Sri Devi Bagavatham-2    Chapters   

అథ సప్తదశో ధ్యామః.

వ్యాసః : రుదంతం బాలకం వీక్ష్య విశ్వామిత్రో దయాతురః | శునః శేపమువాచేదం గత్వాపార్శ్యేతి దుఃఖితమ్‌. 1

మంత్రం ప్రచేతసః పుత్ర మయోక్తం మనసా స్మరన్‌ | బపత స్తవ కల్యాణం భవిష్యతి మయాజ్ఞయా. 2

విశ్వామిత్రవచః శ్రుత్వా శునః శేపః శుతాకుల | మంత్రం జజాప మనసా కౌశికోక్తం స్ఫుటాక్షరమ్‌. 3

జపత స్తత్ర తస్యాశు ప్రచేతాస్తు కృపాకరః | ప్రాదుర్బభూవ సహసా ప్రసన్నోనృపబాలకే. 4

దృష్ట్వా తమాగతం సర్వే విస్మయం పరమం గతాః | తుష్టువు ర్వరుణం దేవం ముదితా దర్శనేన తే 5

రాజాతి విస్మితిః పాదౌ ప్రణనామ రుజాతురః | బద్దాంజలిపుటో దేవం తుష్టావ పురతః స్థితమ్‌. 6

హరిశ్చంద్రః : దేవదేవ కృపాసింధో పాపాత్మాహం సుమందధీః | కృతా పరాధః కృపణః పావితః పరమేష్ఠినా.

మయా తే పుత్రకామేన దుఃఖసంస్ధేన హేలనమ్‌ | కృతం క్షమాప్యం ప్రభుణౖ కోపరాధః సుదూర్మతేః. 8

అర్థీ దోషం న జానతి తస్మా త్పుత్రార్థినా మయా | వంచిత స్త్వం దేవదేవ భీతేన నరకా ద్విభో. 9

ఆపుస్స్ర గతి ర్నాస్తి స్వర్గో నైవచ నైవచ | భీతోహం తేన వాక్యేన తస్మాత్తే హేలనం కృతమ్‌. 10

నాజ్ఞస్య దూషణం చింత్యం నూనం జ్ఞానవతా విభో | దుఃఖలో హం రుజా೭೭ క్రాంతో వంచితః స్వసుతేనహ.

న జానేహం మహారుజ పుత్రోమే క్వగతః ప్రభో | వంతాయిత్వా వనే భీతో మరణా న్మాం కృపానిధే. 12

ప్రయ¸° ద్రవిణం దత్త్వా గృహీతో ద్విజబాలకః | యజ్ఞో యం త్రితపుత్రేణ ప్రారబ్ధ స్తవ తుష్టయే. 13

దర్మనం తవ సంప్రావ్య గతం దుఃఖం మమాద్బుతమ్‌ | జలోదరకృతం సర్వం ప్రసన్నే త్వయి సాంప్రతమ్‌.

పదునేడవ అధ్యాయము

హరిశ్చంద్రోపాఖ్యానము

వ్యాసుడిట్లనెను. అట్లు దుఃఖార్తితో విలపించున్న శునః శేవుని గని విశ్వామిత్రుడు దయాంతరంగుడై బాలుని చెంత కేగి యిట్లునెను. ''ఓ పుత్రాకా! నా వలన వరుణదేవుని మంత్రము గ్రహింపుము. దానిని నెమ్మనమున స్మరించుచు జపించినతో నీకు తప్పక మేలు గల్గును.'' అను విశ్వామిత్రుని వాక్కులు విని దుఃఖితుడగు శునఃశేవుడు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రమును మదిలో జపించెను. ఆ మంత్రమును జపించెనంతలోనే వరుణుడు దయాకరుడై ప్రసన్నడై రాచ కోమరు మెదుట ప్రత్యక్షమయ్యెను. వరుణదేవుడే స్వయముగా వచ్చి దర్మనవిచ్చి నందుల కెల్లరు నాశ్చర్యమొంది ప్రమోద మొందిరి. రోగాతురుడగు రాజు పరమ విస్మయమొంది తన ముందన్న దేవునకు దోసిలొగ్గి పాదములపైబడి నమస్కరించి యిట్లనెను. దేవాదేవా! దయాసాగరా! నేను వట్టి మందమతిని. పాపని. లోభిని. అపరాధిని. నన్ను పవ్రితుని జేయుము. నేను సంతతి లేక కడు దుఃఖమొందితిని. పుత్ర వ్యామోహమున నిన్ను తూలనాడితిని. నేను దుర్మతిని. నన్ను క్షమింపుము. ప్రభూ! దేవాదేవా! యాచకుడెప్పుడును దోసము లక్క చేయడు నేను పున్నామ నరక భయమున పుత్రునిగోరి నిన్ను మిక్కిలి మోసగించితిని. పుత్రులు లేని వారికి స్వర్గప్రాప్తి లేనే లేదను మాటకు భయపడి నిన్ను చుల్కనగ జూచితిని. ఓ విభూ! నీవు జ్ఞానివి. నే నజ్ఞానిని. పుత్ర వ్యామోహమున మునిగితిని. రోగపీడితును దుర్జనుడను కనుక నా దోష మెన్నదగదు. ఓ ప్రభూ? దయానిధీ! నా కొడుకెక్కడికి వెళ్ళెనో నాకే తెలియదు. అతడు చావునకు వెఱచి నన్ను వంచించి వనముల కేగెను. ఇపుడు నేనీ విప్ర బాలునకు డబ్బిచ్చి కొని తెచ్చితిని. ఈ కొన్న కొడుకుతో నిన్ను మెప్పించుట కీ జన్నము మొదలైనది. నీవు ప్రసన్నడవై దర్శనభాగ్య మొసంగితివి. ఇపుడు నా జలోదర వ్యాధి పూర్తిగ తొలగిపోయినది.

ఇతి తస్య వచః శ్రుత్వా రాజ్ఞో రోగాతురస్య చ | దయావా న్దేవదేవేశః ప్రత్యువాచ నృపోతత్తమమ్‌. 15

ముంచరాజన్‌శునః శేపంస్తువంతం మాం భృశాతురమ్‌ | యజ్ఞోయం పరిపూర్ణస్తేరోగముక్తోభవాత్మనా. 16

ఇత్యుక్త్వా వరుణ స్తూర్ణం రాజానం విరుజం తదా | చకార వశ్యతాం తత్ర సదస్యానాం సుసంస్ధితమ్‌. 17

విముక్తోసౌ ద్విజః పాశా ద్వరుణన మహాత్మనా | జయ శబ్ద స్తత సంజాతో మఖ మండపే. 18

రాజా ప్రముదితః సద్యో కోగాన్ముక్తః సుదారుణాత్‌ | యూపాన్ముక్తః శునః శేపో బభూవాతీవ సంస్దితః. 19

రాజాత్విమం మఖం పూర్ణం చకార వినయా న్వితః | శునః శేవ స్తదా సభ్యా నిత్యువాచ కృతాంజలిః. 20

భోభోః సభ్యా సుధర్మజ్ఞా బ్రువంతు ధర్మ నిర్ణయమ్‌ | వేద శాస్త్రాను సారేణ యధార్ధ వా దినః కిల. 21

పుత్రోహం కస్య సర్వజ్ఞాః పితామే కోగ్రతః పరమ్‌ | మహతాం వచనా త్తస్వ శరణం ప్రవ్రజా మ్యహమ్‌.

ఇత్యుక్తే వచనే తత్ర సభ్యాః ప్రోచుః పరస్పరమ్‌ | అజీగర్తస్య పుత్రోయం కస్యాన్యస్య భ##వేగసౌ. 23

ఆంగాదంగా త్సముద్బూతః పాలితస్తేన భక్తితః | అన్యస్య కస్య పుత్రో సౌ ప్రభ##వే దితి నిశ్చయః. 24

తచ్ఛ్రుత్వా వామదేవ స్తు తానువాచ సభాసదః | విక్రీత స్తేన తాతేన ద్రవ్యలోభా త్సుతః కిల. 25

పుత్రోయం ధనాదాతు శ్చ రాజ్ఞ స్తత్ర న సంశయః | అధవా వరుణసై#్యష పాశాన్ముక్తోస్త్యనేన వై. 26

అన్నదాతా భయత్రాతా తథా విద్యాప్రదశ్చయః | తథా విత్తప్రదశ్చైవ వంచైతే పితరః స్మృతాః. 27

తదా కేచి త్పితుః ప్రాహుః కేచిద్రాజ్ఞస్తథాపరే | వరుణ స్యేతి సంవాదే నిర్ణయం న యయుశ్చ తే. 28

రోగార్తుడగు రాజు మాటలువిని వరుణుడు దయాశుడై యతని కిట్లనెను. రాజా! ఈ శునఃశేపుడు తన బ్రతుకు తీపిచే నన్ను జపించుచున్నాడు. ఇతనిని విడిచిపెట్టుము. నీ యజ్ఞము పూర్తి యయ్యెను. నీవు రోగముక్తుడవైతివి. అని యచటి ప్రజలెల్లరును చూచుచుండగనే వరుణుడు రాజును రోగముక్తుని గావించెను. అట్లు విప్రబాలుడు మహితాత్ముడగు వరుణుని దయవలన బంధముక్తుడయ్యెను. అంత సభయందంతట జయజయధ్వానములు మిన్నుముట్టెను. ఇట్లు రాజు దారుణరోగమునుండి ముక్తడయ్యెను. శునఃశేపుడును బంధముక్తుడై సుఖముండెను. రాజు పిమ్మట సవినయముగ యజ్ఞము పూర్ణము గావించెను. అపుడు శునఃశేపుడు దోయిలించి సభాసదుల కిట్లనెను: ధర్మనిర్ణేతలగు సభ్యులారా! వేదశాస్త్రను సారముగ సత్యము బల్కువారలారా? మీరిపుడు నాకు ధర్మమార్గము చెప్పుడు. ఓ సర్వజ్ఞులారా! నా కిపుడు పూజ్యతము డగు తండ్రి యెవడు? నేనెవని కుమారుడను? మీ పెద్దలమాట చొప్పున మీ చెప్పినవాని నాశ్రయింతును. అని బాలుడు పలుకగనే సభ్యులెల్లరును తమలోతా మిట్లనుకొనిరి. అత డజీగర్తుని కుమారుడు. ఇత డితరుని కొడుకెట్లు గాగలడు? ఇత డజీగర్తుని ప్రత్యంగమునుండి పుట్టి యతనిచేత చక్కగ పెంచబడెను. ఇత డితరుని కొడుకెట్లగును? ఇతడతని కొడుకే యగు ననిరి. వారి మాటలు విని వామదేవుడను నతడు వారలకిట్లనెను. ఇతడు ధనాశగల తన తండ్రిచే నమ్ముడుపోయెను. కనుక నితడు తన్ను డబ్బిచ్చి కొన్న రాజు కొడు కగును. కానిచో బంధముక్తి గల్గించిన వరుణుని కొడుకైన గావలయును. అన్నము పెట్టినవాడు భయము బో గొట్టినవాడు చదువు చెప్పినవాడు ధనమిచ్చినవాడు ననువారు తండ్రులని చెప్పబడుదురు. అట్లా బాలుని కొంద ఱజీగర్తుని కొడుకని మఱికొందరు రాజు కొడుకని వేరొక కొందఱు వరుణుని కొడుకని పలుకసాగిరి.

ఇత్థం సందేహమాపన్నే వసిష్ఠో వాక్య మబ్రవీత్‌ | సభ్యా న్వివదత స్తత్ర సర్వజ్ఞః సర్వపూజితః. 29

శృణుధ్వంభో మహాభాగా నిర్ణయం శ్రుతిసమ్మతమ్‌ | నిః స్నేహేన యదా పిత్రా విక్రీతోయం సుతః శిశుః. 30

సంబంధ స్తు గత స్తస్య సదేవ ధనసంగ్రహాత్‌ | హరిశ్చంద్రస్య సంజాతః పుత్రోసౌ క్రీత ఏవచ. 31

యూపే బద్ధో యదా రాజ్ఞా తదా తస్య నవై సుతః | వరుణ స్తు స్తుతోనేన తేన తుష్టేన మోచితః. 32

తస్మా న్నాయం మహాభాగా హ్యాసౌ పుత్రః ప్రచేతసః | యోయం స్తౌతి మహామంత్రైః సోపి తుష్టోదదాతిచ. 33

ధనం ప్రాణా న్పశూ న్రాజ్యం తథామోక్షం కిలేప్సితమ్‌ | కౌశికస్య సుత శ్చాయ మరిష్టే యేన రక్షితః. 34

మంత్రం దత్త్వా మహావీర్యం వరుణస్వాతి సంకటే | వ్యాసః : శ్రుత్వా వాక్యం వసిష్ఠస్యబాఢమూచుః సభాసదః. 35

విశ్వామత్ర స్తు జగ్రాహ తం కరే దక్షిణ తదా | ఏహి పుత్రః గృహం మే త్వ మిత్యుక్తా ప్రేమపూరితః. 36

శునఃశేపో జగామాశు తేనైవ సహ సత్వరః | వరుణ స్తు ప్రసన్నాత్మా జగామ చ స్వమాలయమ్‌. 37

ఋత్విజ శ్చ తథా సభ్యాః స్వగృహా న్నిర్యుయు స్తదా | రాజాపి రోగనిర్మక్తో బభూవాతి ముదా న్వితః. 38

ఈ విధముగ సభ్యులు తమలోతాము సందేహములతో వాదించుకొనుచుండగ సర్వపూజితుడు సర్వజ్ఞుడు నగు వసిష్ఠుడు వారి కిట్లనెను. మహాత్ములారా! వేదసమ్మతమగు నిర్ణయము వినుడు. ఈ బాలుని తండ్రి దయమాలి యితనిని డబ్బున కమ్ముకొనెను. ఇతని తండ్రి ధనాశాపరుడు. కనుక నితని కితని తండ్రితో సంబంధము తెగిపోయెను. హరిశ్చంద్రుడితనిని కొనుటవలన నితడతనికి కొన్నకొడుకే యగును. హరిశ్ఛంద్రు డితనిని యూపస్తభమునకు గట్టుటవలన నితడు రాజు కొడుకు గాడు. ఇతడు వరుణుని నుతించుటవలన వరుణు డితనిని విడుదల గావించెను. మహాశయులారా: అందుచే నితడు వరుణుని కుమారుడు గాజాలడు. ఏలన నే మంత్రమున నే దేవుడు స్తుతింపబడునో యతడు సంతసించును. ఆ దేవుడు తన్ను సుతించువానికి ధనప్రాణములు-పశురాజ్యములు కామమోక్షములు ప్రసాదించును. కనుక నితడు విశ్వామిత్రుని కొడుకే. ఏలన నతనిచేత నిత డాపదలో రక్షింపబడెను. విశ్వామిత్రుడు వరుణమంత్ర మొసంగి యతనిని గాపాడెను గదా! అను వశిష్ఠుని వాక్కులు విని సభ్యులెల్లరు సమ్మతించిరి. అంత విశ్వామత్రు డా బాలుని కుడిచేయి పట్టుకొని నాయనా! ఇంటికి పోదము ర్మని ప్రేమ పులకితుడై పలికెను. శునః శేపుడు వెంటానే విశ్వామిత్రునివెంట నరిగెను. వరుణుడును ప్రసన్నుడై తన నిలయమున కరిగెను. ఋత్విజులును సభ్యులును తమ తమ నెలపుల కరిగిరి. హరిశ్చంద్రుడును రోగ ముక్తుడై సుఖముండెను.

ప్రజా స్తు పాలయామాస సుప్ర సన్నేన చేతసా | రోబితాఖ్య స్తు తచ్ఛ్రుత్వా వృత్తాంతం వరుణస్యహ. 39

ఆజగామ గృహం ప్రీతో దుర్గమా ద్వన పర్వతాత్‌ | దూతా రాజాన మభ్యేత్య ప్రోచుః పుత్రం సమాగతమ్‌. 40

ముదితోసౌ జగామాశు సమ్ముఖః కోసలాధిపః | దృష్ట్వాపితర మాయాంతం ప్రేమోద్రిక్తః సుసంభ్రమః. 41

దండవ త్పతితో భూమావ శ్రుపూర్ణముఖః శుచా | రాజాపి తం సముత్ధాప్య పరిరభ్య ముదాన్వితః. 42

సమాఘ్రాయ సుతం మూర్ద్ని పప్రచ్ఛ కుశం పునః | ఉత్సంగే తం సమారోప్య ముదితో మేగినీవతిః. 43

ఉష్ణనేత్రజలై ః శీర్ష్యభిషేక మథాకరోత్‌ | రాజ్యం శశాస తేనాసౌ పుత్రేణాతి ప్రియేణ చ. 44

వృత్తాంతం నరమేధస్య కథయామాస విస్తరాత్‌ | రాజసూయం క్రతురం చకార నృపసత్తమః. 45

వసిష్ఠం పూజయిత్వాథ హోతారమకరో ద్విభుః | సమాప్తే త్వథ యజ్ఞేస్య వసిష్ఠోతీవ పూజితః. 46

శక్రస్య సదనం రమ్యం జదామ ముని రాదరాత్‌ | విశ్వామిత్రోపి తత్రైవ వసిష్ఠేన చ సంగతః. 47

మిళిత్వా తౌ స్థితౌ దేవసదనే మునిసత్తమ | విశ్వామిత్రోపి పప్రచ్ఛ వసిష్ఠ ప్రతి పూజితమ్‌. 48

రాజు ప్రసన్నుడై ప్రజలను కన్నబిడ్డలవలె పాలించెను. అపుడు రోహితుడు జరిగిన వరుణుని వృత్తాంతమంత యును వినెను. అతడు సంతోషించి దుర్గమవన పర్వతములు విడిచి తన యింటి కేతెంచును. అపుడొక దూత రాజుతో రాకొమరుని రాక వెల్లడించెను. కోసలాధిపతి ప్రమోదమున తన కొడుకున కెదురేగెను. తండ్రిని చూడగనే రోహితునిలో ప్రేమ సంభ్రమము లొక్కుమ్మడి పెల్లుబికెను. అతడు కన్నీట తడిసిన మోముతో తన తండ్రికి దండప్రమాణమము లాచరించెను. రాజు తన కొడుకును లేవనెత్తి పుత్రగాత్ర పరిష్వంగసుఖము బడసెను. తనకొడుకు శిరము మూర్కొని కుశల మడిగి తొడపై నిడుకొని ప్రమోదభరితు డయ్యెను. వెచ్చని కన్నీట తన కొడుకు నభిషేకించెను. తన ముద్దులకొడుకుతో చక్కగా రాజ్యమేలెను. నరమేధ వృత్తాంతమంతయును తనకొడుకుతో జెప్పెను. అటు పిమ్మట రాజు రాజసూయయాగ మొనరించెను. అందు అతడు వసిష్ఠుని హోతగ నియమించెను. యాగము పరిసమాప్తమైన పిమ్మట వసిష్ఠుడు ఘనముగ సత్కరింపబడెను. ఒకనాడు వసిష్ఠుడు సగౌరముగ నింద్రుని భవనము చేరెను. అదేచోటికి విశ్వామిత్రుడేతెంచి వసిష్ఠుని గలిసెను అట్లు వారిర్వురును దైవసభలో గలిసికొనిరి. అపుడు పూజ లందుకొని వెలుగొందున్న వసిష్ఠుని విశ్వామిత్రుడు జూచెను.

వీక్ష విస్మయ చిత్త స్తం సభాయాంతు శచీపతేః | క్వేయం పూజా త్వయా ప్రాప్తా మహతీ మునిసత్తమ. 49

కృతా కేన మహాభాగ సత్యం బ్రూహి మమాంతికే |

వసిష్ఠ ఉవాచః యజమానో స్తి మే రాజా హరిశ్చంద్రః ప్రతాపవాన్‌. 50

రాజసూయః కృతస్తేన రాజ్ఞా ప్రవర దక్షిణః | నేదృశోస్తి నృప శ్చా న్యః సత్యవాదీ ధృతవ్రతః. 51

దాతా చ ధర్మశీల శ్చ ప్రజారంజన త్పతరః | తస్య యజ్ఞే మయా పూజా ప్రాప్తా కౌశికనందన. 52

''కిం పృచ్ఛసి పునః సత్యం బ్రవీమ్యకృత్రిమం ద్విజ''

హరిశ్చంద్ర సమో రాజా న భూతో న భవిష్యతి | సత్యవాదీ తథా దాతా శూరః పరమ ధార్మికః 53

ఇతి తస్యవచః శ్రుత్వా విశ్వామిత్రోతి కోపనః | బభూవ క్రో ధసం రక్త్క లోచనోప్యబ్రవీ చ్చ తమ్‌. 54

ఏవం స్తౌషి నృపం మిథ్యావాదినం కపటప్రియమ్‌ |

వంచితో వరుణో యేన ప్రతి శ్రుత్య వరం పునః. 55

మమ జన్మార్జితం పుణ్యం తపసః పిఠితస్య చ | త్వదీయం వాతితవసో గ్లహం కురు మహా మతే. 56

అహం చేత్తం నృపం సద్యో న కరో మ్యతి సంస్తుతమ్‌ | అసత్యవాదినం కామ మదాతారం మహాఖలమ్‌. 57

ఆజన్మ సంచితం సర్వం పుణ్యం మమ వినశ్యతు | అన్యధా త్వత్కృతం సర్వం పుణ్యంత్వితి వణావహే. 58

గ్లహం కృత్వా తత స్తౌతు వివదంతౌ మునీ తదా | స్వా శ్రమం స్వర్గలో కా చ్చ గతౌ పరమ కోప నౌ. 59

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే సప్తదశోధ్యాయః.

అటు లింద్రసభలో వసిష్ఠుని గాంచి విస్మయము చెంది విశ్వామిత్రుడిట్లనెను: మునిసత్తమా! ఈ ఘనసత్కార మెచట బొందితివి? నిన్నే మహానుభావుడింతగ పూజింతెనో నిజము పలుకుము. అన వసిష్ఠు డిట్లనెను: నాకు ప్రతాపశాలియగు హరిశ్చంద్ర మహారాజు యజమానుడు. ఆ రాజు ఘనముగ దక్షిణలిచ్చి రాజసూయయాగము జరిపెను. అంతటి సత్యవాది నియతవ్రతుడగు రాజు మరెవ్వడులేడు. అతడు మహాదాత. ధర్మశీలి. ప్రజాపాలన తత్పరుడు. విశ్వామిత్రానే నతని యజ్ఞమున పూజింపబడితిని. ద్విజవరా! నన్ను నిజము చెప్పుమని యింకేల పట్టు పట్టెదవు? సత్యహరిశ్చంద్రుని వంటి రాజు మున్నులేడు. ముందుండబోడు. అను వసిష్ఠుని వాక్కులు విని విశ్వమిత్రుడు గ్రుడ్లెఱ్ఱ జేసి యతని కిట్లనెను. హరిశ్చంద్రుడు మిధ్యావాది కపటప్రియుడు. అతడు వరుణునకు మాట యిచ్చి యతనిని వంచిచెను. అతనినే పొగడుచున్నావా! మహామతీ! నా పుట్టినప్పటినుండి సంపాదించిన తపఃఫలము అధ్యయనపుణ్యము నీ పుట్టిననాట గోలె సంపాదించిన నీ తపఃఫలము అధ్యయనపుణ్యము పణముగ నుంచుదము. నీవే దుష్టుడు - లుబ్ధుడునకు రాజును సత్య వాదిగ బతికితివో నేనతని ననత్యవాదిగ చేయగలను. అట్లు చేయనిచో నా జన్మార్జిత పుణ్యమంతయా నశించును గాక! చేసినచోనీపున్నెమంతయునశించును. ఇదే మరకు పణము. ఇటులా యిర్వురు మునులును మహా కోపముతో వాదించు కొనుచు స్వర్గము వీడి తమ తమ యాశ్రమములకేదికి.

ఇతి శ్రీదేవీ భాగవతే మహా పురాణ మందలి సప్తమ స్కంధమున పదునేడవ యాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters