Sri Devi Bagavatham-2
Chapters
అథషష్ఠో7ధ్యాయః శ్రీనారాయణః : సరస్వతీ తు వైకుంఠే స్వయం నారాయణాంతికే | గంగాశాపేన కలహాత్కలయా భారతే సరిత్.
1 పుణ్యదా పుణ్యరూపా చ పుణ్యతీర్థ స్వరూపిణీ | పుణ్యవద్బిర్ని షేవ్యా చ స్థతిః పుణ్యవతాం మునే.
2 తపస్వినాం తపోరూపా తపసః ఫలరూపిణీ | కృతపాపేధ్మదాహాయ జ్వలదగ్ని స్వరూపిణీ.
3 జ్ఞానా త్సరస్వతీతోయే మృతా యే మానవా భువి | తేసాం స్థితి శ్చ వైకుంఠే సుచిరం హరిసంసది.
4 భారతే కృత పావశ్చ స్నాత్వా తత్రచ లీలయా | ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకే వసేచ్చిరమ్. 5 చాతుర్మా స్యాం పౌర్ణమా స్యా మక్షయాయాం దినక్షయే | వ్యతీపాతే చగ్రహ7ణన్య స్మి న్పుణ్య దినే7పి చ. 6 అనుషంగేణ యః స్నాతో హేతునా7శ్రద్ధయా7పివా | సారూప్యం లభ##తే నూనం వైకుంఠే స హరే రపి. 7 సరస్వతీ మనుం తత్ర మాసమేకం చ యో జపేత్ | మహామూర్ఖః కవీంద్రశ్చ స భ##వేన్నా7త్ర సంశయః. 8 నిత్యం సరస్వతీ తోయే యఃస్నాయా న్ముండయన్నరః| న గర్బవాసం కురుతే పునరేవ స మానవః. 9 ఇత్యేవం కథితం కించి ద్బారతీ గుణ కీర్తినమ్| సుఖదం కామదం సారం భూయఃకిం శ్రో తు మిచ్చసి. 10 నారాయణ వచః శ్రు త్వా నారదో మునిసత్తమః | పునః పప్ర చ్చ సందేహ మిమం శౌనక| సత్వరమ్. 11 కధం సరస్వతీ దేవీ గంగాశాపేన భారతే | కలయా కలహేనైవ బభూవ పుణ్యదా సరిత్. 12 శ్రవణ శ్రుతిసారాణాం వర్థతే కౌతుకం మమ | కథా7మృతే న మే తృప్తిః కేన శ్రేయసి తృప్యతే. 13 కథాం శశాప సా గంగా పూజితాం తాం సరస్వతీమ్ | సాతు సత్త్వస్వరూపా యా పుణ్యదా శుభదా సదా. 14 ఆరవ అధ్యాయము సరస్వతి నదిగా మారుట శ్రీనారాయణు డిట్టు లనియెను: మునిపుంగవా! వైకుంఠమందు నారాయణుని సన్నిధానమున వసించు సరస్వతీ దేవి గంగతో కలహించి యామె శాపమున భారతదేశమున నదిగమారెను. మునీ! ఈమె పుణ్యస్వరూపిణి; పుణ్యదాయిని; పుణ్యతీర్థ స్వరూపిణి; పుణ్యవంతులు సరస్వతీ తీర్థమున వసించి సరస్వతిని సంసేవింతురు. సరస్వతి తాపసులకు తపో రూపిణి; తపఃపల స్వరూపిణి; ఎండుకట్టెల నగ్ని కాల్చునట్లు సరస్వతి పాపములను తొలగించగలదు. ఏ పుణ్యవంతులు భారతదేశమందలి సరస్వతి నదిలో ప్రాణములు వదలుదురో వారు వైకుంఠమందలి విష్ణు సభలో పెక్కేండ్లు వసింతురు. భారతదేశమున నెంత పాపియైనను సరస్వతీ నదిలో స్నాన మాడినచో వాని పాపపంక మంతయును తొలగును. వాడు పవిత్రుడై విష్ణుధామమునందు చిరకాలము వసించును. చాతుర్మాస్యమున పున్నమినాడు అక్షయమున దినక్షయమున వ్యతీ పాతయోగమున గ్రహణమందు మఱి యే పుణ్యదినమున వీనిలో దేనియం దైననను కారణము లేకున్నను శ్రద్ధ లేకున్నను సరస్వతీ నదిలో నొక్కసారియైన మునింగినవాడు విష్ణు పదమున హరిసారూప్య మొందగలడు. ఈ పావన సరస్వతీ తీరమునందు నొక్కనెల సరస్వతీ మంత్రము జపించినవాడు మూర్ఖుడెనను తప్పక కవీంద్రుడు గాగలడు. ఒకసారి క్షౌరము చేయించుకొని సరస్వతి నదిలో నిత్యము స్నానమాచరించువాడు మరల గర్బవాస నరక మనుభవింపడు. ఇట్లు భారతీదేవి యొక్క సుఖప్రదము కామదము సారమగు గుణకీర్తనములు నీకు కొద్దిగ మాత్రమే వినిపించితిని. ఇంకేమి వినదలతువో చెప్పుము. శౌనక! అను నారాయణుని వచనములు విని నారద మునీంద్రుడు మరల వెంటనే తన సందేహము తీర్చుకొనుట కిట్లు ప్రశ్నించెను. సరస్వతీ గంగతో కలహించి యామె శాపమున నదిగ నెట్లు భారతమున నవతరించెనో కొంచెము విపుల ముగ చెప్పుము. వేదసారము వినుటయందు నా కుత్సాహము మెండగుచున్నది. నీ దివ్యదేవీ కథామృత మొంత క్రోలినను తనివి దీరుటలేదు. శుభములు పరంపరగ గల్గుచుండగ తృప్తి యేల గల్గును? సత్త్వస్వరూపిణి పుణ్యదాయినియగు గంగ సర్వపూజితయగు సరస్వతి నేల శపించెను? తేజస్వినోర్ద్వయో ర్వాదకారణం శ్రుతి సుందరమ్| సుదుర్లభం పురాణష తన్మేవ్యాఖ్యాతు మర్హసి. 15 శ్రీనారాయణ ఉవాచ: శృణు నారద వక్ష్యామి కథా మేతాం పురాతనీమ్| యస్యాః శ్రవణమాత్రేణ సర్వపాపాత్ర్పముచ్యతే. 16 లక్ష్మీ సరస్వతీ గంగా తిస్రో భార్యా హరే రపి| ప్రేవ్ణూ సమాస్తా స్తిష్ఠంతి సతతం హరిసన్నిధౌ. 17 చకార సైకదా గంగా విష్ణోర్ముఖనిరీక్షణమ్| సస్మితా చ సకామా చ సకటాక్షం పునః పునః. 18 విభు ర్జహాస త ద్వక్తృం నిరీక్ష్య చ క్షణం తదా| క్షమాం చకార త ద్దృష్ట్వా లక్ష్మీర్నైవ సరస్వతీ. 19 బోధయామాస పద్మా తాం సత్త్వరూపా చ సస్మితా| క్రోధావిష్టా చ సా వాణీ న చ శాంతా బభూవ హ. 20 ఉవాచ వాణీ భర్తారం రక్తాస్యా రక్తలోచనా| కంపితా కామవేగేన శశ్వత్ర్పస్పురితా ధరా. 21 సరస్వత్యువాచ: సర్వత్ర సమతాబుద్ధిః సద్బర్తుఃకామినీం ప్రతి| దర్మిష్టస్య వరిష్ఠస్య విపరీతా ఖలస్య చ. 22 జ్ఞాతం సౌభాగ్యమధికం గంగాయాంతే గదాధర| కమలాయాం చ తత్తుల్యం న చ కించిన్మయి ప్రభో. 23 గంగాయాః పద్మయాసార్ధం ప్రీతిశ్చా7స్తి సుసమ్మతా| క్షమాం చకార తేనేదం విపరీతం హరిప్రియా. 24 కిం జీవనేన మే7త్రైవ దుర్బగాయాశ్చ సాంప్రతమ్| నిష్పలం జీవనం తస్యా యా పత్యుః ప్రేమవంచితా. 25 త్వాం సర్వే సత్త్వరూపం చ యేవదంతిమనీషిణః| తే చ మూర్ఖా న వేదజ్ఞాన జానంతి మతిం తవ. 26 సరస్వతీవచః శ్రుత్వా దృష్ట్వా తాం కోపసంయుతామ్| మనసా చ సమాలోచ్య సజగామ బహిఃసభామ్. 27 గతే నారాయణ గంగా మువాచే నిర్బయం రుషా| వాగధిష్ఠాతృదేవీసా వాక్యం శ్రవణదుష్కరమ్. 28 వారిర్వురును తేజస్వినులు గదా! వారి వాదోపవాదములు శ్రుతి సుందరములు. ఇవి పురాణములందు దుర్లభములు కనుక నిన్నడుగుచున్నాను. శ్రీనారాయణు డిట్లనెను: ఓయీ నారదా! వత్సా! ఈ పురాణకథ యాలకింపుము. దీనిని విన్నం తనే జన్మజన్మముల పాపము లన్నియు సమసిపోవును. శ్రీహరికి లక్ష్మి సరస్వతి గంగ మువ్వురు భార్యలు; వీరు పరస్పరము ప్రేమతో కలసిమెలసి విష్ణుసన్నిధిని నివసించుచుండిరి. ఒకనాడు గంగవిష్ణుముఖమును మాటిమాటికి చూచుచు నేవో కోర్కె లువ్వెత్తుగ పరవళ్ళు ద్రొక్కగ నవ్వుచు కటాక్ష వీక్షణములు నిగుడించెను. ఆమె ముఖము చూచి విష్ణువును నవ్వెను. ఇదంతయును జూచి లక్ష్మి మిన్నకుండెను. కాని సరస్వతి యోర్చుకొనలేకపోయెను. సత్త్వశాంతరూపిణియగు లక్ష్మీదేవి చిర్నగవుతో సరస్వతిని శాంతింపజేయుజూచెను. కాని క్రోధాతిరేకముగల సరస్వతి యేమాత్రము శాంతింపలేదు. అపుడు సరస్వతి ముఖము కన్ను నెఱ్ఱవారెను. పెదవు లదరెను. కామవేగమున మేను కంపించెను. ఆమె భర్తతో నిట్లు పలికెను. ధర్మాత్ముడు శ్రేష్ఠుడు సర్వసముడు దక్షిణుడు నగు భర్త తన భార్యలను సమభావముతో చూచుకొనును. దుర్మా ర్గుడు మాత్రము తన భార్యలను సమానముగ చూచుకొనలేడు గదాధరా! ప్రభూ! నీకు గంగాలక్ష్ముల యెడల పక్షపాత బుద్ధి యున్నది. నా మీద నీ కేమాత్రము జాలి దయలేదు. గంగకు లక్ష్మి యెడలను ప్రేమధికముగ గలదు. కావుననే లక్ష్మి యంతయు సహించియున్నది. ఇక మిగిలిన దానను నేనే దౌర్బాగ్యురాలను. నే నిక్కడ బ్రదికి యేమి లాభము! పతి ప్రేమలేని దాని బ్రదుకు వ్యర్థము గదా! మనీషులునిన్ను సత్త్వమూర్తిగపల్కుదురు. వారు వేదవిదులు గారు; మూర్ఖులు; నీ నిజ స్వభావము వారికి తెలియదు. అని కోపముతో కఠినముగపలికిన సరస్వతి పల్కులు విని విష్ణువాలోచించి సభ నుండి బయటి కేగెను. నారాయణుడు వెళ్ళిన పిదప నిర్బయముగ రోషముతో కర్ణశూలములుగ వాగ ధిష్ఠాతృదేవియగు సర స్వతి ఇట్లు పలికెను. హే నిర్లజ్జే హేసకామే స్వామిగర్వం కరోషి కిమ్| అధికం స్వామి సౌభాగ్యం విజ్ఞాపయితు మిచ్చసి. 29 మానం చూర్ణం కరిష్యామి తవా7ద్యహరిసన్నిధౌ | కిం కరిష్యతి తే కాంతో మమైవం కాంతవల్లభే. 30 ఇత్యేవ ముక్త్వా గంగాయాః కేశం గ్రహీతుముద్యతా| వారయామాస తాం పద్మా మధ్యదేశం సమాశ్రితా. 31 శశాపవాణీ తాంపద్మాం మహాబలవతీ సతీ| వృక్షరూపా సరిద్రూపా భవిష్యతి న సంశయః. 32 విపరీతం యతో దృష్ట్వా కించిన్నోవక్తు మర్హసి| సంతిష్ఠతి సభామధ్యే యథావృక్షోయథాసరిత్. 33 శాపం శ్రుత్వాతు సా దేవీ నశశాప చుకోపహ | తత్రైవ దుఃఖితా తస్థౌ వాణీంధృత్వాకరేణచ.34 అత్యున్నతాం తు తాం దృష్ట్యా కోపప్రస్పురితాధరామ్| ఉవాచగంగా తాందేవీం పద్మాం చారక్తలోచనామ్. 35 తా ముత్సృజ మహోగ్రాంచ పద్మాం కిం మే కరిష్యతి| దుఃశీలా ముఖరా నష్టా నిత్యం వాచాలరూపిణీ. 36 వాగధిష్ఠాత్రీ దేవీయం సతతం కలహప్రియా| యావతీ యోగ్యతా చాస్యా యావతీ శక్తిరేవచ. 37 తథా కరోతు వాదం చ మయాసార్ధంచ దుర్ముఖీ | స్వబలం యన్మమబలం విజ్ఞాపయితుమిచ్చతి. 38 జానంతు సర్వే హ్యుభయోః ప్రభావం విక్రమం సతి| ఇత్యేవ ముక్త్వా సాదేవీ వాణ్యౖశాపం దదావితి. 39 సరిత్స్వరూపా భవతు సాయాత్వాం చ శశాపహ| ఆథో మర్త్యే సా ప్రయాతు సంతు యత్రైవ పాపినః. 40 కలౌ తేషాం చ పాపాని గ్రహీష్యంతి న సంశయః | ఇత్యేవం వచనం శ్రుత్వా తాంశశాప సరస్వతీ.41 లజ్జలేనిదానా! కామవతీ! నీకు పతిగర్వ మెక్కువగ నున్నది. భర్త నీ పట్ల ప్రేమగల్గి యున్నట్లు తెలుపుకొనదలచుచున్నావు. నీ గర్వము నిపుడే శ్రీహరి ముందే వమ్ము చేయగలను. నీ కాంతు డేమి చేయగలడో నేను చూతును. నేనును కాంత వల్లభను సుమా! అని గంగ తలవెండ్రుకలు పట్టి సరస్వతి లాగబోయెను. అంతలో లక్ష్మి యడ్డువచ్చి వారం చెను. సరస్వతికి కోపమాగలేదు. ఆమె లక్ష్మిని తప్పక నదిగ చెట్టుగ గమ్మని శపించెను. ఏలన నిండు పేరోలగంబున నింత విపరీతముగ జరుగుచున్న నొక్క మాట మాత్రమైన బలుకక లక్ష్మి చెట్టువలె నదివలె మిన్నకుండెను. అంతటి ఘోర శాపము వినియును లక్ష్మి మరల శపింపలేదు. కోపించలేదు. ఆమె లోలోన బాధపడుచు సరస్వతి చేయి పట్టుకొని నిలు చుండెను. ఆ విధముగ క్రోధరోషములతో పెదవులు వణకుచు కన్ను లెఱ్ఱ చేసిన సరస్వతిని వదలిపెట్టుమని గంగ యిట్ల నెను. ''పద్మా!దానిని వదలుము. ఆదేమి చేయునో నేనును చూతును. అది గయ్యాళిది; వదరుబోతు దుశ్శీల అదెప్పు డింతే. ఇది వాక్కు కధిష్ఠానదేవి; ఎప్పుడు కలహించుచుండును. నా యోగ్యత నా సత్త యేమియు దీని కింకను తెలియదు. ఈ దుర్ముఖి నాతోనే వాదానికి దిగినదే! నా బల మెంతో తన బల మెంతో తెలిసికొనదలచుచున్నది కాబోలు! మా యిర్వురి ప్రభావము పరాక్రమము నెల్ల రెఱుంగుదురు గాక!'' అని పలికి గంగ వాణి నిట్లు శపించెను. అది నన్ను నది గమ్మని శపించినట్లే తానును నదిగ మారగలదు. పాపు లుండు మనుజలోకమున సరస్వతి నదిగమారగలదు. సరస్వతి కలికాలము తప్ప పాపాత్ముల పాప మనుభవింపగలదు'' అను గంగమాటలు విని సరస్వతి గంగనిట్టు శపించెను. త్వమేవ యాస్యసి మహీం పాపిపాపం లభిష్యసి| ఏతస్మినంతరే తతృ భగవానాజగామ హ. 42 చతుర్ముజ శ్చ తుర్బిశ్చ పార్షదైశ్చ చతుర్బుజైః | సరస్వతీం కరే ధృత్వావాసయామాస వక్షసి. 43 బోధయామాస సర్వజ్ఞః సర్వజ్ఞానం పురాతనమ్| శ్రుత్వా రహస్యం తసాంచ శాపస్య కలహస్య చ. 44 ఉవాచ ధుఃఖితా స్తా శ్చ వాచం సామయికీం విభుః| లక్ష్మి త్వం కలయా గచ్చ ధర్మధ్వజగృహంశుభే.45 అయోనిసంభవా భూమౌ తస్య కన్యా భవిష్యసి| తత్రైవదైవదోషేణ వృక్షత్వం చ లభిష్యసి. 46 మదంశ స్యాసురసై#్వవ శంఖచూడస్య కామినీ| భూత్వా పశ్చాచ్చ మత్పత్నీ భవిష్యసి న సంశయః. 47 త్రైలోక్యపావనీ నామ్నా తులసీతిచ భారతే| కలయా చ సరిద్భావం శీఘ్రం గచ్చ వరాననే. 48 భారతం భారతీశాపా న్నామ్నా పద్మావతీ భవ| గంగే యాస్యసి పశ్చాత్త్వమం శేనవిశ్వపావనీ. 49 భారతం భారతీశాపాత్పాపదాహాయపాపినామ్| భగీరథస్య తపసా తేననీతా సుకల్పితే. 50 నామ్నా భాగీరథీ పూజ్యా భవిష్యసి మహీతలే| మదంశస్య సముద్రస్య జాయాజాయేర్మమాజ్ఞయా. 51 మత్కలాంశస్య భాపస్య శంతనోశ్చ సురేశ్వరి| గంగా శాపేన కలయా భారతం గచ్చభారతి. 52 కలహస్య ఫలం భుంక్ష్వ సపత్నీభ్యాం సహాచ్యుతే| స్వయం చ బ్రహ్మసదనే బ్రహ్మణ: కామినీ భవః. 53 గంగా యాతు శివస్థానమత్ర పద్మైవతిష్ఠతు| శాంతా చ క్రోధరహితా మద్బక్తా సత్త్వరూపిణి. 54 నీవును భూమిపై ప్రవహించి పాపుల పాపా లనుభవింపగలవు. అనునంతలో భగవాను డచటి కేగుదెంచెను. చతుర్బుజుడగు నారాయణుడు నల్గురు చతుర్భజులు పార్షదులు తోడురాగ నేతెంచి సరస్వతిని చేయి పట్టుకొని తన గుండెకురాగము మీరహత్తకొనెను. సర్వజ్ఞు డామెకు పురాతనమగు సర్వజ్ఞానము తెలిపెను. వారి వారి కలహములను శాపముల రహస్యములను వినెను. వారు మిక్కిలిగ వగచిరి. అపుడు హరి యా సహాయమునకు తగినట్లుగ వారితో నిట్లు పలికెను: లక్ష్మీ! నీవు నీ యంశ##చే ధర్మధ్వజు నింట జన్మింపుము. నీ వచట నతని కయోనిజవై కన్యగ నవతరింపుము. అచటనే నీవు దైవదోషమున వృక్షముగ మారగలవు. శంఖచూడుడను రాక్షసుడు నా యంశ##చే పుట్టును. నీ వతనికి భార్యవై తిరిగి నాకు తప్పక పత్నివి గాగలవు. నీవు భారతదేశమందు త్రైలోక్యపావనియగు తులసి నామమున ప్రసిద్ధి గాంతువు. ఓ వరాననా ! నీవు వెంటనే నీ యంశ##చే నదీరూపమును దాల్చుము, భారతీ శాపమున నీవు భారతదేశమున పద్మావతీ నదిగ ప్రవహింపుము. గంగా! నీవును నీ యంశవలన విశ్వపావనివి కమ్ము. నీవు భారతవర్షమునందు భారతీశాపమువలన పాపుల పాపములు తొలగించు టకు నదివి కమ్ము. నిన్ను గూర్చి భగీరథుడు తపించి భూమికి గొనిపోవును. అందువలన నీవు భూతలమున ''భాగీరథి'' యను పేర ఖ్యాతి గాంతువు. నీవు నా యాజ్ఞవలన నా యంశజుడగు సముద్రునకు భార్యవు గాగలవు. సురేశ్వరీ! పిదప నీవు శంతను రాజునకు భార్యవు గాగలవు. అతడు నా యంశ##చే బుట్టగలడు. సరస్వతీ ! నీవును గంగాశాపమున భారతదేశ మేగుము. ఇట్లు మీరు సవతుల పోరు ఫలమనుభవింతురు. నీవు బ్రహ్మయింట బ్రహ్మపత్నిగ నుండుము. ఇంక గంగ శివునిచెంత కేగుగాత! నాసన్నిధిలో పద్మ మాత్రము నెలకొని యుండుగాత ! పద్మ పరమశాంత-క్రోధరహిత-నా భక్తు రాలు-సత్త్వస్వరూపిణి. మహాసాధ్వీ మహాభాగా సుశీలా ధర్మచారిణీ | యదంశకలయాసర్వా ధర్మిష్ఠాశ్చ పతివ్రతాః. 55 శాంతరూపాః సుశీలాశ్చ ప్రతివిశ్వేషు పూజితాః | తిస్రోభార్యాస్త్రిశీలాశ్చ త్రయోభృత్యాశ్చ బాంధవాః. 56 ధ్రువం వేదవిరుద్దాశ్చ నహ్యేతే మంగళప్రదాః | స్త్రీపుంవచ్చ గృహేయేషాం గృహిణాం స్త్రీవశఃపుమాన్. 57 నిష్పలం చ జన్మతేషా మశుభం చ పదేపదే | ముఖే దుష్టా యస్య స్త్రీ కలహప్రియా. 58 అరణ్యం తేన గంతవ్యం మహారణ్యం గృహాద్వరమ్ | జలానాం చ స్థలానాం చ ఫలానాం ప్రాప్తి రేవచ. 59 సతతం సులభా తత్ర నతేషాం గృహ ఏవ చ | వరమగ్నౌ స్థితిర్హింస్ర జంతూనాం సన్నిధౌ సుఖమ్. 60 తతో7పి దుఃఖం పుంసాం చ దుష్ట స్త్రీసన్నిధౌ ధ్రువమ్ | వ్యాధిజ్వాలా విషజ్వాలా వరంపుంసాంవరాననే. 61 దుష్ట స్త్రీణాం ముఖజ్వాలా మరణా దతిరిచ్యతే | పుంసాం చ స్త్రీజితాంచైవభస్మాంతంశౌచ మధ్రువమ్. 62 యదహ్ని కురుతేకర్మన తస్య ఫలభాగ్బవేత్ | నిందితో7త్ర పరత్రైవ సర్వత్ర నరకం వ్రజేత్. 63 యశః కీర్తి విహీనో యో జీవన్నపి మృతో హి సః | వహ్నీనాం చ స పత్నీనాం నైకత్రశ్రేయసే స్థితిః. 64 ఏకభార్యః సుఖీ చైవ బహుభార్యః కదా చ న | గచ్ఛ గంగే శివస్థానం బ్రహ్మస్థానం సరస్వతి. 65 అత్ర తిష్ఠతు మద్గేహే సుశీలాకమలాలయా | సుసాధ్యా యస్యపత్నీ చ సుశీలా చ పతివ్రతా. 66 ఇహ స్వర్గే సుఖం తస్య ధర్మోమోక్షః పరత్ర చ | పతివ్రతా యస్యపత్నీ స చముక్తః శుచిః సుఖీ. 67 జీవన్మృతో7శుచి ర్దుఃఖీ దుఃశీలా పతిరేవచ. ఇతి శ్రీదేవీభాగవతే మహాపురామే నవమస్కంధే షష్ఠో7ధ్యాయః. లక్ష్మి మహాసాధ్వీమణి-మహాసౌభాగ్యవతి-సుశీల-ధర్మచారిణి-ఈమె యంశ##చేత బుట్టిన వారెల్లరును ధర్మిష్ఠులు పతివ్రతలు నగుదురు. వారు సుశీలలు శాంతరూపలు నగుదురు. వీరెల్లెడల పూజింపబడుదురు. భిన్నభావాలుగల ముగ్గురు భార్యలుగాని ముగ్గురు సేవకులుగానిముగ్గురు బందుగులుగాని యొకచో నుండరాదు. ఈ ముగ్గురు కలిసియుంట వేదవిరుద్ధము. ఇది మంచిదిగాదు. ఏ యింట స్త్రీ పురుషుడు వర్తించునో యా యింటి మగవాడు దానికి లొంగిపోవును. వాని జన్మము వ్యర్థము. అట్టి మగవారి కడుగడుగున ముప్పు వాటిల్లుచునే యుండును. ముఖదుష్ట - యోనిదుష్ట - కలహప్రియయగు భార్య యున్న పురుషుడు దానిని వదలవలయును. అతడు మహారణ్యమున కేగవలయును. అది వాని కింటికంటె శ్రేష్ఠమైనది. ఏలన నచట మంచినీరు-మంచిపండ్లు మంచిచోటు లభించును. ఇవన్ని యతని కచట సులభములు. అతని కివి యింటిలో దొర కవు. అగ్నిలో నుండుట క్రూరమృగముల మధ్య నుండుట సాధ్యమగును. సుఖముగ నుండును. కాని దుష్టయగునాలి చెంత నుండరాదు. అది నరులకు దుఃఖకరమైనది. ఓ వరాననా! పురుషులకు వ్యాధిమంటలు విషపుమంటలు చల్లగ నుండగలవు. కాని దుష్ట స్త్రీల నోట వెల్వడు ముండ్ల మాటల పెనుమంట మరణముకన్న దారుణమైనది. దుష్ట స్త్రీల యడుగులకు మడుగు లొత్తు పురుషులు చితిలో కాలినపుడే శాంతి జెందగలరు. అట్టివాడు ప్రతిదిన మే పని చేసినను దాని ఫలిత మనుభవింపడు. వాడిచట నిందలపా లగును. తర్వాత నరకమున గూలును. యశము-కీరితి లేనివాడు బ్రతికియు చచ్చినవానితో సమానుడు. కనుక పెక్కురు సవతు లొక్కచోట నుండుట తగదు. ఒకే పెండ్లము గలవాడు కడు సుఖి ; పెక్కు భార్యలు గలవాడు మిక్కిలి దుఃఖబాజనుడు. గంగా ! నీవు శివుని చోటి కేగును. సరస్వతీ ! నీవు బ్రహ్మస్థానమున కరుగుము. ఇట నా యింట సుశీలయగు కమలాలయ నెలకొని యుండును. ఎవని పత్ని పతివ్రతయో సుశీలయో పతి చెప్పినట్లు వినునో వాడు ధన్యుడు. అతని కచట స్వర్గసుఖము చేకూరును. ధర్మబుద్ధి గల్గును. పరలోకమున మోక్షసుఖము ప్రాప్తించును. దుశ్శీల ప్రతికూల యగు భార్య గలవాడు బ్రతికియును చచ్చినవాడే. నిత్యము దుఃఖించువాడే యగును. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమునందలి తొమ్మిదవ స్కంధమందు షష్ఠాధ్యాయము.