Sri Devi Bagavatham-2    Chapters   

అథ పంచ వింశోధ్యాయః.

నారద ఉవాచ : తులసీ చ యదాపూజ్యా కృతా నారాయణ ప్రియా | అస్యాః పూజా విధానం చ స్తోత్రం చ వద సాంప్రతమ్‌. 1

కేన పూజా కృతా కేన స్తుతా ప్రథమతో మునే | తత్ర పజ్యా సా బభూవ కేన వా వద మామహో. 2

నారదస్య వచః శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః |

కథాం కథితు మారేభే పుణ్యాం పాపహరాంపరామ్‌. 3

హరిః సంపూజ్య తులసీం రేమే చ రమయాసహ | రమాసమాన సౌభాగ్యం చకార గౌరవేణ చ. 4

సే హే చ లక్ష్మీ ర్గంగా చ తస్యాశ్చ నవసంగమమ్‌ | సౌభాగ్య గౌరవం కోపా త్తేన సేహే సరస్వతీ. 5

సాతాం జఘాన కలహే మానినీ హరిసన్ని ధౌ | వ్రీడయా చావమానేన సాంతర్దానం చకార హ. 6

సర్వ సిద్ధేశ్వరీ దేవీ జ్ఞానినాం సిద్ధియోగినీ | జగామా దర్శనం కోపాత్సర్వత్ర చ హరేరహో. 7

హరి ర్న దృష్ట్వా తులసీం బోధయిత్వా సరస్వతీమ్‌ | తదనుజ్ఞాం గృహీత్వా చ జగామ తులసీ వనమ్‌. 8

తత్ర గత్వా చ సుస్నాతో హరిః స తులసీం సతీమ్‌ | పూజయామాస తాం ధ్యాత్వా స్తోత్రం భక్త్యా చకారహ. 9

లక్ష్మీ మాయాకామ వాణీబీజ పూర్వం దశాక్షరమ్‌ | బృందావనీతి జేంతం చ వహ్ని జాయాంతమేవ చ. 10

అనేన కల్పతరుణా మంత్ర రాజేన నారద | పూజయే ద్యోవిధానేన సర్వసిద్ధిం లభేద్ద్రువమ్‌. 11

ఘృతదీపేన ధూపేన సిందూర చందనేన చ | నైవేద్యేన చ పుష్పేణ చోప చారేణ నారద. 12

హరిస్తోత్రేణ తుష్టాసా చావిర్బూతా మహీరుహాత్‌ | ప్రసన్నా చరణాం భోజే జగామ శరణం శుభా. 13

వరం తసై#్య దదౌ విష్ణుః సర్వ పూజ్యా భ##వేరితి | అహం త్వాం ధారయిష్యామి సురూపాం మూర్ద్నివక్షసి. 14

ఇరువదియైదవ అధ్యాయము

తులస్యుపాఖ్యానము

నారదు డిట్లనియెను : ప్రభూ! నారాయణప్రియ యగు తులసి పూజనీయురాలయ్యెను. కనుక నిపుడు తులసి పూజా విధానమును స్తోత్రమును తెలుపుము. మహత్మా! మొట్టమొదట తులసి నెవరు పూజించిరి ? ఎవరు నుతించిరి? ఆమె యెవరి చేత పూజ్యురాలయ్యెనో తెల్పుము. సూతు డిట్లనెను : నారదుని మాటలు విని నారాయణుడు నవ్వి పాపహారము పుణ్య ప్రదము నైన తులసీదేవి కథ నిట్లు చెప్పదొడంగెను. హరి తులసిని పూజించి లక్ష్మితో సుఖముగ నుండెను. తులసిని హరి లక్ష్మీ సమానురాలినగ సౌభాగ్యవతినిగ జేసెను. శ్రీహరి తులసితో సంగమించి యామెకు సౌభాగ్య సంపద లిచ్చుట జూచి గంగా లక్ష్ములు సహించిరి. కాని సరస్వతి యోర్వలేకపోయెను. సరస్వతి హరి చూచుచుండగనే తులసితో జగడమాడి యమెను కొట్టెను. అంత తులసి సిగ్గుతో నవమానముతో మాయమయ్యెను. సర్వసిద్దేశ్వరి జ్ఞానులలో సిద్ధయోగిని యగు తులసి హరికి గూడ కనిపించక మాయమయ్యెను. తులసి కనిపించనందున హరి సరస్వతికి నచ్చచెప్పి యామె యనుమతి బొంది పిదప తులసీ వనమున కరిగెను. అచట శ్రీహరి స్నానము చేసి తులసీ సతిని భక్తితో ధ్యానించి పూజించి సంస్తుతించెను. శ్రీ-మాయా-మన్మథ-వాగ్‌ బీజములును బృందావని పదమునకు చతుర్థీ విభక్తి యునుచేర్చి స్వాహా పదమును చివర నుంచిన ''ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా'' యగును. ఇది దశాక్షర మంత్రము. ఇతి కల్పతరువు వంటిది. ఈ మంత్ర రాజముతో విధి ప్రకారముగ తులసిని పూజించినవాడు తప్పకసకల సిద్దులు పడయగలడు. నారదా ! నేతి దీపము ధూపము-సిందూర చందనములు-పూలు-నైవేద్యము-వీటితో తులసికి షోడశోపచార పూజలు చేయవలయును. ఇట్లుపూజించి హరిసంస్తుతించగ తులసి ప్రసన్నయై సంతుష్ట చిత్తయై వృక్షము నుండి యావిర్బవించి హరిచరణకమలములు శరణువేడెను. అపుడు విష్ణువు తులసితో నిట్లనెను: ''నీవు సర్వ పూజ్యురాలవగుదువు; నిన్ను నా తల మీదను వక్ష మందును ధరింతును.

సర్వే త్వాం ధార యిష్యంతి స్వమూర్ద్ని చ సురాదయః |

ఇత్యుక్త్వా తాం గృహీత్వా చ ప్రయ¸° స్వాలయం విభుః. 15

నారదః : కిం ధ్యానం స్తవనం కిం వా కిం వా పూజా విధానకమ్‌ |

తులస్యా శ్చ మహాభాగ తన్మేవ్యాఖ్యాతు మర్హసి. 16

నారాయణః : అత్హరితాయాం తస్యాం చ హరిర్‌ బృందావనే తదా |

తస్యాశ్చక్రే స్తుతిం గత్వా తులసీం విరహాతురః. 17

శ్రీభగవానువాచ : బృందారూపాశ్చ వృక్షాశ్చ యదైకృత్ర భవంతి చ |

విదుర్బుధాస్తేన బృందాం మత్ర్పియాంతాం భజామ్యహమ్‌. 18

పురా బభూవయా దేవీ త్వాదౌ బృందావనే వనే | తేన బృందావనీఖ్యాతా సౌభాగ్యాంతాం భజామ్యహమ్‌. 19

అసంఖ్యేషు చ విశ్వేషు పూజితా యానిరంతరమ్‌ | తేన విశ్వపూజితాఖ్యా పూజితాం చ భజామ్యహమ్‌. 20

అసంఖ్యాని చ విశ్వాని పవిత్రాణి త్వయా సదా | తాం విశ్వపావనీం దేవీం విరహేణ స్మరామ్యహమ్‌. 21

దేవా నతుష్టాః పుష్పాణాం సమూహేనయయా వినా | తాం పుష్పసారాం శుద్ధాం చ ద్రష్టుమిచ్చామిశోకతిః. 22

విశ్వే యత్ర్పాప్తి మాత్రేణ భక్తానందో భ##వేద్ద్రువమ్‌ | నందినీ తేన విఖ్యాతా సాప్రీతా భవతాదిహ. 23

యస్యా దేవ్యా సులానాస్తి విశ్వేషు నిఖిలేషు చ | తులసీ తేన విఖ్యాతా తాం యామి శరణం ప్రియామ్‌. 24

కృష్ణ జీవనరూపా సా శశ్వ త్ర్పియతమా సతీ | తేన కృష్నజీవనీ సా సా మే రక్షతు జీవనమ్‌. 25

ఇత్యేవం స్తవనం కృత్వా తస్థౌ తత్ర రమాపతిః | దదర్శ తులసీంసాక్షాత్పాద పద్మ నతాం సతీమ్‌. 26

రుదతీ మవ మానేవ మానినీం మాన పూజితామ్‌ | ప్రియాం దృష్ట్వా ప్రియః శీఘ్రం వాసయామాస వక్షసి. 27

భారత్యాజ్ఞాం గృహీత్వా చ స్వాలయం చ య¸°హరిః | భారత్యా సహ తత్ర్పీతిం కారయామాస సత్వరమ్‌. 28

సురాదు లెల్లరును నిన్ను తలదాల్తురు. అని వర మిచ్చి హరి తులసిని వెంటగొని తన దివ్యధామమున కేగెను. నారదు డిట్లనియెను : ఓయి మహాశయా ! శ్రీ తులసీదేవి యోక్కస్తోత్రము పూజా విధానమును నాకు తెలియజెప్పుము. నారాయణు డిట్లనియెను : తులసి యంతర్దానము నొందగ హరి బృందావని కేగి విరహాతురుడై యామె నిట్లని సంస్తుతించెను. శ్రీ భగవాను డిట్లనియెను: బృందయనెడు వృక్షము లన్నియును చేరి యొకటియైన చోటును బృందావనమని బుధులందురు. అట్టి నా ప్రియురాలగు బృందను గొల్తును. ఏ దేవి తొల్త బృందావనిలో నవతరించుటనే బృందావనియని ప్రసిద్ధి జెందెనో యా సౌభాగ్యవతిని సేవింతును. ఏ దేవి వలన విశ్వము లన్నియును పవిత్రము లయ్యెనో యా విశ్వపావనిని భజింతును. ఈ యనంత విశ్వములు నీ వలన పవిత్రములైనవి. అట్టి విశ్వపావనివగు విరహముతో స్మరించుచున్నాను. ఎన్ని పుష్ప ములున్నను తులసి పత్రము లేక దేవతలు సంతుష్టి జెందరు. అట్టి శుద్దము-పుష్పసారమునగు తులసిని శోకాతురుడనగునేను చూడదలచుచున్నాను. ఏ తులసిని గాంచినంతనే భక్తుల కానందను గల్గుచుండునో యట్టి నందిని యనబరగిన తులసి నా యెడల ప్రసన్నయగుగాక ! ఈ రేడు లోకాలలో తన కెవరు నీడు లేనందున నే దేవీ తులసియను పేరున ప్రసిద్ధి గాంచెనో యట్టి తులసిని శరణుచొచ్చుచున్నాను. శ్రీకృష్ణునకు జీవనము వంటిదియు ప్రియమైన నిచ్చెలియు అగునట్టి కృష్ణజీవని నా జీవితమును బ్రోచుగాక! అని శ్రీహరి తులసిని సంస్తుతించి నంతనే తులసి హరి చరణ కమలములపై బడి దర్శన మొసంగెను. మాన్య-పూజ్య యగు తులసి యవమానమున మ్రగ్గుచుండగ నట్టి మానినీ ప్రియమగు తులసిని హరి తన పక్షమున నుంచుకొనెను. హరి సత్వరమే తులసీ సరస్వతులను చేయి చేయి కలిపించి సరస్వతి యనుమతితో శ్రీహరి తన మంది రమునకేగెను.

వరం విష్ణుర్దదౌ తసై#్య సర్వ పూజ్యాభ##వేరితి | శిరోధార్యా చ సర్వేషాం వంద్యామాన్యా మమేతి చ. 29

విష్ణోర్వరేణసా దేవీ పరితుస్టా బభూవ చ | సరస్వతీ తామాకృష్య వాసయామాస సన్నిధౌ. 30

లక్ష్మీ ర్గంగా సస్మితా చ తాం సమాకృష్య నారద | గృహం ప్రవేశయామాస వినయేన సతీం సదా. 31

బృందా బృందావనీ విశ్వ పూజితా విశ్వపావనీ | పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ. 32

ఏతన్నా మాష్టకం చైవ స్తోత్రం నామార్థ సంయుతమ్‌ |

యఃపఠేత్తాం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్‌. 33

కార్తిక్యా పూర్ణిమాయాం చ తులస్యా జన్మ మంగళమ్‌ | తత్ర తస్యా శ్చ పూజా చ విహితా హరిణాపురా. 34

తస్యాం యః పూజయేత్తాం చ భక్త్యాచ విశ్వపావనీమ్‌ | సర్వ పాపా ద్వినిర్ముక్తో విష్ణులోకం స గచ్చతి. 35

కార్తికే తులసీ పత్రం యో దవాతి చ వైష్ణవే | గవామయుత దానస్య ఫలం ప్రాప్నోతి నిశ్చితమ్‌. 36

అపుత్రో లభ##తే పుత్రం ప్రియా హీనోలభే త్ర్పియామ్‌ | బంధుహీనో లభే ద్బంధూన్‌ స్తోత్ర శ్రవణ మాత్రతః. 37

రోగీ ప్రముచ్యేతరోగాద్బద్దో ముచ్యేత బంధనాత్‌ | భయాన్ముచ్యేత భీతస్తు పాపాన్ముచ్యేత పాతకీ. 38

ఇత్యేవం కథితం స్తోత్రం ధ్యానం పూజా విధింశృణు | త్వమేవ వేదే జానాసి కణ్వశఆఖోక్త మేవచ. 39

తద్వృక్షే పూజయేత్తాం చ భక్త్యా చావాహనం వినా | తాం ధ్యాత్వా చోపచారేణ ధ్యానం పాతక నాశకమ్‌. 40

తులసీం పుష్పసారాం చ సతీం పూతాం మనోహరామ్‌ | కృత పాపేధ్మదాహాయ జ్వల దగ్ని శిఖోపమామ్‌. 41

పుష్పేషు తులనా యస్యానాస్తి వేదేషు భాషితమ్‌ | పవిత్రరూపా సర్వాసు తులసీ సా చ కీర్తితా. 42

శిరోధార్యా చ సర్వేషా మీప్సితా విశ్వపావనీ | జీవన్ముక్తాం ముక్తిదాం చ భ##జే తాం హరిభక్తిదామ్‌. 43

ఇతి ధ్యాత్వా చ సంపూజ్య స్తుత్వా చ ప్రణమే త్సుధీః | ఉక్తం తులస్యు పాఖ్యానం కిం భూయః శ్రోతుమాచ్చసి. 44

ఇది శ్రీవేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే పంచవింశోధ్యాయః

తులసి యెల్లరికి తలదాల్చదగినది; మాన్య; పూజ్య; యని విష్ణు వామెకు దివ్యవరము లోసంగెను. ఆమె విష్ణు పరమునకు తుష్టి జెందెను. అపుడు సరస్వతియే స్వయముగ తులసిని హరి ప్రక్కను కూర్చుండబెట్టెను. లక్ష్మీ గంగలును దాని కెంతయో సంతసించి సవినయముగ తులసి నింటి లోనికి ప్రవేశ##పెట్టిరి. బృంద-బృందావని-విశ్వపూజిత-విశ్వపావని-పుష్పసార-నందిని-తులసి-కృష్ణజీవని అను తులసీ నామాష్టకము నర్థవంతముగ చదివి పూజించువా డాశ్వమేధ ఫలితము బొందును. కార్తిక శుద్ధపూర్ణిమ తులసి జన్మదినము. అనాడు శ్రీ తులసి పూజ యథావిధిగ చేయవలయునని హరి విధించెను. నిర్మల భక్తితో విశ్వపావని యగు తులసిని పూజించిన వారు సకల పాపముక్తులై విష్ణులోకము జేరగలరు. కార్తికమున వైష్ణవునకు తులసీ పత్రము దాన మిచ్చినవాడు పది వేల గోదానములు ఫలితము బడయగలడు. ఈ తులసీ స్తోత్రమును విన్న మాత్రాన పుత్రులు లేనివాడు పుత్రులను భార్య లేనివాడు భార్యను బందుగులు లేనివాడు బంధువులను బడయగలడు. రోగి రోగము నుండి బద్దుడు బంధనము నుండి భీతుడు భయము నుండి పాతకి పాతకము నుండియు ముక్తుడగును. ఇట్లు తులసీస్తోత్రము చెప్పబడెను. ఇక తులసీ ధ్యానమును పూజా విధానమును వినుము. ఇది వేద మందలి కణ్వ శాఖలో చెప్ప బడినది. నీకును వేదమున తెలియును. అవాహనము లేకున్నను తులసివృక్షమును పరభక్తితో పూజింపవచ్చును. ఆమెను షోడశోపచారములతో పూజించి ధ్యానించిన సర్వ పాతకములును తొలగును. తులసి పుష్పసార-సతి-పూత-మరోహర-పాపము లనెడు కట్టోలను గాల్చు నగ్ని శఖ వంటిది. ఏ పుప్పమును తులసీ దళమునకు సాటిరాదని వేదము లందుండుట వలన తులసి సర్వ పవిత్ర యని వాసిగాంచెను. తులసి యెల్లరికిని తలదాల్చదగినది. విశ్వపావని సర్వపూజ్య; జీవన్ముక్త ముక్తిదాయిని-హరిభక్తి ప్రదాయిని యగు తులసిని భజింతును. అని ఈ రీతిగ తులసిని ధ్యానించి పూజించి స్తుతించి నమ స్కరించవలయును. ఇట్లు తులసి చరిత్ర తెల్పితిని. ఇంకేమి వినతలతువు.

ఇది శ్రీదేవీ భాగవత మహా పురాణ మందలి నవమ స్కంధమున ఇరువదియైదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters