Sri Devi Bagavatham-2    Chapters   

అథ ఏకోనత్రింశోధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : సావిత్రీవ చనం శుత్వా జగామ విస్మయంయమః | ప్రహస్య వక్తు మారేభే కర్మపా కంతు జీవినామ్‌. 1

ధర్మ ఉవాచ : కన్యా ద్వాదశవర్షీయా వత్సే త్వం వయసాధునా |

జ్ఞానం తే పూర్వవిదుషాంజ్ఞానినాం యోగినాంపరమ్‌. 2

సావిత్రీవరదానేన త్వం సావిత్రీ కళాసతీ | ప్రాప్తా పురా భూభృతా చ తపసా తత్సమా సుతే. 3

యథా శ్రీః శ్రీపతేః క్రోడే భవానీ చ భవోరసి | యథాదితిః కశ్య పే చ యథాహల్యా చ గౌతమే. 4

యథాశచీ మహేంద్రే చ యథా చంద్రే చరోహిణీ | యథారథిః కామదేవే యథాస్వాహా హుతాశ##నే. 5

యథాస్వధా చ పితృషు యథా సంజ్ఞా దివాకరే | వరుణానీ చ వరుణ యజ్ఞే చ దక్షినా యథా. 6

యథా వరాహే పృథివీ దేవసేనా చ కార్తికే | సౌభాగ్య సుప్రియా త్వం చ తథాసత్య వతఃప్రియే. 7

అయంతుభ్యంవరో దత్తోప్య పరంచయథే ప్సితమ్‌ | వృణుదేవి మహాభాగే దదామిసకలే ప్సితమ్‌. 8

సావిత్ర్యువాచ : సత్యపత ఔరసానాం పుత్రాణాం శతకం మమ | భవిష్యతి మహాభాగే వరమే తన్మ దీప్సితమ్‌. 9

మత్పితుః పుత్రశతకం శ్వశురస్య చ చక్షుషీ | రాజ్యలాభో భవత్యేవం వరమే తన్మ దీప్సితమ్‌. 10

అంతే సత్యవతా సార్దం యాస్యామి హరి మందిరమ్‌ | సమతీ తే లక్షవర్షే దేహీ దం మే జగత్ర్పభో. 11

జీవకర్మ విపాకం చ శ్రోతుం కౌతూహలం మమ | విశ్వ నిస్తార బీజం చ తన్మే వ్యాఖ్యాతు మర్హసి. 12

సావిత్ర్యు పాఖ్యానము

శ్రీనారాయణు డిట్లనియెను : సావిత్రి ప్రశ్నములకు విస్మయమొంది యముడామెతో జీవుల కర్మ విపాకము గుఱించి యీ విధముగ చెప్పసాగెను. ధర్మదేవత యిట్లనెను: నీవు పండ్రెండేడుల బాలవు. నీ జ్ఞానము పరమయోగుల జ్ఞానుల జ్ఞానముకన్న మిన్నయైనది. నీ తండ్రి తప మొనరించి సావిత్రీ వరమువలన నిన్ను బడసెను. నీవు సావిత్రీదేవి కళ వలన జన్మించితివి. శ్రీమహావిష్ణువు పక్షమున లక్ష్మి శివుని సగభాగమున భవాని కశ్వపునిచెంతనదితి గౌతముని సమీపమున అహల్య ఇంద్రు నెడ శని చంద్రునిపట్ల రోహిణి కామునియందు రతి అగ్నియందు స్వాహాదేవి పితరులయందు స్వధాదేవి సూర్యునిచెంత సంజ్ఞ వరుణునందు వరుణాని యజ్ఞమునందు దక్షిణము వరాహునితోడ భూమియును షణ్ముఖినితోడ దేవ సేనయు వలె సత్యవంతునితోడ నీవును జేరి సౌభాగ్యవతివి గమ్ము. దేవీ సౌభాగ్యవతీ ! నీ కిప్పు డొక వర మిచ్చితిని. నివింకొక్కటి కోరుకొనుము ఇచ్చెదను. సావిత్రి యిట్లనియెను : మహాత్మా ! సత్యవంతు నీ ఔరసులుగానాకు నూర్గురు కుమారులు పుట్ట వలయును. నా తండ్రికిని నూర్గురు పుత్రులు జన్మించవలయును. నా మామకు కండ్లు కనిపించవలయును. అతనికి తిరిగి రాజ్యలాభము గలుగవలయును. ఇదే నా కోరిక. జగత్పృభూ! ఒక లక్ష యేండ్లు గడచిన మీదట నేనును సత్యవంతుడును గలసి హరి మందిరమున కేగవలయును. నాకు జీవుల కర్మ విపాకము గుఱించి వినవేడుకగ చున్నది. అది యీ సంసారమునుండి తరింపజేయును. నాకు దానిని గూర్చి విన కుతూహల మగుచున్నది.

ధర్మరాజః : భవిష్యతి మహాసాధ్వి సర్వం మానసికం తప | జీవకర్మ విపాకం చ కథయామి నిశామయ. 13

శుభానా మశుభానాం చ కర్మణాం జన్మ భారతే | పుణ్యక్షేత్రే చ నాన్యత్ర సర్వం చ భుంజతే జనాః. 14

సురాదైత్యా దానవా శ్చ గంధర్వా రాక్షసాదయః | నరాశ్చ కర్మజనకా న సర్వే జీవినః సతి. 15

విశిష్ట జీవినః కర్మ భుంజతే సర్వ యోనిషు | శుభాశుభం చ సర్వత్ర స్వర్గేషు నరకేషు చ. 16

విశేషతో జీవినశ్చ భ్రమంతే సర్వయోనిషు | శుభాశుభం భుంజతే చ కర్మ పూర్వార్జితం పరమ్‌. 17

శుభేన కర్మణా యతి స్వర్లోకాదిక మేవచ | కర్మణా చాశుభేనైవ భ్రమంతి నరకేషు చ. 18

కర్మనిర్మూలనే భక్తిః సా చోక్తాద్వి విధాసతి | నిర్వాణరూపా భక్తిశ్చ బ్రహ్మణః ప్రకృతే రిహ. 19

రోగీ కుకర్మణా జీవశ్చారోగీ శుభ కర్మణా | దీర్ఘజీవీ చ క్షీణాయుః సుఖీ దుఃఖీ చ కర్మణా. 20

అంధాదయ శ్చాంగహీనాః కర్మణా కుత్సితేన చ | సిద్ద్యా దిక మవాప్నోతి సర్వోత్కృష్టేన కర్మణా. 21

సామాన్యం కథితం దేవి విశేషం శృణు సుందరి | సుదుర్లభం సుగోప్యం చ పురాణషు స్మృతిష్యపి. 22

దుర్లభా మానుషీజాతిః సర్వజాతిషు భారతే | సర్వేభ్యో బ్రాహ్మణః శ్రేష్ఠః ప్రశస్తః సర్వ కర్మసు. 23

బ్రహ్మనిష్ఠో ద్విజశ్చైవ గరీయాన్‌ భరతే సతి | నిష్కామశ్చ సకామశ్చ బ్రాహ్మణోద్వి విధః సతి. 24

ధర్మరాజిట్లనెను : ఓ మహాసాధ్వీ! నీ కోరిన కోర్కు లన్నియును తీర గలవు. ఇపుడు జీవుల కర్మ విపాకము గూర్చి తెల్పుదును వినుము. ఈ పవిత్ర భారతదేశమునందు శుభాశుభకర్మముల కారణముగ జీవులు జన్మింతురు. ఇతరస్థానము లలోపుణ్యమో-పాపమో యేదో యొకటే యనుభవింతురు. సురాసురులు యక్ష-రాక్షస-గంధర్వులు నరులును కర్మలు చేయువారు. పశువులు మున్నగునవి కర్మలు చేయవు. విశిష్ట జీవుడగు మానవు డెల్ల యోనులందు పుట్టి కర్మము లనుభవించును. స్వర్గనరకములందు శుభాశుభము లుండును. ఈ జీవు లెల్ల యోనులందు తిరుగుచు తము చేసికొన్న కర్మఫలముగ మంచి-చెడ్డ లనుభవించును. జీవుడు శుభకర్మముచే స్వర్గ సుఖములను నశుభకర్మముచే నరకయాతనలును బొందును. ఇట్టి ఘోరకర్మములు నశించుటకు భక్తి ముఖ్యము. భక్తి రెండు విధములుగ నుండును; ఒకటి ముక్తిరూపమగు నిర్గుణభక్తి; రెండవది మాయా విశిష్టమగు సగుణభక్తి. మంచికర్మలు చేసికొనినానడు చిరకాలము సుఖించును. చెడు కర్మల చేసినవాడర్దాయుష్కు డగును. కష్టాలు పొందును. కుచ్చితపు పనులవలన కుంటి-గ్రుడ్డి-వికలాంగుడుగ బుట్టును. ఎల్లరికిని మేలు చేయు పనులవలన సిద్ధులుగ జన్మింతురు. దేవీ ! సుందరీ! ఇంతవఱకు సామాన్య విషయము తెల్పితిని. ఇంక విశేషము మినుము. అది స్మృతి పురాణములందు దుర్లభము. అతి రహస్యము. ఈ భాదతదేశ మందలి యెల్ల జాతులలో మానవజాతి దొడ్డది. వారిలో బ్రాహ్మణజాతి సర్వకర్మలందును శ్రేష్ఠము-ప్రశస్తము. ఈ పుణ్య భారతదేశమునందు బ్రహ్మ నిష్ఠుడగు బ్రాహ్మణుడు శ్రేష్ఠతముడు. బ్రాహ్మణుడు ష్కాముడు-సకాముడు నని రెండు తెఱుంగులుగ నుండును.

సకామాచ్ఛ ప్రధాన శ్చ నిష్కామో భక్త ఏవ చ | కర్మభోగీ సకామశ్చ నిష్కామో నిరుపద్రవః. 25

స యాతి దేహం త్వక్త్వా చ పదంయత్తన్నిరామయమ్‌ | పునరాగమనంనాస్తి తేషాం నిష్కామినాం సతి. 26

సేవంతే ద్విభుజం కృష్ణం పరమాత్మాన మీశ్వరమ్‌ | గోలోకం ప్రతి తే భక్తా దివ్యరూపవిధారిణ. 27

సకామినో వైష్ణవా శ్చ గత్వా వైకుంఠ మేవచ | భారతం పునరా యాంతి తేషాం జన్మ ద్విజాతిషు. 28

కాలేన తే చ నిష్కామా భవంత్యేవ క్రమేణ చ | భక్తిం చ నిర్మలాం తేభ్యో దాస్యామి నిశ్చితం పునః. 29

బ్రాహ్మణా వైష్ణవా శ్చైవ సకామాః సర్వజన్మసు | న తేషాం నిర్మలా బుద్ధిర్విష్ణు భక్తి విర్జితాః. 30

తీర్థా శ్రితా ద్విజా యేచ తపస్యా నిరాతఃసతి | తే యాంతి బ్రహ్మలోకంచ పునరాయాంతి భారతే. 31

స్వధర్మనిరతా యేచ తీర్థాన్యత్ర నివాసినః | ప్రజంతి తే సత్యలోకం పునరాయాంతి భారతే. 32

స్వ ధర్మనిరతా విప్రాః సూర్యభక్తా శ్చ భారతే | ప్రజంతి తే సూర్యలోకం పునరాయాంతి భారతే. 33

మూల ప్రకృతి భక్తాయే నిష్కామా ధర్మచారిణః | మణిద్వీపం ప్రయాంత్యేవ పునరావృత్తి వర్జితమ్‌. 34

స్వధర్మే నిరతా భక్తాఃశైవాః శక్తా శ్చ గాణపాః | తేయాంతి శివలోకం చ పునరాయాంతి భారతే 35

యే విప్రా అన్యదేవేజ్యాః స్వ దర్మనిరతాః సతి | తే యాంతి సర్వలోకంచ పునరాయాంతి భారతే. 36

సకామునికన్న నిష్కామభక్తుడు గొప్పవాడు. ఏ చింత చీకు లేనివాడు నిష్కాముడు. కర్మ లనుభవించుగోరువాడు సకాముడు. నిష్కామభక్తుడు తనువుచాలించి నిరామయమగు పరమపదము చేరును. వాడు మరల ఈ లోకమునకు రాడు. రెండు భుజములు గలవాడు-ఈశ్వరుడునైన కృష్ణ పరమాత్ముని మనసార సేవించునట్టి పరమభక్తులు గోలోకమందు దివ్య రూపములతోవెలుగచుందురు.సకాములగు వైష్ణవులు వైకుంఠ మేగి తిరిగి భారతభూమిపై బ్రాహ్మణ వంశమున జన్మింతురు. వారు కొంతకాలమునకు క్రమముగ నిష్కామము లగుదురు. అట్టి వారికి నేను నిర్మల-నిశ్చల-భక్తి నొసంగ గలను. వైష్ణవులుగాని బ్రాహ్మణు లెల్ల జన్మలందును సకాములుగ నుందురు. వారిలో విష్ణుభక్తి లేనందున వారికి స్థిత ప్రజ్ఞ త్వము గల్గదు. ఏదేని పుణ్యతీర్థము నాశ్రయించి తపము చేసికొనునట్టి ద్విజులు బ్రహ్మలోకము వఱకు వెళ్ళి తిరిగి భారతదేశమున జన్మింతురు. స్వధర్మనిరతులై పుణ్యతీర్థములందు నివసించు బ్రాహ్మణులు సత్యలోకము వఱకు వెళ్ళి తిరిగి భారతదేశ మందు జన్మింతురు. స్వధర్మపరులు-సూర్యోపాసకులునైన విప్రులు సూర్యలోకము జేరి మరల భారతదేశమందున జన్మింతురు. ఇంక మూలప్రకృతికి పరమభక్తులు-నిష్కాములు-ధర్మనిరతులునైన బ్రాహ్మణులు పునరావృత్తిలేని మణిద్వీపమున నుందురు. స్వధర్మనిరతులైన శైవులు శాక్తేయులు గాణాపత్యులును శివలోకమేగి తిరిగి భారత పుణ్యభూమిపై జనమెత్తుదురు.

హరిభక్తా శ్చ నిష్కామాః స్వధర్మనిరతా ద్విజాః | తే చ యాంతి హరేర్లోకం క్రమాద్భక్తి బలాదహో. 37

స్వ ధర్మరహితా విప్రా దేవాన్య సేవనాః సదా | భ్రష్టా చారా స్స కామాశ్చ తేయాంతినరకం ధ్రువమ్‌. 38

స్వ ధర్మ నిరతా ఏవ వర్ణా శ్చ త్వార ఏవ చ | భవం త్యేవ శుభ##సై#్యవ కర్మణః ఫలభోగినః. 39

స్వకర్మ రహితాయే చ నరకేయాంతితే ధ్రువమ్‌ | భారతే న భవంత్యేవ కర్మణః ఫలభోగినః. 40

స్వ ధర్మ నిరతా ఏవం వర్ణా శ్చ త్వార ఏవ చ | స్వ ధర్మ రహితా విప్రాః స్వ ధర్మనిరతాయ, 41

కన్యాం దదతి విప్రాయ చంద్రలోకం ప్రయాంతి తే | వసతిం లభ##తేసాధ్వి యావదిం ద్రా శ్చ తుర్ధశ. 42

సాలంకృతాయా దానేన ద్విగుణం ఫలముచ్యతే | సకామా యాంతి తల్లోకం ననిష్కామా శ్చ సాధనః. 43

తే ప్రయాంతి విష్ణులోకం ఫలసంఘాత వర్జితాః | గవ్యంచ రజతం స్వర్ణం వస్త్రం సర్పిఃఫలం జలమ్‌. 44

యే దదత్యేవ విప్రేభ్య శ్చం ద్రలోకం ప్రయాంతి తే | వసంతి తే చ తల్లోకే యావన్మ న్వం తరం సతి. 45

సుచిరా త్సు చిరం వాసం కుర్వంతితేన తే జానాః | యే దదతి సువర్ణా శ్చ గాశ్చ తామ్రాదికం సతి. 46

తే యాంతి సూర్యలోకం చ శుచయే బ్రాహ్మనా యచ | వసంతి తే తత్రలోకే వర్షాణామయుతం సతి. 47

విపులే సుచిరం వాసం కుర్వంతి చ నిరామయాః | దదాతి భూమిం విప్రేభ్యో దనాని విపులాని చ. 48

స్వధర్మ పరాయణులు-నిష్కాములు-హరిభక్తులునైన విప్రులు భక్తి బలమున హరిలోక మేగి మరలి వత్తురు. స్వధర్మరతులు-భూతప్రేతములు గొల్చువారు నగు విప్రులు సకాములై భ్రాష్టాచారులై నరకమందు గూలుదురు. తమ తమ ధర్మకర్మములను నెఱవేర్చునట్టి నాలుగు వర్ణములవారును శుభకర్మల ఫలిత మనుభవింతురు. స్వధర్మ రహితులు నరకము నందు గూలుదురు. తమ కర్మఫలము లనుభవించుట వలన వారు తిరిగి భారతభూమిపై బుట్టరు. నాల్గు వర్ణములవారును స్వధర్మనిరతులైనచో శుభముల బడయుదురు. స్వధర్మనిరతుడు స్వధర్మనిరతుడైన విప్రునకు కన్యాదానము చేసినచో చంద్రలోకమందు పదునల్గు రింద్రు లంత కాలము సుఖించును. కన్నియ నలంకరించి దాన మిచ్చిన దానికి రెండింతల ఫల మబ్బును. కన్యాదాత సకాముడైననే ఫల మబ్బును గాని నిష్కాముడైనచో నతని కట్టి ఫలితము లభింపదు. ఫలకాంక్షలేనివారు విష్ణులోకమేగగలరు. ఆవు నెయ్యి వెండి బంగారము వస్త్రములు పాలు జలము ఫలములు బ్రాహ్మణునకు దాని మిచ్చినవాడు చంద్రలోకమేగును. వాడు అచట నొక మన్వంతరమం దాక వసింపగలడు. మంచి బ్రాహ్మణునకు బంగారముతో-రాగితో జేసిన యావు ప్రతిమను దాన మొసంగిన సూర్యలోకమున పదివేలేండ్లు సుఖముగ నివసింతురు. ఈ దానమొకపవిత్రుడగు బ్రాహ్మణున కీయవలయును. ఇచ్చినవారచట నిరామయులై నివసింతురు. విప్రులకు గొప్పభూమిని ధనమునుదాన మొసంగువాడు.

సయాతి విష్ణులోకం చ శ్వేత ద్వీపం మనోహరమ్‌ | తత్రైవ నినసత్యేవ యావచ్చంద్ర దివాకరౌ. 49

విపులే విపులం వాసం కరోతి పుణ్యవా న్మునే | గృహం దదతి విప్రాయ యేజనా భక్తి పూర్వకమ్‌. 50

తే యాంతి విష్ణులోకం చ సుచిరం సుఖదాయకమ్‌ | గృహరేణు ప్రమాణం చ విష్ణులోకే మహత్తమే. 51

విపులే విపులం వాసలం కుర్వంతి మానవాః సతి | యసై#్మచ కసై#్మచ దేవాయ యోదదాతి గృహం నరః 52

స యాతి తస్యలోకం చ రేణు మానాబ్దమేవ చ | సౌదే చతుర్గుణం పుణ్యం దేశేశతగుణం ఫలమ్‌. 53

ప్రకృష్టే ద్విగుణం తస్మా దిత్యాహ కమలో ద్బవః | యో దదాతి తడాగం చ సర్వపాపాపనుత్తయే. 54

స యాతి జనలోకం త రేణుమానాబ్ద మేవచ | వాప్యాం పలం దశగుణం ప్రాప్నోతి మానవః సదా. 55

సతు వాపీ ప్రదానేన తటా కస్య ఫలం లభేత్‌ | ధనుశ్చతుః సహస్రేణ ధైర్ఘ్య మానేన నిశ్చితమ్‌. 56

న్యూనా వా తావతీ ప్రస్దే సావాపీ పరికీర్తితా | దశవాసీసమా కన్యా యది పాత్రే ప్రదీయతే. 57

ఫలం దదాతి ద్విగుణం యదిసాలంకృతా భ##వేత్‌ | యత్పలం చ తడాకే చ తదుద్దారే చ తత్పలమ్‌. 58

వాప్యా శ్చ పంకోద్ధరణ వాపీతుల్య ఫలం లభేత్‌ | అశ్వత్థ వృక్ష మారోప్య ప్రతిష్ఠాంయః కరోతి చ. 59

స వ్రయాతి తతోలోకం వర్షాణామయుతం సతి | పుష్పోద్యానం యో దదాతి సావిత్రి సర్వభూతయే. 60

మనోహరమగు శ్వేతద్వీపమున విష్ణులోక మేగును. అచట సూర్యచంద్రు లుండునందాక నిసించును. అట్టి పుణ్యాత్ముడు విశాల లోకములందు వసించును. కడు భక్తితో విప్రునకు గృహదానము చేయువాడు సుఖదాయకమగు విష్ణులోకము జేరును. ఆ యింటికున్న యిసుక రేణువు లంతకాలము మహావిష్ణులోకమున సుఖించును. ఇట్లు దానము చేయు మానవులు విశాల లోకములందు సుఖింతురు. ఏ దేవునికైన గృహమును దానము చేయు మానవుడు ఆ యింటికున్న యిసుకరేణువు లన్నియేడు లా దేవుని లోకమందు సుఖము లొందగలడు. ఈ దానము తన యింటిలో చేసిన నాలుగింతల ఫలమును పుణ్య ప్రదేశమున తీర్థములందు చేసిన నూఱురెట్ల ఫలమునబ్బును. ఆ క్షేత్రము మిక్కిలి గొప్పదైనచో ఫలితము రెండింతలెక్కువ యగునని బ్రహ్మ పలికెను. ఎల్ల పాపములు తొలగుటకు చెఱువు దానముచేయువాడు అందలి యిసుక రేణులెన్ని గలవో యన్ని యేడులు జనలోకమున వసించును. దిగుడు బావి దానము చేసినచో దానికి పదింతల ఫలమును బొందును. బావిని దాన మిచ్చిన తాటాకము దాన యొసంగిన ఫల మొందును. ఆ బావి నాల్గువేల ధనుస్సులంత పొడవుండ వలయును. వెడల్పు దానికి తక్కువగ నుండవలయును. తగిన వానికి కన్యాదానము చేసినచో పది బావుల దానముచేసినంత ఫల మబ్బును. సాలంకృతయైన కన్య నిచ్చినచో దానికి రెండింతల పల మబ్బును. పనికిరాని చెఱువును బాగుచేయించినచో మంచి చెఱువు దానముచేసినంత ఫలము లభించును. బావిలోన పూడిక తీయించినచో బావిత్రవ్వించిన ఫలమబ్బును. ఒక రావి చెట్టు నాటి ప్రతిష్టించువాడు పది వేలేండ్లు తపోలోకమున సుఖము లొందురు. సావిత్రీ! సర్వభూతరహితముగ పూదోట వేయువాడు పదివేలేండ్లు ధ్రువలోకమున నివసించును.

స వసే ధ్ధ్రువలోకే చ వర్షాణామయుతం ధ్రువమ్‌ | యో దదాతి విమానం చవిష్ణవే భారతే సతి. 61

విష్ణులోకే వసేత్సో7పి యావన్మ స్వంతరం పరమ్‌ | చిత్రయుక్తే చ విపులే ఫలం తస్య చతుర్గుణమ్‌. 62

తస్యార్థం శిబికాదానే ఫలమేవ లభే ద్ధ్రువమ్‌ | యోదదాతి భక్తియుక్తో హరయే డోలమందిరమ్‌. 63

విష్ణులోకే వసేత్సోపి యావన్మన్వంతరం శతమ్‌ | రాజమార్గం సౌధయుక్తం యఃకరోతి పతివ్రతే. 64

వర్షాణా మయుతం సోపి శక్రలోకే మహీయతే | బ్రాహ్మణభ్యోథ ధానేభ్యో దానే సమఫలంభేత్‌. 65

యద్ది దత్తం చ తద్బుంక్తే న దత్తం నోపతిష్ఠతే | భుక్త్వా స్వర్గాదిజం సౌఖ్యం పుణ్యవాన్‌ జన్మభారతే. 66

లభే ద్విప్ర కులేష్వేవ క్రమేణౖ వోత్త మాదిషు | భారతే పుణ్యవా న్విప్రో భుక్త్వా స్వర్గాదికంఫలమ్‌. 67

పునఃసోపి భ##వేద్విప్రశ్చైవం చ క్షత్రియాదయః | క్షత్రియో వాథ వైశ్యోవా కల్పకోటి శ##తేనచ. 68

తపసా బ్రాహ్మణత్వం చ ప్రాప్నోతీతి శ్రుతౌశ్రుతమ్‌ | నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిశ##తైరపి. 69

అవశ్యమేన భోక్తవ్వం కృతం కర్మ శుభాశుభమ్‌ | దేవతీర్థ సహాయేన కాయవ్యూహేన శుద్ధ్యతి. 70

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నరనారాయణ సంవాదే సావిత్యు పాఖ్యానే ఏకోనత్రింశోధ్యాయః.

పది వేలేండ్లు కదలక ధ్రవలోకమందు నానంద మొందును. ఈ ధన్య పుణ్య భారతదేశములో శ్రీవిష్ణునకువిమానము చేయించి యిచ్చువాడు మన్వంతరము వఱకు విష్ణులోకమున మోద మొందును. ఆ విమానము చిత్రవిచిత్రమై చిత్తరువులతో కూడిన దైనచో దానికి నాలుగింతల సుఖమొందును. హరికి పల్లకి చేయించి యిచ్చినచో విమాన ఫలములో సగము పున్నెము లభించును. శ్రీహరికి కొఱకద్దాల మందిరము కట్టించి యందు తూగుటూయల చేయించినవాడును విష్ణులోకమందు నూఱు మన్వంతరముల వఱకుసుఖించును. ఇరువైపుల సౌధములుగల రాజ మార్గము నిర్మంపించినవాడు పదివేలేడు లింద్రలోకమందు దేవసౌఖ్యములను భవించును. దానము బ్రాహ్మణున కిచ్చిననుఫలము సమానమే. ఎవ్వడెంత దానము చేసికొనునోవాడు చేసికొన్నంతఫలము బొందును. చేసికొననివానికి ఫలితము శూన్యము. పుణ్యవంతుడు స్వర్గసుఖములునుపొంది తిరిగి భారతభూమిపై జన్మమెత్తును. అతడు బ్రాహ్మణుడే యగును. అతడు క్రమమున నుత్తమ లోకముల బడయుము. ఈ భారతమున జన్మించిన బ్రాహ్మణుడు స్వర్గాది సుఖము లొందును. అతడు మరల బ్రాహ్మణుడగనే జన్మించును. ఇటులే క్షత్రియాదుల నెఱుంగవలయును. ఏ క్షత్రియడుగాని వైశ్యుడుగాని కల్పకోటి శతముల వఱకును ఘోరముగ నెంతగ తపించినను బ్రహ్మాణుడు గాజాలడని శ్రుతియందు వినబడుచున్నది. నూరుకోట్ల కల్పములకైన కర్మమనుభవింపక తీరదు. మంచిగాని చెడుగాని చేసిన దనుభవింపక తీరదు. నరుడు దేవతీర్థ సంసేవనమున కాయ వ్యూహమున పవిత్రుడగును. ఇట్లు నీకు కొద్దిగ తెల్పితిని. ఇంకేమి వినదలతువో తెలుపుము.

ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమున నవమ స్కంధమున నరనారాయణ సంవాదమున సావిత్రుపాఖ్యానమున నిరువది తొమ్మిదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters