Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకాదశో7ధ్యాయః. అథోత్తరకాణ్డవర్ణనమ్. నారద ఉవాచః రాజ్యస్థం రాఘవం జగ్మురగస్త్యాధ్యాః సుపూజితాః| ఋషయ ఊచుః : ధన్యస్త్వం విజయీ యస్మాదిన్ద్రజిద్వినిపాతితః నారదుడు పలికెను. రాజ్యము చేయుచున్న రామునివద్దకు పూజనీయులైన అగస్త్యాదులు వెళ్లిరి. ఋషులు ఇట్లు పలికిరి-నీవు ఇంద్రజిత్తును సంహరించితివి. ఈ విధముగ విజయవంతుడవైన నీవు ధన్యుడవు. బ్రహ్మాత్మజః వులస్త్యోభూద్విస్రవాస్తస్య కైకసీ | పుష్పోత్కటా7భ్రూత్ప్రథమా తత్పుత్రో7భూద్ధనేశ్వరః 2 కైకస్యాం రావణో జజ్ఞే వింశద్బాహుద్ధశాననః | తపసా బ్రహ్మదత్తేన వరేణ జితదైవతః 3 కుమ్భకర్ణః సనిద్రో7భూర్ధర్మిష్ఠో7భూద్విభీషణః | స్వసా శూర్పణఖా తేషాం రావణాన్మేఘనాదకః. 4 ఇన్ద్రం జిత్వేన్ద్రజిచ్ఛాభూద్రావణాదధికో బలీ | హతస్త్వయా లక్ష్మమేన దేవదేః క్షేమమిచ్ఛతా. 5 బ్రహ్మకు పులస్త్యుడను కుమారుడు కలిగెను. అతని కుమారుడు విశ్రవసుడు. అతని భార్య కైకసి. అతని ప్రతము భార్య పుష్పోద్భవ. పెద్దదైన పుష్పోద్భవకు కుబేరుడు పుత్రుడుగ జనించెను. కైకసికి ఇరువది బాహువులును, పదిముఖములును గల రావణుడు పుట్టెను. అతడె బ్రహ్మ ఇచ్చిన వరములచే దేవతల నందరిని జయించెను. నిద్రాపరవశుడైన కుంభకర్ణుడును, ధార్మికుడైన విభీషణుడును పుట్టిరి. వారికి శూర్పణఖ సోదరి. రావణునకు మేఘనాదుడను కుమారుడు పుట్టెను. రావణుని కంటె అధికబలవంతుడైన అతడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తను పేరు పొందెను. దేవతాదుల క్షేమమునకై నీవు లక్ష్మణునిచే చంపించితిని. నారద ఉవాచ: ఇత్యుక్త్వా తే గతా విప్రా అగస్త్యాద్యా నమస్కృతాః | దేవప్రార్థిత రామోక్తః శత్రుఘ్నో లవణార్దనః 6 అభూత్పూర్మథురా కాచి ద్రామోక్తో భరతో7వధీత్ | కోటిత్రయం చ శై లూషపుత్రాణాం నిశితైః శ##రైః 7 శైలూషం దుష్టగన్దర్వం సిన్ధుతీరం నివాసినమ్ | తక్షం చ పుష్కరం పుత్రం స్థాపయిత్వా7థ దేశయోః. 8 భరతో7గాత్సశత్రుఘ్నో రాఘవం పూజయన్ స్థితః | రామో దుష్టాన్ని హత్యాజౌ శిష్టాన్ సంపాల్య మానవః. ఆ అగస్త్యాదులగు బ్రాహ్మణులు ఈ విధముగ చెప్పి రామునిచే పూజితులై వెళ్లిపోయిరి. దేవతలచేత ప్రార్థింపబడిన రాముని అజ్ఞచే శత్రఘ్నుడు లవణుడను రాక్షసుని సంహరించెను. పూర్వము మథుర అను పట్టణ మొకటి ఉండెను. రామునిచే అజ్ఞాపింపబడిన భరతుడు తీక్‌ష్ణములైన బాణములచే మూడు కోట్ల శైలూషపుత్రులను సంహరించెను. సిందుతీరమునందు నివసించు దుష్టగంధర్వుడైన శైలూషుని కూడ చంపెను. పిమ్మట ఆ దేశములలో పుత్రులైన తక్షుని, పుష్కరిని పాలకులనుగా చేసి భరతుడు శత్రఘ్న సమేతుడై వచ్చి రాముని సేవించెను. ఈ విధముగ మానవరూపుడైన రాముడు దుష్టులను యుద్దమున సంహరించి శిష్టులను పాలించెను. పుత్రౌ కుశలవై జాతౌ వాల్మీకే రాశ్రమే వరౌ | లోకాపవాదాత్త్యక్తాయాం జ్ఞాతౌ సుచరిత శ్రవాత్. 10 రాజ్యే7భిషిచ్య బ్రహ్మహమస్మీతి ద్యానతతత్పరః | దశ వర్షససాహ్రణి దశ వర్ష శతానిచ. సజ్యం కృత్వా క్రతూన్ కృత్వా స్వర్గం దేవార్చితో య¸° | సపౌరః సానుజః సీతాపుత్రో జనపదాన్వితః 12 లోకాపవాదముచే విడువబడిన సీతకు వాల్మీక్యాశ్రమములో జనించిన కుశలవులను, వారు చేసిన రామాయణ కథశ్రవణమును బట్టి తెలిసుకొని వాళ్ళను రాజ్యమునందు అభిషిక్తులను చేసెను. ఈ విధముగ రాముడు ఆ పరమాత్మనే నేను అను ధ్యానమునందు తత్పరుడై పదివేల సంవత్సరముల కాలము ధనస్సుచే లోకములను రక్షించుచు, అనేక యాగములు చేసి. దేవతలు కొనియాడ, పౌరులును, తమ్ములను వెంటరాగా స్వర్గమునకు వెళ్ళెను. సీతా పుత్రుడైన కుశుడు రాజ్యము పొందెను. అగ్ని రువాచ : వాల్మీకిర్నారదాచ్ఛ్రుత్వా రామాయణమకార యత్ | సవిస్తరం య ఏతచ్చ శృణుయాత్స దివం వ్రజేత్. 13 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఉత్తరకాణ్డ వర్ణనం నామ ఏకదశో7ధ్యాయః అగ్ని పలికెను. వాల్మీకి నారదుని నుండి విని రామాయాణమును సవిస్తరముగ రచించెను. దీనిని వినువాడు స్వర్గమునకు వెళ్ళును. అగ్ని మహాపురాణమునందు రామాయణమున ఉత్తరకాండవర్ణనమున ఏకాదశాధ్యాయము సమాప్తము.