Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ అష్టపఞ్చ శదుత్తర శతతమోధ్యాయః అథ స్రావాద్యాశౌచమ్ పుష్కర ఉవాచ : స్రావాశౌచం ప్రవక్ష్యామి మన్వాది మునిసమ్మతమ్ | రాత్రిభిర్మాసతుల్యాభిర్గర్భస్రావే త్ర్యహేణ వా. 1 చాతుర్మాసికపాతాన్తే దశాహం పఞ్చమాసతః | రాజన్యే చ చతూరాత్రం వైశ్యే పఞ్చాహమేవ చ. 2 అష్టాహేన తు శూద్రస్య ద్వాదశాహాదతః పరమ్ | స్త్రీణ్జాం విశుద్ధిరుదితా స్నానమాత్రేన వై పితుః. 3 న స్నానం హి సపిణ్డ స్యాత్త్రిరాత్రం సప్తమాష్టమే | సద్యః శౌచం సపిణ్డానామాద న్తజననాత్తథా. 4 ఆచూడాదేకరాత్రం స్యాదావ్రతాచ్చ త్రిరాత్రకమ్ | దశరాత్రం భ##వేదస్మాన్మాతాపిత్రో స్త్రి రాత్రకమ్. 5 అజాతదన్తే తు మృతే కృతచూడే೭ర్భకే తథా | ప్రేతే న్యూనై స్త్రిభిర్వర్షైర్మృతే శుద్ధిస్తు నైశికీ. 6 ద్వ్యహేన క్షత్రియే శుద్ధిస్త్రిభిర్వైశ్య మృతే తథా | శుద్ధిః శూద్రే పఞ్చభిః స్యాత్ర్పాగ్వివాహాద్ద్విషట్ త్వహః. యత్ర త్రిరాత్రం విప్రాణామాశౌచం సంప్రదృశ్యతే | తత్ర శూద్రే ద్వాదశాహః షణ్డవ క్షత్రవైశ్యయోః. 8 ద్వ్యబ్దే నైవాగ్ని సంస్కారో మృతే తన్నిఖనేద్భువి | న చోదక క్రియా తస్య నామ్ని చాపి కృతే సతి. 9 జాతదన్తస్య వా కార్యా స్యాదుపనయనాద్దశ | ఏకాహాచ్ఛుధ్యతే విప్రో యో೭గ్నివేదసమన్వితః.10 హీనే హీనతరే చైవ త్ర్యహశ్చతురహస్తథా | పఞ్చాహే నాగ్ని హీనస్తు దశాహాద్ర్బాహ్మణబ్రువః.11 పుష్కరుడు చెప్పెను : మన్వాదిఋషులు చెప్పిన విధముగ గర్భస్రావాశౌచమును గూర్చి చెప్పెదను. నాల్గవ మాసమువరకును జరిగిన గర్భస్రావమునందును, పంచమషష్ఠమాసములందు జరిగిన గర్భపాతమునందును మాసము లెన్నియో అన్ని రాత్రులు స్త్రీకి ఆశౌచము. లేదా మూడు రోజులు మాత్రమే ఆశౌచము. ఏడవ మాసమునుండి దశరాత్రాశౌచము. క్షత్రియునకు నాలుగు రాత్రులు, వైశ్యునకు ఐదు రాత్రులు, శూద్రునకు ఎనిమిది దినములు ఆశౌచము. ఏడు మాసములకంటె అధికమైనచో అందరికిని పదునొకండు దినములు అశుద్ధి. ఆ ఆశౌచము స్త్రీలకు మాత్రమే తండ్రికి స్నానమాత్రముచేతనే శుద్ధి. సపిండులకు ఆరుమాసములవరకును ఆశౌచము లేదు. సప్తమాష్టమమాసములందు మూడు రాత్రులు ఆశౌచము. దంతజననములోపల (అ) 54 మృత్యువైనచో సపిండులకు సద్యఃశౌచము. చూడాకరణము లోపల ఒక రాత్రి, ఉపనయనము లోపల రాత్రిత్రయము. అది దాటిన దశరాత్రము. దంతములు రాకుండ మృతు డైనచో తలిదండ్రులకు మూడురాత్రులు; చూడాకరణమునకు పూర్వము మృత్యువు కలిగినను మూడు రాత్రులే. మూడు సంవత్సరముల లోపు బ్రాహ్మణబాలుడు మృతు డైనచో సపిండులకు ఒక రాత్రి ఆశౌచము. క్షత్రియ బాలకుడు మరణించినచో సపిండులకు రెండు రోజులు వైశ్యులకు మూడు రోజులు, శూద్రులకు ఐదు రోజులు ఆశౌచము. బ్రాహ్మణులకు మూడు రోజుల ఆశౌచము చెప్పినచోట శూద్రులకు పదకొండు రోజులు , క్షత్రియులకు ఆరు రోజులు, వైశ్యులకు తొమ్మిది రోజులు ఆశౌచ ముండును. రెండు సంవత్సరముల బాలునకు అగ్నిసంస్కారము లేదు. వానిని భూమిలో పాతిపెట్టవలెను. అతనికి ఉదకక్రియ కూడ ఉండదు. లేదా నామకరణము చేసినవాడు జాతదండు డైనచో అగ్ని సంస్కార- ఉదకదానములు చేయవలెను. ఉపనయ నానంతరము మరణించినచో పది రోజుల ఆశౌచము. అగ్ని హోత్రముచేయుచు వేదాధ్యయనము చేయు బ్రాహ్మణునకు ఒక్క దినము నందే శుద్ధి. అతనికంటె హీనునకు మూడు దినములు, హీనతరునకు ఐదు రాత్రుల ఆశౌచానంతరము శుద్ధుడగును. పేరుకు బ్రాహ్మణు డనబడువాడు పది రోజులకును శుద్ధు డగును. క్షత్రియో నవసప్తాహాచ్ఛుధ్యేద్విప్రో గుణౖ ర్యుతః | దశాహాత్సగుణో వైశ్యో వింశాహాచ్ఛూద్ర ఏవ చ. 12 దశాహాచ్ఛుధ్యతే విప్రో ద్వాదశాహేన భూమిపః | వైశ్యః పఞ్చదశాహేన శూద్రో మాసేన శుధ్యతి. 13 గుణోత్కర్షే దశాహాప్తౌ త్ర్యహమేకాహకం త్ర్యహే | ఏకాహాప్తౌ సద్యః శౌచం సర్వత్రైవం సమూహయేత్. దాసాన్తేవాసిభృతకాః శిష్యాశ్చైకత్రవాసినః | స్వామితుల్యమశౌచం స్యాన్మృతే పృథక్పృథగ్భవేత్. 15 మరణాదేవ కర్తవ్యం సంయోగో యస్య నాగ్నిభిః | దాహాదూర్ధ్వమశౌచం స్యాద్యస్య వైతానికో విధిః. 16 సర్వేషామేవ వర్ణానాం త్రిభాగాత్ స్పర్శనం భ##వేత్ | త్రిచతుష్పఞ్చదశభిః స్పృశ్యా వర్ణాః క్రమేణ తు. చతుర్థే పంచమే చైవ సప్తమే నవమే తథా | అస్థిసంచయనం కార్యం వర్ణానామనుపూర్వశః. 18 అహస్త్వదత్తకన్యాసు ప్రదత్తాసు త్ర్యహం భ##వేత్ | పక్షిణ సంస్కృతాస్వేవ స్వస్రాదిషు విధీయతే. 19 పితృగేహం కుమారీణాం వ్యూఢానాం భర్తృగోత్రతా | జలప్రదానం పిత్రే చ హ్యుద్వాహే చోభయత్ర తు. దశాహోపరి పిత్రోశ్చ దుహితుర్మరణ త్ర్యహమ్ | సద్యః శౌచం సపిణ్డానాం పూర్వం చూడాకృతేర్ద్విజ. 21 ఏకాహతో హ్యావివాహాదూర్ధ్వం హస్తోదకాత్త్ర్యహమ్ | పక్షిణీభ్రాతృపుత్రస్య సపిణ్డానాం చ సద్యతః. 22 దశాహాచ్ఛుధ్యతే విప్రో జన్మహానౌ స్వయోనిషు | షడృస్త్రిభిరహైకేన క్షత్రవిట్చూద్రయోనిషు. 23 సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఏడు దినములలోనే శుద్ధు డగును; గుణవంతు డైన క్షత్రియుడు తొమ్మిది దినములలోను, వైశ్యుడు పది దినములలోను, శూద్రుడు ఇరువది దినములలోను శుద్ధు డగును. సాధారణు డగు బ్రాహ్మణుడు పది దినములలోను, క్షత్రియుడు పండ్రెండు దినములలోను, వైశ్యుడు పదునైదు దినములలోను, శూద్రడు మాసమునకును శుద్ధు డగును గుణాధిక్య మున్నచో పది రోజుల ఆశౌచము మూడు రోజులును, మూడు రోజుల ఆశౌచము ఒక్క రోజు, ఒకరోజు ఆశౌచము తాత్కాలికముగాను తొలగిపోవును. ఈ విధముగనే అంతటను ఊహించవలెను. దాసులు, శిష్యులు, భృత్యులు మొదలగువారు తమ స్వామి లేదా గురువుతో కలిసి నివసించునపుడు ఆ స్వామి లేదా గురువు మరణించినచో వారందరికి కుటుంబములోని వారితో సమముగా ఆశౌచ ముండును. అగ్నిహోత్రము చేసికొనని వానికి సపిండమృత్యువు జరిగిన వెంటనే ఆశౌచము తగులును. అగ్నిహోత్రానుష్ఠానము చేయువానికి మాత్రము మృతునకు దాహ సంస్కారము జరిగిన తరువాతనే ఆశౌచము ప్రాప్తించును. అన్ని వర్ణముల వారికి మూడవ వంతు ఆశౌచసమయము గడచిన పిమ్మట శారీరకస్పర్శాధికార ముండును. ఈ నియమమును బట్టి బ్రాహ్మణాదులు వరుసగ మూడు, నాలుగు, ఐదు, పది రోజుల తరువాత స్పర్శార్హు లగుదురు. బ్రాహ్మణాదులు అస్థిసంచయము వరుసగ నాలుగు, ఐదు, ఏడు, తొమ్మిది-ఈ దినములందు చేయవలెను. వివాహము కాని కన్య మరణించి నపుడు బాంధవులకు, ఒక రోజు, వివాహిత యైనచో మూడు రోజులు ఆశౌచము. వివాహిత యైన పుత్రిక గాని, సోదరి గాని మరణించినచో రెండు దినముల ఒక రాత్రి అశౌచము. అవివాహితలకు తండ్రిగోత్రమే గోత్రము. వివాహితలకు భర్తృగోత్రము. వివాహ మైన పుత్రికి జలదానము చేయవలసిన విధి భర్తకు తండ్రికి గూడ ఉండును. పది దినముల పిమ్మట చూడాకరణమునకు ముందు కన్య మరణించినచో మాతాపితరులకు మూడు దినముల ఆశౌచము. ఇతర బంధువులకు తాత్కాలికాశౌచము, చూడాకరణానంతరము వివాహాత్పూర్వము బంధువలకు ఒక రోజు ఆశౌచము. వాగ్ధానానంతరము వివాహాత్పూర్వము బంధువులకు ఒక రోజు అశౌచము. వాగ్దానానంతరము వివాహాత్పూర్వ మైనచో మూడు రోజుల ఆశౌచము పిదప ఆ కన్య భ్రాతృపుత్రులకు రెండు రోజుల ఒక రాత్రి ఆశౌచము. అన్యసపిండులకు మాత్రము తాత్కాలిక శుద్ధి సజాతీయులతో జన్మ-మరణములందు, కలిసి యున్నచో బ్రాహ్మణునకు పది రోజులో శుద్ధి. క్షత్రియ-వైశ్య-శూద్రులతో కలసి యున్నచో వరుసగ ఆరు, మూడు, ఒక రోజులలో శుద్ధి. ఏతద్‌జ్ఞేయం సపిణ్డానాం వక్ష్యేచానౌరసాదిషు | అనౌరసేషు పుత్రేషు భార్యా స్వన్యగతాసు చ. 24 పరపూర్వాసు చ స్త్రీషు త్రిరాత్రాచ్చుద్ధిరిష్యతే | వృథాసఙ్కరజాతానాం ప్రవ్రజ్యాసు చ తిష్ఠతామ్. 25 ఆత్మనస్త్యాగినాం చైవ నివర్తేతోదకక్రియా | మాత్రైకయా ద్విపితరౌ భ్రాతరావన్యగామినౌ.26 ఏకాహః సూతకే తత్ర మృతకే తు ద్వ్యహో భ##వేత్ | సపిణ్డానామశౌచం హి సమానోదకతాం వదే. 27 బాలే దేశా న్తరస్థే చ పృథక్పిణ్డ చ సంస్థితే | సవాసా జలమావిశ్య సద్య ఏవ విశుధ్యతి. 28 దశాహేన సపిణ్డాస్తు శుధ్యన్తి ప్రేతసూతకే | త్రిరాత్రేణ సకుల్యాస్తు స్నానాచ్ఛుధ్యన్తి గోత్రిణః. 29 సపిణ్డతా తు పురుషే సప్తమే వినివర్తతే | సమానోదకభావస్తు నివర్తేతాచతుర్ధశాత్. 30 జన్మ నామస్మృతే వైతత్తత్పరం గోత్రముచ్యేత | విగతం తు విదేశస్థం శృణుయాద్యోహ్యనిర్దశమ్. 31 యచ్ఛేషం దశరాత్రస్య తావదేవాశుచిర్భవేత్ | అతిక్రాన్తే దశాహే తు త్రిరాత్రమశుచిర్భవేత్. 32 సంవత్సరే వ్యతీతే తు స్పృష్ట్వైవాపో విశుధ్యతి | మాతులే పక్షిణీ రాత్రిః శిష్యర్త్విగ్భాన్ధవేషు చ. 33 మృతే జామాతరి ప్రేతే దౌహిత్రీ భగినీసుతే | శ్యాలకే తత్సుతే చైవ స్నానమాత్రం విధీయతే. 34 మాతామహ్యాం తథాచార్యే మృతౌ మాతామహే త్ర్యహమ్ | దుర్భిక్షే రాష్ట్రసంపాతే హ్యాగతాయాం తథాపది. 35 ఉపసర్గమృతానాం చ దాహే బ్రహ్మవిదాం తథా | సత్రివ్రతి బ్రహ్మచారి సంగ్రామే దేశవిప్లవే. 36 దానే యజ్ఞే వివాహే చ సద్యఃశౌచం విధీయతే | విప్రగోనృపహన్తౄణామనుక్తం చాత్మఘాతినామ్. 37 ఈ ఆశౌచనియమము లన్నియు సపిండులకు మాత్రమే. ఔరసులు కాని పుత్రలు మొదలగు వారి విషయమున చెప్పెదను. క్షేత్రజుడు. దత్తుడు మొదలగు పుత్రులును, తనను విడచి మరొకనితో సంబంధము పెట్టుకొనిన స్త్రీ గాని, తన భార్యగా అయిన పరపురుషుని స్త్రీ గాని మరణించినపుడు ఆశౌచము మూడు రాత్రులు మాత్రమే ఉండును. స్వధర్మమును త్యజించి తన జన్మను వ్యర్థము చేసికొన్నవాడును, వర్ణసంకరజాతుడును, పరివ్రాజకుడు, అశాస్త్రీయ విధానముచే విషాదుల ద్వారా ఆత్వహత్య చేసికొన్న వారును, వీరికి జలాంజలి ఇవ్వవలసిన పనిలేదు. వారికి ఉదక క్రియానివృత్తి అయిపోయినది. ఒక తల్లికి ఇద్దరు తండ్రుల ద్వారా పుట్టినవారి వలన బంధులకు జాతాశౌచము ఒక రోజు, మృతాశౌచము రెండు రోజులు. ఇంతవరకును సపిండుల ఆశౌచము చెప్పబడినది. ఇపుడు సమానోదకుల ఆశౌచము చెప్పబడుచున్నది. బాలుడు దంతోత్పత్తికి పూర్వమే మరణించినను, దేశాంతరమునందున్న సపిండుడు మరణించినను, అసపిండుని మృత్యువునందును, సచేలస్నానముచే శుద్ధి. జన్మమృత్యువులందు సపిండులకు పది దినములలో శుద్ధి. ఒక కులమునకు చెందిన అసపిండులకు మూడు రాత్రులతో శుద్ధి. సమానగోత్రులకు స్నానమాత్రముననే శుద్ధి ఏడవ తరమునందు సపిండత్వము తొలగును. పదునాల్గవ తరమునందు సమానోదక సంబంధము గూడ తొలగిపోవును. కొందరి మతము ప్రకారము - జన్మనామములస్మృతి లేనపుడు సమానోదక సంబంధము తొలగిపోవును. అటు పిమ్మట సగోత్రత్వము మాత్రము మిగులును. పది రోజులు ముగియక ముందే విదేశములో నున్న బంధువు మరణవార్త విన్నవాడు మిగిలిన రోజులు మాత్రము ఆశౌచము పట్టవలెను. దశాహము దాటిన తరువాత తెలిసినచో మూడు రోజులు పట్టవలెను. సంవత్సరము దాటిన తరువాత తెలిసినచో జలస్పర్మ మాత్రముచే శుద్ధి. మేనమామ, శిష్యుడు బుత్విక్కు, బంధువులు మరణించి నపుడు ఒక పగలు, ఒక రాత్రి, ఒక పగలు ఆశౌచ ముండును. మిత్రుడు, జామాత, దౌహిత్రుడు, మేనల్లుడు, బావమరిది కుమారులు, మరణించినపుడు స్నానమాత్రముచే శుద్ధి. మాతామహి, ఆచార్యుడు, మాతామహుడు మరణించినపుడు మూడు దినములు ఆశౌచము. దుర్భిక్షము, రాష్ట్రోపద్రవము మొదలగు ఆపదలందు సద్యఃకాలశుద్ధి చెప్పబడినది. యజ్ఞముచేయుచున్నవాడు. వ్రతపరాయణుడు, బ్రాహ్మచారి, దాత, బ్రహ్మవేత్త- వీరికి తత్కాలమందే శుద్ధి. దానము యజ్ఞము, దేశోపద్రవము, వివాహము యుద్ధము-వీటియందు సద్యఃశుద్ధి చెప్పబడినది. మహామారి మొదలైన ఉపద్రవములచే మరణించినవారి విషయమునందు గూడ సద్యఃకాలాశౌచము. రాజును, గోవును, బ్రాహ్మణుని చంపినవారును అశాస్త్రీయముగా ఆత్మహత్య చేసుకొన్నవారును మరణించినపుడు తత్కాల శుద్ధి చెప్పబడినది. అసాధ్యవ్యాధియుక్తస్య స్వాధ్యాయే చాక్షమస్య చ | ప్రాయశ్చిత్తమనుజ్ఞాతమగ్నితోయప్రవేశనమ్. 28 అపమానాత్తథా క్రోధాత్స్నే హాత్పరిభవాద్భయాత్ | ఉద్బధ్య మ్రియతే నారీ పురుషో వా కథంచన. 39 ఆత్మఘాతీ చైకలక్షం వసేత్స నరకే೭శుచౌ వృద్ధః శ్రౌతస్మృతేర్లుప్తః పరిత్యజతి యస్త్వసూన్. 40 త్రిరాత్రం తత్ర చాశౌచం ద్వితీయే చాస్థిసంచయమ్ | తృతీయే తూదకం కార్యం చతుర్థే శ్రాద్ధమాచరేత్. 41 విద్యుదగ్నిహతానాం చ త్ర్యహం శుద్ధిః నపిణ్డకే| పాషణ్డాశ్రితభర్తృఘ్నో నాశౌచోదకగాః స్త్రియః. 42 పితృమాత్రాదిపాతే తు ఆర్ద్రవాసా హ్యుపోషితః | అతీతే೭బ్దే ప్రకుర్వీత ప్రేతకార్యం యథావిధి. 43 యః కశ్చిత్తు హరేత్ర్పేతమసపిణ్డం కథఞ్చన | స్నాత్వా సచైలః స్పృష్ట్వాగ్నిం ఘృతం ప్రాశ్య విశుధ్యతి. 44 యద్యన్నమత్తి తేషాం తు దశాహే నైవ శుద్ధ్యతి | అనదన్నన్నమహ్న్యేవ న వై తస్మిన్ గృహే వసేత్. 45 అనాధం బ్రాహ్మణం ప్రేతం యే వహన్తి ద్విజాతయః | పదే పదే యజ్ఞఫలం శుద్ధిః స్యాత్ స్నానమాత్రతః. 46 ప్రేతీభూతం ద్విజః శూద్రమనుగచ్ఛంస్త్ర్యహాచ్ఛుచిః | మృతస్య బాన్ధవైః సార్ధం కృత్వా చ పరిదేవనమ్. 47 వర్జయేత్తదహోరాత్రం దానశ్రార్ధాదికామతః | శూద్రాయాః ప్రసవో గేహే శూద్రస్య మరణం తథా. 48 భాణ్డాని తు పరిత్యజ్య త్ర్యహాద్భూలేపతః శుచిః | న విప్రం స్వేషు తిష్ఠత్సు మృతః శూద్రేణ నాయయేత్. 49 నయేత్ర్పతం స్నాపితం చ పూజితం కుసుమైర్దహేత్ | నగ్నదేహం దహేన్నైవ కించిద్దేహం పరిత్యజేత్. 50 అసాధ్యములగు వ్యాధులతో బాధపడువాడును, స్యాధ్యాయాసమర్థుడును, అగ్నియందుగాని, జలమును గాని ప్రవేశించి మరణించుట ప్రాయశ్చిత్తము. అవమానము, క్రోధము, స్నేహము, పరాభవము, భయము- వీటివలన ఉరిపోసికొనిగాని, మరొక విధముగా గాని ఆత్మహత్య చేసికొన్న పురుషుడైనను, స్త్రీ యైనను, లక్షసంవత్సరములు అశాచి యైన నరకము నందు నివసించును. శౌచశౌచారిదిజ్ఞానము కూడ లేని అతి వృద్ధుడు మరణించినచో ఆశౌచము మూడు రాత్రులే. రెండవ రోజున అస్థిసంచయనము, మూడవరోజున జలదానము, నాల్గవ రోజున శ్రాద్ధము చేయవలెను. పిడుగు పడి చనిపోయినవారి ఆశౌచము సపిండులకు మూడు దినములు. పాషండులను ఆశ్రయించి, పతిఘాతిని యైన స్త్రీ మరణించినపుడు ఆశౌచము ఉండదు. ఆమెకు జలాంజలి కూడ ఇవ్వరాదు. పితృమాత్రాదుల మరణవార్త ఒక సంవత్సరము తరువాత అందినను సచేలస్నానము చేసి, ఉపవసించి, విధిపూర్వకముగ ప్రేతకార్యముల చేయవలెను. అసపిండుని శవము మోసినవాడు సచేలస్నానము చేసి, అగ్నిని స్పృశించి, నెయ్యి తిన్నచో శుధ్ధు డగును. అతడు ఆ కుటుంబమువారి అన్నము తిన్నచో ఆతనికి పది రోజుల తరువాతనే శుద్ధి. ఆ యింటివారి ఆన్నము తినక, ఆ ఇంటిలో నివాసము చేయక ఉన్నచో ఒక్కరోజునకే శుద్ధి. అనాధబ్రాహ్మణశవమును మోసిన బ్రాహ్మణులకు అడుగడుగున యజ్ఞఫలము కలుగును. స్నానమాత్రముచేతనే శుద్ధి. శూద్రశవము అనుసరించి వెళ్లిన బ్రాహ్మణునకు మూడురోజులకు శుద్ధి యగును. మరణించిన వాని బంధువులతో కలసి విలాసాదులు చేసిన బ్రాహ్మణుడు ఒక పగలు, ఒక రాత్రి, దాన శ్రాద్ధాదులను పరిత్యజించవలెను. తన యింటిలో శూద్రస్త్రీ ప్రసవించినను, శూద్రడు మరణించినను మూడు రోజులలో ఇంటిలోని భాండాదులను పారవేయవలెను. భూమిని అలకవలెను. అపుడు శుద్ధి యగును. సజాతీయ లుండగా బ్రాహ్మణశవము శూద్రులచే మోయించరాదు. శవమునకు స్నానము చేయించి, నూతనవస్త్రమును కప్పి, పూవులతో పూజించి శ్మశానమునకు తీసికొని వెళ్లవలెను. నగ్న దేహమునే దహించవలెను. దేహభాగమును కొంచెము కూడ మిగల్చగూడదు. గోత్రజస్తు గృహీత్వా తు చితాం చారోపయేత్తదా | ఆహితాగ్నిర్యథాన్యాయం దగ్ధవ్యస్త్రిభిరగ్నిభిః. 51 అనాహితాగ్ని రేకేన లౌకికేనాపరస్తథా | అస్మాత్త్వమభిజాతో೭సి త్వదయం జాయతాం పునః. 52 అసౌ స్వర్గాయ లోకాయ ముఖాగ్నిం ప్రదదేత్సుతః| సకృత్ర్పసిఞ్చన్త్యుదకం నామగోత్రేణ బాన్దవాః. 53 ఏవం మాతామహాచార్యప్రేతానాం చోదకక్రియా | కామ్యోదకం సఖిప్రేత స్వస్రియశ్వశురర్త్విజామ్. 54 అప నః శోశుచదఘం దశాహం చ సుతో೭ర్పయేత్ బ్రాహ్మణ దశ పిణ్డాః స్యుః క్షత్రియే ద్వాదశస్మృతాః. 55 వైశ్యేపఞ్చదశ ప్రోక్తాః శూద్రే త్రింశత్ప్రకీర్తితాః | పుత్రోవా పుత్రికాన్యో వా పిణ్డం దద్యాచ్ఛ పుత్రవత్. 56 విదశ్య నిమ్బపత్రాణి నియతో ద్వారి వేశ్మనః | ఆచమ్య చాగ్నిముదకం గోమయం గౌరసర్షపాన్. 57 ప్రవిశేయుః సమాలభ్య కృత్వాశ్మని పదం శ##నైః | అక్షారలవణాన్నాః స్యుర్నిర్మాంసా భూమిశాయినః. 58 క్రీతలబ్ధాశనాః స్నాతా ఆదికర్తా దశాహకృత్ | అభావేబ్రహ్మచారీ తు కుర్యాత్పిణ్డోదకాదికమ్. 59 యథేదం శావమాశౌచం సపిణ్డషు విధీయతే | జననే7ప్యేవ మేవస్యాన్నిపుణా శుద్ధిమిచ్ఛతామ్. 60 సర్వేషాం శావమాశౌచం మాతాపిత్రోశ్చ సూతకమ్ | సూతకం మాతురేవ స్యాదుపస్పృశ్య పితా శుచిః. 61 పుత్రజన్మదినే శ్రాద్ధం కర్తవ్యమితి నిశ్చితమ్ | తదహస్తత్ర్పదానార్థం గోహిరణ్యాది వాససామ్‌ః. 62 ఆ సమయమున సగోత్రుడు శవమును ఎత్తి చితిపై ఉంచవలెను. అగ్న్యాధానము చేసినవానిని యథావిధిగా మూడు అగ్నులతో దహనము చేయవలెను. అగ్న్యాధానము లేక ఉపనయనసంస్కారయుక్తుడైన వానికి ఒక (ఆహవనీయ) అగ్నితోను సాధారణులను లౌకికాగ్నితోను దహనము చేయవలెను. ''అస్మాత్....లోకాయస్వాహా'' అను మంత్రము పఠించుచు పుత్రుడు తండ్రి శవము ముఖమున అగ్ని ఉంచవలెను. పిదప ప్రేతయొక్క నామగోత్రముల నుచ్చరించుచు బంధువులు ఒక్కొక్క జలప్రదానము చేయవలెను. మాతామహాచార్యాదులు మరణించినపుడు గూడ ఈ విధముగనే జలాంజలిదానము చేయవలెను. మిత్రులకు, వివాహితులగు పుత్రీ-సోదర్యాదులకును, మేనల్లునకును, ఋత్విక్కులకును, మామగారికిని గూడ ఈ విధముగా జలము నిచ్చుట ఇష్టముపై ఆధారపడియుండును. పుత్రుడు తండ్రికి పది రోజులపాటు ''అప నః శోశుచత్ అఘమ్'' ఇత్యాదిమంత్రము పఠించుచు, జలాంజలి ఇవ్వవలెను. బ్రాహ్మణునకు పది, క్షత్రియునకు పదునొకండు, వైశ్యునకు పదునైదు, శూద్రునకు ముప్పది పిండములు ఇవ్వవలెను. పుత్రుడైనను, పుత్రిక యైనను, మరెవ్వరైనను పుత్రుడు వలెనే మృతునకు పిండ ప్రదాణము చేయవలెను. దహన సంస్కారము చేసి ఇంటికి తిరిగి వచ్చి, మనస్సు అదుపులోఉంచుకొని, ద్వారము వద్ద నిలిచి, రెండు వేపాకులు నమలి, ఆచమనము చేసి, అగ్నిని, జలమును, గోమయమును, పచ్చని ఆవాలను స్పృశించవలెను. పిదప ముందుగా ఱాతిమీద పాద ముంచి మెల్లగా ఇంటిలో ప్రవేశించవలెను. ఆ నాటినుండి బంధువులు ఉప్పు, మాంసము తినగూడదు. అందరును భూమిపై శయనించవలెను. స్నానము చేసి మూల్యమిచ్చి కొన్న అన్నము తినవలెను. మొదట దాహసంస్కారము చేసినవాడు పది దినములవరకును కర్మ చేయవలెను. అధికారము గలవారు లేని పక్షమున బ్రహ్మచారియే పిండదానము, జలాంజలిదానము చేయవలెను. సపిండులకు ఈ విధముగ మరణాశౌచము వచ్చినట్లే జాతాశౌచము కూడ వచ్చును. మరణాశౌచము సపిండులందరికిని వచ్చును. జాతాశౌచముచే కలుగు అస్పృశ్యత్యము విశేషముగా తలిదండ్రులకు మాత్రమే వచ్చును. వారిలో కూడ తల్లికే విశేషముగ ఆశౌచ ముండును. తండ్రి స్నానము చేయుటచే స్పర్శయోగ్యుడగును, పుత్రజన్మదివసమున తప్పక శ్రాద్ధము చేయవలెను. ఆ దినము శ్రాద్ధదానములు, గో - సువర్ణ - వస్త్రాదిదానములు చేయుట మంచిది. మరణం మరణనైవ సూతకం సూతకేన తు | ఉభయోరపి యత్పూర్వం తేనాశౌచేన శుద్ధ్యతి. 63 సూతకే మృతకం చేత్స్యాన్మృతకే త్వథ సూతకమ్ | తత్రాధికృత్య మృతకం శౌచం కుర్యాన్న సూతకమ్. సమానం లబ్ధిశౌచం తు ప్రథమేన సమాపయేత్ | అసమానం ద్వితీయేన ధర్మరాజవచో యథా. 65 శావే೭న్తః శావ ఆయాతే పూర్వాశౌచేన శుద్ధ్యతి | గురుణా లఘు బాధ్యేత లఘునా నైవ తద్గురు. 66 మృతకే సూతకే వాపి రాత్రిమధ్యే೭న్యదాపతేత్ | తచ్ఛే షేణౖవ శుద్ధ్యేరన్‌రాత్రిశేషే ద్వ్యహాదికాత్. 67 ప్రభాతే యద్యశౌచం స్యాచ్ఛుద్ధ్యేరంశ్చ త్రిభిర్దినైః | ఉభయత్ర దశాహాని కులస్యాన్నం న భుజ్యతే. 68 దానాది వినివర్తేత భోజనైః కృత్యమాచరేత్ | అజ్ఞాతే పాతకం నాద్యే భోక్తురేకమహోన్యథా. 69 ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే స్రావాద్యాశౌచంనామాష్టపఞ్చాశదధిక శతతమోధ్యాయః. మరణాశౌచము మరణాశౌచముతోను, సూతకాశౌచము సూతకముతోను తొలగును. మొదటి ఆశౌచముతో రెండవ ఆశౌచమునకు శుద్ధి యగును. జన్మాశౌచమునందు మరణాశౌచ మైనను, మరణాశౌచమున జన్మాశౌచ మైనను మరణాశౌచములో జన్మాశౌచము నివర్తించి నట్లు గ్రహించి శుద్ధి చేసికొనవలెను. జన్మాశౌచముతో మరణాశౌచము తొలగదు. రెండు సమాన మైన ఆశౌచములే అయినపుడు మొదటిదానితో రెండవదానిని సమాప్తము చేసికొనవలెను. ఇది ధర్మరాజు చెప్పిన ధర్మము. ఒక మరణాశౌచము లోపల రెండవ మరణాశౌచము వచ్చినపుడు రెండవది మొదటి దానితో అంత మగును. గురు వైన అశౌచముతో లఘు వైన అశౌచము బాధిత మగును గాని, లఘ్వాశౌచముచే గుర్వాశౌచము బాధితము కాదు. మృతకాశౌచము లేదా సూతకాశౌచము చివరి రాత్రి మధ్య రెండవ ఆశౌచము వచ్చినచో మిగిలిన భాగముతోనే రెండవది పూర్తిగా నివృత్త మైపోనువుగాను సపిండు లందరికిని శుద్ధి యగును. రాత్రి చివరి భాగమున రెండవ ఆశౌచము వచ్చినచో మిగిలిన భాగముతోనే రెండవది పూర్తిగా నివృత్త మైపోవును గాన సపిండు లందరికిని శుద్ధి యగును. రాత్రి చివరి భాగ మున రెండవ ఆశౌచము వచ్చినచో మరి రెండు రోజుల తరువాత ఆశౌచము నివర్తించును. చివరి రాత్రి గడచిపోయి చివరి దినమున ప్రాతఃకాలము మరి యొక్క ఆశౌచము వచ్చినచో మరి మూడు రోజుల తరువాత సపిండులకు శుద్ధి యగును. రెండు విధములైన ఆశౌచములందును ఆ కుటుంబమువారి అన్నము తినగూడదు. ఆశౌచమున దానాద్యధికారము కూడ ఉండదు ఆశౌచసమయమున ఇతరుల ఇంట భోజనము చేసినచో ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తెలియక భోజనము చేసినచో పాపము రాదు తెలిసి తిన్న వానికి ఒక దినము ఆశౌచము ప్రాప్తించును. అగ్నిమహాపురాణమునందు స్రావాద్యాశౌచ మను నూటయేబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.