Sri Devi Bagavatham-2
Chapters
అథ నవమో೭ధ్యాయః వ్యాసః కదా చి దష్టకా శ్రాద్ధే వికుక్షిం పృథివీపతిః | ఆజ్ఞాపయ దసమ్మూఢో మాంసమానయ సత్వరమ్. 1 మేధ్యం శ్రాద్దార్థ మధునా వనే గత్వా సుతాదరాత్ | ఇత్యుక్తో೭సౌ తథే త్యాశు జగామ వన మస్త్రభృత్.
2 గత్వా జఘాన బాణౖః స వరాహా న్సూకరాన్మృగాన్ | శశాం శ్చాపి పరిశ్రాంతో బభూవా೭థ బబుక్షితః. 3 విస్మృతా చాష్టకా తస్య శశంచా೭దదసౌ వనే | శేషం నివేదయామాస పిత్రే మాంస మనుత్తమమ్. 4 ప్రోక్షణాయ సమానీతం మాంసం దృష్ట్వా గురు స్తదా | అనర్హ మితి తద్ జ్ఞాత్వా చుకోవ మునిసత్తమః. 5 భుక్తశేషం తు న శ్రాద్ధే ప్రోక్షణీయ మితి స్థితిః | రాజ్ఞే నివేదయామాస వసిష్ఠః పాకదూషణమ్. 6 పుత్రస్య కర్మ తద్‌జ్ఞాత్వా భూపతి ర్గురుణోదితమ్ | చుకోప విధిలోపాత్తం దేశాన్నిః సారయ త్తతః. 7 శశాద ఇతి విఖ్యాతో నామ్నాజాతో నృపాత్మజః | గతో వనే శశాద స్తు పితృకోపా దసంభ్రమః. 8 వన్యేన వర్తయ న్కాలం నీతవా న్దర్మతత్పరః | పితర్యుపరతే రాజ్యం ప్రాప్తం తేన మహాత్మనా. 9 శశాద స్త్వకరో ద్రాజ్య మయోధ్యాయాః పతిఃస్వయమ్ | యజ్ఞా ననేకశః పూర్ణాం శ్చకార సరయూతటే. 10 శశాద స్యాభవ త్పుత్రః కకుత్థ్స ఇతి విశ్రుతః | తసై#్యవ నామభేదా ద్వై ఇంద్రవాహః పురంజయః. 11 జనమేజయః నామభేదః కథం జాతో రాజపుత్రస్య చానఘ | కారణం బ్రూహి మేస్వరం కర్మణాయేనచాభవత్. 12 తొమ్మిదవ అధ్యాయము సూర్య వంశ రాజ వృత్తాంతము రాజా! ఒకానొకప్పు డష్టక శ్రాద్ధము జరుపుటకు వికుక్షిని ఇక్ష్వాకుడు మాంసము తెమ్మని యాజ్ఞాపించెను. కుమారా! నీ విపు డడవికేగి శ్రాద్దమునకు సాదరముగ మాంసము తెమ్మని ఇక్ష్వాకు డనగా వికుక్షి యట్లే యని యస్త్రము దాల్చి యడవి కేగెను. అతడు తన బాణములతో పందులను జింకలను కుందేళ్లను వేటాడి యాడి యలసిసొలసి యాకలి గొనెను. అత డాకలిమంటచే అష్టకశ్రాద్ధము మాట మఱచి యడవిలో కుందేటి మాంసముతిని మిగిలిన చెడిన మాంసమును తండ్రి కిచ్చెను. దానిని ప్రోక్షించుటకు తెచ్చినపుడు గురుడు చూచి యీ మాంసము పనికిరాదని గ్రహించి కోపించెను. ఈ మాంసము భుక్తశేషము; ప్రోక్షింపదగదు; దీనివలన శ్రాద్ధ పాకమంతయును చెడునని వసిష్ఠుడు రాజునకు తెలిపెను. రాజు తనగురుని మాటలువిని తన కొడుకు విధిలోపమున కర్మలోప మొనరించినందులకు కోపించి యతనిని దేశ బహిష్కృతుని చేసెను. శశమాంసము దినుటవలన నతడు శశాదుడన బరగెను. అతడు తన తండ్రి కోపమునకు గురియై కాఱడవులందు ద్రిమ్మరియై తిరుగుచుండెను. అతడు ఫలమూలములు దినుచు ధర్మతత్పరుడై కాలము గడపెను. కొంతకాలమునకు తన తండ్రి మరణించుటవిని వచ్చి రాజ్యము స్వీకరించెను. శశాదు డయోధ్యాపతియై రాజ్యము చేసెను. అతడు సరయూనదీతీర మున పెక్కు యజ్ఞములు పూర్ణముగ గావించెను. శశాదునకు కుకుత్థ్సుడను కొడుకు గల్గెను. అత డింద్రదాహుడు పురంజయు డను పేర్లతో విఖ్యాతి గాంచెను. జనమేజయు డిట్లనెనుః ఆ రాకుమారునకిన్ని పేరు లేయే కారణములవలన నేయే కర్మల వలన గలిగెనో నాకు వివరించి దెలుపుము. అనగా- వ్యాసః శశాదే స్వర్గతే రాజా కుకుత్థ్స ఇతి చాభవత్ ''రాజ్యం చకార ధర్మజ్ఞః పితృపైతామహం బలాత్'' ఏతస్మిన్నంతరే దేవా దైత్వైః సర్వే పరాజితాః. 13 జగ్ము స్త్రిలోకాధిపతిం విష్ణుం శరణ మవ్యయమ్ | తాన్ ప్రోవాచ మహావిష్ణు స్తదాదేవా న్సనాతనః. 14 పార్షిగ్రాహం మహీపాలం ప్రార్థయంతు శశాదజమ్ | సహనిష్యతివైదైత్యాన్సం గ్రామేసురసత్తమాః. 15 ఆగమిష్యతి ధర్మాత్మా సాహాయ్యార్థం ధనుర్ధర | పరాశ##క్తేః ప్రసాదేన సామర్థ్యం తస్య చాతులమ్. 16 హరేః సువచనా ద్దేవా యయుః సర్వే సవాసవాః | అయోధ్యాయాం మహారాజ శశాదతనయం ప్రతి. 17 తా నాగతా న్సురా నాజా పూజయామాస ధర్మతః | పప్రచ్ఛాగమనే రాజా ప్రయోజన మతంద్రితః. 18 రాజోవాచ : ధన్యో೭హం పావిత శ్చా೭స్మి జీవితం సఫలం మమ | యదాగత్య గృహే దేవా దదుశ్చ దర్శనం మహత్. 19 బ్రువంతు కృత్యం దేవేశా దుఃసాధ్య మపిమానవైః | కరిష్యామి మహత్కార్యం సర్వథా భవతాం మహత్. 20 దేవోవాచః : సాహాయ్యం కురు రాజేంద్ర సఖా భవ శచీపతేః | సంగ్రామేజయదైత్యేం ద్రాన్దుర్జేయాం స్త్రీదశైరపి. పరాశక్తి ప్రసాదేన దుర్లభం నాస్తితే క్వచిత్ | విష్ణునా ప్రేరితాశ్చైవ మాగతా స్తవ సన్నిధౌ. 22 వ్యాసు డిట్లనెను : శశాదుడు స్వర్గము జేరగా కుకుత్థ్సుడు రాజై ధర్మముతో తన తండ్రితాతల రాజ్య మనుభవించెను. ఆ సమయమున దేవతలు దానవుల చేతులం దోడిపోయిరి. అంత దేవతలు త్రిలోకాధిపతియు-అవ్యయుడు-నగు విష్ణుని శరణువేడగ మహావిష్ణువు దేవతల కిట్లనెను : అమరవరులారా! మీరు కుకుత్థ్సుని పార్శ్యరక్షకునిగ నుండుమనుడు. అతడు యుద్దమందు దానవులను చంపగలడు. అతడు ధర్మాత్ముడు. అతడు విల్లునములు దాల్చి మీకు సాయము రాగలడు. శ్రీపరా శక్తి దయవలన నతని కమితశక్తి గలదు. మహారాజా! అపుడింద్రాది దేవత లెల్లరును హరిమాట ప్రకార మయోధ్యకుజని కుకుత్థ్సుని గాంచిరి. ఆ వచ్చిన దేవతల నెల్లరిని రాజు ధర్మమతితో వారి రాకకు కారణ మడిగెను. నేను కడు ధన్యుడను. నేను నేడు పవిత్రుడనైతిని. నా జీవితము సాఫల్యము జెందెను. దేవతలు నాయింటి కేతెంచి నాకు దర్శనభాగ్య మిచ్చినారు. దేవేశులారా! మీ వచ్చిన పని తెలుపుడు. అదెంతటి దుస్సాధ్యమైనదైనను మీ మహాకార్యము చేయగలను. ఆన దేవత లిట్లనిరి:, రాజేంద్రా: నీ సహాయసంపదనిమ్ము. ఇంద్రునకు మిత్రుడవు గమ్ము. యుద్దమున ధుర్జయులగు దానవులను జయింపుము. శ్రీపరాశక్తి యనుగ్రహమున నీకు దుర్లభ##మైన దేదియును లేదు. మేము విష్ణుప్రేరితులమై నీ సన్నిధికి వచ్చి తిమి. అన- రాజోవాచ: పార్షిగ్రాహో భవామ్యద్య దేవానాం సురసత్తమాః | ఇంద్రో మే వాహనం తత్ర భ##వేద్యదిసురాధిపః. సంగ్రామం తు కరిష్యామి దైత్యై ర్దేవకృతే೭ధునా | ఆరుహ్యేంద్రం గమిష్యామి సత్యమేతద్ర్బవీమ్యహమ్. 24 తదో చు ర్వాసవం దేవాః కర్తవ్యం కార్యమద్బుతమ్ | పత్రం భవ నరేంద్రస్య త్యక్త్వా లజ్జాం శచీపతే. 25 లజ్జమాన స్తదా శక్రః ప్రేరితో హరిణా భృశమ్ | బభూవ వృషభ స్తూర్ణం రుద్రస్యేవా పరో మహాన్. 26 తమారురోహ రాజా೭సౌ సంగ్రామగమనాయవై | స్థితః కకుది యేనా೭స్య కకుత్థ్స స్తేనచాభవత్. 27 ఇంద్రో వాహం కృతో యేన తేన నామ్నేం ద్రవాహకః | పురం జితంతు దైత్యానాం తేనా೭భూచ్చపురంజయః. జిత్వా దైత్వా న్మహాబాహు ర్దనంతేషాం ప్రదత్తవాన్ | పప్రచ్ఛ చైవం రాజర్షే రితి సఖ్యం బభూవ హ. 29 కుకుత్థ్స శ్చా೭తి విఖ్యాతో నృపతి స్తస్య వంశజాః | కాకుత్థ్సా భువి రాజానో బభూవు ర్బహు విశ్రుతాః. 30 కుకుత్థ్స స్యా೭భువ త్పుత్రో ధర్మపత్న్యాం మహాబల | అనేనా విశ్రుత స్తస్య పృథుః పుత్రశ్చ వీర్యవాన్. 31 విష్ణో రంశ : స్మృతః సాక్షా త్పరా శక్తిపదార్చకః | విశ్వరంధి స్తు విజ్ఞేయః పృథోః పుత్రో నరాధిపః. 32 చంద్ర స్తస్య సుతః శ్రీమా న్రాజా వంశకరః స్మృతః | తత్సుతో యువనాశ్వ స్తు తేజస్వీ బలవత్తరః. 33 శావంతో యువనాశ్వస్య జజ్ఞే పరమ ధార్మికః | శావంతీ నిర్మితా తేన పురీ శక్రపురీసమా. 34 బృహదశ్వ స్తు పుత్రో೭భూ చ్ఛావంతస్య మహాత్మనః | కువలయాశ్వః సుత స్తన్య బభూవ పృథివీపతిః. 35 రాజిట్లనెను: ఓ సురవరులారా! ఇంద్రుడు వాహనముగ నున్నచో నేను మీకు పార్శ్వరక్షకుడుగ నుండగలను. ఇపుడు జరుగనున్న దేవదానవ యుద్దమందు దేవేంద్రునిపై నారోహించి పోరుదును. నా మాట నిజము. అపుడు దేవత లింద్రునితో నిట్లనిరి. ఓ యింద్రా! నీవా రాజునకు వాహనము గమ్ము. అభిమానము వీడుము. ఈ యద్బుతకార్య మొన ర్పుము. అట్లు దేవేంద్రుడు హరిచే ప్రేరితుడై సిగ్గుజెందుచు శివునికి వృషభమువలె తాను వృషభ##మై రాజునకు వాహనముగ నుండెను. రాజు యుద్దభూమి కేగుట కింద్రుని మూపుపై గూర్చుండెను. అందువలన నతడు కుకుత్థ్సుడన విఖ్యాతి గాంచెను. అతడింద్రుని వాహనముగ జేసికొనుటచే నింద్రువాహు డయ్యెను. దైత్యులపురము ధనరాశిజయించుటవలన పురంజయు డయ్యెను. అట్లుకకుత్థ్సుడు దైత్యులను గెలిచి వారి ధనరాసులు దేవతలకొసంగెను. ఇట్లు రాజర్షి కింద్రునితో స్నేహముకుదిరెను. కుకుత్థ్సుని వంశజు లెల్లరును భూమిపై కాకుత్థ్సు లన వన్నెయు వాసియు గాంచిరి. కకుత్థ్సున కతని భార్యయందు కాకుత్థ్సుడు-అతనికి పరాక్రమశాలియగు పృథుచక్రవర్తి జన్మించి ప్రసిద్ధిబడసిరి. పృథుచక్రవర్తి దేవీపదభక్తుడు. అతనికి విశ్వరంధియను పుత్రుడు గల్గెను. విశ్వరంధి కొడుకు చంద్రుడు. అతడు శ్రీమంతుడు-వంశకరుడు. అతని సుతుడు తేజముబలముగల యువనాశ్వుడు. యువనాశ్వుని తనయుడు శావంతి. అతడు యజ్ఞములు నిర్వహించినవాడు. అత డింద్రపురమును బోలు శావంతీపురమును నిర్మించెను. మహాత్ముడగు శావంతుని కొడుకు బృహదశ్వుడు. అతని కుమారుడు కువలయాశ్వుడు. ధుంధు ర్నామా హతోదైత్వ స్తేనాసౌ పృథివీతలే | ధుంధుమారేతి విఖ్యాతిం నామ ప్రాపా తివిశ్రుతమ్. 36 పుత్ర స్తస్య దృఢాశ్వస్తు పాలయామాస మేదినీమ్ | దృఢాశ్వస్య సుతః శ్రీమా న్హర్యశ్వ ఇతి కీర్తితః. 37 నికుంభ స్తత్సుతం ప్రోక్తో బభూవ పృథివీపతిః | బ్హరణాశ్వో నికుంభస్య కృశాశ్వస్తస్యవై సుతః. 38 ప్రసేనజి త్కృశాశ్వస్య బలవాన్సత్య విక్రమః | తస్య పుత్రో మహాభాగో ¸°వనాశ్వేతి విశ్రుతః. 39 ¸°వనాశ్వసుతః శ్రీమా న్మాంధాతేతి మహీపతిః | అష్టోత్తర సహస్రంతు ప్రాసాదా యేన నిర్మితాః. 40 భగవత్యా స్తు తుష్ట్యర్థం మహాతీర్థేషు మానద | మాతృగర్బే న జాతో೭సౌ నిష్పన్నో జనకోదరే. 41 నిః సారిత స్తతః పుత్రః కుక్షిం భిత్వా పితుః పునః | రాజోవాచ : న శ్రుతంనచదృష్టంవా భవతాయదుదాహృతమ్. 42 అసం భావ్యం మహాభాగ తస్య జన్మయథో దితమ్ | విస్తరేణ వదస్వాద్య మాంధాతు ర్జ న్మకారణమ్. 43 రాజో దరే యథోత్పన్నః పుత్రః సర్వాంగసుందరః | వ్యాసం ¸°వనాశ్వో೭న పత్యోభూ ద్రాజాపరమధార్మికః. 44 భార్యాణాం చ శతం తస్య బభూవ నృపతేర్నృప | రాజా చింతారః ప్రాయపశ్చింతయామాస నిత్యశః. 45 అపత్యార్థే ¸°వనాశ్వో దుఃఖతస్తువనంగతః | ఋషీణా మాశ్రమే పుణ్య నిర్విణ్ణః సచపార్థివః. 46 ముమోచ దుఃఖితః శ్వాసాం స్తాపసానాంచ పశ్యతామ్ | దృష్ట్వాతు దుఃఖితం విప్రా బభూవుశ్చ కృపాలవః. 47 ధుంధువను దైత్యుని చంపుటచే నతడు ధుంధుమారుడను పేర ప్రఖ్యాతి గాంచెను. అతని కుమారుడు దృఢాశ్వుడు. అతని కొడుకు హర్యశ్వుడన పేరొందెను. అతని కొడుకు నికుంభుడు - అతని కొడుకు బర్హణాశ్వుడు. అతని తన యుడు ప్రేసేనజిత్తు. అతడు మహాబలశాలి అతని కొడుకు ¸°వనాశ్వుడన బరగెను. అతని నందనుడు శ్రీమాంధాతృ చక్రవర్తి. అతడు శ్రీజగదీశ్వరికై నూటయెనిమిదివేలు మందిరములు పుణ్యతీర్థములందు శ్రీదేవీప్రీతికై కట్టించెను. అతడు తన తల్లి గర్బమున బుట్టక అద్బుతముగ తన తండ్రి పొట్ట చీల్చుకొని బయటి కేతెంచెను. అన విని రాజిట్లనెను : నీవు చెప్పిన విషయము నేను మున్ను కనివిని యెఱుగను. ఓ మహానుభావా! నీవు పల్కినట్లు జన్మించుట సంభావ్యముగాదు. కనుక నిపుడు మాంధాతృ జన్మ వృత్తాంతము వివరించి తెల్పుము. రాజు పొట్టనుండి సర్వాంగసుందరుడగు పుత్రు డెట్లు గల్గెను? వ్యాసు డిట్లనియెను : ¸°వనాశ్వరాజు పరమధార్మికుడు. కాని సంతానము లేనివాడు. అతనికి నూర్గురు భార్యలు గలరు. కాని సంతులేక రాజ నిచ్చలు చింతారతంత్రుడై యుండెను. ¸°వనాశ్వుడు సంతుకొఱకు వనము లందున్న పుణ్య మున్యాశ్రమములు కేగి రోదించుచు దిగులు పడుచుండెను. అతడచట తాపసోత్తములగు విప్రులు కనికర ముతో కనుచుండగ వేడి నిట్టూర్పులు నిగుడించుచు కటకటపడెను. తమూచు ర్బృహ్మణా రాజన్క స్మాచ్ఛోచసి పార్థివ | కింతే దుఃఖం మహారాజ బ్రూహి సత్యం మనోగతమ్. 48 ప్రతీకారం కరిష్యామో దుఃఖస్య తవసర్వథా | ¸°వనాశ్వః : రాజ్యం ధనంసతశ్వాశ్చ వర్తంతే మునయోమమ. 49 భార్యాణాం చ శతం శుద్దం వర్తతే విశదప్రభమ్ | నారాతి స్త్రిషు లోకేషు కో೭ప్యస్తి బలవా న్మమ 50 అజ్ఞాకరాస్తు సామంతా వర్తంతే మంత్రిణస్తథా | ఏకం సంతాన జం దుఃఖం నాన్య త్పశ్యామి తాపసాః. 51 అపుత్రస్య గతి ర్నాస్తి స్వర్గోనైవచ నైవచ | తస్మా చ్ఛోచామి విప్రేంద్రాః సంతానార్థం భృశంతతః. 52 వారు రాజుతో నిట్లనిరి : ఓ రాజా : ఏల పరితపింతువు? నీ మనసులోని వెత దెలుపుము. నిజము పలుకుము. మేమెల్ల విధముల నీ దుఃఖము తొలగు నుపాయ మాలోచింతుము. ¸°వనాశ్యు డిట్లనెను : ఓ మునులారా ! నాకు గొప్ప రాజ్యము- ధనము- గుఱ్ఱములు గలవు. చక్కని భార్యలు నూర్గురు గలరు. నీ కీ ముల్లోకములందును బలవంతుడగు శత్రు వొక్కడును లేడు. ఓ తాపసులారా ! నా మంత్రిసామంతులు నా మాట జవదాటరు. కాని సంతానములేని లోటు నన్ను పీడించుచున్నది. పుత్రులులేని వానికి సద్గతులు లేవు. స్వర్గము లేనే లేదందురు. కనుక సంతానార్థమింతగ వేత జెందు చున్నాను. వేదశాస్త్రార్థ తత్త్వజ్ఞా స్తాపసాశ్ఛ కృతశ్రమాః | ఇష్టిం సంతానకామస్య యుక్తాంజ్ఞాత్వా దిశంతుమే. 53 కుర్వంతు మమ కార్యంవై కృపాచే దస్తితాపసాః | తచ్ఛ్రత్వా వచనం రాజ్ఞః కృపయా పూర్ణమానసాః. 54 కారయా మాసు రవ్యగ్రాస్త స్యే ష్టి మింద్రదేవతామ్ | కలశః స్థాపిత స్తత్ర జలపూర్ణస్తు బాడబైః. 55 మంత్రితో వేదమంత్రైశ్చ పుత్రార్థం తస్య భూపతేః | రాజా తద్యజ్ఞసదనం ప్రవిష్ట స్తృషితో నిశి. 56 విప్రాన్ దృష్ట్వాశయానాన్స పపౌమంత్రజలం స్వయమ్ | భార్యార్థం సంస్కృతం విపై#్రర్మంత్రితంవిధినోద్ధృతమ్. 57 పీతం రాజ్ఞా తృషార్తేన తదజ్ఞానాన్నృపోత్తమ | వ్యుదకం కలశం దృష్ట్వా తదా విప్రా విశంకితాః. 58 పప్రచ్ఛుస్తే నృపం కేన పీతం జలమితి ద్విజాః | రాజ్ఞా పీతం విదాత్వాతే జ్ఞాత్వా దైవబలం మహత్. 59 ఇష్టిం సమాపయామాసుర్గతాస్తే మునయో గృహాన్ | గర్బం దధార నృపతిస్తతో మంత్రబలా దథ. 60 తతః కాలే స ఉత్పన్నః కుక్షింభిత్వా೭స్య దక్షిణమ్ | పుత్రం నిష్కాసయామానుర్మంత్రి ణస్తస్య భూపతేః. 61 దేవానాం కృపయా తత్ర న మమార మహీపతిః | కంధాస్యతి కుమారో೭యం మంత్రిణశ్చుక్రుశుర్బృశమ్. 62 తదేంద్రో దేశినీం ప్రాదాన్మాంధాతేత్య వదద్వచః | సో೭భవద్బలవాన్రాజా మాంధాతా పృథివీపతిః. 63 తదుత్పత్తి స్తు భూపాల కథితా తవ విస్తరాత్. ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే నవమో೭ధ్యాయః. మీరు వేదశాస్త్రార్థపారంగతులు. తత్త్వవిధులు-తాపసులు-శమధనులు. కనుక నాకు సంతు గల్గుటకు తగిన జన్నము దెలుపుడు. తాపసులారా! నాపై దయయున్న ఇంతమాత్రము పని చేయుడు. వ్యాసు డిట్లనెను: అను రాజు మాటలువిని విపులు దయాంతరంగులైరి. వారంత దేవేంద్రుడు దేవత గగల యజ్ఞమును చక్కగ జరిపించిరి. విప్రుల జలపూర్ణమైన కలశమును స్థాపించిరి. వేదమంత్రములతో పుత్రార్థము జలము నభిమత్రించిరి. ఒక రేయి రాజు దప్పిగొని యజ్ఞశాల కేగెను. అచట విప్రులందఱు నిద్రించుటగని రాజు స్వయముగ దప్పిదీర మంత్రజలము త్రాగెను. అది రాజు భార్యకొఱకు విధిగ మంత్రములచే సంస్కరింపబడినది. పిదప జలములేని కలశమునుగని విప్రు లనుమానించిరి. వారు జల మెవ్వరు త్రాగిరని రాజునడిగిరి. రాజు జలము త్రాగెనని తెలిసి వారు దైవ బలమిదియనిరి. మునివిప్రులు యజ్ఞము సంపూర్ణము గావించి తమ తమ యిండ్లకేగిరి. రాజు మంత్ర జలబలమున గర్బముదాల్చెను. నెలలునిండిన పిదప మంత్రులు రాజు కుడి పొట్టను చీల్చియందుండి కుమారుని బయటకు తీసిరి. దైవకృపచే రాజు చావలేదు. ఆ కుమారునకు పాలెవరిత్తురాయని మంత్రులు మిక్కిలి విచారించిరి. అంత నింద్రు డేతెంచి తన చూపు వ్రేలు చూపి 'మాంధాత' నన్ను చీకుము అని పలికెను. నాటినుండి యతడు 'మాంధాతృ' మహీపతిగ ప్రసిద్ధుడయ్యెను. రాజా! నీ కిట్లు మాంధాతృ భూపాలచరిత్రము వివరించితిని. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున ఎనిమిదవ అధ్యాయము.