Sri Devi Bagavatham-2
Chapters
అథ షోడశోధ్యాయః. శ్రీనారాయణః లక్ష్మీం తౌ చ సమారాధ్య చో గ్రేణతపసామునే | వర మిష్టం చ ప్రత్యేకం సంప్రాపతురభీప్సితమ్.
1 మహా లక్ష్మీ వరేణౖవ తౌ పృథ్వీశౌ బభూవతుః | పుణ్యవంతౌ పుత్రవంతౌ ధర్మధ్వజ కుశధ్వజౌ.
2 కుశధ్వజస్య పత్నీ చ దేవీ మాలావతీ సతీ | సా సుషావ చ కాలేన కమలాంశాం సుతాం సతీమ్.
3 సా చ భూయిష్టకాలేన జ్ఞానయుక్తా బభూవ హ | కృత్వా వేదధ్వనిం సృష్ట ముత్తస్థౌ సూతికాగృహాత్.
4 వేదధ్వనింసా చకార జాతమాత్రేణ కన్యకా | తస్మా త్తాం చ వేదవతీం ప్రవదంతి మనీషిణః.
5 జతమాత్రేణ సుస్నాతా జగామ తపసేవనమ్ | సర్వైర్నిషిద్ధా యత్నేన నారాయణ పరాయణా.
6 ఏకా మన్వంతరం చైవ పుష్కరే చ తపస్వినీ | అత్యుగ్రాం చ తపస్యాం చ లీలయా హి చకార సా.
7 తథా7పి పుష్టాన క్లిష్టా నవ¸°వన సంయుతా | శుశ్రావ సా చ సహసా సువాచ మశరీరిణీమ్. 8 జన్మాంతరే చ తే భర్తా భవిష్యతి హరిః స్వయమ్ | బ్రహ్మదిభి ర్దురారాధ్యం పతింలప్స్యసి సుందరి. 9 ఇతి శ్రుత్వా చ సా హృష్టా చకార హ పునస్తవః | అతీవనిర్జనస్థానే పర్వతే గంధమాదనే. 10 తత్రైవ సుచిరం తప్త్వా విశ్వస్య సమువాస సా | దదర్శ పురత స్తత్ర రావణం దుర్నివారణమ్. 11 దృష్ట్వా సా7తిథి భక్త్యా చ పాద్యం తసై#్య దదౌ కిల | సుస్వాదుభూతం ఫలం చ జలం చాపి సుశీతలమ్. 13 పదునారవ అధ్యాయము శక్తి ప్రాదుర్బావము శ్రీనారాయణు డిట్లనెను : ఓ మునీశా ! ధర్మధ్వజ కుశధ్వజులు తీవ్రతప మొనర్చి మహాలక్ష్మి నారాధించి కోరిన వరములు బడసిరి. వారు మమాలక్ష్మీ వరప్రసాదమున మహారాజులుగ పుణ్యవంతులుగ కీర్తి గడించిరి. కుశధ్వజుని భార్య మాలావతి. ఆమె కొంతకాలమునకు లక్ష్మ్యంశవలన నొక కూతురు గనెను. పుట్టిన బాల రమాంశవలన జన్మించుటచే నామె పుట్టినపుడే జ్ఞానముతో వేదోచ్ఛారణము చేసెను. పుట్టుచునే వేదధ్వనిచేయుటవలన పండితు లామెకు ''వేదవతి'' యను పేరిడిరి. ఆ బాలకు స్నాన మొనరించిరి. అచటివా రెంతగ వారించినను వినక యా బాల నారాయణ పరాయణయై తపమునకు వనముల కరిగెను. ఆమె పుష్కర తీర్థమున నొక మన్వంతరము వరఖు లీలగ ఘోర తపమాచరించెను. ఐన నామె కృశింపక నవ¸°వనముతో పుష్టిగల్గి శోభిల్లుచుండెను. ఒకనా డాకాశవాణి యిట్లు వచియించెను. ''నీవు మఱియొక జన్మలో బ్రహ్మాదులకునుపొంద సాధ్యముగాని శ్రీహరిని పతిగ బడయగలవు.'' అను వాణి విని యామె సంతసించి గంధమాదనగిరిపై నిర్జన ప్రదేశమున తప మొనరింప దొడంగెను. అచ్చట తప మొనర్చు నప్పు డొకనాడు లోక రావణుడగు రావణు డామెకు గనబడెను. ఆమె యతని నతిధిగ భావించి యతనికి పాద్యము అర్ఘ్యము తియ్యని పండ్లు చల్లని నీరు నొసంగెను. ఆ పాపాత్ముడు వాని నన్నిటిని గ్రహించియు నామెచెంత చేరి ''యో కల్యాణీ ! నీ వెవతవు ? ఇక్కడనేల యుంటి'' వని తిన్నగ ప్రశ్నలు వేయసాగెను. తాం దృష్ట్వా సవరా రోహాం పీనశ్రోణి పయోధరామ్ | శరత్పద్మో త్పలాస్యాం చ సస్మితాం సుదతీం సతీమ్. 14 మూర్బా మవాప కృపణః కామబాణ ప్రపీడితః | స కరేణ సమాకృష్య శృంగారం కర్తుముద్యతః. 15 సతీ చుకోప దృష్ట్వా తం స్తంభితం చ చకార హ | స జడో హస్తపాదైశ్చ కించిద్వక్తుంన చ క్షమః. 16 తుష్టావ మనసా దేవీం ప్రయ¸° పద్మలోచనామ్ | సాతుష్టాతస్యస్తవనం సుకృతం చ చకారహ. 17 సాశశాప మదర్థే త్వం వినంక్ష్యసి సబాంధవః | సృష్టా7హంచ త్వయాకామా ద్బలంచాప్యవలోకయ. 18 ఇత్యుక్త్వా సా చయోగేన దేవాత్యాగం చకార సా | గంగాయాం తాంచ సంన్యస్య స్వగృహంరావణోయ¸° 19 అహో కిమద్బుతం దృష్టం కిం కృతం వా7నయా7ధునా | ఇ సంచింత్య సంచింత్య విలలాప పునః పునః. 20 సా చకాలాంతరే సాధ్వీ బభూవ జనకాత్మజా | సీతాదేవీతి విఖ్యాతా యదర్థే రావణో హతః. 21 మహాతపస్వినీ సా చ తపసాపూర్వ జన్మతః | లేభే రామం చ భర్తారం పరిపూర్ణతం హరిమ్. 22 సంప్రాప తపసా77రాధ్యం దురారా ధ్యం జగత్పతిమ్ | సా రమా సుచిరం రేమే రామేణ సహ సుందరీ. 23 జాతిస్మరా నస్మరతి తపస శ్చ క్లమః పురా | సుఖేన తజ్జహౌ సర్వం దుఃఖం చాపి సుఖం ఫలే. 24 నానాప్రకార విభవం చకార సుచిరం సతీ | సంప్రాప్య సుకుమారం తమతీవ నవ ¸°వనా. 25 గుణినం రసికం శాంతం కాంతం దేవ మనుత్తమమ్ | స్త్రీణాం మనోజ్ఞం రుచిరం తథాలేభే యథేస్సితమ్. 26 ఆమె వరారోహ ; లావైన పిఱుదులు కుచములు గలది; శరత్కాలమందలి పద్మమువంటి ముఖము గలది ; సుదతి సతి మందహాసిని. ఆమెను గాంచి రావణుడు కామపీడితుడై మోహించెను. అత డామెను బలాత్కరించి శృంగార చేష్టలకు తలపడెను. ఆమె యతనిని కోపమున చూచి యతనిని నిశ్చేష్టితునిగ చసెను. అతని కాలుసేతులు కదలలేదు. నోట మాట రాలేదు. అపు డా పద్మాక్షిదేవిని మనసారగ నుతించగనే యామె ప్రసన్నయై యతని స్త్రోతమును సఫలముగా వర మిచ్చెను. కాని నీవు కామముతో నన్ను బల్మితో చేయిపట్టి లాగితివి. కనుక నా మూలమున నీవు నీ బందుగులు నశింతురు గాక. నా మహిమము చూడుము. అని యామె యోగబలముతో తన మేను చాలించెను.రావణు డామె శవమును గంగలో వేసి తన యింటి కేగెను. ఆహా! ఎంత యద్బుతము జరిగినది! ఈమె యెంత పనిచేసినది! అని పలుమారు లాలో చించుచు నతడు విలపించుచుండెను. కొంతకాలమునకా వేదవతియే జనకుని కూతురుగ సీతాదేవిగ ప్రసిద్ధిజెంది రావణుని చావునకు కారకురా లయ్యెను. ఈ తపస్విని పూర్వ జన్మమున ఘోరపత మొనరించెను. అ తపః ప్రభావమున నామె పరి పూర్ణతముడగు హరిని పతిగ బడసెను. జగత్పతి దురారాధ్యుడు తపముచే తెలియబడువాడు. అట్టి రామునితో సీతాదేవిపెక్కేండ్లు సుఖసంతోషము లనుభవించెను. ఆమెకు పూర్వజ్ఞాన మన్నందువలన తపము వలని శ్రమము లేకుండెను. ఆమె పరమసుఖముచేత వెనుకటి కష్టము లన్నియును మఱచెను. సీతాసాధ్వి పలు విధములైన భోగభాగ్యములు చిరకాలమను భవించెను. నవ¸°వనాంగియగు సీత సుకుమారుని రాముని పతిగ బొందెను.రాముడు గుణి రసికుడు పరమశాంతుడు కాంతుడు పురుషోత్తముడు; స్త్రీ మనోహరుడు దేవదేవోత్తముడు నగు వాని నామె పతిగ బడసి సుఖ ముండెను. పితుః సత్యపాలనార్థం సత్యంసంధో రఘూ ద్వహః | జగామ కాననం పశ్చా త్కాలేనచ బలీయసా. 27 తస్థౌ సముద్ర నికటే సీతయా లక్ష్మణన చ | దదర్శ తత్ర వహ్నిం చ విప్రరూప ధరం హరిః. 28 రామం చ దుఃఖితం దృష్ట్వా సచ దుఃఖీ బభూవహ | ఉవాచ కించి త్సత్యేష్టం సత్యం సత్యపరాయణః. 29 భగవన్ శ్రూయతాం రామకాలో7యం యదుపస్థితః | సీతాహరణ కాలో7యం తత్రైవ సముపస్థితః. 30 దైవంచ దుర్ని వార్యం చ నచ దైవాత్పరో బలీ | జగత్ప్ర సూం మయి న్యస్య ఛాయాం రక్షాంతికే7ధునా. 31 దాస్యామి సీతాం తుభ్యం చ పరీక్షా సమయే పునః | దేవైః ప్రస్థాపితో హం చన చ విప్రోహుతాశనః. 32 రామస్త ద్వ చనం శ్రుత్వా నప్రకాశ్య చ లక్ష్మణమ్ | స్వీకారం వచస శ్చ క్రే హృదయేన విదూయతా. 33 వహ్ని ర్యోగేన సీతాయా మాయాసీతాం చ కారహ | తత్తుల్యగుణ సర్వాంగాం దదౌరమాయ నారద. 34 సీతాం గృహి త్వా సమ¸° గోప్యం వక్తుం నిషిధ్య చ | లక్ష్మణోనైవ బుబుధే గోప్యమన్య స్య కాకథా. 35 ఏతస్మి న్నంతరే రామోదదర్శ కనకం మృగమ్ | సీతాతం ప్రేరయామాస తదర్థే యత్నపూర్వకమ్. 36 సంన్య స్య లక్ష్మణం రామో జానక్యారక్షణవనే | స్వయం జగామ తూర్ణంతం విన్యాధసాయకేన చ. 37 లక్ష్మణతి చ శబ్దంస కృత్వా చ మాయయామృగః | ప్రాణాం స్తత్యాజ సహసాపురో దృష్ట్వాహరింస్మరన్. 38 మృగదేహం పరిత్యజ్య దివ్యరూపం విధాయ చ | రత్ననిర్మాణ యానేన వైకుంఠం స జగామ హ. 39 పిమ్మట రాఘవుడు బలవత్తరమైన కాలప్రభావముచేత సత్యసంధుడై తన తండ్రి మాట పాటించుట కడవులకేగెను. కోదండరాముడు సీతతో లక్ష్మణునితోగూడి సాగర తీరమున నుండెను. అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపమున నొక నాడు రాముని యొద్దకు వచ్చెను. రాముడు దుఃఖితుడగుట గాంచి యగ్నియును దుఃఖించి సత్యపరాయణుడై సత్యస్వరూపు డగు రామునితో నిట్లనెను : ఓ రామ భగవానుడా ! ఆనందరామా ! వినుము. ఇపుడు సీతాపహరణము జరుగు సమయమాసన్న మైనది. దైవము దాటరానిది. దానిని మించిన బలశాలి లేడు. కనుక జగన్మాతను నాయందుంచి మాయ సీతను నీ చెంత నుంచుకొనుము. పరీక్షా సమయమున తిరిగి నీ సీతను నీకీయగలను : నేను విప్రుడను గాను. దేవతల చేత పంపబడిన యగ్ని దేవుడను. అగ్ని మాటలు విని రాముడు విషయమును లక్ష్మణునకును చెప్పక లోన బాధపడుచునో పై కొప్పుకొనెను. నారదా! అపుడగ్ని యోగబలముతో మాయ సీతను సృజించి రామున కొసంగెను. మాయా సీతకును సీతను బోలిన గుణములు అంగములు నుండెను. దీనిని రహస్యముగ నుంచుమని యగ్ని రామునితో పలికి వెళ్ళిపోయెను. ఈ రహస్యము చెంతనున్న లక్ష్మణునకును తెలియదు. ఇంకితరుల కెట్లు తెలియగలదు? అంత నొకనాడు రాముడొక బంగారు లేడిని చూచెను. దానిని తనకు తెమ్మని సీత రాముని ప్రేరించెను. రాముడు సీతా రక్షణకు లక్ష్మణు నుంచి తానేగి జింక నొక బాణముతో బడ గొట్టెను. మాయ లేడి హా! లక్ష్మణ ! యని కేక వేసి యెట్ట యెదుట రాముని గాంచి రామ స్మరణము చేయుచు ప్రాణములు వదలెను. మృగదేహము నుండి యొక దివ్య పురుషుడు లేచి విమాన మందలి రత్న సింహాసనము పై వైకుంఠ మరిగెను. వైకుంఠలోక ద్వార్యాసీత్కింకరో ద్వార పాలయోః | పునర్జగామ తద్ద్వార మాదేశా ద్ద్వారపాలయోః. 40 అథ శబ్దంచ సాశ్రుత్వా లక్ష్మణతి చ విక్లబమ్ | తంహి సా ప్రేరయామాస లక్ష్మణం రామసన్నిధౌ. 41 గతే చ లక్ష్మణ రామాంరావణో దుర్నివారణః | సీతం గృహీత్వా ప్రయ¸° లంకామేవ స్వలీలయా. 42 విషసాద చ రామ శ్చ వనే దృష్ట్వా చ లక్ష్మణమ్ | తూర్ణం చ స్వాశ్రమం గత్యా సీతాంనైవ దదర్శ సః. 43 మూర్ఛాం సంప్రాప సుచిరం విలలాప భృంశం పునః | పునః పున శ్చ బభ్రామ తదన్వేషణ పూర్వకమ్. 44 కాలేన ప్రాప్య తద్వార్తాం గోదావరీ నదీతటే | సహాయా న్వానరా న్కృత్వా బబంధ సాగరం హరిః. 45 లంకాం గత్వారఘశ్రేష్ఠో జఘాన సాయకేన చ | కాలేన ప్రాప్య తం హత్వా రావణం బాంధవైఃసహ. 46 తాం చ వహ్ని పరీక్షాం చ కారయామాససత్వరమ్ | హుతాశస్తత్ర కాలేతు వాస్తవీంజానకీం దదౌ. 47 ఉవాచ ఛాయా వహ్నిం చ రామం చ వినయాన్వితా | కరిష్యామీతికి మహం తదుపాయం వదస్వ మే. 48 శ్రీరామాగ్నీ ఊచుతుః : త్వం గచ్ఛ తపసే దేవి పుష్కరం చ సుపుణ్యదమ్ | కృత్వా తపస్యాం తత్రైవ స్వర్గ లక్ష్మీ ర్బ విష్యసి. 49 సా చ తద్వచనంశ్రుత్వా ప్రతప్య పుష్కరే తపః | దివ్య త్రిలక్షవర్షం చ స్వర్గ లక్ష్మీ ర్బ భూవహ. 50 సాచ కాలేన తపసా యజ్ఞకుండసముద్బవా | కామినీపాండవానాం చ ద్రౌపదీ ద్రుపదాత్మజా. 51 కృతే యుగే వేదవతీ కుశధ్వజ సుతా శుభా | త్రేతాయాం రామపత్నీ చ సీతేతి జనకాత్మజా. 52 అతడు పూర్వము వైకుంఠ ద్వార పాలకులకు కింకరుడు. ఇపుడు నటులే ద్వారపాలురకు కింకరుడయ్యెను. లక్ష్మణా ! యను కలతపెట్టు ధ్వని విని సీత రాముని చెంతకు లక్ష్మణు నంపెను. లక్ష్మణుడును రాముని సమీపమునకేగి నంతనే రావణుడు వారింప వీలులేని బలముతో సీతనుగొని సంతసమున లంక కేగెను. కుటీరమునకు మరలివచ్చిన రామునకుసీత గనబడలేదు. రాముడు మూర్ఛిల్లి మిక్కిలిగ రోదించెను. సీతను వెదుకుచు నంతట గ్రుమ్మరెను. రాముడు సీతనే స్మరించుచు స్మరించుచుకొంత కాలమునకు గోదావరీ తీరమున కేగి కోతుల సాయమున సాగరమునకు వంతెన కట్టెను. అటుపిమ్మట రాముడు లంకకేగి వాడి బాణములతోరావణు నతని బందుగులను హతమార్చెను. అతడు వేగిరమే సీత నగ్ని ప్రవేశము చేయించెను. అగ్నిదేవు డేతెంచి నిజమైన సీతను రామున కొసంగెను. అపుడు 'నే నేమిచేయవలయునో చెప్పుడ'ని మాయ సీత యగ్నిని రాముని యడిగెను. రామాగ్ను లిట్లనిరి: దేవీ! నీవు పుణ్యప్రదమైన పుష్కరమున తపము చేయుట కరుగుము. అచట తపముచేసి నీవు స్వర్గలక్ష్మివి గాగలవు. ఆమె వారి మాట ప్రకారముగ పుష్కరమున మూడు దివ్యలక్షల యేండ్లు తీవ్రతప మొనర్చి పిదప స్వర్గలక్ష్మి యయ్యెను. ఆమెయే మఱి యొకసారి ద్రుపదుని కూతురు పాండవుల పత్నియగు ద్రౌపదిగ యజ్ఞకుండమున నావిర్బవించెను. కృతయుగమందు కుశధ్వజుని కూతురగు వేదవతియే త్రేతాయుగమున జనకనందిని పత్నియగు సీతగ నావిర్బవించెను. తచ్ఛాయా ద్రౌ పదీ దేవి ద్వాపరే ద్రుపదాత్మజా | త్రిహాయణీ చసా స్రోక్తా విద్యామానా యుగత్రయే. 53 నారద ఉవాచ : ప్రియా : పంచ కథం తస్యా బభూవుర్మునిపుంగవ | ఇతి మచ్చిత్త సందేహం భజ సందేహ భంజన. 54 నారాయణ ఉవాచ : లంకాయాం వాస్తవీసీతామంసంప్రాపనారద | రూప¸°వన సంపన్నా ఛాయా చ బహుచింతయా. 55 రామాగ్న్యో రాజ్ఞయా తప్తుముపాస్తే శంకరం పరమ్ | కామాతురా పతివ్యగ్రా ప్రార్థయంతీ పునః పునః. 56 పతిందేహి పతిందేహి పతిందేహి త్రిలోచన | పతిందేహి పతిందేహి పంచవారం చకారసా. 57 శివ స్తత్ప్రార్థనాం శ్రుత్వా ప్రహస్య రసికేశ్వరః | ప్రియే తవ ప్రియాః పంచ భవిష్యంతివరం దదౌ. 58 తేనసా పాండవానాం చ బభూవకామినీప్రియా | ఇతితే కథితం సర్వం ప్రస్తవం వాస్తవం శృణు. 59 అథ సంప్రాప్య లంకాయాం సీతాంరామోమనోహరామ్ | విభీషణాయ తాం లంకాందత్త్వా7యోథ్యాంయ¸°పునః. 60 ఏకాదశసహస్రాబ్దం కృత్వా రాజ్యంచ భారతే | జగామ సర్వై ర్లోకైశ్చ సార్ధం వైకుంఠ మేవ చ. 61 కమలాంశా వేదవతీ కమలాయాం వివేశసా | కథితం పుణ్య మాఖ్యానాం పుణ్యదం పాపనాశనమ్. 62 సతతం మూర్చిమంతశ్చ వేదాశ్చత్వార ఏవచ | సంతి యస్యా శ్చ జిహ్వాగ్రే సా చ వేదవతీశ్రుతా. 63 ధర్మధ్వజసుతాఖ్యానాం నిబోధ కథయామి తే. ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే షోడశో7ధ్యాయః. మాయా సీతయే ద్వాపరమున ద్రుపదుని కూతురగు ద్రౌపదిగ నుద్బవించెను. ఈ మూడు యుగములందు నొకే దేవి యావిర్బవించుట వలన నామె ''త్రిహాయని'' యన ప్రసిద్ధి బడసెను. నారదు డిట్లనెను: ఓ ముని కులతిలకా ! సంది యములు దీర్చు దేవా! ఆ ద్రౌపది కేల యేవురు భర్తలైరో చెప్పి నా సందియము బాపుము. నారాయణు డిట్లనియెను : ఓయి నారదా! అట్లు లంకలో నిజమైన సీత మరల రాముని బొందెను. అపుడు రూప¸°వనపతి యగు మాయ సీత చింతించెను. అపు డామె రామాగ్నుల యాజ్ఞవలన కామాతురయై పతిని పలుసార్లు గోరుచు శంకరుని గూర్చి ఘోరముగ తపించెను. ఓ త్రిలోచనా ! నాకు పతి నిమ్ము పతి నిమ్ము పతి నిమ్ము పతి నిమ్మని యైదుసార్లు శంకరుని యెదుట బలికెను. రసిక శేఖరుడగు శివు డా ప్రార్థన విని నవ్వి ప్రియా ! నీ కైదుగురు పతులు గాగలరని వర మొసంగెను. అందుచేత నామెయే పంచపాండవులకు పత్ని యయ్యెను. ఇట్లు నీ కంతయును దెల్పితిని. ఇపుడు మఱియొక వాస్తవ విషయము వినుము. అట్లు రాముడు లంకతో మనోహారిణియగు సీతను బడసి లంకను విభీషణున కప్పగించి తాను తిరిగి య¸°ధ్య కరిగెను. శ్రీరామచంద్రుడు భారతమున పదునొకండు వేలేండ్లు రామరాజ్యము పాలించు యెల్ల పౌరులతో వైకుంఠ మేగెను. లక్ష్మ్యంశమగు వేదవతియే సీత. ఆమె తిరిగి లక్ష్మిలో నైక్య మొందెను. ఈ విధముగ పాపహరము పుణ్యప్రదము నగు వేదవతి కథ వినిపించితిని. నాల్గు వేదములు రూపుదాల్చి వేదవతి నాలుకపై నుండుటచే నామె వేదవతి యన ప్రఖ్యాతి గాంచెను. ఇంతవఱకును కుశధ్వజుని కూతురగు వేదపతి చరిత్ర వర్ణించితిని. ఇంక ధర్మధ్వజుని కూతురగు తులసి చరిత నాలకింపుము.