Sri Devi Bagavatham-2
Chapters
అథ చతుర్థో7ధ్యాయః. నారద ఉవాచ: శ్రుతం సర్వం మయా పూర్వం త్వత్ప్ర సాదా త్సుధోపమమ్ | అధునా ప్రకృతీనాంచ వ్యస్తంవర్ణయ పూజనమ్.
1 కస్యాః పూజా కృతా కేన కథం మర్త్యే ప్రచారితా | కేన వా పూజితా కావా కేన కా వా స్తుతా ప్రభో.
2 తాసాం స్తోత్రం చ ధ్యానం చ ప్రభావం చరితం శుభం | కాభిః కేభ్యో వరో దత్తస్త న్మే వ్యాఖ్యాతు చమర్హసి. 3 శ్రీనారాయణ: గణశజననీ దుర్గా రాధా లక్ష్మీః సరస్వతీ | సావిత్రీ చ సృష్టివిధౌ ప్రకృతిః పంచధా స్మృతా. 4 ఆసాం పూజా ప్రసిద్ధా చ ప్రభావః పరమా ద్బుతః | సుధోపమం చ చరితం సర్వమంగళ కారణమ్. 5 ప్రకృత్యాంశాః కళాయాశ్చ తాసాం చ చరితంశుభమ్ | సర్వం వక్ష్యామి తే బ్రహ్మన్సావధానో నిశామయ. 6 కాళీ వసుంధరా గంగా షష్ఠీ మంగళచండికా | తులసీ మనసా నిద్రా స్వధా స్వాహా చ దక్షీణా. 7 సంక్షిప్త మాసాం చరితం పుణ్యదం శ్రుతిసుందరమ్ | జీవకర్మ విపాకంచ తచ్చ వక్ష్యామి సుందరమ్. 8 దుర్గాయాశ్చైవ రాదాయా విస్తీర్ణం చరితం మహత్ | తద్వత్పశ్చా త్ప్రవక్ష్యామి సంక్షేపక్రమతః శృణు 9 ఆదౌ సరస్వతీ పూజా శ్రీ కృష్ణేన వినిర్మితా | యత్ప్రసాదా న్ముని శ్రేష్ఠ మూర్ఖో భవతి పండితః. 10 ఆవిర్బూతా యదా దేవీ వక్త్రతః కృష్ణయోషితః | ఇయేష కృష్ణం కామేన కాముకీ కామరూపిణీ. 11 స చ విజ్ఞాయ తద్బావం సర్వజ్ఞం సర్వమాతరమ్ | తామువాచ హితం సత్యం పరిణామే సుఖావహమ్. 12 భజ నారయణం సాధ్వి మదంశం చ చతుర్బుజమ్ | యువానం సుందరం సర్వగుణయుక్తం చ మత్సమమ్. 13 నాలుగవ అధ్యాయము ప్రకృతి పూజా విధానము నారదు డిట్లనెను: నీ దయ వలన నమృత పసముల వంటి పూర్వ వృత్తాంత మంతయును వింటిని. ఇపుడు మూల ప్రకృతుల పూజా విదాన మంతయును వివరముగ వర్ణింపుము. ఓ ప్రభూ! ఈ భూలోకమందే యే దేవతనెరెవ రెటు లెటుల పూజించి సంస్తుతించి ప్రచారించిరో తేటగ తెలుపుము. ఆయా దేవతల స్తోత్రము ధ్యానము ప్రభావము శుభచరితము తెలుపుటకు నీవే సమర్దుడవు. శ్రీ నారాయణ డిట్లనెను: గణపతి తల్లి యగు దుర్గ రాధ లక్ష్మీ సరస్వతి సావిత్రి యను వారు సృష్టి ప్రకృతి దేవతలు. ఒకేమూల ప్రకృతి సృష్టి కొఱ కిటులనైదు విధము లయ్యెను. వీరి పూజాదులు సుప్రసిద్ధములు. వీరి ప్రతిభా ప్రభవములు పరమాద్బుతములు. వీరి దివ్య చరిత్రములు సర్వ మంగళకరములు. అమృతపు సోనలు. ఓ బ్రాహ్మణోత్తమా! ఇపుడా ప్రకృత్యంశల యొక్క ప్రకృతి కళల యొక్క-శుభచరితములు వివరించి తెల్పుదును. సావధానముగ చెవి కిం పుగ నాలకింపుము. శ్రీ కాళి వసుంధర గంగ షష్ఠి మంగళచండిక తులసి మనస నిద్ర స్వాహ స్వధ దక్షిణ యను వారు ప్రకృతి దేవతలు. ఈ దేవతల శుభచరితములు పుణ్యప్రదమైనవి; శ్రుతి మధురములు. తిలోకమసుందరములు-జీవుల కర్మములు తొలగించునవి. వీని గుఱించి సంక్షేపముగ తెలుపుదును వినుము. శ్రీదుర్గారాధల చరితములు విస్తరించి తక్కినవి సంక్షేపించి తెల్పుదును వినుము. మునివర్యా! మొట్టమొదట శ్రీ కృష్ణుడు సరస్వతిదేవిని పూజించెను. ఆమె దయవలన మూర్ఖుడు సైతము పండితకవి కాగలడు. సరస్వతీ రాధా దేవి ముఖమునుండి యావిర్బవించెను. కామస్వరూపిణి కాముకి యగు సరస్వతి కృష్ణుని కామించెను. సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు సర్వమాతయగు సరస్వతి భావ మెఱంగి యామెకు హితకరము సుఖకరమునగు మాట యిట్ల పలికెను. ఓ సాధ్యీ! నీవు నారాయణుని సేవింపుము. అతడు నా యంశ##చే బుట్టినవాడు; చతుర్బుజుడు నవయువకుడు; అందగాడు సకల గుణయుతుడు.నాకు సాటియైనవాడు. కామజ్ఞం కామినీనాం చ తాసాం చ కామపూరకమ్ | కోటి కందర్ప లావణ్యలీలాలంకృత మీశ్వరమ్. 14 కాంతే కాంతం చ మాంకృత్వా యదిస్థాతు మిహేచ్ఛసి | త్వత్తో బలవతీ రాధా న భద్రం తే భవిష్యతి. 15 యో యస్మా ద్బ ల వాన్వాణి తతో7న్యం రక్షితుం క్షమః | కథం పరాన్సాధయతి యది స్వయమనీశ్వరః. 16 సర్వేశః సర్వశాస్తా7హం రాదాం బాధితు మక్షమః | తేజసా మత్సమానాచ రూపేణ చ గుణన చ. 17 ప్రాణాధిష్ఠాతృదేవీ సా ప్రాణాం స్త్యక్తుంచ కః క్షమః | ప్రాణతో7పి ప్రియః పుత్రః కేషాం నాస్కిత చ కశ్చన. 18 త్వం భ##ద్రే గచ్ఛ వైకుంఠం తవ భద్రం భవిష్యతి | పతిం త మీశ్వరం కృత్వా మోదస్వ సుచిరం సుఖమ్. 19 లోభమోహ కామ క్రోధ మానహిం సా వివర్జితా | తేజసా తత్సమా లక్ష్మీ రూపేణ చ గుణన చ. 20 తయా సార్ధం తవ ప్రీతయా శశ్వత్కాలః ప్రయాస్యతి | గౌరవం చ హరి స్తుల్యం కరిష్యతి ద్వయోరపి. 21 ప్రతి విశ్వేషు తాం పూజాం మహతీణ గౌరవాన్వితామ్ | మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభే చ సుందరి. 22 మానవో మననో దేవా మునీంద్రా శ్చ ముముక్షవః | వసవో యోగినః సిద్ధా నాగా గం ధర్వరాక్షసాః. 23 మద్వరేణ కరిష్యంతి కల్పే కల్పే లయావది | భక్తియుక్తా శ్చ దత్త్వా వై చోపచారాణి షోడశ. 24 కణ్వశాఖోక్త విధినా ధ్యానేన స్తవనేన చ | జితేంద్రియాః సంయతాశ్చ ఘటేచ పుస్తకే7పి చ. 25 కృత్వా సువర్ణ గుటి కాం గంధ చందనం చర్చితామ్ | కవచంతే గ్రహీష్యంతి కంఠే వా దక్షిణ భుజే. 26 అతడు కామినుల కోర్కు లెఱుంగినవాడు; వారిలోని కోరికలు దీర్చువాడు; కోటిమన్మథులవలె సుందరుడు; ఈశ్వరుడు. కాంతా! నన్ను పతిగ జేసికొని నాకు జంటగ నుండ కోరుచున్నావు. ఇది తగదు ఏలన రాధ నీకంటే బలము గలది. వాణీ! ఎవడైనన బలశాలి నాశ్రయించినచో నతడు బలహీనున కాశ్రయ మీయగలడు. బలహీను నాశ్రయించినచో నత డెట్టు లొకని కాశ్రయ మీయగలడు? నేను సర్వేశుడను: నిజమే కాని రాధ మనసును నేను నొప్పింపజాలను. ఏలన నామె తేజమున రూపము గుణమునన్ని విధములలో నాకు సరిజోడు. రాధ నాకు పాణ్రాధిష్ఠానదేవి; కనుక నెవడైన తన ప్రాణములను తాను పోగొట్టుకొనగలడా? తండ్రికి కొడుకు ప్రియమైనవాడే కాని తన ప్రాణములకన్న కొడుకు ప్రియమైనవాడు కాదు గదా? కనుక కల్యాణీ! నీవు వైకుంఠ మేగుము; అచట నీకు మేలు గల్గుత! నీ వచట నీశ్వరుని పతిగ వరించి సుఖములు బడయుము. అచట లక్ష్మి గలదు. ఆమెయును కామక్రోధములు మానహింసలు లోభమోహములు లేనిది; ఆమెయును తేజమున రూపమున గుణమున నీకు సమానురాలు. నీ వామె యిర్వురు సుఖముగ కాలము గడుపవచ్చును. హరి యును మీ యిర్వురిని సమభావమున చూడగల దక్షుడు. సుందరీ! ప్రతి వివ్వమందును మాఘశుద్ధ పంచమినాడు గొప్ప గౌరవముతో విద్యారంభమున నిన్ను పూజింతురు. ఎల్ల మానవులు మనువులు దేవతలు మునీంద్రులు మోక్షకాములు వసువులు యోగులు సిద్ధ నాగ గంధర్వ రాక్షసులును నిన్ను పూజింతురు. ఇట్టు లెల్లరును ప్రతికల్పమున చివరివఱకును భక్తియుక్తితో షోడశ పూజలతో నిన్ను పూజింతురు. ఇట్లు నీకు వర మిచ్చుచున్నాను. జితేంద్రియులు సంయములును కణ్వశాఖవిధిచే నిన్ను కలశమందుగానిపుస్తకమందుగాని యావాహనముచేసి ధ్యానింతురు. నీ కవచము రేకుపై నిర్మించి దానిని గంధచందన ములతో పూజించి మెడలోగాని భుజమునగాని దానిని ధరించవలయును. పఠిష్యంతి చ విద్వాంసః పూజాకాలే చ పూజితే | ఇత్యుక్త్వా పూజయామాస తాం దేవీం సర్వ పూజితామ్. 27 తతస్త త్పూజనం చక్రు ర్బహ్మవిష్ణుశివాదయః | అనంతశ్చాపి ధర్మశ్చ మునీంద్రాః సనకాదయః. 28 సర్వ దేవా శ్చ మునయో నృపాశ్చ మానవా దయః | బభూవ పూజితా నిత్యా సర్వలోకైః సరస్వతీ. 29 నారద ఉవాచః పూజా విధానం కవచం ధ్యానం చాపి నిరంతరమ్ | పూజోపయుక్తం నైవేద్యం పుష్పం చ చందనాదికమ్. 30 వద వేదవిదాం శ్రేష్ఠ శ్రోతుం కౌతూహలం మమ | వర్తతే హృదయే శశ్వత్కిమిదం శ్రుతి సుందరమ్. 31 శ్రీనారాయణః శృణు నారద వక్ష్యామి కణ్వశాఖోక్త పద్ధతిమ్ | జగన్మాతుః సర్వస్వతాః పూజావిధి సమన్వితామ్. 32 మాఘుస్యశుక్లపంచమ్యాంవిద్యారంభ దినే7పిచ | పూర్వే7హ్ని సమయం కృత్వా తత్రా7హ్ని సంయతః శుచిః. 33 స్నాత్వా నిత్యక్రియాః కృత్వా ఘటం సంస్థాప్య భక్తితః | స్వశాఖోక్త విధానేన తాంత్రికేణా7థవా పునః. 34 గణశం పూర్వ మభ్యర్చ్య తతో7భీష్టాం ప్రపూజయేత్ | ధ్యానేన వక్ష్యమాణన ధ్యాత్వా77 వాహ్య ఘటే ధ్రువమ్. 35 ధ్యాత్వా పునః షోడశోపచారేణ పూజయే ద్ర్వతీ | పూజోపయుక్త నైవేద్యం యచ్చవేదే నిరూపితమ్. 36 వక్ష్యామి సౌమ్య తత్కించి ద్యథాథీతం యథాగమమ్ | నవనీతం దధి క్షీరం లాజాం శ్చ తిలలడ్డు కమ్. 37 ఇక్షు మిక్షురసం శుక్ల వర్ణం పక్వగుడం మధు | స్వస్తికం శర్కరా శుక్ల ధాన్యస్యాక్షత మక్షతమ్. 38 అస్విన్న శుక్ల ధాన్యస్య పృథుకం శుక్లమోదకమ్ | ఘృతసైంధవ సంయుక్తం హవిష్యాన్నం యథో దితమ్. పండితులు పూజాకాలమున నిన్ను పూజింతురు. అని సర్వ పూజితయగు సరస్వతిని శ్రీకృష్ణుడు పూజించెను. ఆనాటి నుండియును బ్రహ్మ విష్ణు శివులను మునీంద్రులు సనకాదులును అనంతుడు ధర్ముడును సకల దేవతలును మునులును రాజులు నరులు నెల్ల దేవతలును సరస్వతీదేవి నారాధింప దొడగిరి. నారదు డిట్టనియెను : సరస్వతీదేవి పూజావిధానాదులు కవచము ధ్యానము పూజకు తగిన పూలు చందనాదులునైవేద్యము గూర్చి తెల్పుము. నీవు వేదవిదులలో శ్రేష్ఠుడవు;నాకును వీనులవిందుక విను కోర్కె గలదు. నా యెడదలో శ్రుతి సుందరమైన దేవీపూజా విషయము విన వేడుక యగుచున్నది. శ్రీ నారాయణు డిట్లనెను: ఓ నారదా! కణ్వ శాఖ లోని పద్ధతి ప్రకారముగ జగన్మాతయగు సరస్వతి పూజా విధానము తెల్పు దును. వినుము. మాఘు శుద్ధ పంచమి నాడు గాని విద్యారంభము దినమున గాని మధ్యాహ్నము లోపుగ శుచిగ నియమముతో దేవిని పూజించుటకు నియమనించుకొనవలయును. ఆనాడు స్నాన మొనర్చి నిత్యకృత్యములు దీర్చికొని తనశాఖ ప్రకారముగ గాని తాంత్రికముగ గాని భక్తితో కలశ స్థాపనము చేయవలయును. తొలుత గణపతిని పూజించి కలశమున దేవి నావాహనము చేసి శాస్త్రమున చెప్పినట్లుగ ధ్యానించవలయును. పిమ్మట షోడశోపచార పూజలతో దేవిని పూజించి వేదమున చెప్పినట్లు నైవేద్య మర్పించవలయును. వేదమందును తంత్రమందును చెప్పిన నైవేద్యముల గూర్చి తెల్పుదును. వినుము. వెన్న పెరుగు పాలు పేలాలు నువ్వుండలు చెఱకు ముక్కలు బెల్లము పిండి వంటలు పటిక బెల్లము; తేనె మిఠాయి తెల్లని బియ్య పన్నము తెల్ల ధాన్యములు యటుకులు తెల్లని లడ్డు ఉప్పు నెయ్యి కలిసిన హవిష్యాన్నము- యవగోధూమచూర్ణానాం షిష్జకం ఘృతసంయుతమ్ | షిష్టకం స్వస్తి కస్యా7పి పక్వరంభా ఫలస్య చ. 40 పరమాన్నం చ సఘృతం మిష్టాన్నం చ సుధోపమమ్ | నారికేళం తదుదకం కసేరుం మూల మార్దృకమ్. 41 పక్వరంభాఫలం చారు శ్రీఫలం బదరీఫలమ్ | కాలదేశోద్బవం చారు ఫలం శుక్లం చ సంస్కృతమ్. 42 సుగంధ శుక్ల పుష్పం చ సుగంధం శుక్ల చంధనమ్ | నవీనం శుక్ల వస్త్రం చ శంఖం చ సుందరంమునే. 43 మాల్యం చ శుక్ల పుష్పాణాం శుక్లహారం చ భూషణమ్ | యాదృశం చ శ్రుతౌ ధ్యానం ప్రశస్యం శ్రుతిసుందరమ్. 44 తన్నిబోధ మహాభాగ భ్రమభంజనకారణమ్ | సరస్వతీం శుక్ల వర్ణాం సస్మితాం సుమనోహరామ్. 45 కోటి చంద్ర ప్రభా పుష్ట శ్రీయుక్త విగ్రహామ్ | వహ్ని శుద్ధాంశుకాధానాం వీణా పుస్తకధారిణీమ్. 46 రత్న సారేంద్ర నిర్మాణనవ భూషణ భూషితామ్ | సుపూజితాం సురగణౖ ర్బ్ర హ్మవిష్ణు శివాదిభిః. 47 వందే భక్త్యా వందితాం చ మునీంద్రమను మానవైః | ఏవం ధ్యాత్వా చ మూలేన సర్వం దత్త్వా విచక్షణః. 48 సంస్తూయ కవచం ధృత్వా ప్రణమేద్ధండవద్బువి | యేషాం చేయ మిష్టదేవీ తేషాం నిత్యా క్రియా మునే. 49 విద్యారంభే చ వర్షాంతే సర్వేషాం పంచమీదినే | సర్వోపయుక్తా మూలం చ వైదికాష్టాక్షరః పరః. 50 యేషాం యేనోపదేశో వా తేషాం సమూల ఏవచ | సరస్వతీ చతుర్థ్వంతం వహ్నిజాయాంతమేవ చ. 51 లక్ష్మీ మాయాదికం చైవ మంత్రో7యంకల్పపాదవః | పురా నారాయణ శ్చేమం వాల్మీకాయ కృపానిధిః. 52 బియ్యము గోధుమ పిండి కలిపి నేతితో చేసిన వంటకము పండిన యరటి పండ్లతో గలిపి చేసిన పిండివంటలు నేతి పరమాన్నము అమృత భోజనము కొబ్బరికాయ కొబ్బరిబొండముల నీరు కందమూలాలు అల్లము పండిన యరటిపండ్లు రేగుపండ్లు నాయా దేశకాలముల దొరకునట్టి తెల్లని మంచిపండును దెచ్చి సరస్వతీమాతకు నివేదించవలయును. ఓ మునీ తెల్లని మంచి గంధము చందనము తెల్లని పూలు తెల్లని వస్త్రము సుందరమైన శంఖమును దేవి కర్పించవలయును. తెల్లని పూమాల మేలిమి సొమ్ములు సరస్వతి కీయవలయును. వేదమందు ప్రశంసింపబడిన సరస్వతీ ధ్యాన మెట్టిదో వినుము. మహాత్మా! ఆ ధ్యానము వినినచో అది భ్రమల తొలగించును. తెల్లని వర్ణముగల్గి చిర్నగవులు చిందించుచు సుమనోహరయై కోటి వెన్నెలలను మించిన పుష్టమైన దివ్యమైన యాకృతి గలిగి నిప్పుతోశుద్ధమై పవిత్రమైన వస్త్రములు దాల్చి వీణియపొత్త ములుచేతుల ధరించి నవరత్న భూషణభూషితయై బ్రహ్మవిష్ణుశివాదులచేత పూజింపబడి మునీంద్రమను మానవులచేత నమస్క రింపబడిన సరస్వతీదేవిని పరాభక్తితో నమస్కరించుచున్నాను. అని తెలిసినవాడు తప్పక సరస్వతిని గూర్చి మూల మంత్రముతో నీ ధ్యానము పఠించవలయును. తర్వాత కవచము చదివి దండప్రణామము చేయవలయును. ఇది సరస్వతి నిష్టదేవిగ కొల్చువాని నిత్యక్రియ. విద్యారంభమునగాని సంవత్సరము చివరగాని పంచమినాడుగాని సరస్వతిని బూజింపవలయును. వేదోక్తమైన యష్టాక్షరీమంత్రము సరస్వతీ మూలమంత్రము. ఎవరు దేని నుపదేశముగ బొందిన వారి కదియే మూలమంత్ర మగును. సరస్వతీ శబ్దమునకు చతుర్థీ విభక్తి చేర్చి చివర కగ్ని భార్య పే రుంచవలయును. ఆదే ''శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా'' అను మంత్రము. తొలుత లక్ష్మీ మాయా బీజము. (శ్రీం-హ్రీం) లుంచవలయును. ఈ మంత్రము కల్పవృక్షము వంటిది. పూర్వము దయాశ్రీకుడగు నారాయణుడు దీని నాదికవియగు వాల్మీకి కుపదేశించెను. ప్రదదౌ జాహ్నవీతిరే పుణ్యక్షేత్రే చ భారతే | భృగుర్దదౌ చ శుక్రాయ పుష్కరే సూర్యపర్వణి. 53 చంద్రపర్వణి మారీచో దదౌ వాక్పతయే ముదా | భృగోశ్చైవ దదౌ తుష్టో బ్రహ్మా బదరికాశ్రమే. 54 ఆస్తికస్య జరత్కారు ర్దదౌ క్షీరోద సన్నిధౌ | విభాండకో దదౌ మేరా వృష్యశృంగాయ ధీమతే. 55 శివః కణాదమునయే గౌతమాయ దదౌ ముదా | సూర్యశ్చ యాజ్ఞవల్క్యాయ తథా కాత్యాయనాయ చ. 56 శేషః పాణినయే చైవ భారద్వాజాయ ధీమతే | దదౌ శాకటాయనాయ సుతలే బలిసంసది. 57 చతుర్లక్షజపేనైవ మంత్రసిద్ధిర్బవేన్నృణామ్ | యదిస్యా న్మంత్రసిద్ధో హి బృహస్పతి సమో భ##వేత్. 58 కవచం శృణు విప్రేంద్ర యుద్దత్తం బ్రహ్మణా పురా | విశ్వ స్రష్టా విశ్వజయం భృగవే గంధమాదనే. 59 భృగురువాచ : బ్రహ్మ న్బృహ్మవిదాం శ్రేష్ఠ బ్రహ్మ జ్ఞానవిశారద | సర్వజ్ఞ సర్వజనక సర్వేశ సర్వపూజిత. 60 సరస్వత్యాశ్చకవచం బ్రూహి విశ్వజయంప్రభో | అయాతయామం మంత్రాణాం సమూహ సంయుతంపరమ్. 61 బ్రహ్మవాచ : శృణు వత్స ప్రవక్ష్యామి కవచం సర్వకామదమ్ | శ్రుతిసారం శ్రుతిసుఖం శ్రుత్యుక్తం శ్రుతిపూజితమ్. 62 ఉక్తం కృష్ణేన గోలోకే మహ్యం బృందావనే వనే | రాసేశ్వరేణ విభునా రాసే వై రాసమండలే. 63 అతీవ గోపనీయం చ కల్పవృక్షసమం పరమ్ | అశ్రుతాధ్బుత మంత్రాణాం సమూహైశ్చ సమన్వితమ్. 64 యద్ధృత్వా భగవాన్ శుక్రః సర్వదైత్యేషు పూజితః | యుద్ధృత్వా పఠనా ద్బృహ్మ న్బుద్ధిమాంశ్చ బృహస్పతిః. నారాయణుడు దీనిని భారతదేశమందలి పూణ్యతీర్థమగు గంగాతీరమున నుపదేశించెను. భృగుమహర్షి దీనిని పుష్కరతీర్థమున సూర్యగ్రహణమున శ్రుక్రున కొసంగెను. చంద్రగ్రహణమునాడు దీనిని మరీచి బృహస్పతి కొసంగెను. బ్రహ్మ బదరి కాశ్రమమున భృగువున కొసంగెను. పాలసంద్రము సన్నిధిశ్రీని జరత్కారు డాస్తీకున కొసంగెను. విభాండకుడు మేరుగిరిపై ఋష్యశృంగున కొసంగెను. శివుడు కణాదగౌతములకును సూర్యుడు యాజ్ఞ్యవల్క్యునకును కాత్యాయనునకు నొసంగెను. శేషుడు పాతాళమున బలిసభలో పాణిని భరద్వాజ శాకటాయనుల కుపదేశించెను. దీనిని నాల్గులక్షలు జపించి నచో నరులకు సిద్ధి గల్గును. మంత్రసిద్ధుడైనవాడు బృహస్పతి సముడగును. ఓ విప్రేంద్రా! ఇక సరస్వతీ కవచము వినుము. ఇది విశ్వవిజయము గల్గించును. దీనిని బ్రహ్మ గంధమాదన ప ర్వతముపై భృగున కుపదేశించెను. భృగు విట్లనెను: బ్రహ్మా! బ్రహ్మవిదులలో నీవు శ్రేష్ఠుడవు ; బ్రహ్మజ్ఞాన విశారదుడవు ; సర్వజ్ఞుడవు ; సర్వజనకుడవు సర్వేశుడవు సర్వపూజి తుడవు. ఓ ప్రభూ! విశ్వజయమగు సరస్వతీ కవచము నాకు ననుగ్రహింపుము. అది మంత్రము లన్నిటికి నిలయమైనది. దోషము లేనిది. బ్రహ్మ యిట్లనెను: ఓయి వత్సా ! సర్వకామములు దీర్చు విశ్వజయ కవచము వినుము. అది శ్రుతిసుఖము వేదసారము వేదపూజితము వేదోక్తము. నాకు బృందాపదమున గోలోకమున రాసమండలమున రాసేశ్వరుడగు కృష్ణవిభు డుపదేశించెను. ఇది మిక్కిలి రహస్యమైనది. కల్పతరువు వంటిది. ఇది అత్యద్బుతమై యెన్నడును వినని మంత్రములతో నొప్పును. దీనిని ధరించుట వలన శుక్రుడు సకల దానవులందు పూజనీయు డయ్యెను.దీనిని దాల్చుట వలన బృహస్పతి బుద్ధిశాలి యయ్యెను. పఠనా ద్ధారణా ద్వాగ్నీ కవీంద్రో వాల్మికోమునిః| స్వాయంభువో మనుశ్చైవయద్ధృత్వా సర్వపూజితః. 66 కణాదో గౌతమః కణ్వఃపాణినిః శాకటాయనః| గ్రంథం చకార యుద్ధృత్వా దక్షః కాత్యాయనః స్వయమ్. ధృత్వా వేదవిభాగం చ పురాణా న్యఖిలాని చ|చకార లీలామాత్రేణ కృష్ణద్వైపాయనః స్వయమ్. 68 శాతాతపశ్చ సంవర్తో వసిష్ఠ శ్చ పరాశరః| యద్ధృత్వా పఠనా ద్గృంథం యాజ్ఞపల్క్యశ్చకార సః. 69 ఋష్యశృంగో భరద్వాజ శ్చాస్తికో దేవల స్తథా | జైగేషవ్యో యయాతిశ్చ ధృత్వాసర్వత్ర పూజితాః. 70 కవచస్యాస్య విప్రేంద్ర ఋషిరేవ ప్రజాపతిః | స్వయం ఛందశ్చ బృహతీ దేవతాశారదా7ంబికా. 71 సర్వతత్త్వ పరిజ్ఞాన సర్వార్థ సాధనేషుచ| కవితాసు చ సర్వాసు వినియోగః ప్రకీర్తితః. 72 శ్రీంహీం సరస్వత్తై స్వాహా శిరో మే పాతు సర్వతః | శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మే సర్వదా7వతు. 73 ఓంహ్రీం సరస్వత్త్యెస్వాహేతిశ్రోత్రే పాతు నిరంతరమ్| ఓంశ్రీం హ్రీం భగవత్త్యె స్వాహా నేత్రయుగ్మం సదా7వతు. 74 ఐం హ్రీ వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదా7వతు| హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా చోష్ఠం సదా7వతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదా7వతు| ఐమిత్యేకాక్షరో మంత్రో మమకంఠం సదా7వతు. 76 ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాంస్కంధౌ మే శ్రీం సదా7వతు| ఓం హ్రీం విద్యా ధిష్ఠాతృదేవ్యై స్వాహా వక్షః సదా7వతు. 77 ఓంహ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా మే పాతు నాభికామ్| ఓం హ్రీం క్లీం వాణ్యౖస్వాహేతి మమహస్తౌసదా7వతు. దీనిని పఠించుటచే వాల్మీకిమహర్షి వక్తగ కవీంద్రుడుగ నయ్యెను. మున్ను స్వాయంభువ మనువును దీనిని ధరించి సర్వపూజితు డయ్యెను. కణాదుడు గౌతముడు కణ్వుడు పాణిని శాకటాయనుడు కాత్యాయనుడు దక్షుడును దీనిని ధరించి యుత్తమ గ్రంధములు రచింపగల్గిరి. శ్రీవ్యాసమహర్షియును స్వయముగ దీనిని ధరించి వేదములు విభజించి లీలగ పురాణములు రచించెను. వసిష్ఠడు పరాశరుడు శాతాతపుడు సంవర్తుడు యాజ్ఞవల్క్యుడును దీనిని దాల్చి పఠించుట బట్టియే గ్రంథ రచయితలైరి. ఋష్యశృంగుడు భరద్వాజుడు ఆస్తికుడు దేవలుడు జైగీషవ్యుడు యయాతి యనువారు దీనిని దాల్చి విశ్వ పూజితులైరి. ఓ విప్రేంద్రా| ఈ సరస్వతీ కవచమునకు ప్రజాపతి ఋషి; బృహతీ ఛందము; శ్రీశారదాంబిక-దేవత;సర్వతత్త్వ పరిజ్ఞానము- సర్వార్ధ సాధనము-సకల సంగీత సాహిత్య కళాప్రాప్తి-కొఱకు దీని వినియోగము చెప్పబడును. ''ఓం శ్రీం హ్రీం సరస్వత్త్యై స్వాహా'' నా శిర మెల్లెడల గాపాడుగాక! ''శ్రీం వాగ్దేవతాయై స్వాహా '' నాఫాలభాగము బ్రోచుగాక! ''ఓం హ్రీంభగవత్యై స్వాహా'' నిత్యము చెవులు రక్షించుగాత! ''ఓం శ్రీం హ్రీం భగవత్త్యై స్వాహా'' కన్నులు నిత్యమోము గావుత! ''ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా'' ముక్కులెప్పుడు బ్రోచుగాక! హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా'' పెదవులు బ్రోచుగాత!''ఓం శ్రీం హ్రీం బ్రహ్మై స్వాహా'' దంతములు గాపాడుగాక! ''ఐం'' ఏకాక్షరము నా కంఠము నెల్లవేళల రక్షించుత:ఓం శ్రీం హ్రీం నా మెడను బ్రోచుత| నాభుజములను శ్రీం బ్రోచుగాక! ఓం హ్రీం విద్యాధిష్ఠాతృ దేవ్యై స్వాహా''నా వక్షమునకు శ్రీరామరక్ష. ఓం హ్రీం విద్యాధి స్వరూపాయై స్వాహా నా బొడ్డును రక్షించుగాక! ఓం హ్రీం క్లీం వాణ్యౖ స్వాహా నా చేతులను పోషించుగాక! ఓం సర్వ వర్ణాత్మికాయై పాదయుగ్మం సదా7వతు | ఓం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా మాం సర్వదా7వతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదా7వతు| ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా7గ్నిదిశి రక్షతు. 80 ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్త్యెబుధజనన్యై స్వాహా| సతతం మంత్రారాజో7యం దక్షిణమాం సదా7వతు. 81 ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరోమంత్రో నైఋత్యాం సర్వదా7వతు| ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణ7వతు. 82 ఓం సర్వాంబికాయై స్వాహా వాయువ్యే మాం సదా7వతు| ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మా ముత్తరే7వతు. 83 ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహైశాన్యాం సదా7వతు | ఓం హ్రీం సర్వపూజితాయైస్వాహా చోర్థ్యం సదా7వతు. 84 హ్రీం పుస్తకవాసిన్యై స్వాహా ధోమాం సదా7వతు| ఓం గ్రంథబీజ స్వరూపాయై స్వాహా సర్వతో7వతు. 85 ఇతి తేకథితం విప్ర బ్రహ్మమంత్రౌషు విగ్రహమ్ | ఇదం విశ్వజయం నామ కవచం బ్రహ్మరూపకమ్. 86 పురా శ్రుతం దర్మవక్త్రాత్పర్వతే గంధమాదనే | తన స్నేహాన్మయా77ఖ్యాతం ప్రవక్తవ్యం న కస్యచిత్. 87 గురు మభ్యర్చ్య విధివ ద్వస్త్రాలంకారచందనైః| ప్రణమ్య దండవ ద్బూమౌ కవచం ధారయే త్సు ధీం. 88 పంచలక్షజపేనైవ సిద్ధంతు కవచం భ##వేత్ | ఇతిస్యా త్సిద్ధకవచో బృహస్పతిసమో భ##వేత్. 89 మహావాగ్మీ కవీంద్ర శ్చ త్రైలోక్య విజయీ భ##వేత్ |శక్నోతి సర్వం జేతుం చ కవచస్య ప్రసాదతః. 90 ఇదం చ కణ్వశాఖోక్తం కవచం కథితం మునే| స్తోత్రం పూజా విధానం చ ధ్యాసం చ వందనం శృణు. 91 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కందే చతుర్థో7ధ్యాయః. ''ఓం సర్వవర్ణాత్మికాయై స్వాహా'' నా పదములను పాలించుగాత!''ఓం హ్రీం వాగధిష్ఠాతృ దేవ్యైస్వాహా'' నన్నె ల్లప్రొద్దుల రక్షించుత! ''ఓం సర్వకంఠ వాసిన్యై స్వాహా'' నన్ను తూరుపుదెస నెప్పుడోముత! ''ఓం సర్వ జిహ్వాగ్ర వాసిన్యై స్వాహా'' అగ్నిదిశను గాపాడుత! ''ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్త్యె బుధజనన్యై స్వాహా'' అను మంత్రరాజము దక్షిణమున నన్నెప్పుడు రక్షించుత! ''ఐం హ్రీం శ్రీం'' అను మూడక్షరముల మంత్రము నన్ను నెఋతి దిశయందు బ్రోచుత! ''ఓం ఐం జిహ్వాగ్ర వాసిన్యై స్వాహా'' నన్ను పడమట గాపాడుత!'' సర్వాంబికాయై స్వాహా'' నన్ను వాయువ్యమున పాలించుత. ''ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా'' నను ఉత్తరమున రక్షించుత. ''ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహా'' ఈశాన్యమున నోముత.''ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా'' పైదెస బ్రోచుత! ''హ్రీం పుస్తక వాసిన్యై స్వాహా'' క్రింది దిశగాపాడుత! ''ఓం గ్రంథబీజ స్వరూపాయై స్వాహా'' నన్నెల్లెడల రక్షించుత. ఓ విప్రా! ఇట్లు నీకు బ్రహ్మమంత్రములు రూపుదాల్చిన బ్రహ్మరూపమగు విశ్వవిజయమును కవచము తెలిపితిని. పూర్వము నేను దీనిని గంధమాదన పర్వతముపై ధర్ముని నోట వింటిని. ఇపుడు దీనిని నీ మీద స్నేహము వలన నీకు తెలిపితిని. దీనినితరులకు తెలుపకుము. గురువును వస్త్రాలంకార చందనములతో పూజించి దండప్రణామము గావించి యీ కవచము ధరించవలయును. దీని నైదులక్షలు జపించినచో సిద్ధి గల్గును. సిద్ధకవచుడైనవాడు బృహస్పతి సముడగున. అతడు వక్త కవీంద్రుడు త్రిలోక విజేత-యగును. అతడీ కవచప్రభావమున విశ్వముచే జయింపగలడు. ఓ మునీశా| ఇటుల కణ్వశాఖలో చెప్పిన చోప్పున నీకు కవచము వినిపించితిని. ఇపుడు సరస్వతీ స్తోత్రము పూజా విధానము ద్యానము వందనము గూర్చి వినుము. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కందమున నాల్గవ యధ్యాయము.