Sri Devi Bagavatham-2    Chapters   

అథసప్తమోధ్యాయః

శ్రీనారాయణ ఉవాచ: గిరీ మేరుం చ పూర్వేణ ద్వావష్టాదసయోజనైః | సహసై#్రరాయతే చోదగ్ద్వి సహస్రపృథూచ్చకౌ. 1

జఠరో దేవకూటశ్చతావేతౌ గిరివర్యకౌ | మేరోః పశ్చిమతోద్రీ ద్వౌ పవమానస్తథాపరః. 2

పారియాత్రశ్చతౌ తావద్విఖ్యాతౌ తుంగ విస్తరౌ | మేరోర్దక్షిణతఃఖ్యాతౌ కైలాసకరవీరకౌ. 3

ప్రాగాయతౌ పూర్వవృత్తౌ మహాపర్వతరాజకౌ | ఏవంచోత్తరతో మేరో స్త్రిశృంగమకరౌగిరీ. 4

ఏత్తైశ్చేద్రివరై రష్టసంఖ్యైః పరివృతో గిరిః | సుమేరుః కాంచనగిరిః పరిభ్రాజన్రవిర్య థా. 5

మేరోర్మూర్థని దాతుర్హి పురీ పంకజజన్మనః | మధ్యతశ్చోపక్లప్తే యం దశసాహస్రయోజనైః. 6

సమానచతురస్రాంచ శాతకౌంభమయీం పురీమ్‌ | వర్ణయంతి మహాత్మానః పరాపరవిదో బుధాః. 7

తాం పురీ మనులోకానా మష్టానా మీశిషాం పరాః | పుర్యః ప్రఖ్యాతసౌవర్ణరూపాస్తాశ్చ యథాదిశమ్‌. 8

యథారూపం సార్దనేత్ర సహస్రప్రతిమాః కృతాః | మేరోర్నవ పురాణి స్యు ర్మనోవత్యమరా వతీ. 9

తేజోవతీ సంయమనీ యథా కృష్ణాంగనాపరా | శ్రద్దావతీ గంధవతీ తథా చాన్యా మహోదయా. 10

యశోపతీ చ బ్రహ్మేంద్ర వహ్న్యాదీనాం యథాక్రమమ్‌ | తత్రైవ యజ్ఞలింగస్య విష్ణోర్బగవతో విభోః. 11

వామపాదాంగుష్ఠనఖ నిర్బన్నస్య చ నారద | అండోర్ద్వ భాగరంధ్రస్య మధ్యాత్సంవిశతీ దివః. 12

ఏడవ అధ్యాయము - భువన వ్యవస్థ

శ్రీ నారాయణుడిట్లనెను : మేరుగిరికి తూరుపుదెస పదునెనిమిదివేల యోజనముల దూరమున కావలనుత్తర దిశగ రెండువేల యోజనముల యెత్తు -పొడువు- వెడల్పుగల రెండు గిరులు గలవు. జఠరము దేవకూటమని యా రెండు గిరులకు పేర్లు.అట్లే మేరువునకు పడమటి దెసను రెండుగిరి లంతియు పొడవు - వెడల్పు- నెత్తు- గల్గియున్నవి. వాని తర్వాత పవ మానగిరి పారి యాత్ర గిరి కలవు. ఈ రెండు సంతియే పొడవు - వెడల్పు- నెత్తు గల్గియున్నవి. మేరుగిరికి దక్షిణమున కైలాసము - కరవారము - నను గిరులు రెండు కలవు. ఇవి తూర్పు దిశగ వ్యాపించియున్నవి. మేరువునకు నుత్తర దిశగ త్రిశృంగ -మకరగిరులు గలవు. ఈ యెనిమిది పర్వతములుచేత మేరు మహాపర్వతము చుట్టబడి సువర్ణమయమై సూర్యునివలె వెలుగులు విరజిమ్ముచున్నది. ఆ మేరుగిరిపైనే పద్మభవుడగు బ్రహ్మయొక్క పురము పదివేల యోజనముల వెడల్పున చెన్నొందును. ఈపురము సమముగ చతురస్రముగ-స్వర్ణమయమై యుండునని మహాత్ములగు బుధులు వర్ణింతురు. బ్రహ్మపురికి క్రింది భాగమున నెనిమిది దిశలం దష్టదిక్పాలకుల బంగరు పట్టణములు తనర్చును. ఒక్కొక్కటి రెండున్నర వేల యోజనముల ప్రమాణము గలది. ఇట్లు మేరుగిరిపై బ్రహ్మపురితో గలిసి తొమ్మిది పురములు గలవు. మనోపతి-అమరావతి-తోజోపతి-సంయమని-కృష్ణాంగన-శ్రద్దావతి-గంధవతి-మహోదయ- యశోపతి- యను పేర్లు వరుసగ బ్రహ్మిఇంద్రుడు అగ్ని మున్నగు దిక్పతులపురములపేర్లు. విష్ణువు త్రివిక్రముడు. విష్ణు నెడమకాలి బొటనవ్రేలి కొనగోట చీల్చబడిన యండ కటాహపుపైరంధ్రమునుండి గంగ యుద్బవించి దివి కేగుచున్నది.

మూర్దన్యవతతారేయం గంగా సంవిశతీ విభోః | లోకానా మఖిలానాం చ పాపహారి జలాకులా. 13

ఇయం చ సాక్షా ద్బగవత్పదీ లోకేషు విశ్రుతా | కాలేన మహతా సాతు యుగసాహస్రకేణతు. 14

దివో మూర్దాన మాగత్య దేవీ దేవ నదీశ్వరీ | యత్తద్విష్ణు పదంనామ స్థానం త్రైలోక్యవిశ్రుతమ్‌. 15

ఔత్తానపాదిర్యత్రాస్తే ధ్రువః పరమపావనః | భగవత్పాదయుగల పత్మకోశరజో దధత్‌. 16

ఆద్యాప్యాస్తే స రాజర్షిః పదవీ మచలాంశ్రితః | తత్ర స పర్షయ స్తస్య వభ్రవజ్ఞా మహాశయాః. 17

ప్రదక్షిణం ప్రక్రమంతి సర్వలోక హితేప్సవః | అత్యంతికీ సిద్దిరియం తపతాం సిద్దిదాయినీ. 18

ఆద్రియంతే చ శిరసా జటాజూటోషితేన చ | తతో విష్ణుపదా ద్దేవీ నైకసాహస్ర కోటిభిః. 19

విమానై రాకులే దేవయానేవతరతీ చ సా | చంద్రమండల మాప్లావ్య పతంతీ బ్రహ్మసద్మని. 20

చతుర్దా భిద్యమానా సా బ్రహ్మలోకే చ నారద| చతుర్బి ర్నమభి ర్దేవీ చతుర్ది మభి స్రుతా. 21

సరితాం చ నదీనాం చ పతిమేవన్వ పద్యత | సీతా చాలకనందా చ చతుర్బద్రేతి నామభిః. 22

సీతా చ బ్రహ్మసదనా చ్చిఖరే భ్యః క్షమాభృతామ్‌ | కేసరాభిధనామ్నాంచ ప్రసవంతీ చ స్వర్ణదీ. 23

గంధమాదనమూర్ద్నీ హ పతితా పాపహీరిణీ | అంతరేణ తు భద్రాశ్వ వర్షే ప్రాచ్యాం సమాగతా. 24

అచటినుండి స్వర్గము ద్వారమున భూమిపై పడి గంగ యెల్ల లోకములను పునీతము చేయుచున్నది. పాపములు పాపుచున్నది. ఈ నది లోకములందు విష్ణుపదియన ప్రసిద్దిగాంచెను. అది వేలయుగమలు దనుక ప్రవహించును. గంగదివ్య లోకములందు ప్రవహించుటవలన దేవనదుల కధీశ్వరియైనది. అది ముజ్జగములందు విష్ణు పదిగా వాసిగాంచెను. పరమ పావనుడగు నుత్తానపాదుని కొడుకు ధ్రువుడు. అతడీ గంగాతీరమున శ్రీ విష్ణు భగవానుని దివ్యపాదయుగ కమలరజము తల దాల్చెను. అందువలన నా రాజర్షి నేటికిని ధ్రువపదము నాశ్రయించి యున్నాడు. సప్తర్షి మహాశయులతని ప్రభావ మెఱింగిరి. కనుక వారు లోక కల్యాణమునకై ధ్రువునకు ప్రదక్షిణము సేతురు. గంగ తాపసుల కాత్యంతికసిద్ది నొసంగునది. ఇట్టి గంగను గంగాధరుడగు శివుడు తన తలపై దాల్చి గౌరవించును. గంగ శ్రీ విష్ణుపదకమలమునుండి యుద్బవించును. అది యనేక సహస్ర కోటుల విమానములు తిరుగుచుండునట్టి దేవయానమార్గమున నవతరించును. అచటినుండి చంద్రమండలమును చంద్రమండలమునుండి బ్రహ్మపురము జేరును. ఓయి నారదా! గంగాదేవి బ్రహ్మలోకమందు నాల్గు దిక్కులందును నాల్గు తెఱంగుల నాలుగు నామములతో విలసిల్లుచుండును. అటుపిమ్మట గంగ నదీపతియగు సాగరముతో సంగమించును. గంగ-సీత- అలకనంద-చతుర్బద్రయను నవి గంగపేర్లు. గంగ బ్రహ్మపురము నుండి వెలువడి సంగమించును. గంగ-సీత-అలకనంద-చతుర్బద్రయను నవి గంగపేర్లు. గంగ బ్రహ్మపురమునుండి వెలువడి మేరుగిరిపై కేసరములవంటి శిఖరము మీద ప్రవహించును. ఇచటనుండి పాపహీరిణియగు గంగ గంధమాదన గిరిపై పడును. అచటినుండి భద్రాశ్వదేశ మధ్యమునుండి వెడలి సాగరమును గలియును.

క్షారోదధిం గతా సా తు ద్యునదీ దేవపూజితా | తతోమాల్యవతః శృంగాద్ద్వితీయా పరినిర్గతా. 25

తతో వేగవతీ భూత్వా కేతుమాలం సమాగతా | చక్షుర్నామ్నీ దేవనదీ ప్రతీచ్యాం దివ్యుపాగతా. 26

సరితాం పతి మా విష్టా సా గంగా దేవవందితా | తత స్తృతీయా ధారా తు నామ్నాఖ్యాతాచ నారద. 27

పుణ్యా చాలకనందా వై దక్షిణనాబ్జ భూపదాత్‌ | వనాని గిరి కూటాని సమతి క్రమ్య చాగతా. 28

హేమకూటం గిరివరం ప్రాప్తాతోపీహ నిర్గతా | అతివేగవతీ భూత్వా భారతం చాగతాపరా. 29

దక్షిణం జలధిం ప్రాప్తా తృతీయా సా సరిద్వరా | యస్యాః స్నానాయ సరతాం మనుజానాం పదేపదే. 30

రాజసూయాశ్వమేధాదిఫలం తు న హి దుర్లభమ్‌ | తతశ్చతుర్థీ ధారాతు శృంగవతృర్వతా త్పునః. 31

భద్రాభిధా సంస్రవతీ కురూ న్సంతర్ప్యచోత్తరాన్‌ | సముద్రం సమనుప్రాప్తా గంగా త్రైలోక్యపావనీ. 32

అన్యే నదాశ్చ నద్యశ్చ వర్షే వర్షేపి సంతి హి | బహుశో మేరుమందార ప్రసూతాశ్చైవ నారద. 33

తత్రాపి భారతం వర్షం కర్మక్షేత్ర ముశంతి హి | అన్యాని చాష్టవర్షాణి భౌమస్వర్గ వ్రదాని చ.34

స్వర్గిణాం పుణ్యశేషస్య భోగస్థానాని నారద | పురుషాణాం చాయుతాయుర్వ జ్రాంగా దేవసన్నిభాః. 35

పురుషా నాగసాహసై#్రర్దశభిః పరికల్పితాః | మహాసౌరతసంతుష్టాః కలత్రాడ్యాః సుఖాన్వితాః. 36

ఏకవర్షోనకే చాయుష్యాప్త గర్బాః స్త్రీయోపిహి | త్రేతాయుగ సమః కాలో వర్తతే సర్వదైవహి. 37

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ అష్టమస్కంధే సప్తమోధ్యాయః

ఇట్లు దేవపూజితయగు దేవనది క్షారసముద్రములో గలిసిపోవును. రెండవ ప్రవాహము మాల్యవతి శృంగముల నుండి వెలువడును. అచటనుండి వేగవతియై కేతుమాలగిరిని జేరి చక్షుర్నామమున పిలువబడిన గంగ పడమటి దిశగ ప్రవహించును. ఆ గంగ దేవవందితయై నదీపతియగు సాగరము జేరును. నారదా! ఇంక మూడవధారపేరులో ప్రసిద్ధిగాంచెను. అది పుణ్యయగు ''అలకనంద''. అది బ్రహ్మభవనమునుండి దక్షిణముగ బయలుదేరి వనదుర్గములు. గిరులు. దాటును. అటుల దాటివాటి గంగహేమకూటాద్రిని జేరును. అచటినుండి మహావేగమున భారతవర్షము జేరును. ఈ మూడవధార దక్షిణసముద్రములో కలియును. ఈ గంగలో స్నాన మాడుట కేగెడు నరు లతి ధన్యాత్ములు. వారి కడుగడుగున రాజసూయ-అశ్వమేధ యజ్ఞములు ఫలితము తప్పక లభించును. ఇక నాల్గవ గంగాధర శృంగాధార శృంగావత్‌గిరినుండి వెల్వడును. త్రైలోక్యపావని యగు నీ గంగభద్ర యనబరగి యుత్తర కురుభూములను తనిపి సముద్రగర్బములో గలియును. ఓయి నారదా! ప్రతిదేశ మందెన్నెన్నియో నదీనదములు గలవు. మేరుగిరిపై మందారవృక్షములు కోకొల్లులుగ నున్నవి. అచట దేవతలు ప్రమోదభరితు లగుచుందురు. భారతవర్షము ధర్మ-కర్మ-క్షేత్రము. మిగిలిన యెనిమిది దేశములు నమిత స్వర్గభోగములొసంగు నవి. ఆ యెనిమిది దేశమునులు స్వర్గము ననుభవించి వచ్చిన వారి పుణ్యశేషమునకు భోగస్థానములు-అచటి పురుషులు వజ్రకాయులు-దేవసన్నిభులు-సహస్ర దీర్ఘజీవులు. అచటి పురుషులు పదివేల యేనుగులంతటి బలము గలవారు. నిరంతరము స్త్రీల శృంగాక్రీడలందు ప్రమోదమందుచుండువారు. తమ ఆయువులో ఒక సంవత్సరము తక్కువ యున్నంతవరకు నచటి స్త్రీలు గర్బము దాల్తురు. అచ్చట త్రేతాయుగముతో సమానమైన కాలము సర్వకాలములందు నొకే రీతిగ నుండును.

ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమున సప్తమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters