Sri Devi Bagavatham-2    Chapters   

అథషట్త్రింశోధ్యాయః

దేవ్యువాచ : ఇత్యా దియోగయుక్తాత్మా ధ్యాయేన్మాం బ్రహ్మ రూపిణీమ్‌| భక్త్యా నిర్వ్యాజయా రాజన్నాసనే సముపస్థితః 1

అవిఃసన్నిహితం గుహాచరం నామ మహత్పదమ్‌ | అత్రైత త్సర్వ మర్పిత మేజ త్ప్రాణన్నిమిషచ్చయత్‌. 2

ఏత జ్ఞానథ సదసద్వరేణ్యం పరం విజ్ఞానా ద్యద్వరిష్ఠం ప్రజానామ్‌|

యదర్చి మద్యదణుభ్యోణు చ యస్మిం ల్లోకా నిహితా లోకిన శ్చ. 3

తదేతదక్షరం బ్రహ్మసప్రాణ స్తదు వాజ్మనః | తదేతత్సత్య మమృతం తద్వేద్దవ్యం సోమ్య విద్ధి. 4

దనుర్గృహీ త్వౌపనిషదం మహాస్త్రం శరం హ్యూపాసా నిశితం సంధయీత |

అయమ్య తద్బాగవతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం సోమ్య విద్ది. 5

ప్రణవో ధనుః శరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్య ముచ్యతే | అప్రమత్తేన వేద్దవ్యం శవరత్తమన్మయో భ##వేత్‌. 6

యస్మిన్‌ ద్యౌశ్చ పృథివీ చాంతరిక్షమోతం మనః సహప్రాణౖశ్చ సర్వైః |

తమేవైకం జానథఆత్మానమన్యా వాచో విముంచథామృత సై#్యషసేతుః. 7

అరా ఇవ రథనాభౌ సంహతా యత్ర నాడ్యః | స ఏషో7ం తశ్చరతే బహుధా జాయమానః .8

ఓ మిత్యేవం ధ్యాయథాత్మా నంస్వస్తివః పారాయ తమసః పరస్తాత్‌ |

దివ్యే బ్రహ్మపురే వ్యోమ్ని ఆత్మా సంప్రతిష్ఠితః. 9

మనోమయః ప్రాణశరీరనేతా ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ|

తద్విజ్ఞానేన పరిపశ్యంతిధీరా ఆనందరూప మమృతం యద్విభాతి. 10

ముప్పదిఆరవ అధ్యాయము

శ్రీదేవీ గీతలు

శ్రీదేవి యిట్లనెను : ఓ గిరిరాజా! ఈ విధముగ బ్రహ్మస్వరూపిణి నగు నన్ను యోగయుక్తుడు సహజ భక్తితో నాసనమున గూర్చుండి సతతమను ధ్యానింపవలయును. బ్రహ్మము స్వయంప్రకాశము. సర్వవ్యాపకము. ఐనను హృదయ గుహ యందు వెలుగొందును. ఇది యోగ సాధ్యము. దీని యందాకాశాదులు ఎల్ల ప్రాణులు కాలములు నాధారపడియుండును. ఓ సురలారా ! బ్రహ్మమునిట్లెరుంగుడు. ఇది మాయా జగముల కంటె వరేణ్యమయినది. బుద్దులకందనిది. అణువు కంటె అణీయము. ఎల్ల లోకములు లోకులు దీనియందు ప్రతిష్టింపబడియున్నారు. ఓ సౌమ్యుడా! ఓంకారము అక్షరము- బ్రహ్మము. అది ప్రాణ-వాక్‌-మనో రూపములు దాల్చును. కనుక బ్రహ్మమందు మనస్సు లగ్న మొనర్చి యెఱుంగవలయును. ఉపనిషత్తను ధనువు నందు ధ్యాన మనెడు బాణమెక్కుపెట్టి నిశ్చల చిత్తముతో నక్షరమును లక్ష్యముచేసి ఏయవలయును. ప్రణవము - దనువు; హృదయము-బాణము; బ్రహ్మము లక్ష్యము; బాణము లక్ష్యమును భేదించునటుల నరుడు నప్రమత్తముగ భాగవత హృదయముతో బ్రహ్మమును గురిచూచి వేధించి బ్రహ్మ మయుడు గావలయును. బ్రహ్మమందు భూమి-అంతరిక్షము -ఆకాశము-ప్రాణములు - మనస్సు నిల్చియుండును. ఇదిసంసార సాగరమునకు సేతువు. కనుక వట్టి మాటలుకట్టిపెట్టి యాత్మనొక్క దని నెఱుంగుము. రథపు నాభి యందు చక్రమాకులు చేరియుండును. అటులే హృదయ మందు నాడులన్నియును చేరియుండును. పెక్కురూపులుగల బుద్ది వృత్తికి సాక్షియగు బ్రహ్మము హృదయమందే వెలుగొందుచుండును. అమరులారా ! మీకు మేలగుత ! సంసారపు గ్రుడ్డిపెంజీకటి తెరల కవ్వలి వెలుంగు వెల్లువ యగు నాత్మ నాత్మ విచారముతో ధ్యానింపుడు. ఆత్మ దివ్యమును -బ్రహ్మపురమునుగు హృదయాకాశమున వెల్గుచుండును. అత్మ మనోమయము: ప్రాణశరీరములకధినేత-అన్న మునప్రతిష్టితము- హృదయాంతరవర్తి-ఆనంద స్వరూపము- అమృత రసనిధి; ధీరులగు వారుఅనుభవ పూర్వక మగు ఆత్మ విచారముతో దీనిని దర్శింతురు.

భిద్యతే హృదయగ్రంథీశ్చిద్యంతే సర్వసంశయాః | క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే. 11

హిరణ్మయే పరేకోశే విరజం బ్రహ్మనిష్కలమ్‌ | తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి స్తద్యదాత్మ విదోవిదుః 12

న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః |

తమేవ భాంతమను భాతి సర్వం తస్యభాసాసర్వమిదం విభాతి. 13

బ్రహ్మైవే దమమృతం పురస్తాద్‌ బ్రహ్మదక్షిణతశ్చోత్తరేణ అథశ్చోర్ద్వంచ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వంవరిష్ఠమ్‌. 14

ఏతాదృగనుభవో యస్య సకృతార్థో నరోత్తమః | బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి కాంక్షతి. 15

ద్వితీయాద్వై భయంరాజం స్తదభావాద్బిభేతి న | న తద్వియోగో మేప్యస్తి మద్వియోగోపీతస్య న. 16

అహ మేవ స సోహం వై నిశ్చితం విద్ది పర్వత | మద్దర్శనం తు తత్రస్యాద్యత్ర జ్ఞానీ స్థితోమమ. 17

నాహం తీర్థే నకైలాసే వైకుంఠే వా న కర్హిచిత్‌ | వసామి కింతు మత్‌జ్ఞాని హృదయాంభోజ మధ్యమే. 18

మత్పూజాకోటిఫలదం సకృన్మత్‌ జ్ఞానినోర్బనమ్‌ |కులం పవిత్రం తస్యాస్తి జననీ కృతకత్యకా. 19

విశ్వంభరా పుణ్యవతీ చిల్లయో యస్యచేతసః | బ్రహ్మజ్ఞానం తు యత్పృష్టం త్వయా పర్వత సత్తమ. 20

ఇట్టి పరమాత్మ సాక్షాత్కారము గల్గిన వాని జన్మ జన్మముల హృదయ మందలి పెడముళ్లు తెగతెంపులగును. సంశయము లన్నియు పటాపంచలగును. కర్మబీజము లన్నియును నశించును. బ్రహ్మము నిష్కలము-విరజము-శుభము-ఆనందకోశమున సుఖ రససందోహము-వెల్గులవెల్గు-అనియాత్మవంతులందురు.సూర్య-చంద్ర-అగ్నులు-మెఱుపుతీగలు-తారకలన్నియును బ్రహ్మమును వెలిగింపజాలవు. బ్రహ్మజ్యోతి వలననే సూర్యాదులు వెల్గుచున్నారు. జగము లన్నియును వెలుగుచున్నవి. బ్రహ్మముముందు -వెనుకల క్రిందుమీదుల రెండు వైపుల విశ్వమంతట నుండి వెల్గులు చిమ్ముచున్నది. ఇట్టి యాత్మానుభూతి -యే పుణ్యాత్ములకు గల్గునో యతడు ధన్యజీవుడు. బ్రహ్మభూతుడు - ప్రసన్నాత్ముడు. అతనిని శోక కామము లంటజాలవు. గిరివతంసా! ద్వైతభావము భయకారణము. ద్వైతము లేనిచో సంసార భయము లేదు. నే నద్వయము నకు గాని అద్వయము నాకు గాని బిన్నముగ లేదు సుమా! హిమవంతా! అట్టి యద్వయుడగు జ్ఞానియే నేను. నేనే యాజ్ఞానిని. నా దివ్యదర్శనము నాజ్ఞానియందు కలుగును. నేను

జ్ఞానుల హృదయకమల మధ్యామునగాక కైలాసమునగాని వైకుంఠమునగాని యే తీర్థమందుగాని మరెచ్చటగాని నివసింపను. నాపరమభక్తుడగు జ్ఞాని నొక్కసారి యర్చించి గౌరవించిన నన్ను కోటిసారులు పూజించినంత ఫలితముగల్గును. అట్టి జ్ఞాని కులము పవిత్రము అతని తల్లి ధన్యురాలు. అట్టి జ్ఞానిమాతృభూమి స్వర్గసీమ; వాని చిత్తము చిన్మయము; గిరిరాజా! నీ వడిగిన బ్రహ్మజ్ఞానమంతయును విశద మొన రించితిని.

కథితం తన్మయా సర్వం నాతో వక్తస్య మస్తి హి | ఇదంజ్యేష్ఠాయ పుత్త్రాయ భక్తియుక్తాయశీలినే.21

శిష్యాయ చ తథోక్తాయ వక్తవ్యం నాన్యథా క్వచిత్‌ | యస్య దేవే పరాభక్తి ర్వథా దేవే తథా గురౌ. 22

తసై#్యతే కథితాః హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః | యేనోపదిష్టా విద్యేయం స ఏవ పరమేశ్వరః. 23

యస్యాయం సుకృతం కర్తుమసమర్థస్తతో ఋణీ | పిత్రోరప్యధికః ప్రోక్తో బ్రహ్మజన్మప్రదాయకః. 24

పితృజాతం జన్మ నష్టం నేత్థంజాతం కదాచన | తసై#్మన ద్రుహ్యేదిత్యాది నిగమో7ప్య వదన్నగ. 25

తన్మా చ్చాస్త్రస్యసిద్దాంతోబ్రహ్మదాతాగురుః పరః | శివే రుష్టే గురు స్త్రా గురౌ రుష్టే న శంకరః. 26

తస్మా త్సర్వ ప్రయత్నేన శ్రీ గురుం తోషయేన్నగ | కాయేన మనసా వాచా సర్వదా తత్పరో భ##వేత్‌. 27

అన్యథా తు కృతఘ్నః స్యాత్కృతఘ్నే నాస్తినిష్కృతిః | ఇంద్రేణా థర్వణా యోక్తా శిరచ్చేద ప్రతిజ్ఞాయా. 28

అశ్విభ్యాం కథనే తస్య శిరచ్చన్నం చ వజ్రిణా | అశ్వీయం తచ్చిరో నష్టం దృష్ట్వావైద్యౌ సురోత్తమౌ. 29

పునః సంయోజితం స్వీయం తాభ్యాం మునిశిరస్తదా | ఇతి సంకట సంపాద్యా బ్రహ్మవిద్యా నగాధిప.

లబ్దా యేన స ధన్యః స్యాత్కృతకృత్యశ్చ భూధర.

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే దేవీగీతాయాం షట్త్రింశోధ్యాయః.

నీ కంతయు దెల్పితిని. ఇక మిగిలినది లేదు. దీనిని జ్యేష్ఠపుత్రునకు గాని భక్తియుక్తునకు గాని గుణశాలికిగాని చెప్పవలయును. తగిన శిష్యునకును దీనిని చెప్పవచ్చును. ఇతరుని కెవ్వనికిని చెప్పరాదు. ఎవనికి తన యిష్ఠదేవతయందు గురువునందు నిశ్చలభక్తియుండునో బ్రహ్మజ్ఞాన మతనికే చెప్పవలయును. అతనికి బోధించిన విద్యలు చక్కగ ప్రకాశించును. జ్ఞాన ముపదేశించువాడు కేవలము పరమాత్ముడే. ఇట్టి జ్ఞానోపదేశమందినవాడు తన గురునకు ఋణపడియుండును. బ్రహ్మజ్ఞాన ముపదేశించువాడు తండ్రికంటె శ్రేష్ఠతరుడు. తండ్రివలన గల్గిన జన్మము నశించును. కాని గురు వొసంగిన జ్ఞానజన్మ మెన్నటికిని చెడని పదార్థము. కనుక నట్టి గురునకు ద్రోహము తలపెట్టరాదని వేదమనును. బ్రహ్మజ్ఞాన మొసంగిన గురుడు శ్రేష్ఠు డని శాస్త్రములువచించును. శివుడు కోపించిన వానిని గురుడు కాపాడును. గురుడు కోపించినవానిని శివుడుగాపాడలేడు. కనుక నుత్తమశిష్యుడు మనోవాక్కాయ కర్మములతో గురుసేవాతత్పరుడై యెల్లభంగుల గురునే సంతోషపెట్టవలయును. అటుల చేయనిశిష్యుడు కృతఘ్నడగును. కృతఘ్ననకు ప్రాయశ్చిత్త మేదియును లేదు. తొల్లి యింద్రు డథర్వణునకు జ్ఞానమున దేశించెను. అపుడు దీనినితరులకు చెప్పిన నీ తల నఱకుదునని యింద్రుడు ప్రతిన బూనెను. అశ్వినులు బ్రహ్మవిద్య నెఱుగుట కథర్వణుని తల నఱికి గుఱ్ఱము తల నదికించి విద్య బడసిరి. ఇంద్రుడు తన మాట చొప్పున గుఱ్ఱము తల తెగినఱి కెను. అపు డశ్విను లతని మొండెమున కతని వెనుకటి తల నదికించి బ్రదికించిరి. ఓ నగపతీ! బ్రహ్మవిద్య యింత కష్ట సాధ్యమైనది. దీనిని బొందినవాడు థన్యుడు.కృతార్థుడు.

ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కధమున దేవీగీతయందు ముప్పదియారవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters