Sri Devi Bagavatham-2
Chapters
అథ అష్టావింశోధ్యాయః. జనమేజయః విచిత్ర మిద మాఖ్యానం హరిశ్చంద్ర్య, కీర్తితమ్ | శతాక్షీపాదభక్తస్య రాజర్షేర్ధార్మికస్య చ.
1 శతాక్షీ సాకుతో జాతా దేవీ భగవతీ శివా | తత్కారణం వద మునే సార్థకం జన్మమే కురు.
2 కోహి దేవ్యా గుణాన్ శృణ్వం స్తృప్తిం యాస్యతి శుద్ధధీః | పదే పదే೭శ్వమేధస్య ఫలమక్షయ్య మశ్నుతే.
3 వ్యాసః శృణు రాజన్రక్ష్యావ మి శతాక్షీనంభవం శుభమ్ | తవా೭వాచ్యం న మే కించి ద్దేవీభక్తస్య విద్యతే.
4 దుర్గమాఖ్యోమహాదైత్యః పూర్వ పరమదారుణః | హిరణ్యాక్షాన్వయే జాతో రురుపుత్రోమ్రహాఖలః.
5 దేనానాంతు బలం వేదో నాశే తస్య సురా అపి | నంక్ష్యంత్యేవ న సందేహో విధేయం చావదేవ తత్.
6 విమృశ్యైత త్తపశ్చర్యాం గతః కర్తుం హిమాలయే | బ్రహ్మాణం మనసా ధ్యాత్వా వాయుభక్షో వ్యతిష్ఠత.
7 సహస్రవర్షపర్యంతం చకార పరమం తపః | తేజసా తస్య లోకా స్తుత సంతప్తాః ససురాసురాః. 8 తతః ప్రసన్నో భగవాన్హంసారూఢ శ్చతుర్ముఖః | య¸° తసై#్మ వరం దాతుం ప్రసన్నముఖ పంకంజః. 9 సమాధిస్ధం మీలితాక్షం స్ఫుటమాహ చతుర్ముఖః | వరం వరయ భద్రం తే యస్తే మనసి వర్తతే. 10 తవా೭ద్య తపసా తుష్టో పరదేశో೭హ మాగతః శ్రుత్వా బ్రహ్మముఖా ద్వాణీం ప్యుత్ధితః సుసమాహితః. 11 పూజయిత్వా వరణ వవ్రే వేదాన్దేహి సురేశ్వర | త్రిఘ లోకేఘ యేమంత్రా బ్రాహ్మణషు సురేష్వపి. 12 విద్వంతే తేతు సాన్నిధ్యే మమ సంతు మహేశ్వర | బలం చ దేహి యేన స్యా ద్దేవానాం చ పరాజయః 13 ఇతి తస్య వచః శ్రుత్వా తథా೭స్త్వితి వచో వదన్ | జగామ సత్యలోకం తు చతుర్వేదేశ్వరః పరః. 14 ఇరువదిఎనిమిదవ ఆధ్యాయము-శతాక్షీ మాహాత్మ్యము జనమేజయు డిట్లనెను : రాజర్షి-ధార్మికుడు-శతాక్షి పాదభక్తుడునైన హరిశ్చంద్రుని చరిత్రము మహాద్బుతము-విచిత్రము. ఓ మునివరా! ఆ శివాభగవతీ పరాదేవీ యెట్లు శతాక్షి యయ్యెనో వెల్లడించుము. నా జన్మము పార్ధకమొనరిపించుము. శ్రీరాజరాజేశ్వరి యెక్క దివ్యగుణములు వినుట కాసపడిన నిర్మలచిత్తున కెట్లు తనివి తీరను? శ్రీదేవీనిగూర్చిన ప్రతి పదము నశ్వమేధముచే కలుగు శాశ్వతఫల మొసంగును. వ్యాసు డిట్లనెను: రాజా! ఆవధరింపుము. శ్రీశతాక్షీదేవి దివ్య సంభవము తేటపఱతును. నూవు శ్రీదేవి భక్తుడవు. నీకు చెప్పరానిది లేదు. మున్ను హిపణ్యాక్షుని వంశమున రురుకు మారుడు గలడు. ఆతడు దుష్టదైత్యుడు-పరమదారుణుడు-మూర్ఖుడు-అతని పేరు దుర్గముడు. దేవతలకు వేదములు జీవగఱ్ఱలు. వేదములు నష్టమైనచో వారును నశింతురు. కనుక వేదములను నశింపచేయవలయను. అనితలపోసి యతడు హిమాలయమున కేగి వాయుభక్షుడై బ్రహ్మను గూర్చి ధ్యానించుచు ఉగ్రతప మొనరించెను. అట్లతడు వేయేండ్లు తీవ్రతప మొనరింపగ నతని తపము వేడిమి కెల్ల లోకములును సురాసురులును కడు సంతాపము జెందిరి. అంచ నలుమోముల బ్రహ్మ నవ్వు లొలుకు మోముతమ్ములతో రాయంచ నెక్కి యతనికి వరము లీయవత్తెను. సమాధిలో మునిగి కనులు ముసికొనిన దుర్గమునితో బ్రహ్మ యిట్లనెను. నీ మదిలోని కోర్కి కోరుకొనుము. నీకు మేలగుత. నీ తపమునకు మెచ్చితిని. వరము లీయ వచ్చితిని. అని బ్రహ్మ పలుకగవిని దుర్గముడు సమాధి చాలించి లేచెను. అతడు బ్రహ్మాను పూజించి యిట్లనెను: ఓ సర్వేశ్వరా! నాకు వేదము లిమ్ము. ఈ ముల్లోకములందు విప్రులచెంత సురలదగ్గఱ నెన్నియో వేదమంత్రములు గలవు. అవన్నియును నా సన్నిధి నుండవలయును. మఱియు నెల్లదేవత లోడిపోవునట్టి బలము నాకిమ్ము. అను దైత్యుని మాటలువిని యట్లేయని మాట యిచ్చి నాలుగు వేదములు తెలిసిన బ్రహ్మ సత్యలోకమునకేగెను. తతః ప్రభృతి విపై#్ర స్తు విస్మృతా వేదరాశయః | స్నాన సంధ్యా నిత్యహోమ శ్రద్దాయజ్ఞ జపాదయః. 15 విలుప్తే ధరణీ పృష్ఠే హాహాకారో మహానభూత్ | కిమిదం కిమిదం చేతి విప్రా ఊచుః పరస్పరమ్. 16 వేదాభావాత్తగుస్మాభిః కర్తవ్యం కిమతః పరమ్ | ఇతి భూమౌ మహా೭నర్థే జాతే పరమ దారుణ. 17 నిర్జరాః సజరా జాతా హవిర్బాగాద్యభావతః | రురోధ స తదా దైత్యో నగరీ మమరావతీమ్. 18 అశక్తాస్తే నతే యోద్దుం వజ్రదేహాసురేణ చ | పలాయనం తదా కృత్వా నిర్గతా నిర్జరాః క్వచిత్. 19 నిలీయ గిరి దుర్గేషు రత్నసాను గుహాసు చ | సంస్థితాః పరమాం శక్తిం ధ్యాయంతస్తే పరాంబికామ్. 20 అగ్నౌ హోమాద్యభా వాత్తు వృష్ట్యభావో ప్యభూన్నృప | వృష్టే రభావే సంశుష్కం నిర్జలం చాపి భూతలమ్. 21 కూప వాపీతటాకాశ్చ సరితః శుష్కతాం గతాః | ఆనావృష్టి రియం రాజన్న భూచ్చ శతవార్షికీ. 22 మృతాః ప్రజాశ్చ బహుధా గోమహిష్యాదయ స్తథా | గృహే మనుష్యాణా మభవ చ్చవసంగ్రహః. 23 అనర్థేత్వేవ ముద్బూతే బ్రాహ్మణాః శాంతచేతసః | గత్వా హిమవతః పార్శ్వే రిరాధయిషవః శివామ్. 24 సమాధిధ్యాన పూజాభి ర్దేవీం తుష్టుపు రన్వహమ్ | నిరాహారా స్తదాసక్తా స్తామేవ శరణం యయుః. 25 దయాం కురు మహేశాని ! పామరేషు జనేషు హి | సర్వాపరాధయుకేషు నైత చ్ల్చాఘ్యణం తవాంబికే. 26 కోపం సంహర దేవేశి సర్వాంతర్యామిరూపిణిః | త్వయా యథా ప్రేర్యతే೭యం కరోతి స తథా జనః. 27 నాన్యా గతి ర్జన స్యాస్య కిం పశ్యసి పునః పునః | యథేచ్ఛసి తథాకర్తుం సమర్థా೭సి మహేశ్వరి ! 28 అనాటినుండి విప్రులు వేదములు మఱచిరి. అందుతే స్నానసంద్యాదులు నిత్సహోమములు శ్రాద్ధజపములు లోపించెను. భూమిపై పెద్ద యల్లకల్లోలము బయలుదేరును. ఏమి ఈ వింత! యని విప్రులు తమలోతా మనుకొనిరి. వేదములులేక మేమేమి చేయగలమని వారనిరి. అపుడు భూమిపై నున్న వారికి భరింపరాని యనర్థము చుట్టకొనెను. హవిర్బాగములు లభించనందువలన నిర్జరులు ముసలివారలైరి. అపుడు దుర్గము డమరావతిపై దండెత్తెను. వజ్రకాయుడగు దైత్యునితో బోరాడజాలక దేవతలు పలాయనము చిత్తగించిరి. దేవతలు గిరి దుర్గములందలి రత్న సానువులందును గుహలందును దాగి యుండి పరాంబికాశక్తిని మనసార ధ్యానించుచుండిరి. అగ్నిలో హోమములు లేనందున వానలు కురియుటలేదు. వర్షములు లేనందున నేల యెండి బీటలు పాఱను. ఎల్లబావులు-దిగుడు బావులు-చెఱవులు-నదులు-నింకిపోయెను. ఈ యనావృష్టి నూఱండ్లవఱ కుండెను. అపుడు లెక్కకు మిక్కిలిగ జనులు-ఆవులు-పశువులు-చనిపోయెను. ప్రతి యిల్లు పీనుగుల పెంటతో నిండెను. ఇన్ని యనర్థములు వాటిల్లగశాంతచిత్తులగు బ్రాహ్మణులు హిమగిరికేగి శ్రీశివాపరాంబిక నారాధింపదలంచిరి. వారాకలిదప్పులు మాని శ్రీమాతృదేవికి శరణాగతులై సమాధి-ధ్యాన-పూజలతో దేవిని సంతుష్టి పఱచిరి. ఓ మహేశ్వరీ! యంబికా! మేము పామరులము. సర్వాపరాధులము. మమ్ము కనికరించు మమ్మా. మమ్మింతగ కోపించుట తగ దమ్మా. ఓ దేవేశ్వరీ! సర్వాంతర్యామినీ! తల్లీ! కోపించకుము. నీ వెట్లు ప్రేరించిన నట్లే జరుగును గదా. ఇపుడు మాకు నీవు తక్క వేరే దిక్కులేదు. మహేశ్వరీ! నీ వెట్లు తలంతువో యట్లు చేయుటకు శక్తురాలవు. సముద్ధర మహేశాని: సంకటా త్పరమోత్ధితాత్ | జీవనేన వినాస్మాకం కథం స్యాత్థ్సితి రంబికే. 29 ప్రసీద త్వం మహేశాని: ప్రసీద జగదంబికే | అనంతకోటి బ్రహ్మాండ నాయికే తే నమోనమః. 30 నమః కూటస్వరూపాయై చిద్రూపాయై నమోనమః | నమో వేదూంతవేద్యాయై భువనేశ్యై నమోనమః. 31 నేతి నేతీతి వాక్యై ర్యా భోధ్యతే సకలాగమైః | తాం సర్వకారణాం దేవీం సర్వభావేన సన్నతాః. 32 ఇతి సంప్రార్ధితా దేవి భువనేశీ మహేశ్వరీ | అనంతాక్షిమయం రూపం దర్శయామాస పార్వతీ. 33 నీలాంజన సమప్రఖ్యం నీల పద్మాయతేక్షణమ్ | సుకర్కశ సమోత్తుంగ వృత్తపీన ఘనస్తనమ్. 34 బాణముష్టిం చ కమలం పుష్పవల్లవమూలకాన్ | శాకాదీన్పల సంయుక్తా ననంతరస సంయుతాన్. 35 క్షుత్తృడ్ జరాపహాన్ హసై#్తర్బిభ్రతీ చ మహాధనుః | సర్వ సౌందర్యసారం తద్రూపం లావణ్య శోభితమ్. 36 కోటిసూర్య ప్రతీకాశం కరుణారస సాగరమ్ | దర్శయిత్వా జగద్ధాత్రీ సా೭నంతనయనోద్బవా. 37 మోచయామాస లోకేషు వారిధారాః సహస్రశః | నవరాత్రం మహావృష్టి రభూన్నేత్రోద్బవైర్జలైః. 38 దుఃఖితా న్వీక్ష్య సకలా న్నేత్రాశ్రూణి విముంచతీ | తర్పితా స్తేన తేరోకా ఓషధ్యః సకలా అపి. 39 నదీనద ప్రవాహా సై#్తర్జలైః సమభవ న్నృప | నిలీయ సంస్థితాః పూర్వం సురాస్తే నిర్గతా బహిః. 40 మిలీత్వా ససురా విప్రా దేవీం సమభితుష్టువు | నమో వేదాంతవేద్యే తే నమో బ్రహ్మాస్వరూపిణి. 41 స్వమాయయా సర్వజగద్విధాత్ర్యై తే నమోనమః | భక్తకల్పద్రుమే దేవి భక్తార్థం దేహధారిణి. 42 అమ్మా! మహేశానీ! ఈ ఘోర సంకటమునుండి మమ్ము కడతేర్చుమమ్మా! జీవనమైన నీరే లేనిచో మే మెట్లు జీవింపగలము. సర్వేశ్వరీ! ఓ జగదంబికా! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికా! నీకు నమస్కారమమ్మా! మాయోడల సుప్రసన్నురాలవు గమ్ము. నీవు కూటస్వరూపిణివి. వేదాంతవేద్యవు-చిద్రూపిణివి-త్రిభువనేశ్వరివి. నీకు వందనములు తల్లీ! ఎల్ల వేదములు సర్వమును త్రోసిపుచ్చి ఏ యేకైక పరాదేవతనే భావించునో యట్టి సర్వకారణకు నుతులు. అట్లు బ్రాహ్మణులు సన్నుతింపగ త్రిభువనేశ్వరి-మహేశ్వరి-యగు పార్వతి యనంతనేత్రములతో వారికి ప్రత్యక్షమయ్యెను. ఆమె నల్లని కాటుక కొండవలె నుండెను. ఆమె కన్నులు నల్లకమలమువలె నెసగెను. ఆమె స్తనము లెత్తుగ బిగి వట్రునలుగ నలరెను. అమె తన చేతులందు కమలము-బాణము-కారగాయలు-సరసములైన తీయనిపండ్లు-పూలు-చిగులుటాకులు- దాల్చెను. ఆమె చేత నున్న వన్నియు నాకలిదప్పులు పోగొట్టునవి. ఆమెచేత చాపమును గలదు. ఆమె యందాల కందాలరాశి. లావణ్యసీమ. ఆమె సూర్యకోటిసమాన-దయారస తరంగిణి-జగద్ధాత్రి-అనంత నయనములతో నుద్బవించినది. ఇట్లు దేవి ప్రత్యక్షమయ్యెను. ఆ తల్లి తన యన్ని వేల కన్నులనుండి లోకములందు వర్షధారలు కురుసెను. దేవి కంటి నీటిధారలు నవరాత్రములు కుంభవృష్టిగ గురిసెను. ఆ తల్లి దుఃఖార్తులను గాంచి కన్నీరు వదలి లోకముల నన్నిటిని సంతృప్తి పఱచెను. మఱల నేలపై నోషధు లుద్బవించెను. రాజా! ఆ జలములచే నదీనదములు దరులుతన్ని ప్రవహింపసాగెను. మున్ను దిగియున్న దేవతలు బయటి కేతెంతిరి. అపుడు బ్రహ్మణులు దేవత లెల్లరును గలిసి శ్రీదేవి నిటుల నభినుతించిరి. ఓ వేదాంతవేద్యా! బహ్మస్వరూపిణీ! నీకు నమస్కారము. తన మాయచే లోకములు సృజించు తల్లికి నమస్కారము. భక్తుల పాలిటి కల్పతరువా! దేవీ! నీవు భక్త సంరక్షణకు దేహము దాల్చితివి. నిత్యతృప్తే నిరుపమే భువనేశ్వరి తే నమః | అస్మ చ్ఛాంత్యర్థ మతులం లోచనానాం సహస్రకమ్. 43 త్వయా యతో ధృతం దేవి శతాక్షి త్వం తతో భవ | క్షుధయా పీడితా మాతః స్తోతుం శక్తిన్నచా೭స్తినః. 44 కృపాం కురు మహేశాని వేదా నప్యాహ రాంబికే | వ్యాసః : ఇతి తేషాం వచః శ్రుత్వా శాకాన్స్వ కరసంస్థితాన్. 45 స్వాదూని ఫలములాని భక్షణార్థం దదౌ శివా | నానా విధాని చాన్నాని పశుభోజ్యాని యాని చ. 46 కామ్యానంతరసైర్యుక్తా న్యానవీనోద్బవం దదౌ | శాకంభరీతి నామా೭పి తద్దినాత్సమభూన్నృప. 47 తతః కోలాహలే జాతే దూతవాక్యేన బోధితః | ససైన్యః సాయుధో యోద్ధుం దుర్గమాఖ్యో೭ సురో య¸°. 48 సహస్రాక్షౌహిణీయుక్తః శరాన్ముంచం స్త్వరానితః | రురోధ దైవసైన్యం తద్యద్దేవ్యగ్రే స్థితం పురా. 49 తథా విప్రగణం చైవ రోధయామాస సర్వతః | తతః కిలకిలాశబ్దః సమభాద్దేవమండలే. 50 త్రాహి త్రాహీతి వాక్యాని ప్రోచుః సర్వే ద్విజామారాః | తత స్తే జోమయం చక్రం దేవానాం పరితః శివః. 51 చకార రక్షణార్థాయ స్వయం తస్మా ద్బహిః స్థితా | తతః సమభవద్యుద్ధం దేవ్యా దైత్యస్య చోభయో. 52 శరవర్ష సమాచ్ఛన్న సూర్యమందల మద్బుతమ్ | పరస్పరశరోద్ఘర్ష సము ద్బూతాగ్ని సుప్రభమ్. 53 కఠోర జ్వా రణత్కారబధిరీ కృత దిక్తటమ్ | తతో దేవి శరీరాత్తు నిర్గతా స్తీవ్రశక్తయః. 54 కాళికా తారిణీ బాలా త్రిపురా భైరవీ రమా | బగళా చైవ మాతంగీ తథా త్రిపుర సుందరీ. 55 కామాక్షీ తులజాదేవీ జంభినీ మోహినీ తథా | ఛిన్నమస్తా గుహ్యకాళీ దశసాహస్రబాహుకా. 56 నిత్యతృపా: భువనేశ్వరి! సాటిలేనిదానా! నీకు నమస్కారము. నీవు మా యెల్లర సుఖశాంతులకొఱకు వేయి కన్నులతో వెల్గుచున్నావు. పెక్కు కన్నులుంట నీవు శతాక్షియను పేర ప్రసిద్ధి గాంచుము తల్లీ! అమ్మా! ఆకలిదప్పులచే పీడితులమైన మాకు నిన్ను నుతింప శక్తి చాలకున్నది. అంబికా! మహేశానీ! దయయుంచి వేదములు మాకిమ్ము. అను వారి మాటలు శివాభగవతి వినెను. ఆమె చేతులలోని కూరగాయులు తీయని ఫలమూలములు వారికి తినుట కొసంగెను. ఆ తల్లి వారికి వివిధ భక్ష్యభోజ్యములు నొసంగెను. పశు వుల మేత మొసంగెను. రాజా! ఆమె నవసరము లొలుకుకోర్కులు తీర్చునట్టివి-మరల కొత్త పంటలు పండువరకు సరిపోవునవి- అగు శాకము లొసంగుటవలన నానాటినుండి శాకం భరినామ మున పెరెన్నిక గనెను. పిమ్మట దుర్గమాసురుడు గొప్ప యల్లకల్లోలము జరుగుచున్నదని తన దూతవలన విని ససైన్య ముగ సాయుధుడై బయలుదేరెను. అతడు వేయి యక్షౌహిణుల సేనలతో వచ్చి వేగమున శరములు వదలుచు దేవి చెంత నున్న దేవసైన్యము నెదుర్కొనెను. మఱియు నతడు బ్రాహ్మణుల గుంపుల నడ్డగించెను. అపుడు దేవగణములు గగ్గోలు పడెను. విప్రులుమను దేవతలను త్రాహి త్రాహీ యను కేకలు వేసిరి. శివాదేవి వారి మొఱ యాలించి దేవతల చుట్టు తేజోమయ చక్రము నిర్మించెను. అది వారికి శ్రీరామరక్షగ నుండెను. దేవి బయట నిర్బయముగ నిలుచుండెను. ఆపుడు దేవీ దైత్యుల మధ్య నిర్వురకు ఘోర సమరము సంఘటిల్లెను. వారి బాణవర్షమువలన సూర్యమండలము కనిపించకుండెను. బాణముల యొండొంటి తాకుడువలన నిప్పురవ్వలు దుముకుచుండెను. వారి గట్టి యల్లెత్రాటి టంకారముతో దిక్కులకు చెవుడు వచ్చెను. అట్టి యుద్ధ సమయమునందు దేవి శరీరమునుండి పలుతీవ్రశక్తు లుద్బవించిరి. వారు కాళిక-తారిణి-బాల-త్రిపుర-భైరవి-రమ-బగళ-మాతంగి-త్రిపురసుందరి-కామాక్షి-తులజాదేవి-జంభిని-మోహిని-ఛిన్నమస్త-గుహ్యాకాళి-దశసహస్ర బాహుక-యనబరగువారు. ద్వాత్రింశ చ్బక్తయశ్చాన్యా శ్చతుష్టష్టిమితాః పరాః | అసంఖ్యాతా స్తతో దేవ్యః సముద్బూతాస్తు సాయుధాః. 57 మృదంగశంఖవీణాది నాదితం సంగరస్థలమ్ | శక్తిభిర్దైత్యసైన్యే తు నాశితే೭క్షౌహి ణీశ##తే. 58 అగ్రేసరః సమభవ ద్దుర్గమో వాహినీపతిః | శక్తిభిః సహ యుద్దం చ చకార ప్రథమం రివుః. 59 మహద్యుద్ధం సమభవ ద్యత్రాభూ ద్రక్తవాహినీ | అక్షౌహిణ్యస్తు తాః సర్వా వినష్టా దశభిర్దనైః. 60 తత ఏకాదశే ప్రాప్తే దినే పరమదారుణ | రక్తమాల్యాంబరధరో రక్తగంధాను లేపనః. 61 కృత్వోత్సవం మహాంతం తు యుద్ధాయ రథసంస్థితః | సంరంభేణౖవ మహతా శక్తీః సర్వా విజిత్య చ. 62 మహాదేవీరథా గ్రేతు స్వరథం సంన్యవేశయత్ | తతో೭భవ న్మహ ద్యుద్ధం దేవ్యా దైత్యస్య చోభయోః. 63 ప్రహరద్వయ పర్యంతం హృదయత్రాసకారకమ్ | తతః పంచదశాత్యుగ్ర బాణాన్దేవీ ముమోచ హ. 64 చతుర్బి శ్చతురో వాహాన్బాణనై కేన సారథిమ్ | ద్వాభ్యాం నేత్రేభుజౌ ద్వాభ్యాం ధ్వజమేకేన పత్రిణా. 65 పంచభిర్హృదయం తస్య వివ్యాధ జగదంబికా | తతో వమ న్స రుధిరం మమార పుర ఈశితుః. 66 తస్య తేజస్తు నిర్గత్య దేవీరూపే వివేశ హ | హతే తస్మి న్మహావీర్యే శాంత మాసీజ్జగత్త్రయమ్. 67 తతో బ్రహ్మాదయః సర్వే తుష్టువుర్జగదంబికామ్ | పురస్కృత్య హరీశానౌ భక్త్యా గద్గదయా గిరా. 68 దేవా ఊచుః : జగద్బ్రమ వివర్తైక కారణ పరమేశ్వరీ | నమః శాకంభరి శివే నమస్తే శతలోచనే. 69 సర్వోపనిష దుద్ఘుష్టే దుర్గమా సురనాశిని | నమో మాయేశ్వరి శివే పంచకోశాంతరస్థితే. 70 వీరుకాక మఱి ముప్పదిరెండు మంది-తర్వాత నరువదినల్గురు-నటుతర్వాత లెక్క పెట్టరానంత మంది- దేవి దివ్యావ యవములనుండి సాయుధలై యుద్బవించిరి. ఆ శక్తులందరవలన దైత్యుని నూఱక్షౌహిణుల సేన తుదముట్టెను. రణరంగమున మృదంగ-శంఖ-వీణాధ్వనులు మిన్ను ముట్టెను. అపుడు సేనాపతియగు దుర్గమాసురుడు మొట్టమొదట ముందునకు దుమికి భిన్నశక్తులతో పోర తలపడెను. అట్లు పది దినములు జరిగిన భీకర యుద్ధములో కొన్ని యక్షౌహిణుల సైన్యము హత మయ్యెను. నెత్తురు టేర్లు ప్రవహించెను. అతడు పడునొకండవనాడు రక్తమాల్యంబరంబులు దాల్చి రక్తగంధము పూసికొనెను. అతడు పెద్ద పండుగ జరుపుకొని మహా సంరంభముతో రథమెక్కివచ్చి యెల్లశక్తుల నోడించెను. అతడు పిదప తన రథమును శ్రీపరాశక్తి రథము నెట్ట యెదుటికి పోనిచ్చెను. అపుడు దేవి దైత్యుల మధ్య ద్వంద్వయుద్ధము జరిగెను. వారి మధ్య చూపఱు గుండె లవియునట్టుల పోరు ఘోరముగ రెండుజాములు జరిగెను. పిమ్మట దేవి పదునైదు తీవ్రబాణములు వదలెను. వానిలో నాల్గింటివలన నాల్గు గుఱ్ఱములు-నొక్క బాణమున సారథిని-రెంట వాని కండ్లను-రెంట భుజములు-నొక్కట టెక్కమును-ఐదింట వాని యెడదను-వ్రయ్యవ్రయ్యలుచేసి వేసెను. వాడు నోట నెత్తురు గ్రక్కుచు శ్రీదేవి సన్నిధిలో నసు వాలు పాసెను. వానినుండి యొక దివ్యతేజము వెలువడి దేవిలో ప్రవేశించెను. బలశాలియగు దైత్యుడు చావగనే యెల్లలోక ములు సంతసిల్లెను. ఆ సమయంబున బ్రహ్మాదులు హరిహరాదులను ముందుంచుకొని పరాభక్తితో మధురవాక్కులతో జగ దంబిక నీ విధముగ నన్నుతించిరి. ఓ పరమేశ్వరీ! శాకంభరీ! శతాక్షీ! శివా ! బ్రహ్మాండగోళము లెల్ల భ్రమించి పరిభ్రమిం చుట నీవే మూలకారణము. సకలోపనిషత్తులచేత సుతింపబడు జ్ఞానస్రనూనాంబవు నీవే. ఓ దుర్గమాసుర విభంజనీ! జయ మంగళ స్వరూపిణీ! పంచకోశాంతర సంస్థితా! మాయేశ్వరీ ! నీ కివే మా వందనశతంబులు. చేతసా నిర్వికల్పేన యాం ధ్యాయంతి మునీశ్వరాః | ప్రణనార్థ స్వరూపాం తాం భజాయో భువనేశ్వరీమ్. 71 అనంతకోటి బ్రహ్మాండ జననీం దివ్యవిగ్రహామ్ | బ్రహ్మవిష్ణ్వాది జననీం సర్వభావైర్నతా వయమ్. 72 కః కుర్యాత్పామరా న్దృష్ట్వా రోదనం సకలేశ్వరః | సదయాం పరమేశానీం శతాక్షీం మాతరం వినా. 73 ఇతి స్తుతా సురైర్దేవీ బ్రహ్మవిష్ణ్వాదిభిర్వరైః | పూజితా వివిధై ర్ద్నవ్యైః సంతుష్టాభూచ్చ తత్‌క్షణ. 74 ప్రసన్నా సా తదా దేవీ వేదానాహృత్య సా దదౌ | బ్రాహ్మణభ్యో విశేషేణ ప్రోవాచ పికభాషిణీ 75 మమేయం తనురుత్కృష్టా పాలనీయా విశేషతః | యయా వినార్థ ఏష జాతో దృష్టో೭೭ధునైవ హి. 76 పూజ్యా೭హం సర్వదా సేవ్యా యుష్మాభిః సర్వదైవ హి | నాతః పరతరం కిం చిత్కల్యాణా యోపదిశ్యతే. 77 పఠనీయం మమైతద్ధి మాహాత్మ్యం సర్వదోత్తమమ్ | తేన తుష్టా భవిష్యామి హరిష్యామి తథా೭೭ పదః. 78 దుర్గమాసుర హంత్రీత్వా ద్దురేతి మమ నామ యః | గృహ్ణాతి చ శతాక్షీతి మాయాం భిత్త్వా వ్రజత్యసౌ. 79 కిముక్తేనాత్ర బహునా సారం వక్ష్యామి తత్త్వతః | సంసేవ్యా೭హం సదా దేనాః సర్వైరపి సురాసురైః. 80 ఇత్యుక్త్వా೭ంతర్హితా దేవీ దేవానాం చైవ పశ్యతామ్ | సంతోషం జనయంత్యేవం సచ్ఛిదానందరూపిణీ. 81 ఏతత్తే సర్వమాఖ్యాతం రహస్యం పరమం మహత్ | గోపనీయం ప్రయత్నేన సర్వకల్యాణకారకమ్. 82 య ఇమం శృణుయా న్నిత్యమధ్యాయం భక్తి తత్పరః | సర్వాన్కా మా నవాప్నోతి దేవీలోకే మహీయతే. 83 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే ష్టావింశో೭ధ్యాయః. ఏ త్రిభువనేశ్వరి నెల్లమునులు నిర్మల-నిశ్చలచిత్తములతో నను ధ్యానింతురో యట్టి ప్రణవస్వరూపిణీ! జననీ! నీ కివే మా వందనశతంబులు. అనంతకోటి బ్రహ్మాండ జనయిత్రీ! బ్రహ్మవిష్ణ్వాదుల జననీ! దివ్యమంగళమూర్తియగు జగద్ధాత్రీ! నీ కివే మా వందనశతంబులు. నీవు దయామతల్లివి-పరమేశ్వరివి-విశ్వైకమాతవు-శతాక్షీ మాతవు. కాబట్టి పామరులమైన మమ్ముజూచి యేడ్చితివి. నీవు తక్క సర్వేశ్వరుడు నట్లు చేయడు. అని బ్రహ్మవిష్ణువు మొదలుగాగల దేవతలు దేవిని నుతించి వివిధ ద్రవ్యములతో సంపూజించిరి. దేవి యదే క్షణమున సంతుష్టురాయ్యెను. పికభాషిణియగు దేవి ప్రసన్నయై వేదములు దెచ్చి విప్రుల కొసంగి యిట్లు పలికెను. ఇవి నా యుత్తము శరీరమువంటివి. వీనిని చక్కగ భద్రముగ రక్షింపుకొనుడు. ఇవి లేనందున గల్గిన యనర్థము. మీ రిపుడే సనిదర్శనముగ జూచితిరి గదా. నన్ను నిరంతరముగ పూజింపుడు. సంసేవింపుడు. మీ మేలు వెల్గుగోరి నేనిదంతయును చెప్పుచున్నాను. నా యీ యుత్తమ దివ్యమహాత్మ్యమును మీరలు సతతము పఠించుడు. దానివలన నేను సంతుష్టిజెంది మీ కోరిక లెల్ల దీర్చగలను. దుర్గమాసురుని దెగటార్చుటవలన గల్గిన దుర్గానామమును శతాక్షీనామము నుచ్చరించినవాడు మాయను దాటి పరమపదము జేరగలడు. వేయేల? ఒక ముఖ్య విషయ మేమన సురాసురు లెల్లరును నన్నే సదాగతిగ సతము సేవింపవలయును. అని సచ్చిదానంద స్వరూపిణి యెల్లవారికి సంతోషము గల్గించుచు నచటనే యెల్ల దేవతలు చూచుచుండగ నదృశ్య యయ్యెను. ఈ విధముగ పరమకల్యాణకారకమగు శ్రీదేవి మహాత్మ్యము గూర్చిన రహస్యకథ నీకు వివరించితిని. దీనిని యత్నించి రహస్యముగ నుంచుము. ఎవ్వాడీ శ్రీదేవీ పరమాధ్యాయము విశ్వాత్మభావముతో భక్తిద్ధ్రలతో నాలించునో వాడిచట కోర్కె లెల్ల బడసి పిదప తప్పక శ్రీదేవీలోకము జేరలగలడు. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున నిరువదిఎనివిదవ యధ్యాయము.