేత మతిమాన్వ స్త్రయుగ్మేన వేష్టయేత్. 63 ప్రాణస్థాపనమంత్రేణ ప్రాణస్థాపన మాచరేత్ | ఆవాహనాది ముద్రాభి ర్మోదయేద్ధేవతాం వరామ్. 64 ధ్యాయేత్తాం పరమేశానీం కల్పోక్తేన ప్రకారతః | స్వాగతం కుశల ప్రశ్నం దేవ్యా అగ్రే సముచ్చరేత్. 65 పాద్యం దద్యా త్తతో7ప్యరఘ్యం తతశ్చా చ మనీయకమ్ | మధుపర్కం చ సాభ్యంగం దేవ్యై స్నానం నివేదయేత్. 66 వాససీ చ తతో దద్యా ద్రక్తక్షౌమే సునిర్మలే | నానామణిగణా కీర్ణానాకల్పాన్కల్పయేత్తతః. 67 మణినా పుటితైర్వర్ణైర్మాతృకాయా విధానతః | దేవ్యా అంగేఘ విన్య స్య చందనాద్యైః సమర్చయేత్. 68 గంధః కాలాగరుభవః కర్పూరేణ సమన్వితః | కాశ్మీరం చందనం చాపి కస్తూరీ సహిత్ మునే. 69 కుందపుష్పాదిపుష్పాణి పరదేవ్యై సమర్పయేత్ | ధూపో7గరుపురు వ్రాతోశీరచందన శర్కరాః. 70 పిదప తన ముందు వేదికయందు సర్వతోభద్ర మండలము చిత్రించి దాని కర్ణికమధ్యలో బియ్యము నింపవలయును. తర్వాత నచట నిరువదేడు దర్బలకూర్చ నుంచ వలయును. ఆధార శక్తితో మొదలుపెట్టి మంత్రాంతము వఱకు పీఠ పూజ చేయవలయును. పిమ్మట చిల్లులులేని మంచి కలశమును ''ఫట్'' మంత్రముతో శుద్ధి చేయవలయును. దాని కెఱ్ఱని దారము మూడు వరుసలుగ చుట్టవలయును. అందు ప్రణవము జపించుచు నవరత్నములు - గంధాదులు నుంచవలయును. ఆ కలశమును పీఠమును ఐక్య భావముతో క్షకారము నుండి అకారము వఱకు విలోమముగ చదువుచు పీఠముపై దాని నుంచి నీటితో నింపవలయును. మూల మంత్రము జపించి దానిని దేవతా భావముతో పూజించవలయును. రావి - పనస - మామిడి - లేజిగుళ్లు ఆ కశముఖము నందుంచవలయును. దానిపై పండ్లు అక్షతలుగల పాత్ర నుంచవలయును. రెండు మంచి వస్త్రములు దానికి చుట్టవలయును. ప్రాణప్రతిష్ఠా మంత్రములతో నిష్ట దేవతకందు ప్రాణ ప్రతిష్ఠ చేయ వలయును. ఆ పర దేవత నా వహనాదులతో ముద్రలతో సంతోష పఱచవలయును. కల్పోక్త రీతిగ పరమేశ్వరిని ధ్యానించి యామెకు స్వాగతము బలికి కుశల ప్రశ్నలు చేయవలయును. పిమ్మట జగన్మాకతు పాద్యము - ఆర్ఘ్యము - ఆచమనీయము - అభ్యంగ స్నానము మధు పర్కము సమర్పించవలయును. పెక్కు విధముల మణులు పొదిగిన యందమై నిర్మలమైన యెఱ్ఱని వస్త్రములు దేవికి సమర్పించ వలయును. మాతృకావర్ణముల సంపుటముగల మంత్రములతో శ్రీదేవి నర్చించవలయును. దేవీ దివ్యాంగములందు మంచి చంద నాదు లందవలయును. పిదప వాసనలు విరజిమ్ము కమ్మని కస్తూరి కుంకుమ - కప్పురము - కుంకుమ పువ్వు - కాలాగురు - చందనము మున్నగు సుగంధ పరిమళద్రవ్యములతోను తెల్లనిమల్లె - కుందము మున్నగు విరిసిన పూలతోను గజన్మాతను సంసేవించవలయును. మధుమిశ్రాః స్మృతా దేవ్యా ప్రియా ధూపాత్మనా సదా | దీపా ననేకన్దత్వాథ నైవేద్యం దర్శయే త్సుధీః. 71 ప్రతి ద్రవ్యం జలం దద్యా త్ర్పోక్షణీస్థం న చాన్యథా | తతః కుర్యా దంగపూజాం కల్పోక్తావరణాని చ. 72 సాంగాం దేవీ మథాభ్యర్ఛ్యవైశ్వదేవం తతశ్చరేత్ | దక్షిణ స్థండిలం కృత్వా తత్రాధాయ హుతాశనమ్. 73 మూర్తిస్థాం దేవతాం తత్రా77వాహ్య సంపూజ్య చ క్రమాత్ | తారయాహుతిభిర్హుత్వా మూలమంత్రేణవై తతః 74 పంచవింశతివారం తు పాయసేన ససర్పిషా | హునేత్పశ్చా ద్వ్యాహృతిభిః పునశ్చ జుహుయాన్మునే. 75 గంధాద్యై రర్చయిత్వా చ దేవీపీఠేతు యోజయేత్ | వహ్నిం విసృజ్య హవిషా పరితోవికిరేద్బలిమ్. 76 దేవతాయాః పార్షదేభ్యో గంధపుష్పాది సంయుతాన్ | పంచోపచారాన్దత్వాథ తాంబూలం ఛత్రచామరే. 77 దద్యాద్దేవై తతో మంత్రం సహస్రావృత్తితో జపేత్ | జపం సమర్ప్య చైశాన్యాం వికిరే దిశి సంస్థితే. 78 కర్కరీం స్థాపయే త్తస్యాం దుర్గామావాహ్య పూజయేత్ | రక్షరక్షేతి చోచ్చార్య నాలముక్తేన వారిణా. 79 అస్త్ర మంత్రం జపన్దేశం సేచయేత్తు ప్రదక్షిణమ్ | కర్కరీం స్థాపయేత్థ్సా నే పూజయే చ్చాస్త్రదేవతామ్. 80 పశ్చాద్గురుస్తు శిష్యేణ సహ భుంజీత వాగ్యతః | తస్యాం రాత్రౌతు తద్వేద్యాం నిద్రాం కుర్యా త్ప్రయత్నతః. 81 నారాయణ ఉవాచ : తతః కుండస్య సంస్కారం స్థంజిలస్య చ వా మునే | ప్రవక్ష్యామి సమాసేన యథావిధి విధానతః. 82 మూల మంత్రం సముచ్చార్య విక్షయే దస్త్ర మంత్రతః | ప్రోక్షయే త్తాడనం కుర్యాత్తేనైవ కవచేనతు. 83 అభ్యుక్షణం సముద్దిష్టం తిస్రస్తిస్రస్తతః పరమ్ | ప్రాగగ్రా ఉదగగ్రా శ్చ లిఖేల్లేఖాః సమంతతః. 84 అగురు - కప్పురము - సాంబ్రాణి - చందనము - శర్కర - తేనె - బెల్లము - మున్నగు ప్రియమైన పదార్థములతో జగన్మాతకు ధూపము వేయవలయును. ఆ జ్యోతిర్మయికి పలువిధముల దీపముల చూపి మహావైవేద్యము సమర్పించవలయును. ప్రతి వస్తువు సమర్పించునపుడును ప్రోక్షణపాత్రము నుంచవలయును. పిదప కల్పోక్తరీతిగ ఆవరణ పూజయును అంగపూజయును చేసి దేవిని కోలిచి వైశ్య దేవము చేయవలయును. ఆదేట్లనగ కుడివైపున చతురస్రముగ స్థండిల మేర్పఱచి యందగ్నిని ప్రతిష్ఠించ వలయును. దివ్యమూర్తి యందున్న దేవత నాహ్వానించి యథావిధిగ పూజించవలయును. పిదప ప్రణవము - వ్యాహృతులుగల మూల మంత్రముతో హోమము చేయవలయును. ఇరువదైదు - మార్లు మంచినేయి మార్లు మంచినేయి కలిపిన పాయసముతో వేల్చవలయును. పిదప ప్రణవవ్యాహృతులతో మరల వేల్చవలయును. పిదప గంధాదులతో దేవిని మరల నర్చించి గేవినాలనమున గూర్చుండ పెట్టవలయును. అగ్నివి యధాస్ధానమున ప్రవేశ పెట్టి యన్నివైపుల బలియొసంగ వలయును. తరువాత దేవి పార్శ్వచిరులను సైతము గంధ పుష్ప నై వేద్య తాబూల ఛత్రఃచామరములతో తృప్తి పరచ వలయును. పిమ్మట శ్రీదేవిమంత్రమునుదేవి సన్నిధియందు వేయి మార్లు జిపించి జప ఫలమీశానికి సమర్పించవలయును. ఈ శాన్యదిశ యందు. కర్కరిని (ఒక విధమనగు జలపాత్ర - గరిగబుడ్డి) స్ధాపించి య్‌దు శ్రీదుర్గ నా వాహన చేసి పూజించవలయును. ''రక్ష రక్ష'' యనుచు నాళము నుండి వచ్చు నీటిచే ''ఫట్'' మంత్రము చదువుచు భూమిని తడుపవలయును. పిదప నట కర్కరిని స్ధాపించి యస్త్రదేవతను పూజించవలయును. పిదప గురువు శిష్యునిగూడి మౌనముగ భుజించవలయును. రేయి యంతమును ప్రయత్వించి దేవి వేదిక యందే నిదురించవలయును. సధండిల కుండవుల సంస్కారమున సంక్షేపముగ యధా విధిగ తెలుపుచున్నాను విను. మూల మంత్రముచ్చరించి కుండముల చూడవలయును. ''ఫట్'' మంత్ర ముతో ప్రోక్షించవలయును. ''హుం'' కవచముతో తాకవలయును. పిదప మూడేసి మూర్లు నీళ్ళుచల్లి దానికి తూర్పు పడమరలందు మూడేసి రేఖలు గీయవలయును. ప్రణవేన సమభ్యుక్ష్య పీఠం దేవ్యాః మసర్చయేత్ | ఆదారకక్తీ మార్బ్య పీఠ మంత్రావసానకమ్. 85 తస్మిన్పీఠే సమావహ్య శివౌ పరమకరణౌ | గంధాద్యై రుపచారై శ్చ పూజ¸° త్తౌ సమాహితః. 86 దేవీం ధ్యాయేదృతుస్వాతాం స్‌సక్తాం శం కరేణ తు | కామాతురాం తయేః క్రజాం కించిత్కాల్ విభవయేత్. అథ వహ్నిం 87 సమాదాయ పాత్రేణ పురతోన్యసేత్ క్రవ్యాదాంశం పరిత్యజ్య పూర్వోక్తై ర్వీక్షణాదిభిః. 88 సంస్కృత్య వహ్నింరంబీజ ముచ్చార్య తదనంతరమ్ | చైతన్యం యోజయేత్తస్మి న్ర్పణవేనాభిమంత్రయేత్. 89 సప్తవారం తతో ధేనుముద్రాం సందర్శయే ద్గురుః | శ##రేణ రక్షితం కృత్వా తనుత్రేణావగుంఠయేత్. 90 అర్చితం త్రిః పరిభ్రామ్య ప్రాదక్షిణ్యన సత్తమః | కుండోపరి జపంస్తారం జానుస్పృష్ట మహాతలః. 91 శివబీజధియా దేవ్యా యోనౌ వహ్నిం వినిక్షిపేత్ | ఆచామయేత్తతో దేవం దేవీం చ జగదంబికామ్. 92 చిత్పింగల హల దహపచయుగ్మం తతః పరమ్ | సర్వజ్ఞాజ్ఞాపయ స్వాహా మంత్రో7యం వహ్నిదీపనే. 93 అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనమ్ | సువర్ణ వర్ణమమలం సమిద్ధం విశ్వతోముఖమ్. 94 మంత్రేణానేన తంవహ్నిం స్తువీత పరమాదరాత్ | తతోన్యసే ద్వహ్నిమంత్రం షడంగం దేశికోత్తమః. 95 సహస్రార్చిః స్వస్తిపూర్ణ ఉత్తిష్ఠ పురుషః స్మృతః | ధూమవ్యాపీ సప్తిజిహ్వో ధనుర్ధర ఇతి క్రమాత్. 96 జాతియుక్తాః షడంగాః స్యుః పూర్వస్థానేషు విన్యసేత్ | ధ్యాయే ద్వహ్నిం హేమవర్ణం త్రిణత్రంపద్మసంస్థితమ్. 97 ఇష్టశక్తి స్వస్తికాభి ర్ధారకం మంగళం పరమ్ | పరిషించే త్తతః కుండం మేఖలోపరి మంత్రవిత్. 98 పిదప ప్రణవముతో ప్రోక్షించి యాధారశక్తినుండి పీఠమంత్రము చివర వఱకు చెప్పి దేవి పీఠమును పూజించవలయును. ''ఆధారశక్తయే నమః అముకదేవీ (దేవీ పేరు) పీఠాయ నమః'' అని పూజించవలయును. పీఠముపై శివపార్వతుల నావాహనముచేసి గంధము మున్నగు ఉపచారములతో చక్కగ నర్చన చేయవలయును. ఋతుస్నాతయై పూర్ణకామముతో శంకరునందు లగ్నమైన చిత్తముగల పార్వతిని వారి క్రీడలను భావించవలయును. పిదప నొక పాత్రలో నగ్నిని దెచ్చి దేవి సన్నిధి నుంచవలయును. అందు రాక్షసాంశము వదలి వెనుక చెప్పినటుల చూడవలయును. అగ్నిని చక్కగ సంస్కరించి యేడుమార్లు ప్రణవమును రంబీజమును ఉచ్చరించి యగ్నియందు చైతన్యము కూర్చవలయును. పిమ్మట గురు వేడు మార్లు ధేనుముద్ర ప్రదర్శించి ''ఫట్'' మంత్రముతో రక్షచేసి ''హుం'' మంత్రముతో నవగుంఠనము చేయవలయును. ఇటుల పూజించి యగ్నికుండమునకు ముమ్మారు ప్రదక్షిణించి దాని చెంత నోంకారము జపించుచు మోకాళ్లతో నేలనుతాక వలయును. శివవీర్యము ప్రకృతిలో బడునని తలంచుచు కుండమునం దగ్ని నుంచవలయును. శివాశివుల కాచమనము చేయించవలయును. అగ్ని చక్కగ ప్రజ్వరిల్లుటకు ''హస - హన దహ - దహ పచ - పచ - సర్వజ్ఞ ఆజ్ఞాపయ - స్వాహా'' యను మంత్రములు చెప్పవలయును. ''జాతవేదుడు - హుతాశనుడు - విశ్వతోముఖుడు - సమిద్ధుడు - బంగారు చాయ గలవాడు - చక్కగ ప్రజ్వరిల్లువాడు నగు నగ్నికి నమస్కారము'' అను అర్థ మిచ్చు ఈ మంత్రముతో నగ్నిని గౌరవభావముతో స్తుతించవలయును. పిదప గురువు వహ్నిమంత్రముతో షడంగన్యాసము చేయవయలును. సహస్రార్చి - స్వస్తిపూర్ణ ఉత్తిష్ఠపురుష - ధూమవ్యాపి - సప్తజిహ్వ - ధనుర్ధర - యను షడంగములను నమః స్వాహా - వషట్ - హుం - వౌషట్ - ఫట్ - జాతియుక్తములుగా లోగడ చెప్పినట్లు న్యాస మొనర్చి సహస్రార్చిషే హృదయాయ నమః స్వస్తి పూర్ణాయ శిరసే స్వాహా'' యను రీతిని చెప్ప వలయును. వర - శక్తి - స్వస్తికా భయముద్రలను ప్రదర్శించి పరమ మంగళప్రదమగు కుండమేఖలపై నీరు ప్రోక్షించవలయును. దర్బైః పరిస్తరే త్పశ్చా త్పరిధీ న్విన్యసేదథ | త్రికోణవృత్త షట్కోణసాష్టపత్రం సభూపురమ్. 99 యంత్రం విభావయే ద్వహ్నేః పూర్వం వాసం లిపేదథ | తన్మధ్యే పూజయే ద్వహ్నిం మంత్రేణానేనవై మునే. 100 వైశ్వానర తతో జాతవేదః పశ్చాదిహావహ | లోహితాక్ష పదం ప్రోక్త్వా సర్వకర్మాణి సాధయ. 101 వహ్నిజాయాంతకో మంత్ర స్తేన వహ్నింతు పూజయేత్ | మధ్యే షట్స్వపి కోణషు హిరణ్యా గగనాతథా. 102 రక్తా కృష్ణా సుప్రభా చ బహురూపా7తిరక్తికా | పూజయే త్సప్తజిహ్వాస్తాః కేసరేష్వంగ పూజనమ్. 103 దలేషు పూజయేన్మూర్తీః శక్తి స్వస్తికధారిణీః | జాతవేదాః సప్తజిహ్వో హవ్యవామన ఏవ చ. 104 అశ్వోదరజ సంజ్ఞో7న్యః పునర్వైశ్వా నరాహ్వయః | కౌనారతేజాః స్యా ద్విశ్వముఖో దేవముఖః స్మృతః. 105 తారాగ్న యేపదాద్యాః స్యుర్నత్యంతా వహ్ని మూర్తయః | లోకపాలాం శ్చతుర్దిక్షు వజ్రాద్యాయుధ సంయుతాన్. 106 నారాయణ ఉవాచ : తతః స్రుక్స్రువ సంస్కారా వాజ్యసంస్కార ఏవ చ | హోమం కృత్వా తతః కుర్యా త్స్రువేణాదాయవై ఘృతమ్. 107 దక్షిణాత్ ఘృతభాగాత్తు వహ్నేర్దక్షిణలోచనే | జుహుయా దగ్నయే స్వాహేత్యే వంవైవామతో7న్యతః. 108 సోమాయస్వాహేతి మధ్యాత్ ఘృతమాదాయ సత్తమ | అగ్నీషోమాభ్యాం స్వాహేతి మధ్యనేత్రేహునేత్తతః. 109 పునర్దక్షిణభాగా త్తు ఘృతమాదాయ వై ముఖే | అగ్నయే స్విష్ట కృత్సాహే త్యనేనైవ హునేత్తతః. 110 సతారాభి ర్వ్యాహృతిభి ర్జుహుయాదథ సాధకః | జుహుయా దగ్నిమంత్రేణ త్రివారంతు తతఃపరమ్. 111 తతస్తు ప్రణవే7నైవా ప్యష్టావష్టౌ ఘృతాహుతీ | గర్బాధానాది సంస్కారకృతే తు జుహుయాన్మునే. 112 పిదప పరిధిలో దర్బలు పఱవలయును. త్రికోణము - వృత్తము - షట్కోణము - అష్టపత్రము అను రీతిగ నగ్ని యంత్రమును భావన చేయవలయును. దాని నడుమ నున్న యగ్ని నీ చెప్పబోవు అర్థ మిచ్చు మంత్రముతో పూజించవలయును. వైశ్వానర! జాతవేదా! ఇటు రమ్ము. లోహితాక్ష పదముతో సర్వకార్యములను సాధించుకొనుము. ఈ మంత్రము స్వాహాంతమైనది. దీనితో నగ్నిని పూజించవలయును. షట్‌కోణముల నడుమ హిరణ్య - గగన - రక్త - కృష్ణ - సుప్రభ - బహు రూప - అతిరక్తిక - యను సప్త జిహ్వలను పూజించవలయును. దళముల మధ్యను స్వస్తిధారిణియగు శక్తిని పూజించవలయును. జాతవేద - సప్తజిహ్వ - హవ్యవాహన - అశ్వోదరజ - వైశ్వానర - కౌమారతేజ - విశ్మముఖ - వేదముఖులను ''అగ్నయే జాత వేదసే నమః'' అను విదముగ మంత్రము చెప్పవలయును. నలుదెసలందును వజ్రము మున్నగు నాయుధములు గల యింద్రుడు మొదలగు లోకపాలురను పూజించవలయును. స్రుక్ స్రువములతో నాజ్యసంస్కారము చేసి వేల్చవలయును. స్రువముతో నాజ్యము దక్షిణభాగమునుండి గ్రహించి అగ్ని కుడినేత్రమందు ''ఆగ్నయే స్వాహా'' యను మంత్రముతో వేల్చ వలయును. అటులే యెడమవైపునుండియు నేయి గ్రహించి ''సోమయా స్వాహా'' యని వేల్చవలయును. నడుమనుండి నేయి గ్రహించి ''అగ్నీషోమాభ్యాం స్వాహా'' యని మధ్య నేత్రమున వేల్చవలయును. దక్షిణభాగమునుండి నేయి తీసికొని యగ్ని ముఖమున ''అగ్న యే స్విష్టకృతే స్వాహా'' యనుచు వేల్చవలయును. ''ఓం భూర్బువస్సువః స్వాహా'' యనుచు వేల్చవలయును. మరల మూడుమార్లు పైని చెప్పిన యగ్నిమంత్రములతో వేల్చవలయును. తర్వాత ప్రణవముతో నెనిమిదిసారు లాజ్యాహుతులు వేయవలయును. గర్బాధానాది విధులందు నిటులే చేయవలయును. అవి ఏమనగా - గర్బాదానం పుంసవనం సీమంతోన్నయనం తతం | జాతకర్మ నామకర్మాత్యుపనిష్క్రమణం తథా. 113 అన్వాశనం తథా చూడా వ్రతబంధస్తథైవ చ | మహానామ్న్యం వ్రతం పశ్చాత్తథైపనిషదం వ్రతమ్. 114 గోదానోద్వాహకౌ ప్రోక్తాః సంస్కారాః శ్రుతిచోదితాః | తతః శివం పార్వతీం చ పూజయిత్వా విసర్జయేత్. 115 జుహుయాత్పంచ సమిధో వహ్ని ముద్దిశ్యసాధకః | పశ్చాదావరణానాం చాప్యేకైకా మాహుతిం హునేత్. 116 ఘృతం స్రుచి సమాదాయ చతుర్వారం స్రువేణ చ | పిధాయ తాంతుతేనైన మునే తిష్ఠన్నిజాసనే. 117 వౌషడంతేన మనునా వహ్నే సప్తు జూహుయాత్తతః | మహాగణశ మంత్రేణ జుహుయాదాహుతీర్దశ. 118 వహ్నౌ పీఠం సమభ్యర్చ్య దేయమంత్రస్యదేవతామ్ | వహ్నౌ ధ్యాత్వాతు తద్వక్త్రే పంచవిశతి సంఖ్యయా. 119 మూలమంత్రేణ జుహుయా ద్వక్రైకీ కరణాయ చ | వహ్నిదేవతయోరైక్యం భావయన్నాత్మనా సహ. 120 ఏకీభూతం భావయేత్తు తతస్తుసాధకోత్తమః | షడంగం దేవతానాం చ జుహుయాదాహుతీః పృథక్. 121 ఏకాదశైవ జుహుయా దా హుతీర్ముని సత్తమ | ఏతేన నాడీసంధానం వహ్నిదేవతయోర్మునే. 122 ఏకైక క్రమయోగేనా ప్యావృత్తీనాం తథైవ చ | ఏకైక క్రమయోగేన ఘృతేన జుహుయాన్మునే. 123 తతః కల్పోక్త ద్రవ్యై స్తు జుహుయాదథవా తిలైః | దేవతామూలమంత్రేణ గజాంతక సహస్రకమ్. 124 ఏవం హుత్వా తతోదేవీం సంతుష్టాం భావయేన్మునే | తథై వా7వృతి దేవీ శ్చ వహ్న్యాద్యా దేవతా అపి. 125 తతః శిష్యం చ సుస్నాతం కృతసంధ్యాదికక్రియమ్ | వస్త్రద్వయయుతం స్వర్ణాభరణన సమన్వితమ్. 126 గర్బాధాన-పుంసవన-సీమంతోన్నయనములు-జాతకర్మ-నామకరణము-నిష్కృమణము-అన్నప్రాశనము-చూడా కరణము - వ్రతబంధము - మహానామవ్రతము - ఔపనిషదవ్రతము - గోదానము - వివాహము ననునవి వేదచోదితమైన కర్మలు. ఆ పిదప శివపార్వతులను పూజించి విసర్జించవలయును. ఆ తర్వాత అగ్ని నుద్దేశించి యైదు సమిధలు వేల్చవలయును. పిదప ఆవరణ దేవతల కొక్కొక్క యాహుతి వేయవలయును. పిదప స్రువముతో నాలుగుసార్లు నేయి తీసికొని తన యాసనమున గూర్చొని వేల్చవలయును. తర్వాత నగ్నిలో ''వౌషట్'' మంత్రముతో మహాగణపతికి పది యాహుతు లీయవలయును. (ఎట్లన ఓం ఓం స్వాహా - ఓం శ్రీం స్వామా - ఓం హ్రీం స్వాహా - ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా - ఓం శ్రీం హ్రాం క్లీం గ్లౌం స్వాహా - ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా - ఓం శ్రీం హ్రాం క్లీం గ్లౌం గం గణపతయే స్వాహా - వరవరద - సర్వజనం మే వశమానయ స్వాహా) అటు పిమ్మట నగ్నియందు పీఠపూజ చేసి యగ్ని ముఖమున మంత్రదేవతను ధ్యానించవలయును. మఱియు నిరువదైదు మూలమంత్రములతో వేల్చవలయును. అగ్ని - దేవతల కొకే ముఖము గలదని యాత్మలో వారికైక్యము భావించవలయును. ఈ ప్రకారముగ నెవడు భావించునో వాడుత్తమసాధకుడు. షడంగ దేవతలకు వేర్వేరుగ నాహుతు లీయవలయును. మునిసత్తమా! ఇట్లు పదునొకం డాహుతు లీయవలయును. ఇట్లగ్నికి నిష్టదేవతకు సమైక్యము భావించ వలయును. తర్వాత నొక దేవత నొకే యగ్నిగ భావించి వేల్చవలయును. మునీ ! ఇట్లు క్రమముగ నేతితో వేల్చవలయును. పిదప కల్పోక్తమైన ద్రవ్యములతో లేక తిలలతో వేల్చవలయును. పిదప అష్టోత్తర సహస్ర నామములతో దేవికి హోమము చేయవలయును. ఈ విధముగ నాహుతు లిచ్చుటవలన శ్రీదేవిని - ఆవరణ దేవతలను అగ్ని మున్నగు దేవతలను సంతుష్టి పఱచిన ట్లగును. తర్వాత శిష్యుడు స్నాన సంధ్యావందనాదు లాచరించి రెండు తెల్ల వస్త్రములు - బంగారు సొమ్ములు దాల్చ వలయును. కమండలుకరం శుద్ధం కుండస్యాంతిక మానయేత్ | నమస్కృత్య తతః శిష్యో గురూనథ సభాసదః. 127 కులదేవం నమస్కృత్య విశేత్తత్రా7థ విష్టరే | గురు స్తతస్తు తం శిష్యం కృ పాదృష్ట్యా విలోకయేత. 128 తచ్చైతన్యం నిజే దేహే భావయే త్సంగతంత్వితి | తతః శిష్యతనుస్థాన మధ్వనాం పరిశోధనమ్. 129 కుర్యాత్తు హోమతో విద్వన్దివ్యదృష్ట్యవలోకనాత్ | యేన జాయేతశుద్ధాత్మా యోగ్యోదేవాద్యనుగ్రహే. 130 నారాయణ ఉవాచ : తనౌ ధ్యాయే త్తు శిష్యస్య షడధ్వనః క్రమేణ తు | పాదయోస్తు కలాధ్వాన మంధౌ తత్వాధ్వకం పునః. 131 నాభౌతు భువనాధ్వానం వర్ణాధ్వానం తథా హృది | పదాధ్వానం తథా భాలే మంత్రాధ్వానంతు మూర్ధని. 132 శిష్యం స్పృశం స్తు కూర్చేన తిలై రాజ్య పురిప్లుతైః | శోదయామ్యముమధ్వాన స్వాహేతిమను ముచ్చరన్. 133 తారాఢ్యం జుహుయా దష్టవారం ప్రత్యధ్వమేవ హి | షడధ్వన స్తతస్తాం స్తులీనా న్ర్బహ్మణిభావయేత్. 134 పునరుత్పాదయేత్తస్మా త్సృష్టిమార్గేణ వై గురుః | ఆత్మస్థితం తచ్చైతన్యం పునః శిష్యేతు యోజయేత్. 135 పూర్ణాహుతిం తతో హుత్వా దేవతాం కలశే నయేత్ | పునర్వ్యా హృతిభిర్హుత్వా వహ్నేరంగా హుతీ స్తథా. 136 ఏకైకశో గురుర్దత్వా విసృజే ద్వహ్ని మాత్మని | తతః శిష్యన్య నేత్రేతు బధ్నీయాద్వాససాగురుః. 137 నేత్రమంత్రేణ తంశిష్యం కుండతో మండలం నయేత్ | పుష్పాంజలిం ముఖ్యదేవ్యాం కారయేచ్ఛిష్య హస్తతః. 138 నేత్రబంధం నిరాకృత్య వేశ##యే త్కుశ విష్టరే | భూతశుద్ధిం శిష్యదేహే కుర్యాత్ర్పోక్తేన వర్త్మనా. 139 మంత్రోదితాంస్తథా న్యాసా న్కృత్వాశిష్యతనౌతతః | మండలే వేశ##యే చ్ఛిష్య మన్యస్మిన్కుంభ సంస్థితాన్. 140 తన చేత కమండలువు దాల్చిన శుద్ధచిత్తుడగు శిష్యుని గురు వగ్నికుండము సన్నిధికి తీసికొని పోవలయును. శిష్యు డంత తన గురువునకును సభాసదులకును నమస్కరించవలయును. అతడు పిమ్మట తన కులదేవతలకు మ్రొక్కి విష్టరమందు గూర్చొనవలయును. గురువు తన శిష్యుని దయగల చూపులతో చూడవలయును. శిష్యుని చైతన్యము తన శరీరమం దున్నట్లు గురువు తలంచవలయును. పిదప శిష్యుని శరీరమును చెప్పబోవు రీతిని శోధించవలయును. శిష్యుడు పరిశుద్దుడగునట్లు గురు వతని మొగమున తన చల్లని చూపులతో చూడవలయును. దానిచే శిష్యుడు శుద్ధాంతరంగుడై దేవతల కనుగ్రహపాత్రుడగును. శ్రీనారాయణు డిట్లనెను : శిష్యుని శరీరమునందు ఆరధ్వములను ధ్యానించవలయును. అతని చరణములందు కలాధ్వమును లింగమున తత్వాధ్వమును నాభియందు భువనాధ్వమును హృదయమున వర్ణాధ్వమును నొసట పదాధ్వమును శిరమున మంత్రాధ్వమును భావించవలయును. గురువు శిష్యుని కూర్చతో తాకి మంత్రము చదువవల యును. శిష్యుని యధ్వములు శుద్ధి చెందుటకు నూగులు నేతితో ''అస్య శిష్యస్య కలాధ్వానం శోధయామి స్వాహా'' యను మంత్ర ముచ్ఛరించి వేల్చవలయును. ఇటులెనిమిదిమార్లు వేల్చవలయును. ప్రతి అధ్వము పేరు చెప్పి యా యధ్వములను బ్రహ్మమందు లీనమగునట్లు భావించవలయును. పిదప గురువు సృష్టిమార్గమున బ్రహ్మరూపునిగ శిష్యుని రూపొందించవల తనలో నున్న శిష్యుని చైతన్యమును తిరిగి శిష్యునం దుంచవలయును. తరువాత పూర్ణాహుతి చేసి దేవతను కలశమందు వేశనము చేయవలయును. పిదప వ్యాహృతులతో నగ్ని యంగాహుతులను వేల్చవలయును. ఒక్కొక్క యాహుతి నొసంగి గురువగ్నిని తనయందు నిలుపవలయును. పిదప శిష్యుని కండ్లకు వస్త్రము కట్టవలయును. కట్టునపుడు ''వౌషట్'' అని పిదప శిష్యుని కుండమునుండి కలశము చెంతకు గొనిపోయి యతనిచేత ముఖ్య దేవతకు పుష్పాంజలి నర్పింపజేయవలయును. పిదప కండ్ల గుడ్డతీసి దర్బలపై శిష్యుని గూర్చొనబెట్టి వెనుక చెప్పినటుల శిష్యుని దేహమందు భూతశుద్ధి చేయవలయును. పిదప శిష్యుని శరీరమందు మంత్రములోని వ్యాసము లొనరించి వేరొక కలశ మున్నచోటికి శిష్యుని గొనిపోవలయును. పల్లవాన్ శిష్య శిరసి విన్యసేన్మాతృకాం జపేత్ | కలశస్థజలైః శిష్యం స్నాపయే ద్దేవ తాత్మకైః. 141 వర్ధనీ జలసేకం చ కుర్యాద్రక్షార్థ మంజసా | తతః శిష్యః సముత్థాయ వాససీ పరిధాయ చ. 142 కృతభస్మావలేప శ్చ సంవిశేద్గురుసన్నిధో | తతో గురుః స్వకీయాత్తుహృదయాన్నిర్గతాంశివామ్. 143 ప్రవిష్టాం శిష్యహృదయే భావయేత్కరుణానిధిః | పూజయే ద్గంధ పుష్పాద్యైరైక్యంవై భావయంస్తయోః. 144 తతస్త్రింశో దక్షకర్ణే శిష్య స్యోపదిశే ద్గురుః | మహామంత్రం మహాదేవ్యాః స్వహస్తంశిరసిన్యసన్. 145 అష్టోత్తరశతం మంత్రం శిష్యో7పి ప్రజపేన్మునే | దండవత్ర్పణమే ద్బూమౌ గురుం తం దేవతాత్మకమ్. 146 సర్వస్వ మర్పయేత్తసై#్మ యావజ్జీవ మనన్యధీః | ఋత్విగ్బ్యో దక్షిణాం దత్వా బ్రాహ్మణాం శ్చా పి భోజయేత్. 147 సువాసినీః కుమారీ శ్చ వటుకాంశ్చైవ సర్వశః | దీనానాథాన్దరిద్రాం శ్చ విత్తశాఠ్య వివర్జితః. 148 కృతార్థతాం స్వస్య బుద్ధ్వా నిత్యమారాధయేన్మనుమ్ | ఇతితే కథితః సమ్యగ్దీక్షా విథి రనుత్తమః. 149 విమృశ్యైత దశేషేణ భజ దేవీపదాంబుజమ్ | నాన్య స్తు పరమోధర్మో బ్రాహ్మణస్యా త్ర విద్యతే. 150 వైదికః స్వస్య గృహోక్త క్రమేణోపదిశేన్మనుమ్ | తాంత్రికస్త త్ర రీత్యాతు స్థితిరేషా సనాతనీ. 151 తత్త దుక్త ప్రయోగాంస్తే తేతే కుర్యర్న చాన్యథా | నారాయణః: ఇతి సర్వం మాయాఖ్యాతం యత్పృష్టం నారద త్వయా. 152 అతః పరం పరాంబాయా భజ నిత్యం పదాంబుజమ్ | నిత్యమారాధ్యతచ్చాహం నిర్వృతిం పరమాం గతః. 153 వ్యాస ఉవాచ : ఇతి రాజన్నారదాయ ప్రోక్త్వా సర్వ మనుత్తమమ్ | సమాధి మీలితాక్షస్తు దధ్యౌ దేవీ పదాంబుజమ్. 154 నారాయణస్తు భగవాన్మునివర్య శిఖామణిః | నారదో పి తతో నత్వా గురుం నారాయణం పరమ్ | జగామ సద్య స్తపసే దేవీ దర్శనలాలసః. 155 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ద్వాదశస్కంధే సప్తమో7ధ్యాయః. మాతృక చదువుచు శిష్యుని తలపై కలశమందలి చిగు ళ్ళుంచవలయును. ఆ కలశ జలముతో స్నాన మొనరించ వలయును. పిదప రక్షణకు వర్ధనీజలముతో తడుపవలయును. తర్వాత శిష్యుని లేపి యతనికి రెండు వస్త్రములు కట్టించవల యును. శిష్యుడు తన దేహమున భస్మము దాలిచి గురుసన్నిధి కేగవలయును. గురువు తన హృదయమునుండి వెడలి భగవతి శిష్యుని హృదయములో ప్రవేశించినట్లు భావించవలయును. శిష్యుని గంధాదులతో పూజించి దేవతతో శిష్యుడైక్య మొందినట్లుగ భావించవలయును. పిమ్మట గురువు తన కుడిచేతిని శిష్యుని శిరముపైనుంచి యతని కుడిచెవిలో మహాదేవి మహామంత్ర ముపదేశించవలయును. అంత శిష్యుడా మంత్రమును నూట యెనిమిదిమార్లు జపించి దేవతాత్మకుడగు గురువు నకు సాష్టాంగముగ నమస్కారము చేయవలయును. అతనికి తన సర్వస్వ మర్పించి శిష్యుడు నిశ్చలబుద్ధితో ఋత్విజుల దక్షిణలతోను బ్రాహ్మణులను భోజనములతోను సంతోషపఱచవలయును. ముత్తైదువలను కుమారికలను వటువులను దీనులను అనాధులను తన శక్తి కొలది తృపన్తిపఱచవలయును. శిష్యుడు తన్ను తాను ధన్యునిగ భావించుకొని మంత్రజపము నిరంతర ముగచేయుచుండవలయును. ఇట్లు పరమోత్తమమైన దీక్షా విధానము నీకు తెల్పితిని. దీనిని చక్క నెఱింగి శ్రీదేవీ చరణ కమలములందు ధ్యాన ముంచుము. బ్రాహ్మణున కింతకన్న మిక్కిలియగు ధర్మము మఱియొకటి లేదు. నారదా ! వైదికుడు తన గృహోక్త ప్రకారముగ వేద ముపదేశించవలయును. తాంత్రికుడు తంత్ర ప్రకారము చేయవలయును. ఇది సనాతన మైన వేదధర్మము. ఎవరెవరికి తగినట్లు వారు వారు ప్రయోగములను చేయవలయును. నారదా! నీ వడిగిన దంతయును తేటగ చెప్పితిని. ఇపు డింక నీవు పరాంబికా దివ్య చరణ కమలములు సేవింతుము. దేవిని నిత్య మారాధించి పరమశాంతిని బడయును. వ్యాసు డిట్లనెను : జనమేజయా ! ఈ ప్రకారముగ నారయణుడు నారదున కంతయును చెప్పి కన్నులు మూసికొని సమాధిలో మునిగి శ్రీదేవిని ధ్యానించసాగెను. ఈ విధముగ నారాయణుడను మునిపుంగవుడు పురుషోత్తము డయ్యెను. నారదుడును తన పరమగురువగు నారాయణునకు ప్రణమిల్లి దేవీదర్శనకాంక్షతో తప మాచరించ నరిగెను. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ద్వాదశ స్కంధమున సప్తమాధ్యాయము.