Sri Devi Bagavatham-2    Chapters   

అథ దశమో7ధ్యాయః.

నారదః: భూమి దానకృతం పుణ్యం పాపం తద్ధిరణన చ l పరభూహరణా త్పాపం కూపే7ంధోఃఖననే తథా 1

అంబువాచ్యాం భూఖననే వీర్యసగత్యాగ ఏవ చ l దీహిదిస్థాపనా త్పాపం శ్రోతుమిచ్ఛామి యత్నతః. 2

అన్యద్వా పృధివీజన్యం పాపం య త్పృచ్చచే పరమ్‌ l యదస్తి తత్ర్పతీకారం వద వేదవిదాం వర . 3

శ్రీనారాయణః: వితస్తి మాత్రాం భూమిం చ యోదదాతి చ భారతే l సంధ్యా పూతాయ విప్రాయ స యాతి శివమందిరమ్‌. 4

భూమిం చ సర్వసస్యాఢ్యాం బ్రాహ్మణాయ దదాతి చ l భూమిరేణుప్రమాణాబ్ద మంతే విష్ణుపదే స్థితిః. 5

గ్రామం భూమిం చ ధాన్యం చ బ్రాహ్మణాయ దదాతి యః l సర్వపాపా ద్వినిర్ముక్తౌ చోభౌ దేవీ పురస్థితౌ. 6

భూమిదానం చ తత్కాలే యః సాధు శ్చానుమోదతే l స చ ప్రయాతి వైకుంఠే మిత్రగోత్ర సమన్వితః. 7

స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరేత్తు యః l స తిష్ఠతి కాలసూత్రే యా చ్చంద్రదివాకరౌ. 8

తత్పుత్త్ర పౌత్ర ప్రభృతి ర్బూమి హీనః శ్రియా హతః l పుత్రహీనో దరిద్రశ్చ ఘోరం యాతి చ రౌరవమ్‌. 9

గవాం మార్గం వినిష్కృ ష్య యశ్చ సస్యం దదాతి చ l దివ్య వర్షశతం చై కుంభీపరాకే స తిష్ఠతి. 10

పదవ అధ్యాయము

పృథివ్యుపాఖ్యానము

నారద డిట్లనెనమ: భూదానమువలనిపుణ్యము భూమిని దానము చేసి మరల దానిని వశము చేసికొనిన వాని పాపమును నితరులభూమిని హరించిన వాని పాపమును నితరులు త్రవ్వించిన బావి నిర్జలముకాగా ఆస్థానమున వాని అనుమతి లేకయే మరల తాను బావిని త్రవ్విన వావి పాపమును అంబువాచి యంధు భూమి త్రవ్విన వాని పాపమును నేలపై వీర్యము పడవేసిన వాని పాపముని నేలపై దీపముంచిన వాని పాపమును గూర్చి వివరముగ వినదలచుచున్నాను. వేద విదులలో శ్రేష్ఠుడా!మఱియును నేలపై చేసిన తక్కిన యనాచార పాపము లన్నియును దేనివలన తొలగునో వివరింపవేడు చున్నాను. నారాయణు డిట్లనెను: ఈ పవిత్ర భారతభూమిపై వితస్తి మాత్రము నేల నిత్యము సం ధ్యావందనము చేయువిప్రునకు దానము చేయువాడు శివలోకమునవకేగును. పంటపోలముతో నిండిన భూమిని బ్రాహ్మణునగు దానము చేసిన వా డా పొలములో నెన్ని రేణువులు గలవోయన్నేండ్లు శివలోకమందుండి తుదకు విష్ణులోకమేగుము. గ్రామమును భూమిని ధాన్యమును మూటిని బ్రాహ్మణునకు దాన మొసంగిన దతయును దానము బొందినవాడు నిర్వురును దేవీలోకమున వసింతురు. భూమి దానమును చేయుట కొప్పు కొనువాడు సైతమును తన మిత్రులతో బందువులతొ గూడి వైకుంఠమున సుఖముగ ముండును. తానుగాని యితరులుగాని యిచ్చిన బ్రాహ్మణ వృత్తు లపహరించిన వాడు సూర్యచంద్రు లున్నంతకాలము కాలసూత్ర నరకమున నుండును. తవి కొడుకులు మనుమలును భూమి ధనములు లేనివారై పుత్రహీనులై పేదవారై ఘోర రౌరవ నరక మను భవింతురు . ఆవులు మేయు చోటదున్ని సేద్యము చేయువాడు నూఱు దివ్యవత్సరములు కుంభీపాకనరమున నుండును.

గోష్ఠం తడాగం నిష్కృష్య మార్గే సస్యం దదాతి యః l స తిష్ఠత్య సిపత్రే చ యావ దింద్రా శ్చుతుర్ధశ. 11

పంచ పిండా ననుద్ధృత్య పరకూపే చ స్నాతి యః l ప్రా ప్నోతినరకం చైవ స్నానం నిష్పల మేవ చ. 12

కామీ భూమౌ చ రహసి వీర్యత్యాగం కరోతి యః l భూమిరేణు ప్రమాణం చ వర్షం తిష్ఠతి రౌరవే. 13

అంబువాచ్యాం భూకరణం యః కరోతి చ మానవః l స యాతి కృమిదంశం చ స్థితి స్తత్ర చతుర్యుగమ్‌.14

పరకీయే లుప్త కూపే కూ పం మూఢః కరోతి యః l పుష్కరిణ్యాం చ లుప్తాయాం పుష్కరిణీం దదాతి యః. 15

సర్వం ఫలం పరసై#్యవ తప్తకుండం ప్రజేచ్చ సః l తత్ర తిష్ఠతి సంతప్తో యావదింద్రా శ్చతుర్దశ. 16

పరకీ యే తడాగే చ పంకముద్ధృ త్య చోన్మృ జేత్‌ l రేణు ప్రమాణ వర్షంచ బ్రహ్మలోకే వసేన్నరః 17

పిండం పిత్రే భూమి భర్తుర్న ప్రదాయ చ మానవః l శ్రాద్ధం కరోతి యో మూఢో నరకం యాతి నిశ్చితమ్‌.

భూమౌ దీపం యో7ర్పయతి సచాంధః సప్తజన్నసు l భూమౌ శంఖం తు సంస్థాప్య కుష్ఠం జన్నాంతరే లభేత్‌.

ముక్తాం మాణిక్య హీరౌ చ సువర్ణం చ మణిం తథా | పంచ సంస్థాపయే ద్బుమౌ స చాంధః సప్త జన్నసు.

ఆవుల దొడ్డిని చెఱవును దున్ని పంటలు పండించుకొనువాడు పదునల్గు రింద్రుల కాలమంత కాలమసిపత్ర నరకమున గూలును. ఇతరుల బావిలో స్నాన మాడునపు డైదు మట్టిపెడ్డలు తీయని వాడు నరక మునుభవించును. వాని స్నానమును వ్యర్థ మగును. కామోద్రేకమున రహస్యముగ నేలపై వీర్యము పడవేయువాడు అచటి నేలలోని రేణువులన్నిసంవత్స రములు రౌరవ నరకమున దుఃఖము లొందును. అంబువాచియందు నేలను త్రవ్వువాడు నాల్గుయుగములందాక కృమిదంశనరక మందు భాధలు పడును. ఇతరుల బావిలో నీరు లేనపుడు దానిలోని పూడిక తీయించిన ఫలితమును దానిలో నీరులేనిచో దానిలో మట్టి తీయించిన ఫలమును ఈఫలితములు రెండును బావి సొంతము వానికి చెందును. సొంతదారుని అనువరుతిలేక మట్టి తీయించిన వాడు తప్తకుండ మున పదునల్గు రింద్రుల కాల మన్ని యేండ్లు బాధలుపడును. ఇతరుల బావిలోగాని చెఱువులోగాని మట్టి తీసికొని దానిని పూసికొని స్నానమాడినవాడు అ మట్టి రేణువులన్ని యేండ్లు బ్రహ్మలోకమునందు నివసించును. ఇతరుల నేలయందు నేలయజమాని కేదే నీయక అచట తన పితరులకు పిండ ప్రదానముతో శ్రాద్ధము చేయు మూఢుడు తప్పక నరకమును గూలును. భుమి పై దీప ముంచువాడు వేరొక జన్మలో కుష్ఠరోగి గాగలడు. ముత్యములు మాణిక్యము వజ్రము బంగారము మణి యను నైదింటిని నేలపై నుంచినవాడేడు జన్మలవఱకు గ్రుడ్డివా డగును.

శివలింగం శివామర్చాం యశ్చార్పయతి భూతలే l శతమన్వంతరం యావత్కృ మిభక్ష స్స తిష్ఠతి. 21

శంఖం యంత్రం శిలతోయం పుష్పం చ తులసీదళమ్‌ l యశ్చార్పయతి భూమౌచ స తిష్ఠేన్నరకేధ్రువమ్‌. 22

జపమాలం పుష్పమాలాం కర్పూరం రోచనం తథా l యో మూఢ శ్చార్పయే ద్బూమౌ సయాతి నరకం ధ్రవమ్‌. 23

భూమౌ చందన కాష్ఠం చ రుద్రాక్షం కుశమూలకం l సంస్థాప్య భూమౌ నరకే వసే న్మన్వంతరావథి.24

పుస్తకం యజ్ఞసూత్రం చ భూమౌ సంస్థావయేన్నరః l న భ##వే ద్వి ప్రయోనౌ చ తస్య జన్మాంతరేచ జనిః. 25

బ్రహ్మహత్యా సమం పాప మిహవై లభ##తే ధ్రమమ్‌ l గ్రంథియుక్తం యజ్ఞ సూత్రం పుజ్యం చ సర్వ వర్ణకైః. 26

యజ్ఞం కృత్వా తు యో భూమిం కీరేణ నహి సంచతి l స యాతి తప్తభూమిం చ సంతప్తః సప్త జన్న సు. 27

భుకంపే గ్రహేణ యో పి కరోతి ఖననం భువః l జన్మాంతరే మహాపారో హ్యంగహీనో భ##వేద్ద్రువమ్‌. 28

భవనం యత్ర సర్వేషాం భూమిస్తేన ప్రకీర్తితా l కాశ్యపీ కశ్యపస్యేయ మచలా స్థిరరూపతః. 29

విశ్వంభరా ధారణా చ్చానం తానంచ స్వరూపతః l పృథివీవృథుకన్యా త్వాద్విస్తృతత్వా న్మహామునే. 30

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే దశమో7ధ్యాయః.

నే లపై శివలింగమును శివప్రతిమ నుంచువాడు నూఱు మన్వంతరుములందాక కృమిభక్షమున బాధింపబడుచుండును. శంఖమును యంత్రమును శివతీర్థమును పుష్పమును తులసీదళమును భూమిమీద నుంచువాడు తప్పక నరకమున గూలును. జపమాలము పూలమాలను కర్పూరమును గోరోచనమును భూమిపై నుంచు మూఢుడు నరకమందు బాధలు పడును. భూమి మీద మంచిగంధము కట్టెలు రుద్రాక్షలు దర్బలు నుంచువాడు మన్వంతర మంతకాలము నరకమందుండును. పుస్తకమును యజ్ఞోవవీతమును నేలపై నుంచువాడు మఱుజన్మలో బ్రాహ్మణ వంశమునజన్మింపడు. అతడు తప్పక బ్రహ్మహత్యాపాతక మనుభవించును. బ్రహ్మముడిగల జందెము నెల్ల వర్ణముల వారును పూజించవలయును. యజ్ఞముచేసి యూచోటు పాలతో తడుపనివాడు సంతాపము జెందుచు నేడు జన్నలు తప్తభూమిలో బాధలు పడును. భూకంపము గ్రహణము గల్గు సమయ మన భూమిని త్రవ్వువాడు మఱుజన్మలో తప్పక పాపి వికలాంగుడు నగును. అందఱును దీనిపైనుందురు కావున నేలను భూమి యందురు. కశ్యపుని కూతు రగుట కాశ్యపి యనియును కదలకుండుటవలన ''అచల'' యనియు నందురు. అన్నియు భరించుటవలన విశ్వం భరయనియు ననంత విస్తాముగలదగుటవలన ''అనంత'' యనియును పృథు చక్రవర్తి కూతురుగుటవలన సువిస్తృతయగుట చేతను పృధివియనియును భూమికి పేర్లు గలవు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి మవన సఖంధమున దశమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters