Sri Devi Bagavatham-2
Chapters
అథ వింశో7ధ్యాయః శ్రీనారాయణ ఉవాచ : బ్రహ్మ శివం సన్నియోజ్య సంహారే దానవస్య
చ | జగామస్వాలయం తూర్ణం యథాస్థానం సురోత్తమాః. 1 చంద్రభాగా నదీతీరే వటమూలే మనోహరే | తత్ర తస్థౌ మహాదేవో దేవవిస్తార హేతవే. 2 దూతం కృత్వా చిత్రరథం గంధర్వేశ్వరమీప్సితమ్ | శీఘ్రం ప్రస్థాపయామాస శంఖచూడాంతికం ముదా. 3 సర్వేశ్వరాజ్ఞయా శీఘ్రం య¸°తన్నగరం పరమ్ | మహేంద్రనగరోత్కృష్టం కుబేరభవనాధికమ్. 4 పంచయోజన విస్తీర్ణం దైర్ఘ్యేత ద్ద్విగుణం భ##వేత్ | స్పటికాకారమణిభి ర్నిర్మితం యానవేష్టితమ్. 5 సప్తభిః పరిఖాభిశ్చ దుర్గమాభిః సమన్వితమ్ | జ్వలదగ్నినిభైః శశ్వ త్కల్పితం రత్నకోటిభిః. 6 యుక్తం చ వీథీశతకైర్మణి వేదివిచిత్రితైః |పరితో వణిజాం సౌధైర్నానావస్తు విరాజితైః. 7 సిందూరా కారమణిభి ర్నిర్మితైశ్చ విచిత్రితైః | భూషితం భూషితై ర్దివ్యై రాశ్రమైః శతకోటిభిః. 8 గత్వా దదర్శ తన్మధ్యే శంఖచూడాలయం పరమ్ | అతీవ వలయాకారం యథాపూర్ణేందు మండలమ్. 9 జ్వలదగ్ని శిఖాక్తాభిః పరిఖాభిశ్చతసృభిః | తద్దుర్గమంచ శత్రూణా మన్యేషాం సుగమంసుఖమ్. 10 అత్యుచ్చై ర్గగన స్పర్శి మణిశృంగ విరాజితమ్ | రాజితం ద్వాదశ ద్వారైర్ద్వారపాలసమన్వితమ్. 11 మణీం ద్రసార నిర్మాణౖః శోభితం లక్ష మందిరైః | శోభితం రత్నసోపానై రత్నస్తంభ విరాజితమ్. 12 తద్దృష్ట్వా పుష్పదంతో7పి వరం ద్వారం దదర్శ సః | ద్వారే నియుక్తం పురుషం శూలహస్తం చ సస్మితమ్. తిష్ఠంతం పింగళాక్షం చ తామ్రవర్ణం భయంకరమ్ | కథయామాస వృత్తాంతం జగామ తదనుజ్ఞయా. 14 ఇరువదవ అధ్యాయము శక్తి ప్రాదుర్బావము శ్రీనారాయణు డిట్లు పలికెను : ఇటుల దానవనాశమునకు శివుని నిసయోగించి బ్రహ్మ మొదలగు దేవతలు తమతమ నెలవుల కరిగిరి. మహాదేవుడు చంద్రభాగానదీ తీరమున మఱ్ఱిచెట్టు క్రిందనుండి తన దేవబలమును సమీకరించుకొనెను. శివుడు వెంటనే గంధర్వపతియగు చిత్రరథుని దూతగ శంఖచూడుని కడ కంపెను. అతడు వేగిరముగ నింద్రకుబేర నగర ములను మించిన శంఖచూడుని నగరము చేరెను. ఆ నగర మైదు యోజనములు వెడల్పును దానికి రెండింతలు పొడవునుగల్గి స్పటికారముగల మణులతో నిర్మింపబడి వాహనములతో నొప్పుచుండెను. నగరము చుట్టును ప్రవేశింపవీలులేని యేడగడ్తలు గలవు. ఆ నగరమందు శంఖచూడుని మందిరము గలదు. అది మండుచున్న నిప్పువంటి కోట్లరత్నములచే నిర్మితమైనది. మందిరము చేరుటకు వందల కొలది వీథులు మణిచిత్రితములైన వేదికలును నానావస్తువిరాజితములైన వర్తకుల భవనము లుండెను. అచట పెక్కు లాశ్రమములు సిందూరాకార మణుల చేత నిర్మితములై చిత్రవిచిత్రములై శతకోటి దివ్యాలంకారములగల్గి యొప్పారు చుండెను. అట్టి సుందరమైన శంఖచూడని భవనమును దూత గాంచెను. అది పున్నమనాటి చంద్రమండలము వలె గుండ్రముగ వెల్గు లీనుచుండెను. దాని నలువైపుల నగ్నిశిఖల వలె నగడ్తలు గలవు. అవి శత్రులకు దుర్గమములు మిత్రులకు సుగమములునై యుండెను. శంఖచూడుని మందిరముమిన్ను తాకు మణి శిఖరములతో ద్వార పాలకులతో తనరుచుండెను. అతని భవనము నందు మణి సారములతో నిర్మతములైన లక్షలాది మందిరములును రత్నసోపా నములును రత్నస్తంభములును వెల్గుల జిమ్ముచుండెను పుష్పదంతుడు మొదటి ద్వారమును నందు చిర్నగవుతో శూలము చేత బట్టి నిలుచున్న ద్వారపాలుని చూచెను. ఆ ద్వారపాలుడు తామ్రవర్ణము పింగళ##నేత్రములుగల్గి భయంకరముగ నుండెను. అతనికి విషయము తెల్పి యనుమతి గొని దూత లోని కరిగెను. అతిక్రమ్య చ తద్ద్వారం జగామాభ్యంతరం పునః | న కో7పి రక్షతి శ్రుత్వా దూతరూపం రణస్య చ. 15 గత్వా సో7భ్యంతర ద్వారం ద్వారపాలమువాచ హ | రణస్య సర్వవృత్తాంతం విజ్ఞాపయత మా చిరమ్. 16 స చ తం కథయిత్వా చ దూతో గంతుమువాచ హ | గత్వావైశంఖచూడంతం దదర్శ సుమనో హరమ్. 17 రాజ మండల మధ్యస్థం స్వర్ణ సింహాసనే స్థితమ్ | మణీంద్రరచితం దివ్యం రత్నదండసమన్వితమ్. 18 రత్న కృత్రిమ పుషై#్సశ్చ ప్రశ##సై#్తః శోభితం సదా | భృత్యేన మస్తకన్యస్తం స్వర్ణచ్చత్రం మనోహరమ్. 19 సేవితం పార్షదగణౖ రుచిరైః శ్వేత చామరైః | సువేషం సుందరం రమ్యం రత్నభూషణ భూషితమ్. 20 మాల్యేన లేపనం సూక్ష్మం సువస్త్రం దధతం మునే | దానవేంద్రైః పరివృతం సువేషైశ్చ త్రికోటిభిః. 21 శతకోటిభి రత్నైశ్చ భ్రమద్బి రస్త్రపాణిభిః | ఏవంభూతం చ తం దృష్ట్వా పుష్పదంతః సవిస్మయః. 22 ఉవాచ స చ వృత్తాంతం యదుక్తం శంకరేణ చ | పుష్పదంతః : రాజేంద్ర శివభృత్యో7హం పుష్పదంతాభిధః ప్రభో. 23 య దుక్తం శంకరేణౖవ తద్బృవీమి నిశామయ | రాజ్యం దేహి చ దేవానా మధికారం చ సాంప్రతమ్. 24 దేవాశ్చ శరణాపన్నా దేవేశం శ్రీహరిం పరమ్ | హరిర్దత్వా7స్య శూలం చ తేన ప్రస్థాపితః శివః. 25 పుష్పభద్రానదీతీరే వటమూలే త్రిలోచనః | విషయం దేహి తేషాం చ యుద్దంవా కురునిశ్చితమ్. 26 గత్వా వక్ష్యామి కిం శంభు మథ తద్వద మామపి | దూతస్య వచనం శ్రుత్వా శంఖచూడః ప్రహస్య చ. 27 ప్రభాతే7హం గమిష్యామి త్వం చగచ్చే త్యువాచ హ | స గత్వోవా చ తం తూర్ణం వటమూలస్థ మీశ్వరమ్. 28 ఆ ద్వారమును దాటి లోనికి దూత ప్రవేశించెను. యుద్ద విషయమున నేతెంచిన రాయబారి యగుట నతని నెవరేమియు ననలేదు. అతడు లోని ద్వారము చెంతకేగి రణ వృత్తాంతము మీ రాజునకు తెలుపుమని ద్వారపాలకునితో ననెను. ద్వారపాల కుడు చెప్పగనే దూతను రమ్మనిరి. దూత వెళ్ళి శంఖచూడుని గాంచెను. శంఖచూడుడు రాజుల నడుమ రతనాల దండలతో మణి నిర్మితమైన సింహాసన మందు వెలుగుచుండెను. రత్న పుష్పములచే కృత్రిమముగచేయబడిన యందమైన బంగారు గొడుగు నొకడు రాజు తలపై పట్టుకొనెను. రత్నభూషణములతో నలంకరించుకొన్నయనుచరులు వింజామరలు చేతుల బూని యతనిని సేవించుచండిరి. మాల్యాను లేపనములతో మేలైన వస్త్రములతో నున్న కోట్ల దానవు లతని చుట్టుజేరిరి. నూఱు కోట్ల మంది శస్త్రపాణులై యటు నిటు తిరుగుచుండిరి. ఇట్లు తనరారుశంఖచూడుని గని దూత యాశ్చర్యమొందెను. దూత శంకరుని సందేశ మతని కిట్లు వినిపించెను: పుష్పదంతు డిట్లనెను: ఓ రాజేంద్రా! నేను శివదూతను. నన్ను పుష్ప దంతు డందురు. ప్రభూ! శంకరుడు నాతో పలికిన మాటలు తెల్పుదును. వినుము ''నీవు దేవతల రాజ్యమును వారి యధి కారము నిచ్చివేయుము. దేవతలు దేవేశుడగు శ్రీహరిని శరణు వేడిరి. హరి శివునకు తన శూల మిచ్చి పంపించెను. శివుడు పుష్ప భద్రా నదీ తీరమున మఱ్ఱి నీడలో నున్నాడు. అతనికి నీ రాజ్యమైన ఇమ్ములేక యుద్దమైన చేయుము.'' నేను వెళ్ళి మీరు చెప్పినది తెల్పుదును. అను దూత పలుకులు విని నవ్వి శంఖచూడు డిట్లనెను: రేపు సూర్యోదయమునకు నేను వత్తును. నీవు వెళ్లుమనెను. దూతయును సత్వరముగ మఱ్ఱిచెట్టుక్రింద నున్న శివునితో నంతయు నివేదించెను. శంఖచూడస్యవచనం తదీయం తన్ముభోదితమ్ | ఏతస్మిన్నంతరే స్కంద ఆజగామ శివాంతికమ్. 29 వీరభద్రశ్చ నందీ చ మహాకాళః సుభద్రకః | విశాలాక్ష శ్చ బాణశ్చ పింగుళాక్షో వికంపనః. 30 విరూపో వికృతిశ్చైవ మణిభద్రశ్చ బాష్కలః | కపిలాఖ్యో దీర్ఘదంష్ట్రో వికట స్తా మ్రలోచనః. 31 కాలకంఠో బలభద్రః కాలజిహ్వః కుటీచరః | బలోన్మత్తో రణశ్లాఘీ దుర్జయో దుర్గమ స్తథా. 32 అష్టో చ భైరవా రౌద్రారుద్రాశ్చైకాదశ స్మృతాః | వసవోష్టౌ వాసవశ్చ ఆదిత్యా ద్వాదశస్మృతాః. 33 హుతాశన శ్చ చంద్రశ్చ విశ్వకర్మా7శ్వినౌ చ తౌ | కుబేరశ్చ యమశ్చైవ జయంతో నలకూబరః. 34 వాయుశ్చ వరుణశ్చైవ బుధశ్చ మంగళ స్తథా | ధర్మశ్చ శని రీశానః కామదేవశ్చ వీర్యవాన్. 35 ఉగృదంష్ట్రా చోగ్రదండా కోటరాకైటభీ తథా | స్వయం చాష్టభుజా దేవీ భద్రకాళీభయంకరీ. 36 రత్నేంద్రసారనిర్మాణ విమానోపరిసంస్థితా | రక్త వస్త్రపరీధానా రక్త మాల్యానులేపనా. 37 నృత్యంతీ చ హసంతీ చ గాయంతీ సుస్వరం ముదా | అభయం దదాతి భ##క్తేభ్యో7భయాసాచ భయంరిపుమ్. 38 బిభ్రతీ వికటాం జిహ్వాం సులోలాంయోజనాయతామ్ | శంఖచక్ర గదాపద్మ ఖడ్గ చర్మ ధనుః శరాన్. 39 ఖర్పరం వర్తులాకారం గంభీరం యోజనాయతమ్ | త్రిశూలం గనన స్పర్శి శక్తిం చ యోజనాయతామ్. 40 ముద్గరం ముసలం వజ్రం ఖేటం ఫలక ముజ్జ్వలమ్ | వైష్ణవాస్త్రం వారుణాస్త్రం వాహ్నేయం నాగపాశకమ్. 41 నారాయణాస్త్రం గాంధర్వం బ్రహ్మాస్త్రంగారుడం తథా | పర్జన్యాస్త్రం పాశుపతం జృంభణాస్త్రంచపార్వతమ్. 42 శంఖచూడుని నోట వెడలిన మాటలు దూత చెప్పగ శివుడు వినెను. అంతలో కుమారస్వామి శివుని సన్నిధి కేతెంచెను. అంతలోనే శ్రీ వీరభద్రుడు నంది మహాకాళుడు సుభద్రుడు విశాలాక్షుడు బాణుడు పింగళాక్షుడు వికంపనుడు విరూపుడు వికృతుడు మణిభద్రుడు బాష్కలుడు కపిలుడు దీర్ఘదంష్ట్రుడు వికటుడు తామ్రలోచనుడు; కాలకంఠుడు బల భద్రుడు కాలజిహ్వుడు కుటీచరుడు బలోన్మత్తుడు రణశ్లాఘి దుర్జయుడు దుర్గముడు అష్టభైరవులు ఏకాదశ రుద్రులు రౌద్రులు అష్ట వసువులు ద్వాదశాదిత్యులును అగ్ని చంద్రుడు విశ్వకర్మ అశ్వినులు కుబేరుడు యముడు జయంతుడు నల కూబరుడు వాయువు వరుణుడు బుధుడు కుజుడు ధర్ముడు శని ఈశానుడు కామదేవుడు బలి ఉగ్రదంష్ట్ర ఉగ్రదండ కోటర క్తెటభి అష్ట భుజ భద్ర కాళియును నేతెంచిరి. కాళి రత్నసార నిర్మితమైన విమానము పై రక్త వస్త్రములు రక్తమాల్యాను లేపనములు దాల్చి శోభిల్లుచుండెను. అభయంకరి యగుకాళీదేవి నవ్వుచు నర్తించుచు తియ్యగ గానము చేయుచు భక్తుల కభ యము నొసంగుచుండెను. ఆమె తన నాలుకను యోజన మంత పొడవుగ భయంకరముగ త్రిప్పుచు శంఖచక్రగదపద్మ ఖడ్గకవచ ధనుర్ బాణములను దాల్చి మహా భయంకరముగవెల్గుచుండెను. ఆమె చేతి డాలు గుండ్రముగ యోజనమంత వెడల్పున నున్నది. త్రిశూల మాకాశము తాకుచున్నది; శక్తియు యోజన మంత పొడవు గలదు. ముద్గరము ముసలము వజ్రము ఖేటము పలకవైష్ణవాస్త్రము వారుణాస్త్రము ఆగ్నేయాస్త్రము నాగపాశము-నారాయణ గాంధర్వ బ్రహ్మ గారుడ పర్జన్య పాశుపత జృంభణ పార్వతాస్త్రములును- మాహేశ్వరాస్త్రం వాయవ్యం దండంసంమోహనం తథా | అవ్యర్థమస్త్రకం దివ్యం దివ్యాస్త్రశతకం పరమ్. 43 ఆగత్య తత్ర తస్థౌ చ యోగినీనాం త్రికోటిభిః | సార్ధం చ డాకినీనాం చ వికటానాం త్రికోటిభిః. 44 భూతప్రేతపిశా చా శ్చ కూష్మాండా బ్రహ్మరాక్షసాః | బేతాళా రాక్షసా శ్చైవ యక్షాశ్చైవతు కిన్నరాః. 45 తాభిశ్చైవ స హ స్కందః ప్రణమ్య చంద్రశేఖరమ్ | పితుః పార్శ్వే సహాయార్ధం సమువాస తదాజ్ఞయా. 46 అథ దూతే గతే తత్ర శంఖ చూడః ప్రతాపవాన్ | ఉవాచ తులసీం వార్తాం గత్వాభ్యంతర మేవచ. 47 రణవార్తాం చ సాశ్రుత్వా శుష్క కంఠోష్ఠతాలుకా | ఉవాచ మధురం సాధ్వీ హృదయేన విదూయతా. 48 తులస్యువాచ: హే ప్రాణబంధో హేనాథ తిష్ఠ మేవక్షసి క్షణమ్| హే ప్రాణాధిష్ఠాతృదేవ రక్ష మే జీవితం క్షణమ్. 49 భుంక్ష్వ జన్మ సమాసాద్య యన్మే మనసి వాంఛితమ్| పశ్యామి త్వాం క్షణం కించిల్లోచనాభ్యాం చ సాదరమ్. 50 అందోల యంతే ప్రాణామే మనోదగ్ధం చ సంతతమ్| దుఃస్వప్నశ్చ మయా దృష్టశ్చాద్యైవ చరమే నిశి. 51 తులసీ వచనం శ్రుత్వా భుక్త్వా నృపేశ్వరః| ఉవాచ వచనం ప్రాజ్ఞో హితం సత్యం యథోచితమ్.52 శంఖచూడః: కాలేన యోజితం సర్వం కర్మభోగ నిబంధనమ్| శుభం హర్షః సుఖం దుఃఖం భయం శోకశ్చ మంగళమ్. 53 కాలే భవంతి వృక్షాశ్చ స్కంధవంత శ్చ కాలతః| క్రమేణ పుష్పవంత శ్చ ఫలవంత శ్చ కాలతః. 54 తేషాం ఫలాని పక్వాని ప్రభవంత్యేవ కాలతః| తే సర్వే ఫలితాః కాలే పాతం యాంతి చ కాలతః. 55 కాలే భవతి విశ్వాని కాలే నశ్యంతి సుందరి| కాలాత్ర్సష్టాచ సృజతి పాతా పాతి చ కాలతః. 56 మాహేశ్వర వాయవ్యాస్త్రములును దండము సమ్మోహనము అవ్యర్థము మున్నగు నూర్ల కొలది దివ్యాస్త్రములు గ్రహించి మూడుకోట్ల యోగినులతో మూడుకోట్ల భయంకర డాకినులతో కుమారు డచటి కేతెంచెను. అతని వెంట భూత ప్రేత పిశాచ కూష్మాండ బ్రహ్మరాక్షస బేతాళ రాక్షస యక్ష కిన్నరులును గలరు. కుమారస్వామి వీరందఱిని వెంటగొని వచ్చి శివునకు నమస్కరించి తండ్రి సహాయార్థ మతని యనుమతి కతనిచెంత కూరుచుండెను. ఇక దూత వెళ్ళిన తర్వాత ప్రతాపియగు శంఖచూడుడు తన యంతిపురములోని కేగి జరిగిన దంతయును తులసితో జెప్పెను. రణవార్త వినగనే తులసి పెదవులు కంఠము చెక్కిళ్లునువాడు బారెను. ఆమె కలగుండు పడిన యెడదతో తియ్యగ నిట్లనియెను. ఓ ప్రాణబంధూ! నాథా! నా హృదయములో క్షణ ముండుము. ఓ ప్రాణాధిష్ఠానదేవా! నా జీవితమును గాపాడుము. నామదిలోని తీరని కోర్కి యీ జన్మమందే తీర్పుము. అపుడు నిన్ను ప్రియమైన చల్లని చూపులతో చూతును. ఈరాతిరి తెల్లవారుజామున నొక పీడకల కంటిని. దానికి నా మనస్సు బాధ పడుచున్నది. ప్రాణములు పరితపించుచున్నవి. అను తులసి పలుకులువిని శంఖచూడుడు తనివార త్రాగి తిని హితవుగ నిజముగ తగినట్లుగ తెల్వితో నిట్లు పలికెను. శంఖచూడు డిట్లనెను: ఈ కర్మభోగము లన్నియును కాలముతో ముడిపడియున్నవి. శుభము హరుసము సుఖదుఃఖములు భయశోకములు మంగళము అన్నియును కాలమునందే కల్గును. చెట్లును కాలానసారముగనే పెరిగి పెద్దవై కొమ్మలు-పూలు-పండ్లు క్రమముగ గల్గియుండును. చెట్లపండ్లును కాలమువలననే పండును. ఆ పండ్లును కాలముచేతనే రాలిపడును. ఓ సుందరీ! ఈ విశ్వములు కాలమున బుట్టును కాలమున నశించును. బ్రహ్మకాలముప్రకారము సృజించును. విష్ణువును తన కాలము ప్రకారముగ పాలన సాగించును. సంహర్తా సంహరే త్కాలే క్రమేణ సంచరంతితే| బ్రహ్మ విష్ణుశివా దీనామీశ్వరః ప్రకృతిః పరా. 57 స్రష్టా పాతా చ సంహర్తా స చాత్మాకాల నర్తకః| కాలే స ఏవ ప్రకృతిం స్వాభిన్నాం స్వేచ్ఛయా ప్రభుః. 58 నిర్మాయ కృతవాన్ సర్వా న్విశ్వస్థాంశ్చ చరాచరాన్|సర్వేశః సర్వరూపశ్చ సర్వాత్మా పరమేశ్వరః. 59 జనం జనేన జనితా జనంపాతి జనేన యః| జనం జనేన హరతే తందేవం భజసాంప్రతమ్. 60 యస్యాజ్ఞయా వాతివాతః శీఘ్రగామీ చ సాంవ్రతమ్| యస్యాజ్ఞయా చతపన స్తపత్యేవ యథాక్షణమ్. 61 యథాక్షణం వర్షతీంద్రో మృత్యుశ్చరతి జంతుషు| యథాక్షణం దహత్యగ్నిశ్చంద్రో భ్రమతి శీతవాన్. 62 మృత్యోర్మృత్యుం కాలకాలం యమస్య చ యమం పరమ్| విభుం స్రష్టు శ్చ స్రష్టారం మాతుశ్చమాతృకంభ##వే. సంహర్తారంచ సంహర్తు స్తం దేవం శరణం వ్రజ| కోవాబంధుశ్చ కేషాం వా సర్వబంధుం భజప్రియే. 64 అహంకోవా చ త్వం కావా విధినాయోజితః పురా | త్వయాసార్ధం కర్మణా చ పునస్తేన వియోజితః. 65 అజ్ఞానీ కాతరః శోకే విపత్తౌ న చ పండితః| సుఖే దుఃఖే భ్రమత్యేవ కాలనేమి క్రమేణ చ. 66 నారాయణంతం సర్వేశం కాంతం యాస్యసినిశ్చితమ్ | తపః కృతం యదర్థే చ పురా బదరికాశ్రమే. 67 మయా త్వం తపసాలబ్ధా బ్రహ్మణస్తు వరేణ చ | హర్యర్థే యత్తవతపో హరిం ప్రాప్స్యసి కామినీ. 68 బృందావనే చ గోవిందం గోలోకే త్వం లభిష్యసి | అహం యాస్యామి తల్లోకం తనుంత్యక్త్వా చ దానవీమ్. 69 తత్ర ద్రక్ష్యసి మాం త్వంచ ద్రక్ష్యామి త్వాంచ సాంప్రతమ్ | ఆగమం రాధికాశాపా ద్బారతం చ సు దుర్లభమ్. సంహారకుడును తగిన కాలమును సర్వము నశింపజేయును. కనుక బ్రహ్మ విష్ణు శివులకు ప్రకృతి పరమేశ్వరి. ప్రకృతికి పరమేశ్వరుడు నభిన్నుడునగు బ్రహ్మము స్రష్ట పాలకుడు సంహర్త యగును. అతడు కాలము నావడించును. తగిన సమయమున నతడు స్వతంత్రముగ తనకు వేరుగాని ప్రకృతిలో సృష్టి చేయును. సర్వేశుడు సర్వరూపుడు సర్వాత్మయగు పరమేశ్వరుడు విశ్వములందలి చరాచరప్రాణి కోట్లను సృజించెను. ఈ జనమును జనముచే బుట్టించి జనముచేత పెంచి జనముచేత చంపునట్టి దేవు నిపుడు నీవు భజింపుము. ఎవని యాజ్ఞ మేరకు గాలి శీఘ్రముగ వీచునో సూర్యుడు ప్రతిక్షణమును ప్రకాశించుచుండునో ఇంద్రుడు తగిన సమయమున వర్షించునో మృత్యుదేవత కాలము వచ్చిన జంతువులను కబళించునో అగ్ని తగిన కాలమున మండునో చంద్రుడు చల్లని పండువెన్నెలలు విరజిమ్ముచు తిరుగుచుండునో అటి మృత్యుమృత్యువు కాలకాలుడు యమయముడు స్రష్టృ స్రష్ట రక్షక రక్షకుడు సంహర్తకు సంహర్త సర్వబంధుడు ఆకాశశరీరుడు నగు దేవుని శరణు వేడుము. ఓ ప్రేయసీ ! అతనిని భజింపుము. అతనిని మించిన బంధువు నీ కింకెవడు గలడు? నీ వెవరవు? మన మిర్వురమును మునుపు విధిచేత కర్మచేత కలిసికొంటిమి. మరల నదే కర్మవలన విడిపోవుదుము. మూఢుడు కష్టకాలమున శోకము జెందును. దిగులొందును. కాని పండితు డట్లు బాధపడడు. కాలచక్రమున కనుగుణముగ వరుసగ సుఖదుఃఖములు గలుగుచుండును. పూర్వము నీవు బదరి కాశ్రమమందున సర్వేశుడు కాంతుడునగు నారాయణుని గుఱించి తపము చేసితివి. నేనును బ్రహ్మకు తపించి యతని వరమున నిన్ను పొందితిని. ఓ కామినీ! నీవు హరికొఱకు తపము చేసితివి. హరిని జేరగలవు. బృందావన గోవిందుని నీవు గోలోక మేగి పొందగలవు. నేను నీ దానవ శరీరము వదిలిపెట్టి గోలోకము చేరగలను. అచట నేను నిన్ను నీవు నన్ను ఇర్వురము చూచుకొందుము. నేనీ రాధికాశాప మున దేవదుర్లభ##మైన భారతమునకు వచ్చితిని. పునర్యాస్యామి తత్రైవ కః శోకోమే శృణుప్రియే | త్వం చ దేహం పరిత్యజ్య దివ్యంరూపం విధాయ చ. 71 తత్కాలం ప్రాప్స్యసి హరిం మా కాంతే కాతరా భవ | ఇత్యుక్త్వా చ దినాంతే చ తయాసార్ధం మనోహరమ్. 72 సుష్వాప శోభ##నే తల్పే పుష్పచందన చర్చితే | నానాప్రకార విభవం చకార రత్నమందిరే. 73 రత్నప్రదీపసంయుక్తే స్త్రీరత్నం ప్రాప్యసుందరీమ్ | నినాయ రజనీం రాజా క్రీడాకౌతుక మంగళైః. 74 కృత్వా వక్షసి తాం కాంతాంరుదతీ మతి దుఃఖితామ్ | కృశోదరీం నిరాహారాం విమగ్నాం శోకసాగరే. 75 పునస్తాం బోధయామాస దివ్యజ్ఞానేన జ్ఞానవిత్ | పురాకృష్ణేన యద్దత్తం భాండీరేతత్త్వముత్తమమ్. 76 స చ తసై#్య దదౌ సర్వం సర్వశోకహరం పరమ్ | జ్ఞానం సంప్రాప్యసాదేవీ ప్రసన్నవదనేక్షణా. 77 క్రీడాం చకార హర్షేణ సర్వం మత్వేతి నశ్వరమ్ | తౌ దంపతీ చ క్రీడంతౌ నిమగ్నౌ సుఖసాగరే. 78 పులకాంచిత సర్వాంగౌ మూర్ఛి తౌ నిర్జనే మునే | అంగప్రత్యంగ సంయుక్తౌ సుప్రీతౌ సురతోత్సుకౌ. 79 ఏకాంగౌ చ తథా తౌ ద్వౌ చార్ధనారీశ్వరో యథా | ప్రాణశ్వరం చ తులసి మేనే ప్రాణాధికం పరమ్. 80 ప్రాణాధికాం చ తాంమేనే రాజా ప్రాణశ్వరీం సతీమ్ | తౌ స్థితౌ సుఖసుప్తౌ చ తంద్రితౌ సుందరౌ సమౌ. 81 సువేషౌ సుఖసంభోగా దచేష్టౌ సుమనోహరౌ | క్షణం సుచేతనౌ తౌ చ తంద్రితౌ సుందరౌ సమౌ. 82 కథాం మనోరమాం దివ్యాం హసంతౌ చ క్షణం పునః | క్షణం చ కేళీసంయుక్తౌ రసభావసమన్వితౌ. 83 సురతే విరతి ర్నాస్తి తౌ తద్విషయపండితౌ | సతతం జయ యుక్తౌ ద్వౌక్షణం నైవపరాజితౌ. 84 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే నారదనారాయణ సంవాదే శక్తి ప్రాదుర్బావే వింశో7ధ్యాయః. ఓ ప్రియా! నేను మరల వచ్చినచోటి కేగగలను. దీని కింతగ విచార మేల? నా మాట విను. నీవును నీ దేహము చాలించి దివ్యరూపము దాల్తువు. ఓ కాంతా! నీకు హరినిగాంచు కాలము సమీపించినది. వగవకుము. అను నంతలో సాయంకాల మయ్యెను. అత డామెతో సుఖించెను. అతడు పుష్పచందనములు గుబాళించునట్టి శోభనతల్పమున తులసి గూడి యుండెను. అతని శయన మందిరము రత్నమందిరము నానా విభవములకు నిలయము. రత్నదీపములందు వెల్గుచుండెను. అత డప్పు డందాలు చిందెడు మమతలు తెలిసిన రతనాల మగువను వయసు పరుగులలో నానందసంగమమున రాత్రియంతయు తేల్చెను. శోకసాగరమున మునిగి నిరాహారయై యున్న తులసి నతడు తన హృదయమునకు హత్తుకొనెను. జ్ఞాన వంతుడగు శంఖచూడుడు దివ్యజ్ఞానము బోధించి యామెకు తెలివి గలిగించెను. మున్ను భాండీర ప్రాంతమునందు కృష్ణుడు తనకు పదేశించి జ్ఞానమును బోధించెను. అట్టి జ్ఞానము సర్వశోకహరము. అతడు దాని నామెకు కలిగించెను. జ్ఞానము పొంది తులసియును ప్రసన్నవదన యయ్యెను. అపు డామె సర్వము నశ్వరమని గుర్తించి హర్షము నిండార నతనితో సుఖించెను. అపు డా యిర్వురు నానందసాగరపు టంచులు చూరగొనిరి. వారి హృదయాలు పుల్కరించెను. ఆ యేకాంతమున వారు వలపు మూర్ఛలో మునిగిరి. సుర తోత్సాహమున వారి యొకరి యవయవము లింకొకరి యవయవాలతో కమ్మకమ్మగ తగులుకొనెను. అర్ధనారీశ్వరునివలె వారిర్వురు నొకరైరి. అపుడు తులసి తన ప్రాణపతిని ప్రాణములకన్న మిన్నగ భావించెను. వారిర్వురు నందముగ సుఖముగ నానందించిరి. వారు మంచి వేషములు ధరించి యందముగ నుండిరి. వారుసుఖ సంభోగమున కొంత తడవు నిశ్చేష్టులుగ మఱికొంతసేపు చేతనులై రసగాథలు చెప్పుకొనుచు రాత్రి గడిపిరి. వారు మనోహారమైన కథలతో నవ్వులతో రసభావబంధములతో ముసరిన మోహములతో నొకరి గుండెలో నొకరు చొచ్చుకొని రతికేళి జరిపిరి. వారు రసకోవిధులు; కామకళావిధులు; వారి రతికి విశ్రాంతి లేకుండ సాగెను. ఇర్వురు గెలిచిరి. ఇర్వురు నోడిరి. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమునందు నారద నారాయణ సంవాదమున శక్తి ప్రాదుర్బావమను నిరువదవ యధ్యాయము.