Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ఏకపఞ్చాశదుత్తర శతతమో7ధ్యాయః అథ వర్ణాశ్రమేతరధర్మాః అగ్నిరువాచ: మన్వాదయో భుక్తిముక్తీ ధర్మాంశ్చీర్త్వాప్నువన్తి యాన్ | ప్రోచే పరుశురామాయ వరుణోక్తం తు పుష్కరః. పుష్కర ఉవాచ: విర్ణాశ్రమేతరాణాం తే ధర్మాన్వక్ష్యామి సర్వదాన్ | మన్వాదిభిర్ని గదితాన్ వాసుదేవాదితుష్టిదాన్. 2 అహింసా సత్యవచనం దయా భూతేష్వనుగ్రహః | తీర్థానుసరణం దానం బ్రహమచర్యమమత్సరః 3 దేవద్విజాతిశుశ్రూషా గురుణాం చ భృగూత్తమ | శ్రవణం సర్వధర్మాణాం పితృణాం పూజనం తథా. 4 భక్తిశ్చ నృపతా నితయం తథా సచ్ఛాస్త్ర నేత్రతా | అనృశంన్యం తితిక్షా చ తథా చాస్తిక్యమేవ చ. 5 వర్ణాశ్రమాణాం సామాన్యధథర్మా ధర్మం సమీరితమ్ | యజనం యాజనం దానం వేదాద్యధ్యాపనక్రియా 6 ప్రతిగ్రహశ్చాధ్యయనం విప్రకర్మాణి నిర్దిశేత్ | దానమధ్యయనం చైవ యజనం చ యథావిధి. 7 క్షత్రియస్య సవైశ్యస్య కర్మేదం పరికీర్తితమ్| క్ష త్రియస్య విశేషేణ పాలనం దుష్టనిగ్రహః. 8 కృషిగోరక్షవాణిజ్యం వైశ్యస్య పరికీర్తితమ్ | శూద్రస్య ద్విజశుశ్రూషా సర్వశిల్పాని వా పునః. 9 మౌఞ్జీబన్దనతో జన్మ విప్రాదేశ్చ ద్వితీయకమ్ | అనులోమ్యేన వర్ణానాం జాతిర్మాతృసమామతా. 10 చణ్డాలో బ్రాహ్మణీపుత్రః శూద్రాచ్ఛ ప్రతిలోమతః | సూతస్తు క్ష త్రియాజ్జాతో వైశ్యాద్త్వెదేహకస్తథా. 11 పుక్కసః క్షత్రియాపుత్రః శూద్రాత్స్యాత్ప్రతిలోమతః | మాగధః స్యాత్తథా వైశ్యాత్ శూద్రాదాయోగవోభవత్. 12 వైశ్యాయాం ప్రతిలోమేభ్యః ప్రతిలోమాః సహస్రశః | వివాహః సదృశైస్తేషాం నోత్తమైర్నాధమైస్తథా 13 చణ్డాలకర్మ నిర్దిష్టం వధ్యానాం ఖాతనం తథా | స్త్రీజీవనం తు తద్రక్షా ప్రోక్తం వైదేహకస్య చ. 14 సూతానామశ్వసారథ్యం పుక్కసానాం చ వ్యాధతా | స్తుతిక్రియా మాగధానాం తథా చాయోగవస్య చ. 15 రఙ్గావతరణం ప్రోక్తం తథా శిల్పైశ్చ జీవనమ్ | బహిర్గ్రామనివాసశ్చ మృతచైలస్య ధారణమ్. 16 న సంస్పర్శస్తథైవాన్యైశ్యణ్ణాలస్య విధీయతే | బ్రాహ్మణార్థే గవార్థే వా దేహత్యాగో7త్ర యః కృతః 17 స్త్రీబాలాద్యుపపత్తౌ వా బాహ్యానాం సిద్దికారణమ్ | సఙ్కరే జాతయో జ్ఞేయాః పితుర్మాతుశ్చ కర్మతః. 18 ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే వర్ణాన్తరధర్మో నామైకపఞ్చాశదధిక శతతమోధ్యాయః. అగ్నిపలికెను: ఏ ధర్మముల నాచరించి మన్వాదులు భుక్తిముక్తులు పొందిరో వాటిని పుష్కరుడు, పరశురామునకు, వరుణోక్తప్రకారమున చెప్పెను. పుష్కరుడు చెప్పెను: వాసుదేవాదులకు సంతోషమును కలిగించునవియు, మన్వాదులు చెప్పినవియు అగు వర్ణ - ఆశ్రమ-సర్వసాధారణధర్మములను నీకుచెప్పెదను, పరశురామా! అహింస, సత్యము, భూతదయ, అనుగ్రహబుద్ధి, తీర్థయాత్ర, దానము, బ్రహ్మచర్యము, మాత్సర్యము లేకపోవుట, దేవబ్రహ్మణ పూజనము, గురుశుశ్రూష, సర్వధర్మశ్రవణము, పితృపూజనము, రాజభక్తి, సర్వాదా ఉత్తమశాస్త్రముల సాహాయ్యముననే విషయములను తెలిసికొనుట, క్రౌర్యము లేకుండుట, ఓర్పు, ఆస్తిక్యబుద్ధి- ఇవి అన్ని వర్ణములకును, ఆశ్రమములకును సాధారణము లగు ధర్మములు. యజనము, యజ్ఞము చేయించుట, దానము, వేదాద్యధ్యాపనము, ప్రతిగ్రహము, అధ్యయనము ఇవి బ్రహ్మణులు కర్మలు. దానము, అధ్యయనము, యజనము-ఇవి క్షత్రియవైశ్యుల ధర్మములు, పాలనము, దుష్టనిగ్రహము, ఇవి క్షత్రియుని విశేషధర్మములు, అట్లే వైశ్యునకు వ్యవసాయము. గోసంరక్షణ, వాణిజ్యము, విశేషధర్మములు. శూద్రునకు బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యుల శుశ్రూష లేదా వివిధశిల్పములు ధర్మము. బ్రాహ్మణాదులుకు ఉపనయన మైనదిమొదలు రెండవ జన్మ. అనులోమ్యమున (తండ్రి పై వర్ణమువాడై, తల్లి క్రింది వర్ణమునకు చెందినపుడు) పుట్టినవారి జాతి తల్లి జాతితో సమ మగును, ప్రాతిలోమ్యమున (పై కులము, స్త్రీ పురుషుడు క్రిందికులము అయినపుడు) శూద్రునివలన బ్రహ్మణస్త్రీకి పుట్టిన వాడు చండాలుడు. క్షత్రియునివలన బ్రాహ్మణియందు పుట్టినవాడు సూతుడు. వైశ్యుని వలన పుట్టినవాడు దేవలుడు. క్షత్రియస్త్రీయందు శూద్రునివలన పుట్టినవాడు మాగధుడు. వైశ్యస్త్రీయందు శూద్రునివలన పుట్టినవాడు ఆయోగవుడు, ప్రతిలోమస్త్రీలకు ప్రతిలోమపురుషులవలన (పుట్టినవారు వేలకొలది భేదములలో నుందురు. వారికి వివాహము తమతో సమానమైన జాతికలవారితోనే జరుగవలెను. అధములతో గాని ఉత్తములతోగాని జరుగరాదు. వధ్యులను చంపుట చండాలుల కర్మ. స్త్రీల కుపయోగించు వస్తువులను తయారుచేయుట, స్త్రీలను రక్షించుట వైదేహకుని కర్మ, సారథ్యము సూతుని కర్మ. వేటచే జీవనము పుక్కసుని కర్మ. స్తుతి చేయుట మాగధుని కర్మ. రంగమునందు దిగుట, శిల్పజీవనము ఆయోగవుని కర్మ. చండాలుడు గ్రామముబైట నుండి శవవస్త్రములను ధరించవలెను. ఇతర వర్ణములవారిని స్పృశింంచగూడదు. గోబ్రాహ్మణుల నిమిత్తము, స్త్రీబాలాదుల రక్షణ నిమిత్తముప్రాణత్యాగము చేయుటచే చండాలాదులకు అధ్యాత్మికోన్నతి లభించును. సంకరజాతులవారి జాతిని వార తలింద్రడులను బట్టియు, జాతిసిద్ధము లగు కర్మలను బట్టియు నిర్ణియించవలెను. అగ్ని మహాపురాణమునందు వర్ణాశ్రమేతరధర్మవర్ణన మను నూటఏబదియొకటవ అధ్యాయము సమాప్తము.