Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్వ్యధికశతతమో7ధ్యాయః అధ ధ్వజారోపణాదివిధిః ఈశ్వరఉవాచ : చూలకే ధ్వజదణ్డ చ ధ్వజేదేవకులే తథా | ప్రతిష్ఠా చ యథోద్దిష్టా తథా స్కన్ద వదామి తే. 1 తడాగార్దప్రవేశాద్యా యద్వా సర్వార్థవేశనాత్ | ఐష్టకే దారుజః శూలః శైలజే ధామ్ని శైలజః. 2 వైష్ణవాదౌ చ చక్రాఢ్యః కుమ్భః స్యాన్మూర్తిమానతః | స చ త్రిశూలయుక్తస్తు అగ్రచూలాభిధో మతః. 3 ఈశశూలః సమాఖ్యాతో మూర్ధ్ని లిఙ్గసమన్వితః | బీజపూరకయుక్తో వా శివశాస్త్రేషు తద్విధః. 4 చిత్రో ధ్వజశ్చ జఙ్ఘాతో యథా జఙ్ఘాద్ధతో భ##వేత్ | భ##వేద్వా దణ్డమానస్తు యది వా తద్యదృచ్ఛయా. 5 మహాధ్వజః సమాఖ్యాతో యస్తు పీఠస్య వేష్టకః | శ##క్రైర్గ్రహై రసైర్వాపి హసై#్త్రర్దణ్డస్తు సంమితః. 6 ఉత్తమాదిక్రమేణౖవ విజ్ఞేయః సూరిభిస్తతః | వంశజః శాలజాదిర్వా సదణ్డః సర్వకామదః. 7 అయమారోప్యమాణస్తు భఙ్గమాయాతి వై యది | రాజ్ఞో7నిష్టం విజానీయాద్యజమానస్య వా తథా. 8 మన్త్రేణ బహురూపేణ పూర్వవచ్ఛాన్తిమాచరేత్ | ద్వారపాలాదిపూజాం చ మన్త్రాణాం తర్పణం తథా. 9 విధాయ చూలకం దణ్డం స్నాపయేదస్త్రమన్త్రతః | అనేనైవ తు మన్త్రేణ ధ్వజం సంప్రోక్ష్య దేశికః. 10 మృత్కషాయాదిభిః స్నానం ప్రాసాదం కారయేత్తతః | విలిప్య రసమాచ్ఛాద్య శయ్యాయాం న్యస్య పూర్వవత్. 11 చూలకే లిఙ్గవన్న్యాసా న చ జ్ఞానం న చ క్రియా | విశేషార్థా చతుర్థీ చ న చ కుణ్డస్య కల్పనా. 12 దణ్డ తథార్థతత్త్వం చ విద్యాతత్త్వం ద్వితీయకమ్ | సద్యోజాతాదివక్త్రాణి శివతత్త్వం పునర్ధ్వజే. 13 నిష్కలం చ శివం తత్ర న్యస్తాఙ్గాని ప్రపూజయేత్ | చూలకే చ తతో మన్త్రః సాన్నిధ్యే సహితాణుభిః. 14 హోమయేత్ప్రతిభాగం చ ధ్వజే తైస్తుఫడన్తకైః | అన్యథాపి కృతం యచ్చ ధ్వజసంస్కరణం క్వచిత్. 15 అస్త్రయాగవిధావేం తత్సర్వముపదర్శితమ్. శ్రీపరమేశ్వరుడు పలికెను. స్కందా! దేవాలయములో శిఖరమును ధ్వజదండమును, ధ్వజమును ప్రతిష్ఠ చేయవలసిన విధానమును చెప్పుచున్నాను. వినుము. శిఖరము సగము భాగమునందు శూలమును ప్రవేశ##పెట్టి లేదా శూలము సగముభాగమును శిఖరమందు ప్రవేశ##పెట్టి ప్రతిష్ఠ చేయవలెను. ఇటుకలతో నిర్మించిన దేవాలయమందలి శూలమును దారువుతో నిర్మించవలెను. ఆలయము శిలానిర్మితమైనచో శూలము కూడ శిలానిర్మితముకావలెను. విష్ణ్వాది దేవాలయములందు కలశమును చక్రసంయుక్తము చేయవలెను. ఆ కలశము దేవతామూర్తిప్రమాణమునకు అనురూపముగా ఉండవలెను. కలశము త్రిశూలయుక్తమైనచో దానికి ''అగ్రచూలము'' అని పేరు. దాని శిరోభాగమునందు శివలింగ మున్నచో దానికి ''ఈశశూలము'' అని పేరు. శిరోభాగము బీజపూరకయుక్తమైనను ఇదియే పేరు. అని శైవశాస్త్రములలో చెప్పబడినది. జంఘావేదితో సమానమైనవిత్తు గలది లేదా జంఘావేది ఎత్తులో సగము ఎత్తుగలది ''చిత్రధ్వజము'' లేదా దాని మానదండమును అనుసరించి గాని, తమ ఇచ్చననుసరించి గాని ఉంచవచ్చును. పీఠమును ఆవేష్టించి యున్నది ''మహాధ్వజము'' పదునాలుగు హస్తముల దండము ఉత్తమము తొమ్మిది హస్తములది మధ్యమము, ఆరు హస్తములది అధమము అని విద్వాంసుల నిర్ణయము. ధ్వజదండము లెదురైనను, సాలవృక్షసంబంధమైన దైనను సకల కామపూరకము; ఆరోపణసమయమున ఈ ధ్వజము విరిగిపోయినచో రాజునకు గాని, యజమానునకు గాని హాని కలుగు నని తెలియవలెను. అపుడు బహురూపమంత్రములతో వెనుక చెప్పిన విధముగ శాంతి చేయవలెను. ద్వారపాలాదిపూజ, మంత్రతర్పణము చేసి, ధ్వజమును. దానిదండమును అస్త్రమంత్రముతో స్నానము చేయించవలెను. గురువు ఈమంత్రముతో ధ్వజప్రోక్షణము చేసి, మట్టికషాయోదకము మొదలగు వాటితో దేవాలయమును కూడ స్నానము చేయించవలెను. ధ్వజము పై భాగమున గంధాదులు పూసి, వస్త్రముచే ఆచ్ఛాదించి, మరల వెనుకటి వలెనే దానిని శయ్యపై ఉంచి, లింగమునకు వలెనే న్యాసము చేయవలెను. కాని జ్ఞానశక్తి క్రియాశక్తుల న్యాసము మాత్రము చేయరాదు. విశేషార్థబోధిక యగు చతుర్థి కూడ వాంఛనీయము కాదు. కుంభ-కుండాదుల ఏర్పాటు కూడ అనావశ్యకము. దంéడముపై. విద్యాతత్త్వమును, సద్యోజాతాదిముఖపంచకమును న్యాసము చేయవలెను., పిదప ధ్వజముపై శివతత్త్వన్యాసము చేసి, నిష్కలశివుని న్యాసము చేసి, హృదయాద్యంగపూజ చేయవలెను. పిదప, మంత్రజ్ఞుడైన గురువు, ధ్వజమునందును ధ్వజాగ్రభాగమునందును, సంనిధీకరణము కొరకై ఫడంతసంహితామంత్రములతో, ప్రత్యేకభాగమునందు హోమము చేయవలెను. మరి యే ఇతరసంస్కారములు చేసినను, ఈవిధముగ అస్త్రయాగము చేసియే చేయవలెను. ఈ విషయములను పండితులు చేసి చూపించి యున్నారు. ప్రాసాదే కారితే స్థానే న్రగ్వస్త్రాది విభూషితే. 16 జజ్ఘావేదీ తదూర్ద్వే తు త్రితత్త్వాది నివేశ్య చ | హోమాదికం విధాయాథ శివం సంపూజ్య పూర్వవత్. 17 సర్వతత్త్వమయం ధ్యాత్వా శివం చ వ్యాపకం న్యసేత్ | అనన్తం కాలరుద్రం చ విభావ్యచ పదామ్బుజే. 18 కూష్మాణ్డహాటకదౌ పీఠం పాతాలనరకైః సహ | భువనైర్లోకపాలైశ్చ శతరుద్రాదిభిర్వృతమ్. 19 బ్రహ్మాణ్డకమిదం ధ్యాత్వా జఙ్ఘాయాం చ విభావయేత్ | వారితేజో7నిలవ్యోమ పఞ్చాష్టకసమన్వితమ్. 20 సర్వావరణసంజ్ఞం చ బుద్ధియోన్యష్టకాన్వితమ్ | యోగాష్టక సమాయుక్తం నాసావధిగుణత్రయమ్. 21 పటస్థం పురుషం సింహం వామం చ పరిభావయేత్ | మంజరీవేదికాయాం చ విద్యాదికచతుష్టయమ్. 22 కణ్ఠ మాయాం సరుద్రాం చ విద్యాశ్చామలసారకే | కలశే చేశ్వరం బిన్దుం విద్యేశ్వరసమన్వితమ్. 23 జటా జూటం చ తం విద్యా చ్ఛూలం చన్ద్రార్ధరూపకమ్ | శక్తిత్రయం చ తత్త్రెవ దణ్డ నాదం విభ్యావ్య చ. ధ్వజే చ కుణ్డలీం శక్తిమితి ధామ్ని విభావేయేత్ | జగత్యావాథ సన్ధాయ లిఙ్గం పిణ్డికయాథవా. 25 సముత్థాప్య సుమన్త్రైశ్చ విన్యస్తే శక్తపఙ్కజే | న్యస్తరత్నాదికే తత్ర స్వాధారే వినివేశ##యేత్. 26 యజమానో ధ్వజే లగ్నే బన్దుమిత్రాదిభిః సహ | ధామ ప్రదక్షిణీకృత్య లభ##తే ఫలమీహితమ్. 27 గురుః పాశుపతం ధ్యాయన్ఠ్సిరమన్త్రాధిపైర్యుతమ్| అధిపాఞ్ఛస్త్రయుక్తాంశ్చ రక్షణాయ నిబోధయేత్. 28 న్యూనాదిదోష శాన్త్యర్థం హుత్వా దత్త్వా చ దిగ్భలిమ్ | గురువే దక్షిణాం దద్యాద్యజమానో దివం వ్రజేత్. 29 ప్రతిమా లిఙ్గవేదీనం యావన్తః పరమాణవః | తావద్యుగసహస్రాణి కర్తుర్యోగభుజః ఫలమ్. 30 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ధ్వజారోపణాదివిధిర్నామ ద్వ్యధికశతతమో7ధ్యాయః. దేవాలయమును కడిగి, పుష్పమాలావస్త్రాదులచే అలంకరించి, జంఘావేదిపై త్రితత్త్వాదిన్యాసము, హోమాదులు, శివ పూజ వెనుకటివలెనే చేసి, సర్వతత్త్వమయ మగు ఆ శివుని వ్యాపకస్వరూపమును ధ్యానించవలెను. శివుని చరణారవిందము నందు అనంతకాలరుద్రులను, పీఠమున కూష్మాండ-హాటక-పాతాల-నరకములను భావన చేయవలెను. పిదప భువనములచేతను, లోకపాలులచేతను, శతరుద్రాదులచేతను పరివేష్టిత మగు ఈ బ్రహ్మాండమును ధ్యానించి, జంఘావేదిపై స్థాపించవలెను. పృథ్వీ-జల-తేజో-వాయు-ఆకాశరూపపంచాష్టకములను, సర్వావరణసంజ్ఞకములను బుద్ధియోన్యష్టకమును, యోగ్రాకమును, ప్రలయము వరకును ఉండు త్రిగుణములను, తటస్థపురుషుని, వామసింహమును కూడ జంఘావేదిపై భావన చేయవలెను. కాని మంజరీ వేదికపైవిద్యాదితత్త్వచతుష్టయము భావన చేయవలెను. కంఠమున మాయారుద్రులను, అమలసారమును విద్యలను, కలశమున ఈశ్వరబిందు-విద్యేశ్వరులను భావన చేయవలెను. చంద్రార్థస్వరూప మగు త్రిశూలమున జటాజూటభావన చేయవలెను. ఆ శూలముమీదనే త్రివిధశక్తులను, దండమునందు నాభిని భావన చేసి, ధ్వజముపై కుండలినీశక్తిని భావన చేయవలెను. ఈ విధముగ ఆలయావయవములైప విభిన్నతత్త్వముల భావన చేయదలెను. జగతితో ప్రాసాదసంధానమును, పిండికతో లింగసంధానమును భావన చేసి మిగిలిన విధానము నంతను వెనుకటి వలె చేయవలెను. పిదప గురువు మంగళవాద్య ఘోషముతో, వేదధ్వనితో, మూర్తిధరులతో కలిసి, శివరూప మగు మూలము గల ధ్వజదండజమును ఎత్తి మత్రోచ్చారణపూర్వకముగ శక్తిమయకమలన్యాసము ఎచట చేయబడటెనో, రత్నాదిపంచకము ఉంచబడెనో అట్టి ఆధార భూమిపై ఆ ధ్వజములు స్థాపించవలెను. ప్రాసాదశిఖరముపై ధ్వజారోపణమైన పిదప, యజమానుడు బంధుమిత్రాదులతో ఆలయప్రదక్షిణముచేసినచో సకలభీష్టఫలములను పొందును. గరువు, అస్త్రాదులతో పాశుపతమును చాలసేపు ధ్యానించి, శస్త్రయుక్తులగు ఆ అధిపతుల నందరిని, దేవాలయరక్షకై ప్రార్థించవలెను. న్యూనతాదిదోషపరిహారార్థమై హోమ-దాన-దిగ్బల్యాదులు, పూర్తిచేసినపిదప యజమానుడు గురువునకు దక్షిణ ఈయవలెను. ఆలయనిర్మాణప్రతిష్ఠలు చేసిన యజమానుడు ప్రతిమా-లింగ-వేదులలో ఎన్ని పరమాణువు లుండునో అన్ని వేల యుగముల పాటు, దివ్యలోకమునందు ఉత్తమభోగములను అనుభవించును ఇది అతడు పొందు ఫలము. అగ్ని మహాపురాణమునందు ధ్వజారోపణాదివిధివర్ణన మను నూటరెండవ అధ్యాయము సమాప్తము.