Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ షడధికశతతమోధ్యాయః. అథనగరాదికవాస్తుకథనమ్. ఈశ్వర ఉవాచ : నగరాదిక వాస్తుంచ చ వక్ష్యే రాజ్యాదివృద్దయే | యోజనం యోజనార్దం వా తదర్థం స్థానమాశ్రయేత్. 1 అభ్యర్చ్య వాస్తునగరం ప్రాకారాద్యంం తు కారయేత్ | ఈశాదిత్రింశత్పదకే పూర్వద్వారం చ సూర్యకే. 2 గన్దర్వాఖ్యం దక్షిణ స్యాద్వారుణ్య పశ్చిమే తథా | సౌమ్యద్వారం సౌమ్యపదే కార్యా హట్టాస్తు విస్తరాః. 3 యేనేభాది సుఖం గచ్ఛేత్కు ర్యాద్ద్వారం తు షట్కరమ్ | భిన్నకర్ణం విభిన్నం చ చన్ద్రార్దాభం పురం న హి. 4 వజ్రసూచీముఖం నేష్టం సకృద్ద్వి త్రిసమాగమమ్ | చాపాభం వజ్రనాగాభం పురారమ్భే హి శాన్తికృత్. 5 ప్రార్చ్య విష్ణుహరార్కాదీన్నత్వా దద్యాద్బలిం బలీ | ఆగ్నేయే స్వర్ణహర్మారాన్పురస్య వినివేశ##యేత్. 6 దక్షిణ నృత్యవృత్తీనాం వేశ్యాస్త్రీణాం గృహాణి చ | నటానాం చక్రికాదీనాం కైవర్తాదేశ్చ నైరృతే. 7 రథానామాయుధానాం చ కృపాణానాం చ వారుణ | శౌణ్డికాః కర్మాధికృతా వాయవ్యే పరికర్మిణః. 8 బ్రాహ్మణా యతయః సిద్దాః పుణ్యవన్త స్తథోత్తరే | ఫలాద్యాది విక్రయిణ ఈశానే చ వణిగ్జనాః . 9 పూర్వతశ్చ బలాధ్యక్షా ఆగ్నేయే వివిధం బలమ్ | స్త్రీణామాదేశినో దక్షే కాణ్డారాన్నై రృతే న్యసేత్. 10 పశ్చిమే చ మహామాత్యాన్కోశపాలాంశ్చ కారుకాన్ | ఉత్తరే దణ్డనాథాంస్చ నాయకద్విజసం కులాన్. 11 పరమేశ్వరుడు చెప్పెను. : కార్తికేయా! రాజ్యాదుల అభివృద్ధికొరకై ఇపుడు నగరవాస్తువును వర్ణించి చెప్పెదను. నగర నిర్మాణముకొరకు, ఒకయోజనము లేదా అర్ధయోజనము విస్తారము గల భూమిని గ్రహించవలెను. ఈశాదిపదములు ముప్పదింట సూర్యసంముఖముగ పూర్వద్వారము, గంధర్వసమీపమున దక్షిణద్వారము, వరుణునిదగ్గర పశ్చిమద్వారము సోముని దగ్గర ఉత్తరద్వారము నిర్మించవలెను. నగరమును వీథులు వెడల్పుగా ఉండవలెను. నగరద్వారము ఆరు హస్తముల వెడల్పు ఉండి ఏనుగులు మొదలగునవి సుఖముగా ప్రవేశించుటకు నిర్గమించుటకు వీలుగా ఉండవలెను. నగరము ఛిన్నకర్ణము గాని, భగ్నముగాని, అర్దచంద్రాకారము గాని కాకూడదు. వజ్రసూచీముఖనగరము కూడవ హితకరము కాదు. ఒకటి రెండు లేదా మూడు ద్వారములు గల, ధనస్సు ఆకారములో ఉన్న వజ్రనాగాభనగరము నిర్మించినచో అది శాంతిప్రదము. నగరమునకు అగ్నేయమున స్వర్ణకారులును, దక్షిణము నృత్యోపజీవు లగువారాంగనలును. నైరృతి యందు నట-కుంభకార-కైవర్తాదులును, పశ్చిమమున రథకార-ఆయుధకార-ఖడ్గకారులను, వాయువ్యమున మద్యవిక్రేతలు కర్మకారులు, భృత్యులును, ఉత్తరమున బ్రాహ్మణ-యతి-సిద్ధాదిపుణ్యపురుషులును, ఈశాన్యమున ఫలాదులను విక్రయించు వారును నివసించవలెను. సేనాధ్యక్షుడు తూర్పున ఉండవలెను. వివిధ సైన్యములు ఆగ్నేయమునందును, స్త్రీలకు వివిధ కళలను బోధించు ఆచార్యులు దక్షిణమునందును, ధనుర్ధరసైనికులు నైరృతియందును, పశ్చిమమున మహామాత్యుడు, కోశ పాలకులు, కార్మికులును, ఉత్తరమున దండాధికారులు నాయకద్విజులును నివసించవలెను. పూర్వతః క్షత్రియా న్కక్షేవైశ్యాఞ్ఛూద్రాంశ్చ పశ్చిమే | దిక్షుపైద్యాన్యాజినశ్చ బలాని చ చతుర్దిశమ్. 12 పూర్వేణ చరలిఙ్గ్యాదీఞ్ఛ్మ శానాదీని దక్షిణ | పశ్చిమే గోధనాద్యం చ కృషికర్తౄంస్తథో త్తరే. 13 న్యసేన్ల్మేచ్ఛాంశ్చకోణషు గ్రామాదిషు తథా స్థితమ్ | శ్రియం వైశ్రవణం ద్వారి పూర్వౌ తౌ పశ్యతాం శ్రియమ్. 14 దేవాదీనాం పశ్చిమతః పూర్వాస్యాని గృహాణి హి | పూర్వతః పశ్చిమాస్యాని దక్షిణ చోత్తరాననాన్. 15 నాకేశవిష్ణ్వాదిధామాని రక్షార్థంనగరస్య చ | నిర్దైవతం తు నగరగ్రామదుర్గగృహాదికమ్. 16 భజ్యతే తత్పిశాచాద్యై రోగాద్యైః పరిభూయతే | నగరాది సదైవం హి జయదం భుక్తిముక్తిదమ్. 17 పూర్వాయాం శ్రీగృహం ప్రోక్తమాగ్నేయ్యాం పై మహానసమ్ | శయనం దక్షిణస్యాం తు నైరృత్యామాయుధాశ్రయమ్. 18 భోజనం పశ్చిమాయాం తు వాయవ్యాం ధాన్యసంగ్రహః | ఉత్తరే ద్రవ్యసంస్థానమైశాన్యాం దేవతాగృహమ్. చతుఃశాలం త్రిశాలం వా ద్విశాలం చైక శాలకమ్ | చతుఃశాలాగృహాణాం తు శాలాళిన్దకభేదతః. 20 శతద్వయం తు జాయన్తే పఞ్చాశత్పఞ్చతేష్వపి | త్రిశాలాని తు చత్వారి ద్విశాలాని తు పఞ్చధా. 21 ఏకశాలాని చత్వారి ఏకాలిన్దాని వచ్మి చ | అష్టావింశత్యలిన్దాని గృహాణి నగరాణి చ . 22 చతుర్భిః సప్తభిశ్త్చెవ వఞ్చపఞ్చాశ##దేవ తు | షడలిన్దాని వింశైవ అష్టాభిర్వింశ ఏవ హి. 23 అష్టాలిన్దం భ##వేదేవం నగరాదౌ గృహాణి హి. ఇత్యాదిపూరాణ ఆగ్నేయే నగరాదివాస్తుర్నామ షడధికశతతమో7ధ్యాయః. తూర్పున క్షత్రియులను, దక్షిణమున వైశ్యులను, పశ్చిమమున శూద్రాదులను, విభిన్నదిశయలందు వైద్యులను, అశ్వములను, సైన్యమును నాల్గు దిక్కులందును ఉంచవలెను. తూర్పునందు గూఢచారులను, దక్షిణమున శ్మశానమును, పశ్చిమమున గోధనమును, ఉత్తరమున కర్షకులను ఉంచవలెను. వ్లుెచ్ఛులకు విదిక్కులందు స్థానము ఏర్పరుపవలెను. లేదా గ్రామములలో నివసింపజేయవలెను. పూర్వద్వారమునందు లక్ష్మీకుబేరుల స్థాపన చేయవలెను. ఆ ఇరువురిని చూచువారికి లక్ష్మీసంపత్తి కలుగును. పశ్చిమమున నిర్మించి దేవాలయము పూర్వాభిముఖము గాను తూర్పున నిర్మించినది పశ్చిమాభి ముఖముగాను, దక్షిణమున నిర్మించినది ఉత్తరాభిముఖముగాను ఉండవలెను. నగర రక్షణ కొరకు ఇంద్ర విష్ణ్వాదిదేవతా మందిరములను నిర్మించవలెను. దేవతలు లేని నగర-గ్రామ-దుర్గ-గృహాదులను పిశాచములు అనుభవించును. అవి అనేక రోగములచే పీడింపబడును. పైన చెప్పన విధమున నిర్మించిన నగరాదికము సదా జయప్రద మైన భోగ - మోక్షముల నిచ్చును. వాస్తుభూమికి తూర్పున శృంగారగృహము, అగ్నేయమున పాకగృహము, దక్షిణమున శయనగృహము, నైరృతియందు శస్త్రగృహమును, పశ్చిమమునందు భోజనగృహము, వాయవ్యమునందు ధాన్యసంగ్రహము, ఉత్తరమునందు ధనాగారము,ఈశాన్యమునందు దేవతాగృహము నిర్మింపవలెను. నగరమునందు ఏకశాలా-ద్విశాలా-త్రిశాల-చతుః శాలాగృహములను నిర్మించవలెను. శాలాభేదమును, అలింద (ముంగిలి) భేదమును బట్టి చతుఃశాలాగృహమున రెండు వందల ఏబదియైదు భేదము లుండును. త్రిశాలాగృహములకును నాలుగు, ద్విశాలకు ఐదు, ఏకశాలకు నాలుగు భేదము లుండును. ఇపుడు అలిందయుక్తగృహమును గూర్చి చెప్పెదను వినుము. గృహవాస్తువునందును, నగరవాస్తువునందును, ఇరువది యెనిమిది అలిందము లుండును. నాలుగు అలిందములతోడను, ఏడు అలిందములతోడను ఏబదియైదు భేదములను, ఆరు అలిందములతో ఇదువది భేదములను, ఎనిమిది అలిందములతోగూడ ఇరువది భేదములును ఏర్పడును. ఈ విధముగ నగరాదులలో ఎనిమిది అలిందములు గల వాస్తుపు కూడ ఉండవచ్చును. అగ్నిమహాపురాణమునందు నగరాదివాస్తు వను నూటఆరవ అధ్యాయము సమాప్తము.