Sri Devi Bagavatham-2
Chapters
అథ చతుర్దశో7ధ్యాయః శ్రీ నారాయణ ఉవాచః తతః పరస్తాద చ లోలోకాలోకేతి నామకః. |అంతరాలే చ లోకాలోకయోర్యః పరికల్పితః. 1 యావదస్తి చ దేవర్షే హ్యంతరం మానసోత్తరాత్ | సుమేరో స్తావతీ శుద్దా కాంచనీ భూమిరస్తి హి. 2 దర్పణోదరతుల్యా సా సర్వప్రాణివివర్జితా | యస్యాం పదార్థః ప్రహితో నకించిత్పృత్యుదీయతే. 3 అతః సర్వప్రాణి సంఘరహితా సా చ నారద | లోకాలోక ఇతివ్యాఖ్యా యదత్ర పరికల్పితా. 4 లోకాలోకాంతరే చాస్య వర్తతే సర్వదా స్థితిః | ఈ శ్వరేణ సలోకానాం త్రయాణా మంతగః కృతః. 5 సూర్యాదీనాం ధ్రువంతానాం రశ్మయో యద్వశా దిహ | అర్వాచీనాశ్చ త్రీంల్లోకానాతన్వానాః కదా పిహి. 6 పరాచీనత్వభాజో హి న భవంతి చ నారద | తావదున్నహనాయామః పర్వతేంద్రో మహోదయః. 7 ఏతావాంల్లోకవిన్యా సో7యం సంస్థామానసక్షణౖః | కవిభిః సతు వంచాశ త్కోటిభిర్గణిత స్యచ. 8 భూగోలస్య చతుర్థాంశో లోకాలోకాచలో మునే | తస్యోపరి చతుర్దిక్షు బ్రహ్మణా చాత్మయోనినా. 9 నివేశితా దిగ్గజా యే తన్నామాని నిబోధత | ఋషభః పుష్పచూడో7థ వామనో7థాపరాజితః. 10 పదునాలుగవ అధ్యాయము భువనవ్యవస్థా వర్ణనము నారాయణుడిట్లనెను : దానికిపైని లోకాలోకమను పర్వతము గలదు. ఆ పర్వత మధ్యభాగమున సూర్యప్రకాశము పడుచుండును. ఈ పర్వతముపై మేలిమి బంగరు నేల గలదు. అది మానసోత్తరము నుండి మేరువువర కెంత పొడవంత పొడవు గలదు. ఆ బంగారు భూమి నిగ్గుటద్దమువలె నిగ్గులుదేరి యుండును. అందు వేల్పులు తిరుగుచుందురు. అందే వస్తువు పడినను స్వర్ణమయమగును. ఓ నారదా ! అందువలన నందే ప్రాణియు నుండదు. ప్రజల కగమ్యమైన దగుటచేత నది లోకాలోకమని వ్యాఖ్యానించబడెను. ఈ సువర్ణస్థలము లోకాలోక పర్వతము మధ్యభాగమున సొంపారుచుండును. భగవంతు డీలోకాలోకమును ముల్లోకముల నట్టనడుమ నుండునట్టు లేర్పఱచెను. సూర్యునినుండి ధ్రవతారవఱకుండు కిరణములన్ని యును లోకాలోక పర్వతమునకు వశ##మై యవి మూడు లోకములను దాటి పోజాలకున్నవి. దేవఋషీ! ఈ పర్వతరాజమెంతెంతయో యెత్తుగ విశాలముగ నుండుటచేత సూర్యకిరణములు దీనిని దాటి యావలికి పోజాలవు. ఈ పర్వతములోకము లన్నింటికిని మానదండముగ నున్నది. ఇది యేబదికోట్ల యోజనములంత విస్తారముగ గలదని కవులందురు. ఓయి మునీ ! ఈ లోకాలోకాచలముమొత్తము భూగోళములో నాల్గవవంతు గలదు. స్వయంభువుడగు బ్రహ్మదానికి నలుదెసల నాల్గుస్థానము లేర్పఱచెను. అతడు గిరికి నాల్గు వైపుల దిగ్గజముల నుంచెను. వాని పేర్లు వినుము. ఋషభము, పుష్పచూడము వామనము అపరాజిత మనునవి పేర్లు. ఏతే సమస్తలోకస్య స్థితిహేతవ ఈరితాః | తేషాం చ స్వ విభూతీనాం బహువీర్యో పబృంహణమ్. 11 విశుద్ద సత్త్వం చైశ్వర్యం వర్దయన్బగవాన్హరిః | ఆస్తే సిద్ద్యష్టకోపేతో విష్వక్సేనాది సంవృతః. 12 నిజాయుధైః పరివృతో భుజదండైః సమంతతః | అస్తే సకలలోకస్యస్వస్తయే పరమేశ్వరః. 13 అకల్పమేవం వేషం సగతో విష్ణుః సనాతనః | స్వమాయారచితస్యాస్య గోపీథాయాత్మసాధనః. 14 యో7ంతర్విస్తార ఏతేన హ్యలోక పరిమాణకమ్ | వ్యాఖ్యాతం య ద్బహిర్లోకాలోకాచల ఇతీరణాత్. 15 తతః వరస్తా ద్యోగేశగతిం శుద్దాం వదంతి హి | అండమధ్యగతః సూర్యోద్యావాభూమ్యోర్యదంతరమ్. 16 సూర్యాండగోలయోర్మధ్యే కోట్యః స్యుః పంచవింశతిః | మృతే೭ండ ఏష ఏతస్మిన్ జాతో మార్తాండశబ్దభాక్. 17 హిరణ్యగర్బ ఇతి యద్దిరణ్యాండ సమదుద్బవః | సూర్యేణ హి విభజ్యంతే దిశః ఖం ద్యౌర్మహీభిదా. 18 స్వర్గాపవర్గౌ నరకా రసౌకాంసి చ సర్వశః | దేవతిర్య జ్మనుష్యాణాం సరీసృపసవీరుధామ్. 19 సర్వజీవనికాయానాం సూర్య ఆత్మా దృగిశ్వరః | ఏతావా న్బూమండలస్య యన్నివేశ ఉదాహృతః 20 ఎల్లలోకములయునికీ దిగ్గజములు జీవనాడులవంటివందురు. భగవానుడు వానిలోని సంపదలను వీర్యములను పెంపోందింపజేయును. అతడు దాని విశుద్ద సత్త్వమును పెన్నిధుల నినుమడింపచేయును. ఇట్లు భగవానుడగు హరి యచట నెనిమిది సిద్దులను విష్వక్యేనాదులను గూడి విలసిల్లుచుండును. పరమేశ్వరుడెల్లలోకముల మేలుగోరి తన దివ్యాయుధములు దాల్చి యందు వెలుగొందుచుండును. సనాతనుడగు శ్రీమహావిష్ణువు తన మాయారచితమగు దీనిని కల్పాంతమువఱకు గాపాడు చుండును. వీని లోపలి వైశాల్యమును బట్టి యాలోక పరిమాణము తెల్పబడెను. దానికి బయట లోకాలోక పర్వతము గలదని చెప్పబడెను. నారదా! ఈ పర్వతమునకు పైని సిద్ధయోగులు సంచరింతురందరు. ఈ భూమ్యాకాశముల నడుమ సూర్యడు సంచరించుచుండును. సూర్యునకు భూమికి నడుమ దూర మిరువదైదుకోట్ల యోజనము లుండును. మృతప్రాయమైన యండమునం దాత్మరూపమున ప్రవేశించుట వలన సూర్యుడు మార్తాండుడనబరగును. పెద్ద బంగారుగ్రుడ్డునుండి యుద్బవించుట వలన సూర్యడు హిరణ్యగర్బుడని పిల్వబడును. సూర్యునివలన నింగి నేల దిశలు స్వర్గము అపవర్గము నరకము రసస్థానములు సుర-నర-జంతువులు ప్రాకునవి వృక్షలతలు | ఈ సకల జీవకోటి కంతటికిని సూర్యడే యాత్మ. సూర్యడే చక్షురధిదేవత. ఇతడే భూమండల మంతట నిండి విరాజిల్లుచున్నాడు. ఏతేనా హి దివో మానం వర్ణయంతి చ తద్దియః | ద్విపలానాంచ నిష్పావాదీనాంచదలయోర్యథా. 21 అంతరేణ తయోరంత రిక్షం తదుభయసంధితమ్ | యన్మధ్యగశ్చ భగవా న్బానుర్వై తపతాంవరః. 22 ఆతపేన త్రిలోకీం చ ప్రతపత్యేవ భాసయన్ | ఉత్తరాయణ మాసాద్య గతిమాంద్యం వితన్వతే. 23 ఆరోహణస్థాన మసౌ గత్వా7హోదైర్ఘ్యమాచరేత్ | దక్షిణాయన మాసాద్య గతిశైఘ్ర్యం వితన్వతే. 24 అవరోహస్థాన మసౌ గచ్చ్వనృస్వందినంచరేత్ | విషువత్సంజ్ఞ మాసాద్య గతి సామ్యం వితన్వతే. 25 సమస్థాన మథాసాద్య దినసామ్యం కరోతి చ | యదా చ మే షతులయోః సంచరేద్దిదివాకరః. 26 సమానాని త్వహోరాత్రాణ్యాతనోతి త్రయీమయః | వృషాదిపంచసు యదారాశిష్వర్కో విరోచతే. 27 తదా7హాని చ వర్దంతే రాత్రయో7పి హ్రసంతి చ | వృశ్చికాదిషు సూర్యోహి యదా సంచరతే రవిః. 28 తదా7పీమాన్య హోరాత్రాణి భవంతి విపర్య యాత్. 29 ఇది శ్రీ దేవి భాగవతే మహాపురాణ7అష్టమస్కంధే చతుర్దశోధ్యాయః. సూర్యునివలననే పండితులు ద్యుపరిమాణమును తెల్పుదురు. ఎట్లన రెండు సమభాగములలో నొకటి తెలిసిన రెండవది తెలిసినటులే కదా ! తపించువారిలో శ్రేష్ఠుడగు సూర్యభగవానుడు దివిభువుల మధ్య తన వెల్గులు విరజిమ్ముచుండును. సూర్యుడు ఉత్తరాయనమును ఆశ్రయించియుండి తన నడకలో మాంద్యమును కలిగించుకొనును. ఏలయన ఉత్తరాయన గమనము అతనికి ఆరోహణ (పైకి ఎక్కుచు నడవవలసిన)స్థానము. కనుక అతడు దీనిని చేరియుండి. పగటి పరిమాణమును దీర్ఘముగా చేయును. దక్షిణాయనము అతనికి అవరోహణ(ఎత్తునుండి క్రిందికి దిగు) స్థానము. అందుచే అతడు దీనిని చేరి తన నడకను శ్రీఘ్రతరముచేయును. అందుచే అతడు దీనియందు ఉన్నపుడు పగళ్లపరిమాణమును హ్రస్వతరము (చాలపోట్టిదానినిగా) చేయును. విషువత్ అను స్థానము - ఒక అయనమునుండి మఱియెక అయనమునకు మారెడి ఒక దినము మాత్రము. ఇది సమస్థానము. దీని నాశ్రయించి సూర్యుడు పగటి పరామాణమును రాత్రి పరిమాణమును సమముగా చేయును (ఇది సాధారణుగా మార్చి-సెప్టెంబరు తేదీలకు ఇంచుమించుగా అగును.) ఇది సూర్యడు మేషము నందును తులయందును. చరించు కాలము అగును. అపుడు వేదత్రయమూర్తియగు రవి అహోరాత్రములను సమాన పరిమాణము కలవిగా చేయును. వృషభ-మిథున-కర్కట-సింహ-కన్యారాసులలో సూర్యుడున్నపుడు క్రమముగా పగళ్ల పరిమాణ మధికమగుచు రాత్రులు పరిమాణము తగ్గుచు పోవును. వృశ్చికధనుర్ - మకర- కుంభ-మీనరాసులందు సూర్యుడుండగా రాత్రుల పరిమాణము పెరుగుచు పగళ్ల పరిమాణము తగ్గుచు పోవును. ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమున పదునాల్గవ యధ్యాయము.