Sri Devi Bagavatham-2
Chapters
అథనవమస్కంధః. అథ ప్రథమో7అధ్యాయః. శ్రీనారాయణ ఉవాచ: గణశజననీ దుర్గా రాధా లక్ష్మీః
సరస్వతీ! సావిత్రీ ద సృష్టివిధౌ ప్రకృతిః పంచధా స్మృతా.
1 నారద ఉవాచ: ఆ విర్బభూవ సా కేన కా వా సా జ్ఞానినాంవర| కిం వాతల్లక్షణం సాధోబభూవ పంచధా కథమ్.
2 సర్వాసాం చరితం పూజా విధానం గుణ ఈప్సితః | అవతారః కుత్ర కస్యాస్తన్మే వ్యాఖ్యాతు మర్హసి.
3 శ్రీనారాయణః: ప్రృకృతే ర్లక్షణం వత్స కోదా వక్తుం క్షమో భ##వేత్| కించి త్తథా7పి వక్ష్యామి యచ్చ్రుతం ధర్మవక్తృతః.
4 ప్రకృష్టవాచకః ప్రశ్చ కృతి శ్చ స్పష్టి వాచకః | సృష్టౌ ప్రకృష్టా యా దేవీ ప్రకృతిః సా ప్రకీర్తితా.
5 గుణ సత్త్వే ప్రకృష్టే చ ప్రశబ్దో వర్తతే శ్రుతః | మధ్యమే రజసి కృశ్చ తిశబ్ద స్తమసి స్మృతః.
6 త్రిగుణాత్మ స్వరూ పా యా సా చ శక్తి సమన్వితా | ప్రధానా సృష్టికరణ ప్రకృతి స్తేన కథ్యతే.
7 ప్రథమే వర్తతే ప్రశ్చ కృతి శ్చ సృష్టివాచకః| సృష్టే రాదౌ చ యా దేవీ ప్రకృతిః సా ప్రకీర్తితా.
8 యోగేనాత్మా సృష్టివిధౌ ద్విధారూపో బభూవ సః| పుమాం శ్చ దక్షిణారాంగో వామార్ధా ప్రకృతిః స్మృతా.
9 నాదబ్రహ్మస్వరూపాచ నిత్యాసాచ సనాతనీ | యథా77త్మా చ తథా శక్తి ర్యథా7గ్నౌ దాహికా స్థితా. 10 అతేఏవ హి యోగీంద్రైః స్త్రీపుంభేదో న మన్యతే | సర్వం బ్రహ్మమయం బ్రహ్మన్ శస్వత్సదపి నారద.
11 స్వేచ్ఛామయ స్వచ్ఛయా చ శ్రీకృష్ణస్య సిసృక్షయా| సా77విర్భ భూవ సహసా మూలప్రకృతి రీశ్వరీ.
12 తదాజ్జయా పంచవిధా సృష్టికర్మ విభేదికా | అథ భక్తానురోధా ద్వా భక్తానుగ్రహ విగ్రాహా.
13 గణశమాతా దుర్గా యా శివరూపా శివప్రియా | నారాయణీ విష్ణుమాయా పూర్ణబ్రహ్మస్వరూపిణీ.
14 పూర్వాపర విరోధము-పరిహారము ఈ పురాణము నందు తృతీయ స్కంధమున సృష్టి ప్రక్రియ వివరింపబడినది. సత్త్వరజస్తమస్సులనెడి గుణత్రయము యొక్క సామ్యావస్థ మాయ యనబడును. అట్టి మాయ ఉపాధిగా కల భగవతి శ్రీదేవియే పరబ్రహ్మ తత్త్వము. అట్టిపరబ్రహ్మము నుండియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులును గౌరీ లక్ష్మీ సరస్వతులును ఉత్పత్తి నొందిరి. శ్రీదేవియే త్రిమూర్తులకును ఈదేవీత్రయము నిచ్చెను. అని చెప్పబడినది. నవమస్కంధము నందు గోపాల సుందరీ నామకమయిన శ్రీకృష్ణుని మూర్తి నుండి బ్రహ్మయును త్రిమూర్తులునుగౌరి మొదలగు దేవులును ఉత్పత్తి నొందినట్లును శ్రీకృష్ణుడే బ్రహ్మాదిత్రిమూర్తులకును ఈ ముగ్గురు దేవులను భార్యలుగా ఒసగినట్లును చెప్పబడుచున్నది. ఈ విధముగ ఒకే పురాణమున పరస్పర విరుద్ధముగ సృష్టి ప్రక్రియ చెప్పబడుట సరిగా కనబడదు. అనుశంకకు శ్రీనీలకంఠ పండితులు ఈ విధముగా సమాధానము చెప్పినారు : తృతీయ స్కంధమున చెప్పిన సృష్టి ప్రక్రియలో వక్త శ్రీవ్యాసులు; నారాయణ మహర్షి ఈ నవమస్కంధమునందలి ప్రకియను చెప్పినారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఒకే విషయమును ప్రతిపాదించిరి. అని సమాధానము. మరియు ఇతర పురాణములలో వలెనే ఈ పురాణము నందును ఈ రెండు విధములగు సృష్టి ప్రక్రియలును రెండు కల్పములకు సంబంధించిన వనియు సమాధానము చెప్పవచ్చును. - పరిష్కర్త. నవమ స్కంధము ప్రథమాధ్యాయము ప్రకృతి పంచక నిరూపణము శ్రీనారాయణు డిట్లనెను : ఈ చరాచర సృష్టి జరుగు సమయము నందు మూల ప్రకృతి గణపతి తల్లియగు దుర్గరాధ లక్ష్మి సరస్వతి సావిత్రి యనెడు పంచ దేవతలుగ నావిర్భవించును. నారదు డిట్లనెను: ఓ మహాజ్ఞానీ! సాధు సత్తమా! ఆ మూల ప్రకృతి లక్షణము లెవ్వి? ఆ ప్రకృతి యొట్టుల నైదు విధములుగ నేర్పడినది? ఆ యైదుగురు దేవతల చరిత్రము పూజా విధానము గుణ మహిమలు వారెవరి వలన నెచ్చట నవతారము లెత్తిర? మున్నగున వన్నియును వివరించి తెలుపుటకు నీవు మాత్రమే తగినవాడవు. శ్రీనారాయుణు డిట్లనెను: ఓయి వత్సా! మహా ప్రకృతి లక్షణములు తేటతెల్లముగ తెల్పుట కెవడు సమర్థుడు? ఐనను నేను నా పితృపాదులగు ధర్ముని నోట వినినది కొంత తెల్పుదును. వినుము. ''ప్ర''యను నుపసర్గ ప్రకృష్ట వాచకము''కృతి'' శబ్దము సృష్టి వాచకము. కనుక విశ్వమును నిర్మించుట యందు శ్రేష్ఠురాలగు దేవతను మహా ప్రకృతి యందురు. ''ప్ర'' శబ్దము స్తత్వగుణమును ప్రకృష్ఠార్థమును జ్ఞాన ప్రకాశకమును దెల్పును. ''కృ'' రజోగుణము-విక్షేప దోషము గలదిగ నగుట మధ్యమమగును.''తి'' తమోగుణమును అధర్మమును ఆవరణ రూపమును తెలుపును. (ప్రకృతి శబ్దము-స్వరూప లక్షణము) ఆ వరణ విక్షేపములు లేని చిన్మయ బ్రహ్మము త్రిగుణముల మాయతో గూడి సృష్టి కార్యము సాగించునపుడు దానిని ప్రకృతియని శక్తి యుక్తయని యందురు. సృష్టికి పూర్వమందున్న స్థితిని ''ప్ర'' యందురు. ''కృతి'' సృష్టి జరిగినదాని నందురు. కనుక ఈ సృష్టికి పూర్వమం దున్న దేదీప్యమానమగు చైతన్య మహాదేవియే మూల ప్రకృతి యని పిలువబడుచున్నది. ఆ నిరజంనమగు సత్యజ్ఞానానంత మగు పరమాత్మ సృష్టి జరుగునపుడు తన యోగ మాయతో రెండు రూపములు దాల్చును. అతని కుడి భాగము పురుషుడని ఎడమ సగపాలు ప్రకృతి యని యందురు. వత్సా! ఆ మూల ప్రకృతిని బ్రహ్మ స్వరూపమనుగ సనాతనినిగ నిత్యనుగ భావించవలయును. అగ్నిలో దహనశక్తి వలె నాత్మలోపల ప్రకృతి శక్తి గలదని యెఱుంగవలయును. ఓయి నారదా! అందువలననే యోగీంద్రులకు స్త్రీ పురుష భేదము కనిపించదు. బ్రాహ్మణోత్తమా! ఇదంతయును బ్రహ్మమయమే కదా. ఈ విశ్వమున ప్రకృతి పురుషాత్మకముగాని వస్తువు లేదు సుమా! సర్వతంత్రస్వతంత్రశక్తి గల శ్రీకృష్ణునకు జగములు సృజించు కోర్కి గలిగినపుడు పరాశక్తియగు మూల ప్రకృతి సర్వ నియంత్రిగ సామ్యావస్థారూపిణిగ మాయాశ బలిత బ్రహ్మముగ నావిర్భవించెను. ఆ పిదప కృష్ణ పరమాత్ముని యాజ్ఞవలన సృష్టికార్యము కొనసాగుటకును. భక్తుల ననుగ్రహించుటకును భక్తానుగ్రహ స్వరూపిణయగు స్వరూపపరాశక్తి (మూల ప్రకృతి యైదు శక్తి మూర్తులుగనావిర్భవించెను. ఈ యైదు శక్తులలో దుర్గాదేవి శివరూప-శివప్రియ-విష్ణుమాయ-పూర్ణ బ్రహ్మ స్వరూపిణి- సర్వమంగళమాంగల్య గణశమాత. కృష్ణుడు భక్తులను తరింపజేయుట దుర్గకు గణపతిగ జన్మించెను) కృష్ణుని ప్రియతమా రూపశక్తి. బ్రహ్మాది దేవైర్మునిభిర్మనుభిః పూజితా స్తుతా| సర్వాధిష్ఠాత్రీ దేవీ సా శర్వరూపా సనాతనీ.
15 ధర్మ సత్యా పుణ్యకీర్తి ర్యశోమంగళదాయినీ| సుఖమయోక్షహర్ష దాత్రీశోకార్తి దుఃఖనాశినీ.
16 శరణాగత దీనార్త పరిత్రాణపరాయణా| తేజః స్వరూపా సరమా తదిధిష్ఠాతృ దేవతా.
17 సర్వశక్తి స్వరూపా చ శక్తి రీశస్య సంతతమ్| సిద్ధేశ్వరీ సిద్ధి రూపా సిద్ధిదా సిద్ధిరీశ్వరీ.
18 బుద్ధి ర్ని ద్రా క్షుత్పిపానా ఛాయాతంద్రా దయాస్మృతిః | జాతిః క్షాంతి శ్చ భ్రాంతి శ్చశాంతిఃకాంతిశ్చ చేతనా.
19 తుష్టిః పుష్టి స్తథా లక్ష్మీర్ధృ తిర్మాయా తథైవ చ| సర్వ శక్తి స్వరూపా సా కృష్ణస్య పరమాత్మనః.
20 ఉక్తః శ్రుతౌ శ్రుతగుణాశ్చాతి స్వల్పో యథాగమమ్|గుణో7స్త్యనంతో నంతాయా అపరాంచనిశామయ.
21 శుద్ధ సత్త్వ స్వరూపాయా పద్మాసా పరమాత్మనః | సర్వ సంవత్స్యరూపాసా తదధిష్ఠాతృ దేవతా.
22 కాంతా7తి దాంతా శాంతాచ సుశీలా సర్వమంగళా | లోభమోహ కామరోష మదాహంకారవర్జితా. 23 భక్తా నురక్తా పత్యు శ్చ సర్వాభ్య శ్చ పతివ్రతా| ప్రాణతుల్యా భగవతః ప్రేమ పాత్రం ప్రియం వదా.
24 సర్వసస్యాత్మికా దేవీ జీవనోపాయ రూపిణీ | మహాలక్ష్మీ శ్చ వైకుంఠే పతిసేవరతా సతీ.
25 స్వర్గే చ స్వర్గ లక్ష్మీ శ్చ రాజలక్ష్మీ శ్చ రాజసు| గృహే షు గృహలక్ష్మీ శ్చ మర్త్యానాం గృహిణాంతథా.
26 సర్వ ప్రాణిషు ద్రవ్యేషు శోభారూపా మనోహరా | కీర్తిరూపా పుణ్యవతాం ప్రభారూపా నృపేషు చ.
27 వాణిజ్యరూపా వణిజాం పాపినాం కలహాంకురా | దయారూ పాచ కథితా వేదోక్తా సర్వ సమ్మతా.
28 దుర్గాదేవి సర్వమంగళ స్వరూపిణి-శర్వరూప-సనాతని-సర్వాధిష్ఠాతృదేవి. అందుచేత బ్రహ్మాది దేవతలును మునులు మనువులు మనుజులు నీ దేవిని ఘనముగ పూజించి సంస్తుతించిరి. అదృష్టము పండిన భక్తుని దేవి కనికరించుచో నా తల్లి శోకార్తి దుఃఖములు నశింపజేయును; దైవధర్మము సత్యనిష్ట పుణ్యకీర్తి శుభమంగళములు సుఖసంతోషములు మోక్షమును గల్గించును. శరణార్థుల దీనార్తుల తొలగించి వారిని బ్రోచుటయే పనిగా గలది తేజోరూపిణి అగ్నివర్ణ తపమున వెల్గొందునది కృష్ణుని హృదయాధిష్ఠాతృదేవి దుర్గాదేవి సర్వశక్తిస్వరూపిణి పరమేశ్వరుని పరాశక్తి: అష్టసిద్ధులకీశ్వరి ఈ మహాదేవి సకల జీవుల యొక్క బుద్ధి భ్రమ ఓర్పు నిద్ర ఆకలి దప్పులు నీడలు ఏ మఱుపాటు దయ తలంపు జాతి శాంతి కాంతి చైతన్యము తుష్టి పుష్టి లక్ష్మి ధైర్యము మాయ మున్నగున వన్నియును దుర్గాదేవియే; ఈమె కృష్ణపరమాత్ముని స్వరూపశక్తి. వేదములందు దుర్గవైరోచనిగసముద్రమును నావవలె దుర్గమ బాధలు నుండి దాటించునదిగ వర్ణింపబడినది. నీకు కొద్దిగ మాత్రమే తెలిపితిని. ఆమె గుణమహిమలనంతములు. ఇక మూల ప్రకృతి యొక్క ఇతర రూపములు వినుము. శ్రీ పద్మాదేవి శుద్ధ సత్త్వ స్వరూపిణి; ఈమె పరమాత్ముని రెండవ యవతారము. ఈమె కృష్ణ పరమాత్ముని సకల సంపదల కధిష్ఠాతృ దేవత. ఈమె జితేంద్రియ కాన శాంత స్వరూపిణి లక్ష్మీదేవి కాంత దాంత శాంత సుశీల సర్వ మంగళ; లోభ-మోహ-కామ-రోష-మదాహంకారములు లేని దేవి; ఆ మహాదేవి భక్తానురక్త; పతిప్రియ; పతివ్రతలకు తల మానికము. భగవానుననకు ప్రాణతుల్య; ప్రేమపాత్ర ప్రియంవద. సకల ప్రాణుల బ్రతుకుదెరువునకా లక్ష్మీదేవి తనయేకాంశమున సస్యాత్మికగ ధాన్యలక్ష్మిగ నుండెను. తన సహజ స్వరూపముతో వైకుంఠమున పతిసేవలు చేసికొనుచు నుత్తమ సతీ మణిగ చెన్నొందును. ఆ మహాలక్ష్మి స్వర్గమున స్వర్గలక్ష్మిగ రాజులందు రాజ్యాలక్ష్మిగ గృహమందు పుణ్యపురుషుల గృహిణుల రూపమున గృహలక్ష్మిగ విరాజిల్లుచుండును. లక్ష్మిసకల ప్రాణులందును వెల్గులు జిమ్ము వస్తువులన్నిటియందును మనోహరమైన శోభా రూపమున గోచరించును; పుణ్యాత్ముల లోని కీర్తి రూపముగ రాజులందలి తేజముగ వెలుగొందును. లక్ష్మి వైశ్యులలో వాణిజ్య రూపమున పాపుల యిండ్లలో కలహద్వేష రూపమున పరోపకారులలో దయా రూపమున శోభిల్లును. ఇది వేద సమ్మతము. సర్వపూజ్యా సర్వవం ద్యా చాన్యాం మత్తో నిశామయ | వాగ్బుద్ది విద్యాజ్ఞానాధిష్ఠాత్రీ చ పరమాత్మనః.
29 సర్వ విద్యా స్వరూ పాయా సాచదేవీ సరస్వతీ| సా బుద్ధిః కవితా మేధా ప్రతిభాస్మృ తిదా నృణామ్.
30 నానా ప్రకార సిద్ధాంతభేదార్థకలనా మతా | వ్యాఖ్యా బోధస్వరూపా చ సర్వసందేహభంజినీ.
31 విచారకారణీ గ్రంథకారిణీ శక్తి రూపిణీ | స్వర సంగీత సంధానతాలకారణరూపిణీ.
32 విషయ జ్ఞానవా గ్రూపా ప్రతివిశ్వోపజీవినీ | వ్యాఖ్యా వా దకరీ శాంతా వీణాపుస్తక ధారిణీ.
33 శుద్ధ సత్త్వ స్వరూ పా చ సుశీలా శ్రీహరి ప్రియా | హి మ చందనకుందేందు కుముదాంబోజనసన్నిభా.
34 యజంతీ పరమాత్మానం శ్రీకృష్ణం రత్నమాలయా | తపః స్వరూ పా తపసాం ఫలదాత్రీ తపస్వినామ్.
35 సిద్ధి విద్యా స్వరూ పాచ సర్వసిద్ధి ప్రద సదా | యయా వినాతు విప్రౌఘో మూకోమృతసమః సదా.
36 దేవీ తృతీయా గదితా శ్రుత్యుక్తా జగదంబికా | యథాగమం యథా కించి దపరాం త్వం నిబోధమే.
37 మాతా చతుర్ణాం వర్ణానాం వేదాంగానాంచ ఛందసామ్ | సంధ్యా వందన మంత్రాణాం తంత్రాణాం చ విచక్షణ.
38 ద్విజాతి జాతి రూపాచ జపరూపా తపస్వినీ | బ్రహ్మణ్య తేజోరూ పా చ సర్వసంస్కార రూపిణీ. 39 పవిత్రరూపా సావిత్రీ గాయత్రీ బ్రహ్మణః ప్రియా | తీర్థాని యస్యాః సంస్పర్శం వాంఛంతి హ్యాత్మ శుద్ధయే.
40 శుద్ధ స్పటికసంకాశా శుద్ధ స్వరూపిణీ | పరమానందరూపా చ మరమా చ సనాతనీ. 41 వాస్తవముగ లక్ష్మి యెల్లర చేత నమస్కరింపబడి పూజింపబడును. ఇక నితర శక్తిని గూర్చి వినుము. పరమాత్మ యొక్కవాక్కు-బుద్ధి-విద్య-జ్ఞానముల కధిష్టాత్రీ దేవత గలదు. వినుము. ఆ శక్తిని సరస్వతీదేవి యందురు. ఆమె సకల విద్యాస్వరూపిణి. ఆమె మనుజుల హృదయ బుద్ధులందుండి కవిత-మేధ-ప్రతిభ-స్మృతి మున్నగు శక్తులు గలిగించును. ఏదైన సిద్ధాంతము చేయుటలో సందేహము గల్గినప్పుడు సరస్వతీదేవి వారి వ్యాఖ్యానార్థములో వెల్గుచు వారి సంశయములు ఛేదించి సిద్ధాంతికరంచి వేర్వేరర్థములు తెలుపును. కవి పండితులలోని గ్రంథ రచనా శక్తి విచార శక్తి స్వర సంగీత-సంధాన తాల-లయ-నాద శక్తి మున్నగు కళలకు భారతీయే కారణము. పండితులలోని చర్చా-విషయ జ్ఞాన-వ్యాఖ్యా-వాదన-వాక్య స్వరూపిణి; పరాభాషామయి; విశ్వమునకు భాషా జీవన మొసంగు బ్రాహ్మీదేవి; శాంత-నిర్మల-సుప్రసన్న-రూపిణి; వీణా-పుస్తకధారణీ; పలుకుల తల్లి; శుద్ధ సత్త్వ స్వరూపిణి; మంజుల వాగ్విలాస; సుశీల; శ్రీహరి ప్రియ; మంచు-చంద నము- చంద్రుడు-కుముదము-కుందము- కమలము-కాంతులు విరజిమ్ము కోమలాంగి-చదువుల దేవి-మణిరత్నమాల దాల్చి శ్రీకృష్ణ పరమాత్ముని నామ జప మొనర్చుచుండును; ఈమె తపఃస్వరూపిణి; తాపసుల తపస్సులకు తగినట్లు భాషా ఫల ములు ప్రసాదించు తల్లి. వేదజనని సిద్ధి విద్యాస్వరూపిణి సర్వసిద్ధిప్రదాయిని వస్తు-రస- చమత్కారౌచిత్య స్వరూపిణి; దేవి దయలేనిచో విప్రులు మూగవారితో చచ్చినవారితో సమానులు. వేదములందు సరస్వతి జగదంబ మూడవ దేవతగ వర్ణించ బడెను. ఇట్లు వేదానుసారముగ కొంచెముగ వాణిని వర్ణించితిని. ఇంక మఱియొక దేవి చరిత్ర వినుము. నాలుగు వర్ణముల తల్లియు వేదాంగములకును ఛందస్సులకును జననియు సంధ్యావందన మంత్రతంత్రములకు మూలబీజమును బ్రాహ్మణజాతి రూపిణి-జవరూప-తపస్విని-బ్రాహ్మి-తేజోరూపిణి-సర్వ సంస్కార రూపిణి- పవిత్ర రూపిణి- సావిత్రి-గాయత్రి-బ్రహ్మ్రపియ. సకల పుణ్య తీర్థము లాత్మశుద్ధికే దేవి సంస్సర్శనము గోరునో శుద్ధ స్పటికము వలె తెల్ల వెల్గు లీను శుద్ధ స్వరూపిణి-పరమానంద రూపిణి -పరమసనాతని. పరబ్రహ్మస్వరూపా చ నిర్వాణ పదదాయినీ| బ్రహ్మతేజోమయీ శక్తిస్త దధిష్ణాతృ దేవతా.
42 యత్పాదరజసా ప్తూతం జగత్సర్వం చ నారద | దేవీ చతుర్థీ కథితా పంచమీం వర్ణయామితే.43 పంచ ప్రాణాధి దేవీ యా పంచప్రాణ స్వరూపిణీ | ప్రాణాధిక ప్రియతమా సర్వాభ్యంఃసుందరీ పరా.
44 సర్వయుక్తా సౌభాగ్య మానినీ గౌరవాన్వితా | వామాంగార్ధ స్వర్తూపా చ గుణన తేజసాసమా.
45 పరావరా సారభూతా పరమాద్యా సనాతనీ| పరమానంద రూపా చ దన్యా మాన్యా చ పూజితా.
46 రాసక్రీడాధి దేవీ శ్రీకృష్ణస్య పరమాత్మనః | రాసమండల సంభూతా రాసమండలమండితా.
47 రాసేశ్వరి సురసికా రాసావాసనివాసినీ | గోలోకవాసినీ దేవీ గోపీ వేషవిధాయికా. 48 పరమాహ్లాదరూపాచ సంతోషహర్షరూపిణీ | నిర్గుణా చ నిరాకారా నిర్లపా77త్మ స్వరూపిణీ. 49 నిరీహా నిరహంకారా భక్తాను గ్రహవిగ్రహా | వేదానుసారి ధ్యానేన విజ్ఞాతా సా విచక్షణౖః.
50 దృష్టి దృష్టా నసా చేశైః సురేంద్రై ర్మునిపుంగవైః |వహ్నిశుద్ధాంశుకధరా నానాలంకార భూషితా.
51 కోటి చంద్ర ప్రభాపుష్ట సర్వశ్రీయు క విగ్రహా | శ్రీకృష్ణ భక్తి దాసై#్యకకరాచ సర్వసంపదామ్.
52 అవతారే చ వారాహే వృషభానుసతా చ యా | యత్పాదపద్మసంస్పర్శాత్పవిత్రా చ వసుంధరా.
53 బ్రహ్మాదిభి రదృష్టాయా సరైర్దృష్టా చ భారతే | స్త్రీరత్నసారసంభూతా కృష్ణవక్షఃస్థలేస్థితా.
54 పరబ్రహ్మస్వరూపిణి-నిర్వాణపదదాయిని-నిర్వాణపదదాయిని-బ్రహ్మతేజఃసముజ్జ్వల-బ్రహ్మతేజమున కధిష్ఠానదేవి. ఓయి నారదా! ఏదేవి పదపద్మరజము తాకినంతనే జగములు పవిత్రమగునో యా దేవి సావిత్రి; ఆమె నాల్గవ ప్రకృతి దేవి; ఇంక నైదవశక్తి దేవత యగు రాధను వర్ణింతును వినుము. ఆమె పంచ ప్రాణ స్వరూపిణి; పంచ ప్రాణముల కధీష్టాన దేవత; అపూర్వరూప సుందరి; కృష్ణునకు ప్రాణధిక ప్రియురాలు. సకల పదార్థముల నివసించునది; సౌభాగ్యశాలిని: గౌరనసీమ; కృష్ణుని యెడమ భాగము తన స్వరూపముగ గలది. గుణ తేజము లందు సాటిలేనిది మిక్కిలి శ్రేష్టురాలు-పరమ-ఆద్య-సనాతని-పరమానంద రూపిణి-ధన్య -మాన్య -విశ్వపూజిత-సకలసారభూత శ్రీకృష్ణపరమాత్ముని రాసక్రీడ కధిష్ఠాన దేవత-రాసమండలము పుట్టుటకు కారణురాలు-రాసమండల శోభాయమాన-రాసేశ్వరీ-రసికాగ్రగణ్య-గోలోకనివాసిని-రాసావాసనివాసిని-గోపికల జననమునకుకారణభూతురాలు.పరమానంద-సంతోష-హర్షరూపిణి-నిర్గుణ-నిరాకార-నిర్లిప్త -ఆత్మస్వరూపిణి. నిష్కామ-నిరంహకారా-భక్తానుగ్రహరూప-వేదపండితులు వేదానుసారము ద్యానింపగతెలియబడినది నర-సుర-మునీద్రుల చూపులచే చూడబడినది; నానాలంకారములతో శోభిల్లునది; అగ్ని పూతమగు నస్త్రము ధరించునది కోచి చంద్రులు వెన్నెలలు విర జిమ్మునది; సకల శ్రీమయి; శ్రీకృష్ణుని యెడల భక్తిని సకల సంపదల నొసంగునది. రాధ శ్రీవరాహ కల్పమున వృషభాను డను గోపునకు కన్యగ జన్మించెను. రాధ పద పద్ములను తాకి భూమి పవిత్రురాలయ్యెను. బ్రహ్మాదులకు కనిపించినది; భారతమున బృందావనమున నెల్లర చేత చూడబడెను. స్త్రీ జాతికి తలమానికము; కృష్ణుని వక్షము వాసమున్నది. యథా7ంబరే నవఘనే లోలా సౌదామినీ మునే| షష్ఠి వర్షసహస్రాణి ప్రతప్తే బ్రహ్మణః పురా.
55 యత్పాదపద్మనఖరదృష్టయే చాత్మశుద్ధయే | న చ దృష్టంచ స్వప్నే7పి ప్రత్యక్షస్యాపి కా కథా. 56 తేనైవ తపసా దృష్టా భువి బృందావనే వనే | కథితా పంతమీ దేవీ సా రాధా చ ప్రకీర్తితా.
57 అంశరూపాః కలారూపాః కలాంశాంశాంశసంభవాః | ప్రకృతేః ప్రతి విశ్వేషు దేవ్యశ్చ సర్వయోషితః.
58 పరిపూర్ణతమాః పంచ విద్యాదేవ్యః ప్రకీర్తితాః | యాయాః ప్రధా నాంశరూపావర్ణయామినిశామయ.
59 ప్రధానాంశస్వరూపా సా గంగా భువన పావనీ | విష్ణు విగ్రహసంభూతా ద్రవరూపా సనాతనీ.
60 పాపి పాపేధ్మదాహాయ జ్వలదగ్నిస్వరూపిణీ | సుఖస్పర్శా స్నానపానైర్నిర్వాణ పదదాయినీ.
61 గోలోకస్థాన ప్రస్థాన సుఖసోపానరూపిణీ | పవిత్రరూపా తీర్థానం సరితాంచపరావరా. 62 శంభు మౌళిజటామేరు ముక్తా పంక్తి స్వరూపిణీ | తపఃసంపాదినీ సద్యో భారతేషు తపస్వినామ్.
63 చంద్రప్రద్మక్షీరనిభా శుద్ధసత్త్వస్వరూపిణీ | నిర్మలా నిరహంకారా సాధ్వీనారాయణ ప్రియా.
64 ప్రధానాంశస్వరూపాచ తులసీ విష్ణుకామినీ | విష్ణుభూషణరూపాచ విషుపాదస్థితా సతీ.
65 తపః సంకల్పపూజాది సంఘసంపాదినీ మునే | సారభూతాచ పుష్పాణాం పవిత్రాపుణ్యదా సదా.
66 దర్వనస్పర్శనాభ్యాంచ సద్యోనిర్వాణదాయినీ | కలౌ కలుషశుష్కేధ్మదహనా యాగ్ని రూపిణీ.
67 ఓ మునీ! రాధ నీలఘన్యూమగగనములోని మెరుపుతీగ వంటిది. ఆమెకై పూర్వము బ్రహ్మ యరువది వేలేండ్లు తపము చేసెను. రాధ కాలిగోటిని చూచుట కాత్మశుద్ధి చేసికొనుటకు తపించెను. కాని బ్రహ్మకు కలలోనైన నామె కనిపించలేదు. ఇక ప్రత్యక్షముగ నెట్లుకనిపించగలదు? బ్రహ్మ తన తపము ఫలితముగ బృందావనమందు రాధను గాంచెను. ఇటుల నైదవ దేవి రాధాదేవిగ పేరు గాంచెను. ఈ విశ్వమందలి స్త్రీమూర్తులు రాధయొక్క అంశ-కళా-కళాంశాంశ విభాగములనుండి సృజింపబడిరి. మూలప్రకృతియొక్క పూర్ణాంశమునుండి దుర్గ మొదలగు నైదుగురు విద్యాదేవతలుద్భవించిరి. ఇంక మూలప్రకృతినుండి పుట్టిన యంశరూపలగు దేవతలను వివరింతును వినుము. ప్రకృతి ప్రధానాంశమునుండి భువనపావని-విష్ణుపదసంభూత-ద్రవరూప-సనాతనియగు గంగ యుద్భవించెను. పాపుల పాపములనెడు కట్టెలు కాల్చుటలోనగ్నివంటిది. స్నానపానస్పర్శములవలన ప్రాణులకు సుఖము గల్గించునది. నిర్వాణ సుఖదాయిని గోలోకధామము జేరుటకు సుఖసోపానము వంటిది తీర్థములలో పవిత్రతీర్థము నదులలో ప్రధాన జీవనది శివుని జటాజూటమునందు వెలుంగు ముతైముల వరుస వంటిది కర్మభూమియుగు భారతదేశమందలి తాపసుల తపము ఫలము చంద్ర-పద్మ-క్షీరములవలె తెల్లనివన్నెలు విరజిమ్మునది శుద్ధ సత్త్వస్వరూపిణి నిరహంకారా నిర్మలసాధ్వి నారాయణ ప్రియఅగు గంగ ప్రకృతి ప్రధానాంశమునుండి యుద్భవించెను. ఇక తులసీదేవియును ప్రకృతి ప్రధానాంశజురాలు. ఈమె విష్ణుకామిని; విష్ణు నకలంకారా రూపిణి; విష్ణుని పదకమలములుతన నెలవైనది. ఓ మునీ! తులసీదేవి తపము సంకల్పము పూనాదులు గల్గించునది; ఎల్ల పుష్పములలో సారమూ ప్రధానమైనది పవిత్ర పుణ్యదాయిని. తులసి దర్శనము-స్పర్శనము గల్గినంతనే ముక్తి కైవసమగును ఈ కలికాలమందలి దురితము లనెడు నెండుకట్టెలు కాల్చుటలో నగ్ని వంటిది. యాత్పాదపద్మసంస్పర్శాత్సద్యః పూతా వసుంధరా|యత్స్పర్శదర్శనే చై వేచ్చతి తీర్థాని శుద్ధయే.
68 యయావినాచవిశ్వేషు సర్వంకర్మ చనిష్పలమ్ |మోక్షదాయా ముముక్షూణాం కామినాంసర్వకామదా.
69 కల్పవృక్ష స్వరూపాయా భారతే వృక్షరూపిణీ | భారతీనాం ప్రీణనాయ జాతా యా పర దేవతా.
70 ప్రధానాంశస్వరూపాయా మనసా కశ్యపాత్మజా |శంకర ప్రియశిష్యాచ మహాజ్ఞానవిశారదా.
71 నాగేశ్వరస్యానంతస్య భగినీ నాగపూజితా | నాగేశ్వరీ నాగమాతా సుందరీ నాగవాహినీ.
72 నాగేంద్రగణసంయుక్తా నాగబూషణభూషితా | నాగేంద్రవందితా సిద్ధా యోగినీ నాగశాయినీ.
73 విష్ణురూపావిష్ణుభక్తా విష్ణుపూజా పరాయణా | తపః స్వరూపా తపసాం ఫలదాత్రీ తపస్వినీ.
74 దివ్యం త్రిలక్షవర్షం చ తపస్తప్త్వా చ యా హరేః | తపస్వినీషు పూజ్యా చతపస్విషుచభారతే.
75 సర్వమంత్రాధి దేవీచజ్వలంతీ బ్రహ్మతేజసా | బ్రహ్మస్వరూపాపరమా బ్రహ్మభావనతత్పరా.
76 జరత్కారుమునేః పత్నీ కృష్ణాంశస్య పతివ్రతా | ఆస్తీకస్య మునేర్మాతా ప్రవరస్య తపస్వినామ్.
77 ప్రధానాంశస్వరూపాయా దేవసేనా చనారద | మాతృకాసు పూజ్యతమా సాషష్ఠీచప్రకీర్తితా.
78 పుత్రపౌత్రాది దాత్రీచ ధాత్రీత్రిజగతాంసతీ | పుష్ఠాంశరూపా ప్రకృతేస్తేన షష్ఠీ ప్రకీర్తితా.
79 స్థానేశిశూనాం పరమావృద్ధరూపాచయోగినీ | పూజాద్వాదశమాసేషుయస్యావివ్వేషు సంతతమ్.
80 తులసి పదపద్ముల రజము సోకినంతనే భూమి పవిత్రమైనది. ఎల్లతీర్ధములును తులసి దర్శన-స్పర్శములచే తాముపవిత్రముగా గోరుచుండును తులసిమాత లేనిచో విశ్వమందలి పనులన్నియు నిష్పలము లగును. ముముక్షులకు ముక్తినిచ్చుకాముకులకు కోర్కులు దీర్చుదేవి. తులసిమాత భారతీయులపాలిటి కల్పతరువు; భారత వృక్షముల కధిష్ఠాత్రిదేవి; భారతీయకామినులకు ప్రసన్నత గల్గించుట కవతరించిన పరదేవత. ఇట్టి తులసీదేవియును ప్రకృతి ప్రధానాంశ సంభూత యగును. ఇక మనసాదేవి కశ్యపుని కూతురు; శంకరుని ప్రియశిష్యులు; మహాజ్ఞాన విశారద. నాగపతియగు ననంతుని సోదరి; నాగ గణపూజితః నాగేశ్వరి; నాగమాత; నాగసుందరి; నాగవాహిని. నాగగణములచే పరిష్టితురాలు; నాగభూషణభూషిత; నాగేంద్రవందిత; సిద్ధయోగిని, నాగశాయిని; విష్ణురూప; విష్ణుభక్త, విష్ణుపూజా పరాయణ; తపస్విని; తపస్ప్వరూపిణి, తపః ఫలద్రాతి. ఆమె శ్రీహరినిగూర్చి మూడులక్షల దివ్యవర్షములు తపించి తపించి భారతవర్షమున తాపసులలో తపస్వినులలోపూజ్యురాలయ్యెను. సర్వమంత్రాధిదేవి; బ్రహ్మతేజముతో ప్రకాశించునది; పరబ్రహ్మస్వరూపిణి; బ్రహ్మభావన తత్పర. శ్రీకృష్ణాంశము నుండి యవతరించిన జరత్కారుముని భార్య; తాపసోత్తముడగు ఆస్తీకుని తల్లి. ఈ మనసాదేవియును ప్రకృతి ప్రధానాంశమునుండి కల్గెను. నారదా! గౌరిమొదలగు పదారుమాతృకలలో శ్రేష్ఠమాతృక షష్ఠీదేవి. ఈమె దేవసేన-షష్ఠి యన పేరుగాంచెను. ఆమె పుత్రపౌత్రదాయిని. జగములకు ధాత్రి వంటిది.ప్రకృతి షష్ఠాంశ రూపిణికనుక షష్ఠియన ప్రసిద్ధి గాంచెను. ఈమె వృద్ధరూపమునను యోగినీ రూపమునను శిశువుల చెంతనుండి వారిని బ్రోచును. ఈమె పూజ పండ్రెండు నెలలందు నిరంతరముగ చేయవచ్చును. పూజ్యా చ సూతికాగారే పురా షష్ఠ దినే శిశోః |ఏకవింశతిమే చైవ పూజా కల్యాణ హేతుకీ.
81 మునిభిర్నమితాచైషా నిత్యకామా7ప్యతాఃపరా | మాతృకాచ దయారూపా శశ్వ ద్రక్షణకారిణీ.
82 జలేస్థలే చాంతరిక్షే శిశూనాం సద్మగోచరే| ప్రధానాంశస్వరూపా చ దేవీ మంగళచండికా.
83 ప్రకృతేర్ముఖ సంభూతా సర్వమంఘళదా సదా| సృష్టౌ మంగళరూపా చ సంహారే కోపరూపిణీ. 84 తేన మంగళచండీ సా పండితైః పరికీర్తితా | ప్రతి మంగళవారేషు ప్రతి వివ్వేషు పూజితా.
85 పుత్రపౌత్ర దనైశ్వర్య యశో మంగళదాయినీ |పరితుష్టా సర్వవాంఛా ప్రదాత్రీ సర్వయోషితామ్.
86 రుష్టా క్షణన సంహర్తుం శక్తా విశ్వం మహశ్వరీ | ప్రధానాంశస్వరూపా సా కాశీ కమలలోచనా.
87 దూర్లాలలాటసంభూతా రణ శుంభని శుంభయోః | దుర్గార్ధాంశస్వరూపా సా గుణన తేజసా సమా.
88 కోటీసూర్య సమా జుష్ట పుష్టజాజ్వల విగ్రహా | ప్రధానా సర్వశక్తీనాం బలా బలపతీ పరా.
89 సర్వసిద్ధి ప్రదా దేవీ పమా యోగరూపిణీ | కృష్ణ భక్తా కృష్ణతుల్యా తేజసా విక్రకమై ర్గుణౖః.
90 కృష్ణ భావనయా శశ్వత్కృష్ణవరాణసనాతనీ | సంహర్తుం సర్వ బ్రహ్మాండం శక్తా నిఃశ్వాసమాత్రతః.
91 రణం దైత్యైః సమం తస్యాః క్రీడయా లోకశిక్షయా | ధర్మార్థ కామమోక్షాం శ్చ దాతుం శక్తా చ పూజితా.
92 బ్రహ్మాదిభిః స్తూయమానా మునిభి ర్మనుభిర్నరైః | ప్రధానాంశస్వరూపా సా ప్రకృతే శ్చ వసుంధరా.
93 శిశువు జన్మించిన యారవనాడు పురుటింట షష్ఠీదేవిని పూజింతురు. అటులే యిరువది ఒకటవనాడు సైతము శుభము గోరిషష్ఠీదేవి పూజ గావింతురు. మునులు షష్ఠీదేవికి నమస్కరింతురు. దేవిదర్శనము గోరుదురు. షష్ఠీదేవి తల్లివలె దయారూపిణి. బాలుర నెల్లప్పుడును గాపాడుచుండునది. ప్రకృతి ప్రధానాం శరూపమంగళ చండికాదేవి. ఈమె నేలపై నీటిపై నంత రిక్షుమున పిల్ల లున్నచోట నుండి మంగళము గల్గించుచుండును. ఈమె ప్రకృతి ముఖమునుండి యుద్భవించెను. సర్వమంగళ రూపమున సంహారమున కోపముగనుండు దేవి. అందుచే పండితు లీ మెను మంగళ చండిక యని పిలుతురు. ఈమె ప్రతి మంగళవారమున ఎల్ల జగములందు పూజింపబడుచుండును. ఈమె ప్ర సన్నురాలైనచో స్త్రీలకు పుత్ర పౌత్ర ధనైశ్వర్య యశో మంగళములను ప్రసాదించును. స్త్రీలకోర్కె లన్నియును దీర్చగలదు. ఇక కమలలోచనియగు కాళీదేవి ప్రకృతి ప్రధానాంశస్వరూపిణి- మహేశ్వరి; ఆమె కన్నులెఱ్ఱ చేసినచో లోకములు నశింపగలవు. ఈమె దుర్గలలాటమునుండి యుద్భవించెను. యుద్ధమున శుంభనిశుంభలను సంహరించెను. దుర్గలోని సగమంశ గలది. దుర్గవలె గుణవతి తేజోవతి. కాశి పుష్టికరమైన యుజ్జ్వలమైన శరీరమును చూచినచో నొకేసారి కోటి సూర్యులను చూచినట్లుండును. ఈమె సర్వశక్తులకు మూలము. మహబలపతి; అందఱికన్న బలశాలిని. కాళీమాత సర్వసిద్ధి ప్రదాయిని; పరమయోగస్వరూపిణి; కృష్ణ భక్తురాలు; తేజమున గుణమున విక్రమమున కృష్ణునితో సరితూగునది. నిరంతరము కృష్ణుని భావించుటచే కాళివర్ణము కృష్ణవర్ణము ఈమె సనాతని. ఒక నిశ్శ్వాసము వదలిననంతనే బ్రహ్మండమంతయును సంహరింప శక్తురాలు. లోకములను సరిదిద్దుటకు వినోదముకొఱకును కాళీదేవి దానవులతో పోరును. ఈ తల్లిని పూజపించినచో నీమె ధర్మార్థ కామమోక్షము లొసంగ గలది. ఇంక వసుంధరాదేవి; ఈమెయును ప్రకృతి ప్రధానాంశజురాలే. ఈ భూదేవిని బ్రహ్మాదులు మునులు మనువులునరులు పూజింతురు. ఆధారరూపా సర్వేషాం సర్వసస్యా ప్రకీర్తితా | రత్నాకారా రత్న గర్బా సక్వరత్నాకరాశ్రయా.
94 ప్రజాభి శ్చ ప్రజేశైశ్చ పూజితా వందితా సదా | సర్వోపజీవ్యరూపా చ సర్వసంపద్విధాయినీ.
95 యయా వినా జగత్సర్యం నీరాధారం చరచరమ్ | ప్రకృతే శ్చ కళాయా యా స్తా నిభోద మునీశ్వరా.
96 యస్య యస్య చ యా పత్నీ తత్సర్వం వర్ణయా మితే | స్వాహా దేవీ వహ్ని పత్నీ ప్రతివిశ్వేశు పూజితా.
97 యయావినా హవిర్దానం న గ్రహితుం సురాః క్షమాః | దక్షిణా యజ్ఞపత్నీ చ దీక్షా సర్వత్ర పూజితా.
98 యయా వినా హి విశ్వేషు సర్వ కర్మ హి నిష్పలమ్ | స్వధా పితౄణాం పత్నీచ మునిభి ర్మనుభి ర్నరైః.
99 పూజితా పితృదానం హి నిష్పలం చ యయా వినా |స్వస్తి దేవీ వాయుపత్నీ ప్రతి విశ్వేషు పూజితా.
100 ఆదానం చ ప్రదానంచ నిష్పలం చ యయా వినా | పుష్ఠిర్గణపతేః పత్నీ పూజితా జగతీ తలే.
101 యయావినా పరిక్షీణాః పుమాంసో యోషితో7పిచ | అనంతపత్నీ తుష్టి శ్చ పూజితా వందితా భ##వేత్.
102 యయావినా నసంతుష్టాః సర్వే లోకాశ్చ సర్వతః | ఈశానపత్నీ సంపత్తీః పూజీతా చ సురైర్నరైః.
103 సర్వేలోకా దరిద్రా శ్చ విశ్వేషు చ యయావినా | ధృతిః కపిల పత్నీ చ సర్వై సర్వత్ర పూజితా.
104 సర్వేలోకా అధైర్యా శ్చ జగత్సు చ యయా వినా | సత్య పత్నీ సతీ ముక్తైః పూజితా జగతీ ప్రియా.
105 యయా వినా భ##వేల్లోకో బంధుతారహితః సదా | మోహపత్నీ దయా సాధ్వీ పూజితా చ జగత్ర్పియా.
106 ఎల్లర కాధారభూమి సకల సస్యశ్యామల సకల రత్నా కల రత్న గర్భ రత్నాకరముల కాటపట్టు; ప్రజలచేత ప్రజా పాలకులచేత పూజింపబడి నమస్కరింపబడునది. సకల ధనధాన్యరాసులకు నిలయము. సకల ప్రాణులకు జీవనాధారాము; జీవనాడి; సదాధారయగు భూమి లేనిచో చరాచరజగ మంతయు నిరాధార మగును. ఈమెయు ప్రధానాంశజురాలు. మునీశ్వరా! ఇక ప్రకృతి కళాంశములనుండి పుట్టినవారిని తెల్పుదును వినుము. ఏయే దేవి యెవరెవరి భార్యయో యంతయు వర్ణింతును; అగ్ని భార్య స్వాహాదేవి; విశ్వమంతయు నీమెను పూజించును. ఈమె లేనిచో దేవతలు హవిర్బాగములు గ్రహింపజాలరు. దక్షిణయును దీక్షయును వీరిర్వురును యజ్ఞపత్నులు. అంతట వీరిని పూజింతురు. వీరు లేనిచో నేకార్యమును సఫలము కాజాలదు. పితరుల భార్యస్వధావేవీ. మునులు మనువులు నరులు నీమెను పూజింతురు. స్వధామంత్రము లేక యొసంగిన దానాదులు నిష్పలములగును. ఇకవాయువు భార్యస్వస్తిదేవి; ఈమె విశ్వపూజితురాలు. ఈమెనె లేనిచో నిచ్చిపుచ్చుకొనుటలు ఫలవంతములుగావు. గణపతి భార్యపుష్టి; జగమున సర్వమాన్యురాలు. పుష్టిలేనిచో జగమందలి స్త్రీలు-పురుషులు నెల్లరను బలహీను లగుదురు. నీరసత్వము గల్గును; అనంతుని భార్య తుష్టి. ఈమె సర్వపూజిత; సర్వవందిత. ఈమె లేనిచో లోకములు సుఖసంతోషములతో నుండజాలవు. ఈశాను నిల్లాలు సంపత్తి; ఆమె సురనరులచే నిత్యసేవ లందుకొనును. ఈమె దయలేనిచో లోకములన్నియును దరిద్రము లగును. కపిలుని పత్ని ధృతి; ఈమె యంతట నెల్లర చేత పూజించుపబడును. ఈమె దయలేనిచో లోకములన్నియును ధైర్యము గోల్పోవును. సత్యపత్ని సతి; ఈమె లోకప్రియ; ముక్తపురుషు లీమెను నిత్యము సేవింతురు. ఈమె దయలేనిచో జగము బందుగులకు దూరమగును. మోహపత్నిదయ; జగ మంతయు నీమె నాదరించును. సర్వేలోకా శ్చ సర్వత్ర నిష్పలా శ్చ యయా వినా | పుణ్య పత్నీ ప్రతిష్ఠా సా పూజితా పుణ్యదా సదా.
107 యయా వినా జగత్సర్వం జీవన్మృతసమం మునే | సుకర్మ పత్నీ సంసిద్ధా కీర్తి ర్దన్యై శ్చ పూజితా.
108 యయావినా జగత్సర్వం యశోహీనం మృతంయథా | క్రియాతుద్యోగ పత్నీచ పూజితా సర్వసమ్మతా.
109 యయావినా జగత్సర్వం విధిహీనం చనారద | అధర్మపత్నీ మిథ్యా సా సర్వదూర్తైశ్చపూజితా.
110 యయావినా జగత్సర్వము చ్చిన్నంవిధినిర్మితమ్ | సత్యే ఆదర్శనా యాచ త్రేతాయాంసూక్ష్మరూపిణీ.
111 అర్దావయవరూపాచ ద్వాపరే చైవ సంవృతా | కలౌ మహా ప్రగల్బాచ సర్వత్ర వ్యాపికా బలాత్.
112 కపటేన సమం భ్రాత్రా భ్రమతే చగృహే గృహే | శాంతిర్లజ్ఞా చ భార్యేద్వే సుశీలస్యచ పూజితే.
113 యాభ్యాం వినా జగత్సర్వమున్మత్త మివ నారదా |జ్ఞానస్య తిస్రోభార్యాశ్చ బుద్ధిర్మేధా ధతిస్తథా.
114 యాభిర్వినా జగత్సర్వం మూఢం మత్తసమం సదా | మూర్తి శ్చ ధర్మపత్నీ సా కాంతిరూపా మనోహరా.
115 పరమాత్మాచ విశ్వౌఘో నిరాధారో యయా వినా | సర్వత్ర శోభారూపా చ లక్ష్మీ ర్మూర్తిమతీ సతీ.
116 శ్రీరూపా మూర్తిరూపా చ మాన్యా ధన్యా7తిపూజితా | కాలాగ్ని రుద్రపత్నీ చ నిద్రాసా సిద్ధయోగినీ.
117 సర్వేలోకాః సమాచ్చ న్నాయయాయోగేనరాత్రిషు | కాలస్య తిస్రోభార్యాశ్చ సంధ్యారాత్రి ర్దినాని చ.
118 యాభి ర్వినా విధాత్రా చ సంఖ్యా కర్తుం నశక్యతే | క్షుత్పిపాసే లోభభార్యే దన్యేమాన్యే చ పూజితే.
119 ఈమె లేనిచో లోకము లన్నియు నంతట నిష్పలములగును. పుణ్యపత్ని ప్రతిష్ట; ఈమె పుణ్యాదాయిని; సర్వ పూజిత. మునీ! ప్రతిష్ఠ లేనిచో జగమంతయు జీవన్నృతమగును. సుకర్మ భార్య కీర్తి; సిద్ధులు కృతార్దులు నగువారు కీర్తిని సేవింతురు. ఈమె లేనిచో జగమంతయు కీర్తి లేక మృత ప్రాయమగును. ఉద్యోగ పత్ని క్రియ; ఈమె నెల్ల రాదరింతురు. ఓయి నారదా! ఈమే లేనిచో జగమంతయు విధిహీనమగును. ఆధర్మ భార్య మిథ్య; ఈమెను ధూర్తులు పూజింతురు. ఈమె లేనిచో జగమంతయు విధి నిర్మతముగ నుండును. సత్య యుగమున మిథ్య లేకుండెను. ద్వాపరమున దీనికి సగము బలుపెక్కును. ఇక కలికాలమను రాగానే యిది పూర్తిగ బలిసి యంతట నిండి బలము పుంజుకొని వాగుడు నాయగనయ్యెను. దీని యన్నమోసము. వీరిద్దఱు నింటింట విచ్చలవిడిగ తిరుగుదురు. సుశీల పత్నులు శాంతిలజ్జలు. వీరు సర్వత్రపూజితలు. నారదా! వీరు లేనిచో జగమంతయు పిచ్చెక్కినట్టులుండును. జ్ఞానమునకు ముగ్గురు భార్యలు; వారు బుద్ధి మేధా ధృతులు. వీరు లేనిచో జగము మూఢమై పిచ్చెత్తినదివొలె నగును. అనగా లోకాన మూర్ఖత్వము తాండవించును. ధర్ముని భార్యమూర్తి. ఈమె కాంతిరూప మనోహర. ఈమె తోడు లేనిచో పరమాత్మయు నిరాధారుడగును. మూర్తివలననే లక్ష్మీ శోభావతిగ మూర్తిమతిగ సతిగ ప్రకాశించును. శ్రీ రూపమును మూర్తి రూపమే. ఈమెయు కడు మాన్య. ధన్య-పూజిత. రుద్రుని భార్యకాలాగ్ని; ఈమెను సిద్ధయోగిని యనియు యోగనిద్ర యనియు నందురు. లోకములన్నియును రాత్రివేళ యోగనిద్ర యొడిలో నిదురించును. కాలనీ భార్యలు దినము రాత్రి సంధ్యయని మువ్వురు. లేనిచో బ్రహ్మయు నంకెలు లెక్కింప జాలడు; లోభుని పత్ను లాకలిదప్పులు; వీరును మాన్యలు ధన్యలు. యాభ్యాం వ్యాప్తం జగత్సర్వం నిత్యంచింతాతురం భ##వేత్ | ప్రభా చ దాహికాచైప ద్వేభార్యే తేజస స్తథా.
120 యాభ్యాం వినా జగత్ర్సష్టా విధాతుంచనహీశ్వరః | కాలకన్యే మృత్యుజరే ప్రజ్వారస్య ప్రియా ప్రియే.
121 యాభ్యాం జగత్సముచ్చిన్నం విధాత్రానిర్మితం విధౌ | నిద్రాకన్యా చతంద్రాసా ప్రీతిరన్యా సుఖప్రీయే.
122 యాభ్యాం వ్యాప్తం జగత్సర్వం విధిపుత్ర విధేర్విధౌ | వైరాగ్యస్య చ ద్వేభార్యే శ్రద్ధా భక్తిశ్చ పూజితే.
123 యాభ్యాం శశ్వజ్జ గత్సర్వం యజ్జీవన్ముక్తిమన్ముదే | అదితిర్దేవమాతా చ సురభీ చ గవాం ప్రసూః.
124 దితి శ్చ దైత్య జననీ కద్రూ శ్చ వినతా దనుః | ఉపయుక్తాఃసృష్టి విధా వేతాస్తు కీర్తి తాః కాళాః.
125 కళా అన్యాః సంతి బహ్వ్యస్తాసు కశ్చి న్నిభోధ మే | రోహిణీ చంద్ర పత్నీ చ సంజ్ఞా సూర్యస్య కామినీ.
126 శతరూపా మనోర్బార్యా శచీంద్ర స్య చ గేహినీ | తారా బృహస్పతే ర్బార్యా వసిష్ఠ స్యా ప్యరుంధతీ.
127 ఆహల్యా గౌతమ స్త్రీ సా7ప్యనసూయా7త్రికామినీ | దేవహూతీ కర్దమస్య ప్రసూతి ర్దక్షకామినీ.
128 పితౄణాం మానసీ కన్యా మేనకా సా7ంబికాప్రసూః | లోపాముద్రా తథా కుంతీ కుబేరకామినీ తథా.
129 వరుణానీ ప్రసీద్ధా చ బలే ర్వింధ్యావళిస్త థా | కాంతా చ దమయంతీ చ యశోదా దేవకీ తథా.
130 గాంధారీ ద్రౌపదీశైబ్యా సాచసత్త్వవతీ ప్రియా | వృషభాను ప్రియా సాద్వీ రాధా మాతా కులోద్వహా.
131 మందోదరీ చ కౌసల్యా సుభ్రదాకౌరవీ తథా | రేవతీ సత్యభామా చ కాళిందీ లక్ష్మణా తథా.
132 వీరి వలన జగము నిండియున్నది. వీరి వశమున నుండనిచో జగములు చింతావ్యాకులము లగును. తేజుని భార్యలు ప్రభా-దాహికలు. వీరు లేనిచో బ్రహ్మ విశ్వమును సృజింపజాలడు. జ్వర భార్యలు జరామృత్యులు; వీరు కాలుని కన్యకలు; ప్రియాప్రియులు. వీరు లేనిచో బ్రహ్మసృష్టి పెరగునే కాని తఱుగదు. నిద్ర కూతుళ్ళు తంద్రా-ప్రీతులు; వీరుసుఖుని భార్యలు. నారదా! ఈ జగమంతయు వీరితోనే నిండియున్నది. వైరాగ్యుని భార్యలు శ్రద్ధాభక్తులు; పూజితలు. ఓమునీ! వీరి దయ వలన జగమంతయును జీవన్ముక్తము వలె నుండును. దేవ మాత యుగు అదితియను గోమాతయుగు సురభియను ప్రకృతికళ##లే. దైత్యుల జనని దితి; కద్రువ నాగమాత; గరుత్మంతుని తల్లి వినత; దనుజుల తల్లి దనువు; వీరందఱును ప్రకృతి కళ##లే. సృష్టి కార్యమున పాల్గొనినవారలే. ఇంకను ఖళాంళతో పుట్టినవారు గలరు. వారిని గూర్చి వినుము. చంద్రపత్ని రోహిణి; సూర్యుని యిల్లాలు సంజ్ఞ; మను ప్రియురాలు శతరూప; ఇంద్రుని ప్రియ శచి; బృహస్పతి ప్రియురాలు తార; వసిష్ఠుని సతీమణి అరుంధతి; గౌతముని భార్య అహల్య; అత్రి కామిని అనసూయ; కర్దముని పత్ని దేవహూతి; ప్రసూతి దక్షుని భార్య, పితరుల మానసపుత్రి మేనక, అంబికామాతయని ప్రసిద్ధి; లోపాముద్ర కుంతి కుబేరుని భార్య వారుణి బలి భార్య వింధ్యావళి కాంత దమయంతి యశోద దేవకి గాంధారి ద్రౌపది శైభ్య సత్యవతి రాధ తల్లి వృషభానుదిభార్య మండోదరి కౌసల్య సుభ్రద కౌరవి రేవతి సత్యభామ కాళింది లక్ష్మణ వీరందరు ప్రకృత్యంశరూపలు. జాంబవతీ నాగ్నజితి ర్మిత విందా తథా పురా | లక్ష్మణా రుక్మిణి సీతా స్వయం లక్ష్మీః ప్రకీర్తితా.
133 కాళీ యోజనగంధాచ వ్యాసమాతా మహాసతీ | బాణపుత్రీ తదోషా చ చిత్ర లేఖా చ తత్సఖీ.
134 ప్రభావతీ భానుమతీ తథా మాయావతీ సతీ | రేణుకా చ భృగోర్మాతా బలరామస్య రోహిణీ.
135 ఏకనందా చ దుర్గాసా శ్రీకృష్ణ భగీనీ సతీ| బహ్వ్యః సత్యః కళాశ్చై వ ప్రకృతే రేవ భారతే.
136 యా యా శ్చ గ్రామ దేవ్యః స్యుస్తాః సర్వా ప్రకృతేః కళాః | కళాంశాంశ సముద్బూతాః ప్రతివిశ్వేషు యోషితః.
137 యోషితామవమానేన ప్రకృతే శ్చ పరాభవః | బ్రాహ్మణీ పూజితా యేన పతీపుత్రవతీ సతీ.
138 ప్రకృతిః పూజితా తేన వస్త్రాలంకారచందనైః | కుమారీ చాష్టవర్షీయ వస్త్రాలంకార చందనైః.
139 పూజితా యోన విప్రస్య ప్రకృతిస్తేన పూజితా | సర్వాః ప్రకృతి సంభూతా ఉత్తమాధమ మధ్యమాః.
140 సత్త్వాంశా శ్చోత్తమా జ్జేయాః సుశీలా శ్చ పతివ్రతాః | మధ్యమా రజస శ్చాంశా స్తా శ్చ భోగ్యాః ప్రకీర్తితాః.
141 సుఖంసభోగ వశ్యా శ్చ స్వకార్యతత్పరాఃసదా | అధామాస్తమస శ్చాంశా అజ్ఞాతలకులసంభవాః. 142 దుర్ముఖాః కులహా దూర్తాః స్వతంత్రాః కలహ ప్రియాః |పృథివ్యాం కులటా యాశ్చ స్వర్గేచాప్సరసాంగణాః.
143 ప్రకృతే స్తమసవ్చాంశాః పుంశ్చల్యః పరికీర్తితాః | ఏవం నిగదితం సర్వం ప్రకృతే రూపవర్ణనమ్.
144 తాఃసర్వాః పూజితాః పృథ్వ్యాం పుణక్షేత్రేచ భారతే | పూజితా సురధే నాదౌ దుర్గా దుర్గార్తినాశినీ.
145 తతః శ్రీరామ చంద్రేణ రావణస్య వధార్థినా | తత్పశ్చాజ్జగతాం మాతాత్రిషు లోకేషుపూజితా.
146 జాంబవతి నాగ్నజితీ మిత్రవింద లక్ష్మణ రుక్మిణి లక్ష్మీస్వరూపిణి యగు సీతకాళి వ్యాసుని తల్లియగు యోజనగంధ బాణపుత్రి ఉష ఆమె నెచ్చెలి చిత్రలేఖ ప్రభావతి భానుమతి మాయవతి పరశురాముని తల్లి రేణుకాదేవి బలరాముని తల్లి రోహిణీ ఏకనంద కృష్ణుని సోదరి యగు దుర్గ మొదలగు వారలు ప్రకృతి కళా రూపిణులే. కొందఱు ప్రకృతికళాంశాంసముల నుండి పుట్టినవారును గలరు; కనుక స్త్రీ నవమానించిన ప్రకృతి నవమానించినట్లగును. భర్త కుమారులు గల్గిన బ్రాహ్మణ స్త్రీని పూజింపవలయును. వారిని వస్త్రాలంకార-చందనములతో పూజించినచో ప్రకృతిని పూజించినట్లగును. అటులే వస్త్రాలంకార చందనములతో పదారేండ్ళ స్త్రీని పూజించినచోప్రకృతిని పూజించినటులగును. ఉత్తమమధ్యమాధమ స్త్రీ లెల్లరును ప్రకృతి సంభూతలే. సత్త్వాంశము వలన పుట్టినవారుత్తములు సుశీలలు పతివ్రతలు. రజోంశమున బుట్టినవారు మధ్యములు భోగలాలసలు. తామసాంశమున బుట్టిన వారి శ్రేణిఏదో తెలియదు. వారధమలు. వారు తమ కార్యము సాగించుకొనుటలో జాణలు. వీరు మితిమీరిన మాటలలో వలపు కౌగిళ్ల తగుల్కొందురు. వీరు దుర్ముఖులు రులనాశినులు వ్యభిజారిణులు కలహప్రియులు. వీరు నేలపై వేశ్యలుగ స్వర్గమున నచ్చరలుగ నుందురు. అధమలు ప్రకృతి తామసాంశజులు; వీరజారిణులుగ పిలువబడుదురు. ఇట్లు నీకు ప్రకృతి వర్ణన మంతయును నిరూపించితిని. ఈపుణ్య భారత భూమిపై పూజితులగుదురు. మొట్టమొదట దుర్గార్తినాశిని యగు దుర్గాదేవిని సురథుడనువాడు పూజించెను. తర్వాత రావణుని చంపుటకు శ్రీరాముడును దేవి నారాధించెను. ఆ వెనుక జగన్మాత మూడు లోకాలలో పూజ నీయురాలయ్యెను. జాతా77దౌ దక్షకన్యా యా నిహత్య దైత్యదానవాన్| తతో దేహం పరిత్యజ్య యజ్ఞే భర్తుశ్చనిందయా.
147 జిజ్ఞే హిమవతః వత్న్యాం లేభే ఫశుపతిం పతిమ్ | గణశశ్చ స్వయం కృష్ణః స్కందో విష్ణురువోద్బవః.
148 బభూవతుస్తౌ తన¸° పశ్చాత్తస్యాశ్చ నారద | లక్ష్మీర్మంగళభూపేన ప్రదమం పరిపూజితా.
149 త్రిషులోకేషుతత్పశ్చా ద్దేవతామునిమానవైః | సావిత్రీ చా7 శ్వపతినా ప్రథమం పరిపూజితా.
150 తత్పశ్చాత్త్రిషులోకేషు దేవతాముని పుంగవైః | అదౌ సర్స్వతీదేవీ బ్రహ్మణా పరిపూజితా.
151 తత్పశ్చాత్త్రిషులోకేమ దేవతాముని పుంగవైః| ప్రధమం పూజితారాధా గోలోకే రాసమండలే.
152 పౌర్ణమాస్యాం కార్తికస్య కృష్ణేన పరమాత్మనా |గోపికాభిశ్చ గోపైశ్చ బాలికాభిశ్చ బాలకైః.
153 గవాం గణౖః సురభ్యాచ తత్పశ్చాదాజ్ఞయా హరేః | తదా బ్రహ్మాదిభిర్దేవైర్మునిభిః పరయా ముదా.
154 పుష్పధూపాదిభిర్బక్త్యా పూజితా వందితా సదా | పృధివ్యాం ప్రధమం దేవీ సుయజ్ఞేనైవ పూజితా.
155 శంకరేణోపదిష్టేన పుణ్యక్షేత్ర చ భారతే | త్రిషులోకేషు తత్పశ్చా దాజ్ఞయా పరమాత్మనః.
156 పుష్పదూపాదిభిర్బక్త్యా పూజితా మునిభిః సదా | కళాయా యాః సముద్బూతాః పూజితాస్తాశ్చ భారతే.
157 పూజితా గ్రామదేవ్యశ్చ గ్రామే చ నగరే మునే | ఏవం కథితం సర్వం ప్రకృతే శ్చరితంశుభమ్.
158 యధాగమం లక్షణం చ కిం భూయః శ్రోతుమిచ్చసి. ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే ప్రధమో7ధ్యాయః. దేవి మొదట దక్షకన్యగ పుట్టి దైత్య దానవులను చంపెను. పిదప తన భర్తను దక్షుడు నిందించుట వలన నామె దక్షయజ్ఞములో ప్రాణములు వదలెను. ఆమె తర్వాతి జన్మలో హిమవంతుని భార్య మేనకకు జన్మించి తపించి పశుపతిని భర్తగ బడసెను. గణపతి సాక్షాత్తు కృష్ణునంశ##మే; కుమారస్వామి విష్ణుకులోద్బవుడు. నారదా! గణపతి కుమారులు పార్వతికి కుమారులుగ జన్మించిరి. మొదట లక్ష్మిని మంగళ భూపాలుడను నతడుపూజించెను. ఆ తర్వాత ముల్లోకములందలి దేవముని నరులామెను పూజించిరి. సావిత్రీ దేవిని మొదట అశ్వపతిగొల్చెను. పిదపనామె ముజ్జగములందలి దేవమునులచేత పూజింపబడెను. బ్రహ్మచేత సరస్వతి మొట్టమొదట పూజింపబడెను. తర్వాత లోకములందు దేవమునులచేత నర్చింపబడెను. రాధాదేవీ మొదటగోలోకమందలి రాసమండలమున పూజింపబడెను. ఆమె కార్తికపౌర్ణమినాడు శ్రీకృష్ణపరమాత్మచేత నారాఘింపబడెను. పిదప ఆమె బ్రహ్మాది దేవతల-ములచే పరమామోదముతో పుష్పదూపాదులచేత పూజింపబడి నమస్కరింప బడెను. ఈ పవిత్రభారతతపోభూమిపై మొదట రాధను సుయజ్ఞుడారాధించెను. శివాదేశమున నతడు రాధను భారతదేశమున గొల్చెను పిదప కృష్ణు నాజ్ఞేచే ముల్లోకములు రాధనర్చించెను. మునులును రాధను పుష్పదూపాదులచే గొల్చిరి. ఇట్లు ప్రకృతి కళలనుండి పుట్టిన వారెల్లరును భారతదేశమున జన్మించి యారాధింపబడిరి. ఓ మునీశా! గ్రామదేవతలు ప్రతిగామమునందు పూజింపబడిరి. ఈ విధముగ నీకు ప్రకృతి శుభచరిత్రము వివరించితిని. ఇది ఆగమప్రోక్తము సలక్షణము. ఇంకేమి విన దలతవో తెలుపుము. ఇది శ్రీదేవీ భాగవత మహా పురాణ మందలి తొమ్మిదవ స్కంధమున ప్రధమాధ్యాయము.