Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకోనవింశో7ధ్యాయః

నారద ఉవాచ: విచిత్ర మిదమాఖ్యానం భవతాసముదాహృతమ్‌|శ్రుతేన యేనమే తృప్తి ర్నకదా7పిహి జాయతే. 1

తతః పరంతు యజ్ఞాతం తత్త్వం వదమహామతే|

నారాయణ ఉవాచ: ఇత్యేవ మాశిషం దత్త్వా స్వాలయంచయ¸° విధిః. 2

గాంధర్వేణ వివాహేన జగృహే తాం చ దానవః| స్వర్గే దుందుభి వాద్యం చ పుష్పవృష్టిర్బభూవ హ. 3

స రేమే రామయాసార్ధం వాస గేహే మనోరమే| మూర్చాం సా ప్రాప తులసీ నవసంగమసంగతా. 4

నిమగ్నా నిర్జలే సాధ్వీ సంభోగసుఖసాగరే| చతుఃషష్టి కళామాసం చతుఃషష్టి విధం సుఖమ్‌. 5

కామశాస్త్రేయ న్నిరుక్తం రసికానాం యథేప్సితమ్‌| అంగ ప్రత్యంగ సంశ్లేష పూర్వకం స్త్రీ మనోహరమ్‌. 6

తత్సర్వం రసశృంగారం చకార రసికేశ్వరః| అతీవ రమ్య దేశే చ సర్వజంతువివర్జితే. 7

పుష్ప చందన తల్పే చ పుష్ప చందన వాయునా| పుష్పోద్యా నేనదీతీరే పుష్ప చందన చర్చితే. 8

గృహీత్వా రసికో రాసేపుష్ప చందన చర్చితామ్‌| భూషితో భూషణనైవ రత్నభూషణ భూసితామ్‌. 9

సురతే విరతిర్నాస్తి తయోః సురతి విజ్ఞయోః| జహార మానసం భర్తుర్లోలయా లీలయా సతీ. 10

చేతనాం రసికాయా శ్చ జహార రసభావవిత్‌| వక్షస శ్చందనం రాజ్ఞ స్తిలకం విజహార సా. 11

స చ జహార తస్యా శ్చ సిందూర బిందు పత్రకమ్‌| తద్వ ద్వక్ష స్యురోజే చ నఖరేఖా దదౌ ముదా. 12

సా దదౌ తద్వామపార్శ్వే కరభూషణ లక్షణమ్‌| రాజా తదోష్టపుటకే దదౌ రదన దంశనమ్‌. 13

పందొమ్మిదవ అధ్యాయము

శక్తి ప్రాదుర్బావము

నారదు డిట్లనెను: నీవు చెప్పిన విచిత్రమైన తులసి చరిత్ర యెంత విన్నను తనవితీరుట లేదు. ఓ మహామతీ! తర్వాత జరిగినది తెలుపుము. నారాయణు డిట్లనెను: ఆ విధముగ బ్రహ్మ దంపతుల నాశీర్వదించి తనలోకమున కరిగెను. ధానవుడు గాంధర్వ వివాహముతో నామెను చెట్టపట్టెను. అపుడు స్వర్గమునందు దుందుభివాద్యములు మ్రోగెను. పూలవానలు కురిసెను. అతడా కాంతతో మనోహరమైన శోభనగృహములో పలురతుల సుఖించెను. తొలి తొలి యానందసంగమమునకే తులసి మూర్చిల్లెను. తులసి సంభోగసుఖసాగరములో మునిగి మైమఱచెను; అరువది నాల్గు శృంగారకళలతోనరువది నాల్గు రీతుల సురత సుఖము లనుభవించెను. కామశాస్త్రమునందు రసికుల కోర్కులుదీర చెప్పబడిన రతి విశేషములన్నియు నెరిగి ప్రతి యంగమును బిగియార కవుంగిలించుకొని యతడు సుఖించెను. ఇట్లు రసికేశ్వరుడగు నత డామెతో ఏకాంతమైన రమ్య ప్రదేశమున కూర్మిమీరగ శృంగార రసమున దేలియాడెను. నదీతీరమున పూలతోటలో పూలు మంచిగంధము పరిమళములు విరజిమ్మగ పూల చందనముల పానుపపై రసికేశేఖరుడు రత్నభూషణభూషితుడై రత్నభూషణభూషిత పుష్పచందన చర్చితయగు తులసిని వలపుకౌగిళ్ళలో గ్రహించి తనిపెను. రతి విశారదులగు వారిర్వురు ననురాగాల యంచులుదాక రతి విలాసముల దేలిరి. తులసియును లీలగ పతిలోలయై కవ్వింపులతో తన పతి మనసు దోచుకొనెను. రసికురాలగు తులసి యెడందను రసికుడు చూఱగొనెను. ఆమె యతని ఱొమ్ముమీద చందనమును నుదిటి తిలకమును హరించెను. అతడు నామె సిందూర తిలకమును హరించెను. వెనువెంటనే తమకముమీర జవ్వని బిగివట్రువ కుచములు గట్టిపట్టి కసటున గోళ్ళు గ్రుచ్చెను. రమణియును తన యెదభావము తెలుపలేక తన యెడమ భాగమున కంకణముల గీసెను. అది యెఱిగి యత డామె కమ్మోవిని తన మొన పంట నొక్కెను.

తద్గండ యుగళే సా చ ప్రదదౌ తచ్చతుర్గుణమ్‌ | ఆలింగనం చుంబనం చ జంఘాది మర్దనం తథా. 14

ఏవం పరస్పరం క్రీడాం చక్రత్తు స్తౌ విజాన తౌ| సురతే విరతే తౌ చ సముత్థాయ పరస్ప రమ్‌. 15

సువేషం చక్రతు స్తత్ర యద్యన్మనసి వాంఛితమ్‌| చందనైః కుంకుమారక్తైః సా తస్య తిలకం దదౌ. 16

సర్వాంగే సుందరే రమ్మే చకార చాములేపనమ్‌| సువాసం చైవ తాంబూలం వహ్నిశుద్ధే చ వాససీ. 17

పారిజాతస్య కుసుమం జరారోగహరం పరమ్‌| అమూల్యరత్న నిర్మాణ మంగుళీయక ముత్తమమ్‌. 18

సుందరం చ మణివరం త్రిషులోకేషు దుర్లభమ్‌ | దాసీ తవాహ మిత్యేవం సముచ్చార్య పునః పునః 19

నవామ పరయా భక్త్యా స్వామినం గుణశాలినమ్‌| సస్మితా తన్ముఖాంభోజం లోచనాభ్యాం పునఃపునః . 20

నిమేషరహితాభ్యాం చాప్యపశ్య త్కామ సుందరమ్‌| స చ తాం చ సమాకృష్య చకార వక్షసి ప్రియామ్‌. 21

సస్మితం దాససా77చ్చన్నం దదర్శ ముఖ పంకజమ్‌| చుచుంబ కఠినే గండే బింబో ష్టోపునరేవచ. 22

ద దౌ తసై#్య వస్త్రయుగ్మం వరుణా దాహృతం చయత్‌| తదాహృతాం రత్నమాలాం త్రిషులోకేషు దుర్లభామ్‌. 23

ద దౌ మంజీర యుగ్మం చ స్వాహాయ అహృతం చయత్‌|

కేయూర యుగ్మం ఛాయాయా రోహిణ్యాశ్చయైవ కుండలమ్‌. 24

అంగుళీయక రత్నాని రత్నాశ్చ కరభూషణమ్‌| శంఖంచ రుచిరం చిత్రం యద్ధత్తం విశ్వకర్మణా. 25

విచిత్రపద్మకశ్రేణీం శయ్యాంచాపి సుదుర్లభామ్‌| భూషణాని చ దత్త్వా చ భూపో హాసం చకారహ. 26

ఆమెయును మదనకోపమున నతని గట్టి చెక్కిళ్ళపై దానికి నాలుగింతలు గాట్లుపఱచి పలునొక్కులతో ముద్దుల తీపి గొనుచు నతని పిఱుదులు తన యెదలోనికి హత్తుకొని పెనవేసికొనెను. ఇట్లు విశారదులు వారిర్వును నొకరినొకరు రతుల ముంచెత్తి రతులదేలి విరమించిరి. వారు మరల తమకు నచ్చిన వేషములు వేసికొనిరి. ఆమె యతని నుదుట చందన తిలకము దిద్దెను. ఆమె యతని మేన చందనమలంది యగ్నిశుద్ధ వస్త్రమును కమ్మని తాంబూలము నొసంగెను. ఆమె జరా రోగముల బాపునట్టిపారిజాతసుమును విలు వగల రతనాల ముద్దు టుంగరమును ముల్లోకములందు దుర్లభ##మైన మణినొసంగి నేను నీ దాసినని పలుమారులు పలికెను. ఆమె గుణశాలియగు తన పతికి పరమభక్తితో మ్రొక్కెను. అతని ముఖ కమలమును తన చల్లని చూపులతో మాటిమాటికి చిర్నగవులతో చూడసాగెను. ఆమె తన కామసుందరుని ఱప్పవాల్చక చూచెను. అతడు నామెను మక్కువ మీర నక్కున జేర్చుకొనెను. అతడును నునుసిగ్గు మేలిముసుగులోని యాచెలువ మోముతమ్మిని పెదవిని చెక్కిళ్ళను ముద్దుల ముంచెత్తి పలునొక్కుల తియ్య పఱచెను. అతడు తన ప్రియురాలికి ముజ్జగము లందును దుర్లభములైన వరుణుని రత్నమాలను వస్త్రములను స్వాహాదేవి యొసంగిన కాలియందెన జోడును ఛాయాదేవి యిచ్చిన కేయూరములను రోహిణి కుండలములను రతి యొసంగిన రతనాల యుంగరములను విశ్వకర్మ యిచ్చిన యందమైన శంఖమును విచిత్రమైన దుర్లభ##మైన కెంపులు పొదిగిన శయ్యను భూషణములు నొసంగి శంఖచూడుడు మందహాసము చేసెను.

నిర్మమే కబరీభారే తస్యామాంగళ్యభూషణమ్‌| సుచిత్రం పత్రకం గండమండలే7స్యాః సమంతథా. 27

చందలేఖా త్రిభిర్యుక్తం చందనేన సుగంధినా| పరీతం పరితశ్చిత్రైః సార్ధం కుంకుమ బిందుభిః. 28

జ్వలత్పృ దీపాకారం చ సిందూరతిలకం దదౌ| తత్పాదపద్మయుగళే స్థలపద్మ వినిందితే. 29

చిత్రాలక్తకరామం చ నఖరేషు దదౌ ముదా| స్వవక్షసి ముహుర్న్యస్య సరాగం చరణాంబుజమ్‌. 30

హే దేవి తవ దాసో7హ మిత్యుచ్చార్య పునః పునః| రత్నభూషిత హస్తేన తాంచకృత్వాస్వవక్షసి. 31

తపోవనం పరిత్యజ్య రాజాస్థానాంతరం య¸°| మలయే దేవనిలయే శైలేశైలే తపోవనే. 32

స్థానే స్థానే7త్రిరమ్మే చ పుష్పోద్యానే చ నిర్జనే| కందరే కందరే సింధు తీరే చైవాతిసుందరే. 33

పుష్పభద్రానదీ తీరే నీరవాత మనోహరే| పులినే పులినే దివ్యే నద్యాం నద్యాం నదే నదే. 34

మధౌ మధుకరాణాం చ మధురధ్వనినాదితే| విస్పందనే సురసనే నందనే గంధమాదనే. 35

దేవాద్యానే నందనే చ చిత్రకుందనకాననే| చంపకానాం కేతకీనాం మాధవీనాంచమాధవే. 36

కుందానాం మాలతీనాం చ కుముదాంభోజ కాననే| కల్పవృక్షే కల్పవృక్షే పారిజాతవనే వనే.37

నిర్జనే కాంచనే స్థానే దన్యే కాంచనపర్వతే| కాంచీవనే కింజలకే కంచుకే కాంచనాకరే. 38

పుష్పచందన తల్పేషు పుంస్కోకిల రుతశ్రుతే| పుష్పచందన సంయుక్తః పుష్పచందన వాయునా. 39

అతడామె కొప్పులో మాంగల్య భూషణములు తురిమెను. ఆమె నునుచెక్కిళ్లపై మకరికా పత్రములు దిద్దెను. అతడు కప్పురము గుబాళించు చందన మామె మేని నిండ నలంది నెన్నొసట కుంకుమ తిలకము దిద్దెను. ఆ సిందూర తిల కము దీపకాంతు లీనుచుండెను. ఆమె పద పద్మములు స్థల పద్మములను మించియుండెను. ఆమె కాలిగోళ్ళకు లత్తుకరంగు పూజసి పద కమలములను తన గుండియకు హత్తుకొనెను. ఓ దేవీ! నేను నీ దాసుడనని పలు మారులు పల్కెను. అతడు తన రత్న భూషలు దాల్చిన చేతులతో నామెను తన హృదయమునకు హత్తుకొనెను. అతడు తపోవనము వదలి వేరొక చోటి కరి గెను. పిదప నతడా రమణి ని వెంట వేసుకొని మలయ గిరిపైని దేవస్థానముల తపోవనముల ప్రతి సుందరములైన సాగర తీరము లందును మంచినీటితో గాలితో నందమైన పుష్ప భద్రా నదీ తీరమున ప్రతిన దీనదమునందలి మెత్తని యిసుక తిన్నెలపై తేనియలకై జుంజుమ్మని రొదలుసేయు తేంట్లు గల నందనవనము లందును గంధ మాదన గిరి మీద దేవోద్యానములగు నందన-చిత్ర-చందన వనము లందును చంపక-మాధవీ-కేతకీ లతల వనము లందును కల్పవృక్ష పారి జాత వనము లందును నిర్జనము లైన బంగారు కొండల మీద బంగారు పుప్పొళ్ళు గల కాంచీ వనము లందును పుష్ప చందన పరిమళములు గుబాళించునట్టి కోయిలల కుహూరావముల చెన్నొందు పుష్పచందనముల సెజ్జల యందు-

కాముక్యాః కాముకః కామాత్సరేమే రామయాసహ| న హి తృప్తో దానవేంద్ర స్తృప్తింనైవ జగామాసా. 40

హవిషా కృష్ణవర్త్మేవ వవృధే మదన స్తయోః| తయా సమ సమాగత్య స్వాశ్రమం దానవ స్తతః. 41

రమ్యం క్రీడాలయం గత్వా విజహార పునః పునః| ఏవం స బుభుజే రాజ్యం శంఖచూదః ప్రతాపవాన్‌. 42

ఏకం మన్వం తరం పూర్ణం రాజా రాజేశ్వరో మహాన్‌ | దేవానా మసురాణాం చ దానవానాం చ సంతతమ్‌. 43

గంధర్వాణాం కిన్నరాణాం రాక్షసానాం చ శాంతిదః| హృతాధికారా దేవాశ్చ చరంతి భిక్షుకాయథా. 44

తే సర్వే7తివిషనణ్ణాఈ శ్చ ప్రజగ్ముర్ర్బహ్మణః సభామ్‌| వృత్తాంతం కథయామాస రురుదుశ్చ భృశం ముహుః. 45

తదా బ్రహ్మా సురైః సార్ధం జగామ శంకరాలయమ్‌| సర్వేశం కథయామాస విధాతా చంద్రశేఖరమ్‌. 46

బ్రహ్మా శివ శ్చ తైః సార్ధం వైకుంఠం చ జగామ హ| దుర్లభం పరమం ధామ జరామృత్యు హరం పరమ్‌. 47

సంప్రాప చ వరం ద్వారమాశ్రమాణాం హరే రహో| దదర్శ ద్వారపాలాం శ్చ రత్న సింహాసనస్థితాన్‌. 48

శోభితాన్‌ పీతవసై#్త్ర శ్చ రత్నభూషణ భూషితాన్‌| వనమాలానన్వితా న్సర్వాన్‌ శ్యామసుందర విగ్రహాన్‌. 49

శంఖ చక్రగదా పద్మ ధరాంశ్చైవ చతుర్బుజాన్‌| సస్మితాన్‌ స్మేరవక్త్రాస్మా న్పద్మ నేత్రాన్మనోహరాన్‌. 50

బ్రహ్మా తాస్కథయామాస వృత్తాంతే గమనార్థకమ్‌| తే7నుజ్ఞాం చ దదుస్తసై#్మ ప్రవివేశ తదాజ్ఞయా. 51

ఏవం షోడశ ద్వారాణి నిరీక్ష్య కమలోద్బవః| దేవైః సార్ధం తానతీత్య ప్రవివేశ హరేః సభామ్‌. 52

కాముకుడగు శంఖ చూడుడును కామిని యగు తులసియు రేబవళ్ళు పరస్పర శృంగార విహారములు చేసి చేసియును తనివి జెందకుండిరి. హవిస్సు చేతనగ్ని వలె వారి కామాగ్ని పెరుగుచునే యుండెను. అపుడా దానవు డామెతోడుత తన యాశ్రమము చేరెను. బలశాలియగు శంఖజూడుడా ప్రకారముగ తన శోభన మందిరములో నామె వలపు వెచ్చని కౌగిళ్ళలో మరగియుండెను. ఇట్లతడు కామ విహారము సల్పుచు రాజ్యపాలన చేసెను. పూర్తిగ నొక మన్వంతరము వఱ కతడు దేవదానవాసురులకు మహారాజుగ నుండెను. అతడు కిన్నర గంధ్వర రాక్షసులకు మేలు గూర్చుచు వారికి చక్రకవర్తియై యుండెను. సిరి గొలుపోయిన సురలు బిచ్చగాండ్ర పగిది ద్రిమ్మరుచుండిరి. వారొకసారి దిక్కుమాలి బ్రహ్మ సభకు చేరి జరిగినదంతయును శివునకు విన్నవించిరి. శివుడును బ్రహ్మాది సురులతో గూడి జరామృత్యువులు లేక దుర్లభ##మైన పరంధామ మగు వైకుంఠము జేరెను. వారు హరి యుండు దివ్య భవనము ద్వారమున ద్వారపాలురను గాంచిరి. వారు రత్న సింహాస నములపై గూర్చొనియుండిరి. వారు పట్టు పుట్టములు దాల్చిరి. రత్నభూషణ భూషితులు. శ్యామల సుందర విగ్రహులు వన మాలా శోభితులై వెలసిరి. వారు శంఖచక్రగదా పద్మధరులు చతుర్బుజులు దరహాసముఖులు సుందర పద్మనేత్రులు. బ్రహ్మాదులు వారికి తమ రాక కారణ మెఱింగించిరి. వారి యనుమతితో లోనికి జనిరి. బ్రహ్మ దేవతలతో పదునారు ద్వారములు గడచి విష్ణుని కొలువు కూటము చేరెను.

దేవర్షిభిః పరివృతాం పార్షదై శ్చ చతుర్బుజైః| నారాయణ స్వరూపై శ్చ సర్వైః కౌస్తుభభూషితైః. 53

నవేందు మండలా కారాం చతురస్రాం మనోహరామ్‌| మణీం ద్రహారనిర్మాణాం హీరాసారసుశోభితమ్‌. 54

అమూల్య రత్న ఖచితాం రచితాం స్వేచ్ఛయా హరేః| మాణిక్యమాలా జలాభాం ముక్తా పంక్తి విభూషితామ్‌. 55

మండితాం మండలకారై రత్న దర్పణకోటిభిః| విచిత్రై శ్చిత్రరేఖాబిర్నానా చిత్ర విచిత్రితామ్‌. 56

పద్మరాగేంద్రరుచిరాం రుచిరాం మణిపంకజైః| సోపానశతకై ర్యుక్తాంశ్యమంతక వినిర్మితైః 57

పట్టసూత్ర గ్రంథియుక్తైశ్చారు చందన పల్లవైః| ఇంద్రనీల స్కంభవర్త్యె ర్వేష్టితాం సుమనోహరామ్‌. 58

సద్రత్న పూర్ణకుంభానాం సమూహైశ్చ సమన్వితామ్‌| పారిజాత ప్రసూనానాం మాలాజాలై ర్వరాజితామ్‌. 59

కస్తూరీకుంకుమారక్తైః సుగంధిచందన ద్రుమైః| సు సంస్కృతాంతు సర్వత్ర వాసితాంగంధవాయునా. 60

విద్యాధరీ సమూహానాం నృత్యజాలై ర్విరాజితామ్‌| సహస్రయోజనాయామాం పరిపూర్ణంచ కింకరైః. 61

దదర్శ శ్రీహరిం బ్రహ్మ శంకరశ్చ సురై, సహ| వసంతం తన్మధ్య దేశే యథేందుం తారాకవృతమ్‌. 62

అమూల్యరత్న నిర్మాణ చిత్రసింహాసనే స్థితమ్‌| కిరీటినం కుండలినం వనమాలా విభూషితమ్‌. 63

చందనోక్షిత సర్వాంగం బిభ్రతం కేళిపంకజమ్‌| పురతో నృత్యగీతం చ పశ్యంతం సస్మితం ముదా. 64

శాంతం సరస్వతీకాంత లక్ష్మీధృతపదాంబుజమ్‌| లక్ష్మ్యా ప్రదత్తతాంబూలం భుక్తవంతం సువాసితమ్‌. 65

గంగయా పరయా భక్త్యా సేవితం శ్వేతచామరైః| సర్వైశ్చ న్తూయమానం చ భక్తినమ్రాత్మ కంధరైః. 66

అందలి దేవర్షులు పార్షదులు నెల్లవారును నారాయణ స్వరూపులే; చతుర్బుజులే; కౌస్తుభమణి విరాజితులే. అసభ క్రొత్త చంద్రమండలమో యన చతుస్రముగ మనోహరముగ నుండెను. అది దివ్యమణిరత్న శోభితము. అది శ్రీహరిచేత స్వయముగ దివ్యరత్న మాణిక్య మౌక్తికములచేత బొదిగి చేయబడెను. వైనవైనములైన చిత్తరవులచే రతనాల ముద్దుటద్దములచే విచిత్ర చిత్రరేఖలచే మండలాకారముగ విరాజిల్లుచుండెను. అది పద్మరాగము శ్యమంతకము మణిపంకజములు మున్నగు దివ్యమణులచేత నిర్మింపబడిన వందల కొలది మెట్లు గలది. పట్టు వస్త్రములు చందనపు చిగురుటాకులుమున్నగు వానిచేత కనులవిందుగ చుట్టబడిన మణిస్తంభములు గలది. వేలకొలది పారిజాత సుమములు మాలలు చెలువొందు రత్నపూర్ణ కుంభములు గలది. కస్తూరీ కుంకుమాది సుగంధములతో చందన తరువుల సువాసనలతో పరిమళాలు విరజిమ్మునది. నూఱు యోజనముల వెడల్పున కింకరులతో నిండి విద్యాధరీకన్యల నృత్యగానములతో శోభిల్లునది. తారల మధ్యలోనున్న చంద్రుని వలె దివ్యసభామధ్యమున ప్రకాశించు విష్ణువును బ్రహ్మ శివుడు సురలును గాంచిరి. శ్రీమహావిష్ణువు పరమపదములో దివ్య రత్న సింహాసనముపై విరాజిల్లుచుండెను. విష్ణువు బంగరు కిరీటము కుండలములు వనమాల దాల్చి వెలుగుచుండెను. అతడు మేనినిండ చందనములందుకొని లీలాకమలమును చేతద్రిప్పుచు తన యెదుట జరుగు నృత్యగాన గోష్ఠుల నానందహాసములతో తిలకించుచుండెను. లక్ష్మీ సరస్వతులు తన పదకమలము లొత్తుచుండగ లచ్చి యిచ్చు కమ్మని తాంబూలమును హరి సేవించు చుండెను. గంగ పరమ భక్తితో వింజామరలు వీచుచుండెను. అపు డెల్లరును పరమభక్తితో శ్రీధరునకు తలలు వంచి మ్రొక్కిరి.

ఏవం విశిష్టం తం దృష్ట్వా పరిపూర్ణతమం ప్రభుమ్‌| బ్రహ్మాదయః సురాః సర్వే ప్రణమ్యతుష్టువు స్తదా. 67

పులకాంచితసర్వాంగాః సాశ్రునేత్రా శ్చ గద్గదాః| భక్తా శ్చ పరయా భక్త్యా భీతా నమ్రాత్మకంధరాః. 68

కృతాంజలిపుటో భూత్వా విధాతా జగతామపి| వృత్తాంతం కథయామాస వినయేన హరేః పురః. 69

హరిస్త ద్వచనం శ్రుత్వా సర్వజ్ఞః సర్వభావ విత్‌| ప్రహస్యోవా చ బ్రహ్మాణం రహస్యం చ మనోహరమ్‌. 70

శ్రీ భగవానువాచ: శంఖచూడస్య వృత్తాంతం సర్వం జానామి పద్మజ|

మద్బక్తస్య చ గోపస్య మహాతేజస్వినః పురా. 71

శృణు తత్సర్వ వృత్తాంత మితిహాసం పురాతనమ్‌| గోలోకసై#్యవ చరితం పాపఘ్నం పుణ్యకారకమ్‌. 72.

సుదామా నామగోపశ్చ పార్షదప్రవరో మమ | స ప్రాప దానవీం యోనిం రాధాశాపాత్సు దారుణాత్‌. 73

తత్రైకదాహ మగమం స్వాలయాద్రా స మండలమ్‌ | విరజా మపి నీత్వా చ మమ ప్రాణాధికా పరా. 74

సా మాం విరజయా సార్దం విజ్ఞాయ కింకరీ ముఖాత్‌ | పశ్చాత్క్రుద్దా సా೩೩జగామ న దరద్శ చ తత్రమామ్‌. 75

విరజాం చ నదీరూపాం మాంజ్ఞాత్వా చ తిరోహితమ్‌ | పునర్జగామ సా దృష్ట్వా స్వాలయం సఖీభిః సహ. 76

మాం దృష్ట్వా మందిరే దేవీ సుదామా సహితం పురా | భృశం సా భర్త్సయామాస మౌనీభూతం చ సుస్థిరమ్‌. 77

తచ్చ్రుత్వాసహ మాన శ్చ సుదామాతాం చుకోపహ |స చ తాం భర్త్సయా మాస కోపేన మమసన్నిధౌ. 78

తచ్చ్రుత్వా కోపయుక్తా సా రక్త పంకజలో చనా | బహిష్కర్తుం చకారాజ్ఞాం సంత్రస్తం మమ సంసది. 79

సఖీలక్షం సముత్తస్థౌ దుర్వారం తేజసోల్బణమ్‌ | బహిశ్చాకార తం తూర్ణం జల్పం తం చ పునః పునః. 80

ఇట్లు బ్రహ్మాది సురులు విశిష్టడు పరిపూర్ణడు ప్రభువునగు హరిని దర్శించి నమస్కరించి వేనోళ్ళ నుతించిరి. ఎల్లరును తమ మేనులు పుల్కరింపుగ నానంద బాష్పము లురులగ డగ్గుత్తికతో ప్రేమ భక్తితో సవినయముగ తలలు వంచిరి. అపుడు జగముల సృష్టికర్త చేతులు జోడించుకొని హరికి జరిగిన వృత్తాం మంతయును నివేదించెను. అంత సర్వజ్ఞడు సర్వ విదుడనగు హరి యంతయును విని నవ్వి బ్రహ్మకొక రహస్యమైన విషయ మిట్లు చెప్పదొడంగెను. శ్రీ భగవాను డిట్ల నెను: ఓ బ్రహ్మ! శంఖచూడుని వృత్తాంత మంతయు నే నెఱుంగుదును మును పతడు నా భక్తుడు. గోపకుడు మహా తేజస్వి. అతని పూర్వ చరిత్రము తెల్పుదును వినుము. ఆ గోలోక చరితము పాపహారము; పుణ్యప్రదము. మున్నుసుదాముడను గోపుడు నా పార్శ్వచరుడు. అతడు దారుణమైన రాధ శాపమునకు గురియై దానవు డయ్యెను. నే నొకప్పుడు విరజను వెంట బెట్టుకొని నా యింటినుండి రాసమండలమునకు వెళ్ళితిని. నేను విరజతో జంటగనుంట యొక దాసివలన విని రాధ కోపముతో పరుగు పరుగున నచ్చటికి వచ్చెను. కాని యామె నన్ను చూడలేకపోయెను. విరజ నదీరూపము దాల్చుట నేను కనుమఱుగగుటగని రాధ చెలియలతో తన యింటి కేగెను. నే నంత సుదామునితో మందిరమందుండుట చూచి రాధ నన్ను తూలనాడెను. నేను మాత్రము నోరు విప్పలేదు. అది సహించలేక సుదాము డామెను కోపించెను. ఆమెను నా యెదుటనే నిందించెను. అది విని కన్ను లెఱ్ఱజేసి నా సభనుండి బైటికి వెళ్ళి పొమ్మని రాధ యతని నాజ్ఞాపించెను. అపుడు లక్షలాది చెలికత్తెలులేచి పలు మార్లు వాగుచున్న తేజశ్శాలియగు వానిని బైటికి గెంటిరి.

సా చ తత్తాడనం తాసాం శ్రుత్వారుష్టాశశాప హ | యా హి రే దానవీం యోని మిత్యేవం దారుణం వచః. 81

తం గచ్చంతం శపంతం చ రుదంతం మాం ప్రణమ్య చ | వారయా మాస తుష్టానా రుదతీ కృపాయా పునః. 82

హే వత్స తిష్ఠ మా గచ్చ క్వ యాసతీ పునః పునః | సముచ్చార్య చ తత్పశ్చా జ్జగామ సా చ విక్లబమ్‌. 83

గోప్య శ్చ రురుదుః సర్వా గోపాశ్చాపి సు దుఃఖితాః | తే సర్వే రాధికా చాపి తత్పశ్చా ద్బోధితామయా. 84

ఆయాస్యతి క్షణార్దేన కృత్యా శాపస్య పాలనమ్‌ | సుదామం స్త్వ మిహాగచ్చే త్యుక్త్వా సా చ నివారితా. 85

గోలోకస్య క్షణార్దేన చైకం మన్వం తరం భ##వేత్‌ | పృథివ్యా జగతాం ధాత రిత్యేవ వచనం ధ్రవమ్‌. 86

ఇత్యేవం శంఖచూడశ్చ పురస్తత్రైవ యాస్యతి | మహా బలిష్ఠో యోగేశః సర్వమాయా విశారదః. 87

మమ శూలంగృహీత్వా చ శ్రీఘ్రం గచ్చత భారతమ్‌ | శివః కరోతు సంహారం మమ శూలేన

రక్షసః. 88

మమైవ కవచం కంఠే సర్వ మంగళ కారకమ్‌ | బిభర్తి దానవః శశ్వత్సం సారే విజయీ తతః. 89

తస్మిన్‌ బ్రహ్మన్‌ స్థితే చైవ నకో7పి హింసితుం క్షమః | తద్యాచనాం కరిష్యామి విప్రరూపో హమేవచ. 90

సతీత్వహాని స్తత్పత్న్యా యత్రకాలం భవిష్యతి | తత్రైవకాలే తన్మృత్యు రితి దత్తో వరస్త్వయా. 91

తత్పత్న్సాశ్చోదరే వీర్య మర్పయిష్యామి నిశ్చితమ్‌ | తతణచైవ తన్మృత్యు ర్బవిష్యతి న సంశయః. 92

పశ్చాత్సా దేహ ముత్సృజ్య భవిష్యతి మనుప్రియా | ఇత్యుక్త్వా జగతాంనాధో దదౌశూలం హరాయ చ. 93

శూలం దత్త్వా య¸° శీఘ్రం హరిరభ్యంతరే ముదా | భారతాం చ యయుర్దేవా బ్రహ్మరుద్రపురోగమాః. 94

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే ఏకోనవింశోధ్యాయః.

అతడును వారిని దండించెను. అది విని ''దానవుడవై పుట్టు'' మని రాధయతనిని దారుణముగ శపించెను. అతడట్లు శపింపబడి యేడ్చుచు నాకు నమస్కరించి వెళ్ళుచుండెను. అతనిపై జాలిపూని వారించి రాధ యిట్లనెను. ఓయి వత్సా ! నిలుము పోకుము. ఎక్కడి కేగుదువనుచు రాధయును పలికి మిక్కిలిగ బాధ పడెను. అపు డచటి గోపీగోపులందఱును దుఃఖించిరి. మే మందఱమును రాధకు నచ్చచెప్పితిమి. ''ఓ సుదామా! ఒక క్షమార్దములో నా శాప మనుభవించి తిరిగి రమ్మ'' ని రాధ యతని శోక ముడిపెను. అతడును శోక ముడిగెను. గోలోకమందలి యర్దక్షణము భూలోకమందొక మన్వంతరకాల మగునని బ్రహ్మ నియమము గలదు. కనుక శంఖచూడుడు తిరిగి గోలోకము చేరగలడు. అతడు బలిష్ఠడు మాయావి యోగేశుడు. శివుడు నా శూలము తీసికొని భారతమున కేగి యతనిని సంహరింపగలడు. నామంగళకరమగు కవచము కంఠమున దాల్చుటవలన నతడు గెలుపొందెను. ఆ కవచము ధరించి యున్నంతకాల మతనినెవ్వడును హింసింప జాలడు. నేను బ్రాహ్మణరూపమున నేగి యతనిని కవచ మిమ్మని యాచింపగలను. ఆమె సతీత్వము భంగమైనంతనే యతనికిచావు మూడునని మునుపు నీవే వర మొసంగితివి. అతని భార్యతోడ విష్ణుడనగు నేనే కలియగలను. వెంటనే తప్ప కతడు చానగలడు. ఆపిమ్మట నామె తనువు చాలించి తిరిగి నా ప్రియురాలు గాగలదు. అని జగన్నాధుడు శివునకు తన శూలమొసంగెను. శూల మిచ్చి మాధవుడు వెంటనే యంతిపురములోని కరిగెను. బ్రహ్మ రుద్ర సురలును భారతదేశమున కరిగిరి.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున పందొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters