Sri Devi Bagavatham-2
Chapters
అధఏకవింశో7ధ్యాయః. నారాయణః తస్యానుభావం భగవా స్ర్బ హ్మ పుత్రః సనాతనః |
సభాయాం బ్రహ్మదేవ స్య గాయమాన ఉపాసతే. 1 ఉత్పత్తి స్థితి లయ హేతవో7స్య కల్పాః| సత్త్వా ద్యాః ప్రకృతిగుణా యదీక్షయా 77సన్; యద్రూపం ధ్రువ మకృతం యదే కనామా | త్మన్నా నాధా త్కథ ముహ వేద తస్య వర్త్మ. 2 మూర్తిం నః పురు కృపయా బభార సత్త్వం సంశుద్దంసద సదిదం విభాతి యత్ర | యల్లీలాం మృగపతి రాదదే7న వద్యా మాదాతుం స్వజనమనాం స్యుదారవీర్యః. 3 యన్నామ శ్రుతమనుకీర్తయే దకస్మా దార్తో వా యది పతితః ప్రలంభ నాద్వా| హంత్యంహః సవది నృణా మశేష మన్యం కంశేషా ద్బ గవత ఆశ్రయే ముముక్షుః. 4 మూర్ద నర్బిత మణువ త్స హ స్రమూర్ద్నో భూగోలం సగిరిసరిత్సముద్ర సత్త్వమ్| ఆనంత్యా దనమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్య ధిగణ యే త్సహ స్ర జిహ్వః. 5 ఏవం ప్రభావో భగవా ననంతో దురంత వీర్యోరు గుణానుభావః | మూలే రసాయా ః స్థిత ఆత్మతంత్రో యో లీలయా క్ష్మాం స్థితయో బిభర్తి. 6 ఏతా హ్యేవేహ తు నృభి ర్గతయో మునిసత్తమ | గంతవ్యా బహుశో యద్వ ధ్య థాకర్మ వినిర్మితాః. 7 యథోపదేశం చ కామా న్సదా కామాయమానకైః | ఏతావతీర్హి రాజేంద్ర మనుష్య మృగ పక్షిషు 8 విపాకతగయః ప్రోక్తా ధర్మ స్య వశగా స్తథా | ఉచ్చావచా విసదృశా యథావ్రశ్నం నిబోధత.9 నారదః: వైచిత్ర్య మే తల్లో కస్య కథం భగవతా కృతమ్ | సమానత్వే కర్మణాం చ తన్నో బ్రూహి యథాతథామ్. 10 నారాయణ ఉవాచః కర్తుః శ్రద్దావశాదేవ గతయో 7పి పృథగ్విథా ః | త్రిగుణత్వా త్సదా తాసాం ఫలం విసదృశం త్విహ. 11 సాత్తి క్యా శ్రద్దయా కర్తుః సుఖిత్వం జాయతే సదా | దుఃఖి త్వం చ తథా కర్తూరాజస్యా శ్రద్దయా భ##వేత్. 12 దుఃఖిత్వం చైవ మూఢత్వం తామస్యా శ్రద్ద యోదితమ్ | తారతమ్యా త్తు శ్రద్దానాం ఫలవై చిత్ర్య మీరితమ్. 13 ఆనాద్య విద్యా విహిత కర్మణాం పరిణామజాః | సహస్రశః ప్రవృత్తా స్తు గతయో ద్వి జపుంగవ. 14 ఇరువది ఒకటివ అధ్యాయము కర్మగతి విశేషవ్యవస్థ నారాయణు డిట్లనెను: ఆ యనంతుని ప్రభావమును బ్రహ్మపుత్రుడగు నారద భగవానుడు బ్రహ్మసభలో పాటలుగ పాడుచు ఉపాసించును. ఎవ్వాని దివ్యగుణము లీ జగముల సృష్టిస్థితి లయములకు మూలకారణములో యెవ్వని మేలుచూపు మాత్రా న ప్రకృతి గుణములు తమతమ విధులు నెఱవేర్చునో యెవని దివ్య స్వరూపము ధ్రవతేజమో యనాదియో యెవం డొక్కడే యయ్యు పెక్కురూపుల చక్కనిపేరుల భాసిల్లునో యాతని మూలతత్త్వ మెట్టు లెఱుంగబడును! ఈ సదసద్రూప విశ్వమే విశ్వరూపు నమృతదయవలన సత్త్వముగ దోచునో యే రసికశేఖరుని లీలా వినోదము భక్తుల మనస్సులను సింహము వలె లాగునో యట్టి యుదారవిక్రము ననన్యగతి నాశ్రయింపవలయును. ఏ హరి శుభనామధేయము నార్తుడుగాని పతితుడు గాని నవ్వులాట కేని యొక్కసారియేని విన్న-కీర్తించినయేని పాపుని పాపరాసులు కూలిపోవునో యాశేష భగవానుని ముముక్షు వాశ్రయింప వలయును ఏవేల శిరముల యనంతుడు నదీ-నద-సాగరములు గిరి-దరీభూములుగల భూమండలము నొక్క పరమాణులీల దాల్చునో యట్టి మొక్క పోనియుక్కుగల్గిన శేషుని వీర్యమహిమను వేయినాల్క లున్నవాడు నుగ్గడింపజాలడు. ఇట్టి యనంత గుణగరిష్ఠుడు దురంతవిక్రముడు ననంతప్రభావుడు నగు ననంతశేషుడు స్వతంత్రముగ లీలగ నీ భూమి నంతయును తలదాల్చి పాతాళమందున విరాజిల్లుచుండును. మునిపుంగవా! నరులు తమతమ కర్మల నను సరించి గతులు పొందుదురు. నరు లెట్టి కొర్కెలు కొరుకొందురొ యట్టి ఫలితములు బొందుదురు. ఓ రాజేంద్రానీకీ విధముగ నల-మృగ-పక్షుల గూర్చి తెల్పితిని. ధర్మబద్దములైన వారివారి కర్మ-కాల-పరిపాక-గతులను గూర్చి వాని మంచి చెడులను గుఱించి నీప్రశ్నలకు తగినట్లుచెప్పితిని. నారదు డిట్లనెను; ప్రాణికోటుల కర్మలన్నియును సమానములే గదా! భగవాను డీ లోకముల నింత వింత వింతలు దోప నేల సృజించెనో నాకు దెలుపుము. నారాయణు డిట్లనెను: కర్త యొక్క శ్రద్ద ననుసరించి కర్మఫలములు వేర్వేరుగ మూడు విధములుగ నుండును. కర్తకు సాత్విక శ్రద్దవలన సుఖమును రాజుల శ్రద్దవలన దుఃఖమును గల్గును. తామసశ్రద్దవలన దుఃఖమేకాక మూర్ఖత్వమును గల్గును. ఈ శ్రద్దల తరతమ భేదముల వలననే ఫలితము లందును భేదములు గలుగు చుండును. ఓనారదా! అవిద్య - అనాది. దానివలన జరుగు పనుల గతులు ప్రవృత్తులు ఫలితములు వేనవేలుగ గల్గుచుండును. తధ్బేదా స్వర్ణయిష్వామి ప్రాచుర్యేణ ద్విజోత్తమ | త్రిజగత్యా అంతరాళేదక్షిణస్యాం దిశీహ వై. 15 భూమేరధస్తా దుపరిత్వతలస్య చనారద | అగ్నిష్వాత్తాః పితృగణా వర్తంతే పితరశ్చహ. 16 వసంతి యస్యాం స్వీయానాం గోత్రాణాం పరనూశిషః | సత్యాః సమాధినాం శీ ఘ్రంత్వాశాసానాః పరేణవై. 17 పితృరాజో 7పి భగవా న్సంపరేతేషు జంతుఘ | విషయం ప్రాపితేష్వేఘ స్వకీయైః పురుషై రిహ. 18 సగణో భగవత్ర్పోక్తాజ్ఞాపరో దమధారకః | యథా కర్మ యథా దోషం విదధాతి విచారదృక్. 19 స్వాన్గణా న్ద ర్మతత్వజా న్సర్వానాజ్ఞా ప్రవర్తకాన్ | సదా ప్రేరయితి ప్రోజ్ఞో యథా దేశనియోజితాన్. 20 నరకానేకవింశత్యా సంఖ్యయా వర్ణయంతి హి | అష్టావిం శమితా న్కేచిత్తాననుక్రమతో బ్రువే. 21 తామిస్ర అంధతామిస్రో రౌరవో 7పిరిః తృతీయక | మహారౌరవనామా చ కుంభీపాకో7పరో మతః 22 కాలసూత్రం తథా చావివత్రారణ్య ముదాహృతమ్ | శూకరస్య ముఖం చాంధకూపో7థకృమిభోజనః 23 సందంశ స్తప్తమూర్తి శ్చ వజ్రకంటక ఏవచ | శాల్మలీ చాథ దేవర్షే నామ్నా వైతరణీ తథా. 24 పూయోదః ప్రాణరోధశ్చ తథా విశసనం మతమ్ | లాలాభక్షః సారమేయాదన ముక్తమతః పరమ్. 25 అవీచిరప్యయఃపానం క్షారకర్దమ ఏవచ | రక్షోగణాఖ్య సంభోజః శూలప్రోతో7ప్యతః పరమ్ 26 దందశూకో వటారోధః పర్యావర్తనకః పరమ్ | సూచీముఖ మితిప్రోక్తా అష్టావింశతి నారకాః. 27 ఇత్యేతే నారకా నామ యాతనాభూమయః పరాః | కర్మభి శ్చాపి భూతానాం గమ్యాః పద్మజసంభవ. 28 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ అష్టమస్కంధే ఏకవింశో7 ధ్యాయః. విప్రవర్యా ! కర్మగతుల భేదములను తేటపఱతును. ఈ ముల్లోకముల మధ్యను దక్షిణ దిశయందున భూమికి క్రిందుగ నతలమునకుపైగ నగ్ని ష్వాత్తులను పితృగణములును పితరులును వసింతురు. వారు స్వాత్మసమాధిలో మునింగి తమతమ గోత్రజులను తప్పక దీవించుచుందురు. పితృరాజు-యమధర్మరాజు. అతని భటులు మృతప్రాణులను కొని తెత్తురు. యముడు ప్రాణుల కర్మగుణదోషాలను బట్టి విచారశీలుడై వారి వారికి తగిన శిక్ష విధించును. యముడు గణములతోగూడి దైవాజ్ఞ పాటించును శాసించుచుండును. యముడు ప్రాజ్ఞుడై తన యాన జవదాట నట్టి ధర్మత్తత్వజ్ఞులగు వారిని తన యాదేశము పాటించుటకు పంపుచుండును. కొందఱు నరకము లిరువదొకటనియు మఱికొందఱిరువదెనిమిదనియు నందురు. వాని సరియగు సంఖ్య చెప్పుదును వినుము. తామిస్రము అంధతామిస్రము రౌరవము మహారౌరవము కుంభీపాకము కాలసూత్రము అసిపత్రారణ్యము శూకరముఖము అంధకూపము కృమి భోజనము సందంశము తప్తమూర్తి వజ్రకంటకము శాల్మలి వైతరణీ పూయోదము ప్రాణరోధము విశసనము లాలాభక్షణము సారమే యాదనము అవీచి అయఃపానము క్షార కర్దమము రక్షోగణము సంభోజము శూలప్రోతము దందశూకము వటారోధము పర్యావర్తనము సూచీముఖము ననున విరువ దెనిమిది నరకములు. ఓ నారదా! ఇవన్నియును పెక్కు యాతనలు పెట్టు నరకభూములు. ఆయా చెడుకర్మల ఫలితముగ ప్రాణు లాయా నరకములందు గూలుదురు. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి యష్టమ స్కంథమున నిరువదియొకటవ యధ్యాయము.