Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ త్రయోవింశత్యధికశతతమో7ధ్యాయః. అథ యుద్ధజయార్ణవే నానాయోగాః. అగ్ని రువాచ : వక్ష్యే జయశుభాద్యర్థం సారం యుద్ధజయార్ణవే | అ ఇ ఉ ఏ ఓ స్వరాః స్యుః క్రమాన్నాన్దాదికా తిథిః. 1 కాదిహాన్తా భౌమరవీ జ్ఞసోమౌ గురుభార్గవౌ | శనిర్దక్షిణనాడ్యాం తు భౌమార్కశనయః పరే. 2 ఖార్ణవః ఖరసైర్గుణ్యో రుద్రైర్భాగం సమాహరేత్ | రసాహతం తు తత్ కృత్వా పూర్వభాగేన పూర్వభాగేన భాజయేత్. 3 వహ్నిభిశ్చాహతం కృత్వా రూపం తత్రైవ నిక్షిపేత్ | స్పన్దనం నాడ్యాః పలాని సప్రాణస్పన్దనం పునః. 4 అనేనైవ తు మానేన హ్యుదయన్తి దినే దినే | స్ఫురణౖస్త్రిభిరుచ్ఛ్వాస ఉచ్ఛ్వాసైస్తు పలం స్మృతమ్. 5 షష్టిభిశ్చ పలైర్లిప్తా లిప్తాః షష్టస్త్వహర్నిశమ్ | పఞ్చమార్ధోదయే బాలకుమారయువవృద్ధకాః. 6 మృత్యుర్యోనోదయస్తేన చాస్తమేకాదశాంశ##కైః | కులాగమే భ##వేద్బఙ్గః స మృత్యుః పఞ్చామోపి వా. 7 స్వరోదయ చక్రమ్ : శనిచక్రే చార్ధమాసం గ్రహాణాముదయః క్రమాత్ | విభాగైః పఞ్చదశభిః శనిభాగస్తు మృత్యుదః. 8 ఇతి శనిచక్రమ్ ; దశకోటిసహస్రాణి హ్యర్బుదాన్యర్బుదం హరేత్ | త్రయోదశే చ లక్షాణి ప్రమాణం కూర్మరూపిణః. 9 మఘాదౌ కృత్తికాద్యన్తస్తద్దేశాన్తః శనిస్థితౌ | ఇతి కూర్మ చక్రమ్ : రాహుచక్రే చ సప్తోర్ధ్వమధః సప్త చ సంలిఖేత్. వాయ్వగ్న్యోశ్చైవ నైరృత్యే పూర్ణిమాగ్నే యభాగతః | అమావాస్యా వాయవే చ రాహుర్వై తిథిరూపకః. 11 రకారం దక్షభాగే తు హకారం వాయవే లిఖేత్ | ప్రతిపదాదౌ కకారాదీన్ సకారం నైరృతే పునః. 12 రాహోర్ముఖే తు భఙ్గః స్యాదితిరాహురుదాహృతః | అగ్నిదేవుడు పలికెను: ఇపుడు యుద్ధజయార్ణవప్రకరణమునందు, విజయాది శుభకార్యసిద్ధికై, ప్రధానవిషయములను చెప్పెదను. అ,ఇ,ఉ,ఏ,ఓ-- ఈ ఐదును స్వరములు. వీటి క్రమము ననుసరించి నందా, భద్రా, జయా, రిక్తా, పూర్ణా అను తిథులు ఉండును. 'క' మొదలు 'హ' వరకును కర్ణములు వెనుక చెప్పిన స్వరములకు క్రమముగ సూర్య- మంగలులు, బుధచంద్రులు, బృహస్పతిశుక్రులు, శనిమంగళులు అధిపతులు. 40 ని 60 చే గుణించవలెను. దానిని పదకొండుచే భాగించవలెను. లబ్ధమును ఆరుచే గుణించి దాని ఫలమును మరల 11చే భాగించవలెను. లబ్దమును మూడుచే గుణించి, దాని ఫలమునుందు ఒకటి కలుపగా అన్ని పర్యాయములు నాడీస్ఫురణమును బట్టి పల మేర్పడును. దాని పిదప కూడ రాత్రింబగళ్లు నాడీస్ఫురణము అగు చుండును. ఉదా. 40x 60 =240. 2400 /11= 219. ఈ లబ్దము స్వల్పాంతరముచే ఏర్పడినది. దీనిని 6 చే గుణించగా 219 x 6 = 1314. దీనిని మరల 11చే భాగించగా 1314 / 11 = 119. శేష మైన 5ను విడచివేయవలెను. లబ్ధమైన 119ని 3 చేన గుణించగా గుణనఫలము 357. దీనికి 1 కలపగా 328. కొంచెము అంతరముచే దీనిని 360గా గ్రహించవలెను. అనగా చేతి నాడి 360 సార్లు కొట్టుకొనుటనుబట్టి పల మగును. దానిని గుర్తించు పద్థతి మున్ముందు చెప్పబడును. ఈ విధముగా నాడీస్ఫురణము రాత్రింబగళ్ళు అగుచునే ఉండును. దాని మానము ననుసిరించియే అకారాదిస్వరములు ఉదయించుచుండును. మూడు స్ఫురణములచే ఒక ఉచ్ఛ్వాసము. ఆరు ఉచ్ఛ్వాసములు ఒక పలము. 60 పలములు ఒక లిప్త. అనగా ఒక దండము (ఘడియ). 60 దండములు ఒక అహో రాత్రము. అ, ఇ, ఉ, ఏ, ఓ లకు వరుసగ బాల-కుమార-యువన్-వృద్ధ-మృత్యువు లని ఐదు పేర్లు. వీటిలో ఏదైన ఒక స్వరము ఉదయించిన పిదప మరల దాని ఉదయము ఐదవ ఖండముపై అగును. ఉదయమునకు ఎంత సమయము పట్టునో అస్తమునకు కూడ అంత సమయమే పట్టును. వీటి ఉదయాస్తకాలముల మానము 60 దండముల ఏకాదశాంశమునకు సమానము. ఒక స్వరము ఉదయించిన పిదప రెండవ స్వరము 5 దండముల 27 పలముల తరువాత అగును. ఈ విధముగ ఐదు స్వరముల ఉదయాస్తములు తెలియవలెను. మృత్యుస్వరోదయసమయమున యుద్ధము చేసినచో పరాజయముతో పాటు మృత్యువు కూడ కలుగును. శనిచక్రమునందు 15 దినములందు క్రమముగా గ్రహోదయము జరుగుచుండును. ఈ పంచదశవిభాగానుసారము శనిభాగమునందు యుద్ధము మృత్యుదాయకము. దశకోటిసహస్రత్రయోదశలక్షలకు దాని దశమాంశము కలుపగా ఎంత సంఖ్య వచ్చునో అన్ని యోజనముల ప్రమాణము గల కూర్మరూపశనిబింబపృష్ఠమునకు క్షేత్ర ఫల మేర్పడును. మఘాప్రథమచరణమునుండి కృత్తిక ఆదినుండి అంతమువరకు శనినివాసము తన స్థానమునందుండును. ఆ సమయమునందు యుద్ధము చేయుట మంచిది కాదు. రాహుచక్రముకొరకు ఏడు నిలువు గీతలు, ఏడు అడ్డగీతలు గీయవలెను. దానిపై వాయవ్యమునుండి నైరృతిమీదుగా అగ్నికోణమువరకును శుక్లపక్షప్రతిపత్తు మొదలు పూర్ణిమవరకును ఉన్న తిథులను వ్రాయవలెను. ఆగ్నేయమునుండి ఈశాన్యము మీదుగా వాయవ్యము వరకును, కృష్ణపక్షప్రతిపత్తు మొదలు అమావాస్యవరకును తిథులు వ్రాయవలెను. ఈవిధముగా తిథిరూపరాహున్యాస మేర్పడును. దక్షిణమున 'రా' ను, 'హు' ను వాయవ్యమునందును వ్రాయవలెను. ప్రతిదాదితిథులతో కకారాద్యక్షరములు కూడ వ్రాయవలెను. నైరృతియందు సకారము వ్రాయవలెను, ఈ విధముగ రాహుచక్ర మేర్పడును. రాహుముఖమునందు యాత్ర చేసినచో యాత్రాభంగమగును. విష్టిరగ్నౌ పౌర్ణమాస్యాం కరారీన్ద్రే తృతీయకమ్. 13 ఘోరా యామ్యాం తు సప్తమ్యాం దశమ్యాం రౌద్రసౌమ్యగా | చతుర్దశ్యాం తు వాయవ్యే చతుర్థ్యాం వరుణాశ్రయే. 14 శుక్లాష్టమ్యాం దక్షిణ చ ఏకాదశ్యాం భృశం త్యజేత్ | రౌద్రశ్చైవ తథా శ్వేతో మైత్రః సారభటస్తథా. 15 సావిత్రో విరోచనశ్చ జయదేవో7భిజిత్తథా | రావణో విజయశ్చైవ నన్దీ వరుణ ఏవ చ. 16 యమసౌమ్యౌ భవశ్చాన్తేదశ పఞ్చ ముహూర్తకాః | రౌద్రే రౌద్రాణి కుర్వీత శ్వేతే స్నానాదికం చరేత్. 17 మైత్రే కన్యావివాహాది శుభం సారభ##టే చరేత్ | సావిత్రే స్థాపనాద్యంవా విరోచనే నృపక్రియా. 18 జయదేవే జయం కుర్యాధ్రావణ రణకర్మ చ | విజయే కృషివాణిజ్యం పట్టబన్దం చ నన్దిని. 19 వరుణ చ తడాగాది నాశకర్మ యమే చరేత్ | సౌమ్యే సౌమ్యాది కుర్వీత భ##వేల్లగ్న మహర్దివా. 20 యోగా నామ్నా విరుద్ధాః స్యుర్యోగా నామ్నైవ శోభనాః | రాహురిన్ద్రాత్సమీరం చ రాహోర్దక్షం యమాచ్ఛివమ్. 21 శివాదాప్య ఞ్జలాదగ్ని రగ్నేః సౌమ్యం తతస్త్రయమ్ | తతశ్చ సంక్రమం హన్తి చతస్రో ఘటికా భ్రమన్. 22 ఇతి రాహుచక్రమ్ : చణ్డీన్ద్రాణీ వారాహీ చ ముసలీ గిరికర్ణికా | బలాచాతిబలా క్షీరీ మల్లికా జాతియూథికాః. 23 యథాలాభం ధారయేత్తాః శ్వేతార్కశ్చ శతావరీ | గుడూచీ వాగురీ దివ్యా ఓషధ్యో ధారితా ఇమే. 24 ఓం నమో భైరవాయ ఖడ్గపరశుహస్తాయ ఓం హ్రూం విఘ్నవినాశాయ ఓం హ్రూం ఫట్. అనేనైవ తు మన్త్రేణ శిఖాబన్దాదికృజ్జయే | తిలకం చాఞ్జనం చైవ ధూపలేపనమేవ చ. 25 స్నానపానాని తైలాని యోగధూలిమతః శృణు | సుభగామనః శిలాతాలం లాక్షారససమన్వితమ్. 26 తరుణీక్షీరసంయుక్తో లలాటే తిలకో వశే | విష్ణుక్రాన్తా చ సర్పాక్షీ సహదేవం చ రోచనా. 27 అజాదుగ్ధేన సంపిష్టం తిలకో వశ్యకారకః ప్రియఙ్గుకుఙ్కుమం కుష్టంవ మోహనీతగరం ఘృతమ్. 28 తిలకో వశ్యకృత్తచ్చ రోచనారక్తచన్దనమ్ | | నిశామనః శిలా తాలం ప్రియఙ్గు సర్షపాస్తథా. 29 మోహినీ హరితా కాన్తా సహదేవీ శిఖా తథా | మాతులుఙ్గరసైః పిష్టం లలాటే తిలకో వశీ. 30 సేన్ద్రాః సురా వశం యాన్తి కిం పునః క్షుద్రమానుషాః | మఙ్జిష్ఠా చన్దనం రక్తం కటుకన్దా విలాసినీ. 31 పునర్నవాసమాయుక్తో లేపో7యం భాస్కరో వశే | చన్దనం నాగపుష్పం చ మఞ్జిష్ఠా నగరం వచా. 32 లోధ్రం ప్రియఙ్గరజనీ మాంస తైలం వశంకరమ్. ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే నానాయోగా నామ త్రయోవింశత్యధిక శతతమో7ధ్యాయః. పౌర్ణమియందు భద్రయొక్క పేరు 'విష్టి' అది ఆగ్నేయమునం దుండును. తృతీయనాడు భద్ర పేరు 'కరారి' అది తూర్పున ఉండును. సప్తమినాడు భద్ర పేరు 'ఘోర'. అది దక్షిణముసం దుండును. సప్తమీ దశములయందు భద్ర క్రమముగ ఈశాన్య-ఉత్తరములందుండును. చతుర్దశినాడు వాయవ్యమునందును, చతుర్థియందు పశ్చిమమునందును, శుక్లాష్టమ్యేకాదశులందు దక్షిణము నందును ఉండును. దీనిని అన్ని శుభకార్యములందును పరిత్యజించవలెను. రౌద్ర-శ్వేత-మైత్ర-సారభట-సావిత్రి-విరోచన-జయదేవ-అభిజిత్-రావణ-విజయ-నంది-వరుణ-యమ-సౌమ్యభవులు పదిహేను ముహూర్తములు. రౌద్ర ముహూర్తమునందు భయానకము లగు కార్యములు చేయవలెను. స్నానాది కార్యములు శ్వేత ముహూర్తమునందు చేయవలెను. కన్యావివాహమునకు మైత్ర ముహూర్తము శుభకరము. సారభట ముహూర్తమునందు శుభకార్యములను, సావిత్ర ముహూర్తమున దేవతాస్థాపనమును, విరోచన ముహూర్తమునందు రాజకీయ కార్యములును, జయదేవ ముహూర్తమున విజయమునకు సంబంధించిన కార్యములును, రావణ ముహూర్తమునందు సంగ్రామమును, విజయ ముహూర్తమునందు కృషి-వ్యాపారములను, నందీ ముహూర్తమున షట్కర్మలను, వరుణ ముహూర్తమునందు తడాగాది నిర్మాణమును, యమ ముహూర్తమునందు వినాశకర కార్యములను, సౌమ్య ముహూర్తమునందు సౌమ్యకార్యములను చేయవలెను. భవ ముహూర్తమునందు అహోరాత్రములు శుభలగ్నమే. అందుచేత దానియందు శుభకార్యము లన్నియు చేయవలెను. ఈ విధముగ ఈ పదునైదు ముహూర్తముల శుభాశుభ##హేతుత్వము వాటి పేర్లను పట్టియుండును. రాహువు తూర్పున వాయవ్యమువరకును, వాయవ్యమునుండి దక్షిణము వరకును, దక్షిణమునుండి ఈశాన్యము వరకును, ఈశాన్యము నుండి పశ్చిమమువరకును పశ్చిమమునుండి ఆగ్నేయమువరకును. ఆగ్నేయమునుండి ఉత్తరము వరకును మూడేసి దిక్కులచొప్పున నాల్గు ఘడియలో భ్రమణము చేయును. చండీ-ఇంద్రాణీ, వారాహీ-ముశలీ-గిరికర్ణికా-బలా-అతిబలా-క్షీరీ-మల్లికా- జాతీ-యూథికా-శ్వేతార్క- శతావరీ-గుడూచీ-వాగురీనామకము లగు దివ్యోషధులను యథాప్రాప్తముగ ధరించినచో యుద్ధమునందు విజయము లభించును. ''ఓం నమో భైరవాయ ఖడ్గపరశుహస్తాయ ఓం హుం విఘ్న వినాశాయ ఓం హుం ఫట్'' అను మంత్రముతో శిఖను బంధించి యుద్ధము చేసినచో తప్పక విజయము లభించును. ఇపుడు (యుద్ధమున విజయమునిచ్చు) తిలక-అంజన-ధూప-ఉపలేప-స్నాన-పాన-తైల-యోగ చూర్ణాదులను గూర్చి చెప్పెదను; వినుము. సుభగా-మనఃశిలా-తాళములను లాక్షారసమునందు కలిపి, స్త్రీ చనుబాలతో, రంగరించి, లలాటమునందు తిలక ముంచుకున్నచో శత్రువు వశంగతు డగును. విష్ణుక్రాంతా-సర్పాక్షీ-సహదేవీ-రోచనలను మేకపాలతో నూరి తిలకముగ ధరించినచో శత్రువులు లొంగిపోవుదురు, ప్రియంగు-కుంకుమ-కుష్ట-మోహినీ-తగర-ఘృతములు కలిపి తిలకము ధరించినచో అగి వశ్యకరము. రోచనా-రక్తచందన-నిశా (పసుపు) మనఃశిలా-తాం-ప్రియంగు-సర్షప-మోహినీ-దూర్వా-విష్ణుక్రాంతా-సహదేవా-శికలను ఓషధులను మాతులుంగరసము నందు నూరి లలాటమునందుంచిన తిలకము వశకరము. ఈ తిలకములచే ఇంద్రునితో సహ దేవతలు కూడ వశమగుదురు, ఇక క్షుద్రు లగు మానవుల విషయము చెప్పవలెనా ? మంజిష్ఠా-రక్తచందన-కటుకందా-విలాసినీ-పునర్నవలను కలిపి లేపము చేసినచో సూర్యుడు కూడ వశ మగును, మలయవందన-నాగపుష్ప-మంజిష్ఠా-తగర-వచా-లోధ్ర-ప్రియంగు-రజనీ-జటామాలసులను కలిపి తయారుచేసిన తైలము వశంకరము. అగ్నిమహాపురాణమునందు యుద్ధజయార్ణవమునకు సంబంధించిన వివిధయోగమలవర్ణన మనెడు నూటఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.