Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ సప్తోత్తర శతతమో7ధ్యాయః. అథ స్వాయమ్భువసర్గకథనమ్. అగ్నిరువాచ: వక్ష్యే భువనకోశం చ పృథ్వీద్వీపాది లక్షణమ్ | అగ్నిధ్రశ్చాగ్నిబాహుశ్చ వుపుష్మాన్ ద్యుతిమాం స్తథా. 1 మేధా మేధాతిథిర్భవ్యః సదనః పుత్ర ఏవ చ | జ్యోతిష్మాన్ దశమస్తేషాం సత్యనామా సుతో7భవత్. 2 ప్రియవ్రతసుతాః ఖ్యాతాః సప్తద్వీపాన్దదౌ పితా | జమ్బూద్వీపమథాగ్నీధ్రే ప్లక్షం మేధాతిథేర్దదౌ. 3 వపుష్మతే శాల్మలం చ జ్యోతిష్మతే కుశాహ్వయమ్ | క్రౌఞ్చద్వీపం ద్యుతిమతే శాకం భవ్యాయ దత్తవాన్. పుష్కరం సవనాయాదాదగ్నీధ్రే7దాత్సుతే శతమ్ | జమ్బూద్వీపం పితా లక్షం నాభేర్దత్తం హిమాహ్వయమ్. హేమకూటం కింపురుషే హరివర్షాయ నైషధమ్ | ఇలావృతే మేరుమధ్యం రమ్యే నీలాచలాశ్రయమ్. 6 హిరణ్వతే శ్వతవర్షం కురూంస్తు కురవే దదౌ | భద్రాశ్వాయ చ భద్రాశ్వం కేతుమాలాయ పశ్చిమమ్. 7 మేరోః ప్రియవ్రతః పుత్రానిభిషిచ్య య¸° వనమ్ | శాలగ్రామే తపస్తష్త్వా య¸° విష్ణోర్లయం నృపః. 8 యాని కింపురుషాద్యాని హ్యష్ట వర్షాణి సత్తమ | తేషాం స్వాభావికీ సిద్ధిః సుఖప్రాయా హ్యయత్నతః. 9 జరామృత్యుభయం నాస్తి ధర్మాధర్మౌ యుగాదికమ్ | నాధమం మధ్యమం తుల్యా హిమాద్దేశాత్తు నాభితః. ఋషభో మేరుదేవ్యాం చ ఋషభాద్భరతో7భవత్ | ఋషభో దత్తశ్రీః పుత్రే శాలగ్రామే హరిం గతః. 11 భరతాద్భారతం వర్షం భరతాత్సుమతిస్త్వభూత్ | భరతో దత్తలక్ష్మీకః శాలగ్రామే హరిం గతః . 12 స యోగీ యోగప్రస్తావే వక్ష్యే తచ్చరితం పునః | సుమతేస్తేజసస్తస్మాదిన్ద్రద్యుమ్నో వ్యజాయత. 13 పరమేష్టీ తతస్తస్మాత్ప్రతీహర స్తదన్వయః | ప్రతీహారాత్ప్రతిహర్తాప్రతిహర్తుర్భవన్తతః. 14 ఉద్గీథో7థ చ ప్రస్తారో విభుః ప్రస్తారతః సుతః | పృథుశ్చైవ తతో నక్తో నక్తస్యాపి గయః సుతః. 15 నరో గయస్య తనయస్తత్పుత్రో7భూద్విరాట్ తతః | తస్య పుత్రో మహావీర్యో ధీమాంస్తస్మాదజాయత. 16 మహాన్తస్తత్సుతశ్చాభూన్మనస్యస్తన్య చాత్మజః | త్వష్టా త్వష్టుశ్చ విరజారజస్తస్యాప్యభూత్సతః . 17 సత్యజిద్రజసస్తస్య జజ్ఞే పుత్రశతం మునే | విశ్వజ్యోతి ప్రధానాస్తే భారతం తైర్వివర్దితమ్. 18 కృత త్రేతాదిసర్గేణ సర్గః స్వాయమ్భువః స్మృతః. ఇత్యాది మాహాపురాణ ఆగ్నేయే స్వాయమ్భువసర్గో నామ సప్తాధిక శతతమో7ద్యాయః. అగ్నిదేవుడు పలికెను. వసిష్ఠా! ఇపుడు నేను భువనకోశము, పృథివి, ద్వీపములు మొదలగు వాటిని గూర్చి చెప్పెదను. ప్రియవ్రతునకు అగ్నీధ్ర-అగ్నిబాహు-వవుష్మత్-ద్యుతిమత్-మేధా-మేధాతిథి-భవ్య-సవన-క్షయులను పుత్రులుండిరి. పదవకుమారుడైన జ్యోతిష్మంతుడు యథార్థనామధేయుము కలవాడు. ప్రియవ్రతుని కుమారులందరును జగద్విఖ్యాతులు, తండ్రి వారికి సప్తద్వీపముల నిచ్చెను. ఆగ్నీధ్రునకు జంబూద్వీపము, మేధాతిథికి ప్లక్షద్వీపము, వపుష్మంతునకు శాల్మలిద్వీపము, జ్యోతిష్మంతునకు కుశద్వీపము, ద్యుతిమంతునకు క్రౌంచద్వీపము, భవ్యునకు శాకద్వీపము, సరసునకు పుష్కరద్వీపము ఇచ్చెను. ఆగ్నీధ్రుడు-లక్షల కొలది యోజనముల విస్తీర్ణము గల జంబూ ద్వీపము తన కుమారులకు ఈ విధముగ విభజించి యిచ్చెను. నాభికి హిమవర్షమును (నేటి భారతవర్ణమును) కింపురుషునకు హేమకుట వర్షము, హరివర్షునకు నైషధవర్షము, ఇలావృతునకు మధ్యభాగమున మేరుపర్వతముతో గూడిన ఇలా వృతవర్షమును రమ్యకునకు నీలాచలాశ్రితమగు రమ్యకవర్షమును, హిరణ్యవంతకునకు శ్వేతవర్షమును, కురువుకు ఉత్తరకురువర్షమును ఇచ్చెను. భద్రాశ్వునకు భద్రాశ్వవర్షమును, కేతుమయునకు మేరుపర్వతమునకు పశ్చిమముగా నున్న కేతుమాలవర్షమును ఇచ్చెను. ఈ విధముగ తన పుత్రులను ఆయా వర్షములకు అధిపతులుగా చేసి ప్రియవ్రతుడు వాన ప్రస్థుడై సాలగ్రామ క్షేత్రమునందు తపస్సు చేసి విష్ణులోకమును పొందెను. ఓ మునిశ్రీష్ఠా! కింపురుషాదివర్షము లెనిమిదింటియందును సుఖము అధికము-ఆప్రయత్నముగనే భోగము లన్నియు లభించును. అచట జరామృత్యుభయము గాని. ధర్మాధర్మములు గాని, ఉత్తమ-మధ్యమ-అధమాది భేదములుగాని లేవు. అచట యుగపరివర్తనము కూడ ఉండదు. హిమవర్షాధిపతి యగు నాభికి, మేరుదేవియందు ఋషభ##దేవుడు పుత్రుడుగా జనించెను. ఋషభుని కుమారుడు భరతుడు. ఋషభ##దేవుడు భరతునకు రాజ్యలక్ష్మిని ఇచ్చివేసి, శాలగ్రామక్షేత్రమున శ్రీహరిని శరణుజొచ్చెను. ఈ భరతుని పేరుతో భరతవర్షము ప్రసిద్ధమైనది. భరతునకు సుమతి యను కుమారుడు జనించెను. ఆతనికి రాజ్యభారము సమర్పించి భరతుడు శాలగ్రామ క్షేత్రమునందు శ్రీహరిని శరణు జొచ్చెను. ఆ యోగిరాజు యోగాభ్యసతత్పరుడై ప్రాణములను పరిత్యజించెను. ఈతని ఆ చరిత్రమును నీకు మరల చెప్పెదను. పిదప సుమతి వీర్యము వలన ఇంద్రద్యుమ్నుడు జనించెను. అతనికి పరమేష్ఠియు ఇతనికి ప్రతీహారుడును, ఆతనికి ప్రతిహర్తయు ఆతనికి భవుడు, భవునకు ఉద్గీథుడు, ఆతనికి ప్రస్తారుడు, ఆతనికి విభుడు, ఆతనికి పృథువు, ఆతనికి నక్తుడు, ఆతనికి గయుడు, గయునకు నరుడు నరునకు విరాట్టు అతనికి మహావీర్యుడు, ఆతనికి ధీమంతుడు, ఆతనికి మహాంతుడు, ఆతనికి మనస్యుడు, ఆతనికి త్వష్ట, ఆతనికి విరజుడు, అతనికి (అ.మ.పు.) 40 రజుడు, జన్మించిరి, మహామునీ! రజునిపుత్రుడైన శతజిత్తునకు నూరుగురు పుత్రులు జనించిరి. వారిలో విశ్వజ్యోతి ముఖ్యుడు. వానివలన భారతవర్షము అభివృద్ధి చెందెను. కృతత్రేతాదిక్రమమున ఇది స్వాయం భువమను వంశముగా చెప్పబడిది. అగ్ని మహాపురాణము స్వాయంభువసర్గమను నూటఏడవ అధ్యాయము సమాప్తము. é