Sri Devi Bagavatham-2    Chapters   

అథద్వావింశో 7ధ్యాయః.

నారదాః కర్మభేదాః కతివిధా ః సనాతన మునే మమ | శ్రోతవ్యా ః సర్వథైవైతే యాతనాప్రాప్తి భూమయః. 1

యోవై పర స్య విత్తాని దారాపత్యాని చైవ హి | హరతే సహి దుష్టాత్మా యమానుచరగోచరః. 2

కారపాశేన సంబద్దో యామ్యై రతిభయానకైః | తామి స్రనామనరకే పాత్యతే యాతనాస్పదే. 3

తాడనం దండనం చేవ సంతర్జన మతఃపరమ్‌ | యామ్యాః కుర్వంతి పాశాఢ్యాః కశ్మలం యాతిచైవహి. 4

మూర్చా మాయాతి వివశో నారకీ పద్మభూసుత | యః పతిం వంచ యిత్వా తు దారాదీను పభజ్యతి . 5

అంధతా మిస్రనరకే పాత్యతే యమకింకరైః | పాత్యమానో యత్రజంతు ర్వే దనాపరవా న్బ వేత్‌. 6

నష్ట దృష్టి ర్నష్టమతి ర్బ వత్యే వావిలంబతః | వనస్పతి ర్బ జ్యమానమూలో యద్వ ద్బ వేది హ. 7

తస్మా దప్యంధతా మిస్రనామ్నా ప్రోక్తః పురాతనైః | ఏతన్మమా హమితి యోభూత ద్రో హేణకేవలమ్‌. 8

పుష్టాతి ప్రత్యహం స్వీయ కుటుంబం కార్యలంపటః | ఏతద్విహాయ చాత్రైవ స్వాశుభేన వతేదిహ. 9

రౌరవే నామ నరకే సర్వ సత్త్వభ యావహే | ఇహలోకే7మునా యేతు హింసితాజంతవః పురా.10

త ఏవ రురవో భూత్వా పరత్రపీడయంతి తమ్‌ | తస్మా ద్రౌరవ మిత్యాహుః పురాణజ్ఞా మనీషిణః. 11

రురుః సర్పా దతి క్రూరో జంతురుక్తః పురాతనైః | ఏవం మహా రౌరవాఖ్యో నరకో యత్ర పూరుషః. 12

యాతనాం ప్రాప్యమాణో హి యః పరం దేహ సంభవః | క్రవ్యాదా నామ రురవ స్తం క్రవ్యే ఘాతయంతిచ. 13

ఇరువది రెండవ అధ్యాయము

వర్ణభేదవ్యవస్థ - కర్మవిపాకము

నారదు డిట్లనెను: ఓ సనాతనమునీ! ఏయే కర్మభేదములు నరకయాతనలు గల్గించునో యాయా కర్మభేదము లెన్ని విధములో నాకు తెలుపుము. శ్రీనారాయణుడిట్లనెను: ఏ దుష్ఠుడు పరుల భార్యను-ధనమును-సంతతిని హరించునో యా దుష్టుడు యమదూతల బారి జిక్కును. వాడతి భీకరమైన యముని కాలపాశములచే బద్దుడై యాతనలు గల్గించు తామిస్రనరకమున త్రోయబడును. అచ్చడ యమభటులు పాశములు చేతబూని వానిని పట్టి కొట్టి తిట్టి భయపెట్టి పలు ఇక్కట్టులు పెట్టుదురు. బ్రహ్మపుత్రా! అపుడా నారకుడు వివశుడై మూర్చిను. ఒక విటు డింకొక పురుషుని మోసగించి వాడింటలేని తఱి వాని పెండ్లమును ధనాదులను విడువ కనుభవించును. అట్టివాడు యమకింకరులచేత నంధ తామిస్రమను నరకాంధ్యమున నెట్టబడును. అటవాడు ఘోర యమ యాతనలు పడును. వాడు మతి-చూపులు చెడిన వాడై మొదలంట నఱుకబడిన చెట్టువలె గూలును. అందువలన దాని నంధతామిస్రమని పెద్దలందురు. ''నేను'' ''ఇది నాది'' యును నహంకృతితో నొకడు ప్రాణులకు ద్రోహము తలపెట్టును. అతడు ప్రతిదినమును కార్యమగ్నుడై స్వార్దముతో తన కుటుంబమును మాత్రమే పోషించుకొనును. అట్టివాడు తన వన్నియు నిచ్చటనే వదలిపెట్టి తన కర్మఫలము పొందును. అత డెల్లరకును భితి గొల్పునటి రౌరవనరకము గూలును. ఈ లోకమునం గొకడు ప్రాణుల నెల్ల హింసించును. అట్టి హింస కునిచే హింస బొందినవారు నరకములో రురులైవానిని బాధపెట్టుదురు. అందువలన రౌరవమను నరకము పేరేర్పడెనని పండితులు వచింతురు. ఈ రురువనుజంతువు కర్పముకన్న మిక్కిలి క్రూరమైనది. అందుచే నగి మహారౌరవమని పెద్దలచే పేర్కొనబడినది. ఇతరులను బాధించి పీడించువాడీ రౌరవమునపడును. అందు వాడు మాంసము తిను రురు జంతువుల చేత తినబడును.

య ఉగ్రః పురుషః క్రూరః పశుపక్షిగణానపి | ఉపరంధయతే మూధో యామ్యాస్తం రంధయంతి చ. 14

కుంభీపాకే తప్తతైలే ఉపర్యపి చ నారజ | యావంతి పశురోమాణి తావ ద్వర్ష సహస్రకమ్‌. 15

పితృ విప్రబ్రాహ్మణ ధ్రక్కాలసూత్రే స నారకే | అగ్న్యర్కాభ్యాం తప్యమానే నారకీ వినివేశితః. 16

క్షుత్పిపాసా దహ్యమానాంతః శరీరస్తథా బహిః | ఆస్తే శేతే చోష్టతే చావతిష్ఠతి చ ధావతి. 17

నిడవేదపథాద్యోవై పాఖండం చోపయాతి చ | అనాపద్యపి దేవర్షే తం పాపంపురుషం భటాః. 18

అసిపత్రవనం నామ నరకం వేళయంతి చ | కశయా ప్రహరంత్యేవ నారకీ తద్గత స్తదా. 19

ఇత స్తతో ధావమాన ఇత్తాలమతి వేగతః | అసిపత్రై శ్చి ద్యమాన ఉభయత్ర చ ధారిభిః. 20

సంఛిద్యమాన సర్వాంగో హా హతో7స్మీతి మూర్చితః | వేదనాం పరమాం ప్రాప్త ః పతత్యేవ పదే పదే. 21

స్వధర్మానుగతం భుంక్తే పాఖండఫల మల్పదీః | యోరాజా రాజపురుషో దండయేద్వైత్వధర్మతః. 22

ద్విజే శరీరదండం చ పాపీయాన్నారకీ చ సః | నరకే సూకరముఖే పాత్యతే యమకింకరైః 23

వినష్పిష్టావయవకో బలవద్బి స్తథేక్షువత్‌ | ఆర్తస్వరేణ స్వనయ న్మూర్చితః కశ్మలంగతః 24

సంపీడ్యమానో బహుధా వేదనాం యాత్యతీవ హి | వివిక్త పరపీడో యో7ప్యవివిక్తపరవ్య థామ్‌. 25

ఈశ్వరాంకితవృత్తీ నాం వ్యథా మాచరతే స్వయమ్‌ | స చాంధకూపే పతతి తదభిద్రోహం యంత్రితే . 26

అతిక్రూరముగ కోపముతో పశుపక్షులను బంధించు మూడుని యమదూతలు పట్టి కట్ట కొట్టుదురు. నారదా! వాడుతాను హింసించిన పశు-పక్షుల కెని రోమములు గలవో యన్ని వేలేండ్లు కుంభీపాకనరకమం దుండును. వాని పై సలసలమను వేడినూనెపోయుదురు. తనతల్లిదండ్రులకును విప్రులకునుబ్రాహ్మణులకును ద్రోహముబూనువాడు''కాలసూత్ర'' నరకమున పడవేయబడి సూర్యాగ్నుల మంటలచే తపింపచేయబడును. వాని శరీరములోన బైట నాకలి-దప్పుల పెనుమంటలు చెలరేగను. వాడా నరకమందే తిరుగును కూర్చుండును పరుగెత్తును విదురించును. దేవఋషీ! ఎవుడు తన వైదికమార్గమును వదలి పాషండమతమును నిరాటంకముగ చేపట్టునో యమభటులు వానిని నరకమున ద్రోతురు. అది అసిపత్రవన మనునరకము. అందు వానిని కొరడాలతో కొట్టుదురు. వాడందు కత్తికి రెండు వైపుల పదునున్న '' యసిపత్ర'' ములచేత చీల్చబడుచు నిటునటు పరుగులు దీయును. అట్లు తన యంగము లన్నియును ఛేదింపబడుచుండగా నయ్యోఏ చచ్చితి! చచ్చితి! ననివాడు మహావేదనపడి మూర్చిల్లి యడుగడుగునకు క్రింద పడిపోవును. అల్పబుద్దిగలవాడు తన ధర్మానుసారముగ పాషండమతఫల మనుభవించును. ఒక రాజుగాని రాజపురుషుడుగాని యధర్మముగ నితరులను దండించును. అతడు బ్రాహ్మ ణులను దండించినచో పాప ఫలముద సూకర ముఖ మనబడు నరకమున యమభటులసచేత త్రోయబడును. అత డచట విసరు తాతిలోని పిండివలె నుగ్గునుగ్గయిన యవయువముల బాధతో నార్తితో కేకలు పెట్టుచు మూర్చిల్లును. అతడటుల భాధింపబడి పెక్కురీతుల వేదనలు పొందును. ఎవ డితరుల బాధ గుర్తింపలేడో యెవడు నీచకర్మ చేయునో-ఏవా డీశ్వర కల్పితములగు నల్లులు మున్నగు వాని కూడా భాధించునో యా ద్రోహమునకు వా డం ద కూపనరకముందు గూలును.

తత్రాసౌ జంతుభిః క్రూరైః పశుభిర్మృగపక్షిభిః | సరీస్పపైశ్చ మశ##కై ర్యూకామత్కుణజాతిభిః. 27

మక్షికా భి శ్చ తమసి దందశూకై శ్చ పీడ్యతే | పరిక్రామతి చైవాత్ర కశరీరే చ జంతువత్‌. 28

యస్తు సంవిహితైః పంచ యజ్ఞైః కాకైశ్చ సంస్తుతః | అశ్నాతి చాసంవిభజ్య యత్కించి దుపపద్యతే. 29

సపారురుషః క్రూరై ర్యామ్యై శ్చకృమిభోజనే | నరకాధమకే దుష్ట కర్మణా పరిపాత్యతే. 30

లక్షయోజనవిస్తీర్ణే కృమికుండే భయంకరే | కృమిరూపం సమాసాద్య భక్ష్యమాణశ్చతైః స్వయమ్‌ 31

అప్రత్తా ప్రహుతాదో యః పాతమాప్నోతి తత్రవై | యస్తు స్తే యేనచ బలా ద్ది రణ్యం రత్నమేవ

చ. 32

బ్రాహ్మణస్యా పహరతి అన్య స్యాపిచ కస్యచిత్‌ |అనాపది చ దేవర్షే త మముత్ర యమానుగాః 33

అయస్మ యై రగ్నిపిండై ః సదృశై ర్ని ష్కుషంతి ఛ |

యో7గ మ్యాం యోషితం గచ్చే దగమ్యం పురుషంచయా . 34

తా వముత్రాపి కశయా తాడయంతో యమానుగాః | తిగ్మయా లోహమయ్యా చ సూర్మ్యప్యాలింగ యంతితమ్‌.

తాంచాపి యోషితం సూర్మ్య 77లింగ యంతి యమానుగా? | యస్తు సర్వాభిగమనః

పురుషః పాపసంచయీ.

నిరయే 7ముత్ర తంయామ్యాః శాల్మలీంరోపయంతి తమ్‌ | వజ్రకంటక సంయుక్తాం

శాల్మ లీం తామయస్మయీమ్‌.

రాజన్యా రాజపురుషా యేవా పాఖండ వర్తినః | ధర్మసేతుం విభిందంతి తే పరేత్య గతా నరాః. 38

వైతరణ్యాంపతంత్యేవ భిన్న మర్యాద పాతకాః | నద్యాం నిరయదుర్గస్య పరిఖాయాం చ నారద.

39

అత డచట పశు-మృగ-పక్షులచేత పాములచే - తేళ్లచే దోమలచే నల్లులచే పీడింపబడును. అతడా పెంజీకట దోమలు దందశూకములు మున్నగువాని చేత భాదింపబడును. ఇట్టి దురవస్ధ నీ చ తనువుగల జంతువు కిచటనే కల్గును. ఎవ్వడు తన యన్నమును ధనమును మన్త్రవిహితములైన పంచయజ్ఞములతో దేవతల దేయక కాకివలె తాలొక్కడే యనుభవించునో ఆ పాపి కృమిభోజనమను నరకమునందు క్రూర యమభటులచేత గూల్చబడును. వాడచ్చోట లక్ష యోజనముల వైశాల్యముగల కృమికుండమున బడి తానొక పురుగై యందలి పురుగులచే తినబడును. అతిధులకు పెట్టక తానే కుడి చినవాడు నిదే నరకమున గూలును. ఎవ్వడు బంగారముగాని రత్నము గాని దొంగలించునో ఆ వస్తువులు బ్రాహ్ణునివిగాని యితరులవిగాని వచ్చును. నారదా! అట్టిదొంగను యమకింకరులు బాధింతురు. అట్టి దొంగ నచట భగభగమను నయః పిండముల వంటి రోకళ్లతో కసబిస ద్రోక్కుదురు. ఎవ్వడైన మదమెక్కి పొందరాని యువతిని తగుల్కొనునో యే రేగిన మదవతియైన తనకు తగనివానితో రుసరుసలాడుచు తమకము దీర్చుకొనునో వారిర్వురిని యమభటులు వాడి కొరడాలతో గొట్టుదురు. మఱి భగ్గున మండు నినుప యువతినిచేసి యాయువకునితోదానిని కౌగిలింపింతురు. అ మదవతిని గూడ యినుప యువకునితో కౌగిలింపచేతురు. ఒక్కొక్క పాపాత్ముడు పెక్కురు స్త్రీలను గూడును. యమభటులు వాని నినుము వంటి వజ్రకంటకములు గలశాల్మలీనరకమున పడవేసి బాధింతురు. తమ క్షాత్రము విడనాడి పాఖండమచము పట్టిన రాడపురుషులను స్వధర్మము విడనాడిన నరులు చ్చి దుఃఖము లందుదురు. నారాదా! అట్టి పాపులు మర్యాదలు లేనివారు. వారు పాపదుర్గములప్రక్కనేయున్న యగడ్తల నదులనుబోలు లోతైన వైతరణీతప్తజలములం దుక్కిరిబిక్కిరియగుచుందురు.

యాదోగణౖః సమంతాత్తు భక్ష్యమాణాఇతస్తతః| నాత్మనా వియుజంత్యేవ నాసుభిశ్చాపి నారద. 40

స్వీయేన కర్మపాకే నోపతపంతి చసర్వతః | విణ్మూత్రపూయరకైశ్చ కేశాస్థినగమాంసకైః. 41

మేదోవసాసంయుతాయాం నద్యా ముపపతింతీ తే | వృషలీవతయో యే చ నష్టశౌచా గతత్ర పాః. 42

ఆచారనియమైస్త్యక్తాః పశ చర్యాపరాయణాః| తే7 త్రానుకష్టగతయోవిణ్మూత్రశ్లేష్మరక్తకైః. 43

శ్లేష్మమలసమాపూర్ణే నిపతంతి దురాగ్రహాః | తదేవ ఖాదయంత్యేతా న్యమానుచరవర్గకాః. 44

యే శ్వానగర్దభాదీనాం పతయో వైద్విజాతయః | మృగయారసికా నిత్య మతీర్దే మృగషూతుకాః. 45

పరేతాంస్తాన్యమభటా లక్షీభూతాన్న రాధమాన్‌| ఇషుబి శ్చ విభిందంతి తాంస్తాన్దుర్న యమాగతాన్‌. 46

యే దంభా దంభ యజ్ఞేషు పశూన్నంతి నరాధమాః| తాన ముష్మిన్యమ భటా నరకే వైశ##సే తదా. 47

నిపాత్య పీడయంత్వేవ కశాషూతై ర్దురాసదైః| యో భార్యాం చ సవర్ణాంవై ద్విజో మదనమోహితః. 48

రేతః పాయయతే మూఢో7ముత్రతంయమకింకరాః| రేతః కుండే పాతయంతి రేతఃసంపాయయంతి చ. 49

యే దస్యవో7గ్ని దాశ్చైవ గరదాః సార్ధఘాతుకాః|గ్రామాన్సార్దా న్విలుంపంతి రాజా నోరాజపూరుషాః. 50

తాన్పరేతా న్యమభటా నయంతి శ్వానకాదనమ్‌| వింశత్యధిక సంఖ్యాతాః సారమేయా మహాద్బుతాః. 51

సప్తశత్యా సమాఖ్యాతా రభసంఖాదయంతి తే| సారమేయాదనం నామ నరక్తం దారుణం మునే.52

అతఃపరం ప్రనక్ష్యామి అవీచిప్రముఖా న్నునే|

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ7ష్టమస్కంధే ద్వావింశో7ధ్యాయః.

నారదా| అందు పెక్కు జలజంతువులు వానిని తినుచున్నను ప్రాణములు వాని శరీరమును వదలిపెట్టవు. వాడిటునటు తిరుగుచుండును. పాపులు తామ చేసికొన్న పాపాలు పండుట వలన మలమూతమ్రలు నెత్రుమాంసములు గోళ్ళ వెండ్రుకలు నెముకలు మేదస్సు మజ్జలతో నిండిన నదిలో వారు మునుగుదురు. వృషలీపతులు భ్రష్టాచారులు సిగ్గుమాలినవారును సదాచరనియమములు పాటించని పశువర్తనులునునల మూత్రములు శ్లేష్మరక్తములును శ్లేష్మమలములు నిండిన నదిలోగూలుదురు. ఆ దురాగ్రహులగుయమసేవకు లాపురుల నోళ్లలో మలమూత్రమును నెట్టుదురు.ఏద్విజాతుల వారు గాడిద కుక్క మున్నగు జంతువులను పెంచుదురో-వేటతమకమున మృగములను వేటాడుదురో-ఆ దుర్మార్గులు చచ్చిన మీదట యమభటులువాడిములుకులకుగురి యగుదురు. ఏనరాధముల-డాంబికులనుగువారు దంభయాగముతో పశువులను హింసింతురో వారు చచ్చిన పిమ్మటయమ భటులచేత''విశసన'' నరకమున గూల్చబడుదురు. అచట యమభటులు వారిని బెట్టిదంపు కొరడాలతో గొట్టుదురు. ఏ ద్విజు డగ్గలమైన మేహాతిరేక మాపుకోలేక తనసజాతి స్త్రినోటితో రేతస్సు త్రాగించునో ఆమూఢుని భటులు రేతః కుండమున పవడేసి వానిచే రేతస్సు త్రాపుదురు. దొంగలు నిప్పంటించు వారు విషము పెట్టువారు గ్రామాలను వర్తకులనుగంపులను దోచువారుఅగు రాజులను రాజులను రాజపురుషులను వీరందఱిని చచ్చిన యమదూతలు ''శ్వానకదన'' మను నరకమున గూల్తురు. ఆ నరకము నందేడు వందల ఇరువదికి పైగా చితవిచిత్రములగు విచిత్రములగు కుక్కలు గబగబ ప్రాణులను పీకి పాకము పట్టను. మునీశా| ఈ సారమేయాదన నరకమతి దారుణమైనది సుమా| ఇక మీదట ''అవీచి'' మున్నగు నరకములను గూర్చి వివరుంతును.

ఇది శ్రీ దేవీ భాగవత మహా పురాణ మందలి యష్టమ స్కంధ మందిరువది రెండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters