Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వాదశో7ధ్యాయః.

వ్యాస ఉవాచః తదేవ దేవీసదనం మధ్యభాగే విరాజతే | సహస్రస్తంభసంయుక్తా శ్చత్వారస్తేషు మండపాః. 1

శృంగారమండపశ్చైకో ముక్తిమండప ఏవచ | జ్ఞానమండపసంజ్ఞ స్తు తృతీయః పరికీర్తితః.2

ఏకాంతమండపశ్చైవ చతుర్థః పరికీర్తితః | నానావితానసంయుక్తా నానాధూపై స్తు ధూపితాః . 3

కోటి సూర్య సమాః కాంత్యా ఖ్రాజంతే మండపాః శుభాః | తన్మడపానాం పరితః కాశ్మీరవనికా స్మృతా. 4

మల్లికాకుందవనికా యత్ర పుష్పలతాః స్థితాః | అసంఖ్యాతా మృగమదైః పూరితాస్తత్స్రవా నృప. 5

మహాపద్మాటవీ తద్వ ద్రత్నసోపాన నిర్మితా | సుధారసేన సంపూర్ణా గంజన్మత్త మధువ్రతా. 6

హంస కారండవాకీర్ణా గంధపూరితా దిక్తటా | వనికానాం సుగంధైస్తు మణిద్వీపం సువాసితమ్‌ . 7

శృంగారమండపే దేవ్యో గాయంతి వివధైః స్వరైః | సభాసదో దేవవరా మధ్యే శ్రీజగదంబికా. 8

ముక్తి మండప మధ్యేతు మోచయత్యనిశం శివా | జ్ఞానోపదేశం కురుతే తృతీయే నృప మండపే. 9

చతుర్థే మండపే చైవ జగద్రక్షా విచించనమ్‌ | మంత్రిణీ సహితా నిత్యం కరోతి జగదంబికా.

10

చింతామణిగృహే రాజన్‌ శక్తితత్వత్మకైః పరైః | సోపానైర్దశభిర్యుక్తో మంచకో7ప్యధిరాజతే .11

బ్రహ్మవిష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః | ఏతే పంచ ఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః . 12

తస్యోపరి మహాదేవో భువనేశో విరాజతే | యా దేవీ నిజలీలార్థం ద్విధాభూతా బభూవహ. 13

సృష్ట్యాదౌతు స ఏవాయం తదర్దాంగో మహేశ్వరః | కందర్పదర్పనాశోద్యత్కోటికందర్పసుందరః . 14

పంచవక్త్ర స్త్రీణత్రశ్చ మణి భూషణ భూషితః | హరిణా7భీతి పరశూన్వరం చ నిజాబాహుభిః. 15

దధానః షోడశాబ్దో సౌ దేవః సర్వేశ్వరో మహాన్‌ | కోటిసూర్య ప్రతీకాశ శ్చంద్ర కోటి సుశీతలః . 16

పండ్రెండవ అధ్యాయము

మణిద్వీపవర్ణనము - ఫలశ్రుతి

చింతామణుల మధ్యభాగమున శ్రీదేవి దివ్య మందిరము విరాజిల్లుచున్నది. ఆ దివ్య మందిరమునకు వేయి మణి స్తంభములును నాలుగు మండపములును శోభలు గూర్చుచున్నవి. అందు ఒకటి శృంగఘారమండపము రెండవది ముక్తి మండపము మూడవది జ్ఞానమండపము నాలుగవది ఏకాంత మండపము అని ప్రసిద్ధి గాంచినవి. వీని యందెన్నియో మణుల యరుగులు గలవు. అవి పెక్కు ధూపములు సువాసనలతో నిత్యము పరిమళములు వెదజల్లును. ఈ నాల్గింటిలో ప్రతి మంటపమును కోటి సూర్యకాంతులు విరజిమ్ముచుండును. ఆ మంటపములకు నలువైవుల కాశ్మీర వనములు కనులకింపుగ నుండును. అచ్చట మంచిమల్లె పూదోటలు కుందపు పూలతోటలు నెన్నో పరిమళాలు గుబాళించుచుండును. ఆ తోటలందెన్నియో మృగములు మదము స్రవింపచేయుచు తిరుగుచుండును. అచట రతనాల మెట్ల వరుసలతో విరాజిల్లు మహాపద్మముల వనములు గలవు. ఆ పద్మములం దమృతమువలె తేనెలు జాలువారుచుండును. తుమ్మెదలు ఝుం ఝుం రొదలతో కమ్మని తేనియాను చుండును. ఆచోట హంసకారండవ పక్షులును గలవు - ఆ దివ్యవనము లందలి సుగంధము లెల్ల దిక్కులకు సువాసనలు వెదజల్లును. మణిద్వీప మా పరిమళాల కెరటాలచే సువాసితమై యొప్పును.శృంగార మంటపమందు దేవతలు మధుర సుందర స్వరములతో దివ్యగానము లాలపింతురు. అందెల్ల దేవతలును సభాసదులై యుందురు. శ్రీ జగదంబ - దేవీ వారి నడుమ దివ్య సింహాసనముపై విరాజిల్లుచుండును. ముక్తి మంటపమందుండి జగదంబ బ్రహ్మాండమందలి పరభక్తులకు ముక్తి భాగ్యము ప్రసాదించుచుండును. జ్ఞాన మంటపమందు జ్ఞానకాంతులు వెల్గించుచు విధేయాత్ములగు వారికి పరమజ్ఞాన ముపదేశించుచుండును. నాలవ మంటపమందు దేవి తన మంత్రిణులతో కొలువుండి లోకరక్షణ గూర్చి యాలోచించు చుండును. రాజేంద్రా! చింతామణి గృహమందు శక్తి తత్వాత్మకములైన పదిమెట్ల వరుసతో దివ్యకాంతులీను మంచము శోభిల్లుంచుండును. బ్రహ్మ- విష్ణు- రుద్రులు- ఈశ్వరుడు - దాలికి నాలుపాదములు. సదాశివుడా నాల్గుపాదములపై ఫలకముగ నలరుచుండును. దానిపై త్రిభువనశ్వరుడు- మహాదేవుడునగు కామేశ్వరుడు విరాజిల్లుచుండును. త్రిభువనేశ్వరీ దేవియే తన లీలా విలాసమునకు రెండు రూపులు దాల్చును. ఈ సృష్టికి మొట్టమొదట మహాదేవుడు త్రిభుపవనేశ్వరి కార్ధాంగుడయ్యెను అతడు మన్మధుడు దర్పమడచుటకు పూనిని కోటి మదన సుందరుడు. అతని కైదు ముఖములు- మూడు నేత్రములు గలవు మణిభూశిణ భూషితుడై యతడు తన హిరణ్య బాహులతో జింక- పరమశువువరదాభయ ముద్రలు దాల్చి విరాజిల్లుచుండును. ఆ మహాదేవుడ-సర్వేశ్వరుడు-పదారెండ్ల యువకుడు-కోటి సూర్యుల వెలుగు- కోటి చంద్రుల చల్లదనము గల దేవుడు. అతడు శుద్ధ స్ఫటికములవలె వెల్గువాడు; ముక్కంటి; చల్లని దయతోడి చూపులు విరజిమ్మువాడు.

శుద్ధ స్ఫటిక సంకాశ స్త్రీ నేత్రః శీతలద్యుతి ః | వామాంకే సన్నిషణ్ణా స్య దేవీ శ్రీభువనేశ్వరీ. 17

నవరత్న గణాకీర్ణ కాంచీదామ విరాజితా | తప్త కాంచన సన్నద్ద వైడూర్యాంగద భూషణా . 18

కనచ్చ్రీ చక్రాతాటంక విటంక వదనాంబుజా | లలాట కాంతి విభవ విజితార్ధసుధాకరా. 19

బింబకాంతితిరస్కారి రదచ్చద విరాజితా | లసత్కుంకుమకస్తూరీ తిలకో ద్బాసితాననా. 20

దివ్యచూడామణిస్పార చంచ చ్చంద్రక సూర్యకా | ఉద్యత్కాంతి సమస్వచ్ఛ నాసాభరణ భాసురా. 21

చింతాకాలంబిక స్వచ్ఛ ముక్తాగుచ్చ విరాజితా | పాటీర పంకకర్పూర కుంకుమాలకృత స్తనీ. 22

విచిత్రవివిధా కల్పా కంబుసంకాశకంధరా | దాడిమీఫలభీజాభ దంతపంక్తి విరాజితా. 23

అనర్ఘ్య చరత్వఘటిత ముకుటాంచితమస్తకా | మత్తాలి మాలావిలస దలకాఢ్య ముఖాంబుజా. 24

కలంక కార్శ్య నిర్ముక్త శరచ్చంద్ర నిభాననా | జాహ్నవీసలిలావర్త శోభినాఖీ విభూషితా. 25

మాణిక్య శతలాబద్ధ ముద్రికాంగుళి భూషితా | పుండరీకదళా చకారనయన త్రయ సుందరీ. 26

కల్పితా చ్చ మహారాగ పద్మరాగోజ్జ్వల ప్రభా | రత్నకింకిణికాయుక్త రత్వకంకణ శోభితా. 27

మణిముక్తా సరాపార లసత్పదకసంతతిః | రత్నాంగుళి ప్రవితత ప్రభాజాల లసత్కరా. 28

కంచుకీ గుంఫితాపార నానారత్న తతిద్యుతిః | మల్లికామోద ధమ్మిల్ల మల్లికావిసరావృతా. 29

సువృత్తనిబిజోత్తుంగకుచ భారాలసా శివా | పరపాశాంకుశాభీతిలసద్బాహుచతుష్టయా. 30

సర్వ శృంగార వేశాఢ్యా సుకుమారాంగ వల్లరీ | సౌందర్య ధారాసర్వస్వా నిర్వ్యజ కరిణామయీ. 31

నిజసంలాపమాధుర్య వినిర్బర్సిత కచ్చపీ | కోటి కోటి రవీందూనాం కాంతిం యా బిభ్రతీ పరా. 32

నానాసఖీ భి ర్దాసీభి స్తథా దేవాంగనాదిభిః | సర్వాభి ర్దేవతాభి స్తు సమంతా త్పరివేశిటతా. 33

ఇచ్చాశక్త్యా జ్ఞానశక్త్యా క్రియాశక్త్యా సమన్వితా|

అట్టి త్రిభువనేశ్వరుడు కెడమ వైపున శ్రీ త్రిభువనేశ్వరీదేవి నవరత్నములు పొదుగబడిన మొల నూలితోను క్రాగిన మేలిమి బంగారమునకు వైఢూర్యములు పొదిగిన చేతి కడియములతోను ప్రకాశించుచుండును. మేల్మి బంగారముతో చేయబడిన శ్రీ చక్రాకారముగల తాటంకముల కాంతులతో సొబగు మీరు ముఖకమలముతో దేవి ప్రాకాశించుచుండును. ఆమె ముఖకాంతి వైభవము ముందు చంద్రుని కాంతులు వెలవెలబోవును. బాగుగ పండిన మంచి దొండపండును మించిన అధరముతోను నెన్నొసట కుంకుమ- కస్కూరి- తిలకములు సౌభాగ్యముతో దివ్యకాంతు లీను ముఖకమలములతో దేవి శోభిల్లుచుండును. దేవి సూర్యచంద్ర కాంతులను మించు దివ్యచూడామణ శిరోభూషణముగ గలది; ఉదయించుచున్న శుక్రునివలె స్వచ్ఛకాంతులు విరజిమ్ము నాభరణముచే భాసిల్లునది; మంచి జాతి ముత్యాల గుత్తులతో శోభిల్లుచున్న చింతాకుపదకము వ్రేలాడు మెడతో దేవి శోభిల్లుచున్నది; మంచి గంధము- కప్పురము- కుంకుమ అలందిన చనుదోయి గలది. చిత్రవిచిత్రము లైన వివిధములైన సొమ్ములు సింగిరించుకొనియున్నది;శంఖమప బోలుమెడ గలది; ఎఱ్ఱని బండిన దానిమ్మ పండ్ల గింజల వంటి పలువరుసలు గలది. వెలలేని రత్నములచే బొదుగబడిన బంగారు కిరీటమతో శోభిల్లు శిరము గలది. మత్తిల్లిన గండుతుమ్మెదలు మూగిన ముంగురులతో నలరారు ముఖకమలము గలది. కలంకము- క్షీణత్వము లేక దివ్య శోభలు చిందులాడు శారద పూర్ణచంద్రుని వంటి ముఖము గలది. గంగానది సుడిగుండమువలె భాసిల్లు నాభి గలది. మానికములు పొదిగిన బంగారపు టుంగరములతో శోభిల్లు చేతివ్రేళ్ళు గలది; కమలధళమువలె కాంతులు విరజిమ్ము మూడు నేత్రములతో నొప్పారునది మెఱుగెక్కిన మహారాగపద్మరాగమణుల బోలు నిర్మలమైన - మహోజ్జ్వలమైన సర్వకళలు విరజిమ్ము సహజ లావణ్యశోభ గలది. రవళించు రతనాల కింకిణులు- కంకణములు గలది. మెడలో మణుల ముత్యాల హారములందు తళతళమను బంగారు పదకము గలది. ధగ ధగమను రతనపు టుంగరాల కాతులు చిమ్ము చేతులు గలది. రవికపై బొదుగబడిన పైక్కు విధముల రతనాల కాంతులు వెలుగుచున్నవి. వాడని మంచిమల్లెల పరిమళాలు వెదజల్లు కొప్పునందు ముడిచిన వ్రేలాడు మల్లెదండలు చుట్టు మూగు తుమ్మెదల వరుస గలది. శ్రీదేవి తమ యెత్తైన లావైన గుండ్రని కుచభారముతో కొంచె మలసత్వ మొందియున్నది. శివాదేవి తన నాలుగు చేతులందు పాశకుశ వరాభయములు దాల్చి విరాజిల్లుచున్నది. శుభశ్రీలు నిండారిన శృంగార వేషముతో నొప్పుచున్నది ; మెత్తని తనులతగల

కొమలి ; అందాల కందాలరాశి; కారణము లేకయే దయామృతపు చూపులు గలది. నవరసము లొల్కు కచ్చపీ వీణానాదము తియ్యనిది ; దానికన్న తేనెవాక మధురము; దాని కన్న దేవి పలుకులు మఱి మఱి మధురము; కోటానుకోట్ల చంద్రసూర్యుల కాంతులతో సహజముహ దేవి స్వయముగ ప్రకాశించుచుండును. పలువురు చెలికత్తియలు- దాసీజనములు- దేవాందనలు- దేవతలుతను చేరి కొలుచుచుండగ దేవి ప్రకాశించుచుండును. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో కూడియుండును.

లజ్జాతుష్ఠి స్తథా పుష్టిః కీర్తిః కాంతిః క్షమా దయా. 34

బుద్ధిర్‌ మేధా స్మృలిర్‌ ర్లక్ష్మీ ర్మూర్తిమత్యో7ంగనాఃస్మృతాః | జయా చ విజయా చైవాప్యజితా చాపరాజితా . 35

నిత్యా విలాసినీ దోగ్ద్రీ త్వఘోరా మంగళానవా | పీఠశక్తయ ఏతా స్తు సేవంతే యాం పరాంబికామ్‌ . 36

యస్యాస్తు పారశ్వభాగే స్తో నిధీ తౌ శంఖపద్మకౌ | నవరత్నవహా నద్య స్తథా వై కాంచనస్రవాః . 37

సప్తథాతువహా నద్యో నిధిభ్యాం తు వినిర్గతాః | సుధాసింధ్వంతగామిన్య స్తాః సర్వా నృపసత్తమ. 38

సా దేవీ భువనేశానీ తద్వామాంకే విరాజితే | సర్వేశత్వం మహేశస్య యత్సంగాదేవ నాన్యథా. 39

చింతామణిగృహ స్యా7స్య ప్రమాణం శృణు భామిప | సహస్ర యోజనాయామం మహాంత స్తత్ప్రచక్షతే . 40

తదుత్తరే మహాశాలాః పూర్వస్మాద్ద్విగుణాః స్మృతాః | అంతరిక్షగతంత్వేతన్ని రాధారం విరాజతే . 41

సంకోశ్చ వికాసశ్చ జాయతే స్య నిరంతరమ్‌ | పటవత్కార్యవశతః ప్రళ##యే సర్జనే తథా. 42

శాలానాంచైవ సర్వేషాం సర్వకాంతి పరావధి| చింతామణిగృహం ప్రోక్తం యత్ర దేవీ మహోమయీ. 43

యే యే ఉపాసకాః సంతి ప్రతి బ్రహ్మాండవర్తినః | దేవేషు నాగలోకేషు మనుష్వేష్వితరేషు చ . 44

శ్రీదేవ్యాస్తే చ సర్వే7పి వ్రజంత్య త్రైవభూమిప | దేవీ క్షేత్రే యే త్యజంతి ప్రాణా న్దేవ్యర్చనే రతాః . 45

తే సర్వేయాం తి తత్రైవ యత్ర దేవీ మహోత్సవా | ఘృతకుల్యా దుగ్ధకుల్యా దధికుల్యా మధుస్రవాః . 46

స్యందంతి సరితః సర్వస్తథా7మృతవహాః పరాః | ద్రాక్షారసవహాః కాశ్చి జ్జంబూరసవహాః పరాః . 47

ఆమ్రేక్షు రసవాహిన్యో నద్యస్తాస్తు సహస్రశః | మనోరథపలా వృక్షా వాప్యః కూపా స్తథైవ చ . 48

యథేష్టపానఫలదా నన్యూనం కించిదస్తి హి | న రోగఫలితం వాపి జరా వాపి కదాచన. 49

న చింతా న చ మాత్సర్యం కామ కోధాదికం తథా | సర్వే యువానః సస్త్రీకాః సహాస్రాదిత్యవర్చసః . 50

భజంతి సతతం దేవీం తత్ర శ్రీ భువనేశ్వరీమ్‌ | కేచిచ్సలో కతాపన్నాః కేచిత్సామీప్యతాం గతాః . 51

సరూపతాగతాః కేచిత్ష్సార్టి తాం చ పరేగతాః | యాయాస్తు దేవతా స్తత్ర ప్రతి బ్రహ్మాండ వర్తినామ్‌ . 52

మనష్టయః స్థితా స్తాస్తు సేవంతే జగదీశ్వరీమ్‌ | సప్తకోటి మహామంత్రా మూర్తిమంత ఉపాసతే. 53

మహావిద్యా శ్చ సకలాః సామ్యావస్థాత్మికాం శివాం | కారణ బ్రహ్మరూపాం తాం మాయాశషబలవిగ్రహామ్‌ . 54

లజ్జ తుష్టి పుష్టి కాంతి క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మీ యనువారలు రూపుదాల్చి చెలువొందు చుందురు ; జయవిజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ద్రి అఘోర మంగళ నవ పీఠశక్తులు నిత్యము పరాంబికను సేవించుచుందురు. దేవి కిరుప్రక్కల శంఖ పద్మములను నిధులెల్లప్పుడు నిండియుండును ; నవరత్నములు కాంచనము ప్రవహించు నదులు పారుచుండును. ఆ పెన్నిధుల నుండి సప్త ధాతువులు ప్రవహించు నదులు నెల్లవేళల ప్రవహించు చుండును. ఆ నదులన్నియు తుద కమృత సాగరములో కలియును. ఈ చెలువున త్రిభువనేశ్వరి కామేశ్వరి శ్రీమహాదేవున కెడమ వైపున ప్రకాశించుచుండును. మహాదేవుడు మహాశక్తి కూడియుండుట వలననే సర్వశక్తుడై యెల్ల క్రియలు జరుపుచుండును. ఇక చింతామణి గృహముయొక్క ప్రమాణము వినుము. అది నూ ఱామడల వైశాల్యము గలది యందురు. దానికి నుత్తరవువై వున్న ప్రాకారము తూర్పుదానికన్న రెండితలు ఎత్తున గలదు. అది మహాకాశమున నిరాధారముగ నిలిచియున్నది. అది నిరంతరము సంకోచవ్యాకోచము లొందుచుండును. అది సృష్టి మొదలైనపుడు కార్యవశము విప్పిన వస్త్రము వలె వ్యాకోచించును. ప్రళయమున సంకోచించును. అన్ని ప్రాకారములలో ప్రకాశముల కన్నిటి కంటే చింతామణిగృహము పరమశోభలతో పరిపూర్ణమై విరాజిల్లుచుండును. అట్టి చింతామణి గృహమందు మహోజ్జ్వల తేజస్వినియగు దేవి ధగద్ధగాయమానము విలసిల్లుచుండును. ప్రతి బ్రహ్మాండ మందలి దేవ- నాగ- మనుష్యలోకమలందలి యుపాసకులు నితర లోకమందలి యుపాసకులును శ్రీదేవీ దివ్య సన్నిదానమునకు వచ్చి చేరుదురు. రాజా !శ్రీదేవీ పూజా పరాయణులు దేవీ పుణ్యక్షేత్రములందు తమ ప్రాణములు వదలినచో వారందఱును దేవీ నిత్య మహోత్సవములు జరుగునట్టి దేవి దివ్య సన్నిధానమునకు వచ్చి చేరుదురు. శ్రీదేవీ సన్నిధిలో ఘృతకుల్య మధుకల్య దధికులయ దుగ్ఘకుల్య యను నదులు ప్రవహించుచుండును. అచట నదులన్నియు నెక్కువగ నమృతరస ప్రవాహములు. అందు కొన్ని ద్రాక్షరసమును కొన్ని నేరేడు పండ్ల రసమును ప్రవహించుచుండును. అచ్చట మంచి మామిడిపండ్ల రసము చెఱకు రసము ప్రవహించు నదులు వేలు గలవు. కోరిన కోర్కులు దీర్చు వృక్షములు వాపీకూపములును పెక్కులు గలవు. వాని నీరు త్రాగిన వారి కోరికలెల్ల తీరును. ఇందేమాత్రమును సందియను లేదు. ఆ నీరు త్రాగిన వారి కెన్నటికిని ముదిమి రోగము వెండ్రుకలు నఱయుటయు గలుగవు. అచటి వారి కేనాటికైన దిగులుగాని మచ్చరముగాని కామక్రోధములు గాని గలుగవు. అచటి యువకులు సహస్రసూర్యప్రభలతో యువకులై తమ స్త్రీలతో స్వేచ్ఛగసవిలాసముగ విహారించుచుందురు. వారందఱును శ్రీత్రిభువనేశ్వరీదేవిని సేవించుచుందురు. వారిలో గొందఱు సాలోక్యముక్తిని కొందఱు సామీప్యముక్తిని బొందినవారు గలరు. కొందఱు సారూప్యముక్తిని కొందఱు స్షార్టి ముక్తిని బొందినవారు గలరు. ప్రతి బ్రహ్మాండమందలి యాయా దేవతలుందఱును శ్రీదేవిని జేరి సమిష్టిగ దేవి సేవలు చేయుచుందురు. అచట నేడు కొట్ల మహామంత్రములును రూపములు దాల్చి చేతులు జోడించి దేవి నూపాసించుచుండును. అచ్చోట మహావిద్య లన్నియును సామ్యావస్థము బొంది దివ్యకారణ బ్రహ్మరూపిణి మాయాశబల విగ్రహయైన శివా భగవతి నుపాసించుచుండెను.

ఇత్థం రాజన్మయా ప్రోక్తం మణిద్వీపంమహత్తరం న సూర్యచంద్రౌ నో విద్యుత్కోటయో7 గ్నివ స్తథైవచ. 55

ఎతస్య భాసాకోట్యంశకోట్యంశేనాపి తే సమాః | క్వచిద్వి ద్రుమసంకాశం క్వచిన్మరకతచ్చవి. 56

విద్యుద్బానుసమచ్చాయం మధ్య సూర్యసమంక్వచిత్‌ | విద్యుత్కోటిమహాధారా సారకాంతితతం క్వచిత్‌ . 57

క్వచిత్సిందూరనీలేంద్రం మాణిక్యసధృశచ్చవి | హీరసారమహాగర్బదగద్ధగితది క్తటమ్‌. 58

కాంత్యా దావనలసమం తప్తకాంచనసన్నిభం | క్వచిచ్ఛంద్రోపలోద్గారం సూర్యోద్గారం చుకుత్రచిత్‌ . 59

రత్నశృంగసమాయుక్తం రత్నప్రాకారగోపురమ్‌ | రత్నపత్రై రత్నఫలై ర్వృక్షై శ్చ పరిమండితమ్‌ . 60

నృత్యన్మయూరసంఘై శ్చ కపోతరణీతోజ్జ్వలమ్‌ | కోకిలాకాకలీ లాపైః శుకలాపై శ్చ శోభితమ్‌ . 61

సురమ్యరమణీయాంబులక్షావధిసరోవృతమ్‌ | తన్మధ్యభాగ విలస ద్వికచద్రత్న పంకజైః . 62

సుగంధిభిః సమంతాత్తు వాసితం శతయోజనం | మందమూరుతసంభిన్న చలద్ద్రుమసమాకులమ్‌. 63

చింతామణి సమూహానాం జ్యోతిషా వితతాంబరమ్‌ | రత్న ప్రభాభి రభితో ధగద్ధగిత దిక్రటమ్‌. 64

వృక్షవ్రాత మహాగంధ వాతవ్రాత సుపూరితమ్‌ | ధూపధూపాయితం రాజన్నణిద్వీపాయుతోజ్జ్వలమ్‌. 65

మణిజాలకసచ్ఛిద్రతరలోదరకాంతిభిః | దిజ్యోహజనకం చైతద్దర్పణో దరసంయుతమ్‌ . 66

ఐశ్వర్యస్య సమగ్రస శృంగారస్యాఖిలస్య చ | సర్వజ్ఞతాయాః సర్వాయాస్తేజస శ్చాఖిలస్య చ . 67

పరాక్రమస్య సర్వస్య సర్వోత్తమగుణస్య చ | సకలాయా దయాయా శ్చ సమాప్తి రిహ భూపతే. 68

రాజ్ఞ ఆనంద మారభ్య బ్రహ్మలోకాంత భూమిషు | ఆనందాయే స్దితాః సర్వే తే7 త్రెవాంతర్భవంతి హి. 69

ఇతి తే వర్ణితం రాజ న్మణి ద్వీపం మహత్తరమ్‌ | మహాదేవ్యాః పరం స్థానం సర్వలోకోత్త మోత్తమమ్‌. 70

ఏతస్య స్మరణా త్సద్యః సర్వపాపం వినశ్యతి | ప్రాణోత్క్రమణ సంధౌతు స్మృత్వా తత్రైవ గచ్చతి. 71

అధ్యాయపంచకం త్వేత త్పఠేన్నిత్య సమాహితః | భూతప్రేతపిశా చాది భాధా తత్ర భ##వేన్నహి. 72

నవీనగృహ నిర్మాణ వాస్తుయాగే తథైవ చ | పఠితవ్యం ప్రయత్నేన కల్యాణం తేన జాయతే . 73

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ ద్వాదశస్కందే ద్వాదశో7ధ్యాయః

రాజా !ఈ విధముగ నీకు మహా ప్రబావముగల మణి ద్వీపమును వర్ణించితిని. సూర్యచంద్రుల- మెఱుపు- అగ్ని- వీరి కాంతులన్ని కలిసినప్పటికిని మణిద్వీపము కాంతి కోటి - కోట్యంశమునకును సాటిరావు. అచట నొకచో వైడుర్య కాంతులు - వేరొకచో మరకతశోభలు మఱియొకచో విద్యుత్కాంతులు నింకొకచో నడిమింటి సూర్యుని వెల్గులు నింకొక్కచో విద్యుత్సార్యుల కాంతులు ఇంకొక్కచో నింద్రనీల- మాణిక్య సిందూర కాంతి పుంజములును వేరొక్కచోట దిక్కులను ధగద్ధగిత మొనర్చు వజ్రాలు రాసుల కాంతి పూరములును ఒక్కెడ కార్చిచ్చు మంటలు మఱియొక్కెడ క్రాగిన బంగారు కాంతులు నింక్కొక్కెడ సూర్యకాంత చంద్ర కాంత శిలల వెలుగులును ప్రకాశించుచుండును. ఒక్కొకచో రత్న శిఖరముల రత్న ప్రాకార గోపురములు రత్నఫలవ్రతములుగల వృక్షములును శోభిల్లుచుండును. కొన్ని చోటుల నాటలాడు నెమిళ్ళ గుంపు లును పావురాల తియ్యని ధ్వనులును నవరాగము లొలుకు కోయిలల కలరాగములును చిలుకల ముచ్చటలను గలిగి సుమనోహరముగ విలసిల్లుచుండును. అచట తియ్యని స్వచ్ఛజలము గల సరోవరములు లక్షలకు గలవు. ఆ కొలంకులందు రత్నకమలముల కోట్లకొలది విప్పారి యొప్పారు చుండును. ఆ సరోవరాలకు నలుదెసల నూఱామడల దూరమున మలయ మంద మారుత పరిమళముల కెరటాలకు మెల్లమెల్లగ వీచు వృక్షములు కోకొల్లలుగ నొప్పుచున్నవి. చింతామణుల జ్యోతిః పుంజము లాకసమునిండ పర్వియుండును. అందలి రత్న ప్రభలు దిక్కులనెల్ల ప్రకాశింపజేయును. రాజా !మణిద్వీపమంతయును పలు విధముల మణుల చెట్లనుండి వెడలు కమ్మతెమ్మరలతోను పలు దూపములతోను దివ్యముగ పరిమళించు చుండును. పలు విధముల మణుల రంద్రాల నుడి బటల్వెడలు రత్న దీపకాంతులచటి నిలువుటద్దాలపైన పూర్వ శోభలు దిజ్‌ మోహకముగ వెలార్చుచుండును.

సకల సంపదలకు సకల రస రాజములకు సంపూర్ణ సర్వజ్ఞత్వమునకు సకల తేజములకు సర్వ పరాక్రమములకు సర్వోత్తమ గుణ గణములకు దయారస మంతటికీ నీమణి ద్వీపము పరమావధి. ఒక్క మనుష్యానందము మొదలు బ్రహ్మనందము వఱకు గల యానందము లన్నియు నిచ్చట నెలకొని యున్నవి. రాజోత్తమా !ఈ ప్రకారముగ నీకు సర్వలోకములం దుత్తమో త్తమము- మహత్తరము- దివ్యదివ్యము- పరమధామము నైన శ్రీమహాదేవి మణి ద్వీపమును తేటగవర్ణించితిని. ఈ మణి ద్వీపము నొక్కమారు తలంచినంతనే తొంటి పాపరాసులన్నియును పటాపంచలగును. ప్రాణము పొవునపుడు మణి ద్వీపమును స్మరించినవాడు కేవల మా దేవీ లోకమున ప్రకాశించుచుండును. ఈ యధ్యాయ పంచకము (8-12) నిత్యము సదివినచో భూతప్రేత పిశాచభాధలు కలుగవు. నూతన గృహారంభమున వాస్తు యాగమున గృహప్రవేశమున దీనిని ప్రయత్నించి చదివినచో శుభము గలుగును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ద్వాదశస్కంధమున పండ్రెండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters