Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ నవాధికశతతమో7ధ్యాయః. అథతీర్థమాహాత్మ్యమ్. అగ్నిరువాచ : మాహాత్మ్యం సర్వతీర్థానం వక్ష్యే యద్భుక్తిముక్తిదమ్. యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ సుసంయతమ్.
1 విద్యా తపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్నుతే | ప్రతిగ్రహాదుపావృత్తో లఘ్వాహారో జితేన్ద్రియః. 2 నిష్పాపస్తీర్థయాత్రీ తు సర్వయజ్ఞఫలం లఖేత్ | అనుపోష్య త్రిరాత్రాణి తీర్థాన్యనభిగమ్య చ. 3 అదత్త్వా కాఞ్చనం గాశ్చ దరిద్రో నామ జయతే | తీర్థాభిగమనే తత్స్యాద్యద్యజ్ఞేనాప్యతే ఫలమ్. 4 పుష్కరం పరమం తీర్థం సాన్నిధ్యం హి త్రిసన్ద్యకమ్ | దశకోటిసహస్రాణి తీర్థానాం విప్ర పుష్కరే. 5 బ్రహ్మా సహసురైరాస్తే మునయః సర్వమిచ్ఛవః | దేవాః ప్రాప్తాః సిద్దిమత్రస్నాతాః పితృసురార్చకాః. 6 అశ్వమేదఫలం ప్రాప్య బ్రహ్మలోకం ప్రయాన్తి తే | కార్తిక్యామన్న దానాచ్చ నిర్మలో బ్రహ్మలోకభాక్. 7 పుష్కరే దుష్కరం గన్తుం పుష్కరే దుష్కరం తపః | దుష్కరం పుష్కరే దానం తప్తుం చైవ సుదుష్కరమ్. 8 తత్ర వాసాజ్జపాచ్ఛ్రాద్దాత్కులానాం శతముద్దరేత్ | జమ్బూమార్గాశ్చ తత్రైవ తీర్థం తణ్డులికాశ్రమమ్. 9 కణ్వాశ్రమం కోటితీర్థంనర్మదా చార్బుదం పరమ్ | తీర్థం చర్మణ్వతీసిన్దు సోమనాధః ప్రభాసకమ్. 10 సరస్వత్యబ్దిసఙ్గశ్చ సాగరం తీర్థముత్తమమ్ | పిణ్డారకం ద్వారకా చ గోమతీ సర్వసిద్దిదా. 11 అగ్నిదేవుడు పలికెను :- ఇపుడు భుక్తిముక్తిప్రద మగు తీర్థమాహాత్మ్యమును గూర్చి చెప్పెగను. హస్తములను పాదములను మనస్సును సంయమములో నుంచుకొన్నవాడును, విద్యా-తపఃకీర్తులు కలవాడును మాత్రమే తీర్థములనుండి పూర్తి ఫలమును పొందగలుగును. ప్రతిగ్రహమును విడచి, నియమితాహారమును భుజించుచు, ఇంద్రియముంను స్వాధీనమునందుంచుకొన్నవాడై పాపరహితు డగు తీర్థయాత్రికుడు సకలయజ్ఞఫలమును పొందగలడు. ఎవడు మూడు రాత్రులు ఉపవాసము చేయలేదో, తీర్థయాత్ర చేయలేదో వాడు దరిద్రు డగును. యజ్ఞములవలన కలుగు ఫలితము తీర్థయాత్రలవలన గలుగును. పుష్కరము శ్రేష్ఠ మైన తీర్థము. మూడు సంధ్యలందును అచట సకలదేవతలతో కలసి బ్రహ్మ ఉండును, కోరికలు కలవారు, మునులు, దేవతలును అచటస్నానము చేసి సిద్ధి పొందినారు. పుష్కరమునందు దేవతలను, పితృదేవతలను పూజించిన వాడు అశ్వమేధయజ్ఞఫలమును పొంది బ్రహ్మలోకమునకు పోవును. కార్తీకపూర్ణిమనాడు అచట అన్నదానము చేసిన వాడు శుద్ధచిత్తుడై బ్రహ్మలోకము చేరును. పుష్కరమునకు వెళ్లుటకు అచట తపస్సుచేయుటకు, అచట దానము చేయుటకు, అవకాశము లభించుటయే చాల కష్టము. అచట నివసించు సౌభాగ్యము లభించుట అతిదుష్కరము. పుష్కరమునందు నివసించువాడును, అచట జప శ్రాద్ధములు చేసినవాడును, తన వంశమునందు నూరుతరములవారిచి ఉద్ధరించును. జంబూ మార్గము, తండులికాశ్రమము అను తీర్థములు కూడ అచటనే ఉన్నవి. కణ్వాశ్రమము, కోటితీర్థము, నర్మద, అర్భుదము కూడ ఉత్తమతీర్థములు. చర్మణ్వతి, సింధువు, సోమనాధము. ప్రభాసము, సరస్వతీసముద్రసంగమము, సాగరము కూడా శ్రేష్ఠమైన తీర్థములు. పిండారకక్షేత్రము, ద్వారక గోమతి ఇవన్నియు సర్వసిద్ధిప్రదము లగు తీర్థములు. భూమతీర్థ బ్రహ్మతుంగం తీర్థం పఞ్చనదం వరమ్ | భీమతీర్థం గిరీన్ద్రం చ దేవికా పాపనాశినీ. 12 తీర్థం వినశనం పుణ్యం నాగోద్భేదమషూర్దనమ్ | తీర్థం కుమారకోటిశ్చ సర్వదానీతరా ణి చ. 13 కురుక్షేత్రం గమిష్యామి కురుక్షేత్రే వసామ్యహమ్ | య ఏవం సతతం బ్రూయత్సో7మలః ప్రప్నూయాద్దివమ్..14 తత్ర విష్ణ్వాదయో దేవా స్తత్ర వాసాద్దరిం వ్రజేత్ | సరస్వత్యాం సన్నిహిత్యాం స్నానకృద్బ్రహ్మలోక భాక్. 15 పాంసవో7పి కురుక్షేత్రే నయన్తి పరమాం గతిమ్ | ధర్మతీర్థం సువర్ణాఖ్యం గఙ్గాద్వారమనుత్తమమ్. 16 తీర్థం కనఖలం పుణ్యం భద్రకర్ణహ్రదం తథా | గఙ్గాసరస్వతీ సంగం బ్రహ్మావర్త మఘార్దనమ్ . 17 భృగుతుంగం చ కుబ్జామ్రం గజ్గోద్భేదమషూన్తకమ్ | వారాణసీవరం తీర్థమవిముక్త మనుత్తమమ్. 18 కపాలమోచనం తీర్థం తీర్థరాజం ప్రయాగకమ్ | గోమతీగంగయోః సంగం గఙ్గా సర్వత్ర నాకదా. 19 తీర్థం రీజగృహం పుణ్యం శాలగ్రామమఘాన్తకమ్ | వటేశం వామనం తీర్థం కాళికాసంగముత్తమమ్. 20 లౌహిత్యం కరతోయాఖ్యం శోణం చాథర్షభం పరమ్ | శ్రీపర్వతం కోల్వగిరిః సహ్యాదిర్మలయో గిరిః. 21 గోధావరీ తుంగభద్రా కావేరి వరదా నదీ | తాపీ పయోష్టీ రేవాచ దణ్డకారణ్యముత్తమమ్. 22 కాలంజరం ముంజవటం తీర్థం సూర్పారకం పరమ్ | మన్దాకినీ చిత్రకూటం శృంగవేరపురం పరమ్. 23 అవన్తీపరమం తీర్థమయోధ్యా పాపనాశినీ | నైమిషం పరమం తీర్థం భుక్తిముక్తిప్రదాయకమ్. 24 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే తీర్థయాత్రామాహాత్మ్యం నామ నవాధికశతతమో7ధ్యాయః. భూమితీర్థము, బ్రహ్మతుంగ తీర్థము, పంచనదములు (సత్లజ్ మొదలైన ఐదునదులు) కూడ ఉత్తమములు. భీమ తీర్థ-గిరీంద్ర తీర్థములు, పాపవినాశని యగు దేవికానది, పవిత్రమైన వినశన తీర్థము, నాగోద్భేదము, అఘాదనము, కుమారకోటి- ఇవన్నియు సకలఫలప్రదములు, 'నేను కురుక్షేత్రమునకు వెళ్ళెదను: కురుక్షేత్రములో నివాసము చేసెదను'' అని సర్వదా చెప్పువాడు పరిశుద్ధుడై స్వర్గలోకమును పొందును. అచట విష్ణ్వాది దేవతలు నివసించు చుందురు. అచట నివాసము చేయుటచే మానవుడు విష్ణులోకమును పొందును. కురుక్షేత్రమునందు సమీపముననే సరస్వతీనది ప్రవహించుచుండును. దానిలో స్నానము చేయువాడు బ్రహ్మలోకము పొందును. కురుక్షేత్రమునందలి ధూలికూడ ఉత్తమ పదము నిచ్చును. ధర్మతీర్థ-సువర్ణతీర్థములు, పరమోత్తమ మైన గంగాద్వారము (హరిద్వారము) పవిత్రమైన కనఖలము భద్ర-కర్ణహ్రదము, గంగాసరస్వతీ సంగమము, బ్రహ్మావర్తము ఇవి పాపవినాశకములైన తీర్థములు. భృగుతుంగ-కుబ్జామ్ర-గంగోద్భేదములు గూడ పాపవినాశకములు. వారాణసి సర్వోత్తమమైన తీర్థము. దీనికే శ్రేష్ఠమగు ఆ ఎముక్తక్షేత్రమని కూడ పేదు. కపాల మోచనతీర్థము కూడ ఉత్తమ మైనది. ప్రయాగ తీర్థములలో రాజు. గోమతీ-గంగా సంగమము కూడ పావనతీర్థము. గంగ ఎక్కడ నున్నను స్వర్గలోకము నిచ్చును. రాజగృహము పవిత్రతీర్థము, శాలగ్రామతీర్థము పాపవినాశకము. వటేశ-వామన-కాలికాసంగమతీర్థములు కూడ ఉత్తమమైనవి. రౌహిత్యతీర్థము, కరతోయానది, శోణభద్రము, ఋషభతీర్థము కూడ శ్రేష్ఠమైనవి. శ్రీపర్వత-కోలాచల-సహ్యగిరి-మలయగిరి-గోదావరీ-తుంగభద్రలు, వరదాయిని యగు కావేరినది, తాపి, పయోష్ణి, రేవ (నర్మద) దండకారణ్యము కూడ ఉత్తమతీర్థములు. కాలంజర-ముంజవట-శూర్పారక-మందాకినీ-చిత్రకూట-శృంగవేరుపురములు కూడ శ్రేష్ఠములు- అవంతి కూడ ఉత్తమతీర్థము, అయోధ్య సకలపాపములను నశింపచేయును. నైమిషారణ్యము పరమపవిత్రతీర్థము. ఇది భుక్తిముక్తిప్రదము. అగ్నిమహాపురాణమునందు తీర్థయాత్రామాహాత్మ్య మను నూటతొమ్మిదవ అధ్యాయము సమాప్తము.