Sri Devi Bagavatham-2
Chapters
అథ ఏకవింశో೭ధ్యాయః. ఏతస్మి న్నంతరే ప్రాప్తో విశ్వామిత్రో మహాతపాః | అంతకేన సమః క్రుద్ధో ధనం స్వం యాచితుం హృదా. 1 తమాలోక్య హరిశ్చంద్రః పపాత భువి మూర్ఛితః | స వారిణా తమభ్యుక్ష్య రాజాన మిద మబ్రవీత్.
2 ఉత్తిష్ఠోత్తిష్ఠ రాజేంద్ర స్వాం దదస్వేష్టదక్షిణామ్ | ఋణం ధారయతాం దుఃఖ మహన్యహని వర్ధతే. 3 ఆప్యాయమానః స తదా హిమశీతేన వారిణా | అవాప్య చేతనాం రాజా విశ్వామిత్ర మవేక్ష్యచ.
4 పునర్మోహం సమాపేదే హ్యథ క్రోధం య¸° మనిః | సమాశ్వాస్య చ రాజానం వాక్యమహ ద్విజోత్తమః.
5 విశ్వామిత్రః : దీయతాం దక్షిణా సా మే యది ధైర్య మవేక్షసే | సత్యేనార్క ః ప్రతపతి సత్యే తిష్ఠతి మేదినీ. 6 సత్యే ప్రోక్తః పరో ధర్మః స్వర్గః సత్యే ప్రతిష్ఠతః | అశ్వమేధసహస్రం తు సత్యం చ తులయా ధృతమ్. 7 అశ్వమేధ సహస్రాద్ధి సత్యమేకం విశిష్యతే | అథవా కిం మమైతేన ప్రోక్తేనాస్తి ప్రయోజనమ్. 8 మదీయాం దక్షిణాం రాజ న్నదాస్యసి భవాన్యది | అస్తాచలగతే హ్యర్కే శప్స్యామి త్వామతో ధ్రవమ్. 9 ఇత్త్యుక్త్వా సమ¸° విప్రో రాజా చాసీద్బయాతురః | దుఃఖీభూతో೭వనే నిఃస్వో నృశ ంసమునినా೭ర్దితః. 10 సూతః : ఏతస్మి న్నంతరే తత్ర బ్రాహ్మణో వేదపారగః | బ్రాహ్మణౖర్బహుభిః సార్దం నిర్య¸° స్వగృహాద్బహిః. తతో రాజ్ఞీ తు తాం దృష్ట్వా ఆయాతోం తాపసం స్థితమ్ | ఉవాచ వాక్యం రాజానం ధర్మార్ధసహితం తదా. 12 ఇరువది ఒకటవ అధ్యాయము-హరిశ్చంద్రోపాఖ్యానము ఇంతలో యమునివలె క్రోధముతో మహాతపస్వియగు విశ్వామిత్రుడు తన ధనము యాచించుట కేగుదెంచెను. మునిని చూడగనే హరిశ్చంద్రుడు మూర్ఛితుడై నేల కొఱగెను. అపుడు రాజు మొగముపై నీరు చల్లి ముని రాజున కిట్లనెను. ఓయి రాజేంద్రా! లేలెమ్ము. నీ వీయవలసిన దక్షిణ యిమ్ము. అప్పున్నవానికి క్షణక్షణమును దుఃఖములు పెరుగుచునే యుండును. చల్లని నీటి తాకుడునకు రాజూరటజెంది తెలివొంది విశ్వామిత్రునితో నేదియో పలుకబోయెను. అంతలో రాజు మరల మోహవశుడై పడిపోయెను. అదిగాంచి ముని రాజు నూరార్చి తీవ్రకోపముతో నతని కిట్లనెను: నీవు సత్యము నిలుపు కొనదలచినచో నా దక్షిణ నాకిమ్ము. సూర్యుడు సత్యమువలననే వెల్గుచున్నాడు. ఈ భూమి సత్యబలమున స్థిరముగ నున్నది. స్వర్గమును సత్యముపై నాధారపడియుండును. సత్యము పరమధర్మమని పేర్కొనబడును. వేయి అశ్వమేధముల ఫలము కంటె సత్యఫలము గొప్పది. రెంటిని తులలో తూచుము. అపుడు నూఱశ్వమేధములకంటె సత్యమువైపు మొగ్గుండును నీ కిట్టి వట్టిమాటలతో నేమి పని? రాజా! నా కీయవలసిన దక్షిణ యీనాటి ప్రొద్దు గ్రుంకు లోపల నీయనిచో నిన్ను తప్పక శపించి వేయగలను. అని పలికి ముని వెళ్ళిపోయెను. నిఱుపేదయగు రాజు ముని పరుషములకు దుఃఖితుడై భయాతురుడై యేమి తోచక చింతించుచుండెను. అంతలోనే వేదవిదుడగు నొక విప్రుడు పెక్కురు బ్రాహ్మణులు వెంటరాగ తన గృహము వెడలి యచటి కేతెంచెను. వచ్చిన బ్రాహ్మణుని గాంచి రాణి రాజుతో ధర్మార్థములుగల మాటలతో నిటుపలికెను. త్రయాణా మపి వర్ణానాం పితా బ్రాహ్మణ ఉచ్యతే | పితృద్రవ్యం హి పుత్రేణ గ్రహీతవ్యం న సంశయః. 13 తస్మా దయం ప్రార్థనీయే ధనార్థమితి మే మతిః | రాజోవాచ : నా హం ప్రతిగ్రహం కాంక్షే క్షత్రియో೭హం సమధ్యమే. 14 యాచనం ఖలు విప్రాణాం క్షత్రియాణాం న విద్యతే | గురుర్హి విప్రో వర్ణానాం పూజనీయో೭స్తి సర్వదా. 15 తస్మా ద్గురు ర్న యాచ్యః స్యాత్ క్షత్రియాణాం విశేషతః | యజనాధ్యయనం దానం క్షత్రియస్య విధీయతే. 16 శరణాగతానా మభయం ప్రజానాం ప్రతిపాలనమ్ | న చా೭ప్యేవం తు వక్తవ్యం దేహీతి కృపణం వచః. 17 దదామీత్యేవ మే దేవి హృదయే నిహితం వచః | ఆర్జితం కుత్ర చిద్దృవ్యం బ్రాహ్మణాయ దదామ్యహమ్. 18 పత్న్యువాచ : కాలః సమవిషమకరః పరిభవసమ్మా మానదః కాలః | కాలః కరోతి పురుషం దాతారం యాచితారం చ. 19 విప్రేణ విదుషా రాజా క్రుద్ధేనాతిబలీయసా | రాజ్యాన్ని రస్తః సౌఖ్యాచ్చ పశ్య కాలస్య చేష్టితమ్. 20 రాజోవాచ : అసినా తీక్ష్నధారేణ వరం జిహ్వా ద్విధా కృతా | నతు మానం పరిత్యజ్య దేహిదేహీతి భాషితమ్. 21 క్షత్రియో೭హం మహాభాగేన యాచే కించిదప్యహమ్ | దదామి వా೭హం నిత్యం హి భుజవీర్యార్జితం ధనమ్. 22 పత్న్యువాచ : యది తే హి మహారాజ యాచితుం న క్షమం మనః | అహం తు న్యాయతో దత్తా దేవైరపి సవాసవైః. 23 అహం శాస్యా చ పత్యా చ రక్ష్యాచైవ మహాద్యుతే | మన్మౌల్యం సంగృహీత్వా೭థ గుర్వర్థం సంప్రదీయతామ్. 24 ఏతద్వాక్య ముపశ్రుత్య హరిశ్చంద్రో మహీపతిః | కష్టం కష్ట మితి ప్రోచ్య వలలాపాతి దుఃఖితః. 25 భార్యా చ భూయః ప్రాహేదం క్రియతాం వచనం మమ | విప్రశాపాగ్ని దగ్ధత్వా న్నీ చత్య నుపయాస్యసి. 26 న దూత్యహేతే ర్నచ మద్య హేతో ర్న రాజ్యహేతో ర్న చ భోగహేతోః | దదస్వ గుర్వర్థమతో మయా త్వం సత్యవ్రతత్వం సఫలం కురుష్య. 27 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే హరిశ్చంద్రోపాఖ్యానే ఏకవింశో೭ధ్యాయః. బ్రాహ్మణుడు మూడు వర్ణములు వారికిని తండ్రివంటివా డందురు. కనుక తండ్రి ద్రవ్యమును తనయుడు తప్పక తీసికొనవచ్చును. ఇతని నిపుడు మనము యాచించుట మంచిదని తలంతును. రాజిట్లనెను : ఓ ముదితా! నేను క్షత్రియుడను. ఇతని ముందు చేయి చాపను. విప్రులు యాచింపవచ్చును. కాని క్షత్రియులు యాచింపరాదు. ఎల్ల వర్ణముల వారికి విప్రుడు గురుడు. నిత్యము పూజనీయుడు. కనుక నట్టి గురువు నెవడును యాచింపరాదు. ఈ పని క్షత్రియులకు మొదలే తగదు. క్షత్రియులకు యజనము. అధ్యయనము. దానము శరణార్థుల కభయమిచ్చుట. ప్రజలను చక్కగ పాలిచుట అనునవి విధింపబడినవి. ఒకని ముందు దీనముగ దేహి యనుట రాజులకు దగని పని. ఓ దేవీ! నా హృదయమున నిత్య మిచ్చెదనను మాటయే నిలిచి యుండుత. నేనెక్కడి నుండి యైన ద్రవ్యము దెచ్చి మునికీయగలను. భార్య యిట్లనెను. కాల మొకనిని సమస్థితిలో మఱొకనిని విషమ స్థితిలో పడవేయును. ఒకనికి సమ్మానము వేరొకని కవమానము గల్గించును. ఒకనిని దాతగ నింకొకని బిచ్చగానిగ చేయును. అంతటి పండిత మునియే నిన్ను తీవ్ర కోపముతో రాజ్య సుఖములకు దూరము చేసెను. ఈ కాలము చేత లెంత చిత్రములో చూడుము. రాజిట్లనెను. వాడి కత్తితో నా నాల్కను రెండుగ చీల్చినప్పటికిని నేను క్షత్రియా భిమానము కోల్పోయి దేహి యని యాచింపను. ఓ కల్యాణీ! నేను క్షత్రియుడను. నేనొకని నెంత మాత్రమును యాచింపను. నా చెమటోడ్చి పొందిన ధనమే యీయగలను. భార్య యిట్లనెను. ఓ మహారాజా! ఒకనిని యాచించుటకు నీ మన సొప్పుకొనుట లేదు గదా! నేను నీ కింద్రాది దేవతల వలన న్యాయముగ నీయబడితిని గదా! కనుక నీ చేత శాసింపబడుటకు రక్షింపబడుటకు తగుదును. ఓ మహాద్యుతీ : నన్నమ్మి యా వచ్చిన ధనమును ముని కిమ్ము. అను నామె మాటలు విని హరిశ్చంద్ర రాజు హా! ఎంతటి కష్టముదాపురించెనే! యని యెంతయో దురపిల్లెను. రాణి మరల రాజుతో నిట్లనెను. నా మాట వినుము. విప్ర శాపాగ్మి కాహుతియై నీచత్వమేల పొందెదవు? నీవు నన్నొక జూదమునకుగాని త్రాగుడునుకగాని రాజ్యమునకుగాని భోగలకు గాని యమ్ముటలేదు. గురున కీయవలసిన ధనము కొఱకు నన్నమ్ముము. నీ సత్యత్రము సఫల మొనరింపుము. ఇది శ్రీదేవీభాగవత మహాపురాణమందలి సప్తమస్కంధమున హరిశ్చంద్రోపాఖ్యానమున నిరువది ఒకటవ యధ్యాయము.