Sri Devi Bagavatham-2
Chapters
అథ కోనచత్వారింశో೭ధ్యాయః హిమాలయః: దేవదేవి మహేశాని కరుణా సాగరే೭ంబికే | బ్రూహి పూజావిధిం సమ్యగ్యధావదధునా నిజమ్. 1 శ్రీదేవ్యువాచ: వక్ష్యే పూజావిధిం రాజ న్నంబికాయా యధాప్రియమ్| అత్యంత శ్రద్ధయా సార్దం శృణు పర్వత పుంగవ. 2 ద్వివిధా మమ పూజా స్యా ద్బాహ్యా చాభ్యంతరా೭పిచ | బాహ్యా೭పి ద్వివిధా ప్రోక్తా వైదికీ తాంత్రికీ తధా. 3 వైదిక్యర్చా೭పి ద్వివిదా మూర్తిభేదేన భూధర | వైదికీ వైదికైః కార్యా వే దీక్షా సమన్వితైః. 4 తంత్రోక్త దీక్షా వద్బి స్తు తాంత్రికీ సంశ్రితాభ##వేత్ | ఇత్థం పూజారహస్యం చ న జ్ఞాత్వా విపరీతకమ్. 5 కరోతి యో నరో మూఢః స పతత్యేవ సర్వథా | యత్ర యా వైదికీ ప్రోక్తా ప్రథామా తాం వదామ్యహమ్. 6 యన్మే సాక్షా త్పరం రూపం దృష్టవానసి భూధర | అనంతశీర్షనయన మనంతచరణం మహత్. 7 సర్వశక్తి సమాయుక్తం ప్రేరకం యత్పరా త్పరమ్ | తదేవ పూజయే న్నిత్యం నమేధ్యాయేత్స్మరే దపి. 8 ఇత్యేత త్ప్రథ మార్చాయాః స్వరూపం కథితం నగ | శాంతః సమా హితమనా దంభాహంకారవర్జితః. 9 తత్పరో భవ తద్యాజీ తదేవ శరణం ప్రజ | తదేవ చేతసా పశ్య జప ధ్యాయస్వ సర్వదా. 10 అనన్యయా ప్రేమయుక్త్య భక్త్యా మద్బావ మాశ్రితః | యజ్ఞైర్యజ తపోదానైర్మా మేవ పరితోషయ. 11 ఇత్థం మమాను గ్రహతో మోక్ష్యసే భవబంధనాత్ | మత్పరా యే మదాసక్తచిత్తా భక్త వరా మతాః. 12 ముప్పదితొమ్మిదవ అధ్యాయము-శ్రీదేవి గీతలు హిమాలయు డిట్లనెను: ఓ దేవదేవీ! మహేశానీ! దయారసతరంగిణీ! జగదంబికా! ఇపుడు నీ దివ్య పూజా విధానము చక్కగ దెలుపుము. శ్రీ దేవి యిట్లనెను. గిరిసత్తమా! శ్రీదేవికి మిక్కిలి ప్రియమైన పూజావిధానము తెల్పుదును. శ్రద్దగ వినుము. నా పూజ రెండు విధములు. బాహ్యము-అభ్యంతరము. బాహ్యపూజ మరల వైదికము-తాంత్రికమని రెండు విధములు. ఓ భూధరా! వైదికపూజయు మూర్తిభేదముచే మరల రెండు విధములు. మొదటిది వేదదీక్ష నందినవాడు వేదమంత్ర పూర్వకముగా దేవి నా వాహనాదులతో నర్చించుట-తంత్రదీక్షతో తంత్రోక్త విధానముగ చేయు పూజ తాంత్రికపూజ. ఇట్టి పూజ్యారహ్యస మెఱుగక వైదిక దీక్షితుడు తంత్రోక్తముగా గాని తంత్రదీక్షితుడు వైదోక్తముగ గాని పుజింపరాదు. అట్లు పూజించిన మూఢమతి తప్పక పతితుడగును. తొలుత వైదిక పూజావిధానమువివరింతును. ఆలింపుము. ఓ గిరివరా! ఇంతకుమునుపు మా యే వేయితలలు వేయికన్నులు వేయి పాదములుగల మహాద్బుత రూపము సాక్షాత్తుగ దరిశంచితివో ఏది సర్వశక్తులకు మూలశక్తియో ఏవరేణ్యతేజము బుద్దిప్రేరకమో ఏది పరాత్పరతరమో యట్టి నా రూపమును నిత్యము పూజించి ధ్యానించి స్మరింపవలయును. నగా! ఇదివైదికమార్గమలోని మొదటిపూజా విధానము చెప్పబడెను. ఇట్లు పూజించువాడు నిశ్చలమతితో గంభాహంకృతులు వదల వలయును. నీవును దేవీతత్పరుడవై దేవీహోమమువల చేయుచు దేవీశర మొందుచు దేవీగత చిత్తముతో సర్వమును దేవీభావమునగనుచు దేవీజపధ్యానములు నిరంతరము సలుపుచుండుము. నిత్యము ప్రేమభక్తితో సర్వాత్మభావముతో నన్యప్రేమతో నా మహాయజ్ఞములు జరిపివేల్చుము. నన్నే ప్రసన్నురాలినిచేయుము. ఈరీతి చేసిన నాయను గ్రహమువలన భవబంధములనుండి విముక్తుడవు కాగలవు. ఎనరు మచ్చిత్తులై మద్గతప్రాణులై నా భక్తవరులై యుందురో- ప్రతిజానేభవాదస్మా దుద్దరా మ్యతిరేణ తు | ధ్యాసేన కర్మయుక్తేన భక్తి జ్ఞానేన వా పునః. 13 ప్రాప్యా హ సర్వథా రాజ న్నతు కేవలకర్మభిః | ధర్మాత్సంజాయతే భక్తి ర్బక్క్యాసంజాయతే పరమ్. 14 శ్రుతిస్మృతిభ్యా ముదితం యస్సధర్మః ప్రకీర్తితః అన్యశాస్త్రేణ యః ప్రోక్తో ధర్మాభాసః సఉచ్యతే. 15 సర్వజ్ఞా త్సర్వశ##క్తేశ్చ మచ్చో వేదః సముత్దితః | అజ్ఞానస్య మమాభావా దప్రమాణా న చ శ్రుతిః. 16 స్మృతయ శ్చ శ్రుతే రర్థంగృహీ త్వైవచ నిర్గతాః | మన్వాదీనాం శ్రుతీనాం చ తతః ప్రామాణ్య మిష్యతే. 17 క్వచిత్క దాచి త్తంత్రార్ద కటాక్షేణ పరోదితమ్ | ధర్మం వదంతి సో 7ంశ స్తు నైవగ్రాహ్యో7స్తివైదికైః. 18 అన్యేషాం శాస్త్రకర్తౄణా మజ్ఞాన ప్రభవత్వతః | అజ్ఞాన దోష దుష్టత్వాత్త దుక్తే ర్న ప్రమాణతా. 19 తస్మా న్ముముక్షుర్ ధర్మార్దం సర్వధా వేదమాశ్రయేత్ | రాజాజ్ఞా చ యధా లోకే హన్యతే న కదాచన. 20 సర్వేశాన్యా మమాజ్ఞా సా శ్రుతి స్తాజ్యా కధం నృభిః | మదాజ్ఞా రక్షణార్ధం తుబ్రహ్మక్షత్రియ జాతయః. 21 మయా సృష్టా స్తతో జ్ఞేయం రహస్యమేశ్రుతేర్వచః | యదాయదా హి ధర్మస్య గ్లానిర్బవతి భూధర. 22 అభ్యుత్దాన మధర్మస్య తదా వేషా న్బిభర్మ్యహమ్ | దేవదైత్య విభాగ శ్చాప్యత ఏవాభవన్నృప. 23 యే నకుర్వంత తద్దర్మం తచ్చిక్షార్దం మయా సదా | సంపాదితా స్తు నరకా స్త్రాసోయచ్చ్రవణా ద్బవేత్. 24 వారిని తప్పకనే నీ ఘోరదురితసంసారిమునుండి వెంచనే సముద్దరింతును. నేను కర్మయుక్త ధాన్యముచేత భక్తిజ్ఞానము చేత వీనిలో దేనిచేనైన లభింతును. గిరిరాజా! అంతేకాని కేవలము కర్మముచే నేను చిక్కను. ధర్మమువలన భక్తి-భక్తివలన జ్ఞానము-గలుగును. శ్రుతి స్మృతిలందు చెప్పబడినది ధర్మమగును గాని యితర శాస్త్రములందు చెప్పబడినది ధర్మముగాదు. అది ధర్మాబాస మనబడును. నాయం దజ్ఞానము లేదు. నేను సర్వజ్ఞురాలను. నానుండియే వేదములు పుట్టుటచేత వేదములు భ్రాంతిలేని సత్యవస్తువులు. సుప్రమాణములు. మన్వాది మహర్షలు వేదములలోని యాంతరార్థంమును గ్రబించి స్మృతులు రచించిరి. కనుక స్మృతులును వేదప్రమాణకములే. కాని కొన్నిచోట్ల తంత్రార్దమును దృష్టిలోనుంచుకొని తెలుపబడిన ధర్మాంశములను వైదికులు గ్రహింపరాదు. వేదము నంగీకరింపని యితర శాస్త్రకారుల వాక్కులజ్ఞానదూషితము లగుటచేతవారి మాటలు ప్రమాణములు గావు. కనుకమోక్షము గోరువాడు ధర్మమెఱుంగుటకు వేదమునే ప్రమాణముగ గ్రహింపవలయును. ఎట్లు లోకమునందురాజాజ్ఞ చెల్లుబడియగుచుండునో - అట్లే సర్వేశ్వరి నగు నాశాసనము లోకమున చెల్లుబడి యగుచండును. నా వేదానుశాసనము నెవడును తిరస్కరింపరాదు. నా వేదాజ్ఞను గాపాడుటకే బ్రాహ్మణ క్షత్రియ జాతులు గలిగించితిని. నా వేదవాక్కులందలి రహస్యము తప్పకనెఱంగవలయును. గిరీశా| ధర్మహాని గల్గినప్పుడు అధర్మముపెచ్చుపెరిగినపుడు నేను శాకంభరి మున్నగు పెక్కు దివ్యరూపములు దాల్తును. విబుధులు వేద రక్షకులు. దానవులు వేదవినాశకులు. నావేదధర్మ మనుసరించని వారికొఱకు నరకములు కల్పించితిని. వానిని గుఱించి విన్న మాత్రానగుండె లవిసిపోవును. యో వేదధర్మ ముజ్ఘిత్య ధర్మ మన్యం సమాశ్రయేత్ | రాజా ప్రవాసయే ద్దేశాన్ని జాదేతా నధర్మిణః. 25 బ్రాహ్మణౖ ర్న చ సంభాష్యాః పంక్తిగ్రాహ్యా న చ ద్వీజైః | అన్యాని యాని శాస్త్రాణి లోకే స్మిన్వివిధాని చ. 26 శ్రుతిస్మృతి విరుద్దాని తామసాన్యే సర్వశః | వామం కాపాలకం చైవ కౌపాలకం భైరవాగమః. 27 శివేన మోహనార్దాయ ఫ్రణీతో నాన్యహేతుకః | దక్షశాపాత్ భృగోః శాపాద్దధీచస్య చ శాపతః. 28 దగ్దా యే బ్రాహ్మణవరా వేదమార్గ బహిష్కృతాః | తేషా ముద్దరణార్దాయ సోపానక్రమతః సదా. 29 శైవాశ్చ వైష్ణవా శ్చైవసౌరాః శాక్తాస్తథైవచ | గాణా పత్యా ఆగమాశ్చ ప్రణీతాః శంకరేణ తు. 30 తత్ర వేదావిరుద్ధోం೭శో೭ ప్యుక్త ఏవక్వచిత్క్వచిత్ | వైదికై స్తద్గ్రహే దోషా నభవత్యేవ కర్హిచిత్. 31 సర్వథా వేదభిన్నార్థే నాధి కారీ ద్విజో భ##వేత్ | వేదాధికారహీన స్తు భ##వేత్తత్రాధికారవాన్. 32 తస్మా త్సర్వప్రయత్నేన వైదికో వేద మాశ్రయేత్ | ధర్మేణ సహితం జ్ఞానం పరం బ్రహ్మ ప్రకాశ##యేత్. 33 సర్వైషణాః పరిత్యజ్య మామేవ శరణం గతాః | సర్వభూత దయావంతో మానాహంకారవర్జితాః. 34 మచ్చిత్తా మద్గతప్రాణా మత్థ్సాన కథనే రతాః| సంన్యా సినో వనస్థా శ్చ గృహస్థా బ్రహ్మచారిణః. 35 ఉపాసతే సదా భక్త్యా యోగమైశ్వర సంజ్ఞితమ్ | తేషాం నిత్యావియు క్తానా మహా మజ్ఞానజం తమః. 36 జ్ఞానసూర్య ప్రకాశేన నాశయామి న సంశయః | ఇత్ర వైదిక పూజాయాః ప్రథమాయా నగాధిప. 37 ఎవ్వడు వేదధర్మమును తూలనాడి యితర ధర్మము లనుసరించునో యట్టి ధర్మబాహ్యుని రాజు తన దేశమునుండి వెడలగొట్టవలయును. అట్ట వారిని బంతినుండి వెలివేయవలయును. వారితో విప్రులు మాటాడరాదు. లోకమందింకను వివిధ శాస్త్రములు గంవు. అవన్నియు శ్రుతి స్మృతి విరుద్దము లగుటచేత తామసము లనబడును. వామము కాపాలము కౌలకము భైరవము మున్నగు తంత్రములు గలవు. ఈ యాగమతంత్రముల ఫలాశకు వేదాధికారము లేనివారు మోహితులు గావలయునని వీనిని శివుడు రచించెను. (వీరు పాపఫలమును భవించుచు శుద్దులై క్రమముగ పుణ్యులై వేద మార్గ మవలంబింతురు) అంతేకాని యితర కారణము లేదు. దక్ష భృగు దధీచి మహర్షుల శాపమునకు కొందఱుబలి యైరి. వారు వేదబాహ్యులైన బ్రాహ్మణులు. అట్టివారిని సోపానక్రమమున నుద్ధరించుటకు శివుడాగమములను రచించెను. శైవము వైష్ణవము సౌరము సాక్తము గాణాపత్యమునను నాగమములను శంకరుడు రచించెను. వానియందు కొన్ని చోట్ల వేదాను కూలముగను కొన్ని యెడల వేదవిరుద్ధముగను వ్రాయబడెను. కనుక నందలి వేదానుకూలము లగు నంశములను వైదికు లాచరించుటలో నెట్టి దోషమును లేదు. విప్రుడెన్నడును వేదార్దమునకు భిన్నార్దము గ్రహింపరాదు. వేదాధికారి కానివాడే భిన్నార్దములు గ్రహించును. కనుక వెదికుడైనవాడు సర్వప్రకారముల వేదమార్గ మనుష్ఠింపవలయును. వేదధర్మమువలని జ్ఞానమే బ్రహ్మ సాక్షత్కారము గల్గించును. ఈ షణత్రయమును విడనాడి నన్నేశరణు పొందినవారు సర్వభూతదయాళురు మానదంభాహంకారములు లేనివారు-ఇట్టి బ్రహ్మచారులును గహస్థులును వానప్రస్థలును సంన్యాసులును మచ్చిత్తులు-మద్గతప్రాణులునై నా తీర్థములు సేవించుటలో నిమగ్నులగుదురు. వారు పరభక్తితో నా యీ సంపత్కరమగు విరాట్స్వరూపమునుపాసింతురు. అట్టి నాయందు నిత్యయుక్తిగలవారి యందు నజ్ఞాతము ముండును. నేను జ్ఞానమను సూర్యప్రకాశముతో వారి యడ్ఞానతమము బాపుదును. నగాధిపా! ఇది నా వైదిక పూజయొక్క మొదటి పద్ధతి. దీనినిట్లు సంక్షేపముగ వెల్లండించితిని. స్వరూప ముక్తం సంక్షేపాత్ ద్వితీయాయా అథోబ్రువే | మూర్తౌవా స్థండిలే వా೭పి తథా సూర్యేందు మండలే. 38 జలే೭థవా బాణలింగే యంత్రే వా೭పి మహావటే | తథా శ్రీహృదయాం భోజే ధ్యాత్వా దేవీంపరాత్పరామ్. 39 సగుణాం కరుణాపూర్ణాం తరుణీ మరుణారుణామ్ | సౌందర్య సారసీమాం తాం సర్వావయవసుందరామ్. 40 శృంగారరస సంపూర్ణాం సధా భక్తార్తికాతరమ్ | ప్రసాదసుముఖీ మంబాం చంద్రఖండశీఖందినీమ్. 41 పాశాంకువ వరాభీతిధరా మానందరూపిణీమ్ | పూజయే దుపచారైశ్చ యథా విత్తాను సారతః. 42 యావదాంతర పూజాయా మధికారో భ##వేన్నహి | తావద్బాహ్యామిమాం పూజాం శ్రయే జ్ఞాతే తు తాం త్యజేత్. 43 ఆభ్యంతరాతు యా పూజా సా తు సంవిల్లయః స్మృతః | సంవిదేవ పరం రూపముపాధిపహితం మమ. 44 అతః సంవిది మద్రూపే చేతఃస్థాప్యం నిరాశ్రయమ్ | సంవిద్రూపాతిరిక్తం తు మిథ్యామాయామయం జగత్. 45 అతఃసంసారనాశయ సాక్షిణీ మాత్మరూపిణీమ్ | భావయే న్ని ర్మనస్కేన యోగయుక్తేన చేతసా. 46 అతఃపరం బాహ్యపూజా విస్తారః కథ్యతే మయా | సావధానేన మనసా శృణు పర్వతసత్తమ. 47 ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే దేవీగీతాయా మేకోనచత్వారింశో೭ధ్యాయః ఇక రెండవ పూజా విధానము తెల్పుచున్నాను. శ్రీవిగ్రహమందుగాని శుద్ధ ప్రదేశమునగాని సూర్యచంద్రమండలములందుగాని జలములందుగాని బాణలింగమందుగాని యంత్రమందుగాని మహావస్త్రమునగాని శ్రీహృదయ కమలమందుగాని పరాత్పరాదేవిని ధ్యానింపనలయును. దేవి సుగుణ-సౌందర్యలావణ్యరేణ్య-కరుణామృత తరంగిణి-సర్వావయవసుందరి-దివ్యా రుణారుణ-తరుణీమణీ-శృంగారరసాధినాయిక-భక్తార్తినివారిణీ-ప్రసన్నవదనాంబుజ-కిశోరచంద్రశేఖర-పాశ-అంకుశ-వర-అభయ ముద్రలుగలది-దివ్యానంద స్వరూపిణియగు దేవిని షోడశోపచారపూజల నర్చింపవలయును. అభ్యంతరపూజ యం దధికారము గల్గనంతవరఱకు నీ బాహ్యపుజ నాచరింపవలయును. అధికారము గల్గిన పిదప దీనిని వదలవచ్చును. ఉపాధిరహితమైన బ్రహ్మజ్ఞానమే నా స్వరూపము. ఇట్టి నా యాత్మస్వరూపమున చిత్తముతాదాత్మ్యమందుటే యాభ్యంతర పూజ యగును. కనుక జ్ఞానస్వ రూపిణి నగు నాయందైకాంతిక బావమున చిత్తము నిలుపవలయును. ఈ యాత్మజ్ఞానముదక్క మిగిలిన జగమంతయును నట్టిదే. మాయామయయే. కనుక మాత్మస్వరూపిణి-సర్నసాక్షిణినగు నన్నే నిర్వకల్ప భక్తితో యోగయుక్తత్తముతో నిరంతరము ధ్యానింపవలయును. ఓ గిరిరాజా! దీనితర్వాత బాహ్యపూజా విధానము చెప్పబడుచున్నది సావధానముగ వినుము. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమస్కంధమున దేవీగీతయందు ముప్పది తొమ్మిదవ యధ్యాయము.