Sri Devi Bagavatham-2
Chapters
అథ వంశో 7ధ్యాయః శ్రీనారాయణః తతో7 ధస్తా ద్వీవరకం తలాతల ముదీరితమ్ | దానవేంద్రో మయో నామ త్రిపురాధిపతిర్మహాన్. 1 త్రిలోక్యాః శంకరేణా7యం పాలితో దగ్థపూస్త్రయః | దేవేదేవ ప్రసాదా త్తు లబ్థ రాజ్యసుఖాస్పదః.2 ఆచార్యో మాయినాం సో7యం నానామాయావిశారదః | పూజ్యతే రాక్షసైర్ఘోరైః సర్వకార్య సమృద్దయే. 3 తతో ధస్తా త్సు విఖ్యాతం మహాతల మితి స్పుటమ్ | సర్పాణాం కాద్రవేయాణాం గణః క్రోధవశో మహాన్. 4 అనేక శిరసాం విప్ర ప్రధానా న్కీర్తయామితే | కుహక స్తక్షక శ్చైవ సుషేణః కాలియ సథా. 5 మహాభోగా మహాసత్త్వా ః క్రూరా ః క్రారస్వజాతయః | పతత్రి రాజాధిపతే రుద్విగ్నాః సర్వ ఏవతే 6 స్వకలత్రాపత్య సుహృత్కుటుంబస్య చ సంగతాః | ప్రమత్తా విహరంత్యేవ నానా క్రీడా విశారదాః . 7 తతో 7ధస్తా చ్చ వివరే రసాతలసమాహ్వయే | దైతేయా నివసంత్యేవ పణయో దానవాశ్చయే. 8 నివాతకవచా నామ హిరణ్య పురవాసినః | కాలేయా ఇతి హ ప్రోక్తాః ప్రత్యనీకా హవిర్బు జామ్. 9 మహౌజ స శ్చో త్పత్యైవ మహా సాహసిన స్తథా | సకలలేశస్య చ హరే స్తే జసా హతవిక్రమాః. 10 బిలేశయా ఇవ సదా వివరే నివసంతి హి | యేవై వాగ్బిః సరమయా శక్రదూత్యా నిరంతరమ్. 11 మంత్రవర్ణాభి రసురా స్తాడితా బిభ్యతిస్మహ | తతో7ప్యధస్తా త్పాతాలే నాగలోకాధిపాలకాః. 12 ఇరవదవ అధ్యాయము భువనవ్యవస్థ - అతలాది లోకవర్ణనము శ్రీనారాయణు ఇట్లు పలికెను. : సుతలమునకు క్రింద తలాతలమను లోకము గలదు. అందు గొప్ప దానవపతి త్రిపురాధినాధుడు మయుడనువాడుండును. శివుడు త్రిపురములు గాల్చుతఱి దేవదేవుని దయవలన నితడు రక్షింపబడి రాజ్య సుఖములు పడసెను. మయుడు గొప్పమాయావి! మాయావులకు మాయావి! పెక్కురు రక్కసులతనిని తమ కార్యసిద్దికొఱకు సేవించుచుందురు. సుతలమునకు క్రింద మహాక్రోధవశులును కద్రూతనయులునగు నాగరాజులు నివసించు ప్రసిద్ద మహాతలము గలదు. నారదా! వీరికి పెక్కుతలలుండును. వీరిలో ముఖ్యులను గీర్తింతును; వినుము. కుహకుడు, తక్షుకుడు సుషేణుడు కాళియుడు. వీరుపెద్ద పడగలుగల్గి మహాబలముగల్గి క్రూరస్వభావముగల క్రూర జాతులు. వీరందఱను గరుటామంతునికి జంకుదురు. వీరు తమ తమ భార్యాపుత్ర-మిత్ర-కుటుంబముతో గూడి పెక్కుక్రీడలందారితేరి మదించి ప్రవర్తింతురు. మహ తలమునకు క్రింద రసాతలమను మహావివరముగలదు. ఇందు పెద్దఫణములు గల్గిన దైత్యదానవులు వసింతురు. ఇం దు సుర వైరులు హిరణ్యపురవాసులు కాలేయులనబడు నివాతకవచాది రాక్షసులు వసింతురు. వీరు పుట్టునప్పట్టి నుండియే వీరులు-శూరులు. వీరు శ్రీహరితేజమున మాత్రము నిర్నీర్యులగుదురు. వీరెల్లప్పుడును బిలేశయులవ పగిది వినరమందే వసింతురు. సరమ శక్ర దూతిక. ఈమెమంత్ర వర్ణములుగల వాక్కులకు రసాతలవాసులు గడగడ లాడుదురు. రసాతలము క్రింద నాగలోకపతులు వసించు పాతాళము గలదు. వాసుకుప్రముఖాః శంఖః కులికః శ్వేత ఏవచ | ధనంజయో మహాశంభో ధృతరాష్ట్ర స్తథైవ చ. 13 శంఖచూడః కం బలాశ్వతరో దేవోపదత్తక ః | మహామర్షా మహాభోగా నివసంతి విషోల్బణాః. 14 పంచమస్తకవంతశ్చ ఫణాసప్తకభూషితాః | కేచిద్దశఫణాః కేచి చ్చతశీర్షా స్తథా7పరే. 15 సహస్రశిరస కే7పి రోచిష్ణుమణిధారకాః | పాతాలరంధ్రతిమిరనికరం స్వమరీచిభిః. 16 విధమంతి చ దేవర్షే సదా సంజాతమన్యవః | అస్య మూలప్రదేశేహి త్రింశత్సాహ స్రికేం7తరే. 17 యోజనైః పరిసంఖ్యాతే తమసీ భగవత్కలా | అనంతాఖ్యా సమాస్తేహి సర్వదేవప్రపూజితా. 18 అహమిత్యభిమానస్య లక్షణం యం ప్రచక్షతే | సంకర్షణం సాత్వతీయాః కర్షణం ద్రష్టృదృశ్యయోః. 19 ఇధం భూమండలం యస్య సహస్రశిరసః ప్రభోః | అనంతమూర్తే ః శేషస్య ధ్రియమాణం చ శీర్షికే. 20 పృధ్వీగోల మశేషం హి సిద్దార్థ ఇవ లక్ష్యతే | యస్య కాలేన దేవస్య సంజిహీర్షోః సమంవిభోః. 21 చరాచరం భ్రవోరంతర్వివరాదుదపద్యత | సంకర్షణో నామ రుద్రో వూహైకాదశశోభితః. 22 త్రిలోతనశ్చ త్రిశిఖం శూల ముత్తంభ యన్స్వయమ్ | ఉదతిష్ఠన్మహాసత్త్వో మహాభూతక్షయంకరః. 23 యస్యాంఘ్రికమలద్వంద్వ శోణాచ్చనఖ మండలే | వీరాజన్మణి బింబేషు మహాహిపతయో7నిశమ్. 24 వాసుకి శంఖ కులిక శ్వేత ధనంజయ మహశంఖ ధృతరాష్ట్ర శంఖచూడ కంబల అశ్వతర దేవోపదత్తక నామములుగల నాగులు ప్రముఖులు. వీరు కోపావేశమున విషములు గ్రక్కుచుందురు. వీరులో నొక కొందరైదుతలలు నేడుతలలు పదితలలు నూఱు పడగలు వేయితలలు గల్గి తమ తమ ఫణా మణి కాంతిరేఖలలతో ఫాతాళమందలి చిమ్మచీకట్లు పారద్రోలుచుందురు. నారదా! వీరెల్లరును కోపాటోపముతో బుసలు గొట్టుచుందురు. దీనికి మూలమున ముప్పదివేల యోజనముల వైశాల్యమున నొక భగవత్తళ గలదు. అది తామసకళ. అనంత నామనున నెల్ల దేవతలచేత పూజింపబడుచుండును. అభిమానమునకు లక్షణ మహంకార మందురు. ద్రష్టృ-దృశ్యముల యైక్యమును సంకర్షణ మందురు. అనంతుడనంతమూర్తి; అదిశేషుడు. అతని వేయితలలపై భూమండల మంతయును నిల్చియున్నది. అతని తలలపై నీభూమండల మొక కమలమువలె నొప్పును. లయకాలుడగు రుద్రు డీ చరాచరములను సంహరింపదలచును. అపుడతని కన్బొమల నుండి సంకర్షణులను పేర్లగల పదునొకండు ప్యూహముల రుద్రులుద్బవింతురు. అపుడు ముక్కంటి త్రిశూలము చేబూని మహాభూత భయంకరముగ దోచును. అంత రుద్రుని పదపద్మకాంతులచే కెంపెక్కిన కాలిగోళ్ల కాంతులు పాపఱడుల తలల మణి బింబములపై చెన్నలరును. ఏకాం భక్తియోగేన సహ సాత్త్వతపుంగవైః | ప్రణమంత ః స్వమూర్ద్నాతే స్వముఖాని సమీక్షతే. 25 స్పురత్కుండల మాణిక్య ప్రభా మండల భాంజ్యుపి | సుకపోలాని చారూణి గండస్థలద్యు మంతి చ . 26 నాగరాజ కుమార్యో 7పి చార్వంగ విలసత్త్విషః | విశ##దై ర్విపులై స్త ద్వ ద్థవలైః సుభ##గై స్తథా. 27 రుచిరై ర్బుజ దండై శ్చ శోభమానా ఇతస్తతః | చంద నా గురు కాశ్మీర పంకలేపేన భూషితాః. 28 తదభి మర్షసంజాత కామవేశసమాయుతా ః | లలితస్మితసంయుక్కాః సవ్రీడం లోకయంతి చ. 29 అనురాగమదోన్మత్త విఘూర్ణా రుణలోచనమ్ | కరుణా వలోక నేతం చ ఆశాసానా స్తథా7శిషః. 30 సో7నంతో భగవాన్దేవో7నంతసత్త్వో మహాశయః | అనంతగుణ వార్ది శ్చ ఆదిదేవో మహాద్యుతిః. 31 సంహృతామర్షరోషాదివేగోలోకశుభాయ చ | ఆస్తే మహాతత్త్వ దేవ నిధిః సర్వ ప్రపూజితః. 32 ధ్యాయమానః సురైః సిద్దైరసురై శ్చోరగై స్తథా | విద్యాధ రై శ్చ గంధర్వైర్మునిసంఘైశ్చ నిత్యశః. 33 అనారత మదోన్మత్త లోక విహ్వలలోచనః | వాక్యామృతేన విబుధా న్స్వ పార్ష దగణానపి. 34 ఆప్యాయమానః స విభ##ర్వైజయంతీం స్రజందధ | అవ్లూత్ నాభినవైః స్వచ్చై స్తులసీదలసంచయైః. 35 మాద్యన్మధుకర వ్రాతఘోష శ్రీసంయుతాం సదా | నీలవాసా దేవదేవ ఏకకుండలభూషితః. 36 హలస్యకకుదిన్యస్త సుపీవరభూజో7వ్యయామ్ | మహేంద్రః కాంచనీం యద్వ ద్వరత్రాం చ మతం గమః. 37 ఉదారలీలో దేవేశో వర్ణితః సాత్త్వతర్షభైః. ఇతి శ్రీదేవీభాగవతేమహా పురాణ అష్టమస్కంధే వింశోధ్యాయః. అత్తఱి సజ్జను లనన్య భక్తియోగమున తలలు వంచి దోయిలించి మ్రొక్కుచు తమ మొగములు చూచుకొందురు. వారిచెన్నొందు కుండలకాంతులు నిగ్గుటద్దములవంటి చెక్కిళ్లను మఱింత కాంతిమంతముగ జేయును. నాగరాజకన్యకల విలాసములు వంపుసోంపు లందాలు మిక్కిలి యచ్చమైన తళతళ కాంతులు విరజిమ్ముచుందురు. వారు తమ నునువెచ్చని భు జదండములకు చందనాగురు కస్తూరి సువాసనలు పూసికొని యలంకరించుకొందురు. వారు పురుషుల యంగములుతాకి నంతన కామపరవశ##లై వలపులేనవ్వులు గురియుచు తలలు వంచి ప్రక్కచూపుల గాంతురు. అనురాగము గల్గినపుడు కమ్మని మైకము మత్తెక్కించుటచే నెఱుపెక్కిన వారి కన్నులు మత్తుగ తిరుగును. దయ చూపదలచి నపు డా కన్నులే యాశీస్సులు కురియును. అనంత భగవాను డనంత సత్త్వుడు. అనంత సుగుణవారిధి ఆది దేవుడు మహాద్యుతిమంతుడు. మహాభోగి అతడు సర్వలోకహితముగోరి క్రోధముడిగ సురగణపూజితుడై యచ్చోట విలసిల్లుచుండును. అతనిని ముప్ప్రొద్దులు సురాసులు సిద్దవిద్యాధరగంధర్వలు మునులు నాగులు ధ్యానించుచుందురు. అచటి దేవు డనారతము మదించి వ్యాకులత్వ మొందు కన్నులతో నొప్పిన తల వచనామృతముచే తన పార్షదగణములను విబుధులను తనుపును. ఆ దేవు డేనాటికిని వాడని నవనవమగు తులసీదళముల వైజయంతీమాలికను దాల్చి రాణ కెక్కును. ఆ భగవానుడు మత్తెక్కిన గండుతుమ్మెదల శోభను తిరస్కరించు పట్టుపుట్టముగట్టి యొకే కుండలము దాల్చి శోభిల్లును. ఆదేవుడు హలముపైతన లావు బూజముమోపి యింద్రునైరావతము పగిది శోభిల్లుచుండును. ఆ దేవేశు డుదారశీలుడని తత్త్వవేత్త లభినుతింతురు. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంధమందు యిరువదవ యధ్యాయము.