Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వాదశో7ధ్యాయఃయ

శ్రీనారాయణః: ధ్యానం చ కణ్వశాఖోక్తం సర్వం పాపప్రణాశనమ్‌ | శ్వేతపంకజ వర్ణాభాం గంగాం పాపప్రణాశినీమ్‌. 1

సృష్ణ విగ్రహ సంభూతాం కృశ్ణతుల్యాం పరాం సతీమ్‌ | వహ్ని శుద్ధాంశుకాధానాం రత్న భూషణ భూషితామ్‌. 2

శరత్పూర్ణేందుశతకమృష్ణశోబా కరాం పరామ్‌ | ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం శశ్వత్సుస్థిర¸°వనామ్‌. 3

నారాయణ ప్రియాం శాంతాం తత్సౌభాగ్య సమన్వితామ్‌ | బిభ్రతీం కభరీభారం మాలతీమాల్య సంయుతమ్‌. 4

సిందూరబిందు లలితం సార్ధం చందనబిందుభిః | కస్తూరి పత్రకం గండే నానాచిత్ర సమన్వితమ్‌. 5

పక్వబింబ వినింద్యాచ్ఛ చార్వోష్ఠపుట ముత్తమమ్‌ | ముక్తా పంక్తి ప్రభాముష్ట దంతపంక్తి మనోరమమ్‌. 6

సుచారు వక్త్రనయనం సకాటాక్షం మనోహరమ్‌ | కఠినం శ్రీఫలాకారం స్తనయుగ్మం చ బిభ్రతీమ్‌. 7

బృహచ్చ్రోణిం సుకఠినాం రంభా స్తంభవినిందితామ్‌ | స్థలపద్మ ప్రభాముష్ట పదపద్మ యుగం వరమ్‌. 8

పత్నపాదుక సంయుక్తం కుంకుమాక్తం స యా వకమ్‌ | దేవేంద్ర మౌళి మందార మకరందకణారుణమ్‌. 9

సురసిద్ద మునీంద్రై శ్చ దత్తార్ఘ్య సంయుతం సదా | తపస్వి మౌళినికర భ్రమరశ్రేణ సంయుతమ్‌. 10

ముక్తి ప్రదం ముముక్షూణాం కామినా సర్వభోగదమ్‌ | వరాం వరేణ్యాం వరదాం భక్తా నుగ్రహకారిణీమ్‌. 11

శ్రీవిష్ణోః పదదాత్రీం చ భ##జేవిష్ణుపదీం సతీమ్‌ | ఇత్యనేనైవ ధ్యానేన ధ్యాత్వా త్రిపథగాం శుభామ్‌. 12

దత్త్వా సంపూజయే ద్బ్రహ్మన్ను పచారాణి షోడశ | ఆసనం పాద్య మర్ఘ్యంచ స్నానీయం చానులే పనమ్‌. 13

పండ్రెండవ అధ్యాయము

గంగాధ్యానము

శ్రీనారాయణు డిట్లనెను: నారదా! కణ్వశాఖ యందలి గంగాధ్యానము-సకల పాపహారము. గంగ తెల్లని కమలములవంటి కాంతి గలది; పాపహారిణి. శ్రీకృష్ణుని శరీరమునుండి పుట్టినది; కృష్ణుని బోలి శక్తి గలది:పరమసాధ్వి; అగ్ని పవిత్రమైన వస్త్రములు దాల్చినది; రత్నవ భూషణభూషితురాలు. శరత్కాలమందలి నూఱు చంద్రులను మించిన పరమశోభలు వెలార్చునది; లేజిగురు నవ్వులు పెల్లుబుకు ప్రసన్నముఖము గలది. నవయువతి; నారయణ ప్రియ; శాంత; ప్రియ సౌభాగ్యముతో నొప్పునది; మాలతీ మాలికలు విరిసిన జడకొప్పుతొ నొప్పునది. ఆమె నిగ్గుటద్దంపుచెక్కిళులపై చందన తిలక బిందువులు చిత్రములుగ నున్న కస్తూరీ పత్రముల నలరారునది. ఆమె పెదవులుపక్వ బింబఫలములు; మేలైన పలువరుసలు ముత్తియముల కాంతులను తిరస్కరించునవి. ఆమె అందములు గ్రుమ్మరించు ముఖకమలము కటాక్ష వీక్షణములు శ్రీఫలము వలె గట్టి గుండ్రని స్తనములు గలది. ఆమె రంభాస్తంభములకన్న మిన్నయైన గట్లి నున్నని తొడలుగల్గి స్థల పద్మములను మించిన పదపద్మములు గలది. కుంకుమలత్తుకలతో నొప్పారు నామె పదములు దేవేంద్రుని తలమీది పారిజాత మకరందమున మ ఱింత యెఱుపెక్కి చెన్ను మీరుచున్నవి. ఆమె సుర సిద్ధ మునీంద్రు లొసగు నర్ఘ్యములతో నొప్పారు పదములపైని తాపసుల తలలు తుమ్మెదల వరుసలవలె నుండ విలసిల్లునది. గంగ ముముక్షులకు ముక్తిని కాముకులకు భోగములను భకుల్త కనుగ్రహము నొసంగునట్టి పదపద్మములతో వరేణ్య యైనది. శ్రీవిష్ణుపదము నొసంగగలది సతీమతల్లి విష్ణుపది త్రిపథగ శుభాంగియగు గంగామతల్లి నిట్టి ధ్యానమున ధ్యానించవలయును. బ్రాహ్మణోత్తమా! తర్వాత షోదశోపచారములతో గంగను పూజించవలయును. ఆసనము పాద్యము అర్ఘ్యము స్నానమున కనులేపనము-

ధూపణ దీపం చ నై వేద్యం తాంబూలశీతలం జలం | వసనం భూషణం మాల్యం గంధమాచమనీయకమ్‌. 14

మనోహరం సుతల్పం చ దేయాన్యేతాని షోడశ | దత్వా భక్త్యా చ ప్రణమే త్సం స్తూయ సంపుటాం జలిః. 15

సంపూజ్యైవం ప్రకారేణ సో7శ్వమే దఫలం లబేత్‌ | నారద ఉవాచః శ్రోతు మిచ్ఛామి దేవేశ లక్ష్మీకాంత జగత్పతే. 16

విష్ణో ర్విష్ణుపదీస్తోత్రం పారఘ్నం పుణ్యకారకమ్‌ | శ్రీనారాయణ ఉవాచ: శృణునారద వక్ష్యామి పాపరఘ్నం పుణ్యకారకమ్‌. 17

శివ సంగీత సంముగ్ధ శ్రీకృష్ణాం గసము ద్బవామ్‌ | రాధాంగ ద్రవసం యుక్తాం తాం గంగాం ప్రణమామ్యహమ్‌. 18

యజ్జన్మ సృష్టే రాదౌ చ గోలోకే రాసమండలే | సన్నిధానే శంశరస్య తాం గంగాం ప్రణమామ్యహమ్‌. 19

గోపై ర్గో పీభీ రాకీ ర్ణే శుభే రాధా మహోత్సవే | కార్తికీ పూర్ణి మాయాం చ తాం గంగాం ప్రణ మామ్యహమ్‌. 20

కోటీ యోజన విస్తీర్ణాం దైర్ఘ్యే లక్షగుణాతతః | సమావృతా యాగోలోకే తాంగంగా ప్రణమామ్యహమ్‌. 21

షష్టి లక్షయోజనా యా తతో దైర్ఘ్యే చతుర్గుణా | సమావృతాయా వైకుంఠే తాంగంగాం ప్రణమామ్యహ్‌. 22

త్రింశలక్షయోజనాయా దైర్ఘ్యే పంచగుణాతతః | ఆవృతా బ్రహ్మలోకే యా తాంగంగాం ఫ్రణమామ్యహమ్‌. 23

త్రింశలక్షయోజనా యాదైర్ఘ్యే చతుర్గుణాతతః | ఆవృతా శివలోకే యా తాంగంగాం ప్రణమామ్యహమ్‌. 24

లక్షయోజన విష్తీర్ణాం దైర్ఘ్యే సప్తగుణాతతః | ఆవృతా ధ్రవలోకేయా తాంగంగాం ప్రణమామ్యహమ్‌. 25

లక్షయోజన విస్తీర్ణా దైర్ఘ్యే పంచగుణా తతః | అవృతా చంద్రలోకో యా తాం గంగాం ప్రణమామ్యహమ్‌. 26

ధూప దీప నైవేద్య తాంబూలములు మంచినీరు వస్త్రము భూషణములు పూలదండలు గంధము ఆచమించుటకు నీరు అందమైన పూలసెజ్జ యను వానినర్పించి పూజించి గంగను పరభక్తితో సంస్తుతించి నమస్కరించ వలయును. ఈ విధముగ గంగను పూజించిన వాని కశ్వమేధ ఫలము లభించును. నారదు డిట్లనెను: దేవేశా! లక్ష్మీకాంత!జగత్పతీ! శ్రీవిష్ణుని పాదములందు బుట్టి పాపములు పాపి పుణ్యము గల్గించు గంగాస్తోత్రము విన గోరిక గల్గుచున్నది. శ్రీనారాయణుడిట్టు లనియెను: నారదా! వినుము. పాపహరము పుణ్యకారకమునగు గంగాస్తోత్ర మాలకించుము. శివుని సంగీతము నకుకృష్ణుడు ముగ్దు డయ్యెను. కృష్ణుని యవయవములనుండి పుట్టిన రాధ మేని చెమట యే ద్రవరూపమైన గంగకు నమస్క రింతును. కార్తికపూర్ణిమనాడు గోపగోపీ జనములతో గూడిన శ్రీరాధాకృష్ణుల మధురరాస మహోత్సవమునందు బాల్గొనిన గంగామతల్లికి నమస్కరింతును. కోటి యోజనముల వెదల్పును దానికి లక్ష రెట్లు పొడవును గల్గి గోలోకము నందు ప్రవహించునట్టి గంగామతల్లికి నమస్కరింతును. అరువది లక్షల యోజనముల వెడల్పును దానికి నాలుగు రెట్లు పొడవును గల్గివైకుంఠఝామమున ప్రవహించు గంగామతల్లికి నమస్కరింతును. ముప్పది లక్షల యోజనముల వెడల్పును దాని కైదు రెట్లు పొడవును గల్గి బ్రహ్మలోకమున ప్రవహించునట్టి గంగామతల్లికి నమస్కరింతును. ముప్పది లక్షల యోజనముల వెడల్పును దానికి మూడు రెట్లు పొడవును గల్గి శివలోకమున ప్రవహించునట్టి గంగామతల్లికి నమస్కరింతును. లక్ష యోజనముల వెడల్పును దాని కేడు రెట్లు పొడవును గల్గి ధ్రువలోకమందు ప్రవహించు గంగామతల్లికి నమస్కరింతును. లక్ష యోజనముల వెడల్పును దాని కైదు రెట్లు పొడవును గల్గి చంద్రలోకమున ప్రవహించునట్టి గంగామతల్లికి నమస్కరింతును.

షష్టి సహస్రయోజనా యా దైర్ఘ్యే దశగుణా తతః | ఆవృతా సూర్యలోకే యా తాం గంగాం ప్రణమామ్యహమ్‌. 27

లక్షయోజన విస్తీరా దైర్ఘ్యే పంచ గుణాతతః | ఆవృతా యాతపోలోకే తాంగంగాం ప్రణమామ్యహమ్‌. 28

సహస్రయోజనాయామా దైర్ఘ్యే పంచగుణా తతః | అవృతా జనలోకే యా తాం గంగాం ప్రణమామ్యహమ్‌. 29

దశలక్షయోజనాయామా దైర్ఘ్యే పంచగుణా తతః | అవృతా యా మహర్లోకే తాంగంగాం ప్రణమామ్యహమ్‌. 30

సహస్రయోజనా దైర్ఘ్యే శతగుణా తతః | అవృతా యా చకైలాసే తాంగంగాం ప్రణమామ్యహమ్‌. 31

శతయోజన విస్తిర్ణా దైర్ఘ్యే దశగుణ తతః | మందాకీనీ యేంద్రలోకే తాంగంగాం ప్రణమామ్యహమ్‌. 32

పాతాళే భోగవతీచైవ విస్తీర్ణా దశయోజనా | తతో దశగుణా దైర్ఘ్యే తాంగంగాం ప్రణమామ్యహమ్‌. 33

క్రోశైక మాత్ర విస్తీర్ణా తతః కీణాచ కుత్ర చిత్‌ | క్షితౌ చాలక నందాయా తాం గంగాం ప్రణమామ్యహమ్‌. 34

సత్యేయాక్షీర వర్ణా చ త్రేతాయా మింద్ర సన్నిభా | ద్వాపరే చంజనాభా యా తాం గంగాం ప్రణమామ్యహమ్‌. 35

జలప్రభా కలౌయా చ నా7న్యత్ర పృథివీ తలే | స్వర్గే చ నిత్యం క్షీరాభా తాం గంగాం ప్రణమామ్యహమ్‌. 36

యత్తోయకణీకాస్పర్శే పాపినాంజ్ఞాన సంభవః | బ్రహ్మహత్యాదికం పాపం కోటి జన్మార్జితం దహేత్‌. 37

ఇత్యేవం కథితా బ్రహ్మన్గంగా పద్యైకవింశతిః | స్తోత్రరూపం చ పరమం పాపఘ్నం పుణ్య జీవనమ్‌. 38

నిత్యం యో హి పఠేద్బక్త్యా సంపూజ్య చ సురేశ్వరీమ్‌ | సో7శ్వమేధ ఫలం నిత్యం లభ##తే నాత్ర సంశయ. 39

అరువది వెల యోజనముల వెడల్పును దానికి పది రెట్లు పొడవును గల్గి సుర్యలోకమున ప్రకాశించు గంగా మతల్లికినమస్కరింతును. లక్ష యోజనముల వెడల్పును దాకికైదు రెట్లు పొడవును గల్గి తపోలోకము తేజరిల్లు గంగామతల్లికి నమస్కరింతును. వేయి యోజనముల వెడల్పును దానికి పది రెట్లు పొడవును గల్గి జనలోకమున వ్యాపించిన గంగా మతల్లికి నమస్కరింతును. పదిలక్షల యోజనముల వెడల్పును దానికి కైదు రెట్లు పొడవును గల్గి మహర్లోకమందు విలసిల్లు గంగామతల్లికి నమస్కరింతును. వేయి యోజనముల వెడల్పును దాని నూఱురెట్లు పొడవును గల్గికైలాసమందు ప్రవహించు గంగామతల్లికి నమస్కరింతును. నూఱు యోజనముల వెడల్పును దానికి పది రెట్లు పొడవు గల్గి యింద్రలోకమందు ప్రవహించు గంగా మతల్లికి నమస్కరింతును. పదియోజనముల వెడల్పు దానికి పది రెట్లు పొడవును గల్గి పాతాళమున భోగవతి యనుపేర ప్రవహించు గంగామతల్లికి నమస్కరింతును. క్రొసు వెడల్పు నొక్కొక్కచొ నంతకు తక్కువయును గల్గి అలకనంద యను పేర భూమి పై ప్రవహించు గంగామతల్లికి నమస్కరింతును. సత్యయుగమున పాలవన్నెయును త్రేతాయుగమునందు చంద్రుని తెల్లని వర్ణమును ద్వాపరమందు చందనవర్ణమును గల్గి శోభిల్లు నట్టి గంగామతల్లికి నమస్కరింతును. ఈ కలియుగమున భూమిపై జల రూపమున స్వర్గమందు పాలరూపమున విరాజిల్లు గంగా మతల్లికి నమస్కరింతును. నారదా! గంగా జల బిందువును తాకినంతనే తెలిసి చేసిన బ్రహ్మహత్యాది కోటి జన్మముల పాపమంతయును నశించును. విప్రా! ఇటుల నీకు పరమ గంగస్తోత్ర మిరువదియొక్క శ్లోకములలో వెల్లడించితిని. ఇది పాపహరము పూజనీయము. ఈ గంగా స్తోత్రమును నిత్యము చదివి గంగను పూజించినవాడు తప్పక అశ్వమేధము చేసినంత ఫలితము బడయును.

అపుత్రోలభ##తే పుత్రం భార్యాహీనో లభేత్‌ స్త్రియమ్‌ | రోగాత్ప్రముచ్యతే రోగీ బంధాన్ముక్తోభ##వేద్ధ్రువమ్‌. 40

అస్పష్టకీర్తిః సుయశామూర్ఖో భవతి పండితః | యః పఠేత్ప్రాతరుత్ధాయ గంగాస్తోత్రమిదం శుభమ్‌. 41

శుభం భ##వేచ్చ దుఃస్వప్నే గంగాస్నాన ఫలం లభేత్‌ | శ్రీనారాయణః: స్తోత్రేనేణా న గంగాం చ స్తుత్వాచైవ భగీరథ :. 42

జగామతాం గృహీత్వా చయత్ర నష్టాశ్చ సాగరాః | వైకుంఠం తే యయుస్తూర్ణం గంగాయాః స్పర్శవాయునా. 43

భగీరథేన సానీతా తేన భాగీరథీ స్మృతా | ఇత్యేవం కథితం సర్వం గంగోపాఖ్యాన ముత్తమమ్‌. 44

పుణ్యదం మోక్షదం సారం కిం భూయః శ్రోతుమిచ్చసి | నారదః కధం గంగా త్రిపథగా జాతా భువన పావనీ. 45

కుత్ర వా కేన విధినా తత్సర్వం వదమేప్రభో | తత్రస్థాశ్చ జనా యే యే తే చ కిం చక్రు రుత్తమమ్‌. 46

ఏతత్సర్వం తు విస్తీర్ణం కృత్వా వక్తు మిహార్హసి | నారాయణః: కార్కిక్యాం పూర్ణిమాయంతు రాధాయాః సుమహోత్సవః. 47

కృష్ణః సంపూజ్య తాం రాధా మువాస రాసమండలే | కృష్ణేన పూజితాం సాతు సంపూజ్య హృష్ఠమానసాః. 48

ఊషు ర్బ్రహ్మాదయః సర్వే ఋశయః శౌనకాదయః | ఏతస్మిన్నంతరే కృష్ణ సంగీతా చ సరస్వతీ. 49

జగౌ సుందరతాలేన వీణయా చ మనోహరమ్‌ | తుష్టో బ్రహ్మా దదౌ తసై#్య రత్నేంద్రసారహారకమ్‌. 50

శివో మణీంద్రసారం తు సర్వబ్రహ్మాండ దుర్లభమ్‌ | కృష్ణః కౌస్తుభరత్నం చ సర్యరత్నాత్పరం వరమ్‌. 51

అమూల్య రత్న నిర్మాణం హారసారం చ రాధికా | నారాయణ శ్చ భగవాన్ద దౌ మాలాం మనోహరామ్‌. 52

దీనివలన పుత్రులులేనివాడు పుత్రువంతు డగును. భార్యలేని వానికి భార్య లభించును. రోగి రోగముక్తుడగును. బధ్దుడు బంధనముక్తు డగును. వేకువజామున లేచి గంగాస్తోత్రము చదువువాడు కీర్తిలేని వాడైనను కీర్తిమంతు డగును. మూఢుడు పండితు డగును. చెడుకలలు వచ్చినను శుభ##మే కల్గును. గంగాస్నాన ఫలము గల్గును. శ్రీనారాయణు డిట్లనెను: భగీరథుడీ విధముగ నీ స్తోత్రముతో గంగను స్తుతించెను. అపుడు గంగ భగీరథుని వెంట బయలుదేరగ భగీరథుడు సాగరులు నశించినచోటి కరిగెను. గంగ మీది యమృతవాయువులు తాకగనే వారెల్లరును వైకుంఠ మేగిరి. భగీరథునిచే కొనిరాబడిన దగుటవలన భాగీరథియన ప్రసిద్ధి గాంచెను. ఇట్లు నీకు పవిత్రమైన గంగాచరిత్ర చెప్పితిని. ఇది పుణ్యమును మోక్షమును గల్గించునది. ఇంకో మి వినదలతువో తెలుపుము. నారదు డిట్లనెను: గంగ యెట్లు త్రిపథగ భువనపావని యయ్యెను? ప్రభూ! గంగనెవరెవ రేయే చోట్లకు గొనిపోయిరి. ఆమెతో నెట్లు వ్యవహరించిరి. అంతయును నాకు తెలుపుము. ఇదంతయును వివరముగ తెలుపుటకు నీవు మాత్రమే తగినవాడవు.నారాయణు డిట్లనెను. కార్తిక పూర్ణిమనాడు శ్రీరాధా మహోత్సవము జరుగును. అపుడు కృష్ణుడు రాసమండలమం దుండి రాధను పూజించెను. కృష్ణునిచేత పూజింపబడి రాధ ప్రసన్నురాలయ్యెను. ఆ చోట బ్రహ్మాది దేవతలును శౌనకాది మహర్షులు నుండిరి. ఆదే సమయములో కృష్ణుని సంగితాధిష్ఠానదేవియగు సరస్వతియు నట నుండెను. సరస్వతి సుందరతాళములతో వీణియతో తియ్యతియ్యగ గానము చేసెను. దానికి సంతోషించి బ్రహ్మ ఆమెకు రత్నహార మొంసగెను. శివుడు బ్రహ్మాండమం దెచ్చటను లేని దివ్యమణిహార మిచ్చెను. కృష్ణుడు సకల రత్నములకన్న శ్రేష్ఠమైన కౌస్తుభరత్న మొసంగెను. రాధికాదేవి యామెకు విలువైన రతనాలు పోదిగిన హార మొసగెను. నారాయణ భగవానుడు మనోహరమైన మాలిక నొసగెను.

అమూల్య రత్న నిర్మాణం లక్ష్మీః కనక కుండలమ్‌ | విష్ణుమాయా భగవతీ మూలప్రకృతి రీశ్వరీ. 53

దూర్గా నారాయణీశానా బ్రహ్మ భక్తిం సు దుర్లభామ్‌ | ధర్మబుద్ధిం చ ధర్మశ్చ విపులం యశశ్చవిపులం భ##వే. 54

వహ్వి శుద్ధాం శుఖం వహ్నిర్వాయు శ్చ మణినూపురాన్‌ | ఏతస్మి న్నంతరే శంభు ర్బ్రహ్మాణా ప్రేరితో ముహుః. 55

జగౌ శ్రీకృష్ణసంగీతం రసోల్లాససమన్వితమ్‌ మూర్ఛాం ప్రాపుః సురాః సర్వే చిత్ర పుత్తలికా యథా. 56

కష్టేన చేతనాం ప్రాప్య దదృశూ రాసమండలే | స్థలం సర్వ జలాకీర్ణం రాధాకృష్ణ వహీనకమ్‌. 57

అత్యుచ్చై రురుదుః సర్వే గోపా గోప్యః సురా ద్విజాః | ధ్యానేన బ్రహ్మాబుబుధే సర్వం తీర్ధ మభీప్సితమ్‌. 58

గత శ్చ రాధయా సార్ధం శ్రీకృష్ణో ద్రవతామితి | తతో బ్రహ్మదయః సర్వే తుష్టువుః పరమేశ్వరాత్‌. 59

స్వమూర్తిం దర్శయ విభో వాంఛితం వరమేవనః | ఏతస్మి న్నంతరే తత్ర వాగ్బభూ వాశరీరిణీ. 60

తామేవ శుశ్రువుః సర్వే సువ్యక్తాం మధురాన్వితాం | సర్వా త్మా7హ మియం శక్తి ర్బక్తాను గ్రహవిగ్రహా. 61

మమా ప్యస్యా శ్చ దేహేన కర్తవ్యం చ కిమావయోః | మనవో మానవాః సర్వే మునయశ్చైవ వైశ్ణవాః. 62

మన్మంత్రపూతా మాం ద్రష్టు మాగమిష్యంతి మత్ప దమ్‌ | మూర్తిం ద్రష్టుం చ సువ్యక్తాంయదీచ్ఛత సురేశ్వరాః. 63

కరోతు శంభు స్తత్రైవం మదీయం వాక్యపాలనమ్‌ | స్వయం విధాత స్త్వం బ్రహ్మన్నాజ్ఞాం కురు జగద్గురుమ్‌. 64

కర్తుం శాస్త్రవిశేషం చ వేదాంగం సమనోహరమ్‌ | ఆపూర్య మంత్రనికరైః సర్వాభీష్టఫలప్రదైః. 65

లక్ష్మీ దేవి వెలలేని రతనాల బంగారు కుండలము లిచ్చెను. తర్వాత విష్ణుమాయ భగవతి మూలప్రకృతి ఈశ్వరి. దుర్గ నారాయణి ఈశాని యగు దేవి దుర్లభ##మైన బ్రహ్మభక్తి నొసంగెను. అగ్ని పవిత్రమైన వస్త్రము లగ్నిదేవు డిచ్చెను. వాయువు మణినూపురము లొసగెను. రాసరసోల్లాసముతో గూడిన శ్రీకృష్ణుని మధుర దివ్యగానమును సరస్వతి గానము చేసెను. అది విని దేవత లెల్లరును చిత్తరువునందలి చిత్రములవలె మూర్ఛ మునింగిరి. ఎంతో శ్రమతో తుదకు తెలివొంది దివ్య రాసమండలమును సందర్శించిరి. అపు డచట రాధాకృష్ణులు వారికి కనిపించలేదు. అంతటను నీరు నిండియుండెను. అచటి గోపీగోపకులును సురలును ద్విజులు నెల్లరు గోలగ నేడ్చిరి. కాని బ్రహ్మ మాత్రము ధ్యానముచేత నంతయు జలమగు టకుకారణము తెలిసికొనెను. శ్రీకృష్ణుడు రాధతో గూడి ద్రవరూపము దాల్చెనని బ్రహ్మ మొదలగు వారెల్లరును పరమేశుడగు కృష్ణు నిట్లు సన్నుతించిరి. విభూ! నీ నిజరూపము చూపించుము. మాయాభీష్ట వర మిమ్మనిరి. అదే సమయమున నచటన శరీరవాణి గగనతలమున వినిపించెను. మధురము సుస్పష్ట మునైన గగనవాణి నెల్లరును వినిరి. ''నేను సర్వాత్ముడను. రాధ శక్తి-భక్తానుగ్రహరూపిణి. ఈ నీరు రాధాకృష్ణుల జలమయరూపము. మా యిర్వురి దేహములవలన మీ కేమి లాభము? అందఱు మనుజులు మునులు మనువులు వైష్ణవులును నా భక్తులు కావలయును. ఎల్లరును నా మంత్రము జపించి పవిత్రులై నన్ను దర్శించుటకు నా గోలోకము చేరవలయును. శివుడు నా మాటను తలదాల్చవలయును. బ్రహ్మ స్వయముగశివున కాజ్ఞ యొసంగవలయును. వేదాంగము సుమనోహరము సకల కామప్రదము నైన శాస్త్ర విశేషమున మంత్రములతో శివుడు నిర్మించవలయును.

స్తోత్రై శ్చ చ నికరై ర్ధ్యానై ర్యూతం పూజావిధి క్రమైః | మన్మం త్ర కవచస్తో త్రణ కృత్యా యత్నేన గోపనమ్‌. 66

భవంతి విముఖా యేన జనా మాం తత్కరిష్యతి | సహస్రేషు శ##తే ష్వేకో మన్మంతోపాసకో భ##వేత్‌. 67

జనా మన్మంత్రపూతా శ్చ గమిష్యంతి చ మత్పదమ్‌ | అన్యధా న భవిష్యంతి సర్వే హోలోకవాసినః. 68

నిష్పలం భవితా సర్వం బ్రహ్మాండం చైవ బ్రహ్మణః | జనాః పంచ ప్రకారా శ్చ యుక్తాః స్రష్టుం భ##వే భ##వే. 69

పృథివీవాసినః కేచి త్కేచి త్స్వ ర్గనివాసినః | ఇదం కర్తుం మహాదేవః కరోతి దేవసంసది. 70

ప్రతిజ్ఞాం సుదృఢాం సద్య స్తతో మూర్తిం చ ద్రక్ష్యతి | ఇత్యేవ ముక్త్వా గగనే వరరామ సనాతనః. 71

తచ్ఛ్రుత్వా జగతాం ధాతా త మువాచ శివంముదా | బ్రహ్మణో వచనం శ్రుత్వా జ్ఞానేశో జ్ఞానినాం వరః. 72

గంగాతోయం కరే కృత్వా స్వీకారం చ చకార సః | సంయుక్తం విష్ణు మాయాయా మంత్రౌఘైః శాస్త్ర ముత్తమమ్‌. 73

వేదసారం కరిష్యామి ప్రతిజ్ఞా పాలనాయ చ | గంగతోయ మువస్పృశ్య మిథ్యాయదివదే జ్జనః. 74

స యాతి కాలసూత్రం చ యావద్వై బ్రహ్మణో వయః | ఇత్యుక్తే శంకరే బ్రహ్మ న్గోలోకే సురసంసది. 75

ఆవిర్బభూవ శ్రీకృష్ణో రాధయా సహిత స్తతః | తం సుదృష్ట్వా చ సంహృష్టా స్తుష్టువుఃపురుషోత్తమమ్‌. 76

పరమానంద పూర్ణా శ్చ చక్రు పున రుత్సవం | కాలేన శంభు ర్బ గవా న్ముక్తి దీపం చకారసః. 77

ఇత్యే వం కథితం సర్వం సుగోప్యం చ సుదుర్లభమ్‌ | స ఏవ ద్రవరూపా సా గంగా గోలోకసంభవా. 78

రాధాకృష్ణాంగసంభూతా భుక్తి ముక్తి ఫలప్రదా | స్థానేస్థానే స్థాపితా సా కృష్ణేన చ పరాత్మనా. 79

కృష్ణస్వరూపా పరమా సర్వ బ్రహ్మాండ పూజితా.

ఇతి శ్రీదేవిభా గవతే మహాపురాణ నవమస్కంధే ద్వాదశో7ధ్యాయః.

అందు నామంత్రము స్తోత్రము ధ్యానము పూజావిధానము కవచము మున్నగునవి రచించవలయును. అవియన్నియును రహస్యముగనుండవలయును. నాస్తికులాశాస్త్రములు చూచి నాకు విముఖులగుదురు. వేలమందిలో నొకానొకడునా కృష్ణమంత్రము పాసింపగలడు. నామంత్రముచే పవిత్రులైన వారు నాపుణ్యధామమ చేరగలరు. తక్కినవారు నాగోలోకమును చేరజాలరు. ఇంకనెల్లవారును గోలోకమే చేరగల్గినచో బ్రహ్మదేవుని బ్రహ్మాండమంతయును వ్యర్ధమే యగును. కనుక ప్రతి సృష్టిలో నైదువిధములమనుజులను సృజించవలయును. వారిలో కొందరు భూలోకవాసులు కొందఱు స్వర్గవాసులు; ఈ నాశాస్త్రము నిర్మించుటకు శివుడు సమర్ఠుడు. అతడు దేవసభలో ప్రతిన బూనవలయును. అపుడు వెంచనే మీరు నా దివ్యమంగళ విగ్రహమును దర్శింపగలరు. అని పలికి సనాతనమగు గగనవాణి విరమించెను. అది విని జగముల సృష్టికర్త సంతసించి శివునితో గగన వాణి చెప్పినట్లు చేయు మనెను. బ్రహ్మవాక్కులు జ్ఞానేశుడు సర్వజ్ఞుడు నగ శివుడు వినెను. శివుడు గంగను చేత దాల్చి శాస్త్రరచన చేతునని ప్రతిజ్ఞ చేసెను. అది విష్ణుమాయా మంత్రములతో కూడిన యుత్తమ శాస్త్రము గాగలదు. నా ప్రతిజ్ఞ నెఱవేర్చుటకు వేదసారములగు మంత్రములు రచించపగలను. గంగాజలము ముట్టి ప్రతిజ్ఞతేలి యబద్ధమాడువాడు బ్రహ్మవయస్సుండునంతకాలమును కాలసూత్రనరకమునగూలును. విప్రా! ఇట్లు శంకరుడు గోలోక సభలో దేవతలమధ్య ప్రతినబూనెను. అంతట శ్రీకృష్ణుడు రాధతోగూడి యావిర్బవించెను. పురుషోత్తముని మరల దర్శించి సంతోషించి యెల్లరునుసంస్తుతించిరి. వారూ పరమానందభరితులై రాస మండల మహోత్సవము మరల జరిపిరి. తర్వాత కొద్దికాలమునకే శివుడు ముక్తిదీపమును గ్రంథము రచించెను. అదిత్వికతంత్ర శాస్త్రము. ఇట్లు నీకు రహస్యమైన దుర్లభ##మైన దంతయును దెల్పితిని. గోలోకమందు బుట్టిన యాద్రవరూపమే యీ గంగానది. కృష్ణుడే గంగరూపుదాల్చెను. గంగ రాధాకృష్ణులనుండి యుద్బవించుటవలన భుక్తి ముక్తుల నొసంగుగలదు. గంగ కృష్ణస్వరూపిణి. ఆమె కృష్ణ పరమాత్ముని చేత నాయాచోట్ల ప్రవహింప నియమింపబడెను. కృష్ణస్వరూపిణి గంగ యీ విధముగ సకల బ్రహ్మాండములందు పూజనీయురాలయ్యెను.

ఇది శ్రీదేవీభాగవత మహాపురాణమున తొమ్మిదవస్కంధమున పండ్రెండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters