Sri Devi Bagavatham-2
Chapters
అథత్రయ స్త్రింశో೭ధ్యాయః దేవ్యువాచః మన్మాయాశక్తి సంక్లప్తం జగత్సర్వ చరాచరమ్ |
సా೭ పిమత్తః పృధక్ మాయా మాస్త్యేవపరమారధతః 1 వ్యవహారదృశా సేయం విదా నూయేతి విశ్రుతా | తత్త్వదృష్ట్యాతు నా స్త్వేవ తత్త్వమేవాస్తి కేవలమ్. 2 సా೭హం సర్వం జగత్సృష్ట్వాతదంతః ప్రవిశామ్యహమ్ | మాయాకర్మాది సహితా గిరేః ! ప్రాణాపురఃసరా. 3 లోకాంతరగతి ర్నోచేత్కధం స్యాదితి హేతునా | యధాయధా భవంత్యేవ మాయా భేదాస్తథాతథా. 4 ఉపాధిభేదా ద్బిన్నా೭హం ఘటాకాశాదయో యథా| ఉత్తనీతాదివస్తూని భాసయ నా భస్కరః సదా. 5 న దుష్యతి తథైవాహం దోషైర్లిప్తా కదా పిన | మయి బుద్ద్యాదికర్తృత్వమధ్యసై#్యవాపరే జనాః. 6 విదంచి చా೭೭త్మాకర్మేతి విమూఢా న సు బుద్దయః | అజ్ఞాన భేదాతస్త ద్వ న్మాయాయా భేదత స్తథా. 7 జీవేశ్వర విభాగశ్చ కల్పితో మాయయైవతు | ఘటాతాశ మహీకాశవిభాగః కల్పితో యథా. 8 తథైవ కల్పితో భేదో జీవాత్మ పరమాత్మనోః | యథా జీవబహుత్వం చ మాయ యైవ న చ స్వతః. 9 తథేవ శ్వర బహుత్వం చ మాయయా న స్వభావతః | దేహేంద్రియాది సంఘాతవాసనా భేదభేదితా. 10 అవిద్యా జీవభేదస్య హేతుర్నాన్యః ప్రకీర్తితః | గుణానాల వాసనా భేదాభేధితాయా ధరాధార. 11 మాయా సా పరభేదస్య హేతుర్నాన్యః కదాచన | మయి సర్వమిదం ప్రోతమోతం చ ధరణీధర. 12 ఈశ్వర్యో೭హం చ సూత్రాత్మా విరాడాత్మాహమస్మిచ | బ్రహ్మాహం విష్ణురుద్రౌచ గౌరీ బ్రాహ్మీ చ వైష్ణవీ. 13 సూర్యో೭హం తారకాశ్చాహం తారకేశస్తథాస్మ్యహమ్ | పుశుపక్షిస్వరూపాహంచాండాలో హం చతస్కరః 14 ముప్పదిమూడవ అధ్యాయము - దేవిగీతలు శ్రీదేవి యిట్లనెనుః గిరీశ ! ఈ చరాచర జగమంతయును నా మాయాశక్తిచే నిండియున్నది. ఆది నాలోకల్పితమైనది. పరమార్దముననది నా కంటె భిన్నము గాదు. వ్యవహార దృష్ఠిలో చూడగమాయ విద్యయనంబరనగును. కాని తత్త్వదృష్టని చూడమాయలేదు. కేవలము తత్త్వ వస్తువే కలదు. గీరీశా! చిద్వస్తునగు నేనే పెక్కు మాయా కర్మలంగూడి ఈ జగములు సృజించి ప్రాణ పూర్వకముగ చిదా భాసుడనై యందు ప్రవేశింతును. నా వలననే లోకులకు లోకాంతర గమనములు జరుగును. పెక్కుమాయాభేదముల వలన జీవులుత్పన్నులగుదురు. ఒకే మహాకాశము వలన ఘటాకాశములు గల్గునటుల పెక్కుపాధి భేదముల వలన మాయవలన జీవులుత్పన్నులగుదురు. ఒకే రవి మంచి చెడు వస్తుల నెల్ల వెల్గింపజేయును. ఐనను రవికేట్టి దోషమును గలుగదు. అటులనే చిద్వస్తువనగు నాకెట్టి దోషము నంటదు: కొందఱు బుద్ద్యాదుల కర్తృత్వముక నా యందారోపింతురు. కొందఱు మూడు లాత్మయే కర్తయని పోరపడుదురు. కాని పండితులైనవారు పోరపడరు అజ్ఞానము వలన మాయ వలన జీవేశ్వరుల భేదము గల్పింపబడినది. ఎట్లనగ మహాకాశము వలన ఘాటాకాశాది భేదములు గల్పింబడును. ఇటులే జీవాత్మ- పరమాత్మలకును భేదము గల్పింపబడినది. జీవుల నానాత్వము సహజముగ లేదు. మాయ వలన నున్నట్లు గల్పింపబడెను. అటులే యీశ్వరుల నానాత్వమును మాయ వలన గల్పింబడెను. కాని యది యునుసహజము గాదు. దేహము -మనస్సు-ఇంద్రియాదులు వాసనలు మున్నగు పలు విధముల భేగములు మాయ వలన గల్గుచుండును. పెక్కు జీవేశ్వరుల భేదముల కన్నిటికిన విద్యయే మూల కారణము. మఱదియును గాదు. ఈ త్రిగుణములలో వాసనలలో నెన్నో భేదములు గలవు. మఱి బ్రహ్మాదులలో నీశ్వరులలో నెన్నో భేధములు గలవు. వీనికన్నింటికి నామాయయే మూలకారణము. మఱదియునుకాదు. వస్త్రమందు దారమువలె నాయందెల్ల జగములు వ్యాపించి యున్నవి. అందు వలననే కారణదేహాభిమాని అగు సూత్రాత్మ స్థూలదేహాభిమానియుగు విరాటు నేనే. మఱి బ్రహ్మ-విష్ణు-రుద్రుడు సూర్యచంద్రులు-తారలు-చండాలుడును-దొంగయు-నేనే. నేనే సకల పశు-పక్షి స్వరూపిణిని. వ్యాధో೭హం క్రూరకర్మా೭హం సత్కర్మా೭హం మహాజనః | స్త్రీపున్న పుంసకాకారో೭ప్యహమేవ స సంశయః. యచ్చ కించిత్క్వచిద్వస్తు దృశ్యతే೭ పివా | అంతరబ హి శ్చతత్సరవ్వం వ్యప్యా೭హం సర్వదా స్థితా. న తదస్తి మయా త్యక్తం వస్తుకించి చ్చరాచరమ్ | యద్యస్తి చేత్త చ్చున్యం స్యా ద్వంధ్యాపుత్రోపమంహీతత్. 17 రజ్జుర్యథా సర్పమాలా బేగై రేకా విభాతి హి | తథైవేశాదిరూపేణ భామ్యహం నాత్రసంశయః. 18 అధిష్ఠానాతిరేకేణ కల్పితం తన్న భాసతే | తస్మా న్మ త్సత్తయైవై తత్సత్తా వాన్నాన్యథా భ##వేత్. 19 హిమాలయః: యథావదసి దేవేశి! సమష్ట్యాత్మవపుస్త్విదమ్ | తథైవ ద్రష్టుమిచ్చామి యదిదేవి కృపామయి. 20 ఇతి తస్యవచః శ్రుత్వాసర్వే దేవాః సవిష్ణవః | ననందు ర్ముదితాత్మనః పూజయంతశ్చ తద్వచః 21 అథ దేవమతం జ్ఞాత్వా భక్తకామధుఘా శివా | ఆదర్శయన్నిజం రూపం భక్తకామప్రపూరిణీ. 22 అపశ్యంస్తే మహాదేవ్యా విరాడ్రుపంపరాత్పరమ్ | ద్యౌ ర్మస్తకం భ##వేద్యస్య చంద్రసుర్యౌ చ చక్షుషీ. 23 దిశః శ్రోత్రో వచో వేదాః ప్రాణోవాయః ప్రకీర్తితః | విశ్వం హృదయమిత్యాహుః పృథివీజఘనం స్మృతమ్. 24 సభస్తలం నాభిసరో జ్యోతిశ్చక్రమురఃస్థలమ్ | మహర్లోకస్తు గ్రీవా స్యా జ్జనోలోకో ముఖంస్మృతమ్. 25 తపోలోకో లలాట స్తు సత్యోలోకాదధః స్థితః | ఇంద్రాదయో బాహవః స్యు శబ్ధః శ్రోత్రం మహేశితుః. 26 నాసత్య దస్రౌ నాసేస్తో గంధోఘ్రాణంస్మృతోబుదైః | ముఖమగ్నిః సమాఖ్యాతో దివారాత్రీ చ పక్ష్మణీ. 27 బ్రహ్మస్థానం భ్రూవిజృంభో೭ప్యాపస్తాలుః ప్రకీర్తితా | రసోజిహ్వాసాఖ్యాతా యమోదంష్ట్రాః ప్రకీర్తితాః. 28 క్రూరాత్ముడగు వ్యాధుడు-మహితాత్ముడగుసజ్జనుడు నేనే. ఎల్ల స్రీ-పుం-నపుంసకరూపములు నేనే. సందేహము లేదు. ఏయేచోటుల నేయే వస్తువు కన-విన-బడునో ఆయాచోటుల నాయా వస్తవులలోనబైట నేనే నిత్యము నిండి యున్నాను. ఈ చరాచర వస్సువులన్నియును నేనే. అవి నేను లేక లేవు. ఒక వేళ నేను ఏలకున్నవని యెవడైన ననిచో నావస్తువులు గొడ్రాలిసంతువంటివే. ఒకే త్రాడు పాము-దండ-యను పెక్కు భేధములు నెట్లు దోచునో కేవలము నేనును ఈశ్వరాది బహురూపములనట్లే భాసింతును. అధిష్ఠాన వస్తవులేనిచో కల్పితజగము నిలువజాలదు. కావున నాయునికి వలననే యివన్ని యును శక్తిగల వగుచున్నవి కాని మఱి దేనివలనను గాదు. హిమాలయు డిట్లనెను: ఓ దేవేశ్వరీ! నీ సమష్టీ దివ్యస్వరూపమును చూడ కుతూహల మగుచున్నది. నీకు నాయెడ దయగలదవిని చూపింపుము తల్లీ! అను హిమగిరీశుని వాక్కులువిన విష్ణ్వాది దేవతలెల్లరు నతవి మాటను గౌరవించి ముదితులై హర్షించిరి. ఆపుడు దేవతల యభిమత మెఱింగి కామములు గురియునట్టి భక్తకామప్రపూరణి శివాదేవి వారికి తన దివ్య విరాట్స్వరూపము చూపెను. ఇట్లువారు శ్రీ మహాదేవియొక్క పరాత్పర విరాడ్రూపమును సందర్శించిరి. అపుడు శ్రీదేవియును తల సత్యలోకముగ కన్నులు సూర్యచంద్రులుగ భాసిల్లెను. చెవులు దిక్కులుగపలుకులు వేదములుగ ప్రాణములు వాయువులు హృదయము మహావిశ్వముగ పిఱుదులు భూమిగ తనరెను. నాబి సరస్సు నీలాలనింగిగ ఱొమ్ముజ్యోతిశ్చక్రముగ మెడమహర్లోకముగ ముఖము జనలోకముగ నలరెను. నెన్నుదురు సత్యలోకమునకు క్రింది దగు తపోలోకముగ బాహువు లింద్రాదులుగ శ్రవణంద్రియము శబ్దముగ వెలసెను. నాసికలశ్వి దేవతలుగ ఘ్రాణంద్రియము గంధముగ ముఖ మగ్నిగ కనుఱప్పలు రాత్రింబవళ్ళుగనె సంగెను. కన్బోమలు బ్రహ్మస్థానముగ దవుడలు-జలములుగ నాలుక రసముగ కోరలు యముడు వెలసెను. దంతాః స్నేహకలా యస్య హాసోమాయా ప్రకీర్తితా | సర్గస్త్వపాంగమోక్షః స్యాద్రీడోర్ధ్వోష్ఠా మబేశితుః. 29 లోభః స్యాదధరోష్ఠో೭స్యా ధర్మమార్గస్తు పృష్ఠభూః | ప్రజాపతి శ్చ మేఢ్రం స్యాదః స్రష్టా జగతీతలే. 30 కుక్షిః సమూద్ర గిరియో೭స్థీని దేవ్యా మహేశితుః | నద్యోనాడ్యః సమాఖ్యతా వృక్షాః కేశాః ప్రకీర్తితాః 31 కౌమార¸°వజనరా పయో೭స్య గతిరుత్తమా | బలాహకాస్తు కేశాః స్యు ః సంధ్యే తే వాససీ విబోః. 32 రాజన్ శ్రీజగదంబాయాశ్చంద్రమాస్తు మనః స్మృతః | విజ్ఞాన శక్తి స్తు హరీ రుద్రోం೭తఃకరణం స్మృతమ్. 33 అశ్వాహి జాతయః సర్వాః శ్రోణిదేశే స్థితా విభోః | అతలాదిమహాలోకా ః కట్యధోభాగతాం గతాః. 34 ఏతాదృశం మహారూపం దదృశుః సురపుంగవాః | జ్వలామాలాసహస్రాఢ్యం లేలిహానం త జిహ్వయా. 35 దంష్ట్రా కటకటారావం సమంతం వహ్ని మక్షభిః | నానాయుధధరం వీరం బ్రహ్మక్షత్రౌదనం చ యత్. 36 సహస్రశీర్షనయనం సహాస్ర చర్ణం తథా | కోటిసూర్య ప్రతీకాశం విద్యుత్కోటిసమప్రభమ్. 37 భయంకరం మహాఘోరణ హృదక్షోస్త్రాసకారకమ్ | దదృశుస్తే సురాః సర్వే హాహాకారం చ చ క్రిరే. 38 వికంపమాన హృదయా మూర్చామారు ర్ధురత్యయామ్ | స్మరణం త గతం తేషాం జగదంబేయ మిత్యపి. 39 అథ తే యే స్థితా వేదాశ్చతుర్దిక్షు మహావిభోః | భోధయామాసు రుత్యుగ్రం మూర్చాతోమూర్చితాస్సురాన్. 40 అథ తే ధైర్య మాలంబ్య లబ్ద్వాత స్మృతి ముత్తమామ్ | ప్రేమాశ్రుపూర్ణనయనా రుద్దకంఠా స్తు నిర్జరాః . 41 బాష్పగద్గదయా వాచా స్తోతుం సముపచ్రకిరే | దేవా ఊచుః: అపురాధం క్షమస్వాంబ పాహి దీనాం స్త్వదుద్బవాన్. 42 దంతములు-స్నేహ విలాసములు నవ్వలాట-మాయగకడగంటి చూడ్కులు-సృష్టిగ సిగ్గు-పై పెదనిగ నల రారెను. క్రిందగి పెదవి-లోభమగ వీపు-ధర్మమముగ మేఢ్రము-జగమందలి సృష్టికర్తయగు ప్రజాపతిగ పొట్ట-సాగరములుగ ఎముకలు-గిరులుగనాడులు-నదులుగకేశపాశములు వృక్షములుగనై విలసిల్లెను. ఉత్తమగతులు-కౌమార¸°వన జరలుగ కేశములు-మేఘములుగ కట్టుపుట్టములు-సంఘధ్యలుగ విరాజిల్లెను. మనస్సు-చంద్రుడు విజ్ఞానశక్తి-శ్రీహరిగ హృదయము-రుద్రుడుగనై శోభిల్లెను. రాజా! దేవి పిఱుదం దశ్వజాతులన్నియు నడుమునకు క్రింది భాగమున నతలాదిలోకములుండెను. ఇట్టి శ్రీదేవి ఇశ్వరూపమును దేవత లెల్లరును కన్నుల కరవుతీర సందర్మించిరి. దేవినుండి వేనవేలు జ్వాలామాలికలు వెలువడుచుండెను. దేవి తన పొడవైన నాలుకతో లోకము లెల్లనాకు నట్లుండెను. దేవి పటపట పండ్లు కొఱకుచు కన్నుల నిప్పుల కణికలు గ్రక్కుచు నానాయుధములు దాల్చి బ్రాహ్మణ క్షత్రియుల నాహారము చేసికొనుచుండెను. దేవి సహస్రశిరములు సహస్రనయనములు సహస్రచరణమలు గల్గి సూర్యకోటి ప్రభాభాసమానయై విద్యుత్కోటి సమానప్రభలు చిమ్ముచుండెను. పరాశక్తియొక్క మహాభీషణ ఘోరదారణరూపము చూపఱుల హృదయముయములకు భయంకరముగ నుండెను. అట్టి రూపముగాంచి సురలు మిన్ను ముట్టి హహాకారములు చేసిరి. వారి హృదయనలల్లాడగ తీరని మూర్చ మునిగిరి. వారు దేవి జగదంబయను మాటయే మఱచిరి. అటుల స్పృహ కోల్పోయి పడియున్న దేవతలను దేవికి నలు వైపుల నున్న వేగములు మేలు కోల్పి ప్రభోధ మొనరించెను. దేవతలు దివ్యశ్రుతులాలకించి ధైర్య మవలంబించి ప్రేమాశ్రు పూర్ణ నేత్రములతో గళము తొట్రుపాటు జెందుచుండ కన్నీట మాటలు తడబడ దేవి నీ విధముగ సన్నుతింపసాగిరి. ఓ అమ్మా! మాతపుపలు క్షమింపుము. మేము నీ కన్న బిడ్డలము. మమ్ముకాపాడుమమ్మా! కోపం సంహార దేవేశి సభయా రూప దర్శనాత్ | కాతే స్తుతిఃప్రకర్తవ్యా పామరైర్నిర్జరై రిహ. 43 స్వస్యా ప్యజ్ఞేయ ఏవా೭సౌ యావాన్యశ్చ స్వవిక్రమః | త్వదర్వాగ్జాయ మానానాం కథం స విషయోభ##వేత్. 44 నమస్తే భువనేశాని ! నమస్తే ప్రణవాత్మికే | సర్వవేదాంత సంసిద్ధే నమో హ్రీంకారమూర్తయే. 45 యస్మ దగ్నిః సముత్పన్నో యస్మాత్సూర్యశ్చ చంద్రమాః| యస్మాదోషధయః సర్వా స్తసై#్మ సర్వాత్మనే నమః. 46 యస్మాచ్చ దేవాః సంభూతః సాధ్యాః పక్షిణ ఏవచ | పశవశ్చ మనుష్యాశ్చ తసై#్మ సర్వాత్మనే నమః 47 ప్రాణాపానౌ వ్రీహియవౌ తపః శ్రద్ధాఋతం తథా | బ్రహ్మచర్యం విథిశ్చైవ యస్మత్తసై#్మ నమోనమః 48 సప్త ప్రాణార్చిషో యస్మా త్సమిధః సప్త ఏవచ | హోమాఃసప్త తథా లోకాస్తసై#్మ సర్వాత్మనే నమః. 49 యస్మత్సముద్రా గిరయః సివధ ప్రచరం తిచ | యస్మాదోషధయః సర్వా రసాస్తసై#్మ నమోనమః 50 యస్మా ద్యజ్ఞః సముద్బూతో దీక్ష యూపశ్చ దక్షిణా ః | ఋచో యజూంషి సామాని తసై#్మ సర్వాత్మనేనమః. నమః పురస్తాత్పృష్ఠే చ నమస్తే పార్శ్వయోర్ద్వయోః | అధ ఊర్ధ్వం చతుర్దిక్షు మాతర్బూ యో నమోనమః. 52 ఉపసంహర దేవేశి రూపమేతదలౌకికమ్ | తదేవ దర్శయా೭స్మాకం రూపం సుందర సుందరమ్. 53 ఇతి భీతా స్సురా న్దృష్ట్వా జగదాంబా కృపార్ణవా | సంహృత్య రూపం ఘోరం తద్దర్శయామాస సుందరమ్. 54 పాశాంకుశవారాభీతి ధరం సర్వాంగకోమలమ్ | కరుణా పూర్ణనయనం మందస్మిత ముఖాంబుజమ్. 55 దృష్ట్వా తత్సుందరం రూపం తదా భీతివివర్జితా ః | శాంతచిత్తాః ప్రణముస్తే హర్షగద్గద నిఃస్వనాః. 56 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే దేవీగీతాయాం త్రయస్త్రింశో೭ధ్యాయః. ఓ దేవేశీ ! నీ కోప ముపసంహరించుము. నీ భీకరరూపము గాంచిన మా గుండె లవిసిపోవుచున్నవి. మేము పామరులము దీనులము. త్రిదశులము. నిన్నెంతని సన్నుతింపగలము ! నీ విక్రమ మహాశక్తు లెంతటివో నీకే తెలియదే ! ఇక నీ తర్వాత పుట్టిన మా కెట్లు తెలియును? ఓ త్రిభువనేశ్వరీ! నీకు మా ప్రణామములు. ప్రణవాత్మికాః నీకు ప్రణామములు. సకల వేదాంత సంసిద్ధా!హ్రీంకారమూర్తీ! నీకు ప్రణామములు. ఏ జగదంబికనుండి సకల దేవతలు - సాధ్యులు క్ష మనుజులు-పశువులు -పక్షులు జన్మించెనో యట్టి సర్వాత్మికకు ప్రణామములు. ఏ జగదంబికనుండి ప్రాణాపానములు - వ్రీహియవలు-సత్యము -శ్రద్ధ-బ్రహ్మచర్యము మున్నగునవి కల్గెనో యట్టి సర్వాత్మికకు ప్రణామములు. ఏ జగదంబికనుండి సప్తప్రాణములు -సప్తదీవులు-సప్తసమధలు-సప్తహోమమలు- సప్తలోకవ్లుు గల్గెనో యట్టి సర్వాత్మికకు ప్రణాముములు. ఏ జగదంబికనుండి యెల్ల సాగరములు-నదులు-గిరులు-రసములు-ఓషదులు సంభవించెనో యట్టి సర్వాత్మికకు సర్వాత్మికకు ప్రణామములు. ఓ మాతా! నీ పూర్వభాగము-వెనుక భాగము- ఇరుపక్కలు-పైభాగము-నాల్గు దిక్కులు వీనికి మాటిమాటికి ప్రణామములు. ఓ దేవేశీ! నీయీ లోకాతీతమైన విశ్వరూప ముపసంహరింపుము. అందాల కందమైన నీమొదటి రూపమును ప్రదర్శింపుము. తల్లీ!ఇట్లు భయభ్రాంతులైన దేవతలను చూచి జగదంబిక దయాంతరంగయై తన ఘోరరూపమువదలి శాంతసుందరరూపము చూపెను. అపుడు దేవి పాశ-అంకుశ-వర-అభయ హస్త-సర్వాంగసుందరి-శిరీసఖోమలి-కరుణాపూర్ణనయన-మందస్మితముఖమల. అట్టి దేవిసుందర దివ్యరూపమును దర్శించి భయములు పాసి ప్రశాంతచిత్తలై సంతోషాతిశయమున మాటలాడరాక తుదకు పెక్కు గతుల దేవిని సన్నుతించిరి. ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణమందలి యేడవ స్కంధమున దేవీతయందు ముప్పదిమూడవ యధ్యాయము.