Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

శంకరావతారము

''చిత్తశుద్దిని సాధించి పరమాత్మతో ఐక్యం కావడమే యోగం'' అని శ్రీకృష్ణభగవానుడు అర్జునుడికి ఉపదేశించారు. 'యోగం' అంటే చేరిక, వానికి 'ఉత్తమయోగము' అనగా వానికి మంచి గ్రహములన్నీ చేరి ఉన్నయని అర్థం. ఉత్తమ పదార్థంతో కలియడమే ఉత్తమయోగం. జ్ఞానస్యరూపమే ఉత్తమ పదార్థము. తక్కినవన్నీ దానికి దిగువవే. అట్టి జ్ఞానస్వరూపంతో చేరడమే ఉత్తమయోగం. ఈ యోగాన్ని సాధించడానికి సాధనం నిష్కామకర్మ. అలా నిష్కామకర్మ నాచరిస్తూ ఉత్తమ పదార్థంతో కలియడం పేరే కర్మయోగం. ఇట్టి యోగాలను ఎన్నిటినో వేదాలు వివరించాయి. పరమాత్మతో నిరంతరమైన కలయికకు కావలసిన సాధన లెన్నో వేదాలలో చెప్పబడ్డాయి. 'అంతరం' అంటే భేదం. నిరంతరం అంటే అభేదం. భేదరహితమైన చేరికయే నిరంతరయోగం, అనగా- భేదరహితముగా జ్ఞాన స్వరూపమైన పరమాత్మతోడికలయిక. ఏకమైనచో వియోగంలేదు. కొంచెం వియోగం ఉన్నా అది నిరంతరయోగం కాదు.

-ఉదరమంతరం కురుతే, అథతస్య భయం భవతి

ఉదరమంతరం కురుతే, అథతస్య భయం భవతి

తత్త్వే భయం విదుషో మన్యానస్య

- తైత్తరీయోపనిషత్‌-బ్రహ్మవల్లీ.

భేదం కొంచెంగా ఉన్నప్పటికీ ఈ కలయిక ఎపుడు అంతరిస్తుందో అన్న భయం ఉంటుంది. తన్మయంగా, భేదరహితంగా ఉన్నపుడు లేశ##మైనా భయం ఉండదు. అట్టి అభేదమైన నిరంతరమై కలయికకు వేదాలు సాధనాలుగా మాత్రం ఉన్నాయని శ్రీకృష్ణస్వామి అర్జునునకు బోధించారు.

'ఇమం వివస్వతే యోగం ప్రోక్త వానహ మవ్యయం|

వివస్వాన్‌ మనవే ప్రాహ మనురిక్ష్యాకవే2బ్రవీత్‌||

ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజరయోవిదుః|

స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప|| - గీత-1-2.

'ఓ అర్జునా! నేనీయోగాన్ని పూర్వం వివస్వానునికి బోధించాను. ఇది జరిగి చాలాకాలం అయింది. ఉత్తమాధికారియందు యోగం పూర్తిగా భాసిస్తుంది. ఆ వివస్వానుడు ఉత్తమాధికారియే. కాని అతని తరువాతివారు అంతగా పంటకు వచ్చిన వారుకాదు. తగిన పక్వత లేనికారణంగా ఆ యోగము వారియందు శిధిలమైనది, పరంపరంగావచ్చే యోగము ఉత్తమాధికారులు లేకనేడు జీర్ణావస్థకు చేరు కొన్నది. అందువల్లనే దానిని ఉద్ధరించుటకే నేను వచ్చేను'- అని ఆ తరువాత శ్రీకృష్ణస్వామి చెప్పినమాట-

బహూనియే వ్యతీతాని జన్మాని తవచార్జున|

తాన్యహం వేత్థ సర్వాణి నత్వం వేత్థ పరంతప||

- గీత 4-5.

'అర్జునా! నేను ఎన్నో జన్మ లెత్తేను. నీవున్ను ఎన్నో సార్లు జన్మించేవు. ఈ జన్మలను గూర్చి నీవెఱగవు కాని నేనెఱుగుదును'-అని.

అనగా-ఏనాటివాడో అయిన వివస్వానునకు నేటినీవు యోగమును బోధించుట ఎట్లు? అని ఆర్జునుని మానసంలో ఉండే ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు పైమాటలు చెప్పేడు. ఆ వివస్వానునకు నేను వేదరూపంలో యోగం బోధించాను-అని భావం.

పరమేశ్వరునకు కృష్ణునకు భేదం లేదు. ఇరువురును ఒక్కరే. అందువల్లనే స్మార్తులు ఒకవంక భస్మరుద్రాక్షలను ధరిస్తూవేఱోకవంక విష్ణుపూజనం చేస్తారు. అద్యైతవిధానంలో శివకేశవులకు భేదం లేదు. శ్రుతిస్మృతి పురాణాదుల తాత్పర్యంకూడ దీనికంటె వేరుకాదు. గీతయందు అర్జునునకు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించినట్లు ఉన్నదికదా! ఆ విశ్వరూపం ఈశ్వరరూపమే.

'దివ్యం దదామితే చక్షు: పశ్య మే యోగమైశ్వరమ్‌'

గీత118.

ఈశ్వర శబ్దమునకు పరమశివుడనియే అర్థం. 'ఈశ్వరశ్శర్వ ఈశాన శ్శంకరశ్చంద్రశేఖరః' అని అమరకోశములో చెప్పబడ్డది. 'ఆ గ్రంథం విష్ణువును ఈశ్వరుడని చెప్పలేదు. లోకంలో కూడా శివాలయాన్నే ఈశ్వరాలయం అంటారు. కానా విష్ణ్వాలయాన్ని ఈశ్వరాయలం అని పిలువరు. విష్ణువుయొక్క కోవెలను 'పెరుమాళ్ళుగుడి' అని పిలుస్తారు. అందుచే గీతలోని పై 'ఐశ్వరం' అన్న శబ్దము పరమశివునే సూచిస్తుంది కాని విష్ణువును చూచించదు. అదీకాక మూడుకన్నులు కలవానియందే ఈశ్వరశబ్ద వ్యవహారం కాని ఇతరత్రా కాదు. కాళిదాసు అట్లే చెప్పేడు.

హరి ర్యథైకః పురుషోత్తమః స్మృతః

మహేశ్వర స్త్ర్యంబక ఏవ నాపరః

రఘవంశము 3-49.

వేదాంతేషు య మాహం రేకపురుషం వ్యాప్యస్థితం రోదసీ

యస్మిన్నీశ్వర ఇత్యనన్యవిషయః శబ్దో యథార్థాక్షరః|

అంతర్యశ్చ ముముక్షుభి ర్నియమిత ప్రాణాదిభి ర్గృహ్యతే

సస్థాణుః స్థిరభక్తి యోగసులభో నిశ్ర్శేయసాయాస్తునః||

- విక్రమోర్వశీయము1-1.

పురుషోత్తమ శబ్దం హరిని, ఈశ్వరశబ్దం త్ర్యంబకుని (మూడు కన్నులుగలవానిని) సూచిస్తాయనీ ఈశ్వరశబ్దం ఎవని యందు రూఢమో ఆయన భక్తసులభుడై అనుగ్రహం చూపుతాడని- ఆ మహాకవి చెప్పేడు.

ఈ విధంగా అమరకోశము, లోకవ్యవహారము, మహాకవివాక్కు యీశ్వరశబ్దం పరమశివునే తెలుపుతుంది అనడానికి ప్రమాణాలుగా ఉన్నాయి. కాగా ఆ యీశ్వరరూపమే శ్రీకృష్ణస్వామి అర్జునునకు చూపించిన విశ్వరూపం. మరియు

కాలో2స్మి లోకక్షయకృత్‌ ప్రవృద్ధః

- గీత 11-32.

అంటూ - ఆయన లోకసంహారకరమైన రూపాన్నే అర్జుననుకు చూపించి-చూడు! వీరంతా కాలరూపినైన నా కోరలలో ఇదివరకే చిక్కియున్నారని చెప్పేరు. అందుచే శ్రీకృష్ణుడు చూపిన విశ్వరూపము ఈశ్వరరూపమే అనియు-ఈశ్వరునకు కృష్ణునకు భేదం లేదనియు తెలుస్తోంది.

వేరోక చోట---

ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశే2ర్జున తిష్ఠతి|

భ్రామయన్‌ సర్వభూతాని యం త్రారూఢాని మాయయా||

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత|

తత్ర్పసాదాత్‌ పరాంశాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం||

-గీత 18-61, 62.

అని పలికేరు. అనగా సర్వజీవులయొక్క హృన్మధ్యంలో ఈశ్వరు డుంటాడని, ఆయన అనుగ్రహంవల్లనే పరమ శాంతి లభిస్తుందని, ఇతరస్థలాలలో అహంకారం నశించదనీ శ్రీకృష్ణస్వామి ఉపదేవం. శ్రీకృష్ణులు ఇతరస్థలాలలో ఈశ్వర శబ్దం వాడినా 'నేను' అన్నమాట వెంబడి 'వాడు' అన్నమాట కూడా ఉపయోగిస్తూ హృదయంకంటే భిన్నమైన తావులలో అహంకారం నశించదనీ అభేదజ్ఞానం ఏర్పడదని సూచించారు. ఆయన ఇలా అభేదంగా ఈశ్వర శబ్దాన్ని ఉపయోగించిన చోట్లు రెండే, ఒకటి విశ్వరూపప్రదర్శనకాలం. రెండు పరమమోక్షసాధనాన్ని ఉపదేశించే సమయం. శివకేశవులకు గల ఈ అభేదాన్ని గుర్తించి స్మార్తులు శివాలయాలకు విష్ణ్వాలయాలకు సమాన భక్తిశ్రద్దలతో పోతూ ఉంటారు.

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత|

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం||

- గీత 4-7.

'ధర్మం క్షీణించి అధర్మం విజృంభించిన సమయంలో నేను పుడమిపై అవతరిస్తాను' అన్నారు శ్రీకృష్ణభగవానులు.

అనగా వెనుక వివస్వానునకు దెల్పిన యోగం యిప్పుడు లోకంలో నశించింది. దానిని పునరుద్ధరించడానికే నా యీ అవతారం. నేను నారాయణుడను, నీవు నరుడవు. వెనుకటి అనేకములైన పుట్టుకలు నేనెరుగుదునే కాని నీ వెరుగవు అని అంటారు ఆయన.

ఆ శ్రీకృష్ణులే నారాయణులుగా అవతరించినవేళ అర్జునుడు నరుడై జన్మించాడు. ఆ అవతారంలో వారిద్దరూ బదరికాశ్రమంలో తపస్సు చేశారు. వారు తపస్సు చేస్తూఉండగా దేవతలు వారు నరనారాయణులని ఎరుగక వారి తపస్సును పాడుచేయటానికి అప్సరసలను పంపేరు. ఆ అచ్చరలంతా మెరుపుదీవలవలె మెరుస్తూ హావభావములచే నృత్యగీతములచే నరనారాయణులను ప్రలోభ##పెట్టాలని యత్నించారు. అప్పుడు వారిని చూచి నరుడు హుంకరించాడు. దానికి వారంతా బెడరి పోయి నారాయణుని దగ్గరకు వచ్చేరు. అలా తనదగ్గరకువచ్చిన అచ్చరలను చూచి నారాయణుడు తనతొడను చేతితో తట్టేడు. వెంటనే అందుండి వేలకొలది యువతులు, దేవతలు పంపిన అప్సరసలకంటె ఎక్కువ రూపలావణ్యాలు కలవారు జన్మించేరు. వారిని చూచి దేవతలచే పంపబడ్డ అచ్చరలు సిగ్గుపడి వెడలిపోయేరు.

ఇలా శ్రీకృష్ణులు ఎన్నోసార్లు అవతరించేరు. ప్రతి అవతారములోనూ జ్ఞానోపదేశంచేశారు. ఎప్పుడు జ్ఞానోపదేశం చేసినా ఈశ్వరునితో అభేదంగా ఉండి విశ్వరూపం ప్రదర్శిస్తూ (భిన్న భిన్న విధాలుగా) వచ్చేరు.

జ్ఞానం ఈశ్వరానుగ్రహం లేనిదే లభింపదు.

ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్‌ శ్రియ మిచ్ఛేద్ధుతాశనాత్‌|

ఈశ్వరాత్‌ జ్ఞాన మన్విచ్ఛేత్‌ జ్ఞానదాతా మహేశ్వర:||

జ్ఞానదాత, జ్ఞానస్వరూపి మహేశ్వరుడే. ఈశ్వరుని కొక్కనికే సర్వజ్ఞుడని పేరు. అమరకోశం కూడా అట్లే చెప్పింది. 'ఈశానః సర్వవిద్యానాం' అని వేదము. లోకాలను పాలించుటకు పరమాత్మయే ఈశ్వరుడై ఉన్నాడు.

నశించిపోయిన జీవబ్రహ్మాభేదయోగాన్ని పునరుద్ధరించడానికై శ్రీకృష్ణులు అవతరించారు. ఆ అవతరణం ద్వాపరాంతంలో జరిగింది. పిమ్మట కలి పుట్టినది. ఆ యోగము తిరుగనష్టమై పోయినది. ఏవో డెబ్బదిరెండు దుర్మతాలు లోకంలో అల్లుకొన్నాయి. ఏ దుర్మతమైనా దానికి ఆరంభంలో జీవం ఎక్కువ. కాని అవి చిరకాలం నిలువలేవు. తొందరలోనే అంతరిస్తూ ఉంటాయి. కరుణానిధియైన పరమేశ్వరునితో ఏమీభేదంలేకుండా ఏకంకావడమే వేదాలు చెప్పే పరమార్థం. అదే అద్వైతం. ఆ అద్వైతముపై విశ్వాసం కృతయుగంలో పరిపూర్ణంగా ఉండేది. ద్వాపరంలో ఆ విశ్వాసం కొంత సన్నగిల్లినది. కాని కలిలో అధర్మం బాగా విజృంభిచి, ధర్మం చాలా క్షీణించింది. అందుచే అద్వైతవిశ్వాసం ఎక్కువగా లోపించింది.

శ్రీకృష్ణావతారంలో కొంతసేపుమాత్రమే అర్జునునకు జ్ఞానోపదేశం చెయ్యడం జరిగింది. మిగిలిన కాలం అంతా అయన రాజ్యవిషయాలను చక్కదిద్దడంలో గడిపేరు. రాజ్యాలలో ధర్మం సుప్రతిష్టితం కావడానికి వలసిన ముక్తులన్నీ ఆయన ఆచరించారు. పంచపాండవులు ప్రార్థిస్తే కౌరవసభకు దూతగా వెళ్ళేరు. ఇలా ఎన్నో పనులు నిర్వర్తిస్తూ జ్ఞానోపదేశానికి కొద్దిసమయం మాత్రమే వినియోగించేరు. అది ద్వాపరయుగం. ఆనాడు కలిలోవలె ధర్మం అనగా అద్వైతవిశ్వాసం బాగా క్షీణించనూలేదు, దుర్మతాలు ఎక్కువ విజృంభించనూ లేదు. కాగా ఆనాటికా పని చాలి ఉన్నా కలిలో ఆ మాత్రంచేస్తే చాలదు. ఇక్కడ పూర్తి జ్ఞానోపదేశంలోనే అవతారకాలం అంతానడవాలి. జ్ఞానోపదేశం తప్ప వేరోకపనిలేని అవతారం కలికి అవసరమైనది.

ఇక్కడ కొందరు శంకిస్తూ ఉంటారు. ఏమని అంటే అయ్యా! కలిలో అధర్మాలు ప్రబలుతాయని ధర్మం క్షీణిస్తుందని పురాణాలు చెప్పిన మాటయేకదా! ఇక వేదాలు నశిస్తున్నాయనీ అధర్మం పెరిగిపోతోందనీ గోల చేయడం ఎందుకు? దీనివల్ల ప్రయోజనం ఏమున్నది? పురాణాలు చెప్పినమాటలు దబ్బరలు కావని మీరే అంటున్నారు కదా!- అని ఆక్షేపిస్తారు వారు.

జోస్యం విషయంలోకూడా వారి ఆక్షేపణ ఈ తీరుగానే ఉంటుంది. దానిని గూర్చి వారి ఆక్షేపణ ఏమంటే-జోస్యం వట్టి నిరర్థకవిషయం. మనకు దుఃఖం రానున్నదని జోస్యం ద్వారా తెలిసింది. దానివల్ల ఎప్పుడో రాబోయే దుఃఖాన్ని తలచుకొని ఇప్పటినుండీ ఏడవవలసి వస్తోంది. అలా కాక మనకు ఏదో గొప్ప సుఖం కలుగనున్నదని జోస్యంద్వారా తెలిసింది. అప్పుడు రాబోయే సుఖాన్నిగూర్చి ముందే తెలియడంద్వారా వాస్తవంగా సుఖం కలిగిన సమయంలో ఎక్కువ ఆనందం అనుభవించలేకున్నాము. ఈ సుఖం ఎలాగూ రావలిసినదే. వచ్చినది, అంతే! అన్నభావంతో ఎక్కువగా ఆనందించలేము. కాగా జ్యోస్యం రానున్న సుఖాన్ని గూర్చి చెప్పినా లేక దుఃఖాన్ని గూర్చి చెప్పినా మనకు కలిగే ప్రయోజనం లేదు సరికదా; నష్టం ఉన్నదని వారి ఆక్షేపణ.

మరి అయితే ఆ పురాణాలలో కలిరాబోతోంది, ధర్మం క్షీణిస్తుంది, అధర్మం విజృంభిస్తుంది-అనే మాటలు ఎందుకు చెప్పినట్లు? ముందుగా ఈ హెచ్చరిక చేయడంవల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పై ఆక్షేపణచూస్తే కొందరకు సమాధానం వెంటనే స్ఫురించదు.

కాని పరిశీలిస్తే ఆ హెచ్చరిక నిష్ర్పయోజనం కాదని, దానివల్ల ప్రయోజనం ఉందని తేలుతుంది.

ఒకచోట దొంగల భయం ఎక్కువగా ఉన్నది. ఆ దొంగలు గజదొంగలు. ఎంత జాగ్రత్తగా భద్రం చేసినా సొత్తు ఎత్తు పోతున్నారు. ఇది అచట నున్న వారికందరికీ తెలిసినదే. అయితే మాత్రం - మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు మన కన్నులుగప్పి సొత్తు అపహరిస్తూనే ఉన్నారు. ఇక మనం జాగ్రత్తపడి ప్రయోజనం ఏముంది? ఇంటిలో ఉన్న యీ సొత్తు అంతా వాకిటిలోనే పారవేద్దాం- అని తలచేవారు ఉంటారా! ఉండరు. జాగ్రత్తకలిగి ఉంటే ఏదో కొంతైనా రక్షించుకోవచ్చునను కొంటారేగాని సొమ్మును నడివీధిలో పారవేయరు.

అలాగే కలిలోని ధర్మవిషయములో కూడ ఎక్కువ జాగ్రత్త అవసరమని తెలియజేయడానికే పురాణాలు అలా హెచ్చరించాయి. అదీ కాక కలిలోని అధర్మప్రవాహాన్ని ఎదురిస్తూ ఆచరించిన ధర్మం అల్పమైనా ఇతర యుగాలలో ఆచరించపడినదాని కంటె కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిపక్షాన్ని ఎదురించి నిలుచుటలోనే శూరుడు యశ మార్జిస్తాడు. అందుచే లోకం ఎంత పరిహసిస్తూ ఉన్నా లక్ష్య పెట్టక ధైర్యంతో ధర్మాన్ని ఆచరిస్తే ఎంత కలి అయినా చిత్తశుద్ధి కలుగుతుందనడానికి సందేహం లేదు.

'కలిః సాధుః' అని ఒక వాక్యము. అనగా కలికాలము సాధువైన కాలము అని అర్థం. ఇదెలా! వెనుకచెప్పిన మాటలకిది విరుద్ధం కాదా! అనిపిస్తుంది. ఇది వేరొక దృష్టితో చెప్పినమాట. మిగిలిన యుగాలలో ఎంతోకాలం తపస్సుచేస్తేగాని లభించని ఫలితం కలిలో అల్పకాలం చేసిన తపస్సు ద్వారా పొందవచ్చును. అది దృష్టియందుంచుకొని 'కలిః సాధుః' అన్నారు. ఈశ్వరుడుకూడ ఈ యుగంలో తన్నెవరును ఆశ్రయింపవచ్చుటలేదే! అని, ఎవరైనా తనవద్దకు వెదకుకుంటూ వస్తారా! అనీ అట్టివారిని తానే వెదకుతూ ఉంటాడు. తనను గూర్చి కొంచెంగా అన్వేషించేవానిని కూడా చక్కగా అనుగ్రహిస్తారు. అందుచే కలిలో అధర్మం ఎక్కువుగా ఉండేమాట నిజమైనా ఇచట ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువైనందున వేదధర్మాలను ఎవరూ విడచిపెట్టకూడదు.

కలి ప్రారంభంలో కట్టతెగిన ప్రవాహంవలె అధర్మం లోకాన్ని ముంచి ఎత్తింది. ఈ అధర్మ ప్రవాహాన్ని నిలుపడానికి సంకల్పించి పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణవంశంలో అవతరించేడు. సర్వవిద్యలకు అధిపతి అయిన సదాశివుడు జ్ఞానోపదేశానికై అవతరించారు. అదియే శంకరావతారము ఆయన ఈ అవతారము జ్ఞానప్రధానమైనది- విష్ణువు యొక్క అవతారాలన్నీ క్షాత్రప్రధానాలు.

'శంకర విజయము' లో- శంకరులు అవతరించిన సమయంలో లోకంలో డెబ్బదిరెండు మతాలు ఉన్నాయని చెప్పబడ్డది. ఆ మతము లన్నిటిని గూర్చి నేడు మనకు తెలియదు. బౌద్ధమతము, సాంఖ్యమతము, వైశేషికమతము ఇలా కొన్నిటిని గూర్చి మాత్రం ఇప్పుడు మనం తెలిసికోగలం. మిగిలిన మతాలు పుస్తకాలలో అయితే ఉన్నాయికాని దేశంలో లేవు. ఒక్క బుద్ధమతం మాత్రం జన్మదేశంలో కంటే దేశాంతరాలలో పాదుకొని ఉన్నది. జన్మదేశంలో కూడా ఈ మధ్య తిరిగి అడుగుపెట్టినదే కాని వెనుకలేదు.

ఇలా ఆ డెబ్బదిరెండు మతాలూ ప్రచారంలో లేకుండా పోయేయి. వానిని గూర్చి తెలియడానికి పుస్తకాలు, కొన్ని చోట్ల కొన్ని శిథిలశిల్పాలు మాత్రం ఆధారంగా ఉన్నాయి. ఇన్ని మతాలు నామరూపాలు కూడా లేకుండా నశించేయి అంటే- ఇంతపని ఎవరు చేసేరు? శంకరులు. ఆయన ఈ మతాల నన్నిటినీ నిరాకరించారు. అందుచే అవి పేరు ఊరు లేకుండా నశించాయి.

శంకరు అవతరించిన మీదట వారికి ముందున్న మతాలన్నీ అడుగంటేయి. ఇప్పుడు శంకరమతమే కాక ఇంకా కొన్ని మతాలు దేశంలో ఉన్నాయి. ఈ మతాలన్నీ శంకరులకు పిమ్మటనే వచ్చేయి.

శ్రీ మద్రామానుజమతం, మధ్వాచార్యమతం, శ్రీకృష్ణ చైతన్యమతం- ఈ మతాలు కొంత భిన్నతతో లోకంలో వెలసేయి. కాని ఇవే తమకు ముందున్న మతాలను నిర్మూలించలేదు. రామానుజాచార్యులవారికి పిదప లోకంలో అద్వైతం నశించిందనడానికి వీలేదీ! అట్లే మధ్వాచార్యులవారి అనంతరం శంకరుల అద్వైతము, శ్రీ మద్రామానుజుల విశిష్టాద్వైతమూ రెండూ నిలచే ఉన్నాయికాని నశించలేదు. కాని శంకరుల అవతారానికి పూర్వం దేశంలో ఉన్నమతాలు వారవతరించిన మీదట నామరూపాలూ లేకుండా నశించేయి. వానిలో ఒక్క మతమైనా-ఇదిగో! నేనున్నానని- దేశంలో నిలువద్రొక్కుకొన్నదిలేదు. ఈ కారణంచేతనే శ్రీ శంకరులకు జగదాచార్యులన్న గౌరవం కలిగింది.

మన యీ భారతదేశం కర్మభూమి. ఇచ్చట ఇతర మతాలకు తావుండకూడదని శ్రీ శంకరులు సంకల్పించి కృతకృత్యులయ్యేరు. వారు చేసిన కార్యం ఇతరులకు చేయసాధ్యంకాలేదు.

శంకర మతముదప్ప మిగిలిన మతాలన్నీ (నేడు దేశంలో ఉన్నమతాలు) వేదమతంలో ఉన్న ఏకదేశగుణాలను దీసికొని నిలువబడ్డాయి. శ్రీ మద్రామానుజులు మధ్వాచార్యులు విష్ణు సంబంధములైన శబ్దాలను మాత్రం గ్రహించి వాని అర్థములను విస్తరింపజేస్తూ తమ మతాలను నెలకొల్పేరు. శ్రీ కంఠాచార్యులవారు శైవశబ్దాలను మాత్రమే గ్రహించేరు. బౌద్ధులు కూడా ఇట్లే వేదాలలోని కొన్ని ఏకదేవాంశాలను గ్రహించేరు. సర్వమైన వేదమును గ్రహించినది శ్రీ శంకరులొక్కరే. తక్కినవారు వేదాలను పూర్తిగా అంగీకరించలేదు. మన ఆచార్యులవారు మాత్రం అంతయూ ఒక్కటే అని సమస్తమైన వేదమును ప్రమాణముగా గ్రహించేరు.

అద్వైతం సర్వాన్నీ సమ్మతిస్తుంది. ఆ అద్వైతస్థితిని పొందాలంటే వేదాలు చెప్పినట్లు కర్మానుష్ఠానాలు చెయ్యాలి. కర్మాచరణంలో మనం ఎంత శ్రద్ధా విశ్వాసాలు చూపిస్తామో అద్వైతస్థితి అంతగా సన్నిహితం అవుతుంది. కర్మానుస్ఠానానికి భేదస్థితి అవసరం. దానివల్లనే అభేదస్థితి చేకూరుతుంది.

'అదేమిటి? భేదాన్ని పాటిస్తూ కర్మాచరణం చేసిన వానికి భేదస్థితే లభిస్తుంది కాని అభేదస్థితి లేక అద్వైతం ఎలా లభిస్తాయి? అద్వైతం ప్రాపించాలంటే ఉన్న నియమాలు నిబంధనలు అన్నీ తొలగాలి- ఈ నియమాలన్నీ ఎందుకు? ఇవన్నీ అద్వైతస్థితికి అభేదస్థితికి బాధకాలు కావా?' అని కొందఱు తలుస్తూ ఉంటారు.

కాని మనం చాలా పెద్దబంధంలో చిక్కి ఉన్నాము. కామక్రోధాలకు వశులమై మనము సంపాదించిన పాపాలమూట చాలా పెద్దిది. దాని నెలా వదల్చుకోగలం? అన్నది ముందు ఆలోచించాలి. వర్ణాశ్రమధర్మాలు అనే వేరొక బంధంలో చిక్కుకొంటే కామక్రోధాల బంధం సడలుతుంది. పాపాచరణానికి తావుండదు. క్రమంగా మానవుడు నిసై#్రగుణ్యస్థితికి చేరుకొంటాడు. ఆ స్థితికి చేరుకొన్న వానికి విధి నిషేధాలు లేవు.

'నిపై#్త్రగుణ్య పథి విచరతాం కోవిధిః కోనిషేదః'

కాగా త్రిగుణాలకు (సత్వరజస్తమోగుణాలు) కట్టుబడి ఉన్నంతవరకు వర్ణాశ్రమధర్మాలకట్టు తప్పనిదే. ఆ కట్టులేక పోయిననాడు ఈ కట్టు ఉండదు. దానికొరకే యీ అనుష్ఠానాలన్నీ ఆచరించడం.

దేహంలోని బాధను తొలగించుకొనడానికి ఆముదం త్రాగుతూ ఉన్నాం. ఆముదం త్రాగడం బాధయోగాని సుఖం కాదు కదా! అంటే ఒక బాధను తొలగించుకొనటానికి వేరొక బాధను ఆహ్వానిస్తున్నాం. అలాగే త్రైగుణ్యమైన బంధాన్ని వదల్చుకొనడంకోసం వర్ణాశ్రమధర్మాల బంధంలో చిక్కుకోవాలి. ఈ బంధాన్ని మనం ఎంతగా బిగిస్తే ఆ బంధం అంతగా సడలుతుంది. పూర్తిగా సడలిన మీదట రెండుబంధాలు తొలగుతాయి.

కాగా ఇలా కర్మానుష్ఠాంచేస్తూక్రమంగా అద్వైతాన్ని పొందాలని ఆచార్యువారు చేప్పేరు.

శ్రీ శంకరులు దేనినీ కాదనలేదు. ధర్మానుష్ఠానమును, జ్ఞానము, శివభక్తి, విష్ణుభక్తి అన్నీ వారికి సమ్మతాలే. కాని తక్కిన వారు ఒక్కొక్కదానికి సమ్మతించి మత ప్రచారం చేస్తూ వచ్చేరు.

శంకరులకు పూర్వం కొందరు చాలా కఠినమైన అనుష్ఠానమార్గాన్ని అవలంబించారు. వారి మతాలలో నియమాలు నిర్బంధాలు చాలా ఎక్కువ. ఇలా ఎక్కువ నియమాలు కలవైనా ఆ మతాలు నశించేయి. అవి వేదాలను పూర్తిగా ప్రమాణంగా గ్రహించకపోవడమే దానికి కారణం. మన ఆచార్యులు శ్రుతిస్మృతి పురాణాలలో దేనినీ నిరాకరించక అన్నిటిని అనుసరించేరు.

యో బ్రహ్మాణం విదధాతిపూర్వం, యోవై వేదాంశ్చ ప్రహిణోతి తసై#్మ|

- శ్వేతాశ్వతరోపనిషత్‌.

త్రిధా హితం ఫణిభి ర్గుహ్యమానమ్‌.

- నారాయణోపనిషత్‌.

యో దేవానాం ప్రథమం పురస్తా ద్విశ్వాదికో రుద్రోమహరిః|

- శ్వేతాశ్వతరోపనిషత్‌.

ఏ ఈశ్వరుడు వేదమైయున్నాడో, మొదట బ్రహ్మకు వేదాలను ఎవడు ఉపదేశించాడు, దేవతలకందరకు ఎవడు మొదటివాడో అతడే బ్రహ్మము అనబడతాడు. ఆయనయే బ్రహ్మను సృష్టించేడు. పరమశుభాన్ని ప్రసాదించేడు. ఆ శుభమంటే వేరే యేదోకాదు; అది జ్ఞానమే. దానిని అనుగ్రహించేది శివుడు. అతడే పరబ్రహ్మము. అంతా ఆయనే.

'అతికళ్యాణరూపత్వా న్నిత్యకల్యాణ సంశ్రయాత్‌'

శివము, కల్యాణము, మంగళము, శుభము అన్నీ శివుడే, ఆ శివుడే పరమ మంగళస్వరూపులైన మన ఆచార్యులు.

ఆదిలో ఉండే అద్వైతాన్ని ఉపదేశించడానికై ఈశ్వరాంశ మన ఆచార్యులుగా అవతరించింది. కలిలో అధర్మం ఎలాగూ ఉంటుంది. కాని ఆ అధర్మం పెరుగకుండా నిరోధించాలి .

మన ఆచార్యులు ప్రధానంగా అద్వైతాన్ని బోధిస్తూ దానికి దిగువ భిన్నమత సంప్రదాయాలకు నిలువనీడ నిచ్చారు. ఇలా ఎందుకు చేసేరు? అంటేపరమమైన మోక్షానికి అంతా అధికారులుకారు. కొందఱు మోక్షానికి అధికారులైతే మరికొందరు వారితో సమానమైన పక్వతలేని వారై సాధనపథంలో వారి కంటే దిగువ నిలువవలసినవారుగా ఉంటారు. ఆ మతం వారి వారి పక్వత ననుసరించి ఆయా మతాలు ఉపయోగిస్తాయి. కాని అన్నిటికి గమ్యం అద్వైతం కావాలి. అది మరుగున పడిపోకూడదు. అందుకే వారు ఎన్నిమతాలున్నా అన్నిటికి శిఖరంగా అద్వైతాన్ని బోధించారు.

నీరు అన్నిచోటులందు ఉంటుంది. కాని అన్నిచోటులందు నిర్మలంగా ఉండదు. బావినీరున్నది. అది నిర్మలంగానే ఉంటుంది. దానిలో మలినాలు కలియడానికి అవకాశం లేదు. అలాగే అద్వైతమూ- మిగిలిన మతాలు ఉన్నాయి. మిగిలినవి చిక్కుమార్గాలైతే అద్వైతం రాజమార్గం. వానిద్వారా మోక్షసిద్ది ఎప్పటికో! కాని అద్వైతం శ్రీఘ్ర సిద్ధి నిస్తుంది. 'సూతసంహిత, వైద్యనాధదీక్షితయము' అనే గ్రంథాలలో - ఈ విషయమే చెప్పబడ్డది.

శ్రీశంకరభగవత్పాదులు అవైదికమతాలను కూకటి వ్రేళ్లతో పెల్లగించడానికై అవతరించారు, ఉపాసనా, కర్మజ్ఞానమార్గాలను దాటిన అద్వైతాన్ని స్థాపించడానికి అవతరించారు. ఆయన దిగ్విజయం చేసేరు. వాస్తవానికి దిగ్విజయం చేసినది ఆచార్యలొక్కరే. వారు ఈలోకంలో ఉన్నది కేవలం ముప్పదిరెండు సంవత్సరాలు. బాల్యం పదిసంవత్సరాలు. బాల్య పదిసంవత్సరాలు అనుకొంటే మిగిలినది ఇరువదిరెండు సంవత్సరాలు, ఈ కాలంలో వారు ఆసేతుశీతాచలం మూడుసార్లు పర్యటించేరు, దిగ్విజయం చేసేరు. దీనికి నిదర్శనాలేమిటి? అని ఎవరైనా శంకించవచ్చు. బదరీనారాయణానికి ఆచార్యులు వెళ్లినట్లు నిదర్శనాలున్నాయి. అలాగే దక్షిణాన 'కాలడి'లో వారు జన్మించినట్లు నిదర్శనాలున్నాయి. వారు దేశంలో పలుచోటుల సంచరించినట్లు ఎన్నో సాక్ష్యాలున్నాయి. అన్వేషించేవారికి అవి దుర్లభాలు కావు.

ఇలా అల్పకాలంలో విస్తారమైన దేశంలో పర్యటించి ఎన్నో మహాకార్యాలు నిర్వర్తించినవారు సామాన్యులు కారు వారు ఎవరో అవతారపురుషులు అని నిశ్చయంగా తెలుస్తూనే ఉంది.

శ్రీ శంకరులు షణ్మతస్థాపన చేశారు. షణ్మతాలు అంటే ఆరుమతాలు. అలా అని వీనిలో వీనికి పోటీలేదు సరికదా ఒక దానిని ఒకటి పోషిస్తాయి. కాని కొందరు వీనిలో ఏదో ఒక మతాన్ని అవలంబించి మిగిలినవానిని నిందిస్తూ ఉంటారు. అదికూడదు.

శంకరులు 'శివానందలహరి' ని చెప్పినట్లే 'సౌందర్యలహరినీ' చెప్పేరు. ద్వైతం విశిష్టాద్వైతం కూడ వారు చెప్పినవే. కాని అన్నీ అద్వైతంలో లయించ వలసినవే. విశిష్ఠాద్వైతం ఉన్నది. అది అందరూ భక్తికలవారు కావాలంటుంది. భక్తి వల్ల భగవంతుని యందు దాస్యభావం ఉదయిస్తుంది. దాని వలన క్రమంగా కొంతకాలానికి భగవంతుడు తన్ను దాస్యభవంతో ఆరాధించే వానిలో అంతర్యామి కలుస్తాడని అది చెపుతుంది. కాగా అన్నిమతాలూ చివరకు అద్వైతసాగరంలోలీనం కావలసినవే. చారిత్రకంగా పరిశీలించి చూస్తే అద్వైతానికి సాటియైన మతం వేరొకటి కనిపించదు. ఇతరమతాల నన్నిటిని తత్వ మాత్రంతో జయించి ఇంత ఘనకార్యంచేసినవారు కూడ శంకరులు దప్ప వేరొకరు కనిపించరు.

శంకరుల కాలాన్ని గూర్చి ఎన్నో భేదాభిప్రాయాలున్నాయి. మనకు అది ప్రధానం కాదు. ప్రధానమైనది వారి అనుగ్రహం. వారు దిగ్విజయం చేయడానికి ముందు ఎలా ఉన్నారు. ? తరువాత ఎలా ఉన్నారు? ఇక మీదట మనం సాధించి పొంద దగినదేమిటి? దానికి మార్గం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు సంపాదించుకుంటే చాలు.

శంకరుల చరిత్రను ఎందరో వ్రాసేరు. 'మాధవీయ శంకర విజయము' అది కాకుండా ఆనందగిరీయ శంకరవిజయము, చిద్విలాసీయశంకరవిజయము, కేరళీయ శంకర విజయము, వ్యాసాచలీయ శంకర విజయము అనే గ్రంథాలున్నాయి. గోవిందాచలకృత శంకర దిగ్విజయసారమనే గ్రంథం ఒకటి ఉన్నది. పైవి శంకర విజయాలైతే ఇది శంకర దిగ్విజయసారం. ఏమైనా ఇవన్నీ శంకరుల చరిత్రను తెలిపే గ్రంథాలే.

రామకథ ఒక్కటే అయినా రామాయణా లెన్ని లేవు అలాగే పై గ్రంథాలున్నూ, ఆ రామాయణ గ్రంథాలలో కథాభేదం ఉన్నట్లే, ఈ శంకరవిజయాలలోకూడా కథా భేదాలున్నాయి. ఇలా కొంత భిన్నత కలవైన ఈ గ్రంథాలలో మనం దేనిమీద విశ్వాసం చూపాలి? అన్న సందేహం కలుగుతుంది. భిన్నతను అలా ఉంచి, ఏయే విషయాలు అన్ని గ్రంథాలలోను ఒకే విధంగా చెప్పబడ్డాయో ఆ విషయాలు సత్యములని మనం గ్రహించాలి. పరస్పరం విరోధంగా ఉండని విషయాలు అన్ని గ్రంథాలూ గ్రహించదగినవే.

ఇంతకువెనుక అన్య విషయప్రధానాలైన గ్రంథాలలో శ్రీ శంకరాచార్యులను గూర్చి ఏమి చెప్పబడ్డది? అన్నవిషయం ప్రస్తావిస్తూ-పతంజలి మహాభాష్య కథకు ప్రాధాన్యం కల 'పతంజలి విజయగ్రంథంలో' అప్రధానంగా చెప్పబడిన ఆచార్యుల చరిత్రను గూర్చి చెప్పేను. శంకరవిజయా లన్నీ శంకర చరిత్ర ప్రధానంగా రచించబడ్డాయి. అవికాక ఇతర గ్రంథాలలో ఆచార్యులను ఏమి చెప్ప బడ్డదో గమనిద్ధాం.

'శివరహస్యం' అని ఒక పెద్దగ్రంథం. అది ఇతిహాసం. ఇతిహాసం అంటే పూర్వగాథ. 'ఇతి-హ-ఆస'- ఇట్లు ఉండినాడట' అని యీ శబ్దానికి అర్థం. ఇతిహాసం పురాణాల తెగలోనిదే. రామాయణం, భారతం ఇతిహాసాలు. రామాయణం ఇరువదినాలుగువేల శ్లోకాల గ్రంథం. గ్రంథశబ్దానికి ముప్పది రెండక్షరాలు కలదన్న అర్థం కూడ ఉన్నది. ఆ విధంగా 'శుక్లాంబర ధరం' అనే ఒక్క శ్లోకమూ కూడ గ్రంథం అనబడుతుంది. ఎందుచేతనంటే అందులో ముప్పదిరెండక్షరాలున్నాయి.

గాయత్రీమంత్రంలో ఇరువదినాలుగక్షరాలున్నాయి. రామాయణంలో ఇరువదినాల్గువేల శ్లోకాలున్నాయి. ఆ మహామంత్రంలోని ఒక్కొక్క అక్షరం ఇందులోని ఒకవేయికి ప్రథమాక్షరం. ఆ విధంగా గ్రహించి వాల్మీకి మహరి రామాయణాన్ని రచించేరు. భారతంలోని శ్లోకాలసంఖ్య లక్ష. అంటే భారతం లక్షగ్రంథాలు కలదన్నమాట. పైన చెప్పిన శివ రహస్యం కూడ లక్షగ్రంథసంఖ్య కలిగినదే. దానిని జయగేష్వరులనే వారు రచించేరు. పురాణతిహాసాలలో లక్షగ్రంథసంఖ్య కలవి మూడే, ఒకటి భారతం, రెండు స్కాందం, మూడు శివరహస్యం.

శివరహస్యం ద్వాదశ అంశలుగా విభాగింపబడి ఉంది. ఈ గ్రంథం పూర్తిగా శివవిషయాలు చెపుతుంది. పండ్రెండు అంశలలో తొమ్మిదవ అంశలో శివభక్తుల చరిత్రలు చెప్పబడ్డాయి. అంటే అరువదిముగ్గురు నాయనార్ల చరిత్ర, హరదత్తాచార్యులవారి చరిత్ర ఆ తొమ్మిదవ అంశలో వర్ణింపబడ్డాయి. ఆ భక్తుల చరిత్ర వరుసలోనే శివాంశగా అవతరించిన శ్రీ శంకర భగవత్పాదుల చరిత్రకూడ చెప్పబడ్డది.

రామకృష్ణాదులు తాము అవతారాలైనప్పటికి ఇహలోకంలో తమ స్థానాలకు విహితములైన ధర్మాలను అనుసరిస్తూ వానికి అనుగుణంగానే నడచుకొంటూ వచ్చేరు. అట్లే శంకర భగవత్పాదులు కూడ తాము సాక్షాత్‌ పరమేశ్వరులే అయినప్పటికి పూజాద్యనుష్ఠానాలు యథావిధిగా ఆచరిస్తూ భక్తులవలె నడచుకొన్నారు. అందుచే అవతారం మొదలు సిద్ధిపర్యంతమై వీరిచరిత్ర పూర్తిగా శివరహస్యంలో భక్తుల చరిత్రకల నవాంశలో పదునారవ అధ్యాయంలో వర్ణింపబడింది.

కేరళే శశలగ్రామే విప్రపత్న్యాం మదంశజః|

భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో దిజోత్తమః||

- శివరహస్యము.

అని అందు ఉన్నది. అందులో శంకరుల కాలం కలి ఆదిలో రెండువేల సంవత్సరాలకు పిమ్మట అని కానవస్తుంది. ఇక వారి చరిత్రను గూర్చి 'శంకరులు కైలాసానికి వెళ్ళి భోగ లింగము, యోగలింగము, వరలింగము, ముక్తిలింగము, మోహలింగము అనే ఐదు లింగాలను తెచ్చారని, వానిని ఆరాధించియే ఇతరమతాలను ఖండించి దిగ్విజయం చేయగలిగేరని, ఇది అంతా ఆ లింగారాధనవల్ల కలిగిన బలమని'- ఆ గ్రంథంలో వ్రాయబడ్డది. అది శివమహాత్మ్యాన్ని తెలిపే గ్రంథం కదా! అందుచే ఆచార్యుల దిగ్విజయానికి కారణం పంచలింగారాధనం అని చెప్పినది.

శంకరవిజయ గ్రంథాలకు వ్యాఖ్యలు వ్రాసినవారు తమ వ్యాఖ్యలలో శివరహస్యంలోని శ్లోకాలను ఉదహరించేరు. శివ రహస్యం వాస్తవానికి ద్వైతగ్రంథం. శ్రీ శంకరులు పునరుద్ధరించినదీ అద్వైతసిద్దాంతం. ద్వైతమతావలంబకులు అద్వైతాన్ని ఆక్షేపిస్తారు. అది వారికి సహజం. అయినా శివరహస్యంలో ఆచార్యులచరిత్ర ఉంది. ఇది విశేషం. మూడు వేళలా బిల్వదళాలతో శివార్చనం చేయుమని పరమేశ్వరుడు శంకరులకు ఆజ్ఞాపించేరని అందులో ఉన్నది.

శివార్చనం మనకందరకూ అవశ్యకర్తవ్యం. ఆ ఆరాధనం జరుగడంలో ఏ ఆటంకమూ వాటిల్లకూడదని వివాహంలో చంద్రమౌళీశ్వర సంభావన చేస్తారు. కొందరు కారణాంతరాలచేత ఆ సంభావనను నిలిపివేయడంకూడ ఉన్నది. కాని అది యుక్తంకాదు. ఏమంటే చంద్రమౌళీశ్వర పూజనంవల్ల అందరుకు మేలు కలుగుతుంది. వివాహంలో చంద్రమౌళీశ్వర సంభావన ఆ మేలుకు ఒక పొదుపు ఉద్యమం వంటిది. అట్టి పొదుపుపనులకు మనం అవరోధం కలిగించకూడదు. పరంపరగా వచ్చే ఒక సదాచారాన్ని మనం నేడు త్రోసివేస్తే కొంతకాలం పోయేక ఆ ఆచారాన్ని పాదుకొల్పాలని మనం ఎంత ప్రయత్నించినా సాధ్యంకాదు.

ఊరిలో కోవెల ఉంటుంది. మన అనుదినం కోవెలకు వెడుతూఉండాలి. మానకూడదు. అనుదినం మనం వెడితే ఆలయపూజారికూడ తన పనిలో శ్రద్ధ, భయము కలిగి సంచరిస్తాడు. లేకపోతే వాని యిష్టం వచ్చినట్లు వాడు ఉంటాడు. ఒకవేళ మనం వెడుతూ ఉన్నా వాని స్వేచ్ఛాచారం తగ్గలేదు అయినా మనం ఆలయానికి వెళ్ళడం మానరాదు. కొంతకాలం ఊరిలో ఈపరిపాటి (ఆలయానికి వెళ్ళిరావడం) ఆగిపోయింది అంటే తిరిగి దానిని ఏర్పాటు చెయ్యడం ప్రజలలో అట్టి సద్భావం కలిగించడం కష్టం అవుతుంది. అట్లే చంద్రమౌళీశ్వర సంభావన కూడ. ఎన్ని అభిప్రాయభేదాలున్నా మనం మనకర్తవ్యాలు నిర్వర్తించి తీరాలి. ధనికులు అభిషేక ద్రవ్యాలన్నీ తెచ్చి అగరువత్తులు, చందనం మొదలైన మేలైన వస్తువులను వినియోగించి పూజ చేస్తే పేదవారు బిల్వదళాలతోనే స్వామిని అర్చిస్తాడు. అంతేకాని కర్తవ్యమైన శివార్చనం మానడంలేదు. అలాగే మనం మన కర్తవ్యాలపట్ల అలసత చూపకూడదు.

చంద్రమౌళీశ్వరపూజనం నాల్గువర్ణాల వారి క్షేమంకొరకు ఏర్పడ్డది. ఇది నూతనంగా కొనిరాబడ్డది కాదు. వేదమార్గాన్ని నిష్కంటకంచేసి, దేశాన్ని ఒక్కకుంటుంబంగా మార్చి, ఆ కుంటుంబక్షేమానికి ఈ పూజను ఆచార్యులు విధించేరు. అందుచే అందరకు మేలు కలిగించే చంద్రమౌళీశ్వరపూజనం ఉత్కృష్టంగా నడవాలి, అలా నడవడానికి ఏర్పాటుచేయబడ్డ పొదుపు పనులలో అలసత చూపించకూడదు.

శ్రీ శంకరాచార్యులు ప్రతిష్ఠచేసి ఆరాధించవలెనని ఆజ్ఞాపించిన యీ లింగారాధన అవిచ్ఛిన్నంగా నడవాలి. ఆచార్యులు సర్వజ్ఞులు. ఆయన ఎన్నో కార్యాలు చేసేరు. మేమున్నాం. మేము శిలావిగ్రహాలవంటి స్మారకచిహ్నాలుగా ఉన్నాం. ఆచార్యులను గూర్చిన స్మృతి అందరి మనస్సులలో నిలచిఉండుటకు, లేనివారికి కలిగించుటకు మేము ప్రయత్నం చేస్తున్నాం. స్మారకవిగ్రహాన్ని చూస్తే ఆ విగ్రహం సూచించే మహాపురుషుడు జ్ఞప్తికి వస్తాడు. అట్లే మా ద్వారా ఆచార్యులస్మృతి అందరకు కలగాలని మా ఆశ.

'ఇన్ని ఏనుగులు, ఒంటెలు ఈ పరివారం అంతా దేనికి? వీనిని వదలి వెళ్ళిపోతే' అని ఒకప్పుడు నాకు తోచింది. తత్‌ క్షణమే చంద్రమౌళీశ్వరుని పూజ ఎవరుచేస్తారు? అనిపించింది. ఆచార్యుల అజ్ఞపై అవిచ్ఛన్నంగా నేటివరకు సాగుతూ వచ్చిన పూజ నిలచిపోతుందనిపించింది. అయితే-వెనుక శంకరులు మా వలె పరివారంతో ఉన్నారా? అని మరల శంక కలిగింది. దానికి సమాధానమున్నూ స్ఫురించింది.

ముత్తుస్వామి అయ్యరుకు స్మారకచిహ్నంగా ఒకశిలా విగ్రహం ఏర్పాటుచేసేరు. ఆ శిల ఎప్పుడూ దుస్తులు వేసుకొనియే ఉంటుంది. అర్ధరాత్రంలో చూచిన అది కోటు ధరించే ఉంటుంది; కాని విడచిపెట్టదు. అసలు ముత్తుస్వామయ్యరు అర్ధరాత్రంలో కోటు తొడుగుకొన్నాడా ఈ శిల తొడగడానికి? అన్నశంకవంటిదే పై శంక అనిపించింది. అందుచే 'ఈ ముత్తు స్వామి అయ్యరు' ఇలాగే ఉండాలని తీర్మానించుకొన్నాను. ఆచార్యుల పేరును మాత్రమే 'ఈ శిల' రక్షిస్తుందని గ్రహించాలి.

కాగా శ్రీ శంకరులపేరును రక్షించడానికి మాత్రమే మేము ఉన్నాం. అట్టి పరంపరను రక్షించడానికి తగిన చిహ్నాలు ఉండాలి. అందుచే ఈ పరివారాన్ని అంతనూ వహించి తీరాలి అని తెలిసికొన్నాను. ఇవన్నీ శ్రీ శంకరభగత్పాదుల ఆజ్ఞను పాటించడానికి అవసరం. పరమేశ్వరుడు ఆచార్యులకు మూడు వేళలా బిల్వదళార్చనచేయమని ఆజ్ఞాపించినట్లు శివరహస్యంలో ఉన్నది కదా! ఆ ఆజ్ఞను అవిచ్ఛినంగా జరిపించడానికి ఈ పరివారం అంతా ఉపకరణమాత్రం. ఈ ఉపకరణం ఉన్నప్పుడే అందరకు సొంతమైన చంద్రమౌళీశ్వరపూజనం అవిచ్చిన్నంగా నడస్తుంది.

్వ ్వ ్వ తత్త్వే భయం విదుషో మన్యానస్య