Sri Devi Bagavatham-2
Chapters
అథ ధ్వాత్రింశో೭ధ్యాయః. శ్రీ దేవ్యువాచ: శృణ్వంతు నిర్జరాః సర్వే వ్యాహరంత్యా వచో
మమ| యస్య శ్రవణమాత్రేణ మద్రూపత్వం ప్రపద్యతే. 1 అహమేవాస పూర్వం తు నాన్యత్కించి న్నగాధిప | తదాత్మరూపం చితంవి త్పరబ్రహ్మైక నామకమ్. 2 అప్రర్త్యతమనిర్దేవ్య మనౌపమ్య మనానయమ్ | తస్య కాచిత్స్వతః సిద్ధా శక్తి ర్మాయేతి విశ్రుతా. 3 న సతీ సా నసతీ సా నోభయాత్మా విరోధతః | ఏతద్విలక్షణా కాచి ద్వస్తు భూతా೭స్తి సర్వదా. 4 పావకస్యోష్ణతెవేయ ముష్ణాంశోరివ దీధితిః | చంద్రస్య చంద్రికీ తే వేయం మమేయం సహజా ధ్రువా. 5 తస్యాం కర్మాణి జీవానాం జీవాః కాలశ్చ సంచరే | అభేదేన వివలీనాః స్యు సుషుప్తౌ వ్యవహారవత్ . 6 స్వశ##క్తేశ్చ సమాయోగ దహం బీజాత్మతాం గతా | స్వాధారావరణా త్తస్యా దోషత్వం చ సమాగతమ్. 7 చైతన్యస్య సమాయోగా న్మిమిత్తత్వం కధ్యతే | ప్రపంచపరిణామా చ్చ సమవాయత్వ ముచ్యతే. 8 కేచి త్తాంతవ ఇత్యాహూ స్తమః కేచిజ్జడం పరే ! జ్ఞానం మాయాం ప్రధానం చ ప్రకృతిం శక్తి మవ్యజామ్. 9 విమర్శ ఇతి తాం ప్రాహుః శైవశాస్త్ర విశారదాః | అవిద్యా మితరే ప్రాహుర్వేద తత్త్వారధ చింతకాః 10 ఏవం నానావిధాని స్యు ర్నామాని నిగమాదిషు | తసా జడత్వం దృశ్యత్వాత్ జ్ఞాననాశా త్తతో೭సత్యీ 11 చైత్యన్య స్య దృశ్యత్వం దృశ్యత్యే జడమేవతత్| స్వప్రకాశం చ చైతన్య మ పరేణ ప్రకాశితమ్. 12 ముప్పదిరెండవ అధ్యాయము - శ్రీదేవీగీతలు శ్రీ దేవి యిట్లనెను: దేవతలారా! సావధానముగ నా పలుకులు వినుడు: వానిని విన్నంత మాత్రాన నా సారూప్యము సిద్దింపగలదు. ఓ పర్వతరాజా! ఈ సృష్టికి పూర్వము నే నొక్కతే నుంటిని. ఇతరము లేదు. అట్టి నన్నే అత్మరూపమని- చిత్తని- బ్రహ్మమని యుందరు. అత్మ యనుమానమునకు సర్వ లక్ష్యములకు ఉపమానములకు జన్మమరణాది వికాములకు నతీతము. నా యాత్మ యొక్క సహజ సిద్దశక్తిని మాయ యందురు. ఈ మాయ సత్తుగాదు (ఉన్నది అనుటకు తగదు.) అసత్తుగాదు(ఇది లేకవ్యవహరముసాగదు.) ఈ యుభయముగాదు. ఈ మాయకంటె విలక్షణమైన యొక వస్తువు నిత్యమై వెల్గును. అగ్ని నుండి వేడిమి రవి నుండి కిరణములు జాబిల్లి నుండి వెన్నెలలు వెల్వడు నటులహయ నా యాత్మ స్వరూపమునుండి సహజముగ తప్పక కల్గును: గఢసుషుప్తిలో వ్యవహరము లన్నియునడంగును. అటులే మాయలో నెల్లజీవులు- జీవకర్మలు-కాలము సర్వము నొక్కటియై విలయ మొందును. నేను నిర్గుణను. ఐనను మాయాశక్తి సంయోగమున నెల్ల జీవులు - జీవర్మలు - కాలము సర్వము నొక్కటియై విలయమొందును. నేను నిర్గుణను. ఐనను మాయాశక్తి సంయోగమున నెల్లలోకములకు కారణరూపిణినైతిని. ఇది నన్నే యావరించియుండుటవలన దానిలో నావరణదోషము గలదు. ఈ మాయ చైతన్యముతో గలిసినపు డది జగములకు నిమిత్తకారణ మగును. ఈ ప్రపంచ పరిణామములు మాయసమవాయి ను కారణమగుటచే జరుగును. ఇటి మాయనుతపమని - తమమని జడమని - జ్ఞానమనని-మాయయని- ప్రకృతియని -ప్రధానమని-శక్తియని- అజయని పల్వురు పలువిధమువ పలుకుదురు. శైవాగమ వీశారదులు దీనిని విమర్శ మందురు. వేదతత్త్వార్ద చింతకులు దీనిని ఆ విద్య యందురు. ఇట్లు మాయకు నిగమాగమములందు పెక్కు పేర్లు గలవు. మాయ దృశ్యమగుటవలన జడమని జ్ఞానమును నశింపచేయుటవలన అసత్తు. మిధ్య అని యందురు. ఈ కనిపించున దంతయును జడమే శుద్ధచైతన్యము దృశ్యముగదు కనుక జడముగాదు. చైతన్యము స్వయంప్రకాశము. ఇతరముచే ప్రకాశింపచేయబడదు. అనవ స్థా దోషసత్త్వాన్న స్వేనాపి ప్రకాశితమ్ | కర్మ కర్త్రీవిరోధః స్యాత్తస్మాత్త ద్దీప వత్స్వయమ్. 13 ప్రకాశమాన మన్యేషాం భాసకం విద్ది పర్వత | అతఏవచ నిత్యత్వం సిద్ధం సంవిత్తనో ర్మన. 14 జాగ్రత్స్వప్నసుషుప్త్యాదౌ దృశ్యస్య వ్యభిచారతః | సంవిదో వ్యభిచారశ్చ నాను భూతో೭స్తి కర్హిచిత్. 15 యదితస్యాప్యను భనవస్తర్యయం యేన సాక్షిణా| అనుభూతః స ఏవాత్ర శిష్టః సంవిద్వపుః పూరా. 16 అత ఏవ చ నిత్యత్వం ప్రోక్తం సచ్చా స్త్ర కోవిధైః | ఆనందరూపతా చాస్యాః పరప్రేమాస్పదత్వతః 17 మా న భూవం హి భూయాసమితి ప్రేమాత్మని సితమ్ | సర్వస్యాన్య స్య మిధ్యాత్వా దసందత్వణ స్పుటం మమ. 18 అపరిచ్చిన్నతా೭ప్యేవ మత ఏప మతా మమ | తచ్చ జ్ఞానం నాత్మధర్మోధర్మత్వే జడతా೭೭త్మనః 19 జ్ఞానస్య జడశేషత్వం న దృష్టం న చ సంభవి| చిద్దర్మత్వం తథా నాస్తి చితశ్చి న్నహి భిద్యతే. 20 తస్మా దాత్మా జ్ఞానరూపః సుఖ రూప శ్చ సర్వదా | సత్యః పూరో೭ప్య సంగశ్చ ద్వైతజాల వివర్జితః 21 సపునః కామ కర్మాది యుక్తయా స్వీయమాయమా | పూర్వాను భూత సంస్కారా త్కాల కర్మ విపాకతః. 22 అవివేకా చ్చ తత్త్వస్య సిసృక్షా వాన్ర్పజాయతే | అబుద్ది పూర్వః సర్గోయం కధితస్తే నగధిప. 23 ఏతద్ది యమ్మయా ప్రోక్తం మమరూప మలౌకికమ్ | అవ్యాకృతం తదవ్యగ్రం మాయాశబలమిత్యపి. 24 ప్రోచ్యతే సర్వశాస్త్రషు సర్వాకారణకారణమ్ | తత్త్వానా మాది భూతం చ సచ్చి దానంద విగ్రహమ్. 25 చైతన్యమును ప్రకాశిత మనుకొన్న మఱి దానినెవరు ప్రకాశింపజేతురను అనవస్దదోష మేర్పడును. ఒకేకాలముననొకే వస్తువునకు కర్తృత్వము - కర్మత్వము నుండవు. కనుక చైతన్య వస్తువు దీపమువలె స్వయంప్రకాశ వస్తువని తెలియవయును. గిరిరాజా ! చైతన్యము స్వయంప్రకాశ##మై పరులను ప్రకాశింపజేయును. కనుక అజ్ఞాన స్వరూపము నిత్యము సత్యము. జాగ్రత్-స్వప్న-సుషువ్తులందు దృశ్యమునుకు వ్యభిచారము (అన్ని కాలములందును లేకపోవుట) గల్గును. కాని దివ్య జ్ఞానమున కెన్నడును వ్యభిచార మనునది (అనగా అన్ని కాలములందు నుండుకుండుట) లేదు. ఒకవేళ ఉన్నద్వనుకొన్నను దాని నెఱుగు సాక్షియునువా డొకడు గలడు. జ్ఞానము నిత్యమనియు సాక్షి యెఱుంగుననియు నెల్లరికి విదితమే కదా ! కనుక సచ్ఛాస్త్రవిదులగు కోవిదులు జ్ఞానము నిత్యము. పరమప్రేమ కాలవాల మగుట నది సచ్చిదానందరూపము. అనియు వక్కాణింతురు. ఈ యానందము ప్రేమలోనే యుండును. కనుక నేనున్నాననుట కంటె నేను బాగుగ నున్నానని ప్రతివాడు ననును. ఇందువలనను మఱియు జగము మిధ్య యగుట వలనను నాకు సంగదోషము లేదు. లోకమందలి యే ధర్మమందై నను జడత్వము- పరిచ్చిన్నత్వము నుండును. జ్ఞాన మాత్మ ధర్మముగాదు. జ్ఞానమాత్మయే. అది యపరిచ్చిన్నము. జ్ఞానము చిత్స్వరూపము. అందుచే దానికి జడత్వముండుటగాని యున్నట్లు చూడబడుటగాని జరుగదు. చిత్పదార్దము-చిత్తు-నొకటే కనుక ఆత్మ-జ్ఞానము-ఆనందము-నిత్యము-సత్యము-పరిపూర్ణము-నిస్సంగము-ద్వైతజాలరహితము. అట్టియాత్మతన మాయ వలన తొల్లిటి సంస్కారములవలన కాల-కామ్యకర్మ పిరిపాకమువలన సృష్టికాముడగును. తత్త్వము నెఱుంగనం దున ఆత్మ సృష్టికి పూనుకొనును. ఓ నగరాజా! ఇట్టి సృష్టికార్యము కాలకర్మగుణ పరిపాకముననే సంభవించును గాని బుద్దిపూర్వకముగ జరుగు సృష్టిగాదు. నేను నీకు ప్రభోధించిన యీతత్త్వము నా సత్వరూపమే - ఇది లోతి కోత్తరము. లోకాతీతము. అవ్యాకృతము-అవ్యగ్రము- మాయాశబలము. సర్వకారణ కారణమని సకల శాస్త్రములందును చెప్పబడెను. నా యీ పరతత్త్వము తత్త్వములన్నిటికి మూలకారణము-సచ్చిదానంద విగ్రము. సర్వ కర్మఘనీభూతమిచ్చా జ్ఞాన క్రియాశ్రయమ్ | హ్రీంకారమంత్ర వాచ్యం తదాది తత్త్వం తదుచ్యతే. 26 తస్మా దాకాశ ఉత్పన్న ః శబ్దతన్మాత్రరూపకః | భ##వేత్స్పర్శాత్మకోవాయుస్తేజోరూ పాత్మకం పునః 27 జలం రసాత్మకం పశ్చాత్తతో గంధాత్మికా ధరా | శ##బ్దైతగుణ ఆకాశో వాయుః స్పర్శరవాన్వితః 28 శబ్దస్పర్శరూపగుణం తేజ ఇత్యుచ్యతే బుధైః | శబ్ద స్పర్శరూపరసై రాపో వేదగుణాః స్మృతాః 29 శబ్దస్పర్శరూపరసగంధైః పంచగుణా ధరా | తేభ్యో೭భవన్మహత్సూత్రం యల్లింగం పరిచక్షతే. 30 సర్వాత్మకం తత్సం ప్రోక్తం సూక్ష్మదేహో೭యమాత్మనః | అవ్యక్తం కారణో దేహః స చోక్తః పూర్వమేవహి. 31 యస్మిన్ జగద్మీజరూపం స్థితం లింగోద్బవోయతః | తతః స్థూలాని భూతాని పంచీకరణమార్గతః 32 పంచసంఖ్యానిజాయంతే తత్ర్పకారస్తథోచ్యతే | పూర్వోక్తాని చ భుతాని ప్రత్యేకం విభ##జేద్ద్విధా. 33 ఏకైకం భాగమేకస్య చతుర్ధా విభ##జేద్గిరే | స్వ స్వేతర ద్వితీయాంశే యోజనాత్పంచపంచత. 34 తత్కార్యం చ వీరాడ్దేః స్థూలదేహో೭యమాత్మనః | పంచభూతస్థ సత్త్వాంశైః శ్రోత్రాదీనాం సముద్బవః 35 జ్ఞానేంద్రియాణాం రాజేంద్ర ప్రత్యేకం మిలితై స్తు తైః | అంతః కరణమేకం స్యాత్ వృత్తిభేదాచ్చతుర్విధమ్. 36 యదాతు సంకల్పవి కల్ప కృత్యం తదాభ##వేత్తన్మన ఇత్యభిఖ్యమ్ | స్యాద్బుద్దిసంజ్ఞంచ యదాప్రవేత్తి సునిశశ్చితం సంశయహీనరూపమ్. 37 సర్వ కర్మల ఘనీభావము. ఇచ్చాజ్ఞాన క్రియాశ్రమము. నాతత్త్వము హ్రీంకార మంత్ర వాచ్యము ఆదితత్త్వమని పేర్కొనంబడుము. అట్టి నా మహత్తత్త్వము నుండి శబ్గ తన్మాత్రా రూపమగు ఆకాశ ముత్పన్నమయ్యెను. దాని నుండి స్పర్శతన్మాత్రగల వాయువు దాని నుండి తేజో రూపము గల్గేను. తేజమునుండి రసాత్మకమైన జలమును దాని నుండి గంధ గుణము గల భూమియు గల్గెను. ఆకాశమున కోశబ్ద గుణమే కలదు. వాయువునకు శబ్ద స్పర్శములు గలవు. తేజముశబ్దస్పర్శ-రూపములను గుణత్రయము గలదని బుధులందురు. జలమునందు శబ్ద-స్పర్శ-రూప-రసమాత్రలు గలవనీ పండితులందురు. శబ్దము - స్పర్శము- రూపము-రసము- గంధమను గుణ పంచికము గలది భూమి. వీనిఅటన్నిటికలయిక వలన మహత్సూత్రము గల్గెను. ఆది సర్వవ్యాపకము. దానినే లింగ దేహమనియు నందురు. ఈ లింగదేహము సర్వప ప్రాణాత్మకము. దీనినాత్మయొక్క సూక్ష్కమదేహమనియు వచింతురు. అవ్యక్తము కారణదేహము దానిని ముందే వచించితిని పరమాత్మ యొక్క రెండవ కారణ దేహము నందు జగద్బీజములుండును. ఆది లింగ దేహములకు కారణభూతము. పిమ్మట పంచీకృతము గాని పంచ భూతముల వలన స్థూల పంచభూతములు గల్గెను. ఇట్లు పంచీకరణము వలన పంచభూత సృష్ఠి గల్గిన ప్రకారము చెప్పబడుచున్నది. వెనుక చెప్పిన ప్రతి భూతమును రెండుగ విభజింపవలయును. పిదప ప్రతిభూతము యోక్క రెండవ భాగముతో తక్కిన భూతముల నాల్గవ భాగములు గల్పిన ఒకస్థూల మహిభూతమగును. ఇట్లు పంచీకృతమైన పంచమహాభూతముల కార్యమే విరాడ్దేహము. ఇది పరమాత్మ యొక్క మూడవ స్థూల దేహము. ఈ పంచ మహాభూతముల సతాలీంశము వలన శ్రోత్రాది జ్ఞానేంద్రియముల లోని ప్రతి దాని సత్త్వాంశము వలన నాల్గు భేదములు గల యంతఃకరణ మేర్పడును. దానిలో సంకల్ప వికల్పాత్మక వృత్తి గలది మనస్సు ఏ సంశయము లేక నశ్చయ జ్ఞాన వత్తి గలది బుద్ది యనబడును. అనుసంధానరూపము తచ్చిత్తం పరికీర్తితమ్ | అహంకృత్యాత్మ వృత్త్యా తు తదహంకారతాం గతమ్. 38 తేషాం రజోంశై ర్జాతాని క్రమాత్క ర్మేంద్రియాణిచ | ప్రత్యేకం మిలితైసై#్తస్తు ప్రాణోభవతి పంచధా. 39 హృది ప్రాణో గుదే೭పానో నాభిస్ధ స్తు సమానకః | కంఠదేశే೭ప్యుదానః స్యాద్వ్యానః సర్వశరీరగః 40 జ్ఞానేంద్రియాణి పంచైవ పంచకర్మేంద్రియాణిచ | ప్రాణాదిపంచకం చైవ ధియా చ సహితం మనః 41 ఏతత్సూక్ష్మ శరీరం స్యా న్మమ లింగం యదుచ్యతే | తత్రయా ప్రకృతిః ప్రోక్త్రా సారాజన్ద్వివిధాస్మృతా. 42 సత్త్వాత్మికా తు మాయా స్యాదవిద్యా గుణమిశ్రితా | స్వాశ్రయం యా తు సంరక్షే త్సామాయేతి నిగద్యతే. 43 తస్యాం యత్ర్పితిబింబం స్యా ద్బింబభూస్య చేశితుః | సు ఈశ్వరః సమాఖ్యతః స్వాశ్రయజ్ఞానవాన్పరః 44 సర్వజ్ఞః సర్వ కర్తాచ సర్వాసునుగ్రహకారకః | అవిద్యాయాం తు యత్కించి త్ర్పతిబింబం నగాధిప. 45 తదేవ జీవసంజ్ఞం స్యాత్సర్వ దుఃఖాశ్రయం పునః | ద్వయో రపీహ సంప్రోక్తం దేహత్రయ మవిద్యయా. 46 దేహత్రయాభిమానా చ్చాప్యభూన్నా మత్రయం పునః | ప్రాజ్ఞ స్తు కారణాత్మా స్యాత్యూక్ష్మ దేహీతుతై జసః 47 స్థూలదేహీ తు విశ్వాఖ్యాయస్త్రివిధః పరికీర్తితః | ఏవ మోకో೭పి సంప్రోక్త ఈశసూత్ర విరాట్పదైః 48 ప్రథమో వ్యష్టిరూప స్తు సమస్ట్యాత్మా పరఃస్మృతః | సహి సర్వేశ్వరః సాక్షా జ్జీవానుగ్రహకామ్యయా. 49 కరోతి వివిధం విశ్వం నానాభోగాశ్రయం పునః | మచ్చక్తి ప్రేరితో నిత్యం మయి రాజ న్ప్రకల్పితః 50 ఇతి శ్రీ దేవీభాగవతే మహీపురాణ సప్తమస్కంధే దేవీగితాయాం ద్వాత్రింశో೭ధ్యాయః చిత్తమను సంధాన పూపమైన వృత్తిగలది. నేనే చేయుచున్నానను నాత్మ వృత్తి - యహంకారమనబడును. తర్వాత పంచ మహ భూతముల రజోంశమున వాగాది కర్మేంద్రియంబు లుత్పన్నమగును. ప్రతికర్మేంద్రియము రజోంశమున ప్రాణాది పంచ వాయువులు గలుగును. ఆ వాయువులతో ప్రాణము హృదయమందును. ఈ పానము గుహ్య మందును వ్యానము నాభి యందును ఉదానము కంఠమందుము సమానము శరీరమంతటను నుండును. పంచజ్ఞానేంద్రియములు-పంచ కర్మేంద్రియములు-పంచప్రాణములు-మనో బుద్దులు మొత్తము పదనేడగును. ఈ మొత్తమును నా సూక్ష్మ శరీర మనియు లింగ శరీరమనియు నందురు. అందలి ప్రకృతి రెండు విధములుగ నుండును. అందు సత్త్వాత్మకమైన ప్రకృతి మాయగ గుణమయమగు ప్రకృతియవిద్యగపేర్కొనబడును. తన్నాశ్రయించిన దానిని రక్షించునది మాయ యమబడును మాయమందలి పరమాత్మప్రతిబింబమనే యీశ్వరుడందురు. ఈ యీశ్వరుడు వ్యాపక బ్రహ్మము నెఱుగగలడు. ఈశ్వ రుడు సర్వజ్ఞుడు- సర్వకర్త- సర్వానుగ్రహకారకుడు. ఓ నగపతీ! ఇక ఆనిద్య యందును పరమాత్మ ప్రతిబింబించును. అట్టి ప్రతిబింబమును జీవుడని చైతన్యమని యందురు. ఈశ్వర జీవులను వీరిర్వురును విద్యవలన మూడేసి దేహములుండును. వీరిర్వురికిని తమతమ మూడు దేహము లందు నభీమానముండుట వలన వీరికి మూడేసి పేర్లు గలవు. జీవుడు కారణ దేహీభి మానియైనపుడు ప్రాజ్ఞుడనియు సూక్ష్మదేహాభిమానియైనపుడు తైజసుడనియు స్థూలదేహభిమానియైనపుడు విశ్వుడనియు నందురు. ఇదే విధముగ నీశ్వరుడను పై యాభిమానముల వరుసగ ఈశుడు-సూత్రాత్మ-విరాట్టు ననబరగును. నీరిర్వురిలో జీవుడు వ్యష్టి దేహాభిమాని. ఈశ్వరుడు సమష్ఠి దేహీభమీని. ఈ సర్వేశ్వరుడు కేవలము జీవులనను గ్రహించు కోర్కె గల్గి యుండును. అట్టి తన కోర్కె సాధించుట కీశ్వరుడు జీవుల కొఱకు పెక్కుభోగభాగ్యముల కాటపట్టగు విశ్వమును చిత్ర విచిత్రముగ తల ప్రభావముతో విరచించును. అతడీ సృష్టినంత యును నా శక్తి ప్రేరణచేత నాయుందన్న వాడై రచించుచుండును. ఇది శ్రీదేవీ భాగవత మహాపుఱాణమందలి సప్తమ స్కంధమున దేవీ గీతయను ముప్పదిరెండవ యధ్యాయము.