Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ అష్టావింశత్యధికశతతమో7ధ్యాయః.

అథ కోటచక్రమ్‌.

ఈశ్వర ఉవాచ :

కోటచక్రం ప్రవక్ష్యామిచతురస్రం పురం లిఖేత్‌ | చతురస్రం పునర్మధ్యే తన్మధ్యే చతురస్రకమ్‌. 1

నాడీత్రితయచిహ్నాఢ్యం మేషాద్యాః పూర్వదిఙ్ముఖాః | కృత్తికా పూర్వభాగే తు ఆశ్లేషాగ్నేయగోచరే. 2

భరణీదక్షిణ దేయా విశాఖాం నైరృతే న్యసేత్‌ | అనురాధాం పశ్చిమే చ శ్రవణం వాయుగోచరే. 3

ధనిష్ఠాం చోత్తరే న్యస్య ఐశాన్యాం రేవతీం తథా | బాహ్యనాడ్యాం స్థితాన్యేవ అష్టౌ హ్యృక్షాణి యత్నతః.

రోహిణీపుష్యఫల్గున్యః స్వాతీ జ్యేష్ఠా క్రమేణ తు | అభిజిచ్ఛతతారా తు అశ్వినీ మధ్యనాడికా. 5

కోటమధ్యే తు యా నాడీ కథయామి ప్రయత్నతః | మృగశ్చాభ్యన్తరే పూర్వం తస్యాగ్నే యే పునర్వసుః.

ఉత్తరా ఫల్గునీ యామ్యే చిత్రా నైరృతసంస్థితా | మూలం తు పశ్చిమే న్యస్యో త్తరాషాఢాం తు వాయవ్యే. 7

పూర్వభాద్రపదా సౌమ్యే రేవతీ చేశగోచరే | కోటస్యాభ్యన్తరే నాడీ ఋక్షాష్టకసమన్వితా.

8

ఆర్ధ్రా హస్తస్తథాషాఢా చతుష్కం చోత్తరాత్రికమ్‌ | మధ్యే స్తంభచతుష్కంతు దద్యాత్కోటస్య కోటరే.

ఏవం దుర్గస్య విన్యాసం బాహ్యే స్థానం దిశాధిపాత్‌ |

ఆగన్తుకో యథా యోద్ధా ఋక్షవాన్స్యాత్ఫలాన్వితః. 10

కోటమధ్యే గ్రహాః సౌమ్యా యదా ఋక్షాన్వితాః పునః | జయం మధ్యస్థితానాం తు భఙ్గమాగామినో విదుః.

ప్రవేశ##భే ప్రవేష్టవ్యం నిర్గమే భే చ నిర్గమేత్‌ | భృగుః సౌమ్యస్తథా భౌమఋక్షాన్తం సకలం యదా. 12

తదా భంగం విజానీయాజ్జయమాగన్తుకస్య చ | ప్రవేశరక్షచతుష్కే తు సంగ్రామం చారభేద్యధా. 13

తదా సిద్ధ్యతి తద్దుర్గం న కుర్యాత్తత్ర విస్మయమ్‌ |

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే యుద్దజయార్ణవే కోటచక్రం నామాష్టావింశత్యధికశతతమో7ధ్యాయః.

పరమేశ్వరుడు పలికెను : ఇపుడు కోట చక్రమును గూర్చి చెప్పెదను. మొదట చతుర్భుజము గీసి, దాని లోపల రెండవ చతుర్భుజమును, దాని లోపల మూడవ చతుర్భుజమును, దాని లోపల నాల్గవ చతుర్భుజమును గీయవలెను. ఇట్లు గీయగా కోట చక్ర మేర్పడును. దీని లోపల ఏర్పడు మూడు రేఖలకు ప్రథమనాడి, మధ్యనాడి, ఆంతనాడి అని పేర్లు. కోట చక్రము పైన పూర్వాదిదిశలు వ్రాసి రాశులు కూడ వ్రాయవలెను. తూర్పున కృత్తిక, ఆగ్నేయమున ఆశ్లేష, దక్షణమున మఘ, నైరృతియందు విశాఖ, పశ్చిమమున అనూరాధ, వాయవ్యమున శ్రవణము, ఉత్తరమున ధనిష్ఠ, ఈశాన్యము నందుభరణి వ్రాయవలెను. ఈ విధముగ ప్రథమనాడియందు ఎనిమిది చక్రము లగును. ఇట్లే పూర్వాదిదిశల క్రమమున, మధ్య నాడియందు, రోహిణీ, పుష్యమి పూర్వఫల్గుని, స్వాతి, జ్యేష్ఠ,అభిజిత్తు, శతభిషము, అశ్విని నక్షత్రములు వ్రాయవలెను. అంతనాడియందు., పూర్వాదిదిశాక్రమమున మృగశిర, పునర్వసు, ఉత్తర, చిత్త, మూల, ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర, రేవతి వ్రాయవలెను. ఈవిధముగ అంతనాడి యందు గూడ ఎనిమిది నక్షత్రము లగును. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరా భాద్ర-ఈ నాల్గు నక్షత్రములు కోట చక్రమధ్య స్తంభము లగును. ఈ విధముగ చక్రము, వ్రాయగా బాహ్యస్థానము దిక్పాలకులస్థాన మగును. ఆగంతుకుడైన యోధుడు ఏ దిక్కునందు ఏ నక్షత్రమునందో, ఆ దిక్కు ద్వారా కోటలో ప్రవేశించినచో అతడు విజయము పొందును. కోట మధ్య నున్న నక్షత్రములందో శుభగ్రహములు వచ్చినపుడు యుద్ధము చేసినచో మధ్య నున్న వానికి విజయము, ఆక్రమణ చేసినవానికి పరాజయము కలుగును. ప్రవేశించువాని నక్షత్రమునందు ప్రవేశించవలెను. బైటకు వచ్చు నక్షత్రమునందు బైటకి రావలెను. శుక్ర-కుజ-బుధులు నక్షత్రాంతమునందున్నపుడు యుద్ధారంభము చేయుచో ఆక్రమణకర్త పరాజితు డుగును. ప్రవేశనక్షత్రములు నాల్గింటియందు యుద్ధము ప్రారంభ మైనచో దుర్గమ వశ మగును ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

అగ్ని మహాపురాణమునందు కోటచక్ర నిరూపణ మను నూటఇరువదియెనిమిదివ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters