Sri Devi Bagavatham-2
Chapters
అథచతుస్త్రింశో೭ధ్యాయః. శ్రీదేవ్యువాచ: క్వయూయం మందభాగ్యావై క్వేదం రూపం మహాద్బుతమ్|
తథాపి
భక్తవాత్సల్యా దీదృశం దర్శితం మయా. 1 నవేదాధ్యయనై ర్యోగైర్నదానై స్తపసేజ్యయా | రూపం ద్రష్టు మిదం శక్యం కేవలం మత్కృపాంవినా. 2 ప్రకృతం శృణు రాజేంద్ర పరమాత్మా೭త్ర జీవతమ్ | ఉపాధియోగా త్సం ప్రాప్తః కర్తృత్వాదిక మవ్యుత. 3 క్రియాఃకరోతి వివిధా ధర్మాధర్మైక హేతవః | నానాయోనీ స్తతః ప్రాప్య సుఖదుఃఖైశ్చ యుజ్యతే. 4 పున స్తత్సంస్కృతివశా న్నానాకర్మరతః సదా| నానాదేహా న్సమాప్పోతి సుఖదుఃఖైశ్చ యుజ్యతే. 5 ఘటీయంత్రవ దేతస్య నవిరామఃకదాపి హి| అజ్ఞాన మేవ మూలంస్యాత్తతః కామఃక్రియాస్తతః. 6 తస్మా దజ్ఞాననాశాయ యతేత నియతం నరః | ఏతద్ది జన్మసాఫల్యం యదజ్ఞానస్య నాశనమ్. 7 పురుషార్థ సమాప్తిశ్చ జీవన్ముక్తదశాపిచ | అజ్ఞాన నాశ##నే శక్తా విద్యైవతు పటీయసీ. 8 న కర్మ తజ్జనోపాస్తి ర్విరోధా భావతో గిరే | ప్రత్యుతాశా జ్ఞాననాశే కర్మణా నవ భావ్యతామ్. 9 అనర్థదాని కర్మాణి పునః పున రుశంతి హి| తతో రాగస్తతో దోషస్త೭తో నర్థో మహాన్బవేత్. 10 తస్మా త్సర్వప్రయత్నేన జ్ఞానం సంపాదయేన్నరః | కుర్వ న్నేవేహ కర్మాణిత్యతః కర్మాప్యవశ్యకమ్. 11 జ్ఞానా దేవహికైవల్య మతః స్యాత్త త్సముచ్చయః | సహాయతాం ప్రజేత్కర్మ జ్ఞానస్యహితకారిచ. 12 ఇతికేచి ద్వదం త్యత్ర తద్విరోధా న్న సంభ##వేత్ | జ్ఞానాత్ హృద్గృంథి భేదఃస్యాత్ హృద్గృంథౌ కర్మసంభవః. 13 ముప్పదినాలుగవ అధ్యాయము-శ్రీదేవీగీతలు శ్రీదేవీ యిట్లనెను: మందభాగ్యులగు మీరెక్కడ! ఈ నో లోకాద్బుత దివ్యరూపమెక్కడ! ఐనను మీ మీది వాత్సల్యముతో మీకు నా దివ్యరూపము చూపితిని. ఈ నా దివ్యరూపమును కేవలము నాదయవలన గాక వేదాధ్యయనమున గాని యోగ దానముల వలన గాని యజ్ఞ తపముల వలన గాని చూడ సాధ్యము గాదు. ఓ రాజేంద్ర! ఇక ప్రస్తుతము వినుము. పరమాత్మ తాను పెక్కు విధముల యుపాధులతో గూడి జీవత్వమంది కర్తృత్వము వహించును. జీవుడు నానా యోనుల యందు బుట్టుచు ధర్మా ధర్మాత్మకములైన పెక్కు పనులు చేయుచు సుఖదుఃఖము లనుభవించుచు నుండును. అట్లు పూర్వ వాసనల వలన నానా కర్మరతుడై పెక్కు విధముల జన్మములు దాల్చచు సుఖదుఃఖము లనుభవించు చుండును. జీవుడు నీటి యంత్రము వలె (ఎద్దులు గాని ఒంటె గాని గుండ్రముగా తిరుగుటచే బావిలో చక్రాకారమున తిరుగు నీటి బొక్కెనల మాల నీటితో పైకి వచ్చును. ఇది ఘటీ యంత్రముగా పూరాణములలో చెప్పబడినది) విశ్రాంతి లేక తిరుగుచుండును. అతని కజ్ఞానము కోరికలు కొనలు సాగును. కోర్కులు దీర్చుకొనుట కతడెన్నో పనులు చేయును. ఈ జన్మపరంపరలు తుదముట్టుట కజ్ఞానము తప్పక నశింపవలయును. అజ్ఞానము జ్ఞానము (విద్య) వలన నశించును. పురుషార్థముల కోర్కెలు-తాపములు-తొలగిపోగా జీవన్ముక్తదశ గల్గును. అజ్ఞానమున పుట్టిన కర్మ మజ్ఞానమును నశింపజేయజాలదు. కనుక నజ్ఞాన నాశమునకు కర్మమును నమ్ముకొని యుండరాదు. ఈ కర్మములన్నియు ననర్థ దాయకములు. వీని వలన సంతలో రాగము నంతలో ద్వేషాగ్ని పుట్టును. ఇట్టి యనర్థ కర్మములు పల్మారు పుటుచుండెను. ''కుర్వన్నే వేహ కర్మాణి'' యను వేదాను వచనము ప్రకారముగ మంచి కర్మములు చేయుట మంచిధే. కాని మనుజుడెల్లభంగుల జ్ఞానమే పొందవలయును. దివ్యజ్ఞానము వలననే వైకల్యము ప్రాప్తించును. సత్కర్మము జ్ఞానమునకు తోడుపడును. మేలు చేకూర్చును. ఈ రెంటికిని విరోధము లేదని కొందఱందరు. అది సరికాదు. ఏలన జ్ఞాన ఖడ్గముననే కర్మములక తావగు హృదయ గ్రంథి ఛేదించబడును. ¸°గపద్యం న సంభావ్యం విరోధాత్తు తతస్తయోః | తమః ప్రకాశయోర్యద్వ ద్యౌగపద్యం న సంభవి. 14 తస్మా త్సర్వాణి కర్మాణి వైదికాని మహామతే | చిత్త శుద్ధ్యం తమే స్యుస్తాని కుర్యాత్ప్రయత్నతః. 15 శమో దమస్తితిక్షా చ వైరాగ్యం సత్త్వ సంభవః | తావత్పర్యంత మేవ స్యుఃకర్మాణి న తతః పరమ్. 16 తదంతే చైవ సంస్యస్య సంశ్రయే ద్గురు మాత్మవాన్ | శ్రోత్రియం బ్రహ్మనిష్ఠంచ భక్త్యా నిర్వ్యాజయాపునః. 17 వేదాంత శ్రవణం కుర్యా న్నిత్యమేవ పక్షం ద్రితః | త్తత్వమస్యాది వాక్యస్య నిత్య మర్థం విచారయేత్. 18 తత్త్వ మస్యాది వాక్యం తు జీబ్రహ్మైక్యబోధకమ్ | ఐక్యే జ్ఞాతే నిర్బయస్తు మద్రూపోహి ప్రజాయతే. 19 పదార్థాపగతిఃపూర్వం వాక్యార్థావగతి స్తతః | తత్పదస్య చ వాచ్యార్థో గిరే೭హం పరికీర్తితః.20 త్యంపదస్య చ వాచ్యార్థో జీవ ఏవ న సంశయః | ఉభయోరైక్య మసినా పదేన ప్రోచ్చతే బుధైః. 21 వాచ్యార్థయో ర్విరుద్ధత్వా దైక్యం నైవ ఘటేత హ | లక్షణా తః ప్రకర్తవ్యాతత్త్వమోఃశ్రుతి సంస్థయోః. 22 చిన్మాత్రంతు తయోర్లక్ష్యం తయోరైక్యస్య సంభవః | తయారైక్యం తథా జ్ఞాత్వా స్వాభేదేనాద్వయోభ##వేత్. 23 దేవదత్తః స ఏవాయమితి వల్లక్షణా స్మృతా| స్థూలాది దేహరహితో బ్రహ్మసంపద్యతే నరః. 24 పంచీకృత మహాభూత సంభూతః స్థూలదేహకః భోగాలయో జరావ్యాధి సంయుతః సర్వకర్మణామ్. 25 చీకటి వెలుగులోకచో గలియవు. వానికి విరోధము గలదు. అట్లే కర్మ జ్ఞానములకు విరోధ ముండుటనవి యొకచోగలియవు. కనుక నరుడు వైదికాది కర్మము లన్నియు సంస్కారము లన్నియును చిత్తశుద్ది కొఱకు ప్రయత్న పూర్వకముగ చేయుచుండవలయును. చిత్తశుద్ధి గల్గునంతవఱకే శమదమములు-తతిక్షవైరాగ్యము నత్యా వశ్యకములై యుండును. అటు పిమ్మట కర్మముతో నెట్టి యావశ్యకతయు గల్గదు. చివర కాత్మ వంతుడు సర్వ ధర్మములు పరిత్యజించి నిష్కపటమైన భక్తితో శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడునగు సద్గురువు నాశ్రయింపవలయును. అతడు నిశ్చల నిర్మల చిత్తముతో వేదాంత శ్రవణము నిరంతర మొనరింపవలయును. తత్త్వ మస్యది వాక్యముల సత్యార్థమును చింతింపవలయును. తత్త్వ మస్యాది వ్యాక్యార్థము జీవ బ్రహ్మల యేకత్వము దెల్పును. ఈ రెంటి యేకత్వము తెలిసిన నరుడు నిర్బయుడైనా సారూప్యమందగలడు. మొదట పదముల యర్థమెఱింగి పిదప వాక్యములలోని యర్ద మెఱుంగవలయును. ''తత్'' అను పదమున కర్థము భగవతినగు నేనే యని చెప్పబడును. ''త్వం'' అను పదమునకు జీవుడని ముఖ్యార్థము. ఈ రెంటికి ''అసీ'' యను పదము జేర్చి యైక్యము గూర్తురు. వాచ్యార్థములకు విరోధమువలన నైక్యము గుదురనపుడు లక్ష్యార్థములతో వేద నిర్దిష్టములగు ''తత్-త్వం'' పదములకు కర్థము చెప్పవలయును. జీవ-ఈశ్వరుల ప్రత్యేక ధర్మములు తొలగిపోగరెంటి యైక్య మిట్లెఱుంగుట వలన సద్వయము సిద్దించును. ఆ దేవదత్తు డితడే యన్న వాక్యములో ''ఆ-ఈ'' యను రెంటి ధర్మములు తొలగగ మిగిలిన వాడొక్కడే కధా ! అదే లక్షణ యనబడను. అటులే ఈ స్థూల దేహాది భేదములు తొలగినపుడు నరుడు బ్రహ్మత్వమందును. ఈ స్థూలదేహము పంచీకృత మహాభూతముల నుండి యుత్పన్నయ్యెను. ఇదెల్ల భోగాల కాటపట్టు. జరా వ్యాధులకు కర్మములకు తావలము. మిథ్యాభూతో೭య మాభాతి స్పుటం మాయామయత్వత ః | సో೭యం స్థూలుపాధిః స్యాదాత్మనో మే నగేశ్వర. జ్ఞానకర్మేంద్రియ యుతం ప్రాణపంచక సంయుత్ | మనోబుద్దియుతం చైతత్సూక్ష్మం తత్కవయో విదుః. అపం చీకృతభూతోత్థం సూక్ష్మదేహో೭య మాత్మనః | ద్వితీయో య ముపాధిః స్యా త్సుఖాదేరవబోధకః. 28 అనాద్యనిర్వాచ్యమి దమజ్ఞానం తు తృతీయకః | దేహో೭య మాత్మనో భాతి కారనాత్మ నగేశ్వర 29 ఉపాధివిలయే జాతే కేవలాత్మా వశిష్యతే | దేహత్రయే పంచకోశా అంతఃస్థాః సంతి సర్వదా. 30 పంచకోశ పరిత్యాగే బ్రహ్మపుచ్చం హి లభ్యతే | నేతి నేతీత్యాది వాక్యైర్మమ రూపం యదుచ్చతే. 31 న జాయతే మ్రియతే తత్కదాచిన్నా೭యం భూత్వా నబభూవ కశ్చిత్ | అజోనిత్యః శాశ్వతో೭యం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. 32 హతం చేన్మన్యతే హంతుం హతశ్చే న్మన్యతే హతమ్ | ఉభౌతౌ న విజానీతో నా೭యంహంతి న హన్యతే. 33 అణోరణీయా న్మహతోమహయా నాత్మా೭స్యజంతో ర్నిహితో గుహాయామ్ | తమక్రతుః పశ్యతి వీతశోకో ధాతుప్రసాదాన్మహిమానమస్య. 34 ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవ తు | బుద్దిం తు సారథిం విద్ది మనః ప్రగ్రహమేవచ. 35 ఇంద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్ | ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహు ర్మనీషిణః. 36 యస్త్వవిద్వా న్బవతిచా೭నమస్కశ్చ సదా శుచిః | న తత్పద మవాప్నోతి సంసారం చాధిగచ్చతి. 37 ఈ దేహము మిథ్య. ఐనను మాయాభ్రాంతిచే నున్నట్లు తోచును. గిరిరాజా! ఇట్టి శరీరమే యాత్మయొక్క స్థూలమైన యుపాధి. జ్ఞాన కర్మేంద్రియంబులు-ప్రాణపంచకము-మనోబుద్దులు గలిసిన దేహమును సూక్ష్మమైన యుపాధిగ బుధులందురు. ఈ రెండవ యుపాధి యాత్మయొక్క సూక్ష్మమైన యిపాధి. ఇది పంచీకృతము కాని పంచ భూతముల వలన గల్గును. ఇది అంతఃకరణము యొక్క సుఖదుఃఖాదులు తెలుపుచుండును. ఓ గిరీశ్వరా!నా యాత్మయొక్క మూడవ యుపాధి కారణాత్మ. అది అనిర్వాచ్యము. అనాది-అజ్ఞానము జరుగును. ఈ మూడుపాధులు తొలగిపోగా కేవలమగు ''ఆత్మ'' మిగిలివెలుగును. పంచకోశము లీ మూడు దేహము లందును సతతము విలసిల్లుచుండును. ఈ పంచకోశములు తొలగిపాగా తుదకు బ్రహ్మనిష్ఠ ప్రాపించును. ఇట్లు ''నేతి-నేతి'' యను వాక్యార్థము వలన నాత్మరూపము వెల్లడియగును. అట్టి ''ఆత్మ'' పుట్టునది -చచ్చునది-పూర్వముండి యిపుడు లేనిదిగాదు: అది నిత్యము-చచ్చునది కాదు. అజము-శాశ్వతము-పురాణము. ఈ శరీరాదులు చంపబడుచున్నను నది చంపబడదు. చంపువాడు తాను చంపెననియును చంపబడువాడు నేను చచ్చితి ననియు తలంతురు. కాని వారిర్వురును తెలియనివారే. ఏలన ''ఆత్మ'' చావదు. చంపబడదు. ఆత్మ అణువుకంటెనణువు; మహత్ కంటె మహీయము. అయ్యు నది యెల్ల ప్రాణుల హృదయగుహలందు వెలుగును. జీవుడు పరమాత్మదయ వలన నాత్మమహిమ మెఱిగివిగత శోకుడు గాగలడు. ఆత్మ-రథికుడు; శరీరము-రథము; బుద్ధి-సారథి; మనస్సు-ఇంద్రియములను మూడును గలిసి భోక్త యనబరగునని పెద్దలందురు. అవివేకి-అమనస్కుడు-అశుచియగు మూర్ఖుడు తత్పద మెఱుగలేక దురిత సంసార సాగరమున మునుకలు వేయుచుండును. యస్తు విజ్ఞాన వా న్బవతి స మనస్కః సదా೭శుచిః | స తు తత్పదమాప్నోతి యస్మాద్బూయో న జాయతే. 38 విజ్ఞాన సారథి ర్యస్తు మనఃప్రగ్రహవాన్నరః | సో೭ధ్వనః పారమాప్నోతి మదీయం యత్పరం పదమ్. 39 ఇత్థం శ్రుత్వా చ మత్యా చ నిశ్చిత్యాత్మాన మాత్మనా | భావయే న్మా మాత్మరూపాం నిదిధ్యాసనతో೭పిచ. 40 యోగవృత్తేః పురా స్వస్మి న్బావయే దక్షరతృయమ్ | దేవీ ప్రణవసంజ్ఞస్య ధ్యానార్థం మంత్రవాచ్యయోః. 41 హకారః స్థూలదేహః స్యాద్రకారః సూక్ష్మదేహకః |ఈకారః కారణాత్మా೭సౌ హ్రీంకారో హం తురీయకమ్. 42 ఏవం సమష్టిదేహే೭పి జ్ఞాత్వా బీజత్రయం క్రమాత్ | సమష్టి వ్యష్ట్యో రేకత్వం భావయేన్మతి మాన్నరః. 43 సమాధికాలా త్వూర్వం తు భావయిత్త్వైవమాదృతః | తతో ధ్యాయేన్నిలీనాక్షో దేవీం మాం జగదీశ్వరీమ్. 44 ప్రాణాపానౌ సమౌకృత్వా నాసాభ్యంతర చారిణౌ | నివృత్తి విషయాకాంక్షో వీతదోషోవిమత్సరః. 45 భక్త్యా నిర్వ్యాజయాయుక్తో గుహాయాం నిఃస్వనే స్థలే! హకారం విశ్వమాత్మానం రకారే ప్రవిలాపయేత్. 46 రకారం తైజసం దేవమీకారే ప్రవిలాపయేత్ |ఈకారం ప్రాజ్ఞ మాత్మానం హ్రీంకారే ప్రవిలాపయేత్. 47 వాచ్యవాచకతా హీనం ద్వైతభావవివర్జితమ్ | అఖండం సచ్చిదానందం భావయేత్త చ్చిఖాంతరే. 48 ఇతి ధ్యానేన మాంరాజ న్సాక్షాత్కృత్య నరోత్తమః | మద్రూప ఏవ భవతి ద్వయోరప్యేకతా యతః. 49 యోగయుక్త్వా೭నయా దృష్ట్వా మామాత్మానం పరాత్పరమ్ | అజ్ఞానస్య సకార్యస్య తత్షణనాశకో భ##వేత్. 50 ఇతి శ్రీదేవి భాగవతే మహాపురాణ సప్తమస్కంధే దేవీ గీతాయం చతుస్త్రింశో೭ధ్యాయః. వివేకి-సమనస్కుడు -శ్రోత్రియుడు-నిష్కాముడు నగు వాడు పునరావృత్తి లేని తత్పదమును కైసేయగలడు. బుద్ధియను సారథి మనస్సను కళ్లెమును గట్టిగ బట్టుకొన్నచో సంసార దుస్తర మార్గములు దాటి పరమపద మలంకరింపగలడు. ఈ విధముగ శ్రుతి మతి గలిగిన వాడాత్మ విచారముతో స్వాత్మను నిశ్చయించుకొని పరబ్రహ్మస్వరూపిణి నగు నన్ను ధ్యానమున భావింపవలయును. ధ్యానయోగము చక్కగ కుదురుటకు నా యక్షరత్రయమును మొదట చక్కగ భావించవలయును. అది దేవీ ప్రణవస్వరూపమైనది మాయామంత్రబీజము-మంత్రరాజము. అక్షరత్రయములో హాకారము స్థూలదేహము రేఫము సూక్ష్మదేహము; ఈ కారము కారణదేహము. హ్రీంకారము-తురీయాత్మ-నేనే. ఇదే విధముగ సమష్టి దేహమందు నీ బీజత్రయము క్రమముగ నున్నదని యెఱిగి పిదప సమష్టివ్యష్ట్యాత్మల యేకత్వమును సాధకుడు సాధింపవలయును. ఈ విధముగా సమాధికి ముందు చక్కగా నాత్మవిచార మొనరించి పిదప కన్నులు మూసికొని జగదీశ్వరి-ఆదిపరాశక్తి-నగు నన్నే ధ్యానింపవలయును. నాసికయందు తిరుగాడు ప్రాణపానములను సమముగ జేసి విషకామములు విడనాడి మచ్చ రము -దోషము-వదలవలయును. సాధకు డొంటిగ నైకాంతిక పరాభక్తితో హృదయకుహరమునందు చిత్తము నిల్పి స్థూలాత్మయగు హకారమును సూక్ష్మాత్మయగు రేఫమును లయమొనరింపవలయును. పిదప సూక్ష్మాత్మయగు రేఫమును కారణాత్మయగు ''ఈ'' కారమందున లయ మొనర్పవలయును. తర్వాత కారణాత్మయగు ''ఈ ''కారమును సర్వాత్మకమైన హ్రీంకారమున లయ మొనర్పవలయును. పిమ్మట చిదగ్నిశిఖలో వాచ్యవాచకత్వములును ద్వైతములును లేనట్టి పరబ్రహ్మ రసమయమగు నఖండ సచ్చిదానందమును ధ్యానింపవలయును. రాజా!ఇట్లు జీవుడు విమల ధ్యానమువలన నా సాక్షాత్కారమొంది నా సారూప్యము జెందవలయును. ఏలన నట్టి స్థితిలో నేను-జీవుడు నొకటియే. నరు డిట్టి ధ్యానయోగమువలన పరాత్పరతమగు నన్ను గాంచును. వెనువెంటనే వాని తొంటి యజ్ఞానకర్మములు రెండును నశించును. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున దేవీగీతయందు ముప్పదినాల్గవ యధ్యాయము.