Sri Devi Bagavatham-2
Chapters
అథ పంచయో೭ధ్యాయః వ్యాసః తయో స్తద్బాషితం శ్రుత్వా వేపమానా నృపాత్మజా | ధైర్య మాలంబ్య తౌ తత్ర బభాషే మితభాషిణీ.
1 దేవౌ వాం రవిపుత్రౌ చ సర్వజ్ఞా సుర సమ్మతౌ | సతీంమాం ధర్మశీలాంచ నైవంవదితు మర్హథః.
2 పిత్రా దత్తా సురశ్రేష్టౌ మునయే యోగధర్మిణ | కథం గచ్చామి తం మార్గం పుంశ్చలీ గణసేవితమ్.
3 ద్రష్టా೭యం సర్వలోకస్య కర్మసాక్షీ దివాకరః | కశ్యపాచ్చైవ సంభూతో నైవం భాషితు మర్హథః.
4 కులకన్యా పతింత్యక్త్వా కథమన్యం భ##జేన్నరమ్ | అసారే೭స్మిన్హి సంసారే జానంతౌ ధర్మనిర్ణయమ్. 5 యథేచ్ఛం గచ్చతం దేవౌ శాపం దాస్యామి వా೭సఫ° | సుకన్యా೭హంచ శర్యాతేః పతిభక్తి పరాయణా. 6 ఇత్యాకర్ణ్య వచస్తస్యా నాసత్యౌ విస్మితౌ భృశమ్ | తావబ్రూతాం పునసై#్త్వనాం శంకమానౌ భయం మునేః. 7 రాజపుత్రి ప్రసన్నౌ తే ధర్మేణ వరవర్ణిని | వరం వరయ సుశ్రోణి దాస్యావః శ్రేయసే తవ. 8 జానీహి ప్రమదే నూన మావాం దేవభిషగ్వరౌ | యువానం రూపసంపన్నం ప్రకుర్యావ పతిం తవ. 9 తత స్త్రయాణా మస్మాకం పతితమేకతమం వృణు | సమానరూపదేహానాం మధ్యే చాతుర్యపండితే. 10 సాతయోర్వచనం శ్రుత్వా విస్మితా స్వపతిం తదా | గత్వోవాచ తయో ర్వాక్యం తాభ్యాముక్తం యదద్బుతమ్. 11 ఐదవ అధ్యాయము సుకన్యా వృత్తాంతము అశ్వినుల మాటలు విని మితభాషిణియగు సుకన్య వణకుచు ధైర్యముబూని వారి కిట్లు పలికెను: మీరు దేవతలు - రవిపుత్రులు - సర్వజ్ఞులు-దేవప్రియులు. అట్టి మీరు ధర్మశీలనుకులసతినగు నన్నిట్లు బలుకదగునా? సుర శ్రేష్ఠులారా! నాతండ్రి నన్ను యోగనిష్ఠుడగు మునివరునకు ప్రదాన మొనరించెను. అట్టి నేనొక సామాన్యకులట మార్గ మెట్లు పొందుదును? సూర్యుడు-కర్మసాక్షి-సర్వలోకచక్షువు-కశ్యపసుతుడు. అతనికి పుట్టిన మీరిట్లు పలుకదగదు. ఒక కులకన్య తన ప్రాణ నాధుని విడనాడి పరపురుషు నెట్లు చేరగలదు? ఈ సంసారము సారహీనము. మీరు సూక్ష్మధర్మము నిర్ణయింపజాలుదురు. అనఘులారా! నేను శర్యాతిపుత్రిని. సుకన్యను-పతిభక్తి పరాయణను. మీరికస్వేచ్ఛగవెళ్లవచ్చును. లేనిచో మిమ్ముశపింతును. అను సుకన్య వాక్కులు నివి యశ్విదేవతలు విస్మయ మందిరి. వారు ముని వలన భయము నూహించి సుకన్యతోనిట్లనిరి: ఓ వరవర్ణినీ! సుశ్రోణీ! రాజపుత్రీ! నీ పతి ధర్మమునకు ప్రసన్నులమైతిమి. నీ శుభముగోరి వరము నిత్తుము కోరుకొనుము. ప్రమదా! మేము దేవవైద్యులము. నీ పతిని నవయువకునిగ సురూపసంపన్నునిగ జేయగలము. చతురగుణశీలా! మేము మువ్వురము సమానముగ వయోరూపదేహములు గలవార మగుదుము. మాలో నొక్కని పతిగ వరిం పుము. అను వారి మాటలువిని సుకన్య విస్మయమంది తన పతినిజేరి యతనితో వారు పల్కిన విచిత్ర వాక్కు లిట్లు పలుకసాగెను. స్వామి స్సూర్యసుతౌ దేవౌ సంప్రాప్తౌ చ్యవనాశ్రమే | దృష్టౌ మయా దివ్య దేహౌ నాసత్యౌ భృగునందన. 12 వీక్ష్య మాం చారు సర్వాంగీం జాతౌ కామాతురా వుభౌ | కథితం వచనం స్వామి న్పతిం తే నవ¸°వనమ్. 13 దివ్యదేహం కరిష్యావ శ్చక్షుష్మంతం మునిం కిల | ఏతేన సమయే నాద్య తం శృణు త్వం మయోదితమ్. 14 సమావయవరూపం చ కరిష్యావః పతిం తవ | తత్ర త్రయాణా మస్మాకం పతిమేకతమం వృణు. 15 తచ్ఛ్రుత్వా೭హామిహాయాతాప్రష్టుంత్వాంకార్యమద్బుతమ్ | కింకర్తవ్య మతఃసాధో బ్రూహ్యస్మిన్కార్య సంకటే. 16 దేవమాయా೭పి దుర్జేయా న జానే కపటం తయోః | యదాజ్ఞాపయ సర్వజ్ఞ తత్కరోమి తవేప్సితమ్. 17 చ్యవనః గచ్ఛ కాంతే೭ద్య నాసత్యౌ వచనాన్మమ సువ్రతే | ఆనయస్వ సమీపం మే శీఘ్రం దేవభిషగ్వరౌ. 18 క్రియాతామాశు తద్వాక్యం నాత్రకార్యా విచారణా | ఏవం సా సమనుజ్ఞాతా తత్రగత్వా వచో೭ బ్రహీత్. 19 క్రియాతా మాతు నాసత్యౌ సమయేన సురోత్తమౌ | తచ్ఛ్రుత్వా చాశ్వినౌ వాక్యం తస్యాస్తౌతత్రచాగతౌ. 20 ఊచతూ రాజపుత్రీం తాం పతిస్తవ విశత్వపః | రూపార్థం చ్యవన స్తూర్ణం తతో೭ంభః ప్రవివేశహ. 21 అశ్వినా వపి పశ్చాత్తత్ర్పవిష్టౌ సర ఉత్తమమ్ | తత స్తే నిఃసృతా స్తస్మా త్సరస స్తత్షణాత్త్రయః. 22 తుల్యరూపా దివ్యదేహా యువానః సదృశాః కిల | దివ్యకుండల భూషాడ్యాః సమానావయవా స్తథా. 23 భృగునందనా! మీ యాశ్రమ సమీపమున సూర్యపుత్రులు తేజస్స్వరూపులై వచ్చియున్నారు. నేను వారిని జూచితిని. వారిర్వును సర్వాంగ సుందరినగు నన్ను గాంచి కామపరవశులైరి. నీ పతిని నవయువకునిగ జేయుదుమని మాటయిచ్చిరి. నీ మునిపతికి చూపు నిత్తుము. దివ్య దృఢకాయుని జేతుము కాని నీవు మేము చెప్పిన నియమమును పాటించవలయును. మేము నీ పతికి మాతో సరిసమానమైన రూపము వయస్సు అవయవములు నొసంగుదుము. అపుడు మా ముగ్గురిలో నొక్కని పతిగ వరింపుము అనిరి. సాధుపుంగవా! వారిమాటలు విని యీ యద్బుత విషయము నీకు దెల్పుటకు వచ్చితిని. ఈ కార్య సంకటమునందేమి చేయవలయునో తెలియ జెప్పుము. సర్వజ్ఞా! దేవతల మాయ తెలియరాదు. వారి కపటము నెఱుగని దానను కనుక నీవు చెప్పినట్లు నీ కోర్కి తీర్తును ఆజ్ఞాపింపుము అన చ్యవన డిట్లనియెను: ''సాధుశీలా ! కాంతా! నీ విపుడు శీఘ్రమే వెళ్ళి నా మాటగ దేవ వైద్యులగు సూర్యపుత్రుల నిచటికి గొని రమ్ము, వెంటనే వారి మాట పాటింపుము. దీనికి విచారింపదగదు.'' అను పతి యనుమతిబడసి సుకన్య వారి చెంత కేగి ''ఓ యశ్వి కుమారులారా! మీరు సురోత్తములు. నేను మీ నియమము పాటింపగలను.'' అనెను. ఆమె మాటలు విని యశ్వినులు ముని సన్నిధి కరిగి ఇట్లనిరి : ఓ రాజ కన్యా! ఇపుడు నీపతి నీటిలో మునుంగవలయును. అపుడతనికి చక్కని రూపము ¸°వనము గల్గును. అని యశ్వినులనగనే చ్యవనుడు నీట మునిగెను. ఆ పిమ్మట అశ్వినులు సైతము కొలనులో మునిగిరి. తర్వాత ఆ సరస్సునుండి మువ్వురు దివ్య పురుషులు బయలు వెడలిరి. ఆ మువ్వురును దివ్య దేహాలు - నవ యువకులు - దివ్యకుండల మండితులు - సమాన రూపావయవములు గలవారు. తే೭బ్రువన్ సహితాః సర్వే వృణీష్య వరవర్ణిని | అస్మాక మీప్సితం భ##ద్రే పతిం త్వ మమలాననే. 24 యస్మి న్వా೭వ్యధికా ప్రీతి స్తం వృణుష్వ వరాననే | వ్యాసః : సాదృష్ట్వాతుల్యరూపాం స్తాన్సమానవయస స్తథా. 25 ఏకస్వరాం స్తుల్యవేషాం స్త్రీన్వై దేవసుతోపమాన్ | సా తు సంశయమాపన్నా వీక్ష్య తాన్సదృశాకృతీన్. 26 అజానతీ పతిం సమ్య గ్వ్యాకులా సమచింతయత్ | కిం కరోమి త్రయ స్తుల్యాః కం వృణోమి నవేద్మ్యహమ్. 27 పతిం దేవసుతా హ్యేతే సంశ##యే పతితా೭స్మ్యహమ్ | ఇంద్రజాల మిదం సమ్యగ్దేవాభ్యా మిహ కల్పితమ్. 28 కర్తవ్యం కిం మయా చాత్రమరణం సముపాగతమ్ | న మాయా పతి ముత్సృజ్య వరణీయః కథంచన. 29 దేవ స్త్వాధునికః కశ్చి దిత్యేషా మమ ధారణా | ఇతి సంచింత్యమానసా పరాం విశ్వేశ్వరీం శివామ్. 30 దధ్యౌ భగవతీం దేవీం తుష్టావచ కృశోదరీ | సుకన్యోవాచ : శరణం త్వాం జగన్మాతః ప్రాప్తా೭స్మి భృశదుఃఖితా. 31 రక్షమే೭ద్య సతీధర్మం నమామి చరణౌ తవ | సమః పద్మోద్బవే దేవి నమః శంకరవల్లభే. 32 విష్ణుప్రియే నమో లక్ష్మి వేదమాతః సరస్వతి | ఇదం జగత్త్వయా సృష్టం సర్వం స్థావరజంగమమ్. 33 పాసి త్వ మిద మవ్యగ్రా తథా త్సి లోకశాంతయే | బ్రహ్మవిష్ణుమహేశానాం జననీ త్వం సుసమ్మతా. 34 బుద్ధిదా೭సి త్వమజ్ఞానాం జ్ఞానినాం మోక్షదా సదా | ఆజ్ఞా త్వం ప్రకృతిః పూర్ణా పురుష ప్రియదర్శనా. 35 భుక్తి ముక్తి ప్రదా೭పిత్వం ప్రాణినాం విశదాత్మనామ్ | ఆజ్ఞానాం దుఃఖదా కామం సత్త్వానాం సుఖసాధనా. 36 అపుడు వారు ముగ్గురేక కంఠముతో నిట్లనిరి : వరవర్ణినీ! కమలాననా! మాలో నీ కిష్టుడైన వాని నొక్కని పతిగ వరింపుము. నీకు మేలగుత ! వరాననా! మాలో నెవని యందు నీకెక్కువ మక్కువ యుండునో యతనినే వరింపుము.'' అపుడు సుకన్య సమాన వయో రూపములుగల వారిని గాంచెను. రూపమునందు వేషమందు కంఠ స్వరమందు నెంత మాత్రమును భేదము లేకవెలుగుచున్న దేవ సుతులనుగాంచి యామె సందేహములో బడెను. వారిలో తన పతిని గుర్తించలేక సుకన్య వ్యా కులత్వముతోనిట్లు చింతించెను: ''ఇపుడేమి చేయుదును. మువ్వురును సమానులు. ఎవరిని వరింపవలయునోతోచుట లేదు. వీరు దేవ కుమారులు. వీరిలో నాపతిని తెలియక సంశయమున బడితిని. ఇందంతయు దేవతలు పన్నిన పన్నుగడ- ఇంద్రజాలము. ఇపుడు నాకర్తవ్యమేమి? నా పతిని దక్క వేరొక్కని వరింపను. అట్లయిన నాకు చావు నిక్కము. వీరిలో మూడవ వ్యక్తి యును దేవ పుత్రుడనియే భావించుచున్నాను.'' అని తలపోసి సుకన్య విశ్వేశ్వరి పరాశివదేవి భగవతి నీ విధముగ ధ్యానించి నుతించెను: ఓ జగన్మాతా ! నేను దుఃఖార్తనై నిన్ను శరణు వేడుచున్నాను. నీ చరణ కమలములకు మ్రొక్కుచున్నాను. నాపాతివ్రత్యము నిలువబెట్టుము. ఓ హ్రీంకార కమలాలయా! దేవీ! నీకు మనస్కారము. ఓ హరి ప్రియా లక్ష్మీ దేవి! వేద మాతా! సరస్వతీ! ఈ చరాచరమైన జగమంతయు నీచేత సృజింపబడెను. నీవు జగముల బ్రోతువు. శాంతికై లోకములు సంహరింతువు. ఓ తల్లీ! నీవు బ్రహ్మ విష్ణు మహేశులకు తల్లివి గదమ్మా! ఆజ్ఞానులకు బుద్ధి సుజ్ఞానులకు ముక్తిని నీవు ప్రసాదింతువు. నీవు పరా ప్రకృతివి- అజ్ఞవు- పురుషులకు ప్రియ దర్శినివి. తల్లీ! నీ వెల్ల విజ్ఞులకు భుక్తి ముక్తులు ప్రసాదింతువు. అజ్ఞులకు దుఃఖము గల్గింతువు. భూత జాలములకు సుఖము గల్గించుటే నీ పని. సిద్దిదా యోగినా మంబ జయదా కీర్తిదా పునః | శరణం త్వాం ప్రపన్నా೭స్మి విస్మయం పరమం గతా. 37 పతిం దర్సయ మే మాతర్మగ్నా೭స్మిన్ శోకసాగరే | దేవాభ్యాం చరితం కూటం కం వృణోమి విమోహితా. 38 పతిం దర్శయ సర్వజ్ఞే విదిత్వా మే సతీవ్రతమ్ | ఏవం స్తుతా తదా దేవీ తథా త్రిపుర సుందరీ. 39 హృదయే೭స్యా స్తదా జ్ఞానం దదావాశు సుఖోదయమ్ | నిశ్చిత్య మనసా తుల్య వయోరూపధరా న్సతీ. 40 ప్రసమీక్ష్య తు తా న్సర్వా న్వవ్రే బాలా స్వకం పతిమ్ | వృతే೭థ చ్యవనే దేవౌ సంతుష్టౌ తౌ బభూవతుః. 41 సతీధర్మం సమాలోక్య సంప్రీతౌ దదతు ర్వరమ్ | భగవత్యాం ప్రసాదేన ప్రసన్నౌ తౌ సురోత్తమౌ. 42 మునిమామంత్ర్య తరసా గమనా యోద్యతా వుభౌ | లబ్ద్వా తు చ్వవనో రూపం నేత్రే భార్యాంచ ¸°వనమ్. 43 హృష్ఠో೭బ్రవీ న్మహాతేజా స్తౌనాసత్యా విదం వచః | ఉపకారః కృతో೭యంమే యువాభ్యాం సురసత్తమౌ. 44 కిం బ్రవీమిసుఖం ప్రాప్తం సంసారే೭స్మి న్ననుత్త మే | ప్రాప్య భార్యాసుకేశాంతాం దుఃఖం మే೭భవదన్వహమ్. 45 అంధస్య చాతి వృద్దస్య భోగహీనస్య కాననే | యువాభ్యాం నయనే దత్తే ¸°వనం రూపమద్బుతమ్. 46 సంపాదితం తతః కించి దుపకర్తు మహం బ్రువే | ఉపకారిణి మిత్రేమో నోపకుర్యాత్కథంచన. 47 తం ధిగస్తు నరం దేవౌ భ##వేచ్చ ఋణవాన్బువి | తస్మాద్వాం వాంఛితం కించిద్దాతు మిచ్చామి సాంప్రతమ్. 48 ఓ యమ్మా! నీవు యోగులకు సిద్ధిదాయినివి- జయదాయినివి- కీర్తిదాయినివి. నే నిపుడు విస్మయముతో ప్రసన్ననై నిన్ను శరణు వేడుచున్నాను. ఓ మాతా! నే నిపుడు శోకసాగరమున మునిగితిని. దేవతల మోసములో జిక్కితిని. మాయా బ్రాంతి జెందితిని. వీరిలో నెవని వరింపవలయునో తోచుటలేదు. నా పతిదేవుని నాకు చూపింపుమమ్మా! దేవీ! నీవు సర్వజ్ఞు రాలవు. నా సతీవ్రతము నీకు దెలియును. నా పతి నెఱిగింపజేయుము.'' అని సుకన్య శ్రీత్రిపురసుందరీదేవిని ప్రస్తుతించెను. సుకన్య హృదయమున సుఖోదయమగునట్లు చ్వవనుని గుర్తించునట్లు దేవి జ్ఞాననేత్ర మొసంగెను. ఆ మువ్వురను సమానమైన రూప¸°వనముగల్గినవారిని సుకన్య గనెను, వారందఱిని చక్కగ పరిశీలించి సుకన్య వారిలో తన పతి ఎవరో గుర్తించెను. అట్లామె తన పతినే వరింపగ దేవతలు సంతుష్టులైరి. ఆ సురోత్తములు భగవతిప్రసాదమున ప్రసన్నులైరి. సుకన్య పరమపాతివ్రత్యమునకు సంప్రీతులైరి. వారు వారికి వరములు గురిసిరి. వారు పిదప మునిని వీడ్కొని వెళ్ళుటకు సిద్దముగ నుండిరి. అపుడు కన్నుల చూపును మదనసుందరదేహమును యువశక్తిని భార్యనుబడసి సంతోషించి చ్యవనుడు దేవవైద్యుల కిట్లనియెను: ఓ యశ్వినులారా ! మీ యిర్వురివలన నేను మహోపకారము పొందితిని. ఈ భోగ్య సంసారమునందు సుకేశియగు భార్యను బొందియు సుఖమొందలేకపోతిని. ప్రతిక్షణము దుఃఖమనుభవించితిని. ఈ నట్టడివిలో కన్నుల వెల్గుపోయి ముసలి వాడనై భోగభాగ్యములు లేక క్రుంగికృశించిన నాకు కన్నుల వెల్గును ¸°వనమును సురూపమును మీరొసంగితిరి. కనుక నేను మీకే కొంచెమైన ప్రత్యుపకారము చేయదలచితిని. ఒక మిత్రు డుపకారముచేసిన నతనికి మరల నుపకారము చేయకున్న దోషము. ఆ కృతఘ్నుడు వ్యర్థుడు. భూమిమీద వాడు ఋణగ్రస్తుడు. కనుక నే నిపుడు మీ వాంఛితమే కొద్దిగనైన తీర్చదలచితిని. ఆత్మనో ఋణమోక్షాయ దేవేశౌ నూతనస్యచ | ప్రార్థితం వాం ప్రదాస్యామి యదలభ్యం సురాసురైఃః 49 బ్రువాథాం వాం మనోద్దిష్టం ప్రీతో೭స్మి సుకృతేన వామ్ | శ్రుత్వాతౌతు మునేర్వాక్య మభిమంత్ర్య పరస్పరమ్. 50 తమూచతుర్ముని శ్రేష్ఠం సుకన్యాసహితం స్థితం | మునే పితుః ప్రసాదేన సర్వం నో మనసే ప్సితమ్. 51 ఉత్కంఠా సోమపానస్య వర్తతేనౌసురైః సహ | భిషజా వితి దేవేన నిషిద్దౌ సోమసంగ్రహే. 52 శ##క్రేణ వితతే యజ్ఞే బ్రహ్మణః కనకాచలే | తస్మాత్త్వమపి ధర్మజ్ఞ యదిశక్తో೭సి తాపస. 53 కార్య మేతద్ది కర్తవ్యం వాంఛితం నౌ సుసమ్మతమ్ | ఏత ద్విజ్ఞాయ వా బ్రహ్మన్కుర్వా వాంసోమపాయినౌ. 54 పిపాసా೭స్తి సుదుష్ప్రాపా త్వత్తః సముపయాస్యతి | చ్యవన స్తు తయోః ప్రాహ తచ్చ్రుత్వా వచనం మృదు. యదహం రూపసంపన్నో వయసా చ సమన్వితః | కృతో భవద్బ్యాం వృద్ద స్సన్ భార్యాంచ ప్రాప్తవానితి. 56 తస్మద్యువాం కరిష్యామి ప్రీత్యా೭హం సోమపాయినౌ | మిషతో దేవరాజస్య సత్యమేతద్ర్బవీమ్యహమ్. 57 రాజ్ఞస్తు వితతే యజ్ఞే శర్యాతే రమితద్యుతేః | ఇత్యాకర్ణ్య వచో హృష్టౌ తౌ దివం ప్రతి జగ్మతుః. 58 చ్యవన స్తాం గృహీత్వాతు జగామాశ్రమ మండలమ్. 59 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ సప్తమస్కంధే పంచయో೭ధ్యాయః దేవేశులారా! మీరు నాకు సురాసురుల కలవిగాని ¸°వనము ప్రాసాదించితిరి. మీ యేదైన కోర్కె దీర్చి నేను మీకు ఋణముక్తుడ గాగలను. మీ సుకృతికి ప్రీతుడనైతిని. మీ మనోవాంఛ దెలుపుడు. అను ముని వాక్కులువిని వారు తమలోతామాలోచించుకొనిరి. సుకన్యకు సరిజంటగ వెలయు మునివరునితో వారిట్లనిరి: మా తండ్రి దయవలన మా కోర్కె లన్నియు తీరినవి. కాని మేము దేవవైద్యులమని యింద్రుడు మమ్ము సోమపానము చేయనిచ్చుటలేదు. మా కా దేవతలతో గూడి సోమపానము చేయు కోర్కె గలదు. మున్ను కనకాచలముపై బ్రహ్మ జరిపిన యాగమున నింద్రుడు వైద్యులమగుటచే మాకు దేవతలతో సరిగా సోమపానము తగదనెను. కనుక ధర్మజ్ఞా తాపసా! నీకు శక్తియున్న మమ్ము సోమపాయులను జేయుము. ఈ మా వాంఛిత మీడేర్పుము. ఈ పని నెఱవేర్పుము. ఓ బ్రాహ్మణోత్తమా! ఇది అంతయు నెఱింగి మేము సోమపానము చేయునట్లు చేయుము. మాకు సోమపానమునకై దప్పిక మిక్కుటమైనది. నీవు మా దప్పిదీర్పగల దిట్టవు. అను వారి మాటలువిని చ్యవనుడు వారి కిట్లనెను: నే నొకప్పుడు ముసలివాడను. ఇప్పుడు మీ దయవలన రూపమును ¸°వనమును చక్కని భార్యను బడయగల్గితిని. కనుక దేవరాజు నెదుట మీరు సోమరసము ద్రాగునట్లు జేయగలను. నిజము బల్కుచున్నాను నా మాట నమ్ముడు. శర్యాతి రాజు గొప్ప తేజోవంతుడు. అతని యజ్ఞమున మీ కోర్కె దీర్చగలను. అను మాటలకు వారు ప్రీతులై దివికేగిరి. అంత చ్యవనుడు తన భార్యనుగొని తన యాశ్రమము జేరెను. ఇది శ్రీదేవీ భాగవతమందలి సప్తమ స్కంధమున పంచమాధ్యాయము.