Sri Devi Bagavatham-2    Chapters   

అథ షోడశో7ధ్యాయః

శ్రీనారాయణః: అథాతః శ్రూయతాం చిత్రం సోమాదీనాంగమాదికమ్‌ | తద్గత్యనుసృతానౄణాం శుభాశుభ నిదర్శనా. 1

యథా కులాల చక్రేణ భ్రమతా భ్రమతాం సహ | తదాశ్రయాణాం చ గతి రన్యా కీటాదినాంభ##వేత్‌. 2

ఏవం హి రాశిబృందేన కాలచక్రేణ తేన చ | మేరుంధురంచ సరతాం ప్రాదక్షిణ్యన సర్వదా.

3

గ్రహాణాం భానుముఖ్యానాం గతి రన్యేవ దృశ్య తే | నక్షత్రాంతరగామిత్వా ద్బాంతరే గమనం తథా. 4

గతి ద్వయం చావిరుద్ధం సర్వత్రైష వినిర్ణయః | స ఏవ భగవా నాది పురుషో లోకభావనః.

5

నారాయణో7ఖిలాధారోలోకానాంస్వస్తయే భ్రమన్‌ | కర్మశుద్ధినిమిత్తంతు ఆత్మానంవై త్రయీమయమ్‌. 6

కవిభి శ్చైవ వేదేన విజిజ్ఞాస్యో7ర్కధా7భవత్‌ | షట్సుక్రమేణ ఋతువు వసంతాదిషు చ స్వయమ్‌. 7

యథో పజోష మృతుజా న్గుణా న్వై విదధాతి చ | తమేనం పురుషాః సర్వే త్రయ్యాచ విద్యయాసదా. 8

వర్ణా శ్రమాచారపథా తథా77మ్నాతై శ్చ కర్మభిః | ఉచ్చావచైః శ్రద్ధయా చ యోగానాం చ వితానకైః. 9

అంజసా చ యజంతే యే శ్రేయో విందంతి తే మతమ్‌ | అథైష ఆత్మా లోకానాం ద్యావాభూమ్యంతరేణ చ. 10

కాలచక్రగతో భుంక్తే మా సా న్ద్వా దశరాశిభిః | సంవత్సరస్యావయవా న్మాసః పక్షద్వయందివా. 11

నక్తం చేతి సపాదర్ష ద్వయ మిత్యు పదిశ్యతే | యావతా షష్ఠ మంశం స భుంజీత ఋతురుచ్యతే. 12

పదునాఱవ అధ్యాయము

భువనవ్యవస్థ - జ్యోతిర్వ్యవస్థ

శ్రీ నారాయణు డిట్లనెను : ఇపుడు నరులకు శుభాశుభములు గూర్చునట్టి చంద్రాది గ్రహముల గమనములగూర్చి వినుము. అది మిగుల ఆశ్చర్యకరమైనది. కుమ్మరి సారెపై నున్న కీటకాదులు సారెతోపాటు తిరుగును. అటులే కాలచక్రాత్మకమగు రాశిచక్రముతో బాటుగ గ్రహము లన్నియును మేరునగమునకు ప్రదక్షిణ మొనర్చుచు తమ అక్షమును వదల కుండును. భానుడు మొదలగు గ్రహముల గమనము విలక్షణ విధముగ దోచును. గ్రహములు తమ తమకు అధిపత్యము కల నక్షత్రములలో తిరుగుచు నితర గ్రహముల స్థానములను నక్షత్రములందును దిరుగును. ఈ రెండు విధములగు గమనములు పరస్పరము విరోధము లేనివి. భగవాను డాదిపురుషుడు లోకభావనుడు అగునట్టి శ్రీమన్నారాయణుడే స్వయముగ జగముల మేలుకోరి యిట్టుల జ్యోతీరూపమున తిరుగుచుండును. అతడే కర్మశుద్ధి కారణముగ త్రయీమము డనబరగును. అతడే సూర్యరూపమున పండ్రెండు భేదములుగ నయ్యెనని తత్త్యవేత్తలందురు. ఆ సూర్యుడే వసంతము మున్నగు నారు ఋతువులను క్రమముగ ననుభవించును. అతడు వానిలో నాయాఋతుధర్మములు నెలకొల్పును. అట్టి యాదిత్య పురుషు నెల్లరును త్రయీవిద్యతో నుపాసింతురు. మానవులు తమ తమ వర్ణాశ్రమధర్మములతో వైదిక కర్మలతో కొద్ది గొప్ప క్రియలతో శ్రద్ధాయోగములతో రవినిసేవింతురు. ప్రజలు తమ తమ కోర్కె లీడేరుటకు సతతము భాస్కరునిగూర్చి వేల్తురు. నమస్కరింతురు. దేవగణ స్వరూపములతో తేజరిల్లుచు తిరుగుచు పండ్రెండు మాసము లనుభవించును. మాసమనగ రాత్రిపగలు కలిసిన రెండు పక్షములు. లేక రవి రెండుంబావు నక్షత్రములం దిరుగు కాలము మాసము. ఇట్లు రవి రెండురాసు లనుభవించు కాలమును ఋతు వందురు.

సంవత్సర స్యావయవః కవిభి శ్చో పవర్ణితః | యావతార్ధేన చాకాశ వీథ్యాం ప్రచరతే రవిః.

13

తం ప్రాక్తనా వర్ణయంతి అయనం ముని పూజితాః | అథ యావ న్నభో మండలం సహ ప్రతిగ చ్ఛతి. 14

కార్త్స్నేన సహ భుంజీత కాలంతం వత్సరం విదుః | సంవత్సరం పరివత్సర మిడా వత్సర మేవ చ. 15

అను వత్సర మిద్వత్సర మితి పంచ సమీరితమ్‌ | భానో ర్మాంద్యశై ఘ్ర్య సమగతిభిః కాల విత్తమైః. 16

ఏవం భానో ర్గతిః ప్రోక్తా చంద్రా దీనాం నిబోధత | ఏవం చంద్రో7ర్కర శ్మిభ్యో లక్షయోజన మూర్ధ్వతః. 17

ఉపలభ్యమానో మిత్రస్య సంవత్సరభుజిం చ సః | పక్షాభ్యాం చౌషదీనాథో భుక్తం మాసభుజించ సః. 18

సపాద మాభ్యాం దివసభుక్తిం పక్షభుజిం చరేత్‌ | ఏవం శీఘ్రగతిః సోమో భుంక్తే నూనం భచక్రకమ్‌. 19

పూర్య మాణ కలాభి శ్చామరాణాం ప్రీతిమావహన్‌ | క్షీయమాణ కలాభి శ్చ పితౄణాం చిత్తరంజకః. 20

అహోరాత్రాణి తన్వానః పూర్వాపరసుఘ స్రకైః | సర్వజీవనికాయస్య ప్రాణో జీవః స ఏవహి. 21

భుంక్తేచైకైక నక్షత్రం ముహూర్త త్రింశతా విభుః | స ఏవ షోడశ కలః పురుషో7నాది రుత్తమః. 22

మనోమయో ప్య న్న మయో7మృతధామా సుధాకరః | దేవ పితృమనుష్యాది సరీసృప సవీరుధామ్‌. 23

ప్రాణా ప్యాయన శీలత్వా త్స సర్వమయ ఉచ్యతే | తతో భచక్రం భ్రమతి యోజనానాం త్రిలక్షతః. 24

ఈ ప్రకారముగ సంవత్సరము యొక్క యవయవములను తత్త్వవేత్త లభివర్ణించిరి. భానుడు మూడు ఋతువులలో నింగినెంతకాలములో తిరుగునో ఆ కాల పరిమాణమును పెద్దలయనమని వచింతురు. ఇట్లు రవి పండ్రెండు రాసులందును పూర్తిగ తిరుగును. ఇట్లు పండ్రెండు నెల లనుభవించు కాలము నొక సంవత్సర మందురు. సంవత్సరము-పరివత్సరము-ఇడావత్సరము-అనువత్సరము-ఇద్వత్సరము నని సంవత్సర మయిదు విధములు. రవికి మంద-మధ్య-శీఘ్ర గతులు మూడు గలవని కాలవిదులు వాక్రుత్తురు. ఈ విధముగ సూర్యగతి గుఱించి తెల్పితిని.

ఇక చంద్రాదులగతి గూర్చి వినుము. చంద్రుడు సూర్యనకు లక్ష యోజనములదూరముననుండి వెన్నెలలు గాయుచుండును. ఓషధులపతి వెన్నెలఱడు సూర్యుడు సంవత్సరములో నడుచు మార్గమును చంద్రుడు రెండు పక్షములలో పూర్తి చేయును. సూర్యుడు నెల నడచు మార్గమును చంద్రుడు రెండుంబావు నాళ్లలలో (నొకరాశి) ననుభవించును. ఇటు త్వరితగతితో చంద్రు డెల్ల నక్షత్రముల ననుభవించును. కళానాథుడగు చంద్రుడు షోడశకళలతో నిండి దేవలతలకును తగ్గిన కళలతో పితృదేవతలకును మోదము చేకూర్చును. ఇతడు పూర్వము-అపరము నను పేర్లతో దివారాత్రులు గల్గించును. చంద్రు డెల్ల జీవకోటికి ప్రాణము-అమృతము. చంద్రుడు సనాతనుడు ఉత్తమపురుషుడు షోడశకళాత్మకుడు; ఇతడు ముప్పది ముహూర్తములలో నొక్కొక్క నక్షత్రము వంతున ననుభవించును. చంద్రుడు-మనోమయుడు-సుధాకరుడు-అన్నమయుడు-అమృతధాముడు-శృంగార కళానిధి-ఎల్ల దేవ -పితృ -నర -జంతు -వృక్ష గణములకు తృప్తికురుడు. ఎల్ల ప్రాణులకు ప్రీతికరుడు. కనుక చంద్రుని సర్వమయు డందురు. చంద్రునకు మూడు లక్షల యోజనములమీద నక్షత్ర చక్రము తిరుగుచుండును. ఇవన్నియును భగవంతునిచేత నియోగింపబడి మేరువునకు ప్రదక్షిణము చేయుచుండును.

మేరు ప్రదక్షిణనైవ యోజితం చేశ్వరేణ తు | అష్టా వింశతి సంఖ్యాని గణితాని సహాభిజిత్‌. 25

తతః శుక్రో ద్విలక్షేణ యోజనానా మథోపరి | పురః పశ్చా త్స హై వాసావర్కస్య పరివర్తతే. 26

శీఘ్ర మందసమానాభి ర్గతిభి ర్వి చర న్విభుః | లోకానా మనుకూలో7యం ప్రాయః ప్రోక్తః శుభావహః. 27

వృష్టి విష్టంభశమనో భార్గవః సర్వదా మునే | శక్రా ద్బు ధః సమాఖ్యాతో యోజనానాం ద్వీ లక్షతః. 28

శీఘ్రమందసమానాభి ర్గతిభిః శుక్ర వత్సదా | యదా7ర్కాద్వ్యతిరిచ్యేత సౌమ్యః ప్రాయేణతత్రతు. 29

అతీవాతా భ్రపాతానావృష్ట్యాది భయసూచకః | ఉపరిష్టాత్తతో భౌమో యోజవానాం ద్విలక్షతః. 30

పక్షై స్త్రిభి స్త్రిభిః సో7యం భుంక్తే రాశీనథై కశః | ద్వాదశాపి చ దేవర్షే యది వక్రోన జాయతే. 31

ప్రాయేణ శుభకృత్సో7యం గుహౌఘానాంచసూచకః | తతో ద్విలక్షమానేన యోజనానాం చ గీష్పతిః. 32

ఏకైకస్మిన్నథో రాశౌ భుంక్తే సంవత్సరం చరన్‌ | యది వక్రో భవన్నైవానుకూలో బ్రహ్మవాదినామ్‌. 33

తతః శ##నైశ్చరో ఘోరో లక్షద్వయపరో మితః | యోజనైః సూర్యపుత్రో7యం త్రింశన్మాసైః పరిభ్రమన్‌. 34

ఏకైకరాశౌ పర్యేతి సర్వాన్రాశీన్మహా గ్రహః | సర్వేషా మశుభో మందః ప్రోక్తః కాలవిదాం వరైః. 35

తత ఉత్తరతః ప్రోక్త మేకాదశ సులక్షకైః | యోజనైః పరిసంఖ్యాతం సప్తర్షీణాం చ మండలమ్‌. 36

లోకానాం శం భావయంతో మునయః సప్తతే మునే | యత్త ద్విఫ్ణుపదం స్థానం దక్షిణంక్రమతే చ తే. 37

ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ అష్టమస్కంధే షోడశో7ధ్యాయః.

అభిజిత్తునుగూడి నక్షత్రములు మొత్త మిరువదెనిమిదిగ లెక్కింపబడినవి. వీనికి రెండు లక్షల యోజనముల దూరాన శుక్రుడు ప్రకాశించుచు రవికి ముందువెనుకల సమముగ తిరుగుచుండును. శుక్రునకును శీఘ్ర-సమ-మందగతులు గలవు. ఇతడు లోకుల కనుకూలుడు-మేలు గూర్చువాడు. ఇతడు వర్షము నాపు గ్రహములను శాంత పరచి ప్రాణులకు సుఖము చేకూర్చును. ఇతనికి రెండు లక్షల యోజనముల దూరమున బుధు డొప్పారుచుండును. శుక్రునకు వలె బుధునకును శీఘ్ర-సమ-మందగతులు గలవు. ఒక్కొక్కసారి బుధుడు సూర్యునకు చాల దూరముగ నుండును. అపుడు పెనుగాలులు మేఘపాతములు అనావృష్ఠుల భయము సూచింపబడును. ఇతనికి పైని రెండు లక్షల యోజనముల దూరమున కుజుడు చెన్నొందుచుండును. కుజుడు వక్రుడు గానిచో మూడు పక్షముల కొక రాశి ననుభవించును. ఇటులే పండ్రెండు రాసు లనుభవించును. ఇతడు పాపగ్రహములలో చేరినవాడు. తఱచుగ నశుభము చేయువాడు. ఇతనికి రెండు లక్షల యోజనముల మీద గురుడు విరాజిల్లుచుండును, గురుడు ప్రతీరాశి నొక్క యేడాది యనుభవించును. ఇతడు వక్రించనిచో బ్రహ్మవాదులకు శుభము గల్గును. ఇచనికి రెండులక్షల యోజనముల పైని సూర్యసుతుడు క్రూరుడునగు శని గలడు. ఇత డొక్కొక రాశిని ముప్పదినెల లనుభవించును. ఈ విధముగ గ్రహము లన్నియు నొక్కొక్క రాశి చొప్పున నెల్ల రాసులు దిరుగుచుండును. కాలజ్ఞులు శని యెల్లరికినికీడు గల్గించువా డందురు. ఇతనికి మీద నుత్తరముగ పడునొకండు లక్షల యోజనములపైని సప్తర్షి మండలము శోభిల్లు చుండును, ఈ యేడుగురు మునులును లోకహితము చేకూర్చు తలంపుతో విష్ణుపదస్దానమునకు ప్రదక్షిణము చేతురు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమున పదునారవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters