Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతుస్త్రింశోధ్యాయః.

యమధర్మ ఉవాచ : ఛినత్తి జీవం ఖడ్గేన దయాహీనః సుదారుణః | నరఘాతీ హంతినర మర్థలోభేన భారతే. 1

అసిపత్రే వసేత్సోపి యావదిం ద్రాశ్చ తుర్దశ | తేషు యో బ్రాహ్మణా న్హం తిశతమన్వం తరం వసేత్‌. 2

ఛిన్నాంగ సంవసేత్సోపి ఖడ్గధారేణ సంతతమ్‌ | అనాహారః శబ్దముచ్చైర్యమదూతేన తాడితః. 3

మంథానః శతజన్మని శతజన్మానీ సూకరః | కుక్కుటః సప్తజన్మాని సృగాలః సప్తజన్మసు. 4

వ్యాఘ్ర శ్చ సప్త జన్మాని వృక శ్చైవ త్రిజన్మసు | సప్త జన్మసు మండూకో యమదూతేన తాడితః. 5

స భ##వే ద్బారతే వర్షే మహిషశ్చ తతః శుచిః | గ్రామాణాం నగరాణాంవా దహనంయః కరోతి చ. 6

క్షురధారే వసేత్సోసి ఛిన్నాంగ స్త్రియుగం సతి | తతః ప్రేతో భ##వే త్స త్యో వహ్నివక్త్రో భ్రమన్మహీమ్‌. 7

సప్త జన్మామే ధ్యభోజీ కపోతః సప్త జన్మసు | తతో భ##వే న్మహాశూలీ మానవః సప్తజన్మని. 8

సప్తజన్మ గల త్కుష్ఠీ తతః శుద్దో భ##వేన్నరః | వరకర్ణే ముఖం దత్వా పరనిందాం కరోతియః. 9

పరదోషే మహీశ్లాఘీ దేవ బ్రాహ్మణ నిందకః | సూచీముఖే వసేత్సోపి సూచివిద్దోయుగత్రయమ్‌ః. 10

తతో భ##వే ద్వృ శ్చి కశ్చ సర్ప శ్చ సప్త జన్మసు | వజ్రకీచ స్సప్తజన్మ భస్మకీచ స్తతః పరమ్‌. 11

తతో భ##వే న్మానవశ్చ మహావ్యాధి స్తతః శుచిః | గృహిణాం హీ గృహం భిత్త్వావసుప్తస్తేయంకరోతియః. 12

గా శ్చ చ్చా గాం శ్చ మేషాం శ్చ యాతి గోకాముఖే చ సః. |

తాడితో యమదూతేన వసే త్త త్ర యుత్రయమ్‌.

ముప్పదినాలుగవ అధ్యాయము

సావిత్ర్యుపాఖ్యానము

యమధర్మరాజిట్లనియెను: ఎవ్వడు దయమాలి పవిత్ర భారతదేశమున మనుష్యులను నితర ప్రాణులను చంపునో అతడు పదునాల్గు మన్వంతరములవఱకు ఆసిపత్ర నరకమున నుండును. బ్రాహ్మణుని చంపిన వాడందు నూఱు మన్వంతరము లుండును. అత డందు ఖడ్గదారులు తన్ను ముక్క ముక్కలుగ ఛేదింపగ యమకింకరులు బాధలు పెట్టుచుండగ తిండి లేక హాహాకారములు చేయును. అతడు నూఱు జన్మలు పురుగుగ వంద జన్మలు పందిగ నేడు జన్మలు కోడిగ నేడుజన్మలు నక్కగ బుట్టును. పిదప ఏడు పెద్దపులి జన్మలు మూడు తేలు జన్మలు నేడు తాబేలు జన్మలు దాల్చును. యమదూతల చేత దెబ్బలు తిన్నవా డిటుల నిన్ని జన్మలు దాల్చును. అతడు తర్వాత భారతవర్షమున దున్న పోతుగ బుట్టి తర్వాత శుచి యగును. నగరములను గ్రామములను తగులపెట్టు పాపి అసిధారకుండమున మూడుయుగముల దనుక వికలాంగుడై పడియుండును. పిదప దయ్యమై అగ్ని ముఖుడై తిరుగుచుండును. అత డేడు జన్మలు మలము దినువాడుగ నేడు జన్మలు పావురముగ పుట్టి తర్వాత నేడు జన్మలు శూలరోగము గలవాడుగ బుట్టును. అతడేడు జన్మలు కుష్ఠరోగియై పిమ్మట శుచి గాగలడు ఒకరి ముందు వేరొకరిని నిందించువాడు పరుల తప్పు లెన్నచుండువాడు దేవ బ్రాహ్మణులను నిందించువాడును సూచీముఖ నరకమున కూలి యచట వాడి నూదులచేత గ్రుచ్చబడుచు మూడు యుగములవఱకుండును. అతడు తర్వాత నేడు జన్మలు తేలుగ నేడు జన్మలు పాముగ బుట్టి తరువాత వజ్ర కీటకము భస్మ కీటకముగ బుట్టును. ఆ పిదప నతడు వ్యాధిపీడితుడై బుట్టి తర్వాత నేడు జన్మలకు శుచి యగును. గృహాస్థులయిండ్లకు కస్మములుచేసి వస్తువులు దొంగిలించువాడు ఆవులను మేకలను దొంగిలించువాడు గోకాముఖమున గూలి మూడు యుగముల వఱకు యమబాధలు పడుచుండును.

తతో భ##వే త్స ప్తజన్మ గోజతిర్వ్యా ధిసంయుతః | త్రిజన్మని మేషజాతి శ్చాగజాతా స్త్రి జన్మని. 14

తతో భ##వేన్మాన వ శ్చ నిత్యరోగీ దరిద్రకకః | భార్యా హీనో బంధుహీనః సంతాపీ చ తతః శుచిః. 15

సామాన్య ద్రవ్య చౌర శ్చ యాతినక్ర ముఖం చ సః | తాడితో యమదూతేన వసేత్త త్రాబ్ద కత్రయమ్‌. 16

తతో భ##వే త్స ప్తజన్మ గోపతిర్వ్యాధి సంయుతః | తతోభ##వేన్మా నపశ్చ మహారోగీతతః శుచిః. 17

హంతిగా శచ గాజాంశ్చైవ తురగాం శ్చ నగాం స్తథా | స యాతి గజదంశం చ మహీపాపీయుగ త్రయమ్‌. 18

తాడితో యమదూతేన నాగదంతేన సంతతమ్‌ | సభ##వేద్గజజాతి శ్చ తురగ శ్చ త్రిజన్మని. 19

గోజాతిర్ల్మే చ్చజాతి శ్చ తతః శుద్ధో భ##వేన్నరః | జలం పిబంతీం తృషితాం గాం వారయతియః పుమాన్‌. 20

నరకం గోముఖాకారం కృమితప్తోద కాన్వితమ్‌ | తత్ర తిష్ఠతి సంతప్తీ యావన్మ న్వంతరావది. 21

తతో నరోపి గోహీనో మహారోగీ దరిద్రకః | సప్తజన్మాం త్యజాతిశ్చ తతం శుద్ధోభ##వేన్నరః. 22

గోహత్యాం బ్రహ్మహత్యాం చ కరోతి హ్యాతిదేశికీమ్‌ |

యోహి గచ్చత్య గమ్యాం చ యః స్త్రీహత్యాం కరోతి చ. 23

భిక్షుహత్యాం మహాపాపీ భ్రూణహత్యాం భారతే | కుంభీపాకే వసేత్సోపి యావదిం ద్రా శ్చ తుర్ధశ. 24

తాడితో యమదూతేన చూర్ఘ్య మాన శ్చ సంతతం | క్షణం పతతి మహ్నౌ చ క్షణం పతతి కంటకే. 25

క్షణం పతేత్త ప్త తప్తో యేన క్షణం క్షణమ్‌ | క్షణం చ తప్తలో హే చ క్షణం చ తప్తతామ్రకే. 26

ఆ పిదప నతడు వ్యాధిగ్రస్తమైన యావుగ నేడు జన్మ లెత్తి తర్వాత మేకగ నేడు జన్మ లెత్తి మఱి మూడు జన్మలు మేకగ బుట్టును. పిదప నతడు నిత్యదరిద్రడుగ నిత్యరోగిగ భార్యబందుహీనుడుగ బుట్టి పుట్టి బాధలు పడి పడి తర్వాత శుచియగును. సామాన్యమైన ద్రవ్యము హరించువాడు నక్రకముఖ నరకమునబడి యమభటులచేత బాధలు పడుచు మూడేండ్లు నరకయాతన లనుభవించును. అతడు తరువాత నేడు జన్మలు రోగముగల యెద్దుగ పుట్టి తర్వాతా వ్యాధిగల వాడుగ బుట్టి శుద్ధాత్ము డగును. ఆవును-ఏనుగునులను-గుఱ్ఱములను చంపువాడు చెట్లు పడగొట్టువాడు మూడు యుగాలుగజ దంశ నరకమున గూలును. యమభటు లతని నచట నేనుగు దంతకములచే గొట్టుచుందురు. అతడు మూడు జన్మ లేనుగుగ మూడుజన్మలు గుఱ్ఱముగ బుట్టును. అత డావుగ యవనుడగ బుట్టి పిమ్మట శుచి యగును. దప్పికతో నీరు త్రాగు నావును వారించువాడు పురుగులచే సలసలమను నీరుగల గోముఖాకార నరకమున మన్వంతరము దనుక తపించుచుండును. అతడావులు లేనివాడుగ దరిద్రుడుగ రోగిగ నగును. పిదప నేడు జన్మలు నీచ జాతిలో బుట్టి తద్వాత శుచి యగును. శాస్త్రమును ధిక్కరించి గోహత్య-బ్రహ్మహత్యలు చేయువాడు కూడరాని వారితో గూడువాడు స్త్రీఘాతుకుడు. భిక్షుహత్య-భ్రూణహత్య చేయు మహాపాతకుడు పదునల్గు రింద్రు లంతకాలము కుంభీపాకనరకమందు యమబాధలు పెక్కులు పడుచుండును. యమభటు లతని నచట గొట్టుదురు. కొంతసేపు మంటలలో మఱికొంత తడవు ముండ్లలో పడవేతురు. భటు లతని నొక క్షణము క్రాగు నూనెలో నింకొక క్షణము మసలు నీళ్ళలో వేరొక క్షణము మండుచున్న లోహముపై మఱియొక క్షణము సేపు కాలుచున్న రాగిరేకుపై పతద్రోతురు.

గృధ్రో జన్మ సహస్రాణి శతజన్మాని సూకరః| కాకశ్చ సప్త జన్మాని సర్పశ సప్తజన్మసు. 27

షష్ఠి వర్ష సహస్రాణి విష్ఠాయాం జాయతే కృమిః| నానాజనన్మసు స వృష స్తతః కుష్ఠీ దరిద్రకః. 28

సావిత్ర్యువాచః విప్రహత్యా చ గోహత్యా కిం విధాచా೭೭తి దేశికీ|

కావానౄణా మగమ్యా చ కోవా సంధ్యా విహీనకః. 29

అదీక్షితః పుమాన్కోవా కోవాతీర్థ ప్రతి గ్రహీ| ద్విజః కోవా గ్రా మయాజీ కోవావిప్రోథ దేవలః. 30

శూద్రాణాం సూపకార శ్చ ప్రమత్తో వృశలీ పతిః | ఏతేషాం లక్షణం సర్వం వద వేద విదాంవర. 31

ధర్మరాజ ఉవాచ: శ్రీకృష్ణే చ త దర్చాయామన్యేషాం ప్రకృతౌ సతి|

శివే చ శివలింగే చ సూర్యే సూర్య మణౌ తథా. 32

గణశేవాథ దుర్గాయా మేవం సర్వత్ర సుందరి| యః కరోతి భేదబుద్ధిం బ్రహ్మహత్యాం లభేత్తుసః. 33

స్వగురౌ స్వేష్టదేవే చ జన్మదాతరి మాతరి| కరోతి భేదబుద్ధిం బ్రహ్మహత్యాం లభేత్తుసః. 34

వైష్ణవేషు చ భ##క్తేషు బ్రాహ్మణష్వితరేషు చ | కరోతి భేదబుద్ధిం యో బ్రహ్మహత్యాం లభేత్తుసః. 35

విప్రపాదోదకే చైవ సాల్రగామోదకే తాః| కరోతి బేదబుద్ధిం యో బ్రహ్మహత్యాం లభేత్తుసః. 36

శివనై వేద్యకే చైవ హరిసై వేద్యకే తథా| కరోతి బేదబుద్ధిం యో బ్రహ్మహత్యాం లభేత్తుసః. 37

సర్వేశ్వరేశ్వరే కృష్ణే సర్వ కారణ కారణ| సర్వాద్యే సర్వ దేవానాం సేవ్యే సర్వాంతరాత్మని. 38

మాయాయానేకరూపే వాప్యేక ఏవ హి నిర్గుణ| కరోతీశేన భేదం యో బ్రహ్మహత్యాం లభేత్తుసః. 39

అతడు వేయి జన్మలు గ్రద్దగ నూఱు జన్మలు పందిగ నేడు జన్మలు కాకిగ నేడు జన్మలు పాముగ బుట్టును. అతడు మలములో పురుగుగ నరువది వేలేండ్లు పుట్టినట్టి యెద్దుగ పెక్కే డులుపుట్టి తర్వాత కుష్ఠిరోగిగ పరమ దరిద్రడుగ బుట్టును. సావిత్రి యిట్లనెను. ఏది గోహత్య?ఏది విప్రహత్య? ఎయ్యదిశాస్త్రదిక్కారము? పొందరాని స్త్రీ ఎవరు? ఎవడు సంద్యావిహీనుడు? ఎవ్వ డదీక్షితుడు? ఎవ్వాడు తీర్ధప్రతిగ్రాహి? ఎవ్వడుగ్రామయాజియగు బాపడు?ఎవరు దేవల బ్రహ్మణుడు? ఎవడు శూద్రుల వంటలవాడు?ఎవ్వడు మదించిన వృషలీపతి? ఓ వేదవిదులలో శ్రేష్ఠుడా! వీరందఱ లక్షణములు వివరించి చెప్పుము. యమరాజిట్లనెను: సుందరీ! శ్రీకృష్ణుడు-కృష్ణ విగ్రహము-ఇతర ప్రకృతులు-శివుడు-శివలింగము-సూర్యడు-సూర్యమణి-గణపతి-దుర్గ-మొదలగు దేవతలతో పరస్వరము భేద మున్న దన్నవాడు-బ్రహ్మహత్యా పాపాత్ముడు- వైష్ణవులు-బ్రాహ్మణులు-భక్తులు- మహాత్ములు-వీరిలో భేదభావము గలవాడు-బ్రహ్మహాత్యా పాపి-విప్రపాదోదకము-సాలగ్రామ తీర్ధము- వీనిలో భేదము నెంచువాడు- బ్రహ్మహత్యా పాతకుడు-శివనైవేద్యము- విష్ణు నై వేద్యము నీ రెంట భేదము తలంచువాడు బ్రహ్మహత్యా పాపాత్ముడు-సర్వేశ్వరేశ్వరుడు-సర్వకారణకారణుడు-సర్వాద్యుడు-సర్వదేవతలకు సేర్వావ్యుడు-సర్వాంతరుడు మాయలీలగపెక్కు రూపులు దాల్తువాడునైన శ్రీకృష్ణునకును నిర్గుణ బ్రహ్మమునకును భేదము పాటించువాడు బ్రహ్మహత్యా పాపి.

శక్తి భ##క్తే ద్వేషబుద్ధిం శక్తి శాస్త్రే తథైవ చ | ద్వేషం యః కురుతే మర్త్యో బ్రహ్మహత్యాం లభేత్తుసః. 40

పితృదేవార్చనం యో వాత్యజే ద్వేదవిరూ పితమ్‌| యః కరోతి నిషిద్దం చ బ్రహ్మహత్యా లభేత్తుసః. 41

యో నిందంతి హృషికేశం తన్మంత్రో పాసకం తథై| పవిత్రాణాం పవిత్రం చ జ్ఞానానందం సనాతనమ్‌. 42

ప్రధానం వైష్ణవానాం చ దేవానాం సేవ్య మీశ్వరమ్‌| యోనార్చయంతి నిందంతి బ్రహ్మహత్యాం లభంతితే. 43

యో నిందంతి మమాదేవీం కారణ బ్రహ్మ రూపిణీమ్‌| సర్వవక్తి స్వరూపాం చ ప్రకృతిం సర్వమాతరమ్‌. 44

సర్వ దేవస్వరూపాం చ సర్వేషాం వందితా సదా | సర్వ కారణ రూపాం చ బ్రహ్మహత్యాం లభంతితే 45

కృష్ణ జన్మాష్టమౌ రామ నవమీం చ సువుణ్యదామ్‌| శివరాత్రిం తథా చైకాదశీ వారే రవే స్తథా. 46

పంచ పర్వాణి పుణ్యాని యే న కుర్వంతి మానవాః| లభంతి బ్రహ్మహత్యాంతే చాండాలాధిక పాపినః. 47

అంబు వాచ్యాం భూఖననం జలశౌ చాదికంచ యే| కుర్వంతి భారతే వర్షే బ్రహ్మహత్యాం లభంతితే. 48

గురుం చ మాతరం తాతం సాధ్వీంభార్యాం సుతం సుతామ్‌|

అనింద్యాయోనపుష్ణాతి బ్రహ్మహత్యాం లభేత్తుసః. 49

వివాహో యస్యనభ##వే న్న పశ్యతి సుతంతుయః| హరిభక్తి విహీనోయో బ్రహ్మహత్యాం లభేత్తుసః. 50

హరే రనైవేద్యభోజీ నిత్యం విష్ణుం న పూజయేత్‌| పుణ్యం పార్థివ లింగం చ బ్రహ్మహాసౌ ప్రకీర్తితః. 51

గోప్రహారం ప్రకుర్వంతి దృష్ట్వాయోనని వారయేత్‌| యాతి గో విప్రయోర్మధ్యే గోహత్యాం తు లభేత్తుసః 52

శక్తి భక్తులకును-శక్తి శాస్త్రములకును మధ్యభేదము గలదనువాడు బ్రహ్మహత్యా పాతకి. వేదములు నిరూపించునట్టి పితృదేవతల యర్చనాదులు బూటకమని నిందించి వానిని వదులువాడు బ్రహ్మహత్యా పాతకి. హృషీకేశుని-నతని మంత్రోపాసకులను నిందించువానికిని పరమపవిత్రుడు-నిత్యసత్యుడు-జ్ఞానానందుడు-సనాతనుడు వైష్ణవులకు ముఖ్యదేవుడు-సేవ్యుడునైన శ్రీకృష్ణ నర్చింపక నిందించువాడు బ్రహ్మహత్యా పాతకి. కారణ బ్రహ్మరూపిణి-సర్వశక్తి స్వరూపిణి-విశ్వమాత-మూలప్రకృతి-మహాదేవి సర్వవేదేవమయి-సర్వవందిత-సర్వకారణరూప-యగు శ్రీదేవిని నిందించువాడు-బ్రహ్మహత్యా పాతకి-శ్రీకష్ణ జన్మాష్టమి-పుణ్యప్రదమైన శ్రీరామనవమి- మహాశివరాత్రి-ఏకాదశి-రవివారము-ఈపుణ్యప్రదములైన పంచ మహాపర్వములు జరుపనివాడు బ్రహ్మహత్యా పాతకులు-చండాలుని కన్న పాపాత్ములు. అంబువాచి నాడు భూమిని ద్రవ్వువాడు-ఆ బావి నీట శౌచక్రియ జరుపువాడును బ్రహ్మహత్యా పాతకి. గురువు-తల్లి-తండ్రి-సాధ్వి-భార్య-బిడ్డలు-నిందింపదగనివారు-అను వీరిని బోషింపనివాడు-బ్రహ్మహత్యా పాతకి. పెండ్లిచేసికొననివాడు-పుత్రుని గననివాడు-హరిభక్తి లేనివాడు-బ్రహ్మహత్యాపాతకి. హరికి నివేదింపక తినువాడు-నిత్యము విష్ణుపూజ చేయనివాడు-పవిత్రమైన పార్థివ లింగ మర్చింపనివాడు బ్రహ్మహత్యాపాతకి. గోవులను గొట్టువాడు-గోవులను గొట్టువానిని వారింపని వాడు-గోబ్రాహ్మణుల మధ్యగ పోవువాడు- గోహత్యా పాతకి.

దండైర్య స్తాడయే న్మూడోయో విప్రోవృష వాహనః|దినే దినే గోవధం చ లభ##తే నాత్ర సంశయః. 53

దదాతిగోభ్య ఉచ్చిష్టం భోజయే ద్వృషవాహకమ్‌|భునక్తి వృషవాహాన్నం స గోహత్యాం లబేద్ధ్రువమ్‌. 54

వృషలీ పతిం యాజయేద్యో భుంక్తే న్నం తస్యయో నరః| గోహత్యా శతకం సోపి లభ##లే నాత్ర సంశయః. 55

పాదం దదాతి వహ్నౌ యోగాశ్చ పాదేన తాడయేత్‌| గేహం విశేదధౌ తాంఘ్రిః స్నాత్వాగోవధ మాప్నుయాత్‌. 56

యోభుం క్తే స్నిగ్ధ పాదేన శేతేస్నిగ్ధాంఘ్రిరేవచ| సూర్యోదయే చ యోభుం క్తే సగోహత్యాం లభేద్ధ్రువమ్‌. 57

అవీరాన్నం చ యోభుంక్తే యోనిజీవ్యస్య చ ద్విజ| యస్త్రిసం ధ్యావిహీన శ్చ గోహత్యాం లభ##తే చసః. 58

స్వభర్తరి చ దేవేవా భేదబుద్ధిం కరోతియా| కటూక్త్యా తా డయేత్కాంతం సాగోమత్యాం లభేద్ధ్రువమ్‌. 59

గోమార్గ వర్జనం కృత్వా దదాతి సస్య మేవవా| తడాకే వాతు దుర్గేవా సగోహత్యాం లభేద్ధ్రువమ్‌. 60

ప్రాయశ్చిత్తే గోవధస్య యః కరోతి వ్యతి క్రమమ్‌| పుత్రలోభాద థాజ్ఞా నాత్స గోహత్యాం లభేద్ధ్రువమ్‌. 61

రాజకే దైవకే యత్నాద్గో స్వామీగాం నరక్షతి| దుఃఖం దదాతి యోమూఢో గోహత్యాం సలభేద్ధ్రువమ్‌. 62

ప్రాణినో లంఘయే ద్యోహి దేవార్చామనలం జలమ్‌| నైవేద్యం పుష్ప మన్నం చ సగోహత్యాం లభేద్ధ్రువమ్‌. 63

శశ్వన్నాస్తీతి యోవాదీ మిథ్యావాదీ ప్రతారకః| దేవద్వేషీ గురుద్వేషీ స గోహత్యాం లభేద్ధ్రువమ్‌. 64

ఆవును కఱ్ఱతో గొట్టువాడును-ఎద్దు నెక్కువాడు నగు విప్రుడు దినదినము గోహత్యా పాతకు డగును. ఆవుల చేనెంగిలి యన్నము దినిపించువాడును-ఎద్దునెక్కువాని కన్నము పెట్టువాడును-ఎద్దునెక్కువాని యన్నము దినువాడును-గోహత్యా పాతకు డగును. శూద్రునిచే యజ్ఞము చేయించువాడును- శూద్రుని చేతి యన్నము దినువాడును- గోహత్యా పాతకు డగును. నిప్పును కాలితో చల్లార్చువాడును-ఆవును తన్నువాడును-కాళ్ళు కడుగుకొన కింటిలోని కేగువాడును గోహత్యా పాత కుడు. తడికాళ్ళతో తినువాడు -పండుకొనువాడును సూర్యోదయము వేళ నన్నము దినువాడు తప్పక గోహత్యా పాతకుడు. పతిపుత్రులు లేనిస్త్రీ చేతి యన్నము దినువాడు-మోసగించువాడు-త్రికాల సంధ్యావందనము చేయనివాడునైన విప్రుడు గోహత్యా పాతకుడగును. తనపతి-ఇష్టదైవము-వీరిర్వురిలో భేదము గలదని వికటముగ పెడగ మాటాడి భర్తను తూలనాడి కొట్టు గయ్యాళి భార్యకు గోహత్యా పాతకము నిక్కముగ చుట్టుకొనును. గోవులు నడచు త్రోవను చెడగొట్టి యందు పంట పండిం చిన-చెఱువు త్రవ్వించిన-దుర్గము నిర్మించిన-వాడు గోహత్యా పాతకుడగును. గోహత్య తన పుత్రునివలన జరిగినను-తెలి యక జరిగినను దానికి ప్రాయశ్చిత్తము జరుపుకొనని వానికి తప్పక గోహత్యా పాతకమంటుకొనును. రాజకీయోప్రదవము లందును-దేశోపద్రవములందును గోవులను- గోపాలురను రక్షింపని వానికి గోహత్యా పాతకము వెంటబడును. దేవతార్చన మును- అగ్నిని-జలమును-నైవేద్యమును-మంచి యన్నమును-పుష్టమును తిరస్కరించు వానికి నిశ్చితముగ గోహత్యా పాపము తగుల్కొనును. ఒకనికి పెట్టక తినువాడు మిథ్యావాది దేవ-గురు-ద్వేషి యైన వాడు గోహత్యా పాతకుడు.

దేవతా ప్రతిమాం దృష్ట్వా గురుం వా బ్రాహ్మణం సతి|సంభ్రమాన్న నమేద్యోహి స గోహత్యాం లభేద్ధ్రువమ్‌. 65

నదదా త్యాశిషం కోపాత్ర్పణతాయ చయోద్విజః|విద్యార్థినే చ విద్యాం చ స గోహత్యాం లభే ద్ధ్రువమ్‌. 66

గోహత్యా విప్రహత్యా చ కథితాచా೭೭తి దేశికీ| గమ్యాం స్త్రీయం నృణామేవ నిబోధ కథయామితే. 67

స్వస్త్రీగమ్యా చ సర్వేషామితి వేదాను శాసనమ్‌| అగమ్యా చ తదన్యా యా చేతి వేదవిదో విదుః. 68

సామాన్యం కథితం సర్వం విశేషం శృణు సుందరి|అత్యగమ్యా హి యాయాశ్చ నిబోధ కథయామి తాః. 69

శూద్రాణాం విప్రపత్నీ చ విప్రాణాం శూద్రకామినీ| అత్య గమ్యా చ నింద్యా చలోకే వేదే పతివ్రతే. 70

శూద్రాశ్చ బ్రాహ్మణీం గత్వా బ్రహ్మహత్యా శతం లభేత్‌| తత్సమం బ్రాహ్మణీ చాపి కుంభీ పాకంలభే ద్ధ్రువమ్‌. 71

శూద్రాణాం విప్రపత్నీ చ విప్రాణాం శూద్రాకామినీ| యతిశూద్రాం వ్రజే ద్విప్రోవృషలీ పతిరేవసః. 72

సభ్రష్టో విప్రజాతే శ్చ చాండాలాత్సోధమః స్మృతః| విష్ఠాసమశ్చ తత్పిండో మూత్రం తస్య చ తర్పణమ్‌. 73

న పితౄణాం సురాణాం చ తద్ద త్త ముప తిష్ఠతి| కోటి న్మార్జితం పుణ్యం తస్యార్చా తపసార్జితమ్‌. 74

ద్విజస్య వృషలీలోభా న్నశ్య త్యేవ న సంశయః|బ్రాహ్మణ శ్చ సురాపీతిర్విడ్బో జీవృషలీ పతిః. 75

తప్తముద్రా దగ్ధదేహస్తప్తశూ లాంకిత స్తథా| హరివాసరభోజీ చ కుంభీపాకం ప్రజేద్ద్విజః. 76

గురుపత్నీం రాజ పత్నీం స పత్నీం మాతరం ధ్రువమ్‌|

సుతాం పుత్రవధూం శ్వశ్రూం స గర్బాం భగినీం సతీమ్‌. 77

సోదరభ్రాతృజాయంచ మాతులానీం పితుఃప్రసూమ్‌| మాతుః ప్రసూం తత్స్వసారం భగినీభ్రాతృకన్యకామ్‌. 78

దేవతా విగ్రహమును-గురు బ్రాహ్మణులను చూచి నమస్కరించనివాడు బ్రహ్మహత్యా పాతకు డగును. మహాకోపముతో-తనకు నమస్కరించువాని కాశీస్సు లీయనివాడును విద్యకోరినవాని విద్య చెప్పనివాడు నగు విప్రుడు గోహత్యా పాతకు డగును. ఇంతవఱకునీకు బ్రహ్మహత్యా- గోపత్యా పాపములనే ఇచ్చు కృత్యముల (అతిదేశము) గుఱించి తెలిపితిని. ఇప్పు డేయే స్త్రీలను నరులు పొందవచ్చునో తెలుపుదును. చక్కగ వినుము. ప్రతివాడును తన భార్యను కూడవల యును. ఇతర స్త్రీలతో పొందు కూడదు. అనిపెద్దలగు వేదవిదులు పల్కుదురు. ఇది సామాన్య శాస్త్రము. ఇక వివేషము వినుము. ఏయే స్త్రీలతో కలియగూడదో తెలుపుదును. ఆలింపుము. ఓ సాధ్వీమతల్లీ! శూద్రులు బ్రాహ్మణ స్త్రీని బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని కలియరాదు. అది లోకమందు వేదమందు నింద్యమైనది. శూద్రుడు బాపన దానితో కలిసినచో వానికి నూరు బ్రహ్మహత్యా పాతకములు చుట్టుకొనును. ఆమె కుంభీపాక నరకమున గూలును. శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని గూడిన ఫలితమే-బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని గూడిన గల్గును. విప్రుడు శూద్ర స్త్రీని గూడినచో నతనిని వృషలీపతి యందురు. అతడు బ్రాహ్మణ జాతిలో-భ్రష్టుడు. చండాలుని కన్న నధముడు. అతడు తన పితరుల కిచ్చు పిండములు మలముగ తర్పణము మూత్రముగ నగును. అతడు దేవ పితరుల నుద్దేశించి యేమిచ్చినను వారి కది చెందదు- తొల్లిటి కోటి జన్మల పుణ్యరాశి ఊజాతపముల పుణ్యఫలము అంతయును శూద్ర స్త్రీవ్యామోహము గలవానినుండి నశించుపోవును. సురా పానము చేయువాడు వృషలీపతి యగు విప్రుడు-మలభోజి యగును. తప్త ముద్రాంకములు-శూలాంకములు గల్గి దగ్ధదేహు డైన వాడును ఏకాదశినా డన్నము దినువాడును కుంభీపాక నరకమున పడును. గురుపత్ని-రాజపత్ని-సవితితల్లి-కూతురు-కోడలు-అత్త-తోబుట్టువు-గర్భిణి-సతి-వదిన-మేనమామ భార్య-అమ్మమ్మ-నాయనమ్మ-మేనత్త-సోదరి-అక్కచెల్లెండ్రు-అన్న కూతురు-

శిష్యాం శిష్యస్య పత్నీం చ భాగినే యస్య కామినీమ్‌| భ్రాతుఃపుత్ర ప్రియాంచైవా త్యగమ్యా ఆహ పద్మజః. 79

ఏతాం కామేన కాంతాయో ప్రజేద్వై మానవాధమః| సమాతృగామీ వేదేషు బ్రహ్మహత్యా శతం వ్రజేత్‌. 80

అకర్మా ర్హో7ప్య సంస్పృశ్యోలోకే వేదే చ నిందితః | స యాతి కుంభీపాకే చ మహాపాపీ సుదుష్కరే. 81

కరోత్య శుద్ధాం సంధ్యాం వా న సంధ్యాంవా కరోతి చ| త్రిసంధ్యం వర్జయేద్యోవా సంధ్యా హీనశ్చ సద్విజః. 82

వైష్ణవం చ తథా శైవం శాక్తం సౌరం చ గాణపమ్‌|యోహంకారాన్న గృహ్ణాతి మంత్రం సోదీక్షితః స్మృతః. 83

ప్రవాహ మవధింకృత్వా యావద్ధస్త చతుష్టయమ్‌| తత్ర నారాయణః స్వామీ గంగాగర్బాంతరే వసేత్‌. 84

తత్ర నారాయణ క్షేత్రే మృతోయాతి హరేఃపదమ్‌| వారాణస్యాం బదర్యాం చ గంగాసాగర సంగమే. 85

పుష్కరే హరిహరి క్షేత్రే ప్రభాసే కామరూస్థలే| హరిద్వారే చ కేదారే తథా మాతృపురేపి చ. 86

సరస్వతీ న దీతీరే పుణ్య బృందావనే వనే| గోదావర్యాం చ కౌశిక్యాం త్రివేణ్యాం చ హిమాచలే. 87

ఏషు తీర్థేషు యోధనం ప్రతిగృహ్ణాతి కామతః| స చ తీర్థ ప్రతిగ్రాహీ కుంభీపాకే ప్రయాతి సః. 88

శూద్రసేవీ శూద్రయాజీ గ్రామయాజీతి కీర్తితః| తథా దేవోపజీవీ చ దేవలః పరి కీర్తితః. 89

శూద్ర పాకోపజీవి యఃసూపకార ఇతి స్మృతః|సంధ్యా పూజన హీనశ్చ ప్రమత్తః పతితః స్మృతః. 90

ఉక్తం సర్వం మయాభ##ద్రే లక్షణం వృషలీ పతేః| ఏతే మహా పాతకినః కుంభీపాకే ప్రయాంతితే. 91

కుండాన్యన్యాని యే యాంతి నిబోధ కథయామితే|

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నారద నారాయణ

సంవాదే సావిత్య్రు పాఖ్యానే చతుస్త్రింశ్యోధ్యాయః.

శిష్యురాలు-శిష్యుని భార్య-బావ-బావ పెండ్లము-అన్న కోడలు- వీరితో గలియరాదని బ్రహ్మ శాసించెను. వీరిలో నెవరితోనైన కామాతిరేకమున గూడిన మానవాధముడు మాతృగామి యగునని యతడు బ్రహ్మహత్యా పాతకు డగునని వేదములు శాసించును. అట్టి పాపాత్ముని తాకరాదు. వా డెట్టి కర్మకును తగడు. వానిని లోకములు-వేదములు నిందించును. వాడు దుస్సహమైన కుంభీపాక నరకమున గూలును. శాస్త్ర ప్రకారము సంధ్యావందనము చేయనివాడు త్రికాల సంధ్యావందన మాచరింపనివాడు సంధ్యాహీను డనబడును. వైష్ణవము-శైవము-శాక్తము-సౌరము-గాణాపత్యము వీనిలోనే దేవత మంత్రమైన నుపాసించని వాడు అదీక్షితుడు అనబడును. నదీతీరమునుండి నాల్గుచేతుల ప్రమాణముల నీటి బైట నీటిలోన నున్న తీర్థమును నారాయణ తీర్థమందురు. ఆపుణ్య నారాయణ తీర్థమందు ప్రాణములు వదలిని పుణ్యాత్ముడు విష్ణుపద మలంకరించును. అట్టి నారాయణ తీర్థము-కాశి-బదరి-గంగా సాగర సంగమము-పుష్కరము-హరిహర క్షేత్రము -ప్రభాసము-కామరూపస్థలము-హరిద్వారము-కేదారము-రేణుకా స్థలి-సరస్వతి తటము-పావన బృందావనము-గోదావరి-కౌశికి-త్రివేణి- హిమాచలము వీనిలో నే తీర్థమం దైనను సకామముగ దానము పట్టువాడు- తీర్థ ప్రతిగ్రాహి యనబడును. అతడు కుంభీపాక నరకమున యాతనలను భవించి తీరును. శూద్రసేవి-శూద్రయాజి-గ్రామయాజి యనబడును. దేవ విగ్రహముల నర్చించి బ్రదుకు సాగించు పూజారి దేవలు డనబడును. శూద్రులకు వంట వండి బ్రదుకువాడు శూద్రుని వంటలవా డనబడును. సంధ్యాపూజలు లేనివాడు ప్రమత్తుడు-పతితుడు నగును. ఓ కల్యాణీ! వృషలీపతి లక్షణము లన్నియు వివరించితిని. ఈ పాపా త్ములు కుంభీపాక నరకయాతన లొందుదురు. ఇంకితర నరక కుండములకు వెళ్ళువారిని గుఱించి తెల్పుదును ఆలకింపుము.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమున నారద నారాయణ సంవాదమున

సావిత్రుపాఖ్యానమున ముప్పదినాల్గవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters