Sri Devi Bagavatham-2
Chapters
అథ అష్టాదశో೭ధ్యాయః వ్యాసః. కదాచిత్తు హరిశ్చంద్రో మృగయార్దం వనం య¸° |
అపశ్య ద్రుదతీం బాలాం సుదరీం చారులోచనామ్.
1 తా మపృచ్ఛ న్మహారాజః కామినీం కరుణాపరః | పద్మపత్ర విశాలాక్షి కింరోదిషి వరాననే.
2 కేనా೭సి పీడీతా೭త్యర్ధం మ కింతే దుఃఖం పదాశు మే | కా చ త్వం విజనే ఘెరే కస్తే భర్త పితా೭థ వా.
3 న బాధతే చ రాజ్వే మే రాక్షసో೭పి పరాంగనమ్ | తం హన్మి తరసా కాంతే యస్త్వాం సుందరి బాధతే.
4 బ్రూహి దుఃఖం వరారోహే స్వప్దా భవ కృశోదరి | విషయే మమ పాపాత్మా న తిష్ఠతి సుమధ్యమే 5 ఇతి తస్య వచః శ్రుత్వా నారీ తమబ్రవీ న్నృరమ్ | ప్రమృజ్యా೭శ్రూణి వదనా ద్దరిశ్చంద్రం నృపోత్తమమ్. 6 రాజాన్మాం బాధతే೭త్యర్ధం విశ్వామిత్రో మహామునిః | తపః కరోతి యద్ఘోరం మదర్ధం కౌశికో వనే. 7 తేనా೭హం దుఃఖితా రాజ న్విషయే తవ సువ్రత | విద్ధి మాం కామనాం కాంతాం పీడితాం మునినా భృశమ్. 8 రాజోవాచ: స్వస్ధా భవ విశాలాక్షి నతే దుఃఖం భవిష్యతి | తమహం వారయిష్యామి మునిం తపపరాయణమ్. 9 ఇత్యాశ్వాస్య స్త్రియం రాజా తపసా మునిసన్నిధౌ | నత్వా ప్రణమ్య శిరసా తమువాచ మహీపతిః. 10 స్వామిన్ కిం క్రియతే೭త్యర్ధం తపసా దేహపీడనమ్ | క్రిమర్ధం తే సమారంభో బ్రూహి సత్యం మహామతే. 11 వాంఛితం తవ గాధేయ కరోమి సఫలం కిల | ఉత్తిష్ఠోత్తిష్ఠ తరసా తపసా೭లమతః పరమ్. 12 విషయే మమ సర్వజ్ఞ న కర్తవ్యం సుదారుణమ్ | లోకపీడాకరం ఘోరం తపః కేనాపి కర్హిచిత్. 13 ఇత్థం నిషిధ్యతం రాజా విశ్వామిత్రం గృహంయ¸° | మనసా క్రోధ మాధాయగతోసౌ కౌశికో మునిః. 14 పదునెనిమిదవ అధ్యాయము - హరిశ్చంద్రో పాఖ్యానము వాసుడిట్లనెను : ఒకానొకప్పుడు హరిశ్చంద్రుడు వేట కడవి కేగెను. అతడట చారెడేసి కన్నులు గల్గి యేడ్చు చున్న యొక సుందరిని జూచెను. మహారాజు దయాపరుడై విశాలాక్షి యగు ఆ కామినితో నిట్లనెను: వరాననా! ఏడ్చెదవేల? నిన్ను బాధ పెట్టిన వాడెవడు? నీ దుఃఖ కారణమేమి? ఈ జనము తిరుగనిచోట నీ వేల యుంటివి? నీ తండ్రి యెవరు? నీ పతి యెవరు ! సుందరీ! నా యేలుబడిలో రాక్షసుడు గూడ పర స్త్రీని బాధింపడు. నిన్ను బాధపెట్టిన వాడెనడో తెల్పుము. వానినిపుడే తును మాడుదును. తలోదరీ! వరారోహా! నా రాజ్యమున పాపాత్ముడుండుటకు వీలులేదు. నీ దుఃఖమేమిటో తెల్పి నిశ్చింతగ నుండుము ఆను రాజు మాటలు విని యువతి తన చెక్కిళ్ళపై జారు కన్నీటి బొట్లు తుడుచు కొనుచు హరిశ్చంద్ర నరపతితో నిట్లనెను. ఓ రాజా! విశ్వామిత్రముని నన్నింతగ బాధించుచున్నాడు. నన్ను బొందుటకు ఘెరతప మాచరించుచున్నాడు. సత్యవ్రతా! నేను నీ రాజ్యమందతని వలననే యింత దుఃఖ మొందుచున్నాను. నేనా మునిచే కామింపబడిన కాంతనని నన్నెఱుంగుము. రాజిట్లనెను: విశాలాక్షీ? నేనా తపోనిరతుడగు ముని తపమును వారింపజేతును. నీకిక దుఃఖము గలుగదు. నిశ్చింతగ నుండుము. ఇట్లు రాజు యువతి నూరడించి ముని సన్నిధికేగి తలయొగ్గి యతనికి నమస్కరించి యిట్లనెను. స్వామీ! మహామతీ? నీవీ శరీరము నేల తపింపజేయుచున్నావు. ఏ మహా కార్యసాధన కింతగ కఠోర తప మొనర్చుచున్నావో నిజము తెల్పుము. విశ్వామిత్రా! నీ కోరిక సఫల మొనర్పగలను. ఇంక తపము చాలు: వేగమే లేలెమ్ము. సర్వజ్ఞా! నా రాజ్యమందెవ్వడును లోకబాధ గల్గించు ఘోర దారుణ తప మొనరింపరాదు. ఇట్లు రాజు విశ్వామిత్రుని వారించి తన యింటి కేగెను విశ్వామిత్రుడు మనస్సులో కోపముంచుకొని తన యాశ్రమ మేగెను. స గత్వా చింతయామాస నృప కృత్య మసాంప్రతమ్ | వసిష్ఠస్య చ సం వాదం తపసః ప్రతిషేధనమ్. 15 కోపావిష్టేన మనసా ప్రతీకార మథాకరోత్ | విచింత్య బహుధా చిత్తే దానవం ఘోరవిగ్రహమ్. 16 ప్రేషయామాస తద్దేశం విధాయ సూకరాకృతిమ్ | సో೭తికాయో మహాకాలః కుర్వన్నాదం సుదారుణమ్. 17 రాజ్ఞ శ్చోపవనే ప్రాప్తస్త్రాసయన్రక్షకాం స్తదా | మాలతీనాం చ ఖండాని కదంబానాం తథైవ చ. 18 యూథికానాం చ బృందాని కంపయంశ్చ ముహుర్ముహుః | దంతేనవిలిఖ న్బూమిం సమున్మూలయతేద్రుమాన్. 19 చంపకా న్కేతకీఖండా న్మల్లికానాం చ పాదపాన్ | కరవీరానుశీరాం శ్చ నిచఖాన శుభాన్ మృదూన. 20 ముతుకుందా నశోకాంశ్చ వకులాం స్తిలకాం స్తథా | ఉన్మూల్య కదనం తత్ర చకార సుకరో వనే 21 వాటికారక్షకాః సర్వే దుద్రువుః శస్త్రపాణయః | హాహేతి చుక్రుశు స్తత్ర మాలాకారా భృశాతురాః. 22 బాణౖః సంతాడ్యమానో೭పి యదాత్రస్తో నవై మృగః | రక్షకా న్పీడయామాస కోలః కాలసమద్యుతిః. 23 తేతదా೭తిభయాక్రాంతా రాజానం శరణం యయుః | తమూచు స్త్రాహి త్రాహీతి వేపమానా భయాకులాః. 24 తా నాగతా న్సమాలోక్య భయార్తా న్బూపతి స్తదా | పప్రచ్ఛ కిం భయం కస్మా న్మాం బ్రువంతు నమాగ్రతాః. 25 నాహం బిభేమి దేవేభ్యో రాక్షసేభ్యశ్చ రక్షకాః | కస్మా ద్బయం సముత్పన్నం తద్ బ్రువంతు మమాగ్రతః. 26 హన్నిచైకేన బాణన తం శత్రుం దుర్బగం కిల | యో మే೭రాతిః సముత్పన్నో లోకే పాపమతిః ఖలః. 27 దేవో వా దానవో వా೭పి తంనిహన్మి శ##రై ః శితై ః | క్వ తిష్ఠతి కియద్రూపః కియద్బలసమన్వితః. 28 ఇట్లు విశ్వామిత్రడు వెళ్ళి రాజు తన పట్ల చేసిన పని మంచిది గాదని మనసులో తలంచెను. ఆనాడు వసిష్ఠునితో వాదము ఈనాడు రాజు వలన తపో విఘ్నము జరిగెను. కనుక విశ్వామిత్రుడు కోపావేశముతో ప్రతీకారముచే పగ తీర్చు కొనదలచెను. అతడు ఘోర విగ్రహముగల దానవుని తలచెను. ఆ దానపు నొక పంది యాకారమున హరిశ్చంద్రుని దేశము మీదకు ప్రయోగించెను. అది రాజుగారి యుద్యానవనముజేరి వనపాలకులను భయపెట్టెను. అది కదంబ-మాలతీ వృక్షము లను విఱుగగొట్టెను. అది కొన్నిచోట్ల మాటిమాటికి యూధికా వృక్షముల నరుసలు కదలించుచు కోఱలతో నేల పెళ్ళగించుచు చెట్లు పీకి వేసెను. అది కొన్ని యెడలనుండి గేదగి చెట్లను మల్లెచట్లను ఉశీరకరవీర వృక్షములనుత్రవ్వి పెకలించెను. వనమందున్న అశోక ముచుకుంద వకుల తిలకవృక్షములు సమూలముగ పెకలించి చిం దర వందర చేసెను. తోటకాపరులు శస్త్ర ములు చేతదాల్చి దానిమీదకు పరుగెత్తిరి. మాలలు గట్టువారు భయాతురులై హహాకారములు చేసిరి. వనరక్షకులు దానిని బాణములతో నెంతగనో కొట్టిరి. కాని యది వెఱవక కాలునివలె తిరిగి వారిని బాధ పెట్టెను. వారు మిక్కిలి భయకంపితులై రాజును శరణువేడి కాపాడుమని మొఱపెట్టకొనిరి. అట్లు భయార్తులై వచ్చిన వారిని రాజు చూచి మీకెవని వలన భయము గల్గెనో నాకు తెల్పుడని యడిగెను. రక్షకులాలా! నేను దేవతలకు రాక్షసులకు భయపడను. ఇక మీకెవనివలన భయము గల్గెనో నాకు తెలుపుడు. ఏ పాపి- యే దుష్టుడు- నాకు పగవాడయ్యెనో చెప్పుడు; వాని యొకేయొక బాణమున తెగటార్పగలను. నా శత్రువు దేవుడో-దానవుడోవాని బలమెంతటిదో-వాని రూపేదియో - వాడెక్కడ గలడో- అన్నియా నాకు తెల్పినచో వానిని వాడిబాణముతో చంపుదును. మాలాకారాఊవాచ: న దేవో న చ దై త్యో೭స్తి నయక్షో న చ కిన్నరః | కశ్చి త్కోలో మహాకాయోరాజం స్తిష్ఠతి కాననే. 29 పుష్పవృక్షా నతిమృదూ న్దం తేనోన్మూలయత్య సౌ | విదీర్ణం తద్వనం సర్వం సూకరేణాతిరంహసా. 30 విశిఖై స్తాడితో೭స్మాభి ర్దృషద్బిర్లకుటై స్తథా | న బిభేతి మహారాజ హంతు మస్మానుపాద్రవత్. 31 వ్యాస ఉవాచ: ఇత్యాకర్ణ్య వచస్తేషాం రాజాకోపసమాకులః | అశ్వ మారుహ్య తరసా జగామోపవనం ప్రతి. 32 సైన్యేన మహతా యుక్తో గజాశ్వరధ సంయుతః | పదాతి బృందసహితః ప్రయ¸° వన ముత్తమమ్. 33 తత్రాపశ్య న్మహాకోలం ఘుర్ఘురంతం భయానకమ్ | వనం భగ్నం చ్ర సంవీక్ష్య రాజా క్రోధయుతో೭భవత్. 34 చాపే బాణం సమారోప్య వికృష్యచ శరాసనమ్ | తం హంతుం సూకరం పాపం తరసా సముపాక్రమత్. 35 సమాలోక్య చ రాజానం చావహస్తం రుషా కులమ్ | సమ్ముఖో೭భ్యద్రత త్తూర్ణం కుర్వన్ శబ్దం సుదారణమ్. తమాయాంతం సమాలోక్య వరాహం వికృతాననమ్ | ముమోచ విశిఖం తస్మిన్ హంతుకామో మహీపతిః. 37 వంతయిత్వా೭థ తద్బాణం సూకర స్తరసా బలాత్ | నిర్జగామ మహావేగా త్తములం ఘ్య నృపం తదా. 38 గచ్ఛంతం తం సమాలోక్య రాజా కోపసమన్వితః | ముమోచ విశిఖాం స్తీక్ష్నాం శ్చాపమా కృష్య యత్నతః. 39 క్షణం దృష్టిపధం రాజ్ఞః క్షణం చాదర్శనం గతః | కుర్వ న్బహువిధారావరం సూకరః సముపాద్రవత్. 40 హరిశ్చంద్రో೭తికుపితో మృగంహ్యనుజగామ హ | అశ్వేన వాయువేగేన వికృష్య చ శరాసనమ్. 41 మాలలు కట్టువా రిట్లనిరి: రాజా! దేవ-దానవ-యక్ష-కిన్నరులలో నెవ్వడును కాడు. ఒక్క మహాకాయముగల పంది మీ వనమునందున్నది. ఆ మహావేగముగల పంది మెత్తని పూలచెట్లు కోరలతో పెకలించి వనమంతయును చిందర వందర చేసెను. రాజా! మేము బాణములతో కర్రలతో రాళ్లతో దాని నెంత కొట్టినను అది జంకుకొంకులులేక తిరిగి మమ్మే చంపుటకు వచ్చినది. అనువారి మాటలువిని రాజు మహాకోపముతో సత్వరమే గుఱ్ఱమెక్కి యుపవనము దెస కరిగెను. రాజు వెంట గజాశ్వరధసేనలు-పదాతి ధళములు-తోటవైపు వెళ్ళెను. అట ఘురఘుర శబ్దముతో భయంకరమైన పందిని భగ్నమైన తోటను చూడగనే రాజునకు కోపము వచ్చెను. రాజు వెంటానే వింటియందు బాణ మెక్కుపెట్టి నారి సారించి పాప రూపమైన పందిని చంపుటకు పూనుకొనెను. రాజు అతడు విల్లునమ్ములతో తన వైపు మహా రోషముతో వచ్చుటగని పంది భీకరముగ ఘగఘర శబ్దము చేయుచు నతనివైపు పరిగెత్తెను. అది పెద్దగ నోరు తెఱచుకొని వచ్చుటచూచి రాజు దానిని చంపుటకు బాణం వదలెను. కాని పంది వెంటనే బాణము తప్పించుకొని మహా వేగముతో రాజును దాటి పారిపోయెను. అది తప్పించుకొని పోవుట చూచి రాజు మరింత కోపముతో ధనువు లాగి పందిపై బాణము లేసెను. అది యొక్క క్షణములో రాజునకు కనిపించకయు పెక్కు రీతుల ఘురఘురమనుచు పరుగెతైను. హరిశ్చంద్రుడును కోపోద్రేకముతో వాయువేగము గల గుఱ్ఱమెక్కి ధనువు లాగుచు పంది వెంటబడెను. ఇత స్తత స్తతః సైన్య మగమచ్చ వనాంతరమ్ | ఏకాకీ నృపతిః కోలం న్రజంతం సముపాద్రవత్. 42 మధ్యాహ్న సమయే రాజా సంప్రాప్తో విజనే వనే | తృషితః క్షుధితో೭త్యర్ధం బభూవ శ్రాంతవాహనః. 43 సూకరో೭దర్శనం ప్రాప్తో రాజా చింతాతురో೭భవత్ | మార్గభ్రషో೭ తివిపినే దారుణ దీనవత్థ్సితః. 44 కిం కరోమి క్వ గచ్ఛామి న సహయో೭స్తి మే వనే | అజ్ఞాత స్వపథః కుత్ర వ్రజామీతి వ్యచింతయత్. 45 ఏవం చింతయత స్తత్ర విపినే జనవర్జితే | రాజా చింతాతురో೭వశ్య న్నదీం సువిమలోదకామ్. 46 వీక్ష్యం తాం ముదితో రాజా పాయయిత్వా తురంగమమ్ | అశ్వాదు త్తీర్య నిమలం వపౌ పానీయ ముత్తమమ్. 47 జలం పీత్వా నృప స్తత్ర సుఖమాప మహీపతిః | ఇయేష నగరం గంతుం దిగ్బ్రమేణాతి మోహితిః. 48 విశ్వామిత్ర స్తు సంప్రాప్తో వృద్ధబ్రాహ్మణరూపపధృక్ | ననామ వీక్ష్య రాజాతం ప్రీతిపూర్వం ద్విజోత్తమమ్. 49 తమువాచ గాధిరాజః ప్రణమంతం నృపోత్తమమ్ | స్వస్తి తే೭స్తు మహారాజ కిమర్థ మిహ చాగతః. 50 అపుడు సేనలు వనమంతయును చెల్లాచెదరై క్రుమ్మరుచుండెను. రాజోక్కడే పుట్టపురుగులేని కుట్ర నట్టడవిలో డస్సి యాకలిదప్పులచే నకనకలాడెను. అతని వాహనము సైత మలసిపోయెను. పంది తప్పించుకొని పోయినందున రాజు దిక్కులేని వానివలె నడవిలో దారితప్పి వెతగుందుచుండెను. నే నిపు డేమి చేతును? ఎక్కడి కేగుదును? ఈ వనమున నాకు బాటయు తెలియదే. ఇపు డెట్లని రాజు వగచెను. ఇట్లు చింతాతురుడై యొంటిగ రాజు విచారించుచుండగ నతనికి నిర్మలమైన నీరుగల యొక కొలను కనిపించెను. అది గని రాజు ప్రసన్నుడై గుఱ్ఱముదిగి దానికి నీరు పెట్టి తాను నిర్మలజలము త్రాగెను. రాజు నీరుగ్రోలి శాంతిజెంది తన పురి కేగదలచెను. కాని యతడు దారితెన్ను తెలియక మోహితుడయ్యెను. అంతలో విశ్వా మిత్రుడొక వృద్ధ బ్రాహ్మణ రూపమున వచ్చెను. రాజు బ్రాహ్మణునిగని భక్తిమీర నమస్కరించెను. తన్ను నమస్కరించు చున్న రాజుతో విశ్వామిత్రు డిట్లనెను. రాజా! నీకు మేలగుత! ఇచటి కేల వచ్చితివి. ఏకాకీ విజనే రాజన్కిం చికీర్షిత మత్ర తే | బ్రూహి సర్వం స్థిరో భూత్వా కారణం నృపసత్తమ. 51 రాజోవాచః సూకరో೭తి మహాకాయో బలవా న్పుష్పకాననమ్ | నముపేత్య మమర్దాశు కోమలాన్పుష్పపాదపాన్. 52 తం నివారయితుం దుష్టుం కరే కృత్వా చ కార్ముకమ్ | స సైన్యో೭హం స్వనగరా న్నిర్గతో మునిసత్తమ. 53 గతో೭సౌ దృక్పథా త్పాపో మాయావీక్వాపి వేగవాన్ | పృష్ఠతో೭హమపి ప్రాప్తః సైన్యం క్వాపి గతం మమ. 54 క్షుధిత స్తృషిత శ్చాహం సైన్యభ్రష్ట స్త్విహగతః | న జానే పురమార్గం చ తథా సైన్యగతిం మునే. 55 పంథానం దర్శయ విభో వ్రజామి నగరం ప్రతి | మమాత్ర భాగ్యయోగేన ప్రాప్త స్త్వం విజనే వనే. 56 అయోధ్యాధిపతి శ్బాహం హరిశ్చంద్రో೭తి విశ్రుతః | రాజసూయస్య కర్తా చ వాంఛితార్థప్రదః సదా. 57 ధనే చ్చా యది తే బ్రహ్మ న్యజ్ఞార్ధం ద్విజసత్తమ | ఆగంతవ్య మయోధ్యాయాం దాస్యామి విపులంధనమ్. 58 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే అష్టాదశో೭ద్యాయః. ఈ విజన ప్రదేశమున కొంటిగ నేమి ప్రయోజనము గోరి వచ్చితివి? ఈ కారణములన్నియును నాకు నిలుకడతో చెప్పుము. రాజిట్లమెను: ఒక బలముగల మహాకాయమగు పంది నా పూలతోటలో బడి మెత్తని పూలచెట్ల నన్నిటిని త్రెంపి వేసెను. విప్రవర్యా! నే నా చెడుపందిని చంపుటకు విల్లునంబులుబూని సైన్యమే వెంటరాగా నగరు వెడలి వచ్చితిని. ఆ మాయవి-పాపిష్ఠమగు పంది నా కండ్లకు కానరాక వేగమెటకో పరుగెత్తెను. దాని వెంట నేను బడితిని. నా సైన్య మెటు పోయెనో తెలియుటలేదు. నే నాకలిదప్పులచే భాదపడి యిచటికి వచ్చితిని. నా సైన్య మేమయ్యెనో తెలియదు. నగరపు బాట యును తెలియుటలేదు. ఓ విభూ! నా యదృష్టమువలననే నీ వీ నిర్జనప్రదేశమున కేతెంచితివి. నాకు మార్గము చూపిం పుము. నా పురి కేగగలను. నే నయోధ్యాపతిని. నన్ను హరిశ్చంద్రుడందురు. రాజసూయము చేసినవాడను. యాచకుల కోర్కెలు దీర్చువాడను. ద్విజవర్యా! నీకు యజ్ఞమునకు ధనము కావలసినచో నా వెంట నయోధ్యకు రమ్ము. నీకు కావలసి నంత ధన మీయగలను. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమందు పదునెనిమిదవ యధ్యాయము.