Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ చతుస్త్రింశదధిక శతతమోధ్యాయః అథ త్త్రెలోక్యవిజయవిద్యా ఈశ్వర ఉవాచ: త్రైలోక్యవిజయాం వక్ష్యే సర్వయన్త్రవిమర్దినీమ్. ఓం హూం క్షూం హ్రూం ఓం నమో, భగవతి, దంష్ట్రిణి, భీమవక్త్రే, మహోగ్రరూపే, హిలి, హిలి, రక్తనేత్రే,కిలి, కిలి, మహానిస్వనే,స కులు, ఓం విద్యుజ్జిహ్వే, కులు, ఓం నిర్మాంసే, కట, కట, గోనసా భరణ, చిలి, చిలి, శవమాలాధారిణి, ద్రావయ, ఓం మహారౌద్రి, సార్దచర్మకృతాచ్ఛదే విజృమ్భ ఓం నృత్య, అసిలతాధారిణి, భృకుటీ కృతాపాఙ్గే, విషమనేత్రకృతాననే, వసామేదోవిలిప్తగాత్రే కహ కహ ఓం హస హస, క్రుద్ద, క్రుద్ద, ఓం నీలజీమూతవర్ణే, అభ్రమాలాకృతాభరణ విస్ఫుర ఓం ఘణ్టార వాకీర్ణదేహే, ఓం సింహాంనస్థే, అరుణవర్ణే, ఓం హ్రాం హ్రీం హ్రూం రౌద్రరూపే హ్రూం హ్రీం క్లీం ఓం హ్రీం హ్రూం ఓం ఆకర్ష ఓం ధూన ధూన ఓం హే హః స్వః వజ్రిణి హూం క్షూం క్షాం క్రోధ రూపిణి ప్రజ్వల ప్రజ్వల ఓం భీమభీషణ భిన్ద ఓం మహాకాయే ఛిన్ద ఓం కరాలిని కిటి కిటి మహాభూతమాతః సర్వదుష్టనివారిణి జయ ఓం విజయే ఓం త్రైలోక్యవిజయే హూం ఫట్ స్వాహా. నీలవర్ణాం ప్రేతసంస్థాం వింశహస్తాం యజేజ్జయే. 1 న్యాసం క్భత్వాతు పఞ్చాఙ్గం రక్తపుష్పాణి హోమయేత్ | సంగ్రామే సైన్యభంగః స్యాత్త్రైలోక్యవిజయాపఠాత్. 2 ఓం బహురూపాయ స్తమ్భయ స్తమ్భయ ఓం మోహయ మోహయ ఓం సర్వశత్రూన్ద్రావయ ఓం బ్రహ్మాణమాకర్షయ, విష్ణుమాకర్షయ ఓం మహేశ్వరమాకర్షయ ఓం ఇన్ద్రంటాలయ ఓం పర్వతాన్‌చాలయ ఓం సప్తసాగరాన్ శోషయ ఓం ఛిన్ద ఛిన్ద బహురూపాయ నమః. భుజఙ్గం నామ మృన్మూర్తిసంస్థం విద్యాదరిం తతః. ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్దజయార్ణవే త్రైలోక్యవిజయ విద్యానామ చతుస్త్రింశదధిక శతతమో7ధ్యాయః పమేశ్వరుడు పలికెను: ఇపుడు నేను, సమస్తయంత్రమంత్రములను నశింపచేయు త్రైలోక్యవిజయావిద్యను చెప్పెదను. "ఓం హూం క్షూం హ్రూం.....త్రైలోక్యవిజయే హుం ఫట్ స్వాహా" అను (మూలోక్త) మంత్రము త్రైలోక్యవిజయావిద్య. విజయము కోరువాడు నీలవర్ణము గలదియు. ప్రేతాధిరూఢయు అగు త్రైలోగ్యమవుజయావిద్య యొక్క ఇరువది హస్తముల ఎత్తుగల ప్రతిమ నిర్మించి దానిని పూజించవలెను; పంచాంగన్యాసము చేసి రక్తపుష్పముల హోమము చేయవలెను. ఈత్రైలోక్యవిద్యను పఠించుటచే సమరభూమియందు శత్రుసైన్యములు పారిపోవును. మట్టితో ఒక మూర్తి తయారుచేసి, దానిలో శత్రు వున్నట్లు భావన చేయుచు, ఆ శత్రువు పేరు భుజంగు డని తలచును. "ఓం నమో బహురూపాయ....బహూరూపాయ నమః" ఇత్యాది (మూలోక్త) మంత్రముచే అభిమత్రించి, ఆ శత్రువు నశించుటకై పై మంత్రమును జపించవలెను. శత్రువు నశించును. é అగ్నిమహాపురాణమునందు, యుద్ధజయార్ణవము త్రైలోక్యవిజయవిద్య యను పఞ్చచత్వారింశదధిక శతతమో7ధ్యాయః