Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకచత్వారింశదధిక శతతమోధ్యాయః అథ షట్త్రింశత్పదకమ్ ఈశ్వర ఉవాచ : షట్త్రింశత్పదసంస్థానామోషధీనాం వదే ఫలమ్ | అమరీకరణం నౄణాం బ్రహ్మరుద్రేంద్రసేవితమ్. 1 హరీతక్యక్షి ధాత్ర్యశ్చ మరీచం పిప్పలీ విఫా | వహ్నిః శుణ్ఠీ పిప్పలీ చ గుడూచీవచనింబకాః. 2 వాసకః శతమూలీ చ సైన్దవం సిన్ధువారకమ్ | కణ్టకారీ గోక్షురకా బిల్వం పౌనర్నవం బలా. 3 ఏరణ్డముణ్డీరుచకో భృంగః క్షారో೭థ కర్కటః | ధాన్యాకో జీరకశ్చైవ శతపుష్పీ జవానికా. 4 విడఙ్గః ఖదిరశ్చైవ కృతమాలో హరిద్రయా | వచా సిద్ధార్థ ఏతాని షట్త్రింశత్పదకాని హి. 5 క్రమాదేకాదిసంజ్ఞాని హ్యౌషధాని మహాన్తి హి | సర్వరోగహరాణి స్యురమరీకరణాని చ. 6 వలీపలితభేత్తౄణి సర్వకోష్ఠగతాని తు | ఏషాం చూర్ణే చ వటికా రసేన పరిభావితా. 7 అవలేహః కషాయో వా మోదకా గుడఖణ్డకః | మధుతో ఘృతతో వాపి ఘృతం తైలమథాపి వా. 8 సర్వాత్మనోపయుక్తం హి మృతసంజీవనం భ##వేత్ | కర్షార్థం కర్షమేకం వా పలార్థం పలమేకకమ్. 9 యథేష్టాచారనిరతో జేవేద్వర్షశతత్రయమ్ | మృతసంజీవనీకల్పే యోగో నాస్మాత్పరో೭స్తి హి. 10 ప్రథమాన్నవకాద్యోగాత్సర్వరోగైః ప్రముచ్యతే | ద్వితీయాచ్చ తృతీయాచ్చ చతుర్థాన్ముచ్యతే రుజః. 11 ఏవం షట్కాచ్చ ప్రథమా ద్వితీయాచ్చ తృతీయతః | చతుర్ధాత్పఞ్చమాత్షష్ఠాత్తథా నవచతుష్కతః. 12 ఏకద్విత్రిచతుష్పఞ్చషట్సప్తాష్టమతో೭నిలాత్ | అగ్ని భాస్కరషడ్వింశసప్తవింశైశ్చ పిత్తతః. 13 బాణర్తుశైలవసుభిస్తిథిభిర్ముచ్యతే కఫాత్ | వేదాగ్నిబిర్బాణముఖైః షడ్గుణౖః స్యాద్వశే ఘృతే. 14 గ్రహాదిగ్రహణాన్తైశ్చ సర్పైరేవ విముచ్యతే | ఏకద్విత్రిరసైః శైలైర్వసుగ్రహశివైః క్రమాత్. 15 ద్వాత్రింశత్తిథిసూర్యైశ్చ నాత్ర కార్యావిచారణా | షట్త్రింశత్పదకజ్ఞానం న దేయం యస్య కస్య చిత్. 16 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే షట్త్రింశత్పదకంనామైక చత్వారింశదధిక శతతమో೭ధ్యాయః. పరమేశ్వరుడు చెప్పెను ; ఇపుడు ముప్పదియారు పదములలో నుంచబడిన ఓషధుల ఫలమును చెప్పెదను. ఈ ఓషధులను సేవించుటచే మనుష్యులు అమరులగుదురు. వీటిని బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ఉపయోగించి యున్నారు. హరీతకీ-అక్షధాత్రీ- మరీచ- పిప్పలీ- శిఫా- వహ్ని-శుంఠీ-పిప్పలి- గుడూచీ - వచానింబ - వాసక శతమూలీ - సైంధవ సింధువార - కంటకారి - గోక్షుర - బిల్వ- పునర్నవా - బలా -ఏరండ-ముండీ రుచక- భృంగ క్షార-పర్పట-ధాన్యాక జీవక- శతపుష్పి- యవాపీ - విడంగ - ఖదిర- కృతమూల - హరిద్రా - వచా-సిద్ధార్థము లను ఓషధులు ముప్పది యారు పదములందు స్థాపింపవలెను. ఒకటి, రెండు మొదలైన సంఖ్యలు గల ఈ మహౌషధులు సమస్తరోగములను దూరము చేయును. అమరత్వమును నిచ్చును. అన్ని కుష్ఠములలోని ఓషధులను శరీరముపై ముడతలు పడకుండ చేయును. వెండ్రుకలు నెరవకుండు నట్లు చేయును. వీటి చూర్ణములతో గాని, రసముచేత గాని భావన చేసిన వటులను అవలేహములను కషాయములను లడ్డులను, గుడఖండాదులను నెయ్యితో గాని, తేనెతో గాని తిన్నచో, లేదా వీటి రసముతో భావన చేసిన నెయ్యి గాని, తైలము గాని ఏ ప్రకారముగ నైనను ఉపయోగించినచో, అది సర్వధా మృతసంజీవనముగా పని చేయును. సగము కర్షము లేదా కర్షము లేదా సగము పలము, లేదా పలము దీనిని ఉపయోగించువాడు ఆహారవిహారములందు యథేష్టముగ నున్నను మూడు వందల సంవత్సరములు జీవించును. మృతసంజీవనీకల్పమునందు దీనికి మించిన యోగము లేదు. మొదటి నవకము (తొమ్మిదిఔషధముల సముదాయము నవకము) నందలి ఓషధులు కలిపి చేసిన ఔషధము సేవించుటచే మానవుడు సర్వరోగవిముక్తుడగును. ద్వితీయ-తృతీయ-చతుర్థనవకము లందలి ఓషధుల ప్రయోగముచేత గూడ రోగవిముక్తుడగును. ప్రథము ద్వితీయ - తృతీయ చతుర్థ - పంచమ షష్ఠ షట్కముల (ఆరు ఓషధుల సముదాయము షట్కము ) సేవనముచే మనుష్యుడు రోగవిముక్తుడగును. ముప్పదియారు ఓషధులకు తొమ్మిది చతుష్కము లేర్పడును. (నాల్గింటి సముదాయము చతుష్కము). ఏ చతుష్కములోని ఓషధులను సేవించినను రోగవిముక్తుడగును. ప్రథమ -ద్వితీయ - తృతీయ- చతుర్థ - పంచమ షష్ఠ - సప్తమ - అష్టమ కోష్ఠములందలి ఓషధులను సేవించుటచే వాతదోషము తొలగును. తృతీయ - ఏకాదశ - షడ్వింశ - సప్తవింశ ఓషధుల సేవనముచే పిత్తరోగము నశించును. 6, 7, 8, 15, ఓషధుల సేవనముచే కఫదోషము నివర్తించును. 34, 35, 36 కోష్ఠములందలి ఓషధులను ధరించుటచే వశీకరణము సిద్ధించును. గ్రహాబాధ, భూతబాధ మొదలు నిగ్రహము వరకును గల అన్ని బాధలు తొలగును 1, 2, 3, 6, 7, 8, 9, 11 వ ఓషధులను, 22, 15, 12, వ ఓషధులను ధరించినచో పై ఫలము లభించును. సందేహించ పని లేదు. 36 కోష్ఠములలో చెప్పిన ఈ ఓషధుల విషయమును ప్రతివానికిని చెప్పగూడదు. అగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున షట్త్రింశత్పదకమను నూటనలుబది యొకటవ అధ్యాయము సమాప్తము.