Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకవింశోత్తర శతతమో೭ధ్యాయః.అథ అథ జ్యోతిః శాస్త్రసారః. అగ్నిరువాచ: జ్యోతిఃశాస్త్రం ప్రవక్ష్యామి శుభాశుభనివేదకమ్ | చాతుర్లక్షస్య సారం యత్తద్ జ్ఞాత్వా సర్వవిద్భవేత్. 1 షడష్టకే వివాహో న నచ ద్విర్ద్వాదశే స్త్రియాః | నత్రికోణ హ్యథ ప్రీతిః శేషే చ సమసప్తకే. 2 ద్విద్వాదశే త్రికోణ చ మైత్రీ క్షేత్రపయోర్యది | భ##వేదేకాధిపత్యం చ తారాప్రీతిరథాపి వా. 3 తథాపి కార్యః సంయోగో న తు షష్ఠాష్టకే పునః | జీవే భృగౌ చాస్తమితే మ్రియతే చ పుమాన్ స్త్రియా. 4 గురుక్షేత్రగతే సూర్యే సూర్యక్షేత్రగతే గురౌ | వివాహం న ప్రశంసన్తి కన్యావైధవ్యకృద్భవేత్. 5 అతిచారే త్రిపక్షం స్యాద్వక్రే మాసచతుష్టయమ్ | వ్రతోద్వాహౌ న కుర్వీత గురోర్వక్రాతిచారయోః. 6 చైత్రే పౌషే న రిక్తాసు హరౌ సుప్తే కుజే రవౌ | చన్ద్రక్షయే చాశుభం స్యాత్సన్ద్యాకాలః శుభావహః. 7 రోహిణీ చోత్తరా మూలం స్వాతీ హస్తో7థ రేవతీ | తులే చ మిథునే శస్తో వివాహః పరికీర్తితః. 8 వివాహే కర్ణవేధే చ వ్రతే పుంసవనే తథా | ప్రాశ##నే చాద్యచూడాయాం విద్ధరంచ వివర్జయేత్. 9 శ్రవణ మూలపుష్యే చ సూర్యమఙ్గలజీవకే. కుమ్భే సింహే చ మిథునే క్రమ పుంసవనం స్మృతమ్. 10 హస్తే మూలే మృగే పౌష్ణే బుధే శుక్రే చ నిష్కృతిః | అర్కేన్దుజీవభృగుజే మూలే తామ్బూలభక్షణమ్. 11 అన్నస్య ప్రాశనం శుక్రే జీవే మృగే చ మీనకే | హస్తాది పంచకే పుష్యే కృత్తికాదిత్రయే తథా. 12 అశ్విన్యామథ రేవత్యాం న వాన్న ఫలభక్షణమ్ | పుష్యో హస్తస్తథా జ్యేష్ఠా రోహిణీ శ్రవణాశ్వినౌ. 13 స్వాతిసౌమ్యే చ భైషజ్యం కుర్యాదన్యత్ర వర్జయేత్ | పూర్వాత్రయం మఘా యామ్యం పావనం శ్రవణత్రయమ్. 14 భౌమాదిత్యే శ##నేర్వారే స్నాతవ్యం రోగముక్తితః | అగ్ని పలికెను! మహామునీ! ఇపుడు శుభాశుభనివేకమును ఇచ్చునదియు, మనుష్యుని సర్వజ్ఞునిగ చేయునదియు, నాలుగు లక్షల శ్లోకముల జ్యోతిఃశాస్త్రము యొక్క సారభూతమును అగు జ్యోతిఃశాస్త్రము గూర్చి సంక్షిప్తముగా చెప్పెదను. కన్యయొక్క జన్మరాశినుండి వరుని రాశి సంఖ్య ఆరు-ఎనిమిదిగాని, తొమ్మిది-అయిదుగావి, రెండు-పండ్రెండు గాని అయినచో వారి వివాహము శుభ్రపదము కాదు; మిగిలిన పది-నాలుగు, పదకొండు-మూడు, సమసప్తకము అయినచో శుభప్రదము; వధూవరుల రాశ్యధిపతులు పరస్పరమిత్రులైనను, రెండు రాశుల అధిపతియు ఒక్కడే యైనను ఇరువురి జన్మనక్షత్రములకు మైత్రి యున్నను, పంచమ-నవమ, ద్విర్ద్వాదశ దోషములు చూడక వివాహము చేయవచ్చును. షష్ఠాష్టకమున్నపుడు మాత్రము ఎన్నడును వివాహము చేయరాదు. గురు-శుక్రులు అస్తంగతులై యుండగా వివాహము చేయుటచే వరుడు మరణించును. గురుక్షేత్రమున సూర్యుడును, సూర్యక్షేతరమున గురువును ఉన్నచో వివాహము మంచిదికాదు. కన్యకు వైధవ్యము కలుగును. బృహస్పతి వక్రమైనను అతిచారవంతు డైనను వివాహోపనయములు చేయరాదు. తప్పనిసరి యైనపుడు అతిచారసమయమున పక్షత్రయమును వక్రు డైనపుడు నాలుగు మాసములను విడచి ఉపనయనాదులు చేయవలెను. చైత్ర-పుష్యమాసముందును రిక్తతిథియందును, శ్రీమహావిష్ణువు నిద్రించుచున్నప్పుడును మంగల-రవివారములందును, చంద్రుడు క్షీణించి యున్నప్పుడు వివాహము శుభకరము కాదు. సంధ్యాకాలము శుభము. రోహిణి-ఉత్తరాత్రయ-మూల-స్వాతీ-హస్త-రేవతి నక్షత్రములందు, తులతప్ప మిగిలిన ద్వాస్వభావరాశులందును, స్థిరరాశులందును వివాహము శుభప్రదము. వివాహ-కర్ణవేధ-ఉపనయన-పుంసవనసంస్కారములందును ఆన్న ప్రాశన - చూడా కర్మలందును విద్ధనక్షత్రమును పరిత్యజింపవలెను. శ్రవణ - మూల - పుష్యనక్షత్రములందును రవి - మంగళ - బృహస్పతి వారములందును, కుంభ - సింహ - మిథున లగ్నములందును పుంసవనము చేయవలెను. హస్త-మూల-మృగశీర్ష-రేవతీనక్షత్రములందును, బుధ శుక్రవారములందును, పిల్లలను ఇల్లు కదుపట మంచిది. తొలిసారిగా తాంబూల భక్షణము చేయటకు రవి-సోమ-గురు-శుక్రవారములును, మూల నక్షత్రము ఉత్తమమైనవి. శుక్ర-గురువారములందును, మకరమీనలగ్నములందును, హస్తాది నక్షత్రపంచమునందును, పుష్యమునందును, కృత్తికాది నక్షత్రత్రయమునందును, అన్నప్రాశనము చేయవలెను. అశ్వినీ - రేవతీ - పుష్య - హస్త - జ్యేష్ఠా - రోహిణి-శ్రవణనక్షత్రములందు నూతనాన్న ఫలభక్షణము శుభకరము. స్వాతీ - మృగశిరానక్షత్రములందు ఔషధసేవ చేయవలెను. పూర్వాత్రయమునందును. మఘా-భరణి-స్వాతీ-శ్రవణ-ధనిష్ఠ-శతభిషక్కులందును, రవి-శని-మంగళ వారములందును, రోగవిముక్తుడు స్నానము చేయవలెను. పార్థివే చాష్ట హ్రీంకారం మధ్యే నామ చ దిక్షు చ. 15 హ్రీంపుటం పార్థివే దిక్షు హ్రీంవిదిక్షు లిఖేద్వసూన్ | గోరోచనాకుంకుమేన భూర్జే వస్త్రే గలే ధృతమ్. 16 శత్రవో వశమాయాన్తి మన్త్రేణానేన నిశ్చితమ్ | శ్రీం హ్రీం సంపుటం నామ శ్రీం హ్రీం పత్రాప్దకేక్రమాత్. గోరోచనాకుంకుమేన భూర్జే7థ సుభగావృతే | గోమధ్యవాగమః పత్రే హరిద్రాయా రసేన చ. 18 శిలాపటే7రీన్ స్తమ్భయతి భూమావధోముఖీకృతమ్. ఓం హూం సః సంపుటం నామ ఓ ంహూం సః ప్రతాష్టకే క్రమాత్. 19 గోరోచనా కుంకుమేన భూర్జే మృత్యునివారణమ్ | ఏక పఞ్చ నవ ప్రీత్యై ద్విషడ్‌ద్వాదశయోగకః. 20 త్రిసపై#్తకాదశే లాభో వేదాష్టద్వాదశే రిపుః | తనుర్దనం చ సహజః సుహృత్సుతో రిపుస్తథా. 21 జయా నిధనధర్మౌ చ కర్మాయవ్యయకం క్రమాత్ | స్పుటం మేషాదిలగ్నేషు నవ తారాబలం వదేత్. 22 జన్మ సంపద్విపతేమం ప్రత్యరిః సాధకః క్రమాత్ | నిధనం మిత్రపరమిత్రం తారాబలం విదుః. 23 మట్టితో చేసిన చతురస్ర పట్టము మీద ఎనిమిది దిక్కులందు ఎనిమిది హ్రీంలు వ్రాసి, మధ్య తన పేరు వ్రాయవలెను. లేదా మట్టితో చేసిన పట్టముపై గాని భూర్జపత్రముపై గాని ఎనిమిది దిక్కలందును హ్రీం వ్రాసి మధ్య తన పేరు గోరోచనాకుంకుమలతో వ్రాయవలెను. ఇట్టి యంత్రమును వస్త్రము చుట్టి కంఠమునందు ధరించుటచే తప్పక శత్రువులు వశ మగుదురు. ఈ విధముగనే 'శ్రీం' హ్రీం లతో సంపుటితమైన పేరును గోరోచనముతోను కుంకుమతోను ఎనిమిది భూర్జ పత్రములపై వ్రాసి భూమిలో పాతిపెట్టి నచో విదేశములకు వెళ్ళిన వ్యక్తి శీఘ్రముగ తిరిగి వచ్చును. ఆ యంత్రమునే పసుపురసముతో శిలాపట్టముపై వ్రాసిక్రిందికి ముఖ ముండు నట్లు భూమి పై ఉంచినచో శత్రుస్తంభన మగును. 'ఓం' 'హూం' 'సః' మంత్రములచే సంపుటితమైన పేరును గోరోచనా కుంకుమలతో ఎనిమిది భూర్జ పత్రములపై వ్రాసి ఉంచినచో మృత్యునివారణము కలుగును. ఈ మంత్రమును ఒక మారు, ఏడుమార్లు, తొమ్మిదిమార్లు వ్రాసినచో పరస్పర ప్రేమ కలుగును. రెండు సార్లు, ఆరు సార్లు, లేదా పండ్రెండు సార్లు వ్రాసినచో వియోగమును పొందినవారు కలియుదురు. మూడు, ఏడు లేదా పదకొండు సార్లు వ్రాసినచో లాభము కలుగును. నాలుగు, ఎనిమిది, పండ్రెండు సార్లు వ్రాసిన పరస్పర శత్రుత్వము కలుగును. మేషాది లగ్నమువలన తను-ధన-సహజ-సుహృత్-సుత-రిపు-జాయా-నిధన-ధర్మ- కర్మ-ఆయ- వ్యాయభావము లేర్పడును. ఇపుడు నవతారాబలము చెప్పబడు చున్నది--జన్మ-సంపత్-విపత్-క్షేమ-ప్రత్యరి-సాధక-మైత్ర-అతిమైత్రము లని తొమ్మిది తారలు. వారే జ్ఞగురుశుక్రాణాం సూర్యాచన్ద్రమసోస్తథా | మాఘాదిమాసషట్కౌ తు క్షౌరమాద్యం ప్రశస్యతే. 24 కర్ణవేధో బుధే జీవే పుష్యే శ్రవణచిత్రయోః | పఞ్చమే7బ్దే చాధ్యయనం షష్టీం ప్రతిపదం త్యజేత్. 25 రిక్తాం పఞ్చదశీం భౌమం ప్రార్చ్య వాణీం హరిం శ్రియమ్| మాఘాదిమాసషట్కేతు మేకలాబన్దనం శుభమ్. 26 చూడాకరణమాద్యం చ శ్రావణాదౌ న శస్యతే | అస్తం యాతే గురౌ శుక్రేక్షీణ చ శశలాఞ్ఛనే. 27 ఉపనీతస్య విప్రస్య మృత్యుం జాడ్యం వినిర్దిశేత్ | క్షౌరరే శుభవారే చ సమావర్తనిమిష్యతే. 23 శుభ##క్షేత్రే విలగ్నేషు శుభయుక్తేక్షితేషు చ | అశ్వినీమఘాచిత్రాసు స్వాతీయామ్యోత్తరాసు చ. 29 పునర్వసౌ థథా పుష్యే ధనుర్వేదః ప్రశస్యతే | భరణ్యార్ధ్రామఘా శ్లేషా వహ్నిభర్గరయోస్తథా. 30 జిజీవిఘర్న కుర్వీత వస్త్రపావరణం నరః | గురౌ శుక్రే బుధే వస్త్రం వివాహదౌ నభాదికమ్. 31 రేవత్యశ్విధనిష్ఠాసు హస్తదిషు చ పఞ్చసు |శంఖవిద్రుమరత్నానాం పరిధానం ప్రశస్యతే. 32 యామ్యసర్పధనిష్ఠాసు త్రిషు పూర్వేషు వారుణ | క్రీతం హానికరం ద్రవ్యం విక్రీతం హానికృద్భవేత్. 33 అశ్వినీ స్వాతీచిత్రాసు రేవత్యాం వారుణ హరౌ | క్రీతం లాభకరం ద్రవ్యం విక్రీతం హానికృద్భవేత్. 34 భరణీ త్రీణీ పూర్వాణి ఆర్ధ్రాశ్రేషామఘానిలాః | వహ్నిజ్యేష్ఠావిశాఖాసు స్వామినో నోపతిష్ఠతి. 35 ద్రవ్యం దత్తం ప్రయుక్తం వా యత్ర నిక్షిప్యతే ధనమ్ | ఉత్తరే శ్రవణ శాక్రేకుర్యాద్రాజాభిషేచనమ్. బుధ-గురు-శుక్ర-రవి-సోమవారము లందును. మాఘాది మాసషట్కము నందును, బాలకునకు ప్రథమ క్షౌరకర్మ చేయుట మంచిది. కర్ణవేధ సంస్కారమునకు బుధ. గురువారములు, వుష్య-శ్రవణ-చిత్రానక్షత్రములును మంచివి. ఐదవ సంవత్సరమునందు, ప్రతివత్-షష్ఠీ-రిక్తతిథి-పూర్ణిమలు, మంగళవారమును విడచి ఇతర తిథివారము లందు విష్ణువును, లక్ష్మిని పూజించి అక్షరారంభము చేయవలెను. మాఘమునుండి ఆరు మాసముల వరకును ఉపనయనసంస్కారమునకు శుభకరము. శ్రావణాది మాసషట్కము చూడా కరణాది సంస్కారములకు మంచివి కావు. గురు శుక్రులు అస్తంగతు లైనపుడును, చంద్రుడు క్షీణుడై యున్నపుడు యజ్ఞోపవీత ధారణము చేయుటచే బాలుడు జడబుద్ది యుగును; లేదా మరణించును. క్షౌరమునకు చెప్పిన నక్షత్రములందును, శుభగ్రహవారము లందును, సమావర్తన సంస్కారము చేయుట మంచిది. లగ్నము శుభ గ్రహరాశి యైనను, శుభగ్రహము లగ్నమునుందున్నప్పుడును లేదా చూచుచున్ననను అశ్వినీ-మఘా-చిత్రా-స్వాతీ-భరణీ-ఉత్తరాత్రయ-పునర్వసు-పుష్యనక్షత్రములందును, ధనుర్వేదము ప్రారంభింపవలెను. భరణి, ఆర్ద్ర, మఘ, ఆశ్లేష, కృత్తిక, పుబ్బ నక్షత్రములందు, జీవింప గోరువా డెవ్వడునూతన వస్త్రధారణము చేయరాదు. బుధ-గురు-శుక్రవారములందు వస్త్రధారణము చేయవలెను. వివాహాది మంగళకార్యములందు వస్త్రధారణము విషయమున నక్షత్రాదివిచారము చేయపని లేదు. రేవతి-అశ్వినీ-ధనిష్ఠానక్షత్రములందు, హస్తాది నక్షత్ర పంచకమునందును, శంఖ-విద్రుమ-రత్నములను ధరించవలెను.. భరణీ-ఆశ్లేషా-ధనిష్ఠా-పూర్వాత్రయ-కృత్తికానక్షత్రము లందు వస్తువులను కొన్నను, అమ్మినను హాని కలుగును. అశ్విని-స్వాతి-చిత్రా-రేవతీ-శతభిషా-శ్రవణ నక్షత్రములందు కొనుట లాభదాయకము; అమ్ముట అశుభకరము, భరణీ-పూర్వాత్రయ-ఆర్ధ్రా-ఆశ్లేషా-మఘా-స్వాతీ-కృత్తికా-విశాఖానక్షత్రములందు స్వామిసేవప్రారంభము చేయరాదు. ఈ నక్షత్రములందు ఇతరులకు ద్రవ్యమిచ్చుటగాని, తాకట్టు పెట్టుటగాని చేయకూడదు. ఉత్తరాత్రయ-శ్రవణ-జ్యేష్ఠానక్షత్రములందు రాజ్యాభిషేకము చేయవలెను. చైత్రం జ్యేష్ఠం తథా భాద్రమాశ్వినం పౌషమేవ చ | మాఘం చైవ పరిత్యజ్య శేషమాసే గృహం శుభమ్. అశ్వినీరోహిణీ మూలముత్తరాత్రయమైన్దవమ్ | స్వాతీ హస్తోనురాధా చ గృహారమ్భే ప్రశస్యతే. 38 ఆదిత్యభౌమవర్జం తు వాపీప్రాసాదకే తథా | సింహరాశిగతే జీవే గుర్వాదిత్యే ములివ్లుుచే. 39 బాలే వృద్ధే7స్తగే శుక్రే గృహకర్మ వివర్జయేత్ | అగ్నిదాహో భయం రోగో రాజపీడా ధనక్షతిః. 40 సంగ్రహే తృణకాష్ఠానాం కృతే శ్రవణపఞ్చకే | గృహప్రవేశనం కుర్యాద్ధనిష్ఠోత్తరవారుణ. 41 నౌకాయా ఘటనే ద్విత్రిపఞ్చసప్తత్రయోదశీ | నృపధర్మోధనిష్ఠాసు హస్తపౌష్యాశ్వినీషు చ. 42 పూర్వాత్రయం ధనిష్టార్ద్రా వహ్నిః సౌమ్యవిశాఖయోః | ఆశ్లేషా చాశ్వినీ చైవ యాత్రాసిద్ధిస్తు సమ్పదా. 43 త్రిషూత్తరేషు రోహిణ్యాం సినీవాలీ చతుర్దశీ | శ్రవణం చైవ హస్తోవైచిత్రావై వైష్ణవీ తథా. 44 గోష్ఠయాత్రాం న కుర్వీత ప్రవేశం నైవ కారయేత్ | అనిలోత్తరరోహిణ్యాం మృగమూలపునర్వసౌ 45 పుష్యశ్రవణహస్తేషు కృషికర్మ నమాచరేత్ | పునర్వసూత్తరాస్వాతీ భగమూలేన్ద్రవారుణ. 46 గురోః శుక్రస్య వారే వా వారే వా సోమ భాస్వతోః | వృషలగ్నే చ కర్తవ్యం కన్యాయాం మిథునే తథా. 47 ద్విపఞ్చదశమీసప్తతృతీయ చ త్రయోదశీ | రేవత్యాం రోహిణీన్ద్రాగ్నిహస్తమైత్రోత్తరేషు చ. 48 మన్దారవర్జే బీజాని వాపయేత్సంపదర్థ్యపి | రేవతీహస్తమూలేషు శ్రవణ భగమైత్రయోః. 49 పితృదేవే తథా సౌమ్యో ధాన్యచ్ఛేదం మృగోదయే | హస్తచిత్రాదితిస్వాతీరేవతీశ్రవణత్రయే. 50 స్థిరే లగ్నే గురోర్వారే7థవా భార్గవసౌమ్యయోః | యామ్యాదితిమఘాజ్యేష్ఠాసూత్తరేషు ప్రవేశ##యేత్. 51 చైత్ర-జ్యేష్ఠ-భాద్రపద -ఆశ్విన-పౌష-మాఘ-మాసములు తప్ప ఇతరమాసములు గృహారంభమునకు మంచివి. అశ్వినీ-రోహిణీ-మూల-ఉత్తరాత్రయ-మృగశీర్ష- స్వాతి-హస్త, అనురాధానక్షత్రములును, రవి-మంగళవారములు తక్క ఇతర వారములును గృహ-తటాక-వాపీ-ప్రాసాదారంభములకు శుభప్రదములు. గురుడు సింహారాశిలో నున్నపుడును, గుర్వాదిత్యమునందును (అనగా గురుడు సింహమునందును సూర్యుడు ధనుర్మీనములందును ఉన్నపుడు, అధికమాసము నందును, శుక్రుడు బాలుడుగా గాని, వృద్ధుడుగా గాని, అస్తగతుడుగా గాని ఉన్నప్పుడును గృహమునకు సంబంధించిన కార్యము లేవియు చేయరాదు. శ్రవణాది నక్షత్రపంచకమునందు తృణకాష్ఠ సంచయము చేసినచో అగ్నిదాహము, భయము, రోగము. రాజపీడ, ధననాశము కలుగును. ధనిష్ఠ, ఉత్తరాత్రయము, శతభిషక్-ఈ నక్షత్రములందు గృహప్రవేశము చేయవలెను. ద్వితీయా-తృతీయా-పంచమీ-సప్తమీ-త్రయోదశీతిథులు నౌకానర్మాణమునకు మంచివి. ధనిష్ఠా-హస్త-రేవతీ-అశ్వినీనక్షత్రములందు రాజదర్శనము చేయవలెను. పూర్వాత్రయ - ధనిష్ఠా - ఆర్ద్రా - కృత్తికా - మృగశీర్ష - విశాఖా - ఆశ్లేషా - అశ్వినీనక్షత్రములందు యుద్ధయాత్ర సంపత్తి నిచ్చును. సిద్ధిదాయక మగును. అష్టమీ-అమావాస్యా -చతుర్దశుల యందును, ఉత్తరాత్రయమునందును రోహిణీ - శ్రవణ - హస్త చిత్రనక్షత్రములందును పశువులను గోశాలనుండి బైటకు అమ్ముటకై తీసికొని రాగూడదు; కొన్నవాటిని లోనికి తీసికొని పోగూడదు. స్వాతీ - ఉత్తరాత్రయ - రోహిణీ - మృగశీర్ష - మూల - పునర్వసు - పుష్య - హస్త శ్రవణనక్షత్రములందు సాధారణ వ్యవసాయ ప్రారంభము చేయవలెను. పునర్వసు - ఉత్తరాత్రయ-స్వాతీ-పుబ్బ-మూల-జ్యేష్ఠా-శతభిషక్ నక్షత్రము లందును. రవి-సోమ-గురు-శుక్రవారము లందును, వృషభ, మిథున-కన్యాలగ్నము లందును, ద్వితీయా-పంచమీ-దశమీ-సప్తమీ-తృతీయా-త్రయోదశులందును, దున్నుట మొదలగు వ్యవసాయపు పనులు చేయవలెను. రేవతీ-రోహిణీ-జ్యేష్ఠా-కృత్తిక-హస్త-అనూరాధా-ఉత్తరాత్రయములందును, శని మంగళవారములు తక్క ఇతరవారము లందును, విత్తనములు చల్లినచో సకలసంపదలు లభించును. సస్యచ్ఛేదనమునకు రేవతీ -హస్త-మూల-శ్రవణ-పూర్వఫల్గునీ-మఘా-మృగశీర్షనక్షత్రములును, మకరలగ్నము మంచిది. హస్త -చిత్ర-పునర్వసు-స్వాతీ రేవతీ-శ్రవణాదిత్రయములందు ధాన్యము తీసి, స్థిర లగ్నమునందును, బుధ-గురు-శుక్ర వారములందును, భరణీ-పునర్వసు-మఘా-జ్యేష్ఠా-ఉత్తరాత్రయమునందును, ధ్యానమును గోతాములలో నిలవచేయవలెను. ఓం ధనాయ సర్వధనేశాయ దేహి మే ధనం స్వాహా | ఓం నవే వర్షే ఇలాదేవి లోకసంవర్దని కామరూపిణి దేహి మే ధనం (ధాన్యం) స్వాహా. పత్రస్థం లిఖితం ధాన్యరశిస్థం ధాన్యవర్దనమ్ | త్రిపూర్వాసు విశాఖాయాం ధనిష్ఠావారుణ7పి చ. 52 ఏతేషుషట్సు విజ్ఞేయం ధాన్య నిష్క్రమణం బుధైః | దేవతారామవాప్యాదిప్రతిష్ఠోదజ్ముఖే రవౌ. 53 మిథునస్థే రవౌ దర్శాద్యది స్యాద్ద్వాదశీతిథిః | సదా తత్రైవ కర్తవ్యం శయనం చక్రపాణినః. 54 సింహం తౌలిం గతే చార్కే దర్శాద్యద్ద్వాదశీద్వయమ్ | ఆదావిన్ద్రసముత్థానం ప్రబోధశ్చ హరేఃక్రమాత్. తథా కన్యాగతే భానౌ దుర్గోత్థానే తథాష్ఠమీ | త్రిపాదేషు చ ఋక్షేషు యదా భద్రా తిథిర్భవేత్. 56 భౌమాదిత్యశ##నైశ్చారి విజ్ఞేయం తత్త్రిపుష్కరమ్ | సర్వకర్మణ్యుపాదేయా విశుద్ధిశ్చన్ద్రాతారయోః. 57 జన్మాశ్రితస్త్రిషష్ఠశ్చ సప్తమో దశమస్తథా | ఏకాదశః శశీ యేషాం తేషేమేవ శుభం వదేత్. 58 శుక్లపక్షే ద్వితీయశ్చ పఞ్చమో నవమః శుభః | మిత్రాతిమిత్రసాధక సంపతేమాదితారకాః జన్మనా మృత్యుమాప్నోతి విపదా ధనసంక్షయమ్. | ప్రత్యరౌ మరణం వింద్యాన్నిధనే యాతి పఞ్చతామ్. 60 కృష్ణాష్టమీదినాదూర్ధ్వం యావచ్ఛుక్లాష్టమీదినమ్ | తావత్కాలం శశీ క్షీణః పూర్ణస్తత్రోపరి స్మృతః 61 వృషే చ మిథునే భానౌ జీవే చన్ద్రేన్ద్రదైవతే | పౌర్ణమాసీగురోర్వారే మహాజ్యేష్ఠీ ప్రకీర్తితా. 62 ఐన్ద్రో గురుః శశీ చైవ ప్రాజావత్యే రవిస్తథా | పూర్ణిమాజ్యేష్ఠమాసస్య మాహాజ్యేష్ఠీ ప్రకీర్తితా. 63 స్వాత్యన్తరే యన్త్ర నిష్ఠే శక్రస్యోత్థాపయోధ్ద్వజమ్ | హర్యృక్షపాదే చాశ్విన్యాంసప్తాహాన్తే విసర్జయేత్. 64 ''ఓం ధనదాయ సర్వధనేశాయదేహి మే ధనం స్వాహా'' ఓం నవే వర్షే ఇలాదేవి లోకసంవర్ధని కామరూపిణి దేహి ధనం స్వాహా'' ఈ మంత్రములను పత్రముపై వ్రాసి ధాన్యరాశిపై ఉంచినచో ధాన్యాభివృద్దిగలుగును. పూర్వాత్రయ విశాఖా-ధనిష్ఠా-శతభిషక్‌నక్షత్రములందు ధాన్యమును బైటకు తీయవలెను. సూర్యుడు ఉత్తరాయణమందున్నపుడు దేవాత ఆరామ-తటాక-వాప్యాదుల ప్రతిష్ఠ చేయవలెను. సూర్యుడు. మిథునరాశిలో నున్నప్పుడు అమావస్యానంతరము, వచ్చు ద్వాదశీ తిథియందు శ్రీమహావిష్ణువుశయనోత్సవము చేయవలెను. సూర్యుడు సింహతులారాశులలో, నున్నపుడు అమావస్యానంతరము. వచ్చు ద్వాదశులలో వరుసగా శ్రీమహావిష్ణుపరివర్తనోత్సవ - జాగరణోత్సవములు జరుపవలెను. సూర్యుడు కన్యారాశిలో నుండగా, అమావాస్యనంతరము వచ్చు అష్టమినాడు దుర్గాజాగరణము. త్రిపాదనక్షత్రములందు భద్రా-ద్వితీయ-సప్తమీ ద్వాదశులు వచ్చినప్పుడు, రవి-శని మంగళవారములైనచో అది, త్రిపుష్కరయోగము. ప్రతికార్యమునకును చంద్ర-తార బలము చూడవలెను. చంద్రుడు జన్మారాశియందు, గాని తృతీయ-షష్ఠ-సప్తమ-దశమ-ఏకాదశస్థానములందు గాని ఉన్నచో శుభుడు. శుక్లపక్షమునందు ద్వితీయ - పంచమ - నవమచంద్రుడు కూడ శుభుడు. మిత్ర - అతిమిత్ర - సాధక - సంపత్ - క్షేమాది తారలు శుభకరములు. జన్మతారయందు మృత్యువు, విపత్తారయందు ధననాశము, ప్రత్యరి - మృత్యుతారలయందు మరణము కలుగును. కృష్ణపక్ష అష్టమి మొదలు శుక్లపక్ష అష్టమి, వరకును క్షీణచంద్రుడు, తరువాత పూర్ణచంద్రుడు సూర్యుడు వృషభ-మిథునరాశులందుండి, గురుడు, మృగశిర లేదా జ్యేష్ఠానక్షత్రమునందుండి, గురువారము, పూర్ణిమాతిథియు అయినచో మహాజ్యేష్ఠ. జ్యేష్ఠలో గురుచంద్రులు రోహిణిలో సూర్యుడు ఉండగా జ్యేష్టమాసపూర్ణిమ యైనచో ఆ పూర్ణిమ మహాజ్యేష్ఠ. స్వాతి రాకుండగనే యంత్రముపై ఇంద్రుని పూజచేసి, ఇంద్రధ్వజారోపణము చేయవలెను. శ్రవణ మునందు గాని అశ్వనియందు గాని, వారాంతమున గాని విసర్జన చేయవలెను. సర్వం హేమసమం దానం సర్వేబ్రహ్మసమా ద్విజాః| సర్వం గఙ్గాసమం వారి రాహుగ్రస్తే దివాకరే. 65 ధ్వాంక్షీ మహోదరీ ఘోరా మన్దా మన్దాకినీ ద్విజాః | రాక్షసీ చక్రమేణార్కాత్సంక్రాన్తిర్నామభిఃస్మ్భతా. బాలవే కౌలవే నాగే తైతిలే కరణ యది | ఉత్తిష్ఠన్ సంక్రమత్యర్కస్తదా లోకః సుఖీ భ##వేత్. 67 గరే బబే వణిగ్విష్టౌ కింస్తుఘ్నే శకునౌ వ్రజేత్ | రాజ్ఞో దోషణ లోకో7యం పీడ్యతే సంపదా సమమ్. 68 చతుష్పాద్విష్టివాణిజ్యే శయితః సంక్రమేద్రవిః | దుర్భిక్షంసరాజసంగ్రామో దమ్పత్యోః సంశయో భ##వేత్. ఆధానే జన్మనక్షత్రే వ్యాధౌ క్లేశాదికం భ##వేత్ | కృత్తికాయా నవదినం త్రిరాత్రం రోహిణీషు చ. 70 మృగశిర- పఞ్చరాత్రమార్ద్రాసు ప్రాణనాశనమ్ | పునర్వసౌ చ పుష్యే చ సప్తరాత్రం విధీయతే. 71 నవరాత్రం తథాశ్లేషా శ్మశానాన్తం మఘాసు చ | ద్వౌమాసౌ పూర్వఫాల్గున్యాముత్తరాసు త్రిపఞ్చకమ్. 72 హస్తే తు దృశ్యతే చిత్రా హ్యర్ధమాసం తు పీడనమ్ | మానద్వయం తథా స్వాతి విశాఖా వింశతిర్దినమ్. 73 మైత్రేచైవ దశాహాని జ్యేష్ఠాస్వేవార్దమాసకమ్| మూలేన జాయతే మోక్షః పూర్వాషాడాత్రిపఞ్చకమ్. 74 ఉత్తరా దినవింశత్యా ద్వౌ మసౌ శ్రవణన చ ష ధనిష్ఠాచార్దమాసం చ వారుణ చ దశాహకమ్. 75 స చ భాద్రపదే మోక్ష ఉత్తరాసు త్రిపఞ్చకమ్ | రేవతీ దశరాత్రం చ అహోరాత్రం తథాశ్వినీ. 76 భరణ్యాం ప్రాణహానిః స్యాద్గాయత్రీహోమతః శుభమ్| పఞ్చధాన్యతిలాజ్యాద్యైర్దేనుధానం ద్విజే శుభమ్. ధశా సూర్యస్య షష్ఠాబ్దా ఇన్దోః పఞ్చదశైవతు | అష్టౌవర్షాణి భౌమస్య దశ సప్తతథా బుధే. 78 దశాబ్దాని దశా పఙ్గోరూనవింశద్గురోర్దశా | రాహోహర్ద్వాదశవర్షాణి భార్గవసై#్యకవింశతిః. 79 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే జ్యోతిఃశాస్త్రసారో నామైకవింశత్యధిక శతతమో7ధ్యాయః. సూర్యుడు రాహుగ్రస్తుడైన సమయమున చేసిన సకలదానములు సువర్ణదానములే. బ్రహ్మణు లందురును బ్రహ్మసదృశులు. సకలజలములు గంగాజలసమానములు. రవివారమునుండి శనివారము వరకును జరుగు రవిసంక్రాంతు లకు వరుసగా ఘోర, ధ్వాంక్ష, మహోదర, మంద, మందాకిని, యుత, రాక్షసిఅని పేర్లు, సూర్యసంక్రమణము కౌలవ-శకుని-కింస్తుఘ్నకరణల నైనచో ప్రజలు సుఖవంతులగుదురు. గర-బవ-వణిక్-విష్టి-బాలవకరణములం దైనచో ప్రజలు రాజదోషముచే పీడితులై, సంపదతోమాత్ర ముందురు. చతుష్పాత్-తైతిల-నాగకరణములం దైనచో దేశంమునందు దుర్భిక్షము రాజయుద్ధములు, కలుగును, భార్యభర్తల జీవితము విషయమున గూడ సంశయమేర్పడును. రోగప్రారంభము జన్మనక్షత్రమునందు గాని ఆధానమునందు (జన్మనక్షత్రమునుండి పందొమ్మిదవ నక్షత్రమునందు గాని) అయినచో అధిక క్లేశదాయకము, కృత్తికా నక్షత్రమునందైనచో తొమ్మిది దినముల వరకును, రోహిణియందైనచో మూడు రాత్రులవరుకును మృగశిరయందైనచో ఐదురాత్రులవరకును రోగ ముండును. అర్ద్రయందు అయినచో, ప్రాణనాశకము. పునర్వసు-పుష్యనక్షత్రములందైనచో ఏడురాత్రులును, ఆశ్లేషయందు తొమ్మిది రాత్రులును ఉండును. మఖయందు ప్రాణనాశకము. పూర్వఫల్గునియందు అయినది తొమ్మిది మాసములును, ఉత్తర ఘల్గునియందు కలిగినది మూడు దినములును, చిత్త్రయందు కలిగినది పదిహేను దినములును, స్వాతిరోగము ఒకమాసము, విశాఖయందు ఇదువది దివసములు, అనూరాధారోగము పది దివసములు, జ్యేష్ఠారోగము పదునైదు దివసములును ఉండును. మూలా నక్షత్రమున ప్రారంభించిన రోగము విడువదు. పూర్వాషాడారోగము ఐదుదినములు, ఉత్తరాషాఢారోగము ఇరువది దినములు శ్రవణరోగము రెండు మాసములు, ధనిష్ఠారోగము పదునైదు దినములు, శతభిషరోగము పది దినములు ఉండును. పూర్వాభాద్రారోగము విడవదు. ఉత్తరాభాద్రారోగము ఏడుదినములు, రేవతీరోగము పది రాత్రులు, అశ్వనీరోగము ఒక రాత్రి ఒక పగలు మాత్రము ఉండును. భరణీరోగము ప్రాణనాశకము. పంచధాన్యములు. తిలలు ఘృతము మొదలగు హోమద్రవ్యములతో గాయత్రీమంత్రముతో హొమము చేసినచో రోగము తొలగి శుభఫలప్రాప్తి కలుగును. పాలు ఇచ్చు గోవును బ్రాహ్మణులకు దానము చేసినను రోగశాంతి కలుగును. (అష్టోత్తరీ దశాపద్ధతిలో) సూర్యదశ ఆరు సంవత్సరములు చంద్రుని దశ పదునైదు సంవత్సరములు, కుజదశ ఎనిమిది, బుధదశపదునారు, శనిదశ పది. బృహస్పతిదశ పందొమ్మిది రాహుదశ పండ్రేండు, శుక్రదశ ఇరువదియొక్క సంవత్సరములు. అగ్ని మహాపురాణమునందు జ్యోతిషశాస్త్రకథన మను నూట ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.