Sri Devi Bagavatham-2
Chapters
అథ వింశో೭ధ్యాయః హరిశ్చంద్రః : అదత్త్వా తే హిరణ్యంవై న కరిష్యామి భోజనమ్ | ప్రతిజ్ఞామే ముని శ్రేష్ఠ విషాదం త్యజ సువ్రత.
1 సూర్యవంశసముద్బూతః క్షత్రియో೭హం మహీపతిః | రాజసూ యస్య యజ్ఞస్య కర్తా వాంఛితదో నృషు.
2 కథం కరోమి నా కారం స్వామి న్దత్త్వా యచృచ్ఛయా | అవశ్వమేవ దాతవ్య మృణం మే ద్విజసత్తమ.
3 స్వ స్థో భవ ప్రదాస్వామి సువర్ణం మనసేప్సితమ్ | కంచిత్కాలం పతీక్షస్య యాత్పృ ప్స్యామ్య హంధనమ్.
4 విశ్వామిత్రః : కుత స్తే భవితా రాజ న్దనప్రాప్తిరతః పరమ్ | గతం రాజ్యం తథా కోశో బలం చైవాథ సాధనమ్. వృథా೭೭శా తే మహాపాల ధనార్థే కిం కరోమ్యహమ్ | నిర్ధనం త్వాం చ లోభేన పీడయామి కథం నృప. 6 తస్మా త్కథయ భూపాల న దాస్యామీతి సాంప్రతమ్ | త్యక్త్వా೭೭శాం మహతీం కామం గచ్ఛామ్యహ మతః పరమ్. యథేష్టం వ్రజ రాజేంద్ర భార్యాపుత్రసమన్వితః | సువర్ణం నాస్తి కిం తుభ్యం దదామీతి వదాధునా.
8 వ్యాసః : గచ్ఛన్వాక్యమిదం శ్రుత్వా బ్రాహ్మణస్యచ భూపతిః | ప్రత్యువాచ మునిం బ్రహ్మన్ధైర్యం కురు దదామ్యహమ్. మమ దేహో೭స్తి భార్యయాః పుత్రస్యచ హ్యనామయః | క్రీత్వా దేహం తు తం నూన మృణం దాస్యామి తే ద్విజ. గ్రాహకం పశ్య విప్రేంద్ర వారాణస్యాం పురి ప్రభో | దాసభావం గమిష్యామి సదారో೭హం సపుత్రకః. 11 గృహేణ కాంచనం పూర్ణం సార్దభారద్వయం మునే | మౌల్యేన దత్త్వా సర్వాన్నః సంతుష్టో భవ భూధర.
12 ఇరువదవ అధ్యాయము హరిశ్చంద్రోపాఖ్యానము హరిశ్చంద్రు డిట్లనెను: ఓ మునివర్యా! నీకు దక్షిణ చెల్లించక భోజనము చేయను. ఇది నా ప్రతిన. ఇక విచారము మానుము. నేను సూర్యవంశజుడను-క్షత్రియుడను-రాజసూయయాగ మొనరించినవాడను. ఎల్లకోర్కెలు దీర్చువాడను. ఓ స్వామీ! ఓ ద్విజవరా! నేను మనఃపూర్తిగ దాన మిచ్చితిని. ఇక దక్షిణ యీయ కెట్లుందును? నీ ఋణము తప్పక తీర్చ గలను. నీ యష్టానుసారమే బంగార మీయగలను. నాకు ధనము చేతికి వచ్చునంతవఱ కోపిక పట్టుము. దిగు లొందకుము. విశ్వామిత్రు డిట్లనెను: ఓ రాజా! నీ రాజ్యము-నీ కోశము- నీ బలము-సర్వము - నిన్ను వదిలిపోయెనే! ఇక నీకు ధన మెక్కడినుండి వచ్చును? రాజా! ధనమును గూర్చిన రిత్తయాస లేల? నీ విపుడు లేనివాడవైతివి. ఇపుడు నేను మాత్రమేమి చేయగలను? నేను మాత్రము నిన్నింతగ లోభముతో నేల పీడింతును? కనుక రాజా! నే నిపు డీయలేనని యొక్క మాట చెప్పుము. నా కొండొంతయాస వదలుకొని స్వేచ్ఛగ వెళ్ళుదును. ఇపుడు నా యెద్ద ధనము లేదు. ఇక మీ కేమి యీయగలనను నొక్కమాట పల్కి నీ భార్యాపుత్రులతో స్వేచ్ఛగ నరుగుము. రాజు వెళ్ళిపోవుచు మునినుండి మరల ఈ మాటలు విని ముని కిట్లనెను: ఓ బ్రాహ్మణోత్తమా! ధైర్యము పూనుము. తప్ప కిత్తును. నా దేహము-భార్యా దేహము-కొడుకు దేహము- ఇవి యే రోగములు లేకున్నవి. వీని నమ్మి నీ ఋణము దీర్చుకొందును. ఓ విప్రవరా! ఈ పవిత్ర కాశీపురిలో మమ్ము కొను వాని నెవనినైన చూడుము. అతనికి నేను నా భార్యాపుత్రులతో నమ్ముడుపోదును. మమ్మెవరికైన నమ్మి నీ రెండున్నర బరువుల బంగారము తీసికొమ్ము. మా యెడల ప్రసన్నుడవు గమ్ము. ఇతి బ్రువన్ జగామాథ సహపత్న్యా సుతాన్వతః | ఉమయా కాంతయా సార్ధం యత్రాస్తే శంకరఃస్వయమ్. 13 తాందృష్ట్వాచ పురీం రమ్యాం మనసో హ్లాదకారిణీమ్ | ఉవాచ స కృతార్థో೭స్మి పురీం పశ్యన్సువర్చసమ్. 14 తతో భాగీరథీం ప్రాప్య స్నాత్వా దేవాదితర్ఫణమ్ | దేవార్చనం చ నిర్వర్త్య కృతవాన్దిగ్విలోకనమ్. 15 ప్రవిశ్య నసుధాపాలో దివ్యాం వారాణసీం పురీమ్ | నైషా మనుష్యభుక్తేతి శూలపాణః పరిగ్రహః. 16 జగామ పద్బ్యాం గుఃఖార్త స్సహ పత్న్యా సమాకులః | పురీం ప్రవీశ్య స నృపో విశ్వాస మకరోత్తదా. 17 దదృశే థ మునిశ్రేష్ఠం బ్రాహ్మణం దక్షినార్దినమ్ | తం దృష్ట్వా సమనుప్రాప్తం వినయావనతో೭భవత్. 18 ప్రాహ చైవాంజలిం కృత్వా హారిశ్చంద్రో మహమునిమ్ | ఇమే ప్రాణాఃసుత శ్చాయం ప్రియాపత్నీ మునే మమ. యేన తేకృత్య మస్త్యాశు గృహాణాద్య ద్విజోత్తమ | యచ్చాన్యత్కార్య మాస్మాభి స్తన్మమా೭೭ఖ్యాతుమర్హసి. విశ్వామిత్ర ఉవాచ : పూర్ణ : సమాసో భధ్రం తే దీయతాం మమ దక్షిణా | పూర్వం తస్య నిమిత్తం హిస్మర్యతే స్వవచో యది. 21 రాజోవాచ: బ్రహ్మన్నా ద్యాపి సంపూర్ణో మాసో జాన తపోబల | త్రిష్ఠత్యేకదినార్ధమ యత్తత్ప్రతీక్షస్వ నాపరమ్. ఇట్లు పలికి అన్నపూర్ణతో విశ్వేశ్వరుడు వసించు కాశికి రాజు తన భార్యపుత్రులతో నేగెను. ఆ రమ్యమైన మనసున కింపైన కాశీనగరమును గని నే నీ కాశిని దర్శించి-ధన్యభాగుడనైతినని రాజు తలంచెను. అటు పిమ్మట హరి శ్ఛంద్రు పావనగంగలో మునిగి పితృదేవతలకు తర్పణమిడి దేవతార్చన చేసికొని నలువైపుల కలయజూచెను. రాజు దివ్యకాశీపట్టణముజేరి దీనిని శూలపాణియగు విశ్వేశ్వరుడే పాలించగలడు గాని నరమాత్రుడు పాలించలేడు. అని తలంచి దుఃఖార్తితో తన భార్యాపుత్రులతో కాలి నడకను కాశీపురి ప్రవేశించి యందు నివసింపదలంచెను. ఇంతలో దక్షిణకోరు మునివరుడు తన వెంటవచ్చుట గనెను. హరిశ్చంద్రుడు మహామునికి దోసిలోగ్గి యిట్లనెను: ఇవిగో ఇవి నా ప్రాణములు. ఈమె నా భార్య. ఇతడు నా కొడుకు. ఓ ద్విజవర్యా! మాలో నెవరివలన నీ పని నెఱవేరునో వారిని తీసికొనుము. కాదేని మమ్మేమి చేయుమందువో చెప్పుము. విశ్వామిత్రు డిట్లనెను: రాజా! నీవు పెట్టిన నెలగడువు నిండినది. అపుడు నా కిచ్చిన మాట జ్ఞాపకమున్నచో ఇపుడు నాకు దక్షిణ యిమ్ము. రాజిట్లనెను: జ్ఞానతపోబలా! నెల పూర్తి కాలేదు. ఇంకను సగము దినము మిగిలియున్నది. అదియు పూర్తియగువఱ కెదురుచూడుము. అటు తరువాకాదు. విశ్వామిత్రః: ఏవమస్తు మహారాజ ఆగమిష్యామ్యహం పునః | శాపం తవ ప్రదాస్యామి నచే దద్య ప్రయచ్ఛసి. 23 ఇత్యుక్త్వా೭థ య¸° విప్రో రాజా చాచింతయత్తదా | కథ మసై#్మ ప్రయచ్ఛామి దక్షిణాయా ప్రతిశ్రుతా. 24 కుతః పుష్టాని మిత్రాణి కుత్రార్ధః సాంవ్రతం మమ | ప్రతిగ్రహః ప్రదుష్టోమే తత్రయాచ్నా కథం భ##వేత్. 25 రాజ్ఞాం వృత్తిత్రయం ప్రోక్తం ధర్మశాస్త్రేషు నిశ్చితమ్ | యది ప్రాణా న్విముంచామి హ్యప్రదాయ చ దక్షిణామ్. బ్రహ్మస్వహా కృమిః పాపో భవిష్యామ్య మాదమః | అథవా ప్రేతతాం యాస్యే వరేవాత్మవిక్రయః. 27 సూతః: రాజానం వ్యాకులం దీనం చింతయాన మధోముఖమ్ | ప్రత్యువాచ తదా పత్నీ బాశ్పగద్గదయా గిరా. 28 త్యజ చింతాం మహారాజ స్వధర్మ మనుపాలయ | ప్రేతవద్వర్జనీయో హి నరః సత్యబహిష్కృతః. 29 నాతః పరతరం ధర్మణం వదంతి పురుషస్యచ | యా దృశం పురుషవ్యాఘ్ర స్వసత్యస్యానుపాలయ. 30 అగ్నిహోత్ర మధీతం చ దానాద్యాః సకలాః క్రియాః | భజంతి తస్య వైఫల్యం వాక్యం యస్యానృతం భ##వేత్. 31 సత్య మత్యంతముదితం ధర్మాశాస్త్రేషు ధీమతామ్ | తారణాయానృతం తద్వ త్పాతనాయాకృతాత్మనామ్. 32 శతాశ్వమేధా నాహృత్య రాజసూయంచ పార్థివః | కృత్వా రాజా సకృత్స్వర్గా దసత్యవచనాచ్చ్యుతః. 33 రాజా: వంశవృద్దికర శ్చాయంపుత్రస్తిష్ఠతి బాలకః | ఉచ్యతాం వక్తుకామా೭సి యద్వాక్యం గజగామిని. 34 విశ్వామిత్రు డిట్లనెను: రాజా! సరే! అట్లే కానిమ్ము. మఱల వత్తును. ఈసారి ఈయకున్నచో శాప మీయగలను. అని ముని వెళ్లగనే రాజిట్లు చింతింపసాగెను. ఇతనికి నేనెట్లు దక్షిణ చెల్లింపగలను. దక్షిణ యిత్తునని మాట యిచ్చి యుంటినే! కాశీపురిలో ధనము బొందుటకు నాకు నెచ్చెలికాండ్రెవరును లేరే! నే నొకనిని యాచింపరాదే! ఒకనిముందెట్లు చేయి చాపగలను? రాజులకు ధర్మశాస్త్రాముసారముగ యజనము-అధ్యయనము-దానము-అను మూడు ముఖ్య కర్తవ్యములు. ఇతనికి దక్షణ యీయక నేను ప్రాణములు వదలినచో నమగును? అపుడు నేను వచ్చు జన్మములో బ్రహ్మ హంత-కీటకము-పాపి-అధమాధముడను గాగలను. అవి కానిచో పిశాచము నగుదును-వీటన్నిటికంటె నేనెవనికైన అమ్ముడుపోవుట మంచిది. అని రాజు తల నేలకు వేసికొని చింతాతరుడై యుంటగని యతని భార్య కన్నీరుగార్చుచు డగ్గుత్తికతో నిట్టులనెను. ఓ మహారాజా! నీ ధర్మము నీవు పాలింపుము. దిగులు పడకుము. సత్యమును ధర్మమును మీఱినవాడు ప్రేతవలె విడువదగిన వాడు. ఓ పురుషవర్యా! సత్యమును నిలుపుకొనజాలడో వాని నిత్య్యాగ్ని హోత్రము-అధ్యయనము-దానాదిక్రియలు అన్నియును వ్యర్థములే. ధర్మశాస్త్రములం దీ సత్యమహిమ మెంతగనో వర్ఱింపబడినది. ఇది పుణ్యాత్ముల నుద్ధరించును. పావులనణగ ద్రొక్కును. యయాతి మహారాజు నూఱశ్వ మేధ ములు-రాజసూయము-నొనర్చెను. కాని యొక్కసారి పల్కిన యసత్యము నకు స్వర్గభ్రష్టుడయ్యెను. రాజిట్లనెను: ఓ గజగామినీ! ఈ మన పుత్రుడు వంశము నిల్పువాడు గదా! కనుక నీవు చెప్పదలచు కొన్నది స్పష్టముగ జెప్పుము. పత్న్యువాచ : రాజన్మాభూ దసత్యం తే పుంసాం పుత్రఫలాః స్త్రియః | తన్మాం ప్రదాయ విత్తేన దేహి విప్రాయ దక్షిణామ్. 35 వ్యాసః: ఏతద్వాక్య ముపశ్రుత్య య¸° మోహం మహీపతిః | ప్రతిలభ్య చ సంజ్ఞాంవై విలలాపాతి దుఃఖితః. 36 మహద్దుఃఖ మిదం భ##ద్రే యత్త్వ మేవం బ్రవీషిమే | కిం తవ స్మితసంల్లాపా మమపాపస్య విస్మృతాః. 37 హాహా త్వయా కథం యోగ్యం వక్తుమేతచ్ఛుచిస్మితే | దుర్వాచ్య మేతద్వచనం కథం వదసి భామిని. 38 ఇత్యుక్త్వా నృపతిః శ్రేష్ఠో వధీరో దారవిక్రయే | నిపపాత మహీపృష్ఠే మూర్చయాతి పరిప్లుతః. 39 శయానం భువి తం దృష్ట్వా మూర్ఛయా೭పి మహీపతిమ్ | ఉవాచేదం సకరుణం రాజపుత్రీ సుదుఃఖితా. 40 హా మహారాజ కస్యేద మపధ్యానా దుపాగతమ్ | యస్త్వం నిపతితో భూమౌ రంకనచ్ఛరణోచితః. 41 యేనైన కోటీశో విత్తం విప్రాణా మపధ్యానా దుపాగతమ్ | స ఏవ పృథివీనాథో భువి స్వపితి మే పతిః. 42 హా కష్టం కిం తవానేన కృతం దైవ మహీక్షితా | యదింద్రోపేంద్రుతుల్యో೭యం నీతః పాపా మిమాం దశామ్. ఇత్యుక్త్వా సా೭పి సుశ్రోణీ మూర్ఛితా నిపపాతహ | భర్తు ర్దుఃఖమోహభారేణా సహ్యేనాతిపీడితా. 44 శిశుర్దృష్ట్వా క్షుధా೭೭విష్టః ప్రాహ వాక్యం సుదుఃఖితః | తాత తాత ప్రదేహ్యన్నం మాతర్మే దేహి భోజనమ్. క్షున్మే బలవతీ జాతా జిహ్వా೭గ్రే మే೭తిశుష్యతి | ఇతి శ్రీదేవిభాగవతే మహాపురాణ సప్తమస్కంధే హరిశ్చంద్రోపాఖ్యానే వింశో೭ధ్యాయః. భార్య యిట్లనెను: రాజా! స్త్రీ పురుషుల దాంపత్యము పుత్రులు గల్గుటకే కదా! మన కా కోర్కి దీరినది. కనుక నన్నె వరికైననమ్మి మునికి దక్షిణయిమ్ము. సత్యము నిలువబెట్టుము. ఈ మాటలు వినగానే రాజు మూర్ఛితుడై కొంత తడవునకు తెప్పరిల్లెను. పిమ్మట కడు వగచి యిట్లనెను. ఓ కల్యాణీ! నీవు పల్కిన పల్కులవలన నాకు తీరని దుఃఖము గల్గుచున్నది. ఇక నీ మందహాసపూర్వక సంభాషణముల నీ పాపి మరచిపోవలసినదేనా! ఓ భామినీ! పవిత్రమగు చిరునగవు దానా! నీ వింతటిమాట యెటులు పల్కితివి. అక్కట ! ఇంతటి వనరానిమాట వినవలసివచ్చెనే! అని పలికెను. రాజునకు తన భార్యనే యమ్ముకొనుట అను మాటకు గుండె చెదరెను. పిమ్మట అతడు దుఃఖితుడై మూర్చపోయెను. నేలపై మూర్ఛితుడై పడియున్న రాజునుగని రాణివాపోవుచు దీనముగ నిట్లనుకొనెను : హామహామహీపతీ! నీవే దైవపు చెడుతలంపుతో నిట్టిదుఃస్థితికి గురియైతివి. రాజభవనములో పరుండవలసిన నీ విపు డీ కటికినేలపై పడియుంటివా! హా కటా! ఏ నా పతి మునుపు విప్రులకు కోట్లధనము దాన మిచ్చెనో యా భూపతియే నేడు నైలపై పడియున్నాడే ! అక్కటా! చెడు దైవమా ! ఈ రాజు నీకు మును పేమి కీడొనరించెనో కదా! ఇంద్రోపేంద్రులబోలు రాజేంద్రు డిట్టి దీనదశలో నిన్ని యిక్కట్టుల పాలయ్యెను. అని పలికి తన పతి దుఃఖమోహమును సహింపజాలక రాణియును బాధపడి మూర్ఛితురాలై పడిపోయెను. ఇట్లు వారిర్వురును మూర్ఛితు లగుటగని రోహితుడు అమ్మా! అన్నము; నాయనా! అన్నమని పేరాకట నకనకలాడెను. అమ్మా! ఆకలిమంట యెక్కువైనది. నాలుకపిడచ గట్టుచున్నది. పట్టెడన్నము పెట్టుమమ్మా అనెను. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమాధ్యాయమున నిరువదవ యధ్యాయము.