Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ ద్విపఞ్చాశదుత్తర శతతమో7ధ్యాయః అథ గృహస్థవృత్తిః పుష్కర ఉవాచ: అజీవంస్తు యదుక్తేన బ్రాహ్మణః స్వేన కర్మణా | క్షత్రవిట్ శూద్రధర్మేణ జీవేన్నైవ తు శూద్రజాత్. 1 కృషివాణిజ్య గోరక్ష్యం కుసీదం చ ద్విజశ్చరేత్ | గోరసం గుడలవణక్షారమాంసాని వర్జయేత్. 2 భూమిం భిత్త్వౌషధీశ్ఛిత్త్వా హత్వా కీట పిపిలికాః | పునన్తి ఖలు యజ్ఞేన కర్షకాదేవ పూజనాత్. 3 హలమష్టగవం ధర్మ్యం షడ్గవం జీవితార్దినామ్ | చతుర్గవం నృశంసానాం ద్విగవం ధర్మఘాతినామ్. 4 ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేన వా | సత్యానృతాభ్యామపి వా న శ్వవృత్త్యా కదాచన. 5 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే గృహస్థవృత్తివర్ణనం నామ ద్విపఞ్చాశదధిక శతతమో೭ధ్యాయః పుష్కరుడు పలికెను: బ్రాహ్మణుడు తన కర్మచే జీవించవలెను. అట్లు జీవించజాలని బ్రాహ్మణుడు క్షత్రియ వైశ్య-శూద్రధర్మములచే గూడవ జీవించవచ్చును. కాని సంకరజాతులవారి ధర్మము నవలంబింపరాదు. ద్విజుడు ఆపత్కాలమున కృషి, వాణిజ్యము, గోరక్షణము, వడ్డీవ్యాపారము కూడ చేయవచ్చును. కాని గోక్షీరాదులు, బెల్లము, లవణము, క్షారము, మాంసము మొదలైనవాటి వ్యాపారము చేయరాదు. కర్షకులు భూమిని బ్రద్దలుకొట్టుట, ఓషధులను ఛేదించుట, కీటకపిపీలికాదులను చంపుట మొదలగు వాటివలన కలిగిన పాపమును యజ్ఞముచేతను, దేవతాపూజచేతను తొలగించుకొనగలరు. ఎనిమిది ఎద్దుల హలము ధర్మసంమతము, జీవిక కోరువారికి ఆరు ఎద్దుల హలము, క్రూరులకు నాలుగెద్దుల హలము, ధర్మహింసకులకు రెంéడెద్దుల హలము చెప్పబడినది. ఋతము (కళ్లములో మిగిలిన వరివెన్నుల ధాన్యపు గింజలు ఏరికొని వాటిపై మాత్రము జీవించుట) చేతగాని, అమృతము (అయాచితముగా లభించినది) చే గాని, మృతము (భిక్షాన్నము) చేత గాని, ప్రమృతము (వ్యవసాయము) చేత గాని, సత్యానృతముల (వర్తకము) చేత గాని జీవించవలెను. శ్వవృత్తి (సేవావృత్తి) తో ఎన్నడును జీవించరాదు. అగ్నిమహాపురాణమునందు గృహస్థజీవికావర్ణన మను నూటఏబదిరెండవ అధ్యాయము సమాప్తము.