Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ పఞ్చచత్వారింశదధికశతతమోధ్యాయః అథ సంగ్రామవిజయవిద్యాః ఈశ్వర ఉవాచ: సంగ్రామవిజయాం విద్యాం పదమాలాం వదామ్యహమ్. ఓం హ్రీం చాముణ్డ, శ్మశానవాసిని, ఖట్వాఙ్గకపాలహస్తే, మహాప్రేతసమారూఢే, మహావిమానసమాకులే, కాలరాత్రి, మహాగణపరివృతే, మహాముఖే, బహుభుజే, ఘణ్టాడమరుకిఙ్కిణి, అట్టాట్టహాసే, కిలి, కిలి, కిలి, ఓం హూం ఫట్, దంష్ట్రాఘోరాన్దకారిణి, నాదశబ్దబహులే, గజచర్మప్రావృతశరీరే, మాంసదిగ్దే, లేలిహానో గ్రజిహ్వే, మహారాక్షసి, రౌద్రదంష్ట్రాకరాలే, భీమాట్టాట్టహాసే, స్ఫురద్విద్యుత్ప్రభే, చల చల ఓం చకోర నేత్రే చిలి చిలి ఓం లలజ్జిహ్వే, ఓం భీం భృకుటీముఖి, హుంకారభయత్రాసిని, కపాలమాలావేష్టిత జటాముకుట శశాఙ్కధారిణి, అట్టాట్టహాసే కిలి కిలి ఓం హ్రూం దంష్ట్రాఘోరాన్దకారిణి,సర్వవిఘ్నవినాశిని, ఇదం కర్మ సాధయ సాధయ, ఓం శీఘ్రం కరు కురు ఓం ఫట్ ఓం అజ్కు శేన శమయ ప్రవేశయ ఓం రంగ రంగ కమ్పయ కమ్పయ ఓం చాలయ ఓం రుధిరమాంసమధ్యప్రియే హన హన, కుట్ట కుట్ట ఓం ఛిన్ద, ఓం మారయ, ఓం అనుక్రమయ, ఓం వజ్రశరీరం పాతయ ఓం త్రైలోక్యగతం దుష్టమదుష్టం వా గృహీతమగృహీతం వా ఆవేశయ, ఓం నృత్య, ఓం వన్ద, ఓం కోటరాక్షి, ఊర్ధ్వకేశి, ఉలూకవదనే, కరఙ్కిణి, ఓం కరఙ్కమాలాధారిణి, దహ, ఓం పచ, పచ, గృహ్ణ, ఓం మణ్డలమధ్యే ప్రవేశయ, ఓం కిం విలమ్బసి, బ్రహ్మసత్యేన ,విష్ణుసత్యేన, రుదత్రసత్యేన, ఋషిసత్యేన ఆవేశయ ఓం కిలి కిలి ఓం ఖిలి ఖిలి, విలి విలి ఓం వికృతరూపధారిణి, కృష్ణభుజంగవేష్టితశరీరే, సర్వగ్రహావేశిని, ప్రలమ్బోష్ఠిని, భ్రూభంగలగ్ననాసికే, వికటముఖి,కపిలజటే, బ్రహ్మి భఞ్జ ఓం జ్వాలాముఖి స్వన ఓం పాతయ ఓం రక్తాక్షి ఘూర్ణయ భూమిం పాతయ ఓం శిరో గృహ్ణ చక్షుర్మీలయం ఓం హస్తపాదౌ గృహ్ణ ఓంముద్రాం స్ఫోటయ ఓం ఫట్ ఓం విదారయ ఓం త్రిశూలేన చ్ఛేదయ ఓం వజ్రేణ హాన ఓం దణ్డన తాడయ తాడయ, ఓం చక్రేణ చ్ఛేదయ చ్ఛేదయ, దంష్ట్రయా కీలయ, ఓం కర్ణికయా పాటయ, ఓం ఆజ్కుశేన గృహ్ణ, ఓం శిరోక్షిజ్వరమైకాహికం, ద్వ్యాహికం, త్య్రాహికం, చాతుర్థికం డాకినీస్కన్దగ్రహన్ ముఞ్చ ముఞ్చ ఓం పచ ఓం ఉత్సాదయ ఓం భూమిం పాతయ ఓం గృహ్ణ ,ఓం బ్రహ్మణి ఓం ఏహి మహేశ్వరి ఏహి ఓం కౌమారి, ఏహి ఓం వైష్ణవి, ఏహి ఓం వారాహి, ఏహి ఓం ఐన్ద్రి, ఏహి ఓం చాముణ్డ ఏహి ఓం రేవతి,ఏహి ఓం ఆకాశ##రేవతి, ఏహి ఓం హిమపచ్చారిణి, ఏహి ఓం రురుమర్దిని, అసురక్షయఙ్కరి, ఆకాశగామిని, పాశేన బన్ద బన్ద అఙ్కుశేన కట కట సమయం తిష్ఠ ఓం మణ్డలం ప్రవేశయ, ఓం గృహ్ణ ముఖం బన్ద చక్షుర్బన్ద, హస్తపాదౌ చ బన్ద, దుష్టగ్రహాన్సర్వాన్బన్ద, ఓం దిశోబన్ద ఓం విదిశో బన్ద, అధస్తాద్బన్ధ, ఓం సర్వం బన్ధ ఓం భస్మనా పానియేన మృత్తికయా సర్షపైర్వా సర్వానాదేశయ ఓం పాతయ ఓం చాముణ్డ కిలి కిలి, ఓం విచ్చే హూం ఫట్ స్వాహా, పదమాలా జయాఖ్యేయం సర్వ కర్మ ప్రసాధికా | 1 సర్వదా హోమజాప్యాద్వైః పాఠాద్యైశ్చరణ జయః | అష్టావింశభుజాధ్యేయా అసిఖేటకవత్కరౌ. 2 గదాదణ్డటయుతౌ చన్యౌ శరచాపధరౌ పరౌ | ముష్టిముద్గరయుక్తౌ చ శంఖఖడ్గయుతౌ పరౌ. 3 ధ్వజవజ్రధరౌ చన్యౌ సచక్రపరశూపరౌ | డమరూదర్పణాఢ్యౌచ శక్తికున్తధరౌ పరౌ. 4 హలేన ముసలేనాఢ్యౌ పాశతోమర సంయుతౌ | ఢక్కాపణవ సంయుక్తావభయ ముష్టికాన్వితౌ. 5 తర్జయన్తీ చ మహిషం ఘాతనీ హోమతో7రిజిత్ | త్రిమధ్వాక్తతిలైర్హోమో నదేయో యస్యకస్యచిత్. 6 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్దజయార్ణవే సంగ్రామ విజయ విద్యానామ పఞ్చత్రింశదధిక శతతమో7ధ్యాయః. పరమేశ్వరుడు పలికెను: దేవీ! ఇపుడు సంగ్రామమునందు విజయము నిచ్చు విద్యను (మంత్రమును) చెప్పెదను. పదమాలారూపమున నున్నది, "ఓం చాముణ్డ..................విచ్చే హూం ఫట్ స్వాహా" అను (మూలోక్త) మంత్రము 'జయా' అను పేరు గల పదమాల, అన్ని కార్యములందు సిద్ధి నిచ్చును. దీనితో హోమముచేయుటచేతను, జపపాఠముల చేయుటచేతను సర్వదా యుద్ధమునందు విజయము ప్రాప్తించును. ఇరువది ఎనిమిది హస్తములు గల చాముండా దేవిని ధ్యానించవలెను. ఆమెకు రెండు చేతులలో కత్తి, ఖేటకము ఉన్నవి, రెండు చేతులలో గదాదండములు, రెండుచేతులలో ధనుర్బాణములు, రెండు చేతులలో ముష్టిముద్గరములు, రెండు చేతులలో శంఖఖడ్గములు, రెండు చేతులలో ధ్వజ వజ్రములు, రెండు చేతులలో చక్రపరశువులు, రెండు చేతులలో దర్పణ-డమరువులు, రెండు చేతులలో శక్తి-కుంతములు, రెండు చేతులలో హల-ముసలములు, రెండు చేతులలో పాశతోమరములు, రెండు చేతులలో ఢక్కా-పణవములు, రెండు చేతులలో అభయముద్ర, రెండు చేతులలో ముష్టికములు ఉండును., ఆమె మహిషాసురుని భయపెట్టుచు వానిని చంపును. ఈ విధముగ ధ్యానించుచు హోమము చేయుటచే సాధకునకు శత్రువులపై విజయము లభించును, నెయ్యి,తేనె, పంచదార కలిపిన తిలలుహోమము చేయవలెను. ఈ సంగ్రామ విజయవిద్యను ప్రతిఒక్కనికిని (అధికారములేని వానికి) ఈయరాదు. అగ్నిమహాపురాణమునందు యుద్ధజయార్ణవమున సంగ్రామవిజయవిద్యావర్ణన మను ముప్పదియైదవ అధ్యాయము సమాప్తము.