Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ద్వాదశో7ధ్యాయః

అథ శ్రీహరివంశ వర్ణనమ్‌.

అగ్ని రువాచ :

హరివంశం ప్రవక్ష్యామి విష్ణునాభ్యమ్భుజాదజః | బ్రహ్మణో7త్రిస్తతః సోమః సోమాజ్జాతః పురూరవాః 1

తస్మాదాయురభూత్తస్మాన్నహుషో7తో యయాతికః | యదుం చ తుర్వసుం తస్మాద్దేవయానాప్యజాయత. 2

ద్రుహ్యుం చానుం చ పూరం చ శర్మిష్ఠా వార్షపర్వణీ | యదోః కులే యాదవాశ్చ వాసుదేవస్తదుత్తమః. 3

అగ్ని పలికెను - హరివంశమును చెప్పెదను. విష్ణునాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను. బ్రహ్మకు అత్రి, అతనికి సోముడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, అతనికి యయాతి పుట్టిరి, అతనినుండి దేవయాని యదువు, తుర్వసుడు అను కుమారులను, వృషవర్వుని కుమారైయైన శర్మిష్ఠ ద్రుహ్యు-అను పూరులు అనెడు కుమారులను కనిరి. యదువు కులముందు యాదవులు పుట్టిరి. వాసుదేవుడు వారిలో ఉత్తముడు.

భువో భారావతారార్థ దేవక్యాం వసుదేవతః | హిరణ్యకశిపోః పుత్రాః షడ్‌ గర్భా యోగనిద్రయా. 4

విష్ణుప్రయుక్తయా నీతా దేవకీజఠరం పురా | అభూచ్చసప్తమో గర్భో దేవక్యా జఠరాద్బలః 5

సంక్రామితో7భూద్రోహిణ్యాం రౌహిణయస్తతో హరిః | కృష్ణాష్టమ్యాం చ నభసి అర్థరాత్రే చతుర్భుజః 6

భూ భారమును తొలగించుటకై పూర్వజన్మలో హిరణ్యకశివుని ఆరుగురు పుత్రులు దేవకి యందు వసుదేవుని వలన, విష్ణు ప్రేరిత యైన యోగమాయ- ప్రభావముచే పుట్టిరి. బలరాముడు దేవికి సప్తమ గర్భముగా అయెను. అతడు రోహిణి యందు సంక్రమింపజేయబడి రౌహిణయుడాయెను. పిమ్మట చతుర్భుజుడైన హరి శ్రావణ కృష్ణపక్ష్యష్టమి యందు అర్ధరాత్రమున జనించెను.

దేవక్యా వసుదేవేన స్తుతో బాలో ద్విబాహుకః | వసుదేవః కంసభయాద్యశోదాశయనే7నయత్‌. 7

యశోదాబాలికాం గృహ్య దేవకీ శయనే7నయక్‌ | కంసో బాలధ్వనిం శ్రుత్వా తాం చిక్షేప శిలాతలే. 8

రెండు భాహువులు గల బాలుడుగా మారిన ఆ చతుర్భుజుని దేవకీ వసుదేవులు స్తుతించిరి. వసుదేవుడు కంసునికి భయపడి ఆ పిల్లవానిని తీసికొని వెళ్లి యశోద పక్కలో పరుండబెట్టి యశోద కుమార్తెను తీసికొని వచ్చి దేవకి పక్కలో పరుండ బెట్టెను. కంసుడు పిల్ల ఏడ్చిన ధ్వని విని ఆ శిశువును శిలపై వేసి కొట్టెను.

వారితో7పి స దేవక్యా మృత్యుర్గర్భోష్టమో మమ| శ్రుత్వాశరీరిణీం వాచం మత్తో గర్భాః సుమారితాః 9

సమర్పితాస్తు దేవక్యా వివాహసమయేరితాః | సా క్షిప్తా బాలికా కంసమాకాశస్థా7బ్రవీదిదమ్‌. 10

దేవకి వారించినను "నీ అష్టమగర్భము నాకు మృత్యుహేతువు" అని పలుకుచు అట్లుచేసెను. ఆకాశవాణిని విని అతడు దేవకి వివాహసమయమున చెప్పిన ప్రకారము తన కిచ్చన శిశువులనందరిని పూర్వము చంపివేసెను. క్రిందికి విసరి వేయబడిన ఆ బాలిక అకాశముపైకి ఎగిరి కంసునిలో ఇట్లు పలికెను.

బాలికోవాచ:

కిం మాయా క్షిప్తయా కంస జాతో యస్త్వాం వధిష్యతి | సర్వస్వభూతో దేవానాం భూభారహరణాయ సః.

బాలిక పలికెను. కంసా; నన్ను విసిరివేసి ఏమి ప్రయోజనము? దేవతలకు సర్వన్వము వంటివాడు ఒకడు భూభారమును తొలగించుటకై పుట్టినాడు. అతడు నిన్ను చంపివేయగలడు.

ఇత్యుక్త్వా సా చ శుమ్భాదీన్‌ హత్వేన్ద్రేణ చ సంస్తుతా | ఆర్యా దుర్గా వేదగర్భా అమ్బికా భద్రకాల్యపి. 12

భద్రా క్షేమ్యా క్షేమకరీ నైకబాహుర్నమామి తామ్‌ |

త్రిసంధ్యం యః పఠేన్నామ సర్వాన్కామానవాప్నుయాత్‌. 13

ఇట్లు పలికి ఆమె అంతర్ధానము చెందినది. ఆమె పూర్వము శుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే "ఆర్యా! దుర్గా. వేదగర్భా, అంబికా, భద్రకాళీ, భద్రా, క్షేమ్యాక్షేమకరీ, నైకబాహుః అను పేర్లు గల నిన్ను నమస్కరించుచున్నాను." అని స్తుతింపబడినది. ఈ నామములను త్రిసంధ్యలందును చదువువాడు సమన్తకామములను పొందును.

కంసో7పి పూతనాదీంశ్చ పై#్రషయద్భాలనాశ##నే | యశోదాపతినన్దాయ వసుదేవేన చార్పితౌ. 14

రక్షణాయ చ కంసాదేర్భితేనేవ హి గోకులే | రామకృష్ణౌ చేరతుస్తౌ గోభిర్గోపాలకైః సహ. 15

సర్వస్య జగతః పాలౌ గోపాలౌ తౌ బభూవతుః |

ఆ బాలుని చంపుటకై, కంసుడు, పూతన మొదలగు వారిని పంపెను. కంసునినుండి భయపడినవాడు వలె వసుదేవునిచే యశోదాపతియైన నందునికి రక్షణార్థమై ఈయబడిన రామకృష్ణులు గోకులము నందు గోవులతోడను, గోపాలకులతోడనుకలిసి సంచరించిరి. జగత్తునకు పాలకులైనా వారు గోపాలులైరి.

కృష్ణశ్చోలూఖలే బద్ధో దామ్నా వ్యగ్రయశోదయా. 16

యమలార్జునమధ్యే7గాద్భగ్నౌ చ యమలార్జునౌ |

విసుగు చెందిన యశోదచేత రోటికి కట్టబడిన కృష్ణుడు జంటగా పెరిగిన రెండు అర్జునవృక్షములు మధ్యకు వెళ్ళగా అవి భగ్నమైనవి.

పరివృత్తశ్చ శకటః పాదక్షేపాత్త్సనార్థినా. 17

పూతనా స్తనపానేన సా హతా హన్తకుముద్యతా | వృన్దావనగతః కృష్ణః కాలియం యమునాహ్రదాత్‌. 18

జిత్వా నిఃస్సార్య చాబ్దిస్థం చకార బలసంస్తుతః | క్షేమం తాలవనం చక్రే హత్వా ధేనుకగర్ధభమ్‌. 19

బృందావనమందున్న శ్రీకృష్ణుడు స్తన్యమును కోరుచు పాదములను విసరి శకటాసురుని తల క్రిందు చేసెను. తను చంపుటకై ఉద్యమించిన పూతనను స్తన్యమును త్రాగి చంపివెసెను. కాలియుని జయించి అతనిని యమునాహ్రదము నుండి వెడలగొట్టి సముద్రమునందు నివసించునట్లు చేసెను. బలముచే స్తుతింపబడిన అతడు గర్దభరూపమున నున్న ధేనుకాసురుని చంపి తాలవనమును క్షమకరమైన దానినిగా చేసెను.

అరిష్టవృషభం హత్వా కేశినం హయరూపిణమ్‌ | శక్రోత్సవం పరిత్యజ్య కారితో గోత్రయజ్ఞకః. 20

వృషభ రూపముననున్న అరిష్టాసురుని చంపి హయరూపములో ఉన్న కేశిని సంహరించెను. శక్రోత్సవమును మాన్పి పర్వతపూజ చేయించెను.

పర్వతం ధారయిత్వా చ శక్రాద్వృష్టిర్నివారితా | నమస్కృతో మహేన్ద్రేణ గోవిన్దో7థార్జునో7ర్పితః 21

ఇన్ద్రోత్సవస్తు తుష్టేన భూయః కృష్ణేన కారితః |

పర్వతమును ఎత్తి దేవేంద్రుడు కురిపంచిన వర్షము నివారించెను. దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి అర్జునుని సమర్పించెను. కృష్ణుడు సంతసించి ఇంద్రోత్సవము చేయించెను.

రథస్థో మథురాం చాగాత్కంసోక్తాక్రూరసంస్తుతః 22

గోపీభిరనురక్తాభిః క్రీడితాభిర్నిరీక్షితః | రజకం చాప్రయచ్ఛనతం హత్వా వస్త్రాణి చాగ్రహీత్‌. 23é

సహ రామేణ మాలాభృన్మాలాగకారే వరం దదౌ | దత్తునాలేపనాం కుబ్జామృజుం చక్రే7హనద్గజమ్‌. 24

మత్తం కువలయాపీడం ద్వారి రఙ్గం ప్రవిశ్య చ | కంసాదీనాం పశ్యతాం చ మఞ్చస్థానాం నియుద్దకమ్‌.

చక్రే చాణూరమల్లేన ముష్టికేన బలో7కరోత్‌ | చాణూరముష్టికౌ తాభ్యాం హతౌ మల్లౌ తథాపరౌ. 26

కంసుడు పంపిన ఆక్రూరుడు స్తుతింపగా శ్రీకృష్ణుడు రథము నెక్కి మథురకు వెళ్లెను. అతడు ఆ విధముగా వెళ్ళిపోవునపుడు అతనితో క్రీడించిన, అనురక్తలైన గోపికలు అతనిని చూచుచు నిలబడిపోయిరి. వస్త్రముల నడుగగా ఇవ్వని రజకుని చంపి వస్త్రములను గ్రహించెను. రామునితో కలిసి పుష్పమాలలు ధరించి మాలాకారునకు వరమిచ్చెను. అంగరాగమునిచ్చిన కుబ్జకు గూను పోవునట్లు చేసెను. రాజద్వారమునందున్న మదించిన కువలయాపీడమను గజమును సంహరించెను. రంగస్థలమును ప్రవేశించి, అసనములపై కూర్చున్న కంసాదులు చూచుచుండగా చాణూరముల్లునితో మల్లయుద్ధము చేసెను. బాలరాముడు ముష్టికుడను మల్లునితో చేసెను. వారిరువురు ఆ చాణూరముష్టికులను మల్లులను, ఇతరులను చంపిరి.

మథురాధిపతిం కంసం హత్వాం తత్పితరం హరిః | చక్రే యాదవరాజానమస్తిప్రాప్తీచ కంసగే. 27

జరాసన్దన్య తే పుత్రౌ జరానన్దస్తదీరితః | చక్రే స మథురారోధం యాదవైర్యుయుధే శ##రైః 28

శ్రీకృష్ణుడు మథురాపతి యైన కంసుని చంపి అతని తండ్రనని రాజుగా చేసెను. కంసుని భార్యలైన ఆస్తి-ప్రాప్తి అనువారు జరాసంధుని కుమార్తెలు. వారు ప్రేరేపింపగా జరాసంధడు మథురానగరమును ముట్టడించెను. యాదవులు బాణములతో అతనితో యుద్దము చేసిరి.

రామకృష్ణౌ చ మథురాం త్యక్త్వా గోమన్తమాగతా | జరాసన్ధం విజిత్యాజౌ పౌండ్రకం వాసుదేవకమ్‌. 29

పురా చ ద్వారకాం కృత్వా న్యవసద్యాదవై ర్వృతః |

రామకృష్ణులు మథరను విడచి గోమంతమునకు వచ్చిరి. యుద్ధమున జరాసంధని జయించి, పౌండ్రక వాసుదేవుని కూడ జయించి, శ్రీకృష్ణుడు ద్వారకానగరమును నిర్మించి అందు యాదవులతో నివసించెను.

భౌమం తు నరకం హత్వా తేనానీతాశ్చ కన్యకాః. 30

దేవగన్ధర్వయక్షాణాం తా ఉవాహ జనార్ధనః | షోడశస్త్రీసహస్రాణి రుక్మిణ్యాద్యాస్తథాష్ట చ. 31

జనార్దనుడు, భూమి పుత్రుడైన నరకాసురిని చంపి, అతనిచే బంధింపబడిన దేవగంధర్వ యక్షకన్యలను వివాహామాడెను. ఈ విధముగ అతడు కూడ పదహారువేలమంది స్త్రీలను, రుక్మిణి మొదలగు ఎనమండుగురిని వివాహమాడెను.

సత్యభామాసమాయుక్తో గరుడే నరకార్దనః | మణిశైలం సరత్నే చ ఇన్ద్రం జిత్వా హరిర్దివి. 32

పారిజాతం సమానీయ సత్యభామా గృహే7కరోత్‌ |

నరకాసురసంహారియైన ఆ హరి సత్యభామా సహితుడై గరుడారూడుడై స్వర్గలోకమునకు వెళ్ళి అచట ఇంద్రుని జయించి, మణిశైలమును, రెండు రత్నములను, పారిజాతవృక్షమును తీసికొని సత్యభామా గృహమున ఉంచెను.

సాందీపనేశ్చ శస్త్రాస్త్రం జ్ఞాత్వాం తద్భాలకం దదౌ. 33

జిత్వా పఞ్చజనం దైత్యం యమేన చ సుపూజితః | అవధీత్కాలయవనం ముచుకున్దేన పూజితః. 34

వసుదేవం దేవకీం చ భక్తాన్విప్రాంశ్చ సో7ర్చయత్‌ |

సాందీపని నుండి శస్త్రాస్త్రముల నభ్యసించి, మరణించిన అతని కుమారుని మరల తీసికొని వచ్చి ఇచ్చెను. పంచజనుడను దైత్యుని సంహరించి యమునిచే పూజింపబడెను. కాలయవనుని సంహరించి ముచుకుందనిచే పూజింపబడెను. దేవకీవసుదేవులను భక్తులను, విప్రులను పూజించెను.

రేవత్యాం బలభద్రాచ్చ జజ్ఞాతే నిశఠోల్ముకౌ. 35

కృష్ణాత్సామ్బో జామ్బవత్యామన్యాస్వన్యే7భన్సుతాః |

ప్రద్యుమ్నో7భూచ్చ రుక్మిణ్యాం షష్ఠేహ్ని స హృతో బలాత్‌. 36

శమ్బరేణామ్బుధౌ క్షిప్తో మత్స్యో జగ్రాహా ధీవరః | తం మత్స్యం శమ్బరాయాదాన్మాయావత్త్యెచ శమ్బరః.

మాయావతీ మత్సమధ్యే దృష్ట్వా స్వం పతిమాదరాత్‌ | పుషోష సా తం చోవాచ రతిస్తేహం పతిర్మమ.

కామస్త్వం శమ్భునానఙ్గః కృతో7హం శమ్భరేణ చ |

హృతా న తస్య పత్నీ త్వం మాయాజ్ఞః శమ్బరం జహి.

బలభద్రునకు రేవతియందు నిశఠుడు, ఉల్ముకుడు అను ఇరువురు కుమారులు కలిగిరి, కృష్ణునకు జాంబవతి యందు సాంబుడు పుట్టెను. ఇతర భార్యలయందు ఇంకను కొందరు పుత్రులు పుట్టిరి. రుక్మిణియందు ప్రద్యుమ్నుడు పుట్టెను. అరవదినమున ఆ శిశువును శంబరుడు బలాత్కారముగా అపహరంచి సముద్రములో పారవేయగా ఒక మత్స్యము పట్టుకొనెను. (మ్రింగెను) ఆ మత్స్యమును ఒక జాలరి పట్టుకొనెను. దానిని శంబరున కిచ్చెను. శంబరుడు మాయావతి కిచ్చెము. మాయావతి మత్స్యగర్భములో నున్న తన పతిని చూచి అదరముతో పెంచెను అతనితో ఇట్లనెను. " నేను నీ రతిని. నీవు నాపతివైన మన్మథుడవు. శివుడు నీకు శరీరము లేకుండునట్లు చేసెను. నన్ను శంబరుడు హరించెను. నేను అతని భార్యను కాదు. నీవు మాయలు తెలిసిన వాడవుగాన ఈ శంబరుని సంహరించుము.

తచ్ఛ్రుత్వా శమ్భరం హత్వా ప్రద్యుమ్నః సహ భార్యయా |

మాయావత్యా య¸° కృష్ణం కృష్ణో హృష్టోథ రుక్మిణీ. 40

ఆ మాట విని ప్రద్యుమ్నుడు శంబరుని చంపి భార్యయైన మాయావతితో కూడ కృష్ణుని వద్దకు వెళ్ళగా రుక్మిణి కృష్ణులు సంతసించిరి.

ప్రద్యుమ్నాదనిరుద్దో7భూదుషాపతి రుదారధీః | బాణో బలిసుతస్తస్య సుతోషా శోణితం పురమ్‌. 41

తపసా శివపుత్రో7భూన్మయూరధ్వజపాతితః |

యుద్దం ప్రాప్స్యసి బాణ త్వం బాణం తుష్టః శివో7భ్యధాత్‌. 42

ప్రద్యుమ్నునకు ఉషాపతియు, ఉదారబుద్ధియు అగు అనిరుద్ధుడు పుట్టెను. బలిపుత్రుడైన బాణుడుండెను. అతని కుమార్తె ఉష. అతని నగరము శోణితపురము. అతడు తపస్సుచే శివునికి పుత్రుడు వంటివాడయెను. 'ఓ బాణా! నీ మయూరధ్వజము ఎప్పుడు పడిపోవునో అప్పుడు నీవు యుద్ధము పొందగలవు' అని సంతసించిన శివుడు పలికెను.

శివేన క్రీడతీం గౌరీం దృష్టోషా సస్పృహా పతౌ | తామాహ గౌరీం భర్తా తే నిశి స్వప్నేతు దర్శనాత్‌. 43

వైశాఖమాసద్వాదశ్యాం పమాన్‌ భర్తా భవిష్యతి | గౌర్యుక్తా హర్షితా చోషా గృహే సుప్తా దదర్శ తమ్‌. 44

ఆత్మనా సఙ్గతం జ్ఞాత్వా తత్సఖ్యా చిత్రలేఖయా | లిఖితాద్వై చిత్రపటాదనిరుద్దం సమానయత్‌. 45

కృష్ణపౌత్రం ద్వారకాతో దుహిత్రా బాణమన్త్రిణః | కుమ్భాణ్డస్యానిరుద్దో7గాద్రరామ హ్యుషయా సహ. 46

గౌరి శివునితో క్రీడించుచుండగా చూచి ఉష భర్తను గూర్చి అభిలాష కలదాయెను. గౌరి ఆమెతో ఇట్లనెను. వైశాఖమాన ద్వాదశీదివసమున నీకు స్వప్నమునందు కనబడు పురుషుడు నీకు భర్తకాగలడు గౌరి మాటలు విని సంతసించిన ఉష గృహమునందు నిద్రించి ఆతనిని చూచెను. అతడు తనతో సంగము చేసినట్లు తెలిసికొని, చిత్రపటముపై అతని మూర్తిని చిత్రించి దాని సాహాయ్యముతో సఖియైన చిత్రలేఖ ద్వారా కృష్ణుని పౌత్రుడైన ఆనిరుద్ధుని ద్వారకనుండి తెప్పించికొనెను. ఆ చిత్రలేఖ బాణాసురుని మంత్రియైన కుంభాడుని పుత్రిక. అనిరుద్దుడు ఉషతో కూడ రమించెను.

బాణధ్వజస్య సంపాతో రక్షింభిః స నివేదితః | అనిరుద్ధస్య బాణన యుద్దమాసీత్సుదారుణమ్‌. 47

రక్షకులు వెళ్లి బాణుని ధ్వజము పడిపోయినట్లు అతనికి తెలిపిరి. అనిరుద్దునకు బాణునితో సూదారుణౖన యుద్ధము జరిగెను.

శ్రుత్వా తు నారదాత్కృష్ణః ప్రద్యుమ్న బలభద్రవాన్‌ |

గరుడస్థో7థజిత్వారీన్‌ జ్వరం మహేశ్వరంతథా. 48

కృష్ణుడు నారదునినుండి ఈ విషయము తెలియగా, గరుడారూఢుడై, ప్రద్యుమ్న బలరామసమేతడై వచ్చి శత్రువులను, మహేశ్వరజ్రమును కూడ జయించెను.

హరిశఙ్కరయోర్యుద్ధం బభూవాథశరాశరి | నన్దీ వినాయకగస్కన్ద ముఖాస్తార్యాదిభిర్జితాః. 49

పిమ్మట హరిశంకరుల మధ్య బాణములతో యుద్దము జరిగెను. తార్యుడు మొదలగు వారు నంది - వినాయక- స్కందాదులను జయించిరి.

జృమ్భితే శఙ్కరేసుప్తే జృమ్భణాస్త్రేణ విష్ణునా | భిన్నం సహస్రం బాహూనాం రుద్రేణాభయమర్థితమ్‌. 50

విష్ణువు ప్రయోగించిన జృంభణాస్త్రముచే శంకరుడు ఆవులించుచు నిద్రపోయెను. అపుడు బాణుని బాహస్రము భేదింపబడెను. రుద్రుడు బాణున కభయ మిమ్మని విష్ణువును కోరెను.

విష్ణునా జీవితో బాణో ద్విబాహుః ప్రాబ్రవీచ్ఛివమ్‌.

కృష్ణ ఉవాచ:-

త్వయా యదభయం దత్తం బాణస్యాస్య మయాపి తత్‌ | 51

ఆవయోర్నాస్తి భేదోవై భేదీ నరకమాప్నుయాత్‌.

విష్ణువు బాణుని రెండు బాహువులతో జీవింపచేసి శివునితో ఇట్లనెను (కృష్ణుడు పలికెను.) " నీవు ఈ బాణునకు ఆభయమిచ్చినావు గాన నేనును ఇచ్చుచున్నాను. మన ఇరువురికిని భేదము లేదు. భేదమును చూచువాడు నరకమున పడును."

అగ్ని రూవాచ:-

శివాధ్యైః పూజితో విష్ణుః సానిరుద్ద ఉషాది యుక్‌ | ద్వారకాం తు గతో రేమే ఉగ్రసేనాదియాదవైః 52

విష్ణువు శివాదులచే పూజడింపబడి, ఉషానిరుద్ధాదులతో కూడి ద్వారకకు వెళ్లి ఉగ్రసేనాదియాదవులతో కలిసి సుఖముగా ఉండెను.

అనిరుద్ధాత్మజో వజ్రో మార్కణ్డయాత్తు సర్వవిత్‌ | బలభద్రః ప్రలపమ్బమ్నో యమునాకర్షణో7భవత్‌. 53

ద్వివిద్యస్య కపేర్భాత్తా కౌరవోన్మాదనాశనః | హరీ రేమే7నేకమూర్తి రుక్మిణ్యాదిభిరీశ్వరః 54

పుత్రానుత్పాదయామాస త్వసంఖ్యాకాన్స యాదవాన్‌ |

హరివంశం పఠేద్యః స ప్రాప్తకామో హరిం ప్రజేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే హరివంశ వర్జనం నామ ద్వాదశో7ధ్యాయః

Sri Madhagni Mahapuranamu-1    Chapters